పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/సముద్రమథన వర్ణన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సముద్రమథన వర్ణన

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-208-వ.)[మార్చు]

ఇట్లు సురాసురయూథంబులు హరిసనాథంబులయి కవచంబులు నెట్టంబులు పెట్టికొని; పుట్టంబులు పిరిచుట్లు చుట్టుకొని; కరంబులుఁ గరంబుల నప్పళించుచు; భుజంబులు భుజంబుల నొరయుచు; లెండు లెండు దరువఁ దొడంగుఁడు రండని యమందగతిం బెరుగుఁ ద్రచ్చు మందగొల్లల చందంబున మహార్ణవమధ్యంబున మంథాయమాన మందరమహీధర విలగ్నభోగి భోగాద్యంతంబులం గరంబులం దెమల్చుచుఁ; బెనుబొబ్బలం బ్రహ్మాండ కటాహంబు నిర్భరంబయి గుబ్బుగుబ్బని యురులు కొండకవ్వంబుగుత్తి జిఱజిఱందిరుఁగు వేగంబున ఛటచ్ఛటాయ మానంబులయి బుగులుబుగుళ్ళను చప్పుళ్ళుప్పరం బెగసి లెక్కుకు మిక్కిలి చుక్కల కొమ్మల చెక్కుల నిక్కలుపడు మిసిమిగల మీఁది మీఁగడ పాలతేట నిగ్గుఁ దుంపరల పరంపరలవలన నిజకరక్రమ క్రమాకర్షణపరిభ్రాంత ఫణిఫణాగర్భ సముద్భూత నిర్భర విష కీలి కీలాజాలంబుల నప్పటప్పటికి నుప్పతిల్లిన దప్పిం గొండొక మందగతిం జెందక యక్కూపార వేలా తట కుటజ కుసుమగుచ్ఛ పిచ్ఛిల స్వచ్ఛ మకరంద సుగంధి గంధవహంబులం గ్రొంజెమట నీటి పెను వఱదగము లొడళ్ళ నిగుర నొండొరు లంబరిహసించుచుఁ బేరువాడి విలసించుచు; మేలు మేలని యుగ్గడించుచుఁ; గాదు కాదని భంగించుచు; నిచ్ఛ మెచ్చని మచ్చరంబుల వలన వనధి వలమాన వైశాఖ వసుంధరాధర పరివర్తన సముజ్జనిత ఘమఘమారావంబును; మథన గుణాయమాన మహాహీంద్రప్రముఖ ముహుర్ముహురుచ్చలిత భూరి ఘోర ఫూత్కార ఘోషంబును; గులకుధర పరిక్షేపణ క్షోభిత సముల్లంఘన సమాకులితంబులై వెఱచఱచి గుబురుగుబురలై యొరలు కమఠ కర్కట కాకోదర మకర తిమి తిమింగిల మరాళ చక్రవాక బలాహక భేక సారసానీకంబుల మొఱలునుం గూడికొని ముప్పిరిగొని; దనుజ దివిజ భటాట్టహాస తర్జనగర్జనధ్వనులు నలుపురియై మొత్తినట్లైన దిశదిగంత భిత్తులును; బేఁటెత్తి పెల్లగిలం ద్రుళ్ళుచుఁ గికురు పొడుచుచు నొక్కఁడొకనికంటె వడియునుం గడపునుం గలుగఁ ద్రచ్చుచుఁ బంతంబు లిచ్చుచు సుధాజననంబుఁ జింతించుచు నూతనపదార్థంబులకు నెదుళ్ళు చూచుచు నెంతదడవు ద్రత్తుమని హరి నడుగుచు నెడపడని తమకంబుల నంతకంతకు మురువుడింపక త్రచ్చు సమయంబున.

(తెభా-8-209-క.)[మార్చు]

ప్పాలవెల్లి లోపల
ప్పటికప్పటికి మందరాగము దిరుగం
ప్పుడు నిండె నజాండము
చె ప్పెడి దే మజుని చెవులు చిందఱగొనియెన్.

(తెభా-8-210-వ.)[మార్చు]

అంత నప్పయోరాశి మధ్యంబున.

(తెభా-8-211-క.)[మార్చు]

మఁ గుడి మునుపు దిరుగుచు
గు డి నెడమను వెనుకఁ దిరుగు కులగిరి గడలిం
లెడల సురలు నసురులుఁ
దొ డితొడి ఫణి ఫణము మొదలుఁ దుదియును దిగువన్.

(తెభా-8-212-క.)[మార్చు]

డిగొని కులగిరిఁ దరువఁగ
నిధి ఖగ మకర కమఠ ష ఫణి గణముల్
సు డివడుఁ దడఁబడుఁ గెలఁకులఁ
డు భయపడి నెగసి బయలఁ డు నురలిపడున్.

(తెభా-8-213-క.)[మార్చు]

రాసుర కర విపరి
భ్ర ణ ధరాధరవరేంద్ర భ్రమణంబును దాఁ
ఠేంద్రు వీపు తీఁటను
మియింపఁగఁ జాలదయ్యె గతీనాథా!

(తెభా-8-214-వ.)[మార్చు]

తదనంతరంబ
 : : 21-05-2016: : గణనాధ్యాయి 13:24, 19 సెప్టెంబరు 2016 (UTC)