పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/కరి మకరుల యుద్ధము
కరిమకరులయుద్ధము
←గజేంద్రుని కొలను ప్రవేశము | తెలుగు భాగవతము (మూస:కరిమకరులయుద్ధము) రచయిత: పోతన |
గజేంద్రుని దీనాలాపములు→ |
(తెభా-8-51-సీ.)[మార్చు]
భుగభుగాయితభూరి బుద్భుదచ్ఛటలతోఁ;
గదలుచు దివికి భంగంబు లెగయ;
భువన భయంకరఫూత్కార రవమున;
ఘోరనక్రగ్రాహకోటి బెగడ;
వాలవిక్షేప దుర్వార ఝంఝానిల;
వశమున ఘమఘమావర్త మడరఁ;
గల్లోలజాల సంఘట్టనంబులఁ దటీ;
తరులమూలంబులై ధరణిఁ గూల;
(తెభా-8-51.1-తే.)[మార్చు]
సరసిలోనుండి పొడగని సంభ్రమించి
యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భానుఁ గబళించి పట్టు స్వర్భానుపగిది
నొక్క మకరేంద్రుఁ డిభరాజు నొడిసిపట్టె.
(తెభా-8-52-క.)[మార్చు]
వ డిఁ దప్పించి కరీంద్రుఁడు
ని డుదకరం బెత్తి వ్రేయ నీరాటంబుం
బొ డ వడఁగినట్లు జలములఁ
బ డి కడువడిఁ బట్టెఁ బూర్వపదయుగళంబున్.
(తెభా-8-53-చ.)[మార్చు]
ప దములఁ బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్
మ దగజవల్లభుండు ధృతిమంతుఁడు దంతయుగాంత ఘట్టనం
జె దరఁగఁ జిమ్మె న మ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్
వ దలి జలగ్రహంబు కరివాలముమూలముఁ జీరెఁ గోఱలన్.
(తెభా-8-54-క.)[మార్చు]
క రిఁ దిగుచు మకరి సరసికిఁ
గ రి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్
గ రికి మకరి మకరికిఁ గరి
భ ర మనుచును నతల కుతల భటు లరుదు పడన్.
(తెభా-8-55-వ.)[మార్చు]
ఇట్లు కరిమకరంబులు రెండును నొండొండ సముద్దండదండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై; యన్యోన్య విజయశ్రీ వశీకరంబులై; సంక్షోభిత కమలాకరంబులై; హరి హరియును; గిరి గిరియునుం దాఁకి పిఱుతివియక పెనంగు తెఱంగున నీరాటం బయిన పోరాటంబునం బట్టుచు వెలికి లోనికిం దిగుచుచుఁ గొలంకు గలంకంబొందఁ గడువడి నిట్టట్టుఁ బడి తడఁబడక బుడబుడానుకారంబులై బుగులు బుగు ల్లను చప్పుళ్ళతో నురువులుఁ గట్టుచు జలంబు లుప్పరం బెగయం జప్పరించుచుఁ దప్పక వదనగహ్వరంబుల నప్పళించుచు నిశితనితాంత దురంతదంత కుంతంబుల నింతింతలు తునియ లయి నెప్పళంబునం బునుక చిప్పలుఁ గుదుళ్ళుఁ దప్పి రక్తంబులుఁ గ్రమ్ముదేర హుమ్మని యొక్కుమ్మడిం జిమ్ముచు నితరేతర సమాకర్షణంబులం గదలక పదంబుల మొదలిపట్టు వదలక కుదురై వర్తించుచు బరిభ్రమణ వేగంబున జలంబులం దిరుగుచు మకర కమఠ కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా నొండొంటిం దాఁకు రభసంబున నిక్కలుbడ మ్రక్కం ద్రొక్కుచు మెండుచెడి బెండుపడి నాఁచు గుల్లచిప్ప తండంబులఁ బరస్పర తాడనంబులకు నడ్డంబుగా నొడ్డుచు నోలమాసగొనక గెలుపు దలంపులు బెట్టిదంబులై రెట్టింప నహోరాత్రంబులుం బోలెఁ గ్రమక్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులయి నిర్గత నిద్రాహారంబులై యవక్రపరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబున.
(తెభా-8-56-క.)[మార్చు]
జ వమును జలమును బలమును
వి విధములుగఁ బోరు కరటివీరతకు భువిన్
ది వి మకర మీన కర్కట
ని వహము లొక్కటన మిత్రనిలయముఁ బొందెన్.
(తెభా-8-57-శా.)[మార్చు]
ఆ టోపంబునఁ జిమ్ము ఱొమ్మగల వజ్రాభీల దంతంబులం
దా టించున్ మెడఁ జుట్టిపట్టి హరి దోర్దండాభ శుండాహతిన్
నీ టన్ మాటికి మాటికిం దిగువఁగా నీరాటమున్ నీటి పో
రా ట న్నోటమిపాటుఁ జూపుట కరణ్యాటంబు వాచాటమై.
(తెభా-8-58-వ.)[మార్చు]
అప్పుడు.
(తెభా-8-59-ఆ.)[మార్చు]
మకరితోడఁ బోరు మాతంగవిభుని నొ
క్కరుని డించి పోవఁ గాళ్ళు రాక
గోరి చూచు చుండెఁ గుంజరీయూథంబు
మగలు దగులుఁ గారె మగువలకును.
(తెభా-8-60-వ.)[మార్చు]
అంత.
(తెభా-8-61-ఆ.)[మార్చు]
జీవనంబు దనకు జీవనంబై యుంట
నలవుఁ జలము నంతకంత కెక్కి
మకర మొప్పెఁ డస్సె మత్తేభమల్లంబు
బహుళపక్ష శీతభాను పగిది.
(తెభా-8-62-మ.)[మార్చు]
ఉ ఱుకుం గుంభయుగంబుపై హరి క్రియన్ హుమ్మంచుఁ; బాదంబులం
నె ఱయం గంఠము వెన్నుదన్ను; నెగయున్ హేలాగతిన్; వాలముం
జ ఱచుం; నుగ్గుగఁ దాఁకు; ముంచు; మునుగుం; శల్యంబులుం దంతముల్
వి ఱుఁగన్ వ్రేయుచుఁ బొంచిపొంచి కదియున్ వేదండ యూథోత్తమున్.
(తెభా-8-63-మ.)[మార్చు]
పొ డగానం బడకుండ డాఁగు వెలికిం బోవంగ దా నడ్డమై
పొ డచూపుం జరణంబులం బెనగొనున్ పో రాక రా రాక బె
గ్గ డిలం గూలఁగఁదాఁచు లేచుతఱి నుద్ఘాటించు లంఘించుఁ బ
ల్వి డిఁ జీరుం దలఁగున్ మలంగు నొడియన్ వేధించుఁ గ్రోధించుచున్.
(తెభా-8-64-వ.)[మార్చు]
ఇట్లు విస్మిత నక్రచక్రంబయి నిర్వక్రవిక్రమంబున నల్పహృదయజ్ఞాన దీపంబు నతిక్రమించు మహా మాయాంధకారంబునుంబోలె నంతకంతకు నుత్సాహ కలహసన్నాహ బహువిధ జలావగాహం బయిన గ్రాహంబు మహాసాహసంబున.
(తెభా-8-65-శా.)[మార్చు]
పా దద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియో
న్మా దంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి ని
ష్ఖే దబ్రహ్మపదావలంబనరతిం గ్రీడించు యోగీంద్రు మ
ర్యా దన్ నక్రము విక్రమించెఁ గరిపాదాక్రాంతనిర్వక్రమై.
(తెభా-8-66-ఆ.)[మార్చు]
వనగజంబు నెగచు వనచారిఁ బొడగని
వనగజంబ కాన వజ్రిగజము
వెల్ల నై సురేంద్రు వేచి సుధాంధులు
పట్టఁ బట్టనీక బయలు ప్రాఁకె.
(తెభా-8-67-ఉ.)[మార్చు]
ఊ హ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా
మో హలతా నిబద్ధపదమున్ విడిపించుకొనంగ లేక సం
దే హముఁ బొందు దేహి క్రియ దీనదశన్ గజ ముండె భీషణ
గ్రా హ దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్ర శల్యమై.
(తెభా-8-68-వ.)[మార్చు]
ఇ వ్విధంబున.
(తెభా-8-69-క.)[మార్చు]
అ లయక సొలయక వేసట
నొ లయకఁ గరి మకరితోడ నుద్దండత రా
త్రు లు సంధ్యలు దివసంబులు
స లిపెం బో రొక్క వేయి సంవత్సరముల్.
21-05-2016: :
గణనాధ్యాయి 17:09, 16 సెప్టెంబరు 2016 (UTC)