వీరభద్ర విజయము/ద్వితీయాశ్వాసము/హిమవంతుడు తన యింటికి గూతుం గొనిపోవుట
స్వరూపం
హిమవంతుడు తన యింటికి గూతుం గొనిపోవుట
163-శా.
అంతన్ గొండలరాజు నెమ్మనములో నా వార్త యాలించి వే
సంతాపంబునఁ జిన్నవోయి చని తా సర్వేశ్వరుం గాన క
త్యంతాదోళవిచార యైన తనయ న్దా వేగఁ గొంపోయె న
క్కాంతారత్నము తండ్రి దోకొని చనంగా నేఁగె శీతాద్రికిన్.
164-క.
ప్రమదంబునఁ దలిదండ్రులు
కమలాక్షిఁ జెలుల నిచ్చి గౌరతసేయం
హిమవంతు పట్టణంబునఁ
గమలానన గౌరి కొంతకాలము గడపెన్.
165-వ.
అంత నొక్కనాఁడు పరమేశ్వరుండు కైలాసంబున సుఖంబుండి గౌరీ దేవిం దలంచి ప్రేమచేసి యుండు టెఱింగి నిజాంతర్గతంబున.