పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/గురు పాఠీన విహరణము
< పోతన తెలుగు భాగవతము | అష్ఠమ స్కంధము(పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/గురుపాఠీనవిహరణము నుండి మళ్ళించబడింది)
Jump to navigation
Jump to search
గురుపాఠీనవిహరణము
←కల్పాంతవర్ణన | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
కడలిలో నావనుగాచుట → |
(తెభా-8-719-వ.)[మార్చు]
ఇట్లు లక్ష యోజనాయతం బయిన పాఠీనంబై విశ్వంభరుండు జలధి చొచ్చి.
(తెభా-8-720-సీ.)[మార్చు]
ఒకమాటు జలజంతుయూథంబులోఁగూడు;
నొకమాటు దరులకు నుఱికి వచ్చు;
నొకమాటు మింటికి నుదరి యుల్లంఘించు;
నొకమాటు లోపల నొదిఁగి యుండు;
నొకమాటు వారాశి నొడలు ముంపమిఁ జూచు;
నొకమాటు బ్రహ్మాండ మొరయఁ దలఁచు;
నొకమాటు ఝషకోటి నొడిసి యాహారించు;
నొకమాటు జలముల నుమిసి వైచు;
(తెభా-8-720.1-తే.)[మార్చు]
గఱులు సారించు; మీసాలుఁ గడలు కొలుపుఁ;
బొడలు మెఱయించుఁ; గన్నులఁ పొలప మార్చు;
నొడలు జళిపించుఁ దళతళ లొలయ మీన
వేషి పెన్నీట నిగమ గవేషి యగుచు.
: : 21-05-2016: : గణనాధ్యాయి 11:16, 23 సెప్టెంబరు 2016 (UTC)