పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/పయోభక్షణ వ్రతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పయోభక్షణవ్రతము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-476-వ.)[మార్చు]

అగు నయిననుం గాలోచిత కార్యంబు చెప్పెద.

(తెభా-8-477-మ.)[మార్చు]

వంతుం బరముం జనార్దనుఁ గృపాపారీణు సర్వాత్మకున్
దీశున్ హరి సేవజేయు మతఁడున్ సంతుష్టనిం బొంది నీ
గు నిష్టార్థము లెల్ల నిచ్చు; నిఖిలార్థావాప్తి చేకూరెడిన్
వత్సేవలఁ బొందరాదె బహుసౌభాగ్యంబులం బ్రేయసీ!

(తెభా-8-478-వ.)[మార్చు]

అనిన గృహస్థునకు గృహిణి యిట్లనియె.

(తెభా-8-479-క.)[మార్చు]

నా రాయణుఁ బరమేశ్వరు
నే రీతిఁ దలంతు? మంత్ర మెయ్యది? విహితా
చా రంబు లే ప్రకారము?
లా రాధన కాల మెద్ది? యానతి యీవే.

(తెభా-8-480-వ.)[మార్చు]

అనినఁ గశ్యప ప్రజాపతి సతికిఁ బయోభక్షణంబను వ్రతంబుపదేశించి తాత్కాలంబునుఁ, దన్మంత్రంబును, దద్విధానంబును, దదుపవాస దాన భోజన ప్రకారంబులును నెఱింగించెను. అదితియును ఫాల్గుణ మాసంబున శుక్లపక్షంబునఁ బ్రథమదివసంబునన్ దొరకొని పండ్రెండు దినంబులు హరి సమర్పణంబుగా వ్రతంబు జేసి వ్రతాంతంబున నియత యై యున్న యెడఁ జతుర్భాహుండునుఁ బీతవాసుండును శంఖ చక్ర గదాధరుండునునై, నేత్రంబుల కగోచరుండైన నారాయణదేవుండు ప్రత్యక్షంబైనం గనుంగొని.

(తెభా-8-481-క.)[మార్చు]

న్నుల సంతోషాశ్రులు
న్నులపైఁ బఱవఁ బులక జాలము లెసగన్
న్నతులును సన్నుతులును
ను న్నత రుచిఁ జేసి నిటల యుక్తాంజలియై.

(తెభా-8-482-క.)[మార్చు]

చూ పుల శ్రీపతి రూపము
నా పోవక త్రావి త్రావి ర్షోద్ధతయై
వా పుచ్చి మంద మధురా
లా పంబులఁ బొగడె నదితి క్ష్మీనాథున్.

(తెభా-8-483-సీ.)[మార్చు]

జ్ఞేశ! విశ్వంభరాచ్యుత! శ్రవణ మం;
ళనామధేయ! లోస్వరూప!
యాపన్న భక్త జనార్తి విఖండన! ;
దీనలోకాధార! తీర్థపాద!
విశ్వోద్భవస్థితి విలయకారణభూత! ;
సంతతానంద! శశ్వద్విలాస!
యాయువు దేహంబు నుపమ లక్ష్మియు;
సుధయు దివముఁ ద్రిర్గములును

(తెభా-8-483.1-తే.)[మార్చు]

వైదికజ్ఞాన యుక్తియు వైరిజయము
నిన్నుఁ గొలువని నరులకు నెఱయఁ గలదె
వినుతమందార! గుణహార! వేదసార!
ప్రణత వత్సల! పద్మాక్ష! రమపురుష!

(తెభా-8-484-ఆ.)[మార్చు]

సురవరులు సురల దలించి బెదరించి
నాక మేలుచున్న నాఁట నుండి
న్న కడుపుఁ గాన కంటఁ గూరుకు రాదు
డుపుఁబొక్కు మాన్పి కావవయ్య.

(తెభా-8-485-వ.)[మార్చు]

అనిన విని దరహసితవదనుండయి యాశ్రితకామధేనువైన యప్పరమేశ్వరుం డిట్లనియె.

(తెభా-8-486-శా.)[మార్చు]

నీ కోడండ్రును, నీ కుమారవరులున్, నీ నాథుఁడున్, నీవు సం
శ్లో కింపన్ సతులుం బతుల్ మిగుల సమ్మోదింప రాత్రించరుల్
శో కింపన్, భవదీయ గర్భమునఁ దేజోమూర్తి జన్మించెదన్
నా కున్ వేడుక పుట్టు నీ సుతుఁడనై ర్తించి వర్తింపఁగాన్.

(తెభా-8-487-మ.)[మార్చు]

లిమిన్ దైత్యులఁ జంపరాదు వినయోపాయంబునం గాని; సం
నం బొందకు; నేను నీ నియతికిన్ ద్భక్తికిన్ మెచ్చితిన్;
లి విద్వేషియు నా నిలింపగణముం బౌలోమియున్ మెచ్చ దై
త్యు ల' రాజ్యంబు హరింతు; నింద్రునికి నిత్తున్'''''; దుఃఖమింకేటికిన్?

(తెభా-8-488-క.)[మార్చు]

నీ మణుని సేవింపుము
నా రూపము మానసించి ళినీ! గర్భా
గా రంబు వచ్చి చొచ్చెద
గా రామునఁ బెంపవమ్మ రుణన్ నన్నున్.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 15:41, 22 సెప్టెంబరు 2016 (UTC)