పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/ప్రళ యావసాన వర్ణన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రళయావసానవర్ణన

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-734-వ.)[మార్చు]

అంతం బ్రళయావసాన సమయంబున.

(తెభా-8-735-సీ.)[మార్చు]

ప్పుడు వేగు నం చెదురు చూచుచునుండు;
మునుల డెందంబులం ముదము నొందఁ,
దెలివితోఁ బ్రక్క నిద్రించు భారతి లేచి;
యోరపయ్యెదఁ జక్క నొత్తి కొనఁగ,
లినమై పెనురేయి మ్రక్కిన తేజంబుఁ;
దొంటి చందంబునఁ దొంగలింపఁ,
బ్రాణుల సంచితభాగధేయంబులుఁ;
న్నుల కొలకులఁ గానఁబడఁగ,

(తెభా-8-735.1-తే.)[మార్చు]

వయవంబులుఁ గదలించి, యావులించి
నిదురఁ దెప్పఱి, మేల్కాంచి, నీల్గి, మలఁగి,
యొడలు విఱుచుచుఁ గనుఁగవ లుసుముకొనుచు.
'ధాత గూర్చుండె సృష్టి సంధాత యగుచు.

(తెభా-8-736-వ.)[మార్చు]

అయ్యవసరంబున.

(తెభా-8-737-ఆ.)[మార్చు]

వాసవారిఁ జంపి వాని చేఁ బడియున్న
వేదకోటి చిక్కు విచ్చి తెచ్చి
నిదుర మాని యున్న నీరజాసనునకు
నిచ్చెఁ గరుణతోడ నీశ్వరుండు.

(తెభా-8-738-క.)[మార్చు]

రుహనాభుని కొఱకై
తర్పణ మాచరించి త్యవ్రతుఁ డా
ధి బ్రతికి మను వయ్యెను;
జాక్షునిఁ గొలువ కెందు సంపదఁ గలదే?
 : : 21-05-2016: : గణనాధ్యాయి 11:19, 23 సెప్టెంబరు 2016 (UTC)