పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/గజేంద్రమోక్షణ కథా ఫలసృతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గజేంద్రమోక్షణకథాఫలసృతి

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-135-సీ.)[మార్చు]

రనాథ! నీకును నాచేత వివరింపఁ;
డిన యీ కృష్ణానుభావమైన
జరాజమోక్షణథ వినువారికి;
శము లిచ్చును గల్మషాపహంబు;
దుస్స్వప్న నాశంబు దుఃఖ సంహారంబుఁ;
బ్రొద్దున మేల్కాంచి పూతవృత్తి
నిత్యంబుఁ బఠియించు నిర్మలాత్ముకులైన;
విప్రులకును బహువిభవ మమరు;

(తెభా-8-135.1-తే.)[మార్చు]

సంపదలు గల్గుఁ; బీడలు శాంతిఁ బొందు;
సుఖము సిద్ధించు; వర్థిల్లు శోభనములు;
మోక్ష మఱచేతిదై యుండు; ముదము చేరు
నుచు విష్ణుండు ప్రీతుఁడై యానతిచ్చె.

(తెభా-8-136-వ.)[మార్చు]

అని మఱియు నప్పరమేశ్వరుం డిట్లని యానతిచ్చె "ఎవ్వరేని నపర రాత్రాంతంబున మేల్కాంచి సమాహిత మనస్కులయి నన్నును; నిన్నును; నీ సరోవరంబును; శ్వేతద్వీపంబును; నాకుం బ్రియంబైన సుధాసాగరంబును; హేమనగంబును; నిగ్గిరి కందర కాననంబులను; వేత్ర కీచక వేణు లతాగుల్మ సురపాదపంబులను; నేనును బ్రహ్మయు ఫాలలోచనుండును నివసించియుండు నక్కొండ శిఖరంబులను; గౌమోదకీ కౌస్తుభ సుదర్శన పాంచజన్యంబులను; శ్రీదేవిని; శేష గరుడ వాసుకి ప్రహ్లాద నారదులను; మత్య కూర్మ వరాహాద్యవతారంబులను; దదవతారకృత కార్యంబులను; సూర్య సోమ పావకులను; బ్రణవంబును; ధర్మతపస్సత్యంబులను; వేదంబును; వేదాంగంబులను శాస్త్రంబులను; గో భూసుర సాధు పతివ్రతా జనంబులను; జంద్ర కాశ్యపజాయా సముదయంబును; గౌరీ గంగా సరస్వతీ కాళిందీ సునందా ప్రముఖ పుణ్యతరంగిణీ నిచయంబును; నమరులను; నమరతరువులను; నైరావతంబును; నమృతంబును; ధ్రువుని; బ్రహ్మర్షి నివహంబును; బుణ్యశ్లోకులైన మానవులను; సమాహితచిత్తులై తలంచువారలకుఁ బ్రాణావసానకాలంబున మదీయంబగు విమలగతి నిత్తు" నని హృషీకేశుండు నిర్దేశించి శంఖంబు పూరించి సకలామర వందితచరణారవిందుఁడై విహగపరివృఢ వాహనుండై వేంచేసె; విబుధానీకంబు సంతోషించె" నని చెప్పి శుకుండు రాజున కిట్లనియె.

(తెభా-8-137-క.)[మార్చు]

రాజమోక్షణంబును
ని ముగఁ బఠియించునట్టి నియతాత్ములకున్
రాజ వరదుఁ డిచ్చును
తురగస్యందనములుఁ గైవల్యంబున్.

21-05-2016: :
గణనాధ్యాయి 17:27, 16 సెప్టెంబరు 2016 (UTC)