పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/దితి కశ్యపుల సంభాషణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దితికశ్యపులసంభాషణ

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-460-వ.)[మార్చు]

అంత

(తెభా-8-461-సీ.)[మార్చు]

న తనూజుప్రోలు నుజులు గొనుటయు;
వేల్పు లెల్లను డాఁగ వెడలుటయును
భావించి సురమాత రితాపమునఁ బొంది;
గ ననాథాకృతి నరుచుండ
నా యమ్మ పెనిమిటి గు కశ్యపబ్రహ్మ;
ఱి యొకనాఁడు సమాధి మాని
న కుటుంబిని యున్న ధామమునకు నేగి;
నాతిచే విహితార్చములు పడసి

(తెభా-8-461.1-ఆ.)[మార్చు]

వంది వ్రాలి కుంది వాడిన యిల్లాలి
దనవారిజంబు డువుఁ జూచి
చేరఁ దిగిచి మగువ చిబుకంబు పుడుకుచు
"వారిజాక్షి! యేల గచె" దనుచు.

(తెభా-8-462-వ.)[మార్చు]

ఆ మహాత్ముం డిట్లనియె.

(తెభా-8-463-మ.)[మార్చు]

తె వా! విప్రులు పూర్ణులే? చెలగునే దేవార్చనాచారముల్?
ఱితో వేలుతురే గృహస్థులు? సుతుల్ ర్మానుసంధానులే?
నె ఱి నభ్యాగత కోటి కన్న మిడుదే? నీరంబునుం బోయుదే?
లే కర్థుల దాసులన్ సుజనులన్ న్నింపుదే? పైదలీ!

(తెభా-8-464-ఆ.)[మార్చు]

న్నమైనఁ దక్రమైనఁ దోయంబైన
శాకమైన దనకుఁ రగు కొలఁది
తిథి జనుల కడ్డ మాడక యిడరేని
లేమ! వారు కలిగి లేనివారు.

(తెభా-8-465-వ.)[మార్చు]

మఱియు

(తెభా-8-466-ఆ.)[మార్చు]

నెలఁత! విష్ణునకును నిఖిలదేవాత్మున
కాననంబు శిఖియు వనిసురులు;
వారు దనియఁ దనియు నజాతలోచనుం
తఁడుఁ దనియ జగము న్నిఁ దనియు.

(తెభా-8-467-క.)[మార్చు]

బి డ్డలు వెఱతురె నీకఱ
గొ డ్డంబులు జేయ కెల్ల కోడండ్రును మా
ఱొ డ్డారింపక నడతురె
యె డ్డము గాకున్నదే మృగేక్షణ! యింటన్.

(తెభా-8-468-వ.)[మార్చు]

అని పలికినం బతికి సతి యి ట్లనియె.

(తెభా-8-469-ఉ.)[మార్చు]

ప్రే యొకింత లేక దితి బిడ్డలు బిడ్డలబిడ్డలున్ మహా
భీ బలాఢ్యులై తనదుబిడ్డల నందఱఁ దోలి సాహసా
క్రా మిత వైరులయ్యు నమరావతి నేలుచు నున్నవారు; నీ
కే ని విన్నవింతు? హృదయేశ్వర! మేలుఁ దలంచి చూడవే?

(తెభా-8-470-క.)[మార్చు]

క్కా చెల్లెండ్రయ్యును
క్కరు నాతోడి పోరుఁ; దానున్ దితియున్
క్కసులు సురల మొత్తఁగ
క్కట! వల దనదు చూచు నౌనౌ ననుచున్.

(తెభా-8-471-సీ.)[మార్చు]

ఎండకన్నెఱుగని యింద్రుని యిల్లాలు;
లుపంచలను జాలిఁ డియె నేఁడు
త్రిభువన సామ్రాజ్య విభవంబుఁ గోల్పోయి;
దేవేంద్రుఁ డడవులఁ దిరిఁగె నేఁడు
లిమి గారాబు బిడ్డలు జయంతాదులు;
బరార్భకుల వెంటఁ నిరి నేఁడు
మరుల కాధారగు నమరావతి;
సురుల కాటపట్టయ్యె నేఁడు

(తెభా-8-471.1-ఆ.)[మార్చు]

లి జగముల నెల్ల లియుచు నున్నాఁడు
వాని గెలువరాదు వాసవునకు
యాగభాగమెల్ల తఁ డాహరించుచుఁ
డఁగి సురల కొక్క డియుఁ నీఁడు.

(తెభా-8-472-క.)[మార్చు]

ప్ర లకు నెల్లను సముఁడవు
ప్ర లను గడుపారఁ గన్న బ్రహ్మవు నయ్యుం
బ్ర లందు దుష్టమతులను
ని ముగ శిక్షింప వలదె నీవు? మహాత్మా!

(తెభా-8-473-మ.)[మార్చు]

సు లన్ సభ్యుల నార్తులన్ విరథులన్ శోకంబు వారించి ని
ర్జ ధానిన్ నిలుపంగ రాత్రిచరులన్ శాసింప సత్కార్య మే
వె వేరీతి ఘటిల్లు నట్టి క్రమమున్ వేగంబ చింతింపవే?
రుణాలోక సుధాఝరిం దనుపవే? ళ్యాణ సంధాయకా!

(తెభా-8-474-వ.)[మార్చు]

అనిన మనోవల్లభ పలుకు లాకర్ణించి ముహూర్తమాత్రంబు చింతించి విజ్ఞానదృష్టి నవలంబించి భావికాల కార్యంబు విచారించి కశ్యప బ్రహ్మ యిట్లనియె.

(తెభా-8-475-మ.)[మార్చు]

కుం డెవ్వడు? జాతుఁ డెవ్వఁడు? జనిస్థానంబు లెచ్చోటు? సం
నం బెయ్యది? మేను లేకొలఁదిఁ? సంసారంబు లేరూపముల్?
వి నుమా యింతయు విష్ణుమాయ దలఁపన్వేఱేమియున్ లేదు; మో
నిబంధంబు నిదాన మింతటికి జాయా! విన్నఁబో నేటికిన్?
 : : 21-05-2016: : గణనాధ్యాయి 15:39, 22 సెప్టెంబరు 2016 (UTC)