వీరభద్ర విజయము/ఉపశృతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉపశృతి[మార్చు]

229-మత్త.
రాజచందన కుంద శంఖ మరాళ హీర పటీర వి
భ్రాజితాంగ! మునీంద్రమానసపద్మహంస! రమాంగనా
రాజనాయక! ధారుణీధరరాజనందననాయకా!
రాజరాజమనస్సరోజవిరాజితాంబుజనాయకా!
230-మాలినీ.
నిగమభువనదీపా! నిర్మలానందరూపా!
యగణితగుణధీరా! యప్రతర్క్యప్రకారా!
గగనజలధిహారా! ఖండరాజద్విహారా!
యువతిమదనమూర్తీ! యోగిహృద్యాంతవర్తీ!
231-గ.
ఇది శ్రీమన్మహామహేశ్వర యివటూరి సోమనారాధ్య దివ్యశ్రీ పాదప ద్మారాధక కేసనామాత్యపుత్ర పోతయనామధేయ ప్రణీతంబైన వీరభద్ర విజయం బను మహా పురాణకథ యందు దేవేంద్రాది దేవగణంబులు శివుని సందర్శనంబు సేయుటయు దక్షయాగంబును దాక్షాయణి నారదు వలన విని శంభుని కెఱింగించుటయు శంభుండు పనుప దివ్యరథా రూఢ యై పార్వతీదేవి దక్షు నింటికి వచ్చుటయు దక్షుఁడు సేయు శివనింద వినఁజాలక య మ్మహాదేవి దేహంబు దొఱఁగుటయు హిమవంతునికిఁ గుమారియై శాంకరి పొడచూపుటయు తదీయ తపో మహత్త్వంబును నగజ శివునకుఁ బరిచర్యలు సేయుటయు నన్నది ప్రథమాశ్వాసము.
- x -