పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/ఉత్తమమనువు చరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

3ఉత్తమమనువు చరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-16-సీ.)[మార్చు]

నువు మూఁడవవాఁడు నుజేంద్ర! యుత్తముం;
నఁ బ్రియవ్రతునకు నాత్మజుండు
పాలించె నిల యెల్లఁ వన సృంజయ యజ్ఞ;
హోత్రాదు లాతని పుత్రు లధిక
గుణులు; వసిష్ఠుని కొడుకులు ప్రమథాదు;
లైరి సప్తర్షులు; మరవిభుఁడు
త్యజిత్తనువాఁడు; త్యభద్రాద్యులు;
సురలు; ధర్మునికిని సూనృతకును

(తెభా-8-16.1-ఆ.)[మార్చు]

బుట్టి సత్యనియతిఁ బురుషోత్తముఁడు సత్య
సేనుఁ డనఁగ దుష్టశీలయుతుల
నుజ యక్షపతుల దండించె సత్యజి
న్మిత్రుఁ డగుచు జగము మే లనంగ.

21-05-2016: :
గణనాధ్యాయి 16:39, 16 సెప్టెంబరు 2016 (UTC)