పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/జగన్మోహిని వర్ణన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జగన్మోహిని వర్ణన

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-300-వ.)[మార్చు]

అంత.

(తెభా-8-301-సీ.)[మార్చు]

మెత్తని యడుగుల మెఱుఁగారు జానువు;
రఁటి కంబములదో యైన తొడలు
నమగు జఘనంబుఁ డు లేత నడుమును;
ల్లవారుణకాంతి పాణియుగము
డు దొడ్డ పాలిండ్లుఁ గంబుకంఠంబును;
బింబాధరముఁ జంద్రబింబముఖముఁ
దెలిగన్నుఁ గవయును నలికుంతలంబును;
బాలేందు సన్నిభ ఫాలతలము

(తెభా-8-301.1-తే.)[మార్చు]

మరఁ గుండల కేయూర హార కంక
ణాదు లేపార మంజీర నాద మొప్ప
ల్ల నవ్వులఁ బద్మదళాక్షుఁ డసుర
తుల నడగింప నాఁడు రూపంబుఁ దాల్చి.

(తెభా-8-302-వ.)[మార్చు]

అయ్యవసరంబున జగన్మోహనాకారంబున.

(తెభా-8-303-సీ.)[మార్చు]

పాలిండ్లపై నున్న య్యెద జాఱించు;
జాఱించి మెల్లన క్క నొత్తు
ళ్కు దళ్కను గండలకంబు లొలయించు;
నొలయించి కెంగేల నుజ్జగించుఁ
టు మెఱుంగులు వాఱు డకన్ను లల్లార్చు;
ల్లార్చి ఱెప్పల నండఁ గొలుపు
వరని దరహాస చంద్రికఁ జిలికించుఁ;
జిలకించి కెమ్మోవిఁ జిక్కుపఱచు

(తెభా-8-303.1-తే.)[మార్చు]

ళిత ధమ్మిల్ల కుసుమ గంమ్ము నెఱపుఁ
గంకణాది ఝణంకృతుల్ డలు కొలుపు
నొడలి కాంతులు పట్టులే కులుకఁ బాఱు
న్నవలిపంపుఁ బయ్యెద చౌకళింప.

(తెభా-8-304-వ.)[మార్చు]

ఇవ్విధంబున న క్కపట యువతీరత్నంబు జగన్మోహన దేవతయునుంబోలె నెమ్మొగంబు తావికి మత్తిల్లిన తేఁటి మొత్తంబులన్ గెలిచి చిగురు జొంపంబుల నెడగలుగ జడియుచు ముఱియుచుండ రాక్షసవరులు గనుంగొని.

(తెభా-8-305-సీ.)[మార్చు]

వుఁగదే లావణ్య; వుఁగదే మాధుర్య;
వుఁగదే సతి! నవయౌవనాంగి!
యెటనుండి వచ్చితి? వేమి యిచ్ఛించెదు? ;
నీ నామమెయ్యది? నీరజాక్షి!
మర గంధర్వ సిద్ధాసుర చారణ;
నుజకన్యలకు నీ హిమ గలదె?
ప్రాణ చిత్తేంద్రియ రిణామ దాయియై;
నిర్మించెఁ బో విధి నిన్ను గరుణ;

(తెభా-8-305.1-తే.)[మార్చు]

నిత! గశ్యపు సంతతి వార మేము
భ్రాతలము సురలకు నిద్ధపౌరుషులము
జ్ఞాతులకు మాకు నేకార్థసంగతులకుఁ
బాలు దీరని యర్థంబు బంచి యిమ్ము.

(తెభా-8-306-క.)[మార్చు]

యై యుండెద మిందఱ
యంబున వచ్చు కొలఁది మృతంబును నీ
వి రాజగమన! తప్పక
వి జింపు విపక్షపక్ష విరహితమతి వై.

(తెభా-8-307-వ.)[మార్చు]

అని మందలించిన దైత్యులం గని మాయాయువతి రూపుం డగు హరి తన వాఁడి వాలు జూపుటంపఱలవలన వారల తాలుముల నగలించి చిఱునగవు లెగయ మొగమెత్తి యిట్లనియె.

(తెభా-8-308-క.)[మార్చు]

సుం రులగు పురుషులఁగని
పొం దెడు నాయందు నిజము పుట్టునె మీకున్?
బృం దారకరిపులారా!
చెం రు కామినుల విశ్వసింపరు పెద్దల్.

(తెభా-8-309-క.)[మార్చు]

లుకులు మధురసధారలు
లఁపులు నానా ప్రకార దావానలముల్
చె లుములు సాలావృకములు
చె లువల నమ్ముటలు వేదసిద్ధాంతములే?
 : : 21-05-2016: : గణనాధ్యాయి 12:45, 22 సెప్టెంబరు 2016 (UTC)