చంపూరామాయణము/విషయసూచిక
విషయసూచిక
1 |
1 |
12 |
49 |
79 |
118 |
144 |
- శ్రీరాముడు పంచవటిని వసించుట
- శ్రీరాముని కడకు శూర్పణఖ వచ్చుట
- కిష్కిందాకాండము
- వర్షాకాలవర్ణనము
- లక్ష్మణుడు కిష్కిందకు బోవుట
- సుగ్రీవుడు సీతను వెతుకుటకు వానరులకు పంపుట
- హనుమదాదుల ప్రాయోపవేశప్రయత్నము
- జాంబవంతుడు హనుమంతుని సముద్రలంఘనమునకు బ్రోత్సహించుట
- సుందరకాండము
- హనుమంతుడు సముద్రమును దాటుట
- హనుమంతుడు సీతాన్వేషనమునకై చింతించుట
- రాత్రివర్ణనము
- హనుమంతు డశోకవనముం జొచ్చుట
- సీతాదేవి రావణునకు హితవు జెప్పుట
- హనుమంతుడు సీతాదేవితో సంభాషించుట
- హనుమంతునితో సీత ప్రత్యభిజ్ఞానంబు దెల్పుట
- హనుమంతు డశోకవనభంగమొనర్చుట
- హనుమంతుడు రావణునితో ప్రసంగించుట
- లంకాపురదహనము
- మధువనభంగము
- యుద్ధకాండము
- కపిసేనలు మలయపర్వతమున విడియుట
- రావణునకు విభీషణుడు హితము చెప్పుట
- విభీషణుడు రాముని శరణు జొచ్చుట
- శ్రీరాముడు సముద్రునిపై గోపించుట
- విద్యుజ్జిహ్వుని మాయకు సీత విలపించుట
- అంగదుని రాయబారము
- ఇంద్రజిద్యుద్ధము
- కుంభకర్ణయుద్ధము
- ఇంద్రజిత్తుని రెండవ యుద్ధము
- రామరావణయుద్ధము
- రావణుమరణమునకు విభీషణాదులు దుఃఖించుట
- సీత యగ్నిప్రవేశము
- భరతాదులు రామునెదుర్కొనుట
- శ్రీరామపట్టాభిషేకము
శ్రీరస్తు
చంపూరామాయణ పీఠిక
కవికాలనిర్ణయము
ఈకృతి యొనర్చినకవి కవిరాజకంఠీరవబిరుదాంకితుఁడును వాసిష్ఠగోత్రజుఁడును నగుఋగ్వేదికవి వేంకటాచలపతి. ఆశ్వాసాంతగద్యములయందు "ఋగ్వేదికవి తిరువేంగళార్యకలశరత్నాకరసుధాకరఁ"డని తన్ను వర్ణించుకొనుటచే నీతనితండ్రిపేరు తిరువేంగళార్యుఁ డైనట్లు తెలియుచున్నది. మరియు గ్రంథావతారికలో దాను "తిరువేంగళార్యకవిరాజసమాశ్రయ ధన్యచిత్తవర్తనుఁ" డనియు—
| "అత్తిరువేంగళార్యుని యుదారదయావిలసత్కటాక్షసం | |
ననియు వ్రాసికొనుటచే నీతని కవితాగురువు కూడ దిరువేంగళార్యుఁడైనట్లు కన్పట్టుచున్నది. ఈతిరువేంగళార్యు లిరువురు భిన్నపురుషులై యుందు రని తోచుచున్నది. అట్లు కానిచో గురువును వర్ణించునవసరమున నతఁడు తనతండ్రియే యని చెప్పకుండునా?
కవికాలమును నిర్ణయించుటకు దగినయాధారములు కొన్ని గ్రంథమునందే యున్నవి. వానిలో గృతిపతివంశావతారము ముఖ్యమైనది. ఈకృతిపతి యిప్పుడు కార్వేటినగరసంస్థాన మని వాడబడుచున్న దేశమున కధిపతి యైన వెల్లంటి కసవరాజు. ఆదేశమునకు దొండమండలము, తుండీరమండలము నని పూర్వనామములు. ఆంధ్రజైమినిభారతకృతిపతి యగుసాళువ నరసింగరాజు మొదలగు సాళువరాజులు పూర్వ మాదేశమును బాలించిరి. వారిపిదప మాకరాజువంశ్యులు రాజులైరి. ఈమాకరాజుకులములో జేరిన తిరుమలరాజునకే చదలువాడ మల్లయకవిప్రణీత మైన విప్రనారాయణచరిత్ర మంకిత మైనది. కొంతకాలమునకు రాజ్యము మాకరాజువంశమునుండి దౌహితృభాగముగా వెల్లంటివారికి సంక్రమించినది. ఈమా ర్పెప్పుడు జరిగినదో స్పష్టముగా దెలియదు. ప్రస్తుతగ్రంథకృతిపతి యైన కసవనృపతి యీవెల్లంటివంశమువాడే. ఇప్పుడున్న కార్వేటినగరపు జమీందారులు కూడ నీవంశమువారే. మాకరాజువారును వెల్లంటివారును గూడఁ బూర్వపుసాళువరాజులబిరుదములఁ దమబిరుదములుగాఁ జేసికొన్నారు.
కసవరాజువంశము గ్రంథములో నిట్లు వర్ణింపబడినది. కరికాళచోళుని వంశములో సింగరిరాజు పుట్టెను. సింగరిరాజునకు శ్రీరంగరాజును, శ్రీరంగరాజునకు సింగరిరాజును, సింగరిరాజునకుఁ గావేరిరాజునుఁ, గావేరిరాజునకు సింగరిరాజును, సింగరిరాజునకుఁ గావేరిరాజునుఁ, గావేరిరాజునకుఁ గసవరాజు, సింగరిరాజు, తిరువేంగళరాజు, పెరుమాళ్రాజు ననునలువురు కొడుకులును బుట్టిరి. ఈకసవరాజే కృతిపతి. కసవరాజుపిదప నేడవతరమువాఁ డగుబ్రహ్మరాజు కాలమునఁ బుట్టిన [1]పద్మావతీపరిణయ మనుసంస్కృతచంపూగ్రంథ మీవంశక్రమమును దృఢపరుచుచున్నది. ఆగ్రంథములోఁ గసవరాజునకు మాఱు కేశవరా జనియున్నది. కసవయనునది కేశవశబ్దభవము కాఁబోలును. కసవరాజు తరువాతి తరములవారు పద్మావతీపరిణయములో నీరీతిం జెప్పఁబడినారు:—
కసవరాజు పిమ్మట నతనితమ్ముఁడైన వేంకటపెరుమాళ్రాజు రాజ్యము చేసెను. అతని యనంతర మాతని యన్నకొడు కగుబ్రహ్మరాజు రాజ్యము చేసెను. బ్రహ్మరాజుకొడుకులు కావేరిరాజు వేంకటపెరుమాళ్రాజులు. వేంకటపెరుమాళ్రాజు కొడుకు బ్రహ్మరాజు; అతని కొడుకులు కుమారవేంకటపెరుమాళ్రాజు, కావేరిరాజు, తిరుమలరాజు, సుందరకృష్ణరాజును. కుమారవేంకటపెరుమళ్రాజు కొడుకులు [2]బ్రహ్మరాజు మొదలగువారు. ఈబ్రహ్మరాజే పద్మావతీపరిణయకృతిపతి. కసవరాజునకు బ్రహ్మరాజునకు నడుమ నయిదుగురు రాజ్యముచేసినట్టులు దీనివలనఁ గనఁబడుచున్నది. ఈగ్రంథములోఁ గుమారవేంకటపెరుమాళ్రాజు తారణసంవత్సరచైత్రమాసములో లోకాంతరగతుఁ డైనట్లును, నాసంవత్సరజ్యేష్ఠమాసములో బ్రహ్మరాజు పట్టాభిషిక్తుఁ డైనట్టును బ్రహ్మరాజునాజ్ఞ ననుసరించి యాగ్రంథము వికృతిసంవత్సరమునం దచ్చుపడినట్లు నున్నది. తారణసంవత్సరము 1884-వ క్రైస్తవసంవత్సరమునకును, వికృతిసంవత్సరము 1890 సంవత్సరమునకును సరిపోవును. కుమారవేంకటపెరుమాళ్రాజు సవతితమ్ముఁ డగుతిరుమలరాజున కంకితమైనట్టియు, గరుడాద్రి సుబ్రహ్మణ్యవిద్వత్కవి ప్రణీత మైనట్టియు [3]శత్రుఘ్న విజయ మీవంశక్రమమును దృఢపఱుచుచున్నది. ఈ గ్రంథము 1786 వ (రసకరిమునిశశి) శాలివాహనసంవత్సరమునకు సరియైన ప్రభవసంవత్సరమునఁ బూరింపఁబడినట్లు గ్రంథాంతమం దున్నది. ఇది క్రీ. 1864 వ సంవత్సరమునకు సరి పోవును. అప్పటికిఁ గుమారవేంకటపెరుమాళ్రాజు సజీవుఁడై యున్నట్లును, నతనికి బ్రహ్మరాజు, కుమారవిజయవీరరాఘవరాజు, కావేరిరాజు, సింగరిరాజు ననునలుపురుకొడుకు లున్నట్లును జెప్పి యింకను బలువురు తనయులు కలుగుదురుగాక యని కవి యాశీర్వదించినాఁడు. క్రీ. 1884 సంవత్సరమునఁ గాలధర్మము నొందిన కుమారవేంకటపెరుమాళ్రా జీతఁడే యగుట నిస్సంశయము. ఈకుమారవేంకటపెరుమాళ్రాజు కసవరాజున కైదవ తరమువాఁ డగుచున్నాడు. ఆచారానుసారముగాఁ దరమున కిరువదియైదుసంవత్సరముల చొప్పున లెక్కించినచోఁ గసవరాజు క్రీ. 1714 సంవత్సరప్రాంతమువాఁ డగుచున్నాఁడు. స్టూలదృష్టిచే, క్రీ. 1700 సంవత్సరప్రాంతమువాఁ డనుకొందము.
వేఱొకలెక్కనుబట్టి చూచినను నించుమించుగా నీకాలమే ధ్రువపడుచున్నది. ఎట్లన :—
కవిగురువైన తిరువేంగళార్యుఁడు సాళ్వతిమ్మనృపాలుఁడు, వీరవేంకటరాయశౌరి, వెలుగోటి వేంకటవిభుఁడు, చెంజి వరదేంద్రుఁడు ననుప్రభువులచే గౌరవింపఁబడినట్లు గ్రంథములో నున్నది. (ఆ. 1 ప. 31.) సాళ్వతిమ్మనృపాలుఁ డెవ్వఁడో తెలియదు. ఆకాలమం దాపేరుగల సుప్రసిద్దరాజు గానరాఁడు. సామాన్యుఁ డైనజమీందారుఁడై యుండనోపును. చెంజి వరదేంద్రుని కాలము స్పష్టముగాఁ దెలియుచున్నది. దీనినిబట్టి యితరుల కాలము నిర్ణయింపవలసి యున్నది. చెంజి యనునది దక్షిణార్కాటు మండలములో సుప్రసిద్ధ మైనస్థలము. ఆంగ్లేయ భాషను దీనిని "జింజి" యందురు. కర్ణాటరాజ్యకాలమం దీచెంజిదేశమును గొందఱునాయఁకులు పాలించుచుండెడివారు. ఆనాయఁకులలో నొక్కఁడగు "చెంజి వరదప్పనాయనయ్యవారు తీర్థాచరణ వచ్చి శేతుదర్శనం శేశి స్వస్తిశ్రీశాలివాహనశకవర్షంబులు 1593 కల్యబ్దాః 4772 అస్మిన్ వర్తమానె వైశాఖబహుళసప్తమి స్తిరవారం యీపుణ్యక్షేత్ర మైన..........మరప్రదేశం ఆకార్తికశుద్ధపౌర్ణమినాడు కొమారస్వామికి బంగారు అందలమున్ను సమర్పణ శేశి తమఆరతిను యేర్పాటు శేయించినారు” అని మధురకు సమీపమందున్న సుప్రసిద్ధకుమారక్షేత్రమగు తిరుప్పరంగుండ్ర మను