వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/హిమవంతుఁడు కన్యాదానము చేయుట

వికీసోర్స్ నుండి


హిమవంతుఁడు కన్యాదానము చేయుట.

179-క.
తెర వాసిన సమయంబునఁ
బరమేశ్వరుఁ జూడవమ్మ బాలిక యనుచున్
గిరిరాజు మంతనంబునఁ
దరళాక్షికి హైమవతికిఁ దా వినిపించెన్.
180-వ.
అంత.
181-శా.
కన్యాదానము చేనెఁ బర్వతుఁడు గంగామౌళికిన్ లగ్న మా
సన్నం బైన సురేంద్రమంత్రి కణఁకన్ సర్వంబు సంసిధ్ధమై
జెన్నారం సుముహూర్త మన్నఁ దెరవాసెన్ మ్రోసె వాద్యంబు ల
న్యోన్యాలోకన మయ్యె దంపతులకున్ మోహానురాగంబునన్.
182-క.
దేవర పదపద్మంబులు
దేవియు మణిపూజ చేసె దృగ్ధీప్తులచేన్
దేవీవిలాస వననిధి
బావుగ నోలాడఁ జొచ్చె భవు చూడ్కుల దాన్.
183-శా.
లీలన్ బార్వతి సేసలన్ శివుని మౌళిన్ బోసెఁ దాఁ గోరికల్
కేలిం దోయిటఁ బట్టి శంకరునిపైఁ గీలించెనో నాఁగ న
వ్వేళన్ సత్కృప దోయిలించి సతిపై విశ్వేశ్వరుం డిచ్చె నాఁ
బోలన్ శంభుఁడు ప్రాలుపోసెఁ దలపైఁ బూర్ణేందుబింబాస్యకున్.
184-శా.
దేవాదిదేవుండు తెఱఁగొప్ప నంతలో
సతివామహస్తంబు చక్కఁ బట్టి
పెద్దింటిలోనుండి పెంపారఁగాఁ బెండ్లి
యరుఁగుమీఁదికి వచ్చి యర్ధితోడ
బహురత్న పీఠంబుపై నొప్ప వేంచేసి
కమలజన్ముఁడు యాజకంబు సేయ
వేదోక్తవిధిని బ్రవేశహోమము చేసి
వెలుపటి కన్యఁ దాపలికిఁ దెచ్చి
ఆ.
యొనర లాజకాదిహోమంబుఁ గావించి
మఱియుఁ దగిన కృత్యముల నొనర్చి
సకలలోకభర్త శంభుండు ముదముతో
నచలవృత్తి నున్న యవసరమున.