పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/ధర్మసావర్ణిమనువుచరిత్ర

వికీసోర్స్ నుండి

11ధర్మసావర్ణిమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-421-వ.
మఱియుం దదాగమ్యిష్యత్కాలంబున ధర్మసావర్ణి పదునొకండవ మనువయ్యెడి; మనుతనూజులు సత్యధర్మాదులు పదుండ్రు; ధరణీపతులును; విహంగమ కామగమన నిర్వాణరుచు లనువారు సురులును; వైధృతుఁడను వాఁ డింద్రుండును; నరుణాదులు ఋషులును నయ్యెదరు; అందు.
టీక:- మఱియును = ఇంకను; తత్ = ఆ; ఆగమిష్యత్ = రాబోవు; కాలంబునన్ = సమయమునందు; ధర్మసావర్ణి = ధర్మసావర్ణి; పదునొకండవ = పదకొండో (11); మనువున్ = మనువు; అయ్యెడిన్ = అవ్వుతాడు; మను = మనువు యొక్క; తనూజులు = పుత్రులు; సత్యధర్మ = సత్యధర్ముడు; ఆదులు = మున్నగువారు; పదుండ్రున్ = పదిమంది (10); ధరణీపతులును = రాజులు; విహంగ = ఆకాశగమనములు; కామగమన = కామగమనులు; నిర్వాణరుచులును = నిర్వాణరుచులు; అను = అనడి; సురులును = దేవతలును; వైధృతుడు = వైధృతుడు; అను = అనెడి; వాడు = వాడు; ఇంద్రుండును = ఇంద్రుడు; అరుణ = అరుణుడు; ఆదులు = మున్నగువారు; ఋషులునున్ = సప్తర్షులు; అయ్యెదరు = అవ్వుతారు; అందున్ = ఆ కాలమున.
భావము:- ఆతరువాత వచ్చే కాలంలో ధర్మసావర్ణి పదకొండవ మనువు అవుతాడు. అతనిక కొడుకులైన సత్యధర్ముడు మొదలైనవారు పదిమంది రాజులు అవుతారు. విహంగములూ, కామగమనులూ, నిర్వాణరుచులూ దేవతలు అవుతారు. వైధృతుడు ఇంద్రుడు అవుతాడు. అరుణుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు.

తెభా-8-422-ఆ.
అంబుజాత నేత్రుఁడా సూర్య సూనుఁడై
ర్మసేతు వనఁగఁ గ జనించి
వైభవాఢ్యుఁ డగుచు వైధృతుఁ డలరంగఁ
రుణఁ ద్రిజగములనుఁ గావఁ గలఁడు.

టీక:- అంబుజనేత్రుడు = విష్ణువు; ఆ = ఆ; సూర్య = సూర్యుని యొక్క; సూనుడు = పుత్రుడుగా; ఐ = అయ్యి; ధర్మసేతువు = ధర్మసేతువు; అనగన్ = అనిపిలవబడి; తగన్ = తప్పక; జనించి = అవతరించి; వైభవ = మహిమలతో; ఆఢ్యుడు = సంపన్నుడు; అగుచున్ = అగుచు; వైధృతుడు = వైధృతుడు; అలరంగన్ = సంతోషించేటట్లు; కరుణన్ = కృపతో; త్రిజగములనున్ = ముల్లోకములను; కావగలడు = కాపాడబోవుచున్నాడు;
భావము:- ఆకాలంలో విష్ణువు ధర్మసేతువు అనే పేరుతో సూర్యుని కొడుకుగా జన్మిస్తాడు. అతడు మహిమలతో సంపన్నుడై వైధృతుడు సంతోషించేటట్లు మూడు లోకాలనూ కరుణతో కాపాడుతాడు.