చంపూరామాయణము/ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
చంపూరామాయణము
ప్రథమాశ్వాసము
ఇష్టదేవతాప్రార్థనాదికము
శా. | శ్రీవత్సాంకము చాయకైవడి మిటారింప న్మనోవారిజా | 1 |
ఉ. | గుబ్బలికన్యలోచనచకోరయుగంబునకు న్మృగాంకుఁడై | 2 |
ఉ. | నీ వనురాగలీల హవళించుప్రవాళము కేలివీణె కో | 3 |
సీ. | ప్రభవిల్లుఁ బద్మసౌభాగ్య మేవిరిఁబోఁడి యభిముఖస్పూర్తిఁ జెన్నొందినపుడ | |
గీ. | యాజగన్మాత మకరాకరాత్మజాత, శంఖనందనకచ్ఛపోజ్జ్వలపదాగ్ర | 4 |
ఉ. | ఫాణితమాధురిం దెగడుపల్కులయందము నభ్యసింపఁగాఁ | 5 |
చ. | నెమలికి నాట దిద్దువగ నెయ్యపుఁజిల్కకు గౌళమాధురిం | 6 |
చ. | అలఘుతమాగమాంతసముదంచితమౌ చిగురాకు విఘ్నమం | 7 |
ఉ. | ఇం బడరంగ సద్గతిసమృద్ధినిదానము ధర్మ మేని ధ | 8 |
శా. | ఆరాధింతు నిరంతరంబు నతులధ్యానప్రసూనంబుచే | 9 |
క. | శుకభీష్మవిభీషణశౌ, నకశాక్త్యనరాంబరీషనారదుల వసి | 10 |
సీ. | కౌఠారధార యేఘనునిబాహాదండ మక్షరాక్షసమహావృక్షమునకు | |
గీ. | కతని శ్రీరామభద్రముద్రాంగుళీయ, దానసంతోషితావనీతనయు సనయు | 11 |
సీ. | మహికర్ణపుటశుక్తిమౌక్తికాకృతిధన్యు, యామునద్వీపాబ్జహేమగర్భుఁ | |
గీ. | నాంధ్రభాషారచితభారతాదికావ్య, భాగవతముఖ్యవిఖ్యాతబహువిధప్ర | 12 |
మ. | నిరతంబుం బలుకున్మిటారికి చొకానిద్దంపుటద్దంబులై | 13 |
మ. | నెల రెణ్ణెల్లకు నొండు రెండుపదము ల్నిద్రాదరిద్రాణతా | 14 |
ఉ. | ధారణి గద్యసూక్తిమిళితంబగు పద్యము హృద్యవాద్యరే | 15 |
అవతారిక
వ. | అని యిష్టదేవతాగురునమస్కారంబును మహాకవిపురస్కారంబును గుకవితిరస్కారంబును సనమస్కారంబుగా నొనర్చి సుధారసమధురదశరథాత్మజకథాసంవిదానబంధురంబగు మహాప్రబంధంబు సందర్భింపం బూని యున్న సమయంబున. | 16 |
సీ. | సత్యభాషాహరిశ్చంద్రుండు సాహసోన్నతుఁడు శ్రీహరికరుణాకటాక్ష | |
గీ. | మద్విజాశీల్వచోవర్ధమాన సకల, భోగభాగ్యాయురారోగ్యయోగశాలి | 17 |
గీ. | సరసమై తగునట్టి ప్రసన్నవేంక, టేశ్వరస్వామిపద్యము లిపుడు మాకు | 18 |
శా. | వేర్వేఱన్ శివుఁ డంచు విష్ణు వనుచు న్వెల్లంటికావేరిరా | 19 |
శా. | దుర్వాసఃప్రముఖుల్ మునీశ్వరులు నెంతోభక్తితో నెమ్మది | 20 |
శా. | చర్వాద్యాహుతు లాదిగాఁ దగినయజ్ఞంబందు ఋగ్యాజుషా | 21 |
క. | వారిదగంభీరోక్తుల, నీరీతిఁ బ్రసన్నవేంకటేశ్వరునుతియున్ | 22 |
చ. | పగడపుఁగంబముల్ గరుడపచ్చలబోదెలు తమ్మికెంపుఱా | 23 |
సీ. | అలమేలుమంగాంతరంగసారసభృంగలలితుఁడై వేంకటాచలవిభుండు | |
గీ. | జారుచామీకరాధిక్యచాకచక్య, భూరిమాణిక్యధగధగస్ఫురణభరణ | 24 |
ఉ. | అందపునర్తనం బభినయంబును మద్దెలసద్దు గీతగో | 25 |
సీ. | శబ్దతర్కాదిశాస్త్రప్రసంగములఁ బే రెక్కిన విద్యాంసు లొక్కవంకఁ | |
గీ. | నుచితమతిమంతు లగుమంత్రు లొక్కవంక | 26 |
ఉ. | వందిధురీణుల న్మధురవాణులఁ గన్లొని వేంకటాచలా | 27 |
బిరుదుగద్యము. | జయజయారంభజృంభమాణ గంభీరభేరీనినాదమేదురామోద | |
| కులరేవంత! గజపతిసప్తాంగహరణబిరుదభాస్వంత! శచీకాంతదిశాక్పశోదరీము | 28 |
వ. | అని యనితరసాధారణానవద్యపదహృద్యనిజబిరుదగద్యపఠనపరిశీలిత పారీషద్యశ్రవణానందు లగువందిజనులకు నభీష్టవస్తువు లొసంగి యంత. | 29 |
చ. | నను హరిణాంకమౌళికరుణాసముపాత్తరసప్రసాదవ | |
| ర్ధను దిరువేంగళార్యకవిరాజసమాశ్రయధన్యచి త్తవ | 30 |
సీ. | చక్రవాళాంకప్రశస్తివిస్ఫురణంబు సాళ్వతిమ్మనృపాలుసమ్ముఖమునఁ | |
గీ. | మంతు కెక్కంగ నేమతిమంతుఁ డమరు, నతఁడు సామాన్యుఁడే సమస్తావనీమ | 31 |
ఉ. | అత్తిరువేంగళార్యునియుదారదయావిలసత్కటాక్షసం | 32 |
సీ. | సందర్భములు లేవె జనసన్నుతానన్యపదసహిష్ణుతకుఁ జొప్పడవు గాక | |
గీ. | సమధికాచారభూసురోత్తములు లేరె, జగతి నీరీతి గౌరీశచరణభజన | 33 |
చ. | తరణిసమప్రతాపనిధి దామరయక్కనృపాలుసన్నిధిన్ | 34 |
ఉ. | అంబుజసంభవోపమసమగ్రమనీష! నిరస్తదోషమై | 35 |
వ. | అని సబహుమానంబుగా నుదారఘనసారతాంబూలజాంబూనదాంబరాభరణాదు లొసంగినం గైకొని యత్యంతసంతోషతరంగితాంతరంగుండనై కృతిముఖంబున కలంకారంబుగాఁ గృతిపతివంశావతారం బభివర్ణించెద. | 36 |
కృతిపతివంశవర్ణనము
సీ. | సౌగంధికవ్యూహసమ్మోహనాస్త్రంబు నాళీకనికరవైతాళికుండు | |
గీ. | మఖిలహరిదంతరూఢగాఢాంధకార, గంధసింధురవర్గనిర్గంధనైక | 37 |
సీ. | నిజతపోనందితాంబుజగర్భలబ్ధరంగవిమానరాజుఁ డిక్ష్వాకునృపతి | |
గీ. | విశ్వజిద్యాజి రఘుమేదినీశ్వరుండు, నాదియగురాజు లుదయించి రాదినేంద్రు | 38 |
సీ. | దశరథేశ్వరచిరంతనపుణ్య మెవ్వానిశాంబరీమానుషసంభవంబు | |
గీ. | దశముఖావరజాచంద్రతారభూరి, విభవసంధాత యెవ్వానిశుభకటాక్ష | 39 |
సీ. | చూపరియడుగుమేల్తాపసి కేదేవదేవునిపదరజస్స్థేమ మామ | |
గీ. | తాదృశానూనకరుణానిధానమాన, సాభిరాముఁడు భక్తియుక్తాంతరంగ | 40 |
సీ. | కొలిచిన వారికిఁ గెలనితంగెటిజున్ను నలసినవారికి నిలువనీడ | |
గీ. | రాజమాత్రుండె హైమధరాధరాధి, రాజకన్యాంతరంగసారంగవికస | 41 |
క. | శరణాగతులకు నెల్లను, వరదుం డగురామభద్రువంశమునందుం | 42 |
మ. | హరిదశ్వప్రతిమప్రతాపవిమతాహంకారహుంకారి యౌ | 43 |
మ. | చరణాంభోరుహబంభరాయితరిపుక్ష్మాపాలుఁ డౌధారణీ | 44 |
క. | గీరంగనాముఖాబ్జుఁడు, శ్రీరంగనృపాలసుతుఁడు సింగరిగా జా | 45 |
క. | సనయులు సింగరిభూభృ, త్తనయులు కావేరిరాజదాసరిరాజుల్ | 46 |
శా. | శ్రీవెల్లంటికులాబ్ధికౌస్తుభమణిక్షేమంకరాకారుఁ డౌ | 47 |
క. | ఆలలితయశోవైభవ, శాలులలో నగ్రజుండు చంద్రముఖీపాం | 48 |
శా. | ఆరూఢన్మయవారణాధిపతీసప్తాంగాపహారక్రియా | 49 |
సీ. | కలలోన నైన నవ్వుల కైన ననృతంబు వచియింప వెఱచు నెవ్వానిజహ్వ | |
| శర ణన్న నపరాధశత మరాతికి నైన మన్నించు నేమహామహునిమనసు | |
గీ. | యతఁడు పొగడొందు నీతిమార్గానుసారి, విబుధభరణాధికారి సేవితమురారి | 50 |
క. | అంకెపలివంశజలధిమృ, గాంకకళం గోనమాంబ నంబుజపాణిన్ | 51 |
శా. | కాకుత్స్థోసమసత్యవాక్యనిధి యాకావేరిరాజంచిత | 52 |
క. | అం దగ్రజుండు కవిబుధ, మందారుఁడు కసవరాజు మంతున కెక్కెం | 53 |
సీ. | చండాభియాతివేదండతండమదంబు ఖండించుమృగరాజు కసవరాజు | |
గీ. | ధైర్యమున కద్రిరాజు విద్యలకు భోజ, రాజు వెల్లంటికావేరిరాజగర్భ | 54 |
ఉ. | నీతివనీకుఠారులు వినీతివిదూరులు శాల్మలీక్షమా | 55 |
ఉ. | వైరివిఫాలుఁ డైనకసవక్షితిపాలుఁడు వార్థిమేఖలా | 56 |
క. | శ్రీమంతుఁడు చరణానత, సామంతుఁడు కసవరాజు సాటి యగుం దే | 57 |
క. | ఆరాజుకూర్మితమ్ముఁడు, రేరాజు కళావిలాసరేఖం గలిమిన్ | 58 |
ఉ. | ఖ్యాతమృగవ్యకౌతుకవిహారుఁడు సింగరిరాజు సంభ్రమా | 59 |
క. | ఘనుఁ డాసింగరి భూపతి, కనుజుఁడు తిరువేంగళేంద్రుఁ డసమానయశో | 60 |
మ. | సభలన్ వాసవదారకైశికచకాశన్నూత్నమందారసౌ | 61 |
చ. | భటకవిగాయకార్థిజనబాంధవకైరవపర్వశర్వరీ | 62 |
చ. | సురవరదంతిదంతములచొప్పున ధాతముఖంబులుం బలెన్ | 63 |
క. | ఆనలుగురురాజులలో, భానునిభుఁడు కసవరాజు భాసిలె నెంతే | 64 |
క. | ధృతిఁ గసవశౌరి విభవో, న్నతసాళువబొమ్మరాజనందినిఁ గమలా | 65 |
సీ. | తనదుపుట్టినయిల్లు తగఁ బాలువొంగినచందాన వెలయించునిందువదన | |
గీ. | కరము రాణించు సౌజన్య గరిమధన్య, పరమకల్యాణి కసవభూపాలురాణి | 66 |
క. | ఆచినకృష్ణాజిమ ల, క్ష్మీచంద్రాననవిధాన సేవింపఁ గృపా | 67 |
షష్ఠ్యంతములు
క. | ఈదృక్కళ్యాణగుణా, మోదితలోకునకు భువనమోహనకుశల | 68 |
క. | గండరబాలాంకున కు, ద్దండభుజబలనవీనతాలాంకునకున్ | 69 |
క. | రాజగ్రామణికిం బద, రాజీవప్రణతవిముఖరాజన్యగజో | 70 |
క. | ఆరామసత్రసౌరా, గారసరఃప్రముఖధర్మకర్మవినిర్మా | 71 |
క. | శ్రీలప్రాభవనిధికిం, దోళప్పాచార్యచరణతోయజసేవా | 72 |
క. | కాశ్యపగోత్రోద్భవున క, వశ్యాయమయూఖలేఖవసుధాజసుధా | 73 |
క. | మంథానాచలధృతికిన్, సంధాభృగుపతికి శౌరచరణాంబుజపు | 74 |
క. | ఆకాశీతలసేతు, ప్రాకటశరణాగతాభిరక్షణబిరుద | 75 |
వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన చంపూరామాయణం బను మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టి దనిన. | 76 |
కథాప్రారంభము
క. | అమరమునిపల్కు విని సం, భ్రమమున వాల్మీకిసుకవి మాధ్యందినకృ | 77 |
చ. | అరిగి తదీయపావనతటావని నొక్కెడఁ దుంటవింటిబల్ | 78 |
శ్లో. | మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమా: | 79 |
చ. | అని శపియించి మౌనివిభుఁ డక్కట! యొక్కెడఁ బోక తీర్థసే | 80 |
మ. | అని చింతించుచు వామలూరుతనయుం డాత్మీయపుణ్యాశ్రమం | 81 |
క. | చనుదెంచి విరించి తపో, ధనువలనిసపర్యఁ గాంచి త్రైలోక్యవ్యా | 82 |
మ. | నుడువుంజిల్కలకొల్కి సత్యజగతి న్నూల్కొన్నచందంబునం | 83 |
చ. | అని యవనిశ్రవోభవుని కానతియిచ్చి యలంఘ్యవర్ణలే | 84 |
సీ. | అలరుఁబొట్లము విచ్చినట్లు కస్తురివీణె గోసినరీతిఁ గుంకుమము రాశి | |
గీ. | బుధకవుల కింపు జనియింప మధుమయోక్తి, రత్నఖనిదర్శి బ్రహ్మర్షి రచనసలిపె | 85 |
క. | భవ్యపదశ్రావ్యముఁ ద,త్కావ్యముఁ గుశలవుల కతఁడు గఱపిన భువన | 86 |
చ. | మునివటువేషధారు లతిమోహనశీలురు వా రయోధ్యకుం | 87 |
సీ. | మాటలజవరాలిమగనికి నామభేదంబు లేకటకంబుధరణిసురులు | |
గీ. | వెలయు నది సారవాజగంధిలసమీర, వికసితారామవాటికావిహరమాణ | 88 |
ఉ. | ఆపుర మేలు మానవకులార్ణవపూర్ణశశాంకుఁ డుగ్రబా | 89 |
సీ. | తనశౌర్యశిఖ కుల్కి వినునీథి కెగబ్రాఁకుభానునంద పతంగతానుభూతి | |
గీ. | తనధృతిఁ జలించుకులధరాధరములంద, గైరికభరంబు తనసోయగంబుఁ జూచు | 90 |
శా. | సప్తద్వీపయుతావనిన్ బహుసమాసాహస్ర మి ట్లేలియున్ | 91 |
సీ. | కలిమితొయ్యలి మెలంగనిమురారియురంబు చిన్నివెన్నెల లేనిశివునిశిరము | |
గీ. | సంతతికి ద వ్వగుజనుండు సరియ కాన, నెంతధనమున్నఁ గులకాంత లెందఱున్నఁ | 92 |
మ. | భవనాలంకరణంబు సంసృతిసుధాపాథోనిధానక్షపా | 98 |
చ. | అలికము రావి క మృదులాంఘ్రులగజ్జెలు గంధరంబునం | 94 |
గీ. | కనకమయకింకిణు లొకింత గల్లురనఁగ, దాదికరపల్లవము లూఁది తప్పుటడుగు | 95 |
చ. | అనిమిషలోకనాయకుని కైనఁ జరాచరసృష్టికర్త కై | 96 |
సీ. | చిన్నినెన్నుదుటిపైఁ జిందులు ద్రొక్కు నీలము లైనయలకజాలములతోడ | |
గీ. | దనదు మ్రోల మెలంగెడుతనయు నెత్తు, కొని తొడలమీఁద నిడుకొని కురులు దువ్వి | 97 |
గీ. | అనుచు ననపత్యతాదురత్యయనిదాఘ, తాపమునఁగుందుతనదుడెందమునెమ్మి | 98 |
సీ. | నదినీటితో విభండకుతేజ మాని జింకమిటారిఁ గన్న శేఖరితశృంగుఁ | |
గీ. | ఋషి యొకఁ డొనర్చు పుత్రకామేష్టి వలన | 99 |
వ. | శాంతాకుటుంబియుం దనకు సంబంధియు నగునంబుజోదరపదాంభోజరోలం | 100 |
శా. | నారీనూతనపంచబాణ! కవితానైపుణ్యపారీణ! కా | 101 |
క. | భారతభాగవతకథా, నారాయణదేవదివ్యనామశ్రవణా | 102 |
స్రగ్విణి. | వీరచూడామణీ! విశ్రుతౌజోహృతా, శారణీ! భూరిభోగామరగ్రామణీ! | 103 |
గద్యము. | ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదసమాసాదిత సరసకవితావిలాస | |