పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/కూర్మావతారము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కూర్మావతారము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-201-క.)[మార్చు]

నిధి జలముల లోపల
ము నిఁగెడి గిరిఁ జూచి దుఃఖమునఁ జింతాబ్దిన్
ము నిఁగెడి వేల్పులఁ గనుఁగొని
జాక్షుఁడు వార్ధినడుమ వారలు చూడన్.

(తెభా-8-202-సీ.)[మార్చు]

వరనై లక్ష యోనముల వెడలుపై;
డుఁ గఠోరమునైన ర్పరమును
దనైన బ్రహ్మాండమైన నాహారించు;
నతరంబగు ముఖహ్వరంబు
కల చరాచర జంతురాసుల నెల్ల;
మ్రింగి లోఁగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైఁబడ్డ;
నాఁగినఁ గదలని ట్టి కాళ్ళు

(తెభా-8-202.1-తే.)[మార్చు]

వెలికి లోనికిఁ జనుదెంచు విపుల తుండ
మంబుజంబులఁ బోలెడు క్షి యుగము
సుందరంబుగ విష్ణుండు సురలతోడి
కూర్మి చెలువొంద నొక మహా కూర్మ మయ్యె.

(తెభా-8-203-మ.)[మార్చు]

ఠంబై జలరాశిఁ జొచ్చి లఘు ముక్తాశుక్తి చందంబునన్
దద్రీంద్రము నెత్తె వాసుకి మహానాగంబుతో లీలతో
రేంద్రాదులు మౌళికంపములతో నౌనౌఁగదే! బాపురే!
లాక్షా! శరణంచు భూదిశలు నాకాశంబునున్ మ్రోయఁగన్.

(తెభా-8-204-వ.)[మార్చు]

ఇవ్విధంబున.

(తెభా-8-205-క.)[మార్చు]

రిగాండ్రలోన నొకఁడట
రి గడవకుఁ గుదురు నాఁక త్రాడఁట చేరుల్;
రి గవ్వంబును దా నఁట
రిహరి! హరిచిత్రలీల రియే యెఱుఁగున్.

(తెభా-8-206-ఆ.)[మార్చు]

లధిఁ గడవ చేయ శైలంబుఁ గవ్వంబు
చేయ భోగిఁ ద్రాడు చేయఁ దరువ
సిరియు సుధయుఁ బడయ శ్రీవల్లభుఁడుఁ దక్క
నొరుఁడు శక్తిమంతుఁ డొకఁడు గలఁడె?

(తెభా-8-207-ఆ.)[మార్చు]

గొల్లవారి బ్రతుకు గొఱఁతన వచ్చునె
గొల్లరీతిఁ బాలకుప్ప ద్రచ్చి
గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్ణుండు
చేటు లేని మందు సిరియుఁ గనిరి.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 13:22, 19 సెప్టెంబరు 2016 (UTC)