పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/రాహువు వృత్తాంతము

వికీసోర్స్ నుండి

రాహువువృత్తాంతము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-321-వ.
అప్పుడు
టీక:- అప్పుడు = అప్పుడు.
భావము:- మోహిని అలా అమృతం అంతా అమరులకే పోస్తున్న సమయంలో. . .

తెభా-8-322-మ.
రవ్రాతములోన జొచ్చి దివిజుండై రాహు పీయూష పా
ము జేయం గని చంద్రభాస్కరులు సన్నల్ చేయ నారాయణుం
రారాతిశిరంబు చక్రహతిఁ దున్మాడెన్ సుధాసిక్త మై
రత్వంబును జెందె మూర్ధముఁ దదన్యాంగంబు నేలం బడెన్.

టీక:- అమర = దేవతల; వ్రాతము = సమూహము; లోనన్ = అందు; జొచ్చి = ప్రవేశించి; దివిజుండు = దేవతారూపుడు; ఐ = అయ్యి; రాహు = రాహువు; పీయూష = అమృత; పానమున్ = తాగుటను; చేయన్ = చేయుచుండగ; కని = చూసి; చంద్ర = చంద్రుడు; భాస్కరులు = సూర్యులు; సన్నల్ = సైగలు; చేయన్ = చేయగా; నారాయణుండు = విష్ణుమూర్తి; అమరారాతి = రాక్షసుని; శిరంబున్ = తలను; చక్ర = చక్రాయుధము యొక్క; హతిన్ = దెబ్బచేత; తున్మాడెన్ = నరకివేసెను; సుధా = అమృతముచేత; సిక్తము = తడసినది; ఐ = అగుటచేత; అమరత్వంబున్ = చావులేకపోవుటను; చెందెన్ = పొందినది; మూర్ధమున్ = తల; తత్ = అతని; అన్య = మిగిలిన; అంగంబున్ = దేహము; నేలన్ = భూమిపైన; పడెన్ = పడిపోయెను.
భావము:- రాహువు దేవతలలో రహస్యంగా కలిసిపోయి దేవతల రూపు ధరించి అమృతం తాగుతుండగా సూర్యచంద్రులు చూసారు. చూసి మోహినికి సైగలు చేసారు. వెంటనే విష్ణువు చక్రాయుధంతో రాహువు తల ఖండించాడు. అమృతం ఆనటం వలన, రాహువు తల నిర్జీవం కాలేదు. అమరత్వం పొందింది. మొండెం నేలపై కూలిపోయింది.

తెభా-8-323-ఆ.
జుఁడు వాని శిరము నంబరవీథిని
గ్రహము జేసి పెట్టి గారవించె;
వాఁడు పర్వములను వైరంబు దప్పక
భానుచంద్రములను ట్టు చుండు.

టీక:- అజుడు = బ్రహ్మదేవుడు; వాని = అతని; శిరమున్ = తలను; అంబర = గగన; వీథిన్ = తలమున; గ్రహమున్ = గ్రహముగా; చేసి = చేసి; పెట్టి = ఉంచి; గారవించె = గౌరవించెను; వాడున్ = అతడు; పర్వములను = అమావాస్యపూర్ణిమలను; వైరంబున్ = పగతో; తప్పక = వదలకుండ; భాను = సూర్యుడు; చంద్రములన్ = చంద్రుడులను; పట్టుచుండు = పట్టుచుండును.
భావము:- అలా అమరత్వం పొందిన రాహువు శిరస్సును బ్రహ్మదేవుడు గౌరవించి గ్రహంగా చేసి ఆకాశంలో నిలబెట్టాడు. రాహుగ్రహం ఆ పగను వదలకుండా, అమావాస్య, పూర్ణిమలలో సూర్య చంద్రులను నేటికీ పట్టుకుంటోంది.

తెభా-8-324-క.
బొట్టుఁ జిక్క కుండఁగ
ల సుధారసము నమర సంఘంబులకుం
బ్రటించి పోసి హరి దన
సురాకృతిఁ దాల్చె నసుర శూరులు బెగడన్.

టీక:- ఒక = ఒక్క; బొట్టున్ = చుక్కకూడ; చిక్కకుండగన్ = మిగలకుండ; సకల = అంత; సుధా = అమృతపు; రసమున్ = రసమును; అమర = దేవతా; సంఘంబుల్ = సమూహముల; కున్ = కు; ప్రకటించి = బాహాటముగా; పోసి = పోసి; హరి = విష్ణుమూర్తి; తన = తన యొక్క; సుకర = సాధువైన; ఆకృతిన్ = రూపును; తాల్చెన్ = ధరించెను; అసుర = రాక్షస; శూరులు = వీరులు; బెగడన్ = బెదిరిపోగ.
భావము:- విష్ణు మూర్తి ఒక్క చుక్క కూడా రాక్షసులకు మిగల్చకుండా, అమృతమంతా దేవతలకు బాహాటంగా పోసి, మోహినీ రూపాన్ని వదలిపెట్టి నిజాకారాన్ని ధరించాడు. ఇదంతా చూస్తున్న రాక్షస వీరులు దుఃఖించారు.

తెభా-8-325-మ.
రుల్ రక్కసులుం బ్రయాసబలసత్త్వార్థా భిమానంబులన్
ములై లబ్ధవికల్పు లైరి యమరుల్ సంశ్రేయముం బొంది ర
య్యరారుల్; బహుదుఃఖముల్ గనిరి తా త్యంత దోర్గర్వులై;
లాక్షున్ శరణంబు వేఁడని జనుల్ ల్యాణ సంయుక్తులే.

టీక:- అమరుల్ = దేవతలు; రక్కసులున్ = రాక్షసులు; ప్రయాసన్ = శ్రమపడుట; బల = శక్తి; సత్త్వ = సామర్థ్యము; అర్థాభిమానంబులన్ = పూనికలు కలిగుండుటలో; సములు = సరిసమానులు; ఐ = అయి యున్నను; లబ్ధ = ఫలితములు పొందుటలో; వికల్పులు = అసమత్వముగలవారు; ఐరి = అయినారు; అమరుల్ = దేవతలు; సంశ్రేయమున్ = మిక్కిలి శుభములను; పొందిరి = పొందిరి; ఆ = ఆ; అమరారుల్ = రాక్షసులు; బహు = అనేకరకముల; దుఃఖముల్ = దుఃఖములను; కనిరి = పొందిరి; తాము = వారు; అత్యంత = బహుమిక్కిలి; దోర్గర్వులు = భుజబలగర్వముగలవారు; ఐ = అయ్యి; కమలాక్షున్ = విష్ణుమూర్తి; శరణంబు = శరణు; వేడని = కోరని; జనుల్ = వారు; కల్యాణ = మంగళములను; సంయుక్తులే = కూడినవారా, కాదు.
భావము:- దేవతలూ, రాక్షసులూ సరిసమానమైన సంకల్పమూ, శక్తీ, బలమూ, తెలివీ, ధనమూ, ఆత్మగౌరవమూ ఉన్నవారే. కానీ ఇద్దరికి రెండు రకాలైన ఫలితాలు అందాయి. దేవతలు శుభాలను పొందారు. విష్ణువును ఆశ్రయించని కారణంచేత రాక్షసులు శుభాలను పొందకుండా అనేక దుఃఖాలపాలయ్యారు. అవును, విష్ణువును శరణు వేడని వారు శుభాలు పొందలేరు కదా!

తెభా-8-326-క.
దావు లమృతము ద్రావం
బూని పయోరాశిఁ ద్రచ్చి పొగిలిన మాడ్కిన్
శ్రీనాథ పరాఙ్ముఖులగు
హీనులు పొందంగఁజాల రిష్టార్థంబుల్.

టీక:- దానవులు = రాక్షసులు; అమృతమున్ = అమృతమును; త్రావన్ = తాగవలెనని; పూని = ప్రయత్నించి; పయోరాశిన్ = సముద్రమును; త్రచ్చి = చిలికి; పొగిలిని = దుఃఖముచెందిన; మాడ్కిన్ = వలె; శ్రీనాథ = విష్ణుని; పరాఙ్ముఖులు = వ్యతిరేకులు; అగు = అయిన; హీనులు = వివేకహీనులు; పొందంగన్ = పొందుటకు; చాలరు = సమర్ధులుకారు; ఇష్ట = కోరిన; అర్థముల్ = ప్రయోజనములను.
భావము:- రాక్షసులు అమృతం త్రాగాలని సంకల్పించి, పాలసముద్రాన్ని చిలికినా దుఃఖాన్ని పొందారు. అవును, లక్ష్మీపతి విష్ణుమూర్తి యందు భక్తిలేని వివేకహీనులు కోరిన కోరికలు తీరి కృతార్థులు కావడం జరుగదు కదా.

తెభా-8-327-క.
శోధించి జలధి నమృతము
సాధించి నిలింపవైరి క్షుర్గతులన్
రోధించి సురల కిడి హరి
బోధించి ఖగేంద్రు నెక్కి పోయె నరేంద్రా!

టీక:- శోధించి = కష్టపడిప్రయత్నించి; జలధిన్ = సముద్రమునందు; అమృతమున్ = అమృతమును; సాధించి = సంపాదించి; నిలింపవైరిన్ = రాక్షసులను; చక్షుః = చూపుల; గతులన్ = నడకలతోనే; రోధించి = నిరోధించి; సురల్ = దేవతల; కున్ = కు; ఇడి = ఇచ్చి; హరి = విష్ణుమూర్తి; బోధించి = తెలియజెప్పి; ఖగేంద్రున్ = గరుత్మంతుని; ఎక్కి = ఎక్కి; పోయెన్ = వెళ్ళిపోయెను; నరేంద్రా = రాజా.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! రాక్షసులను తన కంటి చూపులతోనే నిరోధించి, కష్టపడి సాధించిన అమృతాన్ని, దేవతలకు ఇచ్చి విష్ణుమూర్తి గరుత్మంతుని ఎక్కి వెళ్ళిపోయాడు.