పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/చాక్షుసమనువుచరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

6చాక్షుసమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-141-సీ.)[మార్చు]

క్షుస్తనూజుండు చాక్షుషుం డను వీరుఁ;
డాఱవ మనువయ్యె వనినాథ!
భూమీశ్వరులు పురుః పురుష సుద్యుమ్నాదు;
లాతని నందను; మరవిభుఁడు
మంత్రద్యుమాఖ్యుఁ; డర్త్యు లాప్యాదికు;
లాహవిష్మద్వీరకాది ఘనులు
మునులందు విభుఁడు సంభూతికి వైరాజు;
కుఁ బుట్టి యజితుండు నాఁగ నొప్పె;

(తెభా-8-141.1-ఆ.)[మార్చు]

తఁడు కాఁడె కూర్మమై మందరాద్రిని
నుదధి జలములోన నుండి మోచె;
తఁడు చువ్వె దివిజు ర్థింప నమృతాబ్ధిఁ
ద్రచ్చి యిచ్చె నా సుధారసంబు.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 12:31, 19 సెప్టెంబరు 2016 (UTC)