పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/సురాసుర యుద్ధము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సురాసుర యుద్ధము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-328-క.)[మార్చు]

శు ద్ధముగ సురల కమృతము
సి ద్ధించిన నసుర వరులు సిడిముడిపడుచున్
క్రు ద్ధులు నానాయుధ స
న్న ద్ధులు నయి యుద్ధమునకు డచిరి బలిమిన్.

(తెభా-8-329-క.)[మార్చు]

న్యులు వైరోచని శత
న్యుప్రముఖులు మదాభిమానులు దమలో
న్యోన్యరణము బాహా
సి న్యాసంబులను బేర్చి చేసిరి కడిమిన్.

(తెభా-8-330-మ.)[మార్చు]

రుదై కామగమై మయాసురకృతంబై లోకితాలోక్యమై
శస్త్రాస్త్ర సమేతమై తరళమై వైహాయసంబై మహా
సు యోధాన్వితమైన యానమున సంశోభిల్లెఁ బూర్ణేందు సు
స్థి కాంతిన్ బలి చామరధ్వజ చమూదీప్తస్థితిన్ ముందటన్.

(తెభా-8-331-వ.)[మార్చు]

మఱియు నముచి శంబర బాణ ద్విమూర్ధ కాలనాభ శకుని జంభాయోముఖ ప్రహేతి హేతి భూతసంత్రాస హయగ్రీవ కపిలేల్వలోత్కళ మేఘదుందుభి మయత్రిపురాధిప విప్రచిత్తి విరోచన వజ్ర దంష్ట్ర తారకారిష్టారిష్టనేమి శుంభ నిశుంభ శంకుశిరః ప్రముఖులును బౌలోమ కాలకేయులును, నివాత కవచ ప్రభృతులును, దక్కిన దండయోధులునుం గూడికొని యరదంబులం దురగంబుల మాతంగంబుల హరిణంబుల హరి కిరి శరభ మహిష గవయ ఖడ్గ గండభేరుండ చమరీ జంబుక శార్దూల గో వృషాది మృగంబులను, గంక గృధ్ర కాక కుక్కుట బక శ్యేన హంసాది విహంగంబులను, దిమి తిమింగ లాది జలచరంబులను, నరులను, నసుర సుర నికర వికృత విగ్రహ రూపంబులగు జంతువులను నారోహించి తమకు నడియాలంబులగు గొడుగులు పడగలు జోడుఁగైదువలు పక్కెరలు బొమిడికంబులు మొదలగు పోటుము ట్లాయితంబుగఁ గైకొని వేఱు వేఱ మొనలై విరోచననందనుం డగు బలిముందట నిలువంబడిరి; దేవేంద్రుండును నైరావతారూఢుండై వైశ్వానర వరుణ వాయు దండధరాద్యనేక నిర్జర వాహినీ సందోహంబునుం, దాను నెదురుపడి పిఱుతివియక మోహరించె; నట్లు సంరంభసన్నాహ సముత్సాహంబుల రెండుదెఱంగుల వారునుం బోరాడు వేడుకల మీఁటగు మాటల సందడించుచున్న సమయంబున.

(తెభా-8-332-సీ.)[మార్చు]

జ్రదంష్ట్ర్రాంచిత వ్యజనంబులును బర్హ;
చామరంబులు సితచ్ఛత్త్రములును
జిత్రవర్ణధ్వజచేలంబులును వాత;
లితోత్తరోష్ణీష జాలములును
ప్పుళ్ళ నెసఁగు భూణ కంకణంబులుఁ;
జండాంశురోచుల స్త్రములును
వివిధ ఖేటకములు వీరమాలికలును;
బాణపూర్ణములైన తూణములును

(తెభా-8-332.1-ఆ.)[మార్చు]

నిండి పెచ్చురేఁగి నిర్జరాసురవీర
సైన్యయుగ్మకంబు చాల నొప్పె
గ్రాహతతుల తోడఁ లహంబునకు వచ్చు
సాగరములభంగి నవరేణ్య!

(తెభా-8-333-క.)[మార్చు]

భే రీ భాంకారంబులు
వా ణ ఘీంకారములును రహరి హేషల్
భూ రి రథనేమి రవములు
ఘో ములై పెల్లగించెఁ గులశైలములన్.

(తెభా-8-334-వ.)[మార్చు]

ఇవ్విధంబున నుభయబలంబులును మోహరించి బలితో నింద్రుండును, దారకునితో గుహుండును, హేతితో వరుణుండును, బ్రహేతితో మిత్రుండును, గాలనాభునితో యముండును, మయునితో విశ్వకర్మయు, శంబరునితోఁ ద్వష్టయు, విరోచనితో సవితయు, నముచితోఁ బరాజితుండును, వృషపర్వునితో నశ్విదేవతలును, బలిసుతబాణాది పుత్రశతంబుతో సూర్యుండును, రాహువుతో సోముండును, బులోమునితో ననిలుండును, శుంభ నిశుంభులతో భద్రకాళీదేవియు, జంభునితో వృషాకపియును, మహిషునితో విభావసుండును, నిల్వల వాతాపులతో బ్రహ్మపుత్రులును, దుర్మర్షణునితోఁ గామదేవుండును, నుత్కలునితో మాతృకాగణంబును, శుక్రునితో బృహస్పతియు, నరకునితో శనైశ్చరుండును, నివాత కవచులతో మరుత్తులును, గాలేయులతో వసువులు, నమరులును, బౌలోములతో విశ్వేదేవగణంబును, గ్రోధవశులతో రుద్రులును, నివ్విధంబునం గలిసి పెనంగి ద్వంద్వయుద్ధంబు చేయుచు మఱియు రథికులు రథికులను, పదాతులు పదాతులను, వాహనారూఢులు వాహనారూఢులనుం, దాఁకి సింహనాదంబులు చేయుచు, నట్టహాసంబు లిచ్చుచు, నాహ్వానంబు లొసంగుచు, నన్యోన్యతిరస్కారంబులు చేయుచు, బాహునాదంబుల విజృంభించుచుఁ, బెనుబొబ్బల నుబ్భిరేగుచు, హుంకరించుచు, నహంకరించుచు, ధనుర్గుణంబులఁ డంకరించుచు, శరంబుల నాటించుచుఁ, బరశువుల నఱకుచుం, జక్రంబులం జెక్కుచు, శక్తులం దునుముచుఁ, గశలంబెట్టుచుఁ, గుఠారంబులఁ బొడుచుచు, గదల నడచుచుఁ, గరంబులఁ బొడుచుచుఁ, గరవాలంబుల వ్రేయుచుఁ, బట్టిసంబుల నొంచుచుఁ, బ్రాసంబులం ద్రెంచుచుఁ, బాశంబులం గట్టుచుఁ, బరిఘంబుల మొత్తుచు, ముసలంబుల మోఁదుచు, ముద్గరంబుల జదుపుచు, ముష్టివలయంబుల ఘట్టించుచుఁ, దోమరంబుల నుఱుముచు శూలంబులఁ జిమ్ముచు, నఖంబులం జీరుచుఁ, దరు శైలంబుల ఱువ్వుచు, నుల్ముకంబులం జూఁడుచు నిట్లు బహువిధంబులం గలహ విహారంబులు సలుపు నవసరంబున భిన్నంబు లయిన శిరంబులును, విచ్ఛిన్నంబులైన కపాలంబులును, వికలంబులైన కపోలంబులును, జిక్కుపడిన కేశబంధంబులును, భగ్నంబులైన దంతంబులును, గృత్తంబులైన భుజంబులును, ఖండితంబులైన కరంబులును, విదళితంబు లైన మధ్యంబులును, వికృతంబులైన వదనబింబంబులును, వికలంబు లైన నయనంబులును, వికీర్ణంబు లయిన కర్ణంబులును, విశీర్ణంబు లైన నాసికలును, విఱిగిపడిన యూరుదేశంబులును, విసంధులయిన పదంబులునుఁ, జిరిగిన కంకటంబులును, రాలిన భూషణంబులును, వ్రాలిన కేతనంబులును, గూలిన ఛత్రంబులును, మ్రగ్గిన గజంబులును, నుగ్గయిన రథంబులును, నుఱుమైన హయంబులునుఁ, జిందఱవందఱలైన భటసమూహంబులును, నొఱలెడు కొఱప్రాణంబులును, బొఱలెడు మేనులును, నుబ్బి యాడెడు భూతంబులును, బాఱెడు రక్త ప్రవాహంబులును, గుట్టలుగొన్న మాంసంబులును, నెగసి తిరిగెడి కబంధంబులునుఁ, గలకలంబులు జేయు కంక గృధ్రాది విహంగంబులు, నయి యొప్పు నప్పోరతిఘోరంబయ్యె నప్పుడు.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 12:51, 22 సెప్టెంబరు 2016 (UTC)