సాక్షి మూడవ సంపుటం/కవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

4. కవి

కవి ఎలా ఆలోచిస్తాడు? ఎలా ప్రతిస్పందిస్తాడు? ఎందుకు, దేనిగురించి ఆరాటపడతాడు? - అనే విషయాలను తరిచి జంఘాలశాస్త్రి ఈ ఉపన్యాసం ఇస్తున్నాడు. -

కవి, ఒక గడ్డిపరకలో సైతం పరమేశ్వరుడి కరుణ, పరమేశ్వరుడి లీల, పరమేశ్వరుడి జ్ఞానం, పరమేశ్వరుని ఆనందం, పరమేశ్వరుడి మహిమ, భావించి ఆమూర్తిని సేవించి సేవించి, ఆశక్తిని ధ్యానించి ధ్యానించి, ప్రకృతిలో సహజతకు సంతోషించి, వలచి, వశుడై సౌందర్యగీతాలను అరచిఅరచి, వ్యక్తిత్వాన్నిమరచి, తన్మయుడవుతాడు.

నవ్వితే ఒక సొగసు, బెదిరిస్తే వేరొకసొగసు, తల ఊగిస్తే మరోసొగసు, రౌద్రంగా ఘూంకరిస్తే ఇంకొకసాగసు, బతిమాలితే మరోసొగసు కనిపించే ప్రకృతికిలొంగి, సౌందర్యం అనే పాలసముద్రంలో చేతులు బారలువి సిరి ఈదుతూ-మరొకసారి ఏచిరు కెరటంమీదనో తలవాల్చి మైమరచి పడివుండే మనిషి కవి.

బాహ్యప్రకృతే ఎంతో ఆశ్చర్యంగా వుందనుకుంటే, మరిలోపలి ప్రకృతి ఇంకా ఆశ్చర్యకరమైంది. అక్కడ తలెత్తే ఉత్పాతాలు బాహ్యప్రకృ తిలో వాటికంటె తీవ్రమైనవి.

మనం రకరకాల వ్వవధానాలతో చరిత్రలో సాగిన అనేక యుద్దాలగు రించి వినివున్నాంగాని, సృష్టిప్రారంభంనుంచే అరిషడ్వర్గం (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్పర్యాలు) తో మనిషికి లోపలి ప్రకృతిలో జరిగే యుద్దం దాని సంక్షోభం వాటకంటె బీభత్సమైంది. ఈరెండు విధాల ప్రకృతులలో విశేషాలను తన అనుభవంతో పట్టజాలినవాడు కవి. అతనికి మాటల్ని బొమ్మలుగాచేసే శక్తివుంది. కవి ఒక విధమైన పిచ్చివాడు. కోట విధాల పరమార్ధగ్రహణ మార్గాలలో ఒక మార్గమే ఆపిచ్చి, అటువంటి వెర్రితో, తాను ధన్యుడై లోకాన్ని ధన్యంచేసేవాడు కవి.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

ఎక్కడఁ జూచిన జిగజిగ, ఎక్కడ జూచిన మిలమిల, ఎక్కడం జూచిన నీరు, ఎక్కడ జూచిన పరిమళము, ఎక్కడ జూచిన వెలుఁగు, ఎక్కడఁ జూచిన బయలు, ఎక్కడఁ జూచిన రంగు. ఆహాహా! ఏమివింత! ఏమిచిత్రము! పచ్చనిబయళ్లు! ఫలములతో నిండినచెట్లు, పుష్పములు గుత్తులుగుత్తులుగా నున్న లతలు, భూమినుండి యుబికి యుబ్బెత్తుగ లేచుకొండలు, స్వాదుజలభరితములగు నదులు, నొడ్డులేని నముద్రము, నంతములేని యాకాశము, తేజోమయములగు గ్రహములు, కంటికి తేజము, చెవికి హాయి, యొడలికిఁ జలువ, ఫ్రూణమునకు సౌరభము, జిహ్వకు రుచి నిచ్చుచున్నవికదా? ఈతేజముకంటెు, నీహాయికంటె, నీచలువకంటె, నీసౌరభముకంటె, నీరుచికంటె విలక్షణమైన యాశ్చర్యకర మైన, యనుభవైక వేద్యమైన యానందము ప్రకృతిదర్శనమున మనస్సునఁ గల్గుచున్నదికదా? ఆయానంద ప్రభావమున మనస్సిఫైయిపై తేలికయై యస్టెయపై విస్తీర్ఘమై ప్రకృతియందు వ్యాప్తమై లీనమై పోవుచున్నదికదా? ఏవస్తువును గాంచిన సౌందర్యమృతము వర్షించుచున్నట్ల గడుచున్నదికదా? ఏవస్తువును గాంచిన సౌందర్యామృతము వర్షించు చున్నట్టగడుచున్నది కదా? ఆహా? ఆకసమున నీవైపునుండి యావైపునకు వ్యాపించిన యింద్రధనుస్సు వంపులతో, రంగులతో, వ్యాప్తితో, సౌందర్యముతోఁ కలసి ప్రకృతిసౌభాగ్యదేవతకు మంగళపుటారతు లిచ్చుచున్నవికదా? ఒక్కగులాబిపువ్వులోని సారళ్యము, సౌందర్యము, సౌరభము నాలోకింపఁబోయి, యస్వాదింపంబోయి, యనుభవింపఁబోయి, యాపుష్చసౌభాగ్యములోఁ గలసి, యాకేసర మార్దవమున నార్హమై, యామకరందబిందుసందోహమున లీనమై మన సుయపై తన్మయత్వమును జెందుచున్నదే. తుట్టతుద కొక్క గడ్డిపొరకలోఁ బరమేశ్వ రుని కరుణ, పరమేశ్వరునిలీల, పరమేశ్వరునిజ్ఞానము, పరమేశ్వరునియానందము, పరమే శ్వరునిమహిమము భావించి, యామూర్తిని సేవించి సేవించి, యాశక్తిని ధ్యానించి ధ్యానించి తరింప వచ్చునుగదా! ప్రకృతిసామంజస్యమునకు, ప్రకృతి సామీచీన్యమునకు, వలచి వలచి వశుడై వశుండై సౌందర్యగీతము లరచి యరచి, వ్యక్తిత్వమును మఱచి మఱచి, తన్మయుఁ డగు నాతండు కవి. తాను వలచిన ప్రకృతిఁ జూచినకొలఁది, చూచినకొలఁది సుందరన్వరూ పయై కానcబడునే. ఆఫ్రూణించినకొలఁది నధిక పరిమళభరితయై కానcబడునే. కౌcగిలించిన కొలఁది కౌcగిలించిన కొలఁది కఠినతలో మెత్తన, మెత్తనలోఁ గఠినత. కఠినతలో గఠినత, మెత్తనలో మెత్తన, వేడిలోc జలువ, చలువలో వcడి, చలువలో జలువ నిముసని ముసమున కధికతరముగఁ గానబజచుచున్నదే. ముద్దుపెట్టిన కొలఁది ముద్దులోఁ దేనె, యాతేనెలో కలకండ, యారెంటిలో ద్రాక్షపండ్లరసము, నామూటిలోఁ బద్మసౌరభము, ఆనాల్గింటిలో శిరీషపేశలత క్షణక్షణప్రవర్ధమాన మగుచుఁ గానcబజచుచున్నదే ప్రాఁకులాడినకొలఁది ప్రాఁకులాడిన కొలఁది వన్నెలు, చిన్నెలు, హొరంగులు, హొయలులు, తళుకులు, బెళుకులు, వగలు, వద్దికలు నేకొత్తరాభివృద్దిగాఁ గానcబఆచుచున్నదే. మల్లెపూవులలో రెల్లుపూవులలో నపై యస్లై మందహాస మొనర్చుచున్నదే. చక్కని చుక్కలమాటునఁ జేరి కాముకుఁడైన కవికిఁ గన్నిస్టైయ్చఁ గీటుచున్నదే. పర్వతములప్రక్కఁ జేరి తెల్లని జిలుఁగు పయ్యెదతోఁ బయోదరములాంధ్ర వనితవలె గూఢతయుఁ బ్రత్యక్షతయుఁ గాకుండ మాటుకొనుచు బయ లు సేయుచున్నదే. అంభోధరములచెంత నిలిచి మొగము ముడుcచుకొని ధుమధుమలాడుచుఁ గంటివెంట నిప్పలు గ్రక్కుచు బడబడాయమానశబ్దములతోఁ గలోర ముగ రూంకరించుచున్నదే. అట్లు రూంకరించి రూంకరించి స్త్రీనైజము ననుసరించి ధారాపాతముగఁ గన్నీరు విడుచుచున్నదే. గంగావాల్గాదిముక్తాహారాలంకృతగళసీమయై, నక్షత్రపుష్చవారవిరాజిత కేశబంధయై, భానుమండలసిందూరతిలక ప్రభాభాసమాన ఫాలసీ మయై పద్మపన్నీరచంపకశేఫాలికాదిపుష్పపరిమిళభరిత నిశ్వాసమై, సర్వగోళసంచలనో ద్భూతమహారవ గీతామాధురీరమాధురీణయై ప్రకాశించు నీప్రకృతికాంత చూచిన చూపులకు, బలికిన పలుకులకుc, బాడినపాటలకు, నాడినయాటలకు, చేసినచేష్టలకు నధీనుఁడై, పరవశుcడై, కవి రసమయుఁడై విరాజిల్లునే. సర్వాంగసుందరయై బంగారుప్రాయ మున నున్న వేశ్యాకాంతను విటుc డెంతగాఢముగఁ బ్రేమించునో, ప్రేమించి దానిపాదముల యొద్దనే యీఢిలబడి, దాని మొగమునందే సదా దృష్టిధ్యానముల నిల్పుకొని యుండునో ప్రకృతి ప్రమదాశిరోమణి నంతకంటె గాఢముగఁ బ్రేమించి యామేకొంగు దగిలినఁ జాలు నని, యామెముఖసౌరభ మబ్బిన భాగ్యమని, యామె యవయవవర్తులత కనcబడిన నదృష్ట మని, యామె చిఱునవ్వు వెన్నెలచే మనస్సు చల్లబడిన స్వర్గ మని, యామె క్రీగంటc దన్నుఁ గటాక్షించిన మోక్షమని, కవి యామెను నేత్రపుష్పములచే, వాక్పుష్చములచే, మనఃపుష్చముచే నారాధించుచుండునే. ఆకుపచ్చనితలపుగాగరాకట్టి, పూలరవికc దొడిగి, పంటకాలువల యొడ్డునను, జలప్రపాతముల ప్రక్కలను, నడివలెc దాండవించుచుండ కవి మహానందమున లయానుసారముగ గీతములు పాడుచుఁ జేతులతోc దాళములు వైచుచుం డునే. ఒడలు భయంకరముగ నదరుచుండ, నోటివెంటఁ బొగలు, గంధకపుజ్వాలలు, రాతినీరు గ్రక్కుచు రౌద్రస్వరూపిణియై చెలరేగుచుండ, నొదిఁగి, యడంగి శోకసంతప్తచిత్తుఁడై కన్నీళ్లతోఁ గని కరుణగీతములCబాడుచుఁ గరcగిపోవు చుండునే. పండు టాకులనడుమ, శిథిలములైన మహాభవనముల నడుమ సంధ్యారాగము వెనుక సన్యాసినివలె గాషాయాంబరధారిణియై, యస్తమించుచున్న సూర్యునిఁ జూచుచు నాలోచనభావమున నిశ్శబ్దముగ నడఁగియుండం, గవి జగదశాశ్వతతత్త్వము, సర్వసంగపరిత్యాగమును బోధిం చువైరాగ్యగీతములు పాడి తానుగూడం గాషాయమాత్రధారియై నిర్మలుడై నిర్ణేపుఁడై నిస్సంగియై, నీఱయిపోవునే. నవ్విన నొక్క సొగసు, రౌద్రమున రూంకరించిన నిఁక నొక్కసొగసు, నేడ్చిన మఱియింక నొక్కసాగసు, బతిమాలిన మeమeకి యిఁక నొక్కసొగసుc, గల ప్రకృతికాంత కధీనుఁడై కవి సౌందర్యక్షీరవారాశిలో నొకపుడు చే బారలు వైచి యీcదుచు మఱియొకపుడు కదలిన ట్టగపడక నిల్వు నీఁతనీcదుచు, వేలకొకపుడు సౌందర్యామృతమును గడుపునిండంగ్రోలి కదలలేకుండ నలసిసొలసి యేతరంగముమీదనో తలయుంచి యొక్కనిమేషకాలము మైమఱచి పడియుండునే. నోటివెంట గనులవెంటc జెవులవెంట ముక్కువెంట లావణ్యామృతము నధికముగాఁ గ్రోలుటచేఁ గెక్కు కెక్కుమ నుచు నూపిరియాడక, బుడుక్కున మునిఁగి యొక్కసారి తేలి, మఱియొక్క మున్కలో నమృతమయుఁడై యద్వైతస్థితి నొందునుగదా!

బాహ్యప్రకృతియే యింతయనిర్వర్ధ్యమై, యద్బుతమై యప్రతిహతమై యుండ దీనిని మించిన ప్రకృతి వేఱకొక్కటి యున్నది. అదియే యాంతరప్రకృతి. బాహ్యప్రకృతి యెంతవివి ధమో, యెంతవిపులమో, యెంతవిన్మయజనకమో, యాంతరప్రకృతి యంతకంటెు వివి ధము. అంతకంటె విపులము. అంతకంటె విస్మయజనకము. దానిలోఁ బ్రకాశించుచున్నది, యెండయా కాదు, వెన్నెలయాకాదు, ఎండయు వెన్నెలయుఁగలసి యెండయు వెన్నెలయుc గాని యొకవింతకాంతియై, వింతలలో వింతయై వెల్గిపోవుచున్నదే. లకనూర్యులు, కోటి చంద్రు లొకదానిప్రక్క నొక్కటి, యొకదానిలో నొక్కటి యేకకాలమందుఁ బ్రకాశించుచున్నవే, ధ్వనికంటె, వెల్తురుకంటె, విద్యుచ్చక్తికంటె నెక్కువ వేగవంతములైన వింతవింతబా రుమెఱపులేవో నుల్కసహస్రములతోఁ గొఱవిదయ్యపు గోటులతో లోన జటజల మనుచున్నవే. అంతరప్రకృతిలోని రత్నములముందు, మీపట్టువజ్రము, మీ కోహినూరు వజ్రము దిగదుడుపునకైన నక్కఱకు వచ్చునా? అనంతరప్రకృత్యాకాశమునులు నింద్ర ధనన్సులముందు బాహ్యప్రకృతిలోని యింద్రధనస్సులు వెలవెలలాడుచున్నవే. నిస్తేజస్కము లగుచున్నవే మాసిమాయమగుచున్నవే. అంతశ్శక్రచాపములలో వట్టి రంగులుమాత్రమేనా? కాదే, రంగులో శబ్దమో, ఆశబ్దములోఁ బరిమళమో, ఆపరిమళములో మాధుర్యమో, ఆమాధుర్యములోఁ జలువయో, అన్నిటిలో ననిర్వచనీయమైన సౌందర్యమో, ఆహా ఏమి యంతఃప్రకృతి! ఏధరణీ కంపములైన, నేయగ్నిపర్వతోల్దేములైన, నేగాలివానలైన, నాంతర ప్రకృతిలోని సంక్షోభముల కీడువచ్చునా ఎనిమిదిదినములయుద్దమున్నది. పదునెనిమిదిదినముల యుద్ద మున్నది. మూఁడుసంవత్సరముల యుద్దమున్నది. నూరు సంవత్సరముల యుద్దమున్నది. కాని సృష్ట్యాదినుండి కామక్రోధాదులయుద్ద మవిచ్చిన్నముగ నాంతరప్రక్కృ తిలో జరుగుచున్నదే. రామాయణయుద్దమైన భారతయుద్దమైన ఐరోపా మహాసంగ్రామమైన నవియన్నియునైన నరిషడ్వర్గ సంక్షోభము ముందెంత? పిడుగుపాటుముందు పికిలికూతలు కావా? సముద్రపుహోరుముందు నరుగుడుచెట్టగానము గాదా? అట్టిబాహ్య ప్రకృతికి నిట్టియాంతర ప్రకృతికి నేమిసంబంద మున్నదో, యేమి భేదమున్నదో, దానిలోఁ దిరుగు నప్ప డేమియానందమో, దీనిలోఁ దిరుగునప్పడేమి యానందమో, యాయానందమున కీయానందమున కెచ్చట సామ్యమో, యెచ్చటభేదమో, యనుభవమునఁ గనిపెట్టఁజాలి నయాతండు కవి. చెట్టమొదలే కొమ్మయై, కొమ్మయే యాకై యూకే చిగురై, చిగురే పుష్పమై, పుష్పమే మకరందమైనట్టు బాహ్య ప్రకృతియే జడత్వమును దృజించి, భారమును వదలి, మోటుతనమును విడిచి, క్రమముగా సున్నితమై, మృదులమై, తేలికయై, వేగవంతమై, సూక్ష్మతమమై, విపులతరమై, యాంతరప్రకృతిగ మారెనో, కాక యాంతర ప్రకృతియే క్రమముగ మందమై, బరువై కఠినమై మొదై బాహ్యప్రకృతిగ మారెనో తెలిసికొన గోరి యొక్కసారియే యందులో నొకకా లిందులో నొకకాలుంచి, యందులో నొకచేయి, యిందులో నొకచేయి యుంచి, యందులో నొకక న్నిందులో నొకక న్నుంచి, పరిశీలించి, కాశిపట్టుబట్టకు, మెఱుఁగువైపు, మోటువైపులెట్టో యష్లే యని యనుభవమునఁ గని పట్టcజాలినయాతండు కవి. అట్టు కనిపట్టి యాకృతిచే, రంగులచే, రుచిచే, బరువుచే, స్వభావముచే, గతిచే, భేదములైన యావస్తువు లన్నిటికి లోపల వెలుపల, నొకవిలక్షణ మగుశక్తినిండియున్నదనియు స్పష్టములగు సర్వపదార్ధములుగూడ నామహాశక్తి సాగరమం దలి తరంగములు, తుంపరలు, బుద్బుదములు, ఫేనము లని యావేశమున గనిపట్టcజాలిన యాతండు కవి. అందుచే నేకత్వమే బహుత్వముగా నున్నదికాని, బహుత్వమసత్యమనియు, నేకత్వమే సత్య మనియుఁ గనుపట్టు నాతండు కవి.

ఈశక్తియందుమాత్రము, కవికి, వేదాంతికి సామ్యమున్నది. ఉత్తమమైనకవిత్వము వేదాంతముకంటె భిన్నముకాదు. “Poetry is the highest Philosophy" అని పాశ్చాత్య విమర్శకచక్రవర్తిచెప్పినాఁడు. జగత్తత్త్వమును గూర్చి, పరబ్రహ్మతత్త్వమునుగూర్చి పలికిన వేదరులందరు మహాకవులు కారా? జగత్పుస్తకమును జదివి, దాని యర్ధమును గ్రహించి, దానిభావమును గుర్తెఱిఁగి, దాని రచియించిన మహాశక్తియొక్క తత్త్వము ననుమానింపఁ గలిగిన యాతడే కవి, భూమిలో నుండు గాజురాయి మొదలుకొని యంతరిక్షమున నత్యంత దూర మందుండు చుక్కవఱకు సమస్త పదార్ధములందు నీతిని, శాసనమును, ప్రేమమును, సౌందర్యమును, మతమును, నవిలంఘ్యక్రమమును బుద్దివైశిత్యముచేఁ గనిపట్టఁజాలిన యాతండు కవి. ఫలభారమున వంగిన చెట్టు ప్రపంచమున కేమి బోధించుచున్నవి? విద్యాంసుcడు వినయవంతుఁడై యుండవలయు ననియేకదా? ఉదయముననే భరతపక్షి ‘తుఱ్ఱు మని సూర్యునివంక కేల యెగురుచున్నది? నిద్రావస్థలో నిస్సహాయస్థితిలో రక్షించిన భగవంతుని పాదములపై మనుజుని యాత్మకృతజ్ఞతా వందనములతో నుబ్బెత్తుగ నెగురవలయు ననుమతమును బోధించుటకేగదా, గులాబిపొదపై నొకపూవును మనము లాcగగా దానిపై కొమ్మపై నుండుపువ్వు తానుగూడ వంగుట యెందులకు? ఒకచెంపc గొట్టువానికి రెండవ చెంపఁగూడ చూపు మని యేసుక్రీస్తు డెందులకు బోధించెనో యందులకే. పురపాలకసంఘమువారి వీథి దీప మేమి బోధించెనో యందులకే. పురపాలకసంఘమువారి వీథి దీప మేమి బోధించుచున్నది? తా నంతస్తాపముచే దహింపఁ బడినసరియే. పరులకు మే లొనర్పు మను స్వార్డపరిత్యాగమహాపాఠమును బోధించుట లేదా! కన్ను లున్న వానికి, మన సున్నవానికి రాతిలో నీతి యున్నది. మట్టిలో మత మున్నది.

అట్టు చూచువాఁడు కవి. చూచి యూరకుండునా? ఆవేశ మూరకుండనిచ్చునా? ఆనందము పొరలి పోకుండ నాcగునా? లోపల చిత్తము తాండవించుచున్నప్పడు జిహ్వపై శారద తాండవింపకుండునా? కలకంఠకలస్వనములతో నొకప్పడు, శ్రీనివాసదేవాలయ ఘంటా ఘణఘణధ్వనులతో నొకప్పడు శ్రీశైలేశ్వర శంఖారావములతో నొకప్పడు, ఆఫ్రికాదేశపంచాననభయంకరగర్ధారావములతో నొక్కప్పడు పలికి, చిత్తోత్సాహమును, జిత్తోద్రేకమును నప్రయత్నముగ, ననర్గళముగ వెల్లడించునాతండు కవి. ఎవనిపలుకు లొక ప్పడు గంగా రురీవేగసన్నిభములో, యొకప్పడు పుత్రునియాలింగనమువలె చల్లనలో, సంతోషజనకములో, యొకప్పడు పడుచు పెండ్డాము నాలింగనము వలె గోరువెచ్చనలోఁ గుతూహలప్రదములో, యొకప్పడు పన్నీటితుంపరవలె పరిమళభరితములో, యొకప్పడు వీణావాదమువలె మధుర మధుర లలితలలితములై సృదయాకర్షములో, యొకప్పడు వేదవా క్కులవలె శాసనములో, యొకప్పడు నిస్సంబంధములుగాఁ గానcబడుచు, దూరస్థములుగc గానcబడుచు, మెలికలై ప్రక్కబాఆునఁ బోవుచు, తిరుగుడులై వెనుకబా ఆున వచ్చి కాళ్లు చేతులు మనస్సు గట్టిగాఁ గట్టి డబ్బాటున మోసముతో స్వాధీనపఱచు కొనుదాఁక స్వభావము తెలియని పలుకు లొకప్పడు, రివ్వుమని పైకిఁ బోయి యచ్చట నింద్ర చాపవర్ధములఁ బూలను ద్రిమ్మరించి క్రింద జాలకిపోవుపలుకు లొకప్పడు, నుపయో గించు సమయానుసారసర్వతో ముఖసమ్మోహినీ కరణసరస్వతీమూర్తియగు నాతండు కవి.

పైకి మందుcడై, బాహ్యప్రపంచ జ్ఞానశూన్యుఁడై జడుడై యాంతరప్రపంచముచే గాఢముగ నవలోకించుచు, గోంచితో, గొంగళి పాంతతో, నెడమచేతివెదురుకట్టతోఁ, గుడిచేతికుండతోఁ, గడుపులో నాకలితో, నడుముపై వంపుతో, శిరముపై గంపతో బిచ్చగాఁడై మాధుకర మెత్తుకొనుచు నొకపుడు, ధర్మసింహాసనాధిష్ణాతయై, కిరీటాంగదధా రియై, స్వర్ణనేత్రధర సేవితుఁడై యొకచేత ధర్మశాస్త్రమును, నొకచేత కత్తిని ధరించి యొకయడుగు చందనమున, నొకయడుగు నగ్నియం దుంచి, ప్రజలను యథాన్యాయముగఁ బరిపాలించుచు నొకపుడు, ముండియై, దండియై, కాషాయాంబరధా రియై, బ్రహ్మవర్చసము ముఖమున ఠవణింప నుపదేశముద్రను వహించి, యుపనిషత్సార మును బోధించుచు నొకపుడు, చిలువెండ్రుకలతో, పాలబుగ్గలతో, నోటిచొంగతో, కంటికా టుకతో, మాటిమాటికి పైకెత్తుచున్న నడుముతో, చమురుతలతోఁ, దొట్టిలోని బొత్తులలోఁ బండుకొని వ్రేలు నోటబడక వెక్కివెక్కి యేడ్చుచు నొకపుడు నిట్టు భావనాప్రపంచమున, భావనానాటకమున, భావనారంగమున సర్వవేషధారియై బాహ్యప్రపంచాతీతుఁడై తన ప్రపం చమునఁ దా నొక్కఁడై సర్వమై యుండునాతఁడు కవి,

ఎదుట లేనివస్తువుల వర్ణించునపు డాంతరదృష్టితో, వజ్రధారకంటె వాcడియైన యాంతరదృష్టితో, నావస్తువుల యాకృతి, రంగు, రుచి, వాసన, ధ్వని, స్పర్శము మొదలగున విపరిశీలించి వాని బాహ్యాంతస్స్వరూపముల నెట్టయెదుటఁ బెట్టఁగల యింద్రజాలమహేంద్ర జాల విద్యావిశారదుఁడగునాతండు కవి. ఏయేవస్తువుల నెట్టెట్టు వర్ణించిననవి స్వస్వరూప ములతోఁ బ్రత్యకము లగునో యట్టి చాకచక్యసంపత్తితోఁ గొన్నిటిని బలిష్టములైన నాల్గు జటకాలతోనో, కొన్నిటిని బలిష్టములైన మూఁడు ప్రేతలతోనో కొన్నిటిని దేలికతేలిక లేఁతలేఁత యగు పదివ్రేటులతోనో నిర్మించి యెంతదూరముననో యెన్నిమూలలలోనో దాగియున్న వానిని సాక్షాత్కరింపఁ జేయఁగ సమయానుసారశబ్దార్థగుంభనాసమర్ధుఁడగు నాతండు కవి. ఎవనిబోమ్మలు మాటలో యతఁడు చిత్రకారుఁ డగునట్టే యెవనిమాటలు బొమ్మలో యతcడు కవి.

నాయనలారా! కవియొక్క ప్రధానశక్తులను జెప్పచున్నాను. ఇట్టిశక్తుల కుదాహరణ ములు మనభాగవతభారతరామాయణాది గ్రంథములనుండి యెత్తిచూపునెడల నాల్గుదినము లకైన నీయుపన్యాసము తెమలదు. కవిలక్షణములను మాత్రమే చెప్పెదను. లక్యములను మీరు చూచుకొన వలయును. (అయ్యా మీపూర్వోపన్యాసములం దెన్నిటిఁ గూర్చియో చెప్పెద నని వాగ్దాన మొనర్చియున్నారు. ఈసందర్భమునఁ గవిభేదముల గూర్చియు బాత్రాచిత్యముగూర్చియుc జెప్పవలసి యున్నది. పూర్వవాగ్దత్తములైన వన్నియు నీసారి చెప్పినదాఁక మిమ్మువదలము-అని సభలో గేకలు.) నాయనలారా! కూతురు కొడుకును గందునన్నఁ దల్లి వల దనునా? వినువా రున్నప్పడు చెప్పకుందునా? పూర్వమున నుపేక్షించిన వానినే కాక నింక ననేకవిషయములఁగూర్చి చెప్పెదను. ప్రపంచచర్య లంతకంటె నంతకంటెఁ జెడుచునేయున్నప్పడుపన్యాస విషయములకు లోపమేమి? భగవత్క టాకము మాత్రముండవలయును.

నాయనలారా! కవిలక్షణము లింకఁ జెప్పెదను. ఇది చప్పన మనస్సునఁ బ్రవేశించువి షయము కాదు. కావున సావధానచిత్తముతో వినవలయును. వస్తువర్ధనశక్తి నింతవఱకుఁ జెప్పియుంటిని. పరుల సుఖదుఃఖాద్యవస్థాభేదములను తనవిగాఁ జేసికొని పరులహృదయ ములందు దూరి తన్నుఁ బూర్తిగ మఱచి తనవ్యక్తిత్వమును బూర్ణముగc దుడిచిపెట్టి వారిహృదయములం దైక్యమై, వా రట్జయవస్థాభేదములం దెట్టు మాటలాడుదురో, యెట్టు పాడుదురో, యెట్టు గంతులిడుదురో, యెట్లు కూలఁబడుదురో, యెఫ్టేడ్లురో యట్లు మాటలాడి, యట్లు పాడి, యట్టు గంతులిడి, యట్టు కూలబడి, యఫ్టేడ్చునాతండు కవి. కళత్రవిహీనుఁ డగునిర్భాగ్యు డేడ్చిన ట్లోకపుడు, పుత్రోదయమైన భాగ్యవంతుఁడగు వృద్దుcడుప్పొంగి మహానందమున నోలలాడినట్లోకపుడు, సందిగ్దావస్థలో నెటు చేయుటకుఁ దోcపని యాపన్నునివలె నూఁగులాడి యొకపుడు, నపకారి యగుసరి యెదుటcబడిన వీరాగ్రేసరునివలె బాయకత్తి జళిపించి రూంకరించి, సంహరింపఁ బోవుచు నొకపు డి యందeవాడవలసిన యాటలు తానే యాడి తానే పరవ్యక్తులైనట్టు మాటలాడు సవ్యక్తినంఛన్న పూర్వకపరవ్యక్తిప్రవేశ పాండితీమండితుండగు నాతండు కవి.

ఆంతరప్రపంచములోని రూపశూన్యములైన రసభేదములు, నవస్థాభేదములు నక్షిగో చరములు కాకుంటచే వానిని వివరించి, విస్పష్టముగా మనయెదుటc బెవలసివచ్చుచున్న పుడు బాహ్య ప్రపంచమున మన కనుభవములో నున్నవస్తువులను జట్టుభట్టు సందర్భానుసా రముగ నుపమల్నర్చి తెలియనివానినిఁ దెలియున ల్గొనర్చి చీఁకటిపై వెలుతురినిఁ బ్రసరింపఁజేయు విజ్ఞానతేజశ్శాలియగునాతcడు కవి. మనస్సంకల్పములు, చిత్తవికార ములు, బుద్దిభ్రమములు, వివిధరసస్పురణములు, వర్ద్యవిషయములైనప్ప డాయగోచరపరి స్థితులను దెలియcబఱచుటకు బాహ్యప్రపంచమునందలి సౌమ్యపరిస్థితులసాహాయ్య మావశ్య కము, ఆంతరప్రపంచమందలి సౌమ్యపరిస్థితులసాహాయ్య మావశ్యకము, ఆంతరప్రపంచము నందలి యజ్ఞవిషయమునెల్ల సూక్ష్మముగా, సునాయాసముగా, సుప్రశస్తముగా, నత్యంతస ముచితములైన యుపమలతో లంకెవేసి మనసుతోనైన స్పష్టముగ గ్రహించుట కవకోశము లేనివానినిఁ గంటితోఁ జూచునట్టు చేయు ప్రకృతిజ్ఞానపరిపూర్ధుఁ డైనయాతండు కవి. కవి ప్రాశస్త్యము సముచితోపమాన సంఖ్యను బట్టిగ్రహింపవచ్చును. శ్రీమద్రామాయణము నందు వాల్మీకి యుపయోగించిన యుపమలకు హద్దు లేదు. తులసీదాసుని రామాయణమునందుc గూడ నట్లే యున్నవి. మనఃప్రపంచమునందలి యవస్థాకోటులకెల్ల బాహ్యప్రపంచమున నుపమానకోటులున్నవి. కవి వానిని గ్రహింపవలయును. అది యిదియు నొకటే, అది యిదియు నొకటే యనుటకు సామ్యముకొఱకు గవి యెట్టు ప్రకృతినిఁ బరిశీలించునో, యది యిది కాదు, అది యది కాదు, (నేతి, నేతి) యని పలుకుటకు వేదాంతియు నష్లే ప్రకృతినిఁ బరిశీలించును. సామ్యపరిజ్ఞానికవి. భేదపరిజ్ఞాని వేదాంతి. సామ్యముc తెలియకపో వుటకు నిజమే. కాని కవి యందు సామ్యజ్ఞానము విశేషముగ నుండును. వేదాంతి యందు విభేదజ్ఞానము విశేషముగ నుండును. ఇది స్టూలమైన నిర్వచన మని యెఱుఁగవలయును. అపదార్ధములైన యంతరంగావస్థలకుఁ బదార్ధత్వమిచ్చి ప్రత్యక్షము చేయుట కుపమాలంకా రము మహాకవులందఱు మిక్కిలి విరివిగా వాడియున్నారని చెప్పియున్నాను. బాహ్య పరిస్థితులను వెల్లడించునప్పడు గూడఁ గవు లుపమలను వాడినారు, వాడుచున్నారు. వాడఁగలరు. ఇది కేవల మావశ్యకము కాదు కాని యలంకారమునకు, జమత్కారమునకు, సౌందర్యమునకు, వస్తువైశద్యమునకుఁ గవు లట్టు చేయుదురు. మఱియుఁ గవులు మఱి యొక విధములయిన యుపమలను గూడ వాడుచున్నారు. అవి యేవనగ బాహ్యావస్థలను వెల్లడించు నప్ప డాంతరావస్థల నుపములుగCదీసికొనుచున్నారు. ఇది కేవలము విరుద్దము. రవంత దెలిసినదానిని దెలుపcగోరి తెలియని దానినిగాఁ జేయుచున్నారు. ఇట్టిక్లిష్ట పరిస్థితుల కుదాహరణములు గొన్ని యిచ్చెదను. మహాకవిశిఖామణియైన వాల్మీకినుండియే యిచ్చె దను. అశోకవనమందుండిన సీతాదేవిని వర్ణించునప్పడు శుక్లపక్షాదియందలి చంద్ర రేఖవలె నున్నదని చెప్పినారు. ఇది తెలిసినది. 'పినద్దాం ధూమాజాలేన శిఖామివ విభావసో అని మఱియుఁ జెప్పినారు. ఇదికూడ దెలిసినది. కాని "స్మృతీమివ సుసందిగ్జాం కీర్తిం నిపతితా మివ, నిహతామివ ఛ శ్రద్ధా మాశాం ప్రతిహతామివ. బుద్దిం సకలుషామివ" యని యనేకము లయిన యంతరావస్థల నుపములుగా జేసినారు. సందిగ్ధమైన స్మృతివలె, నిపతితమైన కీర్తివలె, నిహతమైన శ్రద్దవలె, ప్రతిహతమైన యాశవలెఁ, గలుషమైనబుద్దివలె సీతాదేవి యున్నదని జెప్పటవలన సీతను గూర్చి తెలియకపోవుటయే కాక తెలియని యవస్థానభేదము లెన్నియో మనపైఁ బడినవి. ఈపద్దతి సమంజసము కాదేమో? కాని యావాల్మీకి తిరుగబడి 'నాపుస్త కము నిన్నుఁ జదువు మన్నవాఁ డెవcడు? నీకుఁ దెలియుట కొఱకే నేను కవిత్వము చెప్పవలయునా? ఒకనికిఁ దెలియుట యనునది కవితోద్దేశమా? నాయుత్సాహము కొలఁది నాయిష్టమువచ్చినట్టు నాసంతోషము కొఱకైనా కొఱకే పాడుకొంటి’ నని మనల ధిక్కరించు నెడల మనము కొంతసేపటి వఱకు మూఁగలమైయుండవలసివచ్చునేమో? వాల్మీకి మహర్షి చెప్పిన యధిక్షేపణము నిజమే. మామిడిచిగురువగరున జీరవదలినకంఠముతోఁ గలకంఠ మెవనికొఱకుఁ బాడుచున్నది? మధుపాన మొనర్చి పాడు తుమ్మెద నీవు వినుటకే పాడుచున్నదా? ప్రకృతి జ్ఞానాస్వాదమున మత్తిల్లి మైమఱచి వినువారు లేకున్నను వ్రాయు వారు లేకున్నను నాత్మసంతోషము కొఱ కానందగీతములను బాడు గాయకశిఖామణి కవి.

"అభ్రకం రనసిందూరం గంధకం టంకణం సమ" మ్మనుయోగము ననుసరించి యాయావస్తువులను గలిపి సింధూర భూషణమును జేయు వైద్యునివలె, వివిధములయిన రంగులను చిత్రచిత్రములగు పాళ్లతోఁ గలపి యొకవింతరంగును చేయుచిత్రకారునివలె రామాశుగ సన్నిభమైన దృష్టిని బదునాల్గు భువనము లొక్కవిసరున ముందునకు వెనుకకుఁ బఱపి సర్వవస్తుజాలమును బరిశీలించీ యావస్తువులలో దేనిదేని నేయేవిధములుగా గలసిని బాగుగా నుండునో యోజించి యట్టు కలపి నూతన వస్తువుగఁ జేసి వాని నుంచుటకుఁ దావు, వాని బిలుచు టకుcబేరుకల్పించి వానిని వాగ్రూపములగు ప్రతిమలను జేసి మనయోదుటఁ బెట్టఁగలద్వితీయద్వితీయ సృష్టికళా బ్రహ్మయగు నాతండు కవి.

కవి పిచ్చివాఁడనుమాట సత్యమే. ఎట్టిపిచ్చిలో నేమాత్రమైన వెగటును లేదో, యెట్టిపిచ్చి జగదుద్దరణపట్టిష్టమో, యెట్టిపిచ్చిలో జ్ఞానవిజ్ఞానములు దుర్నిరీకమైన తేజస్సుతో వెల్గునో, యెట్టవెజ్జీకి వేయి విధములు గాక, కోటి విధములైనను బరమార్డగ్రహణ విధానమున నొక్కటే విధము గలదో, యెట్టి వైజ్డ్ వెల్దులన్నింటికంటె వెక్టిదో, యట్టి వెఱ్ఱని, నట్ట లోకాతీతయెన వెణ్ణిని, నట్టి వెల్ద్ లేని వెఱ్ఱఁ గలిగే తాను ధన్యుడై ధన్యముజేయు నాతండు కవి.

ఆ. మల్లెపూవుఁ దూeటీ మధుపంబుతోఁ బాడి
గంధవాహుతోడc గలసి వీచి
యబ్దిలోన మునిఁగి గలసి వీచి
యబ్లిలోన మునిఁగి యార్వవహ్నిని గ్రాంగి
నీటిబుగ్గ యగుచు నింగిఁ బ్రాంకీ
తోఁక చుక్కతోడ డీకొని శ్రమంజెంది
సాంద్య రాగనదిని స్నానమాడి
తనువునిండ నింద్రధనుసురంగులు పూసి
కైరవాపుసుధను గైపుఁ జెంది
గోళగానరుతికి మేళవింపుగం బాడి
పాడి యూడి పాడి యూడి సోలి
భావనామహత్వపటిమను బ్రహ్మమై
పోవుకవికిం గోటిమ్రొక్కు లిడుదు.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః