పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/బలి ప్రతాపము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బలిప్రతాపము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-335-శా.)[మార్చు]

నా కాధీశుఁ బదింట, మూఁట గజమున్, నాల్గింట గుఱ్ఱంబులన్,
కాస్త్రంబున సారథిం జొనిపె, దైత్యేంద్రుండు దా నాకస
ల్లో కాధీశుఁడు ద్రుంచి యన్నిటిని దోడ్తో నన్ని భల్లంబులన్
రా కుండన్ రిపువర్గముం దునిమె గీర్వాణారి యగ్గింపఁగన్.

(తెభా-8-336-సీ.)[మార్చు]

న తూపులన్నియుఁ రమిడి శక్రుండు;
ఱికిన జోదు విన్ననువు మెఱసి
లి మహాశక్తిచేఁ ట్టిన నదియును;
తఁడు ఖండించె నత్యద్భుతముగ;
ఱి ప్రాస శూల తోరములు గైకొన్న;
దోడ్తోడ నవియును దునిమివైచె;
నంతటఁ బోక యెయ్యది వాఁడు సాగించెఁ;
దొడరి తా నదియును దురుము జేసె;

(తెభా-8-336.1-ఆ.)[మార్చు]

సురభర్త విరథుఁడై తన పగఱకుఁ
గానఁబడక వివిధ పట వృత్తి
నేర్పు మెఱసి మాయ నిర్మించె మింటను
వేల్పుగములు చూచి వెఱఁగు పడఁగ.

(తెభా-8-337-వ.)[మార్చు]

ఇట్లు దానవేంద్రుని మాయావిశేషవిధానంబున సురానీకంబులపైఁ బర్వతంబులు పడియె; దావాగ్ని దందహ్యమాన తరువర్షంబులు గురిసె సటంక శిఖర నికర శిలాసారంబులు గప్పె; మహోరగ దందశూకంబులు గఱచె; వృశ్చికంబులు మీటె; వరాహ వ్యాఘ్ర సింహంబులు గదిసి విదళింపన్ దొరఁకొనియె; వనగజంబులు మట్టిమల్లాడం జొచ్చె; శూలహస్తులు దిగంబరులునై రండు రండని బలురక్కసులు శతసహస్రసంఖ్యులు భేదనచ్ఛేదన భాషణంబులు చేయం దొడంగిరి; వికృత వదనులు గదాదండధారులు నాలంబిత కేశభారులునై యనేక రాక్షస వీరులు "పోనీకు పోనీకుఁడు; తునుము తునుముం" డని వెనుతగిలిరి; పరుష గంభీర నిర్ఘాత సమేతంబులయిన జీమూత సంఘాతంబులు వాతాహతంబు లై యుప్పతిల్లి నిప్పుల కుప్పలు మంటల ప్రోవులుం గురిసె; మహాపవన విజృంభితంబైన కార్చిచ్చు ప్రళయానలంబు చందంబునం దరికొనియె; ప్రచండ ఝంఝానిల ప్రేరిత సముత్తుంగ తరంగావర్త భీషణంబయిన మహార్ణవంబు చెలియలి కట్ట దాఁటి వెల్లివిరిసిన ట్లమేయంబయి యుండె; నా సమయంబునం బ్రళయకాలంబునుం బోలె మిన్ను మన్నును రేయింబగలు నెఱుంగ రాదయ్యె; అయ్యవసరంబున.

(తెభా-8-338-క.)[మార్చు]

సురేంద్రుని బహుతర
మా యాజాలంబులకును మా ఱెఱుఁగక వ
జ్రా యుధ ముఖరాదిత్యుల
పా యంబును బొంది చిక్కుడిరి నరేంద్రా!

(తెభా-8-339-వ.)[మార్చు]

అప్పుడు

(తెభా-8-340-క.)[మార్చు]

య్యసురుల చేఁ జిక్కితి
మె య్యది దెరు? వెందుఁ జొత్తుఁ? మిటు పొలయఁ గదే
య్యా! దేవ! జనార్దన!
కు య్యో! మొఱ్ఱో! యటంచుఁ గూయిడి రమరుల్
 : : 21-05-2016: : గణనాధ్యాయి 12:53, 22 సెప్టెంబరు 2016 (UTC)