పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/కల్పాంత వర్ణన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కల్పాంతవర్ణన

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-711-వ.)[మార్చు]

తదనంతరంబ

(తెభా-8-712-తే.)[మార్చు]

మున్ను పోయిన కల్పాంతమున నరేంద్ర!
బ్రహ్మ మనఁగ నైమిత్తిక ప్రళయ వేళ
నింగిపై నిట్టతొలఁకు మున్నీటిలోనఁ
గూలె భూతాళి జగముల కొలఁదు లెడలి.

(తెభా-8-713-వ.)[మార్చు]

అంత న మ్మహారాత్రి యందు

(తెభా-8-714-మ.)[మార్చు]

నె ఱి నెల్లప్పుడు నిల్చి ప్రాణిచయమున్ నిర్మించి నిర్మించి వీఁ
పి యన్ నీల్గుచు నావులించుచు నజుం డే సృష్టియున్ మాని మే
నొ ఱఁగన్ ఱెప్పలు మూసి కేల్ దలగడై యుండంగ నిద్రించుచున్
గు ఱు పెట్టం దొడఁగెం గలల్ గనుచు నిర్ఘోషించుచున్ భూవరా!

(తెభా-8-715-ఆ.)[మార్చు]

లసి సొలసి నిదుర నందిన పరమేష్ఠి
ముఖము నందు వెడలె మొదలి శ్రుతులు
పహరించె నొక హగ్రీవుఁ డను దైత్య
టుఁడు; దొంగఁ దొడర రుల వశమె?

(తెభా-8-716-క.)[మార్చు]

దువులుఁ దన చేఁ బడినం
దువుచుఁ బెన్ బయల నుండ శంకించి వడిం
దువుల ముదుకఁడు గూరుకఁ
దువుల తస్కరుఁడు చొచ్చె లనిధి కడుపున్.

(తెభా-8-717-వ.)[మార్చు]

ఇట్లు వేదంబులు దొంగిలి దొంగరక్కసుండు మున్నీట మునింగిన, వాని జయింపవలసియు, మ్రానుదీఁగెల విత్తనంబుల పొత్తరలు పె న్నీట నాని చెడకుండ మనుపవలసియు నెల్ల కార్యంబులకుం గావలి యగునా పురుషోత్తముం డ ప్పెను రేయి చొరుదల యందు.

(తెభా-8-718-క.)[మార్చు]

కు ఱుగఱులు వలుఁద మీసలు
చి ఱుదోకయుఁ బసిఁడి యొడలు సిరిగల పొడలున్
నె ఱి మొగము నొక్క కొమ్మును
మి ఱుచూపులుఁ గలిగి యొక్క మీనం బయ్యెన్.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 11:13, 23 సెప్టెంబరు 2016 (UTC)