పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/కడలిలో నావను గాచుట
కడలిలో నావనుగాచుట
←గురుపాఠీనవిహరణము | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
ప్రళయావసానవర్ణన → |
(తెభా-8-721-వ.)[మార్చు]
అంతకు మున్న సత్యవ్రతుండు మహార్ణవంబులు మహీవలయంబు ముంచు నవసరంబున భక్త పరాధీనుం డగు హరిఁ దలంచుచు నుండ నారాయణ ప్రేరితయై యొక్క నావ వచ్చినం గనుంగొని.
(తెభా-8-722-మ.)[మార్చు]
చ ని సత్యవ్రతమేదినీదయితుఁ డోజం బూని మ్రాన్దీఁగె వి
త్త నముల్ పెక్కులు నావపై నిడి హరిధ్యానంబుతో దానిపై
ము ని సంఘంబులుఁ దాను నెక్కి వెఱతో మున్నీటిపైఁ దేలుచుం
గ నియెన్ ముందట భక్తలోక హృదలంకర్మీణమున్ మీనమున్.
(తెభా-8-723-వ.)[మార్చు]
కని జలచరేంద్రుని కొమ్మున నొక్క పెనుఁ బాపత్రాటన నావఁ గట్టి, సంతసించి డెందంబు నివురుకొని తపస్వులుం దాను నా రాచపెద్ద మీనాకారుండగు వేల్పుఱేని నిట్లని పొగడం దొడంగె.
(తెభా-8-724-మ.)[మార్చు]
త మలోఁ బుట్టు నవిద్య గప్పికొనుడుం దన్మూలసంసార వి
భ్ర ములై కొందఱు దేలుచుం గలఁగుచున్ బల్వెంటలన్ దైవ యో
గ మునం దే పరమేశుఁ గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై
ప్ర మదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మమ్మీశ్వరా!
(తెభా-8-725-ఉ.)[మార్చు]
క న్నులు గల్గువాఁడు మఱి కాననివారికిఁ ద్రోవఁ జూపఁగాఁ
జ న్న తెఱంగు మూఢునకు సన్మతిఁ దా గురుఁడౌట సూర్యుఁడే
క న్నులుగాఁగ భూతములఁ గాంచుచు నుండు రమేశ! మాకు ను
ద్య న్నయమూర్తివై గురువవై యల సద్గతిజాడఁ జూపవే.
(తెభా-8-726-క.)[మార్చు]
ఇం గలముతోడి సంగతి
బం గారము వన్నె గలుగు భంగిని ద్వత్సే
వాం గీకృతుల యఘంబులు
భం గంబులఁ బొందు ముక్తి ప్రాపించు హరీ!
(తెభా-8-727-క.)[మార్చు]
హృ దయేశ! నీ ప్రసన్నత
ప దివేలవపాలి లేశభాగము కతనం
ద్రి దశేంద్రత్వము గలదఁట;
తు ది నిను మెప్పింప నేది దొరకదు శ్రీశా!
(తెభా-8-728-క.)[మార్చు]
పె ఱవాఁడు గురు డటంచును
గొ ఱగాని పదంబు చూపఁ గుజనుండగు నీ
నె ఱ త్రోవ నడవ నేర్చిన
న ఱమఱ లేనట్టిపదమునందు దయాబ్ధీ!
(తెభా-8-729-మ.)[మార్చు]
చె లివై చుట్టమవై మనస్థ్సితుఁడవై చిన్మూర్తివై యాత్మవై
వ లనై కోర్కులపంటవై విభుఁడవై వర్తిల్లు నిన్నొల్లకే
ప లువెంటంబడి లోక మక్కట; వృథా బద్దాశమై పోయెడిన్
ని లువన్ నేర్చునె హేమరాశిఁ గనియున్ నిర్భాగ్యుఁ డంభశ్శయా!
(తెభా-8-730-ఆ.)[మార్చు]
నీరరాశిలోన నిజకర్మ బద్దమై
యుచితనిద్రఁ బొంది యున్న లోక
మే మహాత్ముచేత నెప్పటి మేల్కాంచు
నట్టి నీవు గురుఁడ వగుట మాకు.
(తెభా-8-731-క.)[మార్చు]
ఆ లింపుము విన్నప మిదె
వే లుపు గమిఱేని నిన్ను వేఁడికొనియెదన్
నా లోని చిక్కు మానిచి
నీ లోనికిఁ గొంచుఁ బొమ్ము నిఖిలాధీశా!
(తెభా-8-732-వ.)[మార్చు]
అని యిట్లు సత్యవ్రతుండు పలికిన సంతసించి మత్స్యరూపంబున మహాసముద్రంబున విహరించు హరి పురాణపురుషుం డగుటం జేసి సాంఖ్యయోగక్రియాసహితయగు పురాణసంహిత నుపదేశించె; నమ్మహారాజు ముని సమేతుండై భగవన్నిగదితంబై సనాతనంబగు బ్రహ్మస్వరూపంబు విని కృతార్థుం డయ్యె; నతం డిమ్మహాకల్పంబున వివస్వతుం డనం బరఁగిన సూర్యునకు శ్రాద్ధదేవుండన జన్మించి శ్రీహరి కృపావశంబున నేడవ మనువయ్యె; అంత నవ్విధంబున బెనురేయి నిండునంతకు సంచరించి జలచరాకారుండగు నారాయణుండు తన్నిశాంత సమయంబున.
(తెభా-8-733-మ.)[మార్చు]
ఉ ఱ కంబోనిధి రోసి వేదముల కుయ్యున్ దైన్యముం జూచి వేఁ
గ ఱు లల్లార్చి ముఖంబు సాఁచి బలువీఁకందోఁక సారించి మే
న్మె ఱయన్ దౌడలు దీటి మీస లదరన్ మీనాకృతిన్ విష్ణుఁ డ
క్క ఱిటిం దాఁకి వధించె ముష్టిదళితగ్రావున్ హయగ్రీవునిన్.
: : 21-05-2016: : గణనాధ్యాయి 11:17, 23 సెప్టెంబరు 2016 (UTC)