సాక్షి మూడవ సంపుటం/అత్యద్భుత స్వప్నము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

24. అత్యద్భుత స్వప్నము

తాజ్‌మహల్ చూసిననాటి రాత్రి వచ్చిన కలను జంఘాలశాస్త్రి చెపుతున్నాడు.

షాజహాన్, ముమ్‌తాజ్ కలిసి అంతఃవురంలో వుండగా ఒక బంగారు చువ్వలాంటి ఒక స్త్రీ మేలి ముసుగు వేసుకుని అక్కడికి వచ్చింది. ముం తాజ్ ఆమె ఎవరని, షాజహాన్‌ను ఎక్కదీసింది. ఆమెను తాను వివాహమాడినట్టు, చక్రవర్తి నెమ్మదిగా వెల్లడించాడు. ముమ్‌తాజ్ వెంటనే కోపాన్ని వెనక్కినెట్టి ఆమెను 'చెల్లెలి'గా మన్నించింది. ఆ స్త్రీ పేరు కిన్నెత్.

చక్రవర్తి ఆ స్త్రీ, ఆ స్త్రీ అంతఃపురానికి వెళ్ళాక, ముమ్‌తాజ్ తన అసూయ వెళ్లగ్రక్కింది. కిన్నెత్‌ను అంతం చెయ్యడానికి పెద్దకుట్ర పన్నింది. ఈ కుట్రలో రోషనార కూడా ప్రముఖపాత్ర వహించింది.

కిన్నెత్, చక్రవర్తి కలిసి పక్కపై దిండు మీద ఒక లేఖ చక్రవర్తి కంటపడింది. ఆ లేఖను చక్రవర్తి చదివిన క్షణంలో కిన్నెత్ లోపలకు వెళ్లింది.

ఆ లేఖ సారాంశం ఏమంటే, కిన్నెత్ కులట అని-ఆ అంతఃపురంలో వున్న యాకుతీ స్త్రీ కాదని పురుషుడని కిన్నెత్ ప్రియుడని -

చక్రవర్తికి దారుణంగా కోపం వచ్చి కిన్నెత్‌ను చంపివేద్దామను కున్నాడు గాని, నిగ్రహించుకుని, కిన్నెత్‌నే నిజం చెప్పమని అడిగాడు. ఆమె తన శీలం నిప్పువంటిదని చెప్పింది. యాకుతీ చెప్పిన సాక్ష్యం వల్ల తన కుటుంబం వాళ్లు కిన్నత్‌కు ఎంత వ్యతిరేకంగా వున్నారో తెలిసింది. చక్రవర్తి కిన్నెత్ శీలవతేనని నమ్మిన అనంతరం, ఆమె అక్కడి కక్కడే అల్లాను తలుచుకుని తల పగలు కొట్టుకొని చనిపోయింది. షాజహాన్ మనస్సు కలిగిపోయింది.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:

తాజ్‌మహలు చూచినరాత్రి నాకుఁ గలిగిన స్వప్నమును జెప్పెదనని క్రిందటిసారి చెప్పితిని. ఇప్పడ దానిని గూర్చి చెప్పెదను. స్వప్నమిట్టుండెను. షాజహాన్ చక్రవర్తి మం తాజ్ ను బతిమాలు కొనుచున్నాఁడు. మూటకంటె నెక్కువ పనికిరాదని యామె యనుచున్నది. ఆసెలవును బొంది ముద్దు పెట్టుకొనుట కాతండుపక్రమించినాఁడు, ఏక్ దో, ఏక్దో, ఔర్ ఏక్ ఔర్ దో, ఫిర్ ఏక్, ఫిర్ దో దోయనుచు మూడన్న అంకె నోటి వెంటఁ బలుకకుండ మూడువందల ముద్దులు టపాకచ్చేరిలో ముద్రల వలె నామెమాతిపై పెడిపెడి ముద్రించినాడు. అన్ని ముద్దులు పెట్టుకొనుట కాచక్రవర్ తికెంత ప్రేమయో. ఇన్ని మూతినొక్కుల నుభవించుట కాయమ్మ కెంతయోపికయో యని తెల్లబోయితిని. మూడుకంటె నెక్కువ పనికిరాదన్నప్పడే యింతకుంభవృష్టి కురిపించిన యయ్యవారు నీయిష్టము వచ్చినన్ని పెట్టుకొనవచ్చునని చెప్పి, “సర్వదుంబాల' చీట నిచ్చినయెడల పుష్కలావర్తకములు తెగి పడి జలప్రళయము చేయునట్టు ముద్దుపెట్టుకొ నుచు గాబోలు నని ననుకొంటుమి.

ఇంతలో బంగారు శలాకవంటి యొక చక్కని కాంత యెచ్చటి నుండియో గాని యచ్చటకు మేలిముసుంగుతో వచ్చెను. “నీవెవతెవు? ఇటు కేలవచ్చితివి" అని ముమ్తాజ్ ఆమెను గద్దించెను. 'ప్రియురాలా! ఆమెను బెదరగొట్టకుము నిన్నుఁ జూచుటకే గడగడలా డుచున్నది. నీవు నన్నేలిన యామెనుగూడ నేలికొనుము. నీకు సర్వతా విధేయురాలు' అని చక్రవర్తి మమ్తాజ్తో క్రొత్తయువతిని గూర్చి చెప్పెను. 'ప్రాణనాయకా! నీవు చెప్పిన మాటలలో నొక యక్షరమైన నాకుఁ దెలియలేదు. ఆమె యొవతె? ఇక్కడ కెందులకు వచ్చినది? నా యంతః పురములోనికి నాసెలవులేకుండ వచ్చుట కామెకేమి యధికార మున్న దని ముంతాజ్ తీవ్రపడెను. వారి కిట్టు సంభాషణ జరిగెను.

షా:- ప్రాణప్రియా! నీదర్శన మామెకు లభింపఁజేసి నిన్నామెపై సర్వాధికారిణిగ జేయుటకు నేనే యామె నిక్కడకు రమ్మంటిని.

ముంతాజ్ - ఏమీ! నేను లేనప్పడు నీ వీపడుచుకుర్రదానితో నేల మాటలాడితివి? మీకు మాటలు జరుగుటా! అది నీకు నచ్చుటా! నీవు దానిపై నిష్టపడుటా! దానిని నాయంతఃపురము లోనికి రమ్మని నీవు రహస్యపుమాట చెప్పటా! అది య చ్చటికి వచ్చుటా! నాయెదుటచే నీవు దానిచర్యను సమర్ధించుటా! అని నాకుఁ గూడ నీకైనయట్టే యిష్టపదార్థమగుటకు నీవు నన్ను బతిమాలుటా! నాకను బ్రామి యింతచర్య జరిగించితివా? దానిని నా యంతఃపురములోని కేల రమ్మంటివి? ఈయంతఃపురము నుండి నన్ను వెడలఁ గొట్టి యామె నిచ్చట సింగారింపఁ దలచితివా? నేను లేచిపోవుదును.

(ముంతాజ్ లేచి పోబోవును.)

షా:-(ఆమెకాళ్లపైఁబడి) నన్ను కమింపుము. నావలనఁదప్ప గలిగినది. మించిపోయి నదాని కేమిచేయఁగలము? నే నామె నాకస్మికముగఁ బైయూరఁ గాంచి “నాయొద్దకు వచ్చునెడల బదివేల అషరఫీ లిచ్చెదనని వార్త నంపితిని. "ఊరివారిసాలైన తొత్తు ననుకొంటవా? పదివేల అషరఫీ లిచ్చిననైన నేను నీ మొగమువంకఁ జూతునా? నాకు నాల్గషరఫీల యలంకారములైన నీయకుండ నన్ను వివాహము చేసికొనునెడల నా కంగీకారము” అని యామె తిరుగ వార్త నం పెను.

ముంతాజ్:- ఆ! ఆ! అంతవఱకు వచ్చినది? వివాహము చేసికొంటివా! చేసికొంటివా! షాజ:- క్షమింపుము. క్షమింపుము. చేసికొంటిని.

ముంతాజ్ - ఐనది కదా. నీ వుంచుకొన్నదానిని నాయొద్దకు దెచ్చితివేమో యని నే నంత తీవరించితిని. ఇంకనేమి! నీయెడల నామెకును నాకుఁ గూడ, సమానమైన హక్కేకదా? ప్రాణనాథా! లెమ్ము! మనశాస్త్ర, మంగీకరించిన పనిని చేసితిని. కాని నీవు తప్పచేయలేదే? చెల్లెలా? ఇటు రమ్మ, (కౌఁగిలించుకొనును.) మన మొక్కతల్లిబిడ్డల వలెఁ గాలక్షేపము చేయుదము. నీ యిష్టము వచ్చినప్పడు నీ విక్కడకు రావచ్చును. నాకు వీలగు నెడల నేను నీ యంతఃపురమునకు వత్తును. ప్రాణనాథా! నీవు నీ క్రొత్తపెండ్లి కూఁతును గౌగిలించి యుండఁగాఁ జూచియుండలేదు. కావున నా చెల్లెలిని నాయెదుట గౌంగలించు కొనుము.

షా:— అక్క చెల్లెండ్ర నిద్దరి నొక్కసారి కౌగలించు కొనుటకు, రెండు బాహువులుండ వేరువేరుగఁ గౌంగలించు కొనుట తప్పకాదా? (ఇద్దరను గౌంగలించును.)

ఇంతలో లోనిగదిలో నుండి యొక రవంత కీచుగొంతుకధ్వని యయ్యెను.

ముంతాజ్:- రోషనార్ నన్ను బిలుచుచున్నది. నేను లోనికిఁ బోవుదును. చెల్లెలికిఁ బ్రశస్తమైన అంతఃపుర మీయక తప్పదు. నోటివెంట మాటయైన నెఱుఁగని ముద్దరాలు. ఆమెను జూడ నాకు జాలియగుచున్నది. మీవంటి ముసలి తొక్కుదొరుకుట యామె దురదృష్టము. కాని పడుచు ప్రాయపు పసలచే బెసంగకుండ గసిమసపు బంగారు బొమ్మ ప్రక్కలోని కమరుట నీ మహాదృష్టమే కదా? ఆడుదానికర్మ మెట్టయిన సరే మగవాఁడు సుఖపడినఁ జాలును కదా. (షాజహాను లెంపపై బరిహాసముగఁ గొట్టును. లోనికిఁ బోవుదును.)

షాజ:- మే మిక్కడ నెందులకు? మేముగూడఁ బోయెదము. (షాజహాను, క్రొత్త పెండ్లికూతురు పోవుదురు.)

ముంతా:- ఇద్దరు గూడఁ బోవుదురా? నే నీముండను దెల్లవాఱకుండ బరాభవించి చంపింపనా? అంతేకాని వీరిని గాంపురముచేయ నిచ్చెదనా? ఈ పెండ్డిసంగతి నాకు పదిహేనురోజుల క్రిందటనే తెలిసినది. రోషనార్ యీసరికి తగిన మాయ పన్నియే యుండును. రోషనార్ (అని పిలుచును) (రోషనార్ ప్రవేశించి) మీకు జరిగిన సంభాషణ వింటిని. ఈమె నీరాత్రి చంపించుట కేర్పాటు చేయించితిని. నీవు విచారము వదలుము. రమ్ము లోనికిఁ బోవుదము. సంగతులన్నియు వివరముగాఁ జెప్పెదను.

ముంతాజ్ - కాని నాపేరు మాత్రము పైకి రాంగూడదు సుమా.

రోష:- రానేరదు. వచ్చినను మరేమియు దొందరలేదు. లోనికి రమ్ము. (ఇద్దరు పోవుదురు.)

అంతలో నాస్టలమంతయు గిరగిర దిరిగిన ట్లయ్యెను. నాకుఁ గన్నులు స్వప్నము లోనే చీఁకటులు పడినవి. అంతలో షాజహాను తన నూతన భార్యచెఱగు బట్టుకొని లాగుచున్నాడు. ఈమె పేరు కిన్నెత్.

కిన్నెత్:- అబ్బే! అబ్బే! ఇప్పడుగాదు. పాదుషాసర్కార్ క్షమింపవలెను. నాక్రొత్త దాసి యక్కడనే యున్నది. అదిచూడదా? అదిపైకిఁ బోయి యేవియో తెలివితక్కువమాట లాడకుండునా?

షాజ:- దాని నావలికిఁ బొమ్మని చెప్పము.

కిన్నె-యాకుతీ! ఇటురా! (యాకుతి వచ్చును.)

యాకు:- పర్వద్దిగార్ (పాదుషాకు నమస్కరించును.)

షాజ:- నీ వీగదివెలుపల నేను బిలుచువల కుండుము. (యాకుతి పోవును.)

కిన్నె- నే నొక్కసారి లోనికిఁ బోయి పన్నీరుతెచ్చి మీపై జల్లెదను. (కిన్నెతు పోవును.)

షాజ:-ఈయుత్తర మెవరిదో అది యిచ్చటికి వచ్చుటకుఁ గారణమేమి? (తలగడపై నున్న యుత్తరముందీసి) దిక్కుమాలిన రాజకార్య తంత్రము భార్యయొద్ద దిన్నగం బండుకొ ననైన నీయదుగదా? ఏమి? (జరూరని దీనిపైన వ్రాయబడి యున్నదే. (సీలు విప్పి చూచును.) మంచముమీఁదఁ గూలబడి) అల్లా అల్లా అల్లా హోఅక్బర్ అల్లాహో అక్బర్! ఈగుడిసెవ్రేటిముండ నాపరువు తీసివేసినదే. నన్ను మాయ చేసినదే. మా మొగలాయివంశ మునకుఁ ప్రేగులుదీసి కుక్కలకుఁ బెట్టించెదను. నాయెడల నింతవిశ్వాసఘాతుకురాలై ప్రఎర్తించిన యీ తుచ్చురాలి ప్రేగులను విశ్వాసవంతములైన నాకుక్కలు స్పృశించునా? నా కైజారును వ్యభిచార దోషమున మలిమసమైన యీముండ రక్తమున నపవిత్రము గావించె దనా? నేను దానిని జంపను. దీనిని సంతలోఁ బెట్టించి ఒక్కొక్క యవయవ మొక్కొక్కది నమునఁ గోయించి చిత్రవధఁ జేయించెదను. నేనిప్పడేమియు దెలియనటులే నటింతును. అది చేసిన దోషమును గూర్చి విమర్శింతును. చంపించుట యెంతసేపు? ఏనిముసమున నైనను తలారి చేయఁగలడు. ఆమోస కత్తెయైన ముండ యిటకు వచ్చుచున్నది. నేను జూడనట్టు నటింతును.

పన్నీటిబుడ్డితో వచ్చి కిన్నెత్ షాజహానును వెనుకప్రక్కనుండి కౌగిలించును.

షాజ:-(వెగటుపడి వెంటనే క్రమ్ముకొని) ప్యారీ బైఠీయే? (ఆమె కూరుచుండును) చూడు. వయసు ముదిరినవాని యుబలాటము. తాటాకు మంటవంటిది. రవంత యాలస్య మగునెడల నావాంఛ యంతటితో నశించును. ఇపుడు నీతో రవంత మాటలాడవలసియు న్నది. సరిగ బ్రత్యుత్తర మిచ్చెదవా? జడిసి యసత్య మాడుదువా?

కిన్నె- నా నోటివెంట యింత వఱకు సత్యమేకాని యసత్యమెన్నఁడు రాలేదు. నే నొకరిని జూచి భయపడుటకు నావలన నేమైన దోషమున్నదా? భగవంతుని యెడలఁ గూడ, నేను బుద్దిపూర్వకముగఁ దప్పజేసి యుండలేదు. నీ వెంత మాత్రము సందేహింపక, నీకుఁ దోచినదేదో యడుగుము.

షాజ:- తలాడ పైనున్న యీయుత్తర మెవరు తెచ్చిరి?

కిన్నె- నాక్రొత్తదాసి. ఆది కోటలోనికి వచ్చుచుండంగా, పహిలీ దర్వాజాయొద్ద నెందరో జనులు మూఁగియున్నారట. వారిలో నొక్కడు దానిచేతి కీలేఖ నిచ్చి పాదుషా సర్కారువారి క్రొత్త జనానాలో దాఖలుచేయుమని చెప్పెనట. అట్టుతెచ్చి నాచేతి కివ్వఁబోవఁగా నాభర్తతలాడపై నుంపుమని చెప్పితిని. అది అట్టు చేసినది. నేను మీతో యీ లేఖనుగూర్చి చెప్పఁదలఁచితినిగాని మఱచిపోయితిని. క్షమింప వలెను.

షాజ:- దీనిలోని సంగతులు నీ కేమైనఁ దెలియునా?

కిన్నెత్:- సర్కార్ నాకెట్టు తెలియును?

షా:-ఈ యుత్తరములోని సంగతులు నేనెరుఁగుదును. నాకనుభవములో నున్నవని నీచే ననిపించిన యడల

కిన్నె- అదేమి సర్కార్! నీయుత్తరములోనున్న గూర్చి యేమియుండును? పైవారెవ్వరైన నన్నుఁగూర్చి మీ పేర నేమైన వ్రాసినారని మీ అభిప్రాయమా?

షా:- ఔను. కిన్నె- నే నెఱిఁగిన సంగుతులన్నియు నిర్భయముగాఁ జెప్పెదను.

షా:- నీవు నన్ను వివాహము చేసికొనక పూర్వము నిన్నెవడైనా వలచెనా?

కిన్నె:- ఆ! ఆతనివల వసాధారణమైనదని నేను దృఢముగాఁ బలికెదను. నేను వానిని స్పష్టముగ నిరాకరించితిని. చచ్చెదనని నాకు వార్త నంపినాడు. నీ యిష్టమని తెలియఁ బఱచితిని.

షా:- అంతవలపు గల పడుచువానిని నిరాకరించి నీవు నన్నల చేసికొంటివి?

కిన్నె- అతనియందు నాకు వలపు లేదుగావునఁ జేసికొనలేదు. నీయం దున్నది గాన నిన్ను జేసికొంటిని.

షా:- ఆతడిప్ప డెక్కడ నున్నాఁడు?

కిన్నె- నేను మిమ్ము జేసికొన్నపిమ్మట వెర్రివెర్రి యాసలన్నియు నడుగంటుచే నెక్కడకుఁ బోయెనో, నే నెట్టు చెప్పఁగలను?

షా:- అసత్య మాడుచున్నావు.

కిన్నె- అయ్యో! వాఁడెక్కడ నున్నాండో నా కెట్లు తెలియును?

షా:- ఎక్కడ నున్నాడో తెలియదా? నన్ను జెప్పమందువా? ఎక్కడ నున్నాఁడా, నీయంతఃపురములో నున్నాఁడు, నీ ప్రక్కలో నున్నాఁడు, నీకౌగిట నున్నాడు.

కిన్నె- అట్టున్న యాతండు నామగఁడైన చక్రవర్తియే కాడా?

షాజ:- నీ మగడు కాడు, నీ ఱంకుమగడు. (ఆమె గుండెపై జఱచుచున్నాడు.)

కిన్నె- పాదూషాసర్కార్ ఆగర్భశ్రీమంతుఁడవే, మహాసుకుమారమూర్తివే, అంత దెబ్బ కొట్టంగ, నీచేయి కందిపోదా? వ్రేళ్లు నొప్పలు పెట్టవా? నీవు కేవలము పొరపాటుపడు చున్నావు. నే నాదోషమెరుగను. ఎరుగను. అల్లాహో అక్బర్! నేను దోషసహిత నగు నెడలఁ నన్నుఁ గొట్టుటకు గఱ్ఱలేదా? కఱ్ఱతోఁ బనియే మున్నది? కత్తితో నఱకరాదా? కాని తప్పు నిదానింపుము. తొందరపడకుము. నా కాకస్మికముగఁ గలిగిన స్థితినిబట్టి యనేకులు నాకు వైరు లుందురు.

షా:- నేను సత్యమునే పరిశీలించుచున్నాను. నీ ఱంకుమగని నీయెదుట కిప్పడు బిలిపింతునా? కిన్నె- ఓ! అభ్యంతరమేమి? అట్టు ముఖాముఖిని బెట్టి నిర్ణయింపుము.

షా:- యాకుతీ యని పిలువుము.

కిన్నె-యాకుతీ! (యాకుతీ వచ్చును.)

షా:- చూడు. అటుచూడు. కన్నులు పెట్టుకొని చూడు. వాఁడు నీఱంకుమగడు కాడా? నీవు వచ్చినమరునాఁడే నీ ఱంకుమగని నిచ్చటికిఁ దెచ్చి నాయెదుటనే మీవృత్తిని సాగింపఁ దలచించినారా? నీ దగ్గఱ నుబలాటముతోఁ బండుకొనుట కీగాడిదకొడుకునకు నేను జీతము బత్తెము నలంకారము లెదురీయవలసినదా? నీయిల్లు వల్లకాడుగాను. నామర్యాద నింతయైనఁ జూడ నక్కఱలేదా? వీపుమీఁద గట్టిగఁ గొట్టగ బడిపోవును) యాకుతీ! నీవు మగవాండ వగునా? కాదా? నిన్నెవరు లోనికిఁ బంపినారు? ఈతంత్రమం తయు నీవలన జరిగినది అంతయు సరిగాఁ జెప్పనియెడల నిన్ను జంపుదును. బజానాక్రింద ముందొక తమాంచా తీసికొనుము. అని కొట్టును.

యాకు:- నే నాడుదానను గాను. మగవాడనే.

నేను నీభార్యను గాటముగా వలచితిని. ఒక్కసంవత్సరము నుండి యామెను గాఢముగాఁ బ్రార్థించు చున్నాను. గొంగళి పురుగును జూచిన కంటె, నెక్కువ యసహ్యముగ నన్ను జూచినది. నే నామె యాస నిది వఱకే వదలు కొంటిని. నేను మరియొక గ్రామము పోయి యక్కడ నాకుఁ దగినదానిని, నన్ను వలచినదానిని బెండ్లి చేసికొనవలె నని నిశ్చయించుకొని పోవుచుండంగా, మంతాజ్ గారి యిద్దరుదాసులు నా యొద్దకు వచ్చి నిన్ను జక్రవర్తినిగారు బిలుచు చున్నారనంగా నేను ప్రాణముల నరచేతఁ బెట్టుకొని దాసులవెంటఁ బోయితిని. నాతో వారు చెప్పిన దేమనంగా, చక్రవర్తిగారి క్రొత్త పెండ్లికూతును నీవత్యంతము వలచితివని మేము వినియున్నాము. ఆమె నిన్ను మోసగించి చక్రవర్తిని జేసికొన్నది. నీకు రెండువేల అషరఫీ లిచ్చెదను. ఇదిగో తీసికొనుము నీ వీ యాడు వేసముతోడనే యామెయెద్ద దాసిగా నుండవలయును. నీ కెంత యదృష్టము పట్టునో యెవరు చెప్పఁగ లరు? ఇట్టిమాట లామంతాజ్ గారు పట్టుదలగఁ బలికినను, నే నిష్టపడక యింటకిఁ బోదలఁచితిని. కాని నన్ను వారు నిరోధించి యిక్కడనే బలాత్కారముగ దాసిగా నుంచిరి. మహాప్రభూ! నే నేమి చేయఁగలను? చక్రవర్తీ ఇప్పడు నన్ను బొమ్మనిన నేను సంతోషముగఁ బోవుదును. నాదోషమేమియు లేదు.

షా:- నీకును, గ్రోత్తపెండ్లి గూతునకు నిదివఱకు సంబంధము లేదా?

యా:- లేదు. లేదు.

షా:- ని న్నిట్టు బలాత్కరించి క్రొత్త రాణియొద్ద వారుంచి నారని నీ వీమెతో జెప్పితివా? లేదా?

యా:- చెప్పినయెడల నెగచి తెగనఱకించు నని భయపడితిని. నాస్వరూపము నిప్పడు బాగుగా నిదానించి క్రొత్తరాణియే మీతో జెప్పినది గాబోలును.

షా:- ఆమె చెప్పలేదు. ఈయుత్తరము చెప్పినది. దీనిని నీ కిచ్చినవా రెవరు? యా:- తల్లి సెలవుపైని రోషనార్ నాకిచ్చినది. తా నిచ్చినట్టు చెప్పవలదన్నది.

షా:- ఎవరిచ్చినారని చెప్పవలసినదని నీ వడుగలేదా?

యా:- అడిగితిని. వీథిలోని ప్రజమహజరిచ్చు కొనినారని చెప్పమన్నది. అట్టే నేను కిన్నెత్తుతోఁ జెప్పితిని.

షా:- నీదోషము లేకుండ నీవు చేసికొన్నావు. నీ వుంచుకొన్న ముండదోషము గనపడకుండ సమర్ధించినావు. నాముసలి తనమునకు నీ పడుచు దనముఁ దోడుపఱచి దానిని సుఖపెట్టుటకే నీవు వచ్చితివి. నీతలఁ బగులగొట్టెదను. (చేతికర్రతోఁ దలపై గొట్టఁగ వాడు క్రిందఁ బడిపోవును).

షా:- ఈసంగతి సత్యమో, యసత్యమో? ఎవడు చెప్పఁగలడు. అసత్యమైనప్పడే తరుగని చెరుగని యప్రతిష్ట యైనప్పడు, సత్యమే యైనచో నిఁకఁ జెప్పఁదగిన దేమున్నది. దీనిని జంపించు తంత్రమున మం తాజ్ తో నాకూతులు, వారిదాసులు, వీరిదాసులు, మిగిలిన జనానావారు, వారికొజ్ఞాలు, వీరి కొజ్జాలంద రేకీభవించి నా కెదురు తిరిగినారు. ఇంత కుటుంబ వైరమును సహింపఁగలనా? కడుపునఁ బుట్టినబిడ్డ లుండగా, దిరుగ నిక్కాకు సిద్దపడిన వానిని ముక్క ముక్కలక్రిందఁ గోసినను పాపమున్నదా? నాదోషముచేతనే యింతపని జరిగినది. కిన్నెత్ వలనఁ దప్పన్నదని నాకు నమ్మకములేదు. తప్పలేనిదానిని నెట్టు చంపఁగలను? తప్ప లేనిదానిని అంతఃపురమందే యుంచుకొనుటకు నాభార్యలు సహింపకుండ నున్నారు. నాబిడ్డలే సహింపకుండ నున్నారు. నా ప్రజలు కూడ నా కెదురు దిరిగినారని భయ పెట్టుటకే లేఖను గోటవెలుపలి జనులెవ్వరో యిచ్చిన మహజరని మాయచేసినారు. ఇదియంతయు మమ్తాజ్ మహిమయే కాని మరియొకటి కాదేమో. ఇట్టి మహేంద్రజాల మధ్యమున నేను క్రొత్తరాణిని బెట్టుకొని నిర్వహింపఁగలనా? కావున దీని నెక్కడకైనఁ బొమ్మని చెప్పదును. అక్కడ దీనిసంరక్షణకుఁ దగు నేర్పాటును జేయింతును.

కిన్నెత్- (మూర్చనుండి కొంచెము తెప్పిరిలి) పాదుషా సర్కార్! నే నేదోస మెరుగను. అగ్నివలె పరిశుద్దనైయున్నాను. మంచుగడ్డవలె స్వచ్చనైయున్నాను. నన్ను - రక్షింపుము.

షా:- కిన్నెత్) లేవఁగలవా? లేనియెడల నేను రవంత యూత నిచ్చెదను. లెమ్ము.

కిన్నె- (లేచి) సర్కార్! మీరు నాకొరకుఁ జింతపాలు గావలదు. నామాటలు ఖోరానుమాటలవలె నమ్మవలెను. నేను దోషమేమియు నెరుగను.

షా:- నీ వట్టిదానివే యగుదువు. కాని నీ మీఁద నింత యల్లరియైన పిమ్మట నిన్ను నే నెట్టు నిర్వహింపవచ్చును?

కిన్నె:- ఆడుదానిపై ప్రజలకుఁ దప్పమాటఁ జెప్పకొనుటయే నైజము. బుద్దిమంతు లైన న్యాయాధిపతులు సత్యమును బరిశీలించి నిందలేదని స్పష్టపరుపవలెను గాని ప్రజలకు జడియుదురా? నన్ను మీరు న్యాయసభలోఁ బెట్టి బహిరంగముగ విచారించి, నాకు న్యాయము దయచేయుడు. షా- మరియొకరి తప్పయిన యెడల నట్టు చేయదగినదే. కాని పాదుషానైనా నాయింటిలోని జంకుగాదా? నేను ఫిర్యాదినా? నా దాసులు సాక్షులా? ఇది చాలతప్ప గాదా? అదిగాక యీతంత్రమున నాకుఁ గావలసిన వారందరు చిక్కుకొని యున్నారు, నాప్రతిష్ట నాప్రాణము, నామానము పోదగిన తంత్రము సిద్దించినది.

కిన్నె:- ఇది తంత్రమేకాని, సత్యముకాదని మీరొప్పకొందురా?

షా:- ఒప్పకొంటని.

కిన్నె:- ఒప్పకొంటివా? సంతోషమే. అటులైన న న్నేమి చేయుమంటివి.

షా:- నీయిష్టము వచ్చినచోటికి నీవు బొమ్ము.

కిన్నె- పాదుషా! నేను నిర్దోషినైన నీ భార్యనని నీవు పలికితివి. నా కంతియే చాలును. నేను నీ సెలవు ప్రకారము నాయిష్టము వచ్చినచోటికిఁ బోవుదును. నాకు సెలవా? అల్లాహో అగ్బర్ అల్లాహో అగ్బర్ అల్లాహో అగ్బర్ (పాదుషాకు సాష్ట్రాంగపడి) బిస్ మిల్లా! బిన్ మిల్లా (యని తల బళ్లుమని నేల గొట్టుకొనినది.)

షా:- ఆ! ఆ! ఎంత ప్రమాదము. యాకుతీ! ఆమెతలకు దెబ్బ తగిలినది. ఎట్టు రక్తము ప్రవహించుచున్నదో, మంచముమీఁద నిమ్మళముగఁ బరుండ బెట్టెదము. రవంత సాయము చేయుదువా?

యా:- పాదుషా సర్కార్! ఆమె పార్సా (మహాపతివ్రత) ఆమెను నే నంటుదునా?

షా:- అటులైనఁ బరుగెత్తుకొనిపోయి దాసులను హుజూర్ తబీమ్ను (వైద్యుడు) బిలుచుకొని రా?

(యాకుతి బోవును.)

షా- అల్లా అల్లా ఎంతసని జరిగినది. ముసలితనమున వీర్యవృద్దికొరకు హల్వాలను మ్రింగి నల్లమందు మొదలగు నిషాపదార్ధముల నెక్కించి, ఉద్రేకమును బుట్టించు కథలను విని, ప్రదర్శనములను గాంచి, కనబడి కాంతావాంఛను తీర్చికొనుటకై యీ పడుచు బంగారుబొమ్మ బ్రదుకు భ్రష్టమొనర్చితిని. అయ్యయ్యో! ప్యారీ! వెళ్లిపోయితివా! (మొగమున గుడ్డవైచుకొని హా! యని యఱచుచు నావలికిఁ బోయెను.)

ఆతని హాహాకారముతో మేల్కాంచితిని, ఇక్కడికి స్వప్నము సరి.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.