పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/దానవులు వామనునిపై కెళ్ళుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దానవులువామనుపైకెళ్ళుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-634-వ.)[మార్చు]

అంత నొయ్యన పూర్వప్రకారంబున వామనాకారంబు వహించి యున్న వామనునిం గని "పదత్రయ వ్యాజంబున నితండు సకల మహీ మండలంబు నాక్రమించె కపటవటురూప తిరోహితుండగు విష్ణుండని యెఱుంగక మన దానవేంద్రుఁడు సత్యసంధుండు గావున మాటఁ దిరుగక యిచ్చె నతని వలన నేరంబు లేదు ఈ కుబ్జుం డప్రతిహత తేజః ప్రభావంబున సజ్జకట్టుగా ని జ్జగంబులం బరిగ్రహించి, పర్జన్యాదులకు విసర్జనంబు చేయందలంచి యున్నవాఁ, డీ పాఱునిం దూఱి పాఱనీక నిర్జించుటఁ గర్జం" బని తర్జనంబులును గర్జనంబులునుఁ జేయుచు, వజ్రాయుధాధి మరుజ్జేతలగు హేతి ప్రహేతి విప్రచిత్తి ముఖ్యులయిన రక్కసులు పెక్కం డ్రుక్కుమిగిలి యుద్ధంబునకు సన్నధులై పరశు పట్టిస భల్లాది సాధనంబులు ధరియించి కసిమెసంగి ముసరికొని దశదిశలఁ బ్రసరించినఁ జూచి హరిపరిచరులు సునంద నంద జయ జయంత విజయ ప్రబలోద్బల కుముద కుముదాక్ష తార్క్ష్య పుష్పదంత విష్వక్సేన శ్రుతదేవ సాత్వత ప్రముఖులగు దండనాథు లయుత వేదండ సముద్దండ బలులుఁ దమతమ యూథంబుల నాయుధంబులతోడం గూర్చుకొని దానవానీకంబులం బరలోకంబున కనుచువారలై వారల నెదుర్కొని కదనంబునకున్ బరవసంబు చేయుచున్నం గనుంగొని శుక్రుశాపంబుఁ దలంచి దనుజ వల్లభుం డిట్లనియె.

(తెభా-8-635-సీ.)[మార్చు]

రాక్షసోత్తములార! రండు పోరాడక;
కాలంబు గాదిది లహమునకు;
ర్వభూతములకు సంపదాపదలకు;
బ్రభువైన దైవంబుఁ రిభవింప
న మోపుదుమె? తొల్లి నకు రాజ్యంబును;
సురలకు నాశంబు సొరిది నిచ్చి
విపరీతముగఁ జేయు వేల్పు నే మందము;
నపాలి భాగ్యంబు హిమ గాక;

(తెభా-8-635.1-తే.)[మార్చు]

వెఱచి పలుమాఱుఁ బాఱెడి విష్ణుభటులు
మిమ్ము నెగచుట దైవంబు మేర గాదె?
నకు నెప్పుడు దైవంబు మంచిదగును
నాఁడు గెలుతుము పగవారి నేఁడు వలదు.

(తెభా-8-636-వ.)[మార్చు]

అదియునుం గాక.

(తెభా-8-637-క.)[మార్చు]

లు దుర్గంబులు సచివులు
ములు మంత్రౌషధములు హు శేముషియుం
లిగియు సామోపాయం
బు లఁ గాల మెఱింగి నృపుడు పోరుట యొప్పున్.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 11:01, 23 సెప్టెంబరు 2016 (UTC)