సాక్షి మూడవ సంపుటం/సు.స. గారికి బహిరంగ లేఖ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

34. సు.స.గారికి బహిరంగ లేఖ

సు.స.గారు పానుగంటి వారిపై మండిపడి మందలిస్తూ వ్రాసిన HEREDITY వాద విశేష వివరాలను ఆయన ఖండిస్తూ తాను చెప్పిన విషయానికి మరికొంత వివరంగా, తన విశ్వాసభూమిక, విశదం చేస్తున్నారు.

జంఘాలశాస్త్రి జవాబు చెప్పాలని సు.స. గారు ఆశించినా, ఆ పని జరిగేలోగా తన శక్తిమేరకు సమాధానం చెప్పక తప్పదన్నారు. ఏది ఎలా వున్నా HEREDITY వల్ల బిడ్డలో స్థూలదేహ లక్షణాలు అన్నీ కలగవచ్చునంటేనూ, కొన్నైనా కలుగుతున్నాయంటేనూ తనూ ఒప్పకొంటానన్నారు గాని–శరీర పరిణామంలో HEREDITY పనిచేయడానికి శక్తి కలిగిందే నని ఒప్పకొంటానన్నారు గాని మనస్సు మీద దానికి పిసరంత కూడా అధికారం లేదని తన అభిప్రాయమన్నారు.

మనస్సుకి మెదడు ముఖ్యావయవం గనుక మనస్సులో పరిణామం HEREDITY వల్ల కలిగినట్టు కనిపిస్తుంది గాని అది భ్రమ అన్నారు. ఉన్మాదాలన్నీ దేహపరిణామాలే కాని, మనః పరిణామాలు కావన్నారు.

పాశ్చాత్య శాస్త్రజ్ఞలలో ప్రకృతి శాస్త్రజ్ఞానం సంపూర్ణంగా వుండే మహావిద్వాంసుల్లో నూటికి 95 మంది నిరీశ్వరవాదులు. మిగిలిన వారు అజ్ఞేయ (AGNOSTICS) వాదులు.

మన హిందూ సిద్దాంత ప్రకారం శరీరాలు మూడు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరం మంటలోనో, మట్టిలోనో కలిసిపోతుంది. లోపల జీవాత్మగల సూక్ష్మ శరీరానికే మనవారు పునర్జన్మను నిర్మించారు. ఈ సూక్ష్మశరీరంలోనే, మనిషి సంతరించుకున్న అనేక పూర్వజన్మల కర్మఫలం వుంది. కనక ఒక బిడ్డలో వ్యక్తమయ్యే గుణాగుణాలన్నీ అతగాడి సొంత సొమ్ము. అంటే, ‘మనస్సు’ అనేది బిడ్డ సొంతమే. ఆత్మ, పునర్జన్మ, విశ్వాసాలుంటే తప్ప ఈ లెక్క మతం మీద విశ్వాసం వల్లనే మనిషి మనిషి అనిపించుకొంటున్నాడు.

మ్మా!

కార్తీకమాస భారతిలో మీరు ప్రచురించిన బహిరంగలేఖను జదివితిని. జంఘాలశాస్త్రి యుపన్యాసములువిని చాలఁ గాలమైనదనియు, నాతండు శీఘ్రముగ వచ్చి నూతనసంఘము నేదైన స్థాపించి యుపన్యాసము లిచ్చుచు నాంధ్రదేశమునం దిరుగ సమంజసమైన సంచలనము, సంతోషము నెప్పడు సమకూర్చునా యని నిరీక్షించియున్నా మనియు మీరు వ్రాసి భాషాభిమానమును వెల్లడించినందులకు సంతసించితిని గాని యాతఁడే మీబహిరంగలేఖను దన ప్రథమ సాంఘికోపన్యాసమున విమర్శిం పవలయును గాని నీవు దొందరపడి దానిని విమర్శింప వలదని శాసించితి రేల? ఆతడు వచ్చుపిమ్మట నటులే జరుగవచ్చును గాని యంత వఱకు నేను వేచియుండ నేల? ఆతడు విపులముగ విమర్శించిన విమర్శించుగాక! నేను నా యల్పశక్తిననుసరించి సంగ్రహముగ విమర్శింపకుండుట తగదు. కావున నందులకు మీ యనుజ్ఞ కోరుచున్నాను.

అమ్మా! నా బహిరంగలేఖలో మీరు విమర్శించిన దొక్కటే వాక్యము. Heredity వలనఁ దల్లిదండ్రుల దేహలక్షణములు కాదాచిత్కముగ బిడ్డలయందు సంక్రమింపవచ్చును గాని మనో లక్షణము లేవియు నట్టు సంక్రమించుట కవకాశములేదని నా వాక్యమునందలి యనిప్రాయము. నేను దల్లిదండ్రుల లక్షణములు మాత్రమే యెత్తుకొంటని. అవియైనఁ గాదాచిత్కముగ సంక్రమింప వచ్చునని నే నంటిని. మరికొన్న తరములవారి దేహలక్షణ ములు గూడ బరీక్షింపవలయు నని మీరంటిరి. అది చాలక పోవునెడల నింకను బైకిఁ బోవలయునని కూడ మీరు చెప్పితిరి. దేహలక్షణ పరీక్ష కంత విశాలమైన యవకాశమును మీరు కల్పించు కొనినను, బూర్వుల దేహలక్షణములన్నియు బిడ్డకుఁ తప్పకుండ సంక్రమిం చునని మీరును జెప్పంజాకపోయితిరి. మీరిచ్చిన యుదాహరణముల బట్టి చూడఁగ నెవరివో కొన్ని దేహలక్షణము లెప్పడో యొకప్ప డేదోబిడ్డకు సంక్రమించునని స్పష్టముగ దేలుచున్నది. అట్టిచోఁ గాదాచిత్కముగ సంక్రమించునని నేనంటినని నాతో మీ కింతవాద మెందులకు? Heredity ని గూర్చి పదునాల్గు తరముల వఱకైనఁ బరీక్షించుట గూడ మీ యభిమతమైనట్టు కనబడుచున్నదే! అట్టి పరీక కవకాశ మెట్టు? తరమునకు సామాన్య ముగా ముప్పదిసంవత్సరములు చూచుకొన్నను బదునాల్గుతరములగుటకు 420 సంవత్సర ములుపట్టునే! ఈలోపల నెన్నివందలజనమో పుట్టి చచ్చియుందురు గదా! ఈవంశములోఁ బుట్టిన మగవారి కొఱకుఁ దెచ్చుకొన్న యాడు పిల్లల వంశములో వారి నందఱ లెక్కపెట్టు కొన్న యెడల మఱికొన్ని వందల జనాభా తేలుచున్నదే అధమసంఖ్యగా జూచుకొనుటచే వందల వఱకే తేలినదే కాని యనేక సంతానయుక్తులైన వారి వంశములో నీ సంఖ్య వేలవఱ కెగబ్రాకు ననుట కేమైన సందేహమా? ఈ సహస్రజన సంఘములో నెవనిదో యొకనిపోలిక యిప్పటి తరములో బుట్టినబిడ్డకు సంక్రమించును గావున Heredity సత్యమని మీరు వాదించుచున్నారా? వేలకొలది జనుల పోలికలో నెవరిదో యొకనిది బిడ్డకు సంక్రమింపకుండ నెట్టుండగలదు? మఱియొకవంశములోని వేయిజనుల దేహ లకణములు మాత్రమీ వేయిజనుల దేహలక్షణములకంటె భిన్నముగ నుండుట కవకాశ మున్నదా? ఇంతదూర పరీక్షవలన మనుష్యుల లక్షణములేకాని వంశస్టుల లక్షణములు నిర్ణయింప శక్యమగునా? అందువలన వంశములోని Heredity కి భంగము కలుగుచున్నదని మీరేల గ్రహింపలేదు? కప్ప, యిలకోడి లక్షణములు కూడ మనయందు గనిపించుచున్న పనికూడ మీరు వ్రాసినారు. ఇది సర్వప్రాణికోటి సంబంధమై సామాన్యలక్షణక్రమమై యుండవచ్చును. అంతేకాని మనకు వివాదాంశమై వంశము లోని Herediry కి సంబంధించినది మాత్రము కాదు. ఏది యెటులున్నను Heredity వలన బిడ్డలోని స్టూలదేహ లక్షణములన్నియుఁ గలుగ వచ్చుననియు, గొన్నియైన గలుగవచ్చుననియు, నా కంగీకృతమే. దేహపరిణామ మందే Herediry పనిచేయుటకు శక్తికలది కాని మనస్సుపై దానికి లేశముకాని, యధికార ములే దని నా యభిప్రాయము. ఈ నా యభిప్రాయమును ఖండించుటకు మీరు కొన్ని వాక్యములు వ్రాసినారు; అవి యేవనంగా—"ఇదివఱ కైదుతరములనుండి Idiocy తీగ సాగుచున్న వంశములు రెండెచ్చటనో యున్నట్టోక మనశ్శాస్త్రజ్ఞుడు చెప్పచున్నాడు. తండ్రికిఁ బిచ్చి లేదుకాని తీవ్రమైన కోపము, పెద్దకొడుకునకు సామాన్యపుబిచ్చి, రెండవకొడుకున కంతకంటెఁ బిచ్చి, మూడవకొడుకునకు బూర్తిగాఁ బిచ్చియున్న కుటుంబము నొకదానిని గోదావరీ తీరమందు నే నెఱుఁగుదును.” మీరిట్లు వ్రాసినారు. అమ్మా! గోదావరీ తీరమందలి కుటుంబము నే నెఱుంగునది కాదు. Heredity మనస్సు మీఁదఁగూడఁ బనిచేయునని నిర్ధారణ చేయటకై మీరు చెప్పిన యీ రెండుదాహరణములు గూడ మీ కనుకూలించునని కావని తెలియఁజేయ వలసివచ్చి నందులకు విచారించుచున్నాను. అమ్మా! మెదడు (Brain) మనస్సుయొక్క అవయవము (Organ) అని పాశ్చాత్యులతోపాటు మనముకూడ నొప్పకొవనిన యంశమే కాని వేఱుకాదు. Brain అనునది తలలో నుండు నని మీఱిగినయంశమే కదా! ఈతల తగినయేత్తుతో, దగినపొడవుతోఁ, దగిన వెడలుపుతో, దగిన యాకృతితోఁ దగిన చుట్టుకొలతతో గోధుమరంగు గల తగిన యంత ర్వస్తువుతో నుండవలయును. అప్పడే తలలోని మెదడు మనస్తత్త్వమునకుఁ దగిన యవయవ మగును. వీనిలో లోపములు కలుగుటచేతనే మనస్సు శక్తిహీనమై చెడినట్లుండును. ఎదిగినమ గవానితల సర్వసాధారణముగా 22 అంగుళముల చుట్టుకొలత కలిగియుండును. ఆడుదాని తల యిరువదియొకటికి నిరువదిరెంటికి నడిమికొలతకలదై యుండును. మహాబుద్దిశాలు లగువారి తలలు 23, 24 అంగుళముల చుట్టుకొలత కలవియై యుండును. ఎట్టి యద్వితీయ మేధాసంపన్నుని తలయైనను 24/2 అంగుళముల కొలతకంటె హెచ్చుకొలత గలిగియుం డదు. అంతకంటెఁ బెద్దతల రోగచిహ్నమని యెంచవలయును. మందుల తలలు 19 అంగుళములను, idiots తలలు 18 అంగుళముల కొలతకలవియై యుండును. అమ్మా! జన్మమందత్వము Idiocy అయిదుతరములనుండి తీఁగ సాగుచున్న కుటుంబములు రెండున్నవి చెప్పితివే! వారంద ఆకిట్టి తలలు గలవారే. తలలనుబట్టియే వారు Idiots అయిరి. తండ్రికోలమొగము Heredity వలన బిడ్డకు నెట్టు సంక్రమించునో తండ్రిబుద్దిహీనమైనతల కొడుకున కట్టు సంక్రమించుచున్నది. ఇది దేహపరిణామమే కాని మనః పరిణామ మెంతమా త్రము గాదు. అమ్మా! గోదావరీతీర మందలి పిచ్చికుటుంబమును గూర్చిరవంత చెప్పెదను. తండ్రి, తల్లి, ముగ్గురు కొడుకులా కుటుంబమున నుండిరి. తండ్రినరముల కత్యంత మైన యుద్రేకము. వాకిటిలో గుక్క రవంత మొఱగినయెడల భూకంప మైనంత తహతహ లాడిపోవును. అట్టి యాతనికి వెనుక వ్రాలుతలగల (Pyramidal-forehead) యిల్గాలు సిద్దించెను. వా రిద్దఱకు ముగ్గురు కొడుకులు పుట్టిరి. మొదటివాఁడు పాముతలవాఁడు. ఇతనికి నుదుటిసంబంధమగు మెదడు (Frontel brain) లేదు. రెండవకొడుకు మిక్కిలి చిన్నతలతో బుట్టెను. ఇతడు జన్మమందుడు. చిన్నయన్న గారి చిన్నతలతోఁ దల్లివ్రాలు తలతో, దండ్రి నరముల యుద్రేకముతో మూఁవకొడుకు పుట్టినాఁడు. ఈత డీగను జూచి యెగిరి యెగిరి పడువాఁడు. పిల్లిని గాంచి యేడ్చెడువాఁడు; కాకిని గాంచి గాన మొనర్చెడివాఁడు. పంచభూతములకు భాషావిషయ కోపన్యాసము లిచ్చువాఁడు; ఇతడు పూర్తిగాఁ బిచ్చివాఁడు జన్మమందత్వమే కాదు, పెద్దపెద్ద యున్మాదములే కాదు, చిట్టచివరకు మనుజులకు సర్వసాధారణముగా నున్న కొసవెట్టలు గూడ మెదటితో, నరముల కూటుమితో సంబంధించినవే కాని, వేఱు కాదు. ఇవియన్నియు దేహపరిణామములే కాని మనఃపరిణామములు కావు. కాని మనస్సునకు మెదడు ప్రధానావయవము కావున మనస్సులో బరిణామము Heredity వలనఁ గలిగి నట్టు కానబడుచున్నది. కాని మఱియొు కటి కాదు. అది కేవలము భ్రమము. మనస్సు చెడిపోయినట్టగపడుట కనేక కారణములుండును. పచ్చకామిల గలవాని కంటికిఁ బికిలిపిట్ట పసపుపొత్తి పిట్ట. సర్పదష్టుని జిహ్వకు లవణము కలకండ. అధర్మాయచెవియందు నిర్ధాతమునకు నిశ్వబ్దత్వము. సన్ని పాతరోగియె & Socrates కు , శంకరాచార్యుల వారికి, జగన్మిథ్యాత్వవాదము జరుగచుండును. అలవాటు లేనివానికి అరయవున్సు Exshaw గొంతుక దిగుటయేమి? యప్సరస లెదుటఁ దాండవించుటకై యమరలోకమునుండి దిగుటయేమి? ఇట్టి వన్నియు దాత్కాలి కోన్మాద ములు. వీనికి మహోన్మాదములకుఁ దత్త్వమందు భేదమేమియులేదు. నిలుకడలో మాత్రమే భేదమున్నది. సన్నిపాతరోగికి జ్వరహర మగువెంటనే యున్మాదము వదలును. అటులే యశ్వినీదేవతలు వచ్చి జన్మమందునిఁ జిన్నతలను బెద్దతలగాఁ జేయునెడల Idiot కున్మా దము వదలును. అదియులేదు; యిదియు లేదు, కాని కొన్ని కొన్ని యున్మాదము లౌషధసాధ్యములనుట సత్యమే; ఏ యౌషధమైనను శరీరమునకుఁగాని చిత్తమునకుఁ గాదని యంద ఱెఱిగిన యంశమే. అందుచే నున్మాదము లన్నియు దేహపరిణామములు కాని మనఃపరిణామములు కావు.

ఆమ్మా! Heredity మనస్సుపై బనిచేయునని నీ వెన్నఁడు నమ్మవలదు. నీయభిప్రా యమును సిద్ధాంతీకరించు కొనుటకు మనశ్శాస్త్రజ్ఞ డైన పాశ్చాత్యమహావిద్వాంసుని మాటలు గొన్నింటిని ఉదహరించినావు. అవి.ఏమనగ: ..... The heredity transmission of a liability to mental disease must be reckoned as the most important of all predisposing causes of insanity”ఈ మాటలను బట్టి mental disease (పిచ్చి) Heredity వలననే వచ్చుచున్నదని నీ వనుకొంటివి. అమ్మా! అట్టనుకొనుట తప్ప. పిచ్చికి Herediry యే కారణమని యావాక్యముల వ్రాసిన పండితుని యభిప్రాయము కాదు. పిచ్చికి Liability యున్నదే. అదే Heredity వలన వచ్చునని యాతని యభిప్రాయము. ఆ Liability యెప్పడుకూడ దేహపరిణామమే కాని మలకియొకటి కాదు. అందుచే Heredity దేహముమీ దనే కాని మనస్సు మీద బనిచేయదు; చేయలేదు.

అమ్మా! ఒకమాటు చెప్పచున్నాను; శ్రద్దగా వినుము. మనమార్షమతస్థులము. పరమాత్మను, జీవాత్మను, బునర్జన్మమును నమ్మిన వారము. మనదేశము నందుఁ బుట్టిన చార్వాకమతము నందుమాత్ర మివి యేవియు లేవు. బుద్దుడు దైవమును గూర్చి మూకీభావము వహించినను జీవాత్మతత్త్వమును గూర్చి కొంతవేఱుగాఁ జెప్పినను బునర్జన్మము నొప్పకానినాఁడు. అమ్మా! పాశ్చాత్య శాస్త్రజ్ఞలలో ననేకుల నాత్మవాదులు. ఆత్మలేనప్పడు పునర్జన్మము దేనికి? అందులోఁ బ్రకృతిశాస్త్రజ్ఞానము పరిపూర్ణముగ నున్న మహావిద్వాంసు లలో నూటికిఁ దొంబదియైదుగురు నిరీశ్వరవాదులు. మిగిలిన యయిదుగురు Agnositcs అమ్మా! Evolution గూర్చి Heredity ని గూర్చి యట్టివా రొనర్చిన విపరీత సిద్ధాంతము లందు నీవు విశ్వాస ముంచి మనవారి సిద్ధాంతములను బాటిసేయకుండుట తగునా? ఇంతకును నీవు మన సిద్ధాంతసాంప్రదాయములను బూర్తిగ నెఱుంగకుండఁబైవారి వాక్యములే సిద్ధాంతము లని నిర్ణయించుటకు నీకేమి యధికారమున్నది? ఆత్మను బునర్జన్మమును నమ్మిన మన కనాత్మవాదుల సిద్ధాంతములు వలదు. నిరీశ్వరవాదుల సిద్ధాంతములు మొదలే వలదు. మనలో మతమునకు వేదాంతమునకు సంపూర్ణసామరస్య మున్నది. వారిలో లేదు. వారిలో మతమును నమ్మిన వాఁడు వేదాంతమును బారలౌకికానంద భంజకముగను భగవ త్తత్త్వ దూషకముగను భావించును. ప్రకృతిజ్ఞాన సంపన్నులైన సిద్ధాంతులు మతము మూఢజ నచిత్తాకర్షణమైన బొమ్మలాటగ భావింతురు. ఈ రెంటకి సామరస్యము కుదిరినఁ గాని మతము నిలువదు; వేదాంతము నిలువదు. వేదాంతము లేని మతమైనఁ గొంతకాలము నిలుచును గాని మతము లేని స్వసౌఖ్యపరమావధికిఁ బరహింసాప్రవీణతకుఁ బ్రపంచవిశ్రాంత ప్రఖ్యాతికిఁ బనికివచ్చును గాని చిత్తశాంతికి, వైరాగ్యమునకు, యోగమునకు, నాత్మజిజ్ఞాసకు, నపరోకమార్గమునకు నక్క ఆకు రాదు. అసంతుష్టి కరములై యపూజ్యములై యనాత్మక ములైన వారిసిద్ధాంతములకు వారే కొంతకాలమైన పిమ్మట వెగటుపడక తప్పదు. ఇప్పడి ప్పడే యేదో కొంత విసుగుదలతోఁ గూడిన స్వల్పవైముఖ్యము వారి మనస్సులం దీసిద్ధాంతముల యెడలఁ గలుగుచున్నట్టు కొన్నిచిహ్నము లగుపడుచున్నవని కొందఱు చెప్పచున్నారు. పుణ్యమున కుత్తమ లోకఫలము లేదన్న వేదాంత మెంతకాలము మనస్సు నకు సంతుష్టి నీయంగలదు? సర్వరక్షకుండే లేని వేదాంతమం దెంతకాలం మనోధైర్య ముండ గలదు? అణువులు (Atoms) నిన్ను రక్షించునని చెప్పినమాటను నీ వెంత కాలము నమ్మఁగలవు?

అమ్మా! నీ విట్టి సిద్ధాంతముల నాధారముచేసికొని వాదించుట సమంజసము కాదు. నీయాంగ్లేయభాషాజ్ఞానమునకు, నీగ్రంథపరిశోధనమునకు నేను సంతసించితిని. కాని మన యార్షమతమునందలి నీ యనాదరణమునకు విచారించుచున్నాను. మన పెద్దలు జీవుని పునర్జన్మమును గూర్చి యెట్టి యభిప్రాయమును వెల్లడించిరో రవంత కనుగొందము. అమ్మా! నేను నీమాత్రమైనఁ జదువుకొన్న వాఁడనుగాను. కాని పెద్దల సేవించుచు హెచ్చుకాలము గడపినవాఁడ నగుటచే వారిప్రసాదమునఁ గొన్నిమాటలు నాచెవి నప్పడ ప్పడు పడినవి. అవి సంగ్రహముగ మనవి చేసెదను.

స్థూల సూక్ష్మ కారణ శరీరములని శరీరములు మూఁడు. మనుజుని మరణానంతరము స్థూలశరీర మిచ్చట మంటలోనో మట్టిలోనో కలసిపోవును. ఇంక సూక్ష్మకారణ శరీరము లున్నవి. సూక్ష్మశరీరములోఁ గారణ శరీరముండును. బాదముకాయలోఁ బలు కెట్లో యటులే యుండును. సూక్ష్మశరీరము వెలుతురు (Light) విదుచ్చక్తి (Electricity) వంటిది. సూక్ష్మశరీరములో నున్న జీవాత్మకు మోక్షము సూక్ష్మశరీరము పూర్తిగా నశించిన పిమ్మట గాని కలుగదు. అట్టిస్థితి కర్మరాహిత్య వాంఛారాహిత్య పూర్వకమయిన జ్ఞానమువలనఁ గని, భక్తివలనఁగాని పరమేశ్వరకటాక్షము వలనఁగాని కలుగును. అంతవజకు సూక్ష్మశరీరమాత్మ నంటిపెట్టి కొనియే యుండును. లోపల జీవాత్మగల యీసూక్ష్మశరీరమునకే మన పెద్దలు పునర్జన్మమును నిర్మించినారు. ఈ జీవుఁడు విశేష పుణ్యము లొనర్చుకొన్న వాఁడైన యెడల నుత్తమలోకము లందు దత్పుణ్యఫలక్షయ మగువలకు మహాసుఖమంది యటుపిమ్మట మర్తృలోకమునఁ దిరుగ జన్మించును. ఉత్కృష్ణ పుణ్యకార్యములు కాని, పాపకార్యములు కాని సామాన్యముగాఁ జరించి మరణించిన వానిసూక్ష్మ శరీరమునకు వెంటనే పునర్జన్మము సంభ వించును. విశేష పాపకర్మము లొనర్చినవాఁడు మరణించి శ్వ సూకరాది జంతువుల గర్భమందుఁ బుట్టును. పునర్జన్మ మెత్తవలసిన జీవుఁడు తన కర్మానుగుణమైన తావు చూచుకొని ప్రీహిమూలమునఁ బురుషుని యుదరమునఁ బ్రవేశించి యటనుండి మాత్పగ ర్భకోశమునఁ బ్రవేశించును. పుట్టఁదఁలచిన జీవుఁడు తనంతతానే ప్రయత్నించి పుట్టుచున్నాఁడు; కాని మన ప్రయోజకత్వముచేఁ బుట్టుచుండుటలేదని స్పష్టముగఁ దెలిసికొ నవలయును. జీవుని వదలకుండ వెంటాడించు చున్న యతని సూక్ష్మశరీరము కూడ జీవునితో పాటే తల్లి కడుపునఁ బ్రవేశించును. ఈసూక్ష్మ శరీరము కూడ జీవునితో పాటే తల్లికడుపునఁ బ్రవేశించును. ఈసూక్ష్మ శరీరములో నేమున్న వనంగా: అనేక పూర్వజన్మ ములలో జీవుఁ డొనర్చుకొన్న కర్మముల ఫలమున్నది. అదికాక విద్యయున్నది. విద్య యనంగా వేదవేదాంత జ్ఞానము, శాస్తాదిజ్ఞానము మొదలగునవి. ఇదికాక ప్రతిభ యున్నది. ప్రతిభ యనంగా బుద్దివికాసము, లలితకళా ప్రావీణ్యము, వాక్చతురత, వ్యవహార నైపుణి మొదలగునవి. ఈశక్తులన్నియు దల్లి గర్భమునఁ దనంత దాను ప్రవేశించినజీవుని సొంత సొమ్ము కాని తల్లిదండ్రులిచ్చిన వెంతమాత్రమును కావు. ఇక్కడనే నశించిపోవుట కర్దమైన స్థూలశరీరమును (దేహము) మాత్రమే తల్లిదండ్రులు బిడ్డ కిచ్చుచున్నారు. ఈ దేహమైనఁ దల్లిదండ్రులు బిడ్డకు యథాక్రమముగఁ బూర్తిగ నిచ్చుచున్నారా? ఈయ శక్తిగలిగి యున్నారా? కల్ల అట్టే యగునెడల నిందఱు వికృతాంగులు, నిందఱు నపుంసకులు, నిందఱు రాకాసిరూపులు ప్రపంచమున నుండనేల? బిడ్డనికి దేహమిచ్చుటలోఁ దల్లిదండ్రులు బిడ్డని కర్మమునకుఁ దమ కర్మమునకు గూడ ననుగుణమగు నంతవజకే దేహమిచ్చుచున్నారు. ఎటు లిచ్చినను బ్రధానముగఁ దెలియదగిన యంశమేదనఁగా: బిడ్డకుఁ దల్లిదండ్రులిచ్చు నది దేహమే కాని తద్వ్యతిరిక్త మెంతమాత్రము కాదు. మన స్సనునది బిడ్డనిదే. దానిపై దల్లిదండ్రుల కధికారము లేనే లేదు. అందుచేతనే యొకనికిఁ బుట్టిన యెనమండ్రు కొడుకు లలో నొకండు మహాబలాఢ్యుం డగుచున్నాడు. ఒకడు కాలుచేతులులేని మొండె మగు చున్నాఁడు. ఒక డెనుబది సంవత్సరములు పూర్ధారోగ్యమున జీవించుచున్నాడు. ఒకఁ డెనిమిదవదినమున సందుగొట్టి చచ్చుచున్నాఁడు. ఒకడు మహాకవి యగుచున్నాఁడు. ఒకడు నిరక్షరకుకి యగుచున్నాఁడు. ఒకఁడు పరమహంసశిఖామణి యగుచున్నాఁడు. ఒకడు బందిపోటుదొంగ యగుచున్నాఁడు. ఈ వ్యత్యానముల So Heredity సమన్వయింపఁగలదా? ఊహు.

పాశ్చాత్య వేదాంతులలో నూతనముగఁ గొందఱు మఱియొక యభిప్రాయమును బడుచున్నారని వినుచున్నాను. Heredity వలన బిడ్డని దేహపరిణామము లన్నియు బూర్తిగఁ గలుగుచున్నవని వీ రంగీకరించుచు మనఃపరిణామములోఁ గొన్ని మాత్రమే Heredity వలనఁ గలుగుచున్నవని వీరభిప్రాయ పడుచున్నారు. ఆకొన్ని యేవనగా:- బుద్దివికా నముతోఁ జేరిన మనఃపరిణామములు మాత్రమే Herediy వలనఁ గలుగుచున్నవి. కాని పుణ్యపాప సంబంధంతోఁ జేరిన నడవడి మాత్రము Heredity వలనఁ గలుగుటలేదని వీరి యభిప్రాయమైనట్టు కనబడుచున్నది. గణితశాస్త్రప్రావీణ్యము Herediry వలననే కలుగు చున్నది. గణితశాస్త్రప్రావీణ్యము Heredity వలననే కలుగుచున్నది. కాని కాంతాలపట త్వముమాత్రము దానివలనఁ గలుగుట లేదంట! ప్రబంధరచనా నైపుణ్యము Herediy వలననే కలుగుచున్నది. కాని, వైరాగ్యజ్ఞానసంపత్తి దానివలనఁ గలుగుటలేదంట! సరే, కలుగుటలేదు. దేనివలనఁ గలుగుచున్నదని వీరి నడిగినయెడల నాత్మ నొప్పకొనవలసి వచ్చునను భయముచేత Science యుంకను Progress అయిన కొలది దెలియునని కాఁబోలు మూకీభావమును వహించుచున్నారని వినుచున్నాను. ఏమైనాసరే కాని వీ రాత్మ నొప్పకొ నుట కిష్టపడరు.

"This doctrine (Transmigration) famous in antiquity and still held as a religious tenet by certain sects of the civilised world has its roots far back in primitive culture. It is developed out of three universal savage beliefs, (1) that man has a soul; (2) that animals and plants have souls; (3) that souls can be transferred from one organism to another.”

అమ్మా! వింటివా! ఆత్మాస్తిక్య విశ్వాసమున్న మనలను బాశ్చాత్యసిద్దాంతులు Savages అని పిలుచుచున్నారు. కాని యింత నాగరకత యుండియు నింత శాస్త్రజ్ఞాన ముండియు Heredity lntellectual Side ననే కాని Moral Side న బని చేయవని చెప్పు నట్టి వీరిని మన మేమని పిలువవలయునో? జవుననటికాయ లాగున మనస్సున కొకప్రక్కను బుద్దిభాగము, రెండవ ప్రక్కను నీతిభాగము నున్నవని వీరి యభిప్రాయము కాబోలు! సరే. ఎటులో యొకటు లుండుఁగాక! సగము మనస్సుపై బనిచేసినది. మిగిలినసగము పై నేలపనిచేయదో? నీటిలో ముంచిన గుడ్డకుఁ బడుగు తడిసి పేక పొడిగనుండునా? అమ్మా! ఆత్మవిశ్వాసము పునర్జన్మ విశ్వాసమున్నఁగాని యీలెక్క 'కజబాజ'లు గిట్టవు. బుద్దిచేతనే ప్రపంచపుఁ గట్టుకథను విప్ప సాధ్యమగునా? ప్రపంచమున మన లెకిక బుద్దికి స్వాధీనమైనది రూపాయ కొక్క యరపైసంతయిన గాదే. మిగిలినదంతయు భగవద్వాక్యములని మనము నమ్మినవానివలనను సమాధినిష్టాగరిష్ణులై యపరో కజ్ఞాననిక్షేపులైన మంత్రదష్టల పలుకులవల నను దెలిసికొనవలెను. Nonsense అది మూఢవిశ్వాస మని పైవారందురా? అది Nonsense అనీ క్రిందిదానిని వారేమందురో? “One cannot accept the theory of Evolution or the theory of Heredity built upon the Evolutionary hypothesis without discording the Bible and rejecting the dominent note in Christianity. We are not progeny of the brute. We have not tumbled upward by chance but rise by a power which finds its highest Expression in Christ.” WJ. Bryan అను నొక పాశ్చాత్యవిద్వాంసు డీమాటలను వ్రాసినాడు. Evolutionary heredity ని బూర్తిగ ఖండించిన వారిలో నితఁడు ప్రముఖుఁడు. ఈతండుబ్రేకమున “God or Gorilla?” యని అఱచినాడు. “Theworldfamouslawyer, politicianandorator” అని ఖ్యాతి చెందినవాఁడు. అమ్మా! ఈత డింక నేమని వ్రాసెనో విందువా? “I would propose the Bible as a substitute for all materialistic doctrines, because the Bible is not only the foundation of ever present standard of morals but also gives us our only conception of God and Jesus Christ. మతమునందలి విశ్వాసముచేతనే మనుజుఁడు మనుజఁ డగుచున్నాఁడు. కాని, లెకిక మైన బుద్దిచేతఁగాదని నమ్మవలయును. ఎంతటి వాఁడైనసరే, యొక్కడివాఁడైనసరే, యశా (స్త్రీయములైన మతవిశ్వాసములు కలవాఁడు మూడుడేకాని మఱియొకడు కాడని యింకను బాశ్చాత్యవేత్తలు మనల నధిక్షేపింతురా? ఊ, అటులే కానిమ్ము, బ్రహ్మర్షులతో పాటు మనము తప్పునఁ బడియుండుటే తగునుకాని పాశ్చాత్య శాస్త్రవేత్తలతోపాటు సందేహహతులమై భ్రష్టత్వమొందుట తగదు. అనాగరకులలో నధము లనిపించుకొన్న మన మాస్తికులమై యుండదము; కాని నాగరకశిఖామణులని పించుకొనుచు నాస్తికులమై యుండ వలదు. అమ్మా! ఎవరు చూడవచ్చినారు. ఏమో! ఏమో!! ఏమో!!!

(భారతినుండి పునర్ముద్రితము)