పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/కల్పవృక్షావిర్భావము
స్వరూపం
కల్పవృక్షావిర్భావము
←ఐరావతావిర్భావము | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
అప్సరావిర్భావము → |
తెభా-8-261-ఆ.
ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై
యింద్రువిరులతోఁట కేపు దెచ్చి
కోరి వచ్చు వారి కోర్కుల నీనెడు
వేల్పు మ్రాను పాలవెల్లిఁ బుట్టె.
టీక:- ఎల్ల = అన్ని; ఋతువుల్ = కాలముల; అందున్ = లోను; ఎలరారి = అతిశయించి; పరువము = పంట కొచ్చినది; ఐ = అయ్యి; ఇంద్రున్ = ఇంద్రునియొక్క; విరుల = పూల; తోట = తోట; కిన్ = కి; ఏపు = అధిక్యమును; తెచ్చి = కూర్చి; కోరి = ఆశ్రయించి; వచ్చు = వచ్చెడి; వారి = వారియొక్క; కోర్కులన్ = కోరికలను; ఈనెడు = తీర్చెడిది యగు; వ్రేల్పుమ్రాను = కల్పతరువు; పాలవెల్లిన్ = పాలసముద్రమునందు; పుట్టె = పుట్టెను.
భావము:- ఆలా కడలిని చిలకడం కొనసాగుతుండగా, అందులోనుండి కల్పవృక్షం పుట్టింది. ఆ కల్పవృక్షం సకల ఋతువులలోనూ రాలిపోని పూలతో విరబూసి, ఇంద్రుని వనానికి ఇంపు కూర్చుతూ ఉంటుంది. ఆశ్రయించిన వారి కోరికలను తీర్చుతుంది.