వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/అశ్వాశాంతము
అశ్వాశాంతము
232-లగ్రా.
శంకర! హలాహలభయంకర! పినాకధర!
కింకర దిగీశ! యకళంకతరమూర్తీ!
పంకజభవాభినుత! పంకజభవాండభవ!
సంకలితదైత్యకులసంకట! సుథాప
ర్యంకనుతనాగకరకంకణవిరాజితక
ళంక! గిరిజాకుచశుభాంకపరివిలస
త్పంకితనితాంత పులకాంకిత యురస్థ్సలమృ
గాంకశతకోటినిభ! పంకజదళాక్షా!
233-క.
త్రిపురాటవీ ధనంజయ!
త్రిపురాసుర ఘోరశైల దేవాధిపతీ!
త్రిపురాంబుధి బడబానల!
విపులదయాంభోధిచంద్ర! విశ్వస్తుత్యా!
234-మాలిని.
అఖిలభువనపాలా! హస్తకాంత త్రిశూలా!
శిఖినయనలలాటా! శీతధామార్ధజూటా!
నిఖిలనిగమసంగా! నిర్వికారాంతరంగా!
మఖసమయవిజృంభా! మంగళస్పూర్తిధామా!
235-గ.
ఇది శ్రీమన్నహామహేశ్వర యివటూరిసోమనారాధ్య దివ్వశ్రీ పాదపద్మారాధక కేసనామాత్యపుత్త్ర పోతయనామధేయ ప్రణీతంబైన శ్రీవీరభద్రవిజయం బను మహాపురాణ కథ యందు దక్షుయాగంబును, దధీచివివాదంబును, దేవతల పరాజయంబును, వనజనయన వనజభవ ప్రముఖలు మహేశ్వరుని స్తుతించుటయు, వారల మహేశ్వరుండు కరుణించుటయు నన్నది సర్వంబును జతుర్థాశ్వాసము.
వీరభద్రవిజయము
సంపూర్ణము