Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామనుడు గర్భస్తు డగుట

వికీసోర్స్ నుండి

వామనుడుగర్భస్తుడగుట

తెలుగు భాగవతము ( అష్ఠమ స్కంధము )
రచయిత: పోతన


తెభా-8-489-క.
లింతు దివము సురలనుఁ
బాలింతు మహేంద్రయువతి భాగ్యశ్రీలం
దూలింతు దానవుల ని
ర్మూలింతు రిపుప్రియాంగముల భూషణముల్. "

టీక:- ఏలింతున్ = పరిపాలింపజేసెదను; దివమున్ = స్వర్గమును; సురలనున్ = దేవతలను; పాలింతున్ = కాపాడెదను; మహేంద్ర = ఇంద్రుని {మహేంద్రుడు - మహా (గొప్ప) ఇంద్రుడు, దేవేంద్రుడు}; యువతిన్ = భార్యయొక్క; భాగ్య = సౌభాగ్యము; శ్రీలన్ = సంపదలను; తూలింతున్ = చలింపజేసెదను; దానవులన్ = రాక్షసులను; నిర్మూలింతున్ = నాశముచేసెదను; రిపు = శత్రువుల; ప్రియ = భార్యల; అంగముల = దేహమునందలి; భూషణముల్ = అలంకారములు.
భావము:- దేవతలు స్వర్గాన్ని పాలించేటట్లు చేస్తాను. శచీదేవి సౌభాగ్యాలను కాపాడతాను. రాక్షసులను అధికారం నుంచి తొలగించి, వారి ఇల్లాళ్ళ అలంకరాలను పోగొడతాను.”

తెభా-8-490-వ.
అని యిట్లు భక్తజనపరతంత్రుండగు పురాణపురుషుం డానతిచ్చి తిరోహితుడయ్యె; అ య్యదితియుఁ గృతకృత్య యై సంతోషంబునఁ దన మనోవల్లభుండగు కశ్యపు నాశ్రయించి సేవించుచుండె; నంత నొక్క దివసంబున .
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; భక్త = భక్తులైన; జన = వారికి; పరతంత్రుడు = లొంగిపోవువాడు; అగు = అయినట్టి; పురాణపురుషుండు = హరి; ఆనతిచ్చి = చెప్పి; తిరోహితుండు = మాయమైనవాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; అదితియున్ = అదితి; కృతకృత్య = కృతార్థురాలు; ఐ = అయ్యి; సంతోషంబునన్ = సంతోషముతో; తన = తన యొక్క; మనోవల్లభుండు = భర్త; అగు = అయిన; కశ్యపున్ = కశ్యపుని; ఆశ్రయించి = చేరి; సేవించుచుండెన్ = కొలుచుచుండెను; అంతన్ = అంతట; ఒక్క = ఒక; దివసంబున = దినము.
భావము:- ఆ విధంగా భక్తజన విధేయుడైన విష్ణుమూర్తి సెలవిచ్చి మాయమయ్యాడు. కృతార్థురాలైన అదితి సంతోషంతో తన ప్రాణవల్లభుడైన కశ్యపప్రజాపతిని చేరి సేవించసాగింది. అటు పిమ్మట ఒకనాడు, . . .

తెభా-8-491-ఆ.
న సమాధినుండి శ్యపుఁ డచ్యుతు
నంశ మాత్మనొలయ దితి యందుఁ
నదు వీర్య మధికరము సేర్చెను గాలి
శిఖిని దారువందుఁజేర్చినట్లు
.
టీక:- ఘన = గొప్ప; సమాధిన్ = యోగసమాధి; నుండి = నుండి; కశ్యపుడు = కశ్యపుడు; అచ్యుతున్ = హరి యొక్క; అంశన్ = అంశను; ఆత్మన్ = తనయందు; ఒలయన్ = ప్రవేశించగా; అదితి = అదితి; అందున్ = లో; తనదు = తన యొక్క; వీర్యమున్ = రేతస్సును; అధికతరమున్ = మిక్కిలి అధికమైనదిగా {అధికము - అధికతరము - అధికతమము}; చేర్చెన్ = చేర్చెను; గాలి = వాయువు; శిఖిని = అగ్నిని; దారువు = కొయ్య; అందున్ = లో; చేర్చిన = చేర్చిన; అట్లు = విధముగ.
భావము:- తపస్సులో ఉన్న కశ్యపునిలో విష్ణువు తేజస్సు ప్రవేశించింది. వాయువు కొయ్యలో అగ్నిని చేర్చిన విధంగా అదితి యందు కశ్యపుడు తన అసాధారణమైన వీర్యాన్ని చేర్చాడు.

తెభా-8-492-వ.
ఇట్లు కశ్యప చిరతర తపస్సంభృత వీర్యప్రతిష్ఠిత గర్భయై సురల తల్లి యుల్లంబున నుల్లసిల్లుచు నుండె; నంత .
టీక:- ఇట్లు = ఈ విధముగ; కశ్యప = కశ్యపుని యొక్క; చిరతర = చాలాఎక్కువకాలము {చిరము - చిరతరము - చిరతమము}; తపస్ = చేసినతపస్సుచే; సంభృత = చక్కగాధరించిన; వీర్య = రేతస్సు; ప్రతిష్ఠిత = ఉంచబడిన; గర్భ = గర్భాశయము కలామె; ఐ = అయ్యి; సురలతల్లి = అదితి {సురలతల్లి - దేవతల మాత, అదితి}; ఉల్లంబునన్ = మనసునందు; ఉల్లసించుచున్ = సంతోషించుచు; ఉండెను = ఉండెను; అంత = అప్పుడు.
భావము:- రాజా పరీక్షిత్తూ! ఈ విధంగా కశ్యపుడు చాలాకాలంగా మహతపో విశేషంతో సంపాదించిన వీర్యంవల్ల అదితి గర్భాన్ని ధరించింది. ఆమె మనసు చాలా ఉల్లాసాన్ని పొందింది.

తెభా-8-493-క.
చలనై పిదపిదనై
లంబై కరుడు గట్టి ళనాళముతోఁ
యేర్పడి గర్భంబై
నెమసలం జీరచిక్కె నెలఁతకు నధిపా!

టీక:- చలచలను = కదిలెడిద్రవమువలె; ఐ = అయ్యి; పిదపిదన్ = మెత్తమెత్తగా; ఐ = అయ్యి; కలలంబు = గర్భపిండము; ఐ = అయ్యి; కరడుగట్టి = గట్టిబడి; గళనాళము = గొంతు; తోన్ = తోబాటు; తల = శిరస్సు; ఏర్పడి = ఏర్పడి; గర్భంబు = పిండముగా; ఐ = అయ్యి; నెలమసలన్ = నెలతప్పగా; చీరజిక్కె = కడుపు వచ్చినది {చీరజిక్కు - చీర చాలలేదు, కడుపు వచ్చెను}; నెలత = యువతి; కున్ = కు; అధిపా = రాజా.
భావము:- ఒక నెల గడిచింది. అదితి కడుపులో క్రమక్రమంగా ద్రవరూపమూ మెత్తని రూపమూ గడ్డకట్టి పిండరూపము ఏర్పడింది. నెల తప్పింది గొంతుతోపాటు తల ఏర్పడి గర్భం నిలిచింది.

తెభా-8-494-క.
నెతకుఁ జూలై నెల రె
న్నెలై మఱి మూఁడు నాల్గు నెలలై వరుసన్
నెలంతకంత కెక్కఁగ
నెలును డగ్గఱియె నసుర నిర్మూలతకున్
.
టీక:- నెలత = సతి; కున్ = కి; చూలు = కడుపు; ఐ = వచ్చి; నెల = ఒకటవనెల (1); రెన్నెలలు = రెండునెలలు (2); ఐ = అయ్యి; మఱి = ఇంకా; మూడు = మూడు (3); నాల్గు = నాలుగు (4); నెలలు = నెలలు; ఐ = నిండి; వరుసన్ = క్రమముగా; నెలలు = నెలలు; అంతకంతకున్ = అంతకంతకు; ఎక్కగా = నిండుతుండగా; నెలలు = సమయము; డగ్గఱియెన్ = దగ్గరపడినది; అసుర = రాక్షస; నిర్మూలత = సంహారమున; కున్ = కు.
భావము:- అదితి చూలాలైన తరువాత వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు నెలలు గడిచాయి. క్రమంగా నెలలు పెరిగినాయి. దానితోపాటు రాక్షసులు నాశనం కావడానికి నెలలు సమీపించాయి.

తెభా-8-495-క.
హితతర మేఘమాలా
పిహితాయుత చండభాను బింబప్రభతో
విహితాంగంబులఁ గశ్యపు
గృహిణీగర్భమున శిశువుఁ గ్రీడించె నృపా!

టీక:- మహితతర = మిక్కిలిగొప్పదైన; మేఘ = మబ్బుల; మాలా = గుంపులచే; పిహిత = కప్పివేయబడిన; అయుత = పదివేల; చండభాను = సూర్య; బింబ = బింబముల; ప్రభ = ప్రకాశము; తోన్ = తో; విహిత = చక్కటి; అంగంబులన్ = అవయవములతో; కశ్యపు = కశ్యపుని; గృహిణీ = ఇల్లాలు యొక్క; గర్భమునన్ = కడుపులో; శిశువు = శిశువు; క్రీడించెన్ = కదలాడసాగెను; నృపా = రాజా {నృపుడు - నరులను పాలించువాడు, రాజు}.
భావము:- పరీక్షిన్మహారాజా! అదితి గర్భంలో అవయవాలతోకూడిన ఆ అద్భుత శిశువు గొప్ప మేఘాలు కప్పిన సూర్యబింబాల వెలుగుతో కదలాడసాగాడు.

తెభా-8-496-క.
కడుపున నొక యిరువునఁ
రుహగర్భాండభాండ నధిచయంబుల్
గొకొని జగములు నిడుకొని
నుగతిఁ గడు నడఁగి మడిఁగి నరెన్ బెడఁగై
.
టీక:- తన = తన యొక్క; కడుపునన్ = గర్భమునందు; ఒక = ఒక; ఇరువున = పక్కన; వనరుహగర్భాండభాండ = బ్రహ్మాండముల {వనరుహగర్భాండభాండము - వనరుహగర్భ (బ్రహ్మ) అండముల భాండములు (గుంపులు), బ్రహ్మాండభాండములు}; వనధి = సముద్రముల {వనధి - వనము (నీటి)కి నిధి, సముద్రము}; చయంబుల్ = సమూహములు; కొనకొని = కూడుకొనిన; జగములున్ = భువనములను; ఇడుకొని = ఉంచుకొని; తను = సన్ననిఅర్భకుని; గతిన్ = వలె; అడగి = అణిగి; మడిగి = మణిగి; తనరెన్ = చక్కగనుండెను; బెడగు = అందగించినవాడు; ఐ = అయ్యి.
భావము:- అదితి గర్భంలోని చిన్నారి శిశువు భూగోళాలనూ ఖగోళాలను సముద్రాలను సమస్తలోకాలనూ తన కడుపులో ఇమిడించికొని సన్ననైన చిన్ని రూపంతో అందంగా అణగిమణిగి ఉన్నాడు.

తెభా-8-497-వ.
అంత న క్కాంతాతిలకంబు క్రమక్రమంబున .
టీక:- అంతన్ = ఆ సమయమున; ఆ = ఆ; కాంతా = స్త్రీలలో; తిలకంబు = శ్రేష్ఠురాలు; క్రమక్రమంబున్ = క్రమముగా.
భావము:- అదితి క్రమక్రమంగా నిండుచూలాలు అయింది. . .

తెభా-8-498-మ.
నిలిపెన్ ఱెప్పల బృందిమన్, విశదిమన్ నేత్రంబులం, జూచుకం
బునాకాళిమ, మేఖలం ద్రఢిమ, నెమ్మోమారఁగాఁ బాండిమన్
లిమిం జన్నుల, శ్రోణిపాళిగరిమన్, ధ్యంబునన్ బృంహిమ
న్లలితాత్మన్ లఘిమన్, మహామహిమ మేనన్ గర్భదుర్వారమై
.
టీక:- నిలిపెన్ = స్థిరపరచెను; ఱెప్పల = కనురెప్పల; బృందిమన్ = మనోజ్ఞతను; విశదిమన్ = పెద్దవిగా ఉండుటయందు; నేత్రంబులన్ = కన్నులను; చూచుకంబులన్ = చనుమొనలను; ఆ = ఆ ; కాళిమన్ = నల్లదనమును; మేఖలన్ = ఒడ్డాణము; ద్రఢిమన్ = బిగువుకావడమును; నెఱ = నిండు; మోము = ముఖము; ఆరగాన్ = ఒప్పుగా; పాండిమన్ = తెల్లదనమును; బలిమిన్ = బలిష్ఠము; చన్నులన్ = స్తనములందు; శ్రోణి = పిరుదుల; పాళి = ప్రదేశము; గరిమన్ = గొప్పదనమును; మధ్యంబునన్ = నడుమునందు; బృంహిమ = లావగుట; లలిత = మనోజ్ఞమైన; ఆత్మన్ = మనసునందు; లఘిమన్ = తేలికపడుట; మహా = మిక్కిలి; మహిమ = మహత్వము; మేనన్ = దేహమునందు; గర్భ = గర్భము; దుర్వారము = ఆపలేనిది; ఐ = అయ్యి.
భావము:- ఆమె రెప్పలు అందంగా ఒప్పాయి: కన్నులు నిర్మలమయ్యాయి: స్తనాగ్రాలు నల్లపడ్డాయి: ఒడ్డాణం బిగువైంది; ముఖం తెల్లబడింది: పిరుదులు బరువెక్కాయి: నడుము విస్తరించింది: మనస్సు తేలికపడింది. దేహం మహత్వాన్ని పొందింది. గ్రర్భం అతిశయించింది.

తెభా-8-499-క.
పెట్టుదురు నుదుట భూతిని
బొట్టిడుదురు మేఁన బట్టుఁ బుట్టపుదోయిం
బెట్టుదురు వేల్పు లమ్మకుఁ
ట్టుదురు సురక్ష పడఁతిర్భంబునకున్
.
టీక:- పెట్టుదురు = పెట్టెదరు; నుదుటన్ = నుదుటిమీద; భూతిని = విభూతిని; బొట్టిడుదురు = బొట్టుగా పెట్టెదరు; మేనన్ = ఒంటిమీదకి; పట్టు = పట్టు; పుట్టపు = బట్టల; దోయిన్ = జత (2)ని; పెట్టుదురు = పెట్టెదరు; వేల్పులమ్మ = అదితి; కున్ = కి; కట్టుదురు = కట్టెదరు; సురక్ష = రక్షాతోరమును; పడతి = సతి యొక్క; గర్భంబున్ = గర్భమున; కున్ = కు.
భావము:- పెద్దముత్తైదువలు ఆదిత్యులకు తల్లి అయిన అదితికి నుదుట విభూతి పెట్టారు. తిలకం దిద్దారు పట్టుబట్టలు కట్టారు. ఆమె గర్భానికి రక్ష కట్టారు.

తెభా-8-500-వ.
ఇవ్విధంబున .
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
భావము:- ఈ విధంగా హరి గర్భస్తుడు అయి. . .

తెభా-8-501-తే.
విశ్వగర్భుఁడు దన గర్భ వివరమందుఁ
బూటపూటకుఁ బూర్ణుఁడై పొటకరింప
వ్రేఁక జూలాలితనమున వేల్పుఁ బెద్ద
పొలఁతి కంతట నీళ్ళాడు ప్రొద్దులయ్యె
.
టీక:- విశ్వగర్భుడు = నారాయణుడు {విశ్వగర్భుడు - విశ్వము గర్భమున కలవాడు, విష్ణువు}; తన = తన యొక్క; గర్భవివరము = గర్భాశయము; అందున్ = లో; పూటపూట = రోజురోజు; కున్ = కి; పూర్ణుడు = నిండుతున్నవాడు; ఐ = అయ్యి; పొటకరింపన్ = వర్థిల్లుచుండగా; వ్రేకన్ = భారమైన; చూలాలితనమునన్ = నిండుచూలాలిగ; వేల్పుపెద్దపొలతి = అదితి; కిన్ = కి; అంతట = అప్పుడు; నీళ్ళాడు = ప్రసవించెడి, పురిటి; ప్రొద్దులు = సమయము, దినములు; అయ్యె = అయినది.
భావము:- అదితి గర్భంలో విశ్వగర్భుడైన భగవంతుడు పూర్ణుడు అవుతూ పూటపూటకూ పెరగసాగాడు. గర్భం బరువెక్కసాగింది. దేవతల కన్నతల్లి అదితి నీళ్ళాడే సమయం ఆసన్నమయింది.