Jump to content

వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/ఆశ్వాసాంతము

వికీసోర్స్ నుండి


ఆశ్వాసాంతము

265-మత్త.
నాగవాహనరంజనా! మదనాగవిద్విషభంజనా!
నాగదానవఖండనా! మునినాథ సాగరషుండనా!
యోగిరాజనమానచిత్త పయోజ షట్పద వేషణా!
నాగభూషితభూషణా! శరణాగతామరపోషణా!
266-క.
శ్రీనీలరుచిర కంధర!
మానిత త్రిపురాంబురాశి మందర! గౌరీ
పీనపయోధరయుగళ
స్థానపరీరంభమోదసంరంభ! శివా!
267-మా.
కమలనయనబాణా! ప్రస్ఫురత్పంచబాణా!
యమితగుణకలాపా! యచ్యుతానందరూపా!
విమలకమలనేత్రా! విశ్వతంత్త్రెకసూత్రా!
ప్రమథనుతగభీరా! పార్వతీచిత్తచోరా!
268-గ.
ఇది శ్రీ మన్మహేశ్వర యివటూఠి సోమనారాథ్యా దివ్య శ్రీపాదపద్మారాధక కేసనామాత్యపుత్త్ర పోతయనామధేయ ప్రణీతంబైన శ్రీవిరభద్రవిజయం బను మహాపురాణ కథ యందు మహాదేవు పంపున మునులు వోయి; ముద్రారోపణంబు చేసి వచ్చుటయు; హరి విరించ్యాది బృందారక సేవితుం డై యీశ్వరుండు వివాహంబునకుం జనుటయు; హిమ నగేంద్రుని మహోత్సవంబున భూమిక్రుంగిన శంభుపంపునం గుంభజుం డరిగిన నత్యంత సమతలం బై యుండుటయును; గౌరీవివాహంబును; భవానీశంకర సంవాదంబును; దేవ దాన వోద్యోగంబును; కాలకూట సంభవంబును; దానిఁ బరమేశ్వరుండు పరహితార్థం బై యుపసంహరించి నీలకంఠుండ నైతి
నని యానతిచ్చుటయు; నన్నది తృతీయాశ్వాసము.