పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/అప్సరావిర్భావము
Jump to navigation
Jump to search
అప్సరావిర్భావము
←ఐరావతావిర్భావము | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
లక్ష్మీదేవి పుట్టుట→ |
(తెభా-8-262-వ.)[మార్చు]
మఱియునుం గొండకవ్వంబునం గడలి మథింప నప్సరోజనంబు జనించె నంత.
(తెభా-8-263-క.)[మార్చు]
క్రొ క్కారు మెఱుఁగు మేనులు
గ్రి క్కిరిసిన చన్నుఁగవలుఁ గ్రిస్సిన నడుముల్
పి క్కటిలి యున్న తుఱుములుఁ
జ క్కని చూపులును దివిజసతులకు నొప్పెన్.
(తెభా-8-264-వ.)[మార్చు]
వెండియు నా రత్నాకరంబు నందు సుధాకరుం డుద్భవించి; విరించి యనుమతంబునఁ దన యథాస్థానంబునం బ్రవర్తించుచుండె; నంత.
: : 21-05-2016: : గణనాధ్యాయి 13:36, 19 సెప్టెంబరు 2016 (UTC)