పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/మీనావతారుని ఆనతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మీనావతారుని ఆనతి

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-705-వ.)[మార్చు]

అని పలుకు సత్యవ్రత మహారాజునకు నయ్యుగంబు కడపటఁ బ్రళయ వేళ సముద్రంబున నేకాంతజన ప్రీతుండయి విహరింప నిచ్ఛించి మీన రూపధరుండైన హరి యిట్లనియె.

(తెభా-8-706-సీ.)[మార్చు]

టమీఁద నీ రాత్రికేడవదినమునఁ;
ద్మగర్భున కొక్క గలు నిండు;
భూర్భువాదిక జగంబులు మూఁడు విలయాబ్ధి;
లోన మునుంగు; నాలోనఁ బెద్ద
నావ చేరఁగ వచ్చు; నా పంపు పెంపున;
దానిపై నోషధితులు బీజ
రాసులు నిడి పయోరాశిలో విహరింపఁ;
లవు సప్తర్షులుఁ లసి తిరుఁగ

(తెభా-8-706.1-ఆ.)[మార్చు]

మ్రోలఁ గాన రాక ముంచు పెంజీఁకటి
మిడుకుచుండు మునుల మేనివెలుఁగుఁ
దొలకుచుండు జలధి దోధూయమాన మై
నావ దేలుచుండు రవరేణ్య!

(తెభా-8-707-వ.)[మార్చు]

మఱియు న న్నావ మున్నీటి కరళ్ళకు లోనుఁ గాకుండ, నిరుఁ గెలం కుల వెనుక ముందట నేమఱకుండఁ, బెన్నెఱుఁలగు నా గఱులన్ జడి యుచుఁ బొడువ వచ్చిన బలుగ్రాహంబుల నొడియుచు సంచరించెద; ఒక్క పెనుఁబాము చేరువ నా యనుమతిం బొడచూపెడు దానంజేసి సుడిగాడ్పుల కతంబున నావ వడిం దిరుగంబడకుండ నా కొమ్ము తుదిం పదిలము చేసి నీకునుఁ దపసులకును నలజడి చెందకుండ మున్నీట ని ప్పాటం దమ్మిచూలి రేయి వేగునంతకు మెలంగెద; నది కారణంబుగా జలచర రూపంబుఁ గయికొంటి; మఱియు నొక ప్రయోజనంబుఁ గలదు; నా మహిమ పరబ్రహ్మం బని తెలియుము; నిన్ను ననుగ్రహించితి" నని సత్యవ్రతుండు చూడ హరి తిరోహితుం డయ్యె; అయ్యవసరంబున.

(తెభా-8-708-ఆ.)[మార్చు]

త్స్యరూపి యైన మాధవు నుడుగులుఁ
లఁచికొనుచు రాచపసి యొక్క
ర్భశయ్యఁ దూర్పుఁ లగడగాఁ బండి
కాచి యుండె నాఁటి కాలమునకు.

(తెభా-8-709-వ.)[మార్చు]

అంతఁ గల్పాంతంబు డాసిన

(తెభా-8-710-క.)[మార్చు]

ల్లసిత మేఘ పంక్తులు
ల్లించి మహోగ్రవృష్టి డిగొని కురియన్
వె ల్లి విరిసి జలరాసులు
చె ల్లెలి కట్టలను దాఁటి సీమల ముంచెన్.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 11:12, 23 సెప్టెంబరు 2016 (UTC)