భారత రమణి/రెండవ అంకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf

రెం డ వ అం క ము

         మొదటి రంగము
(దేవేంద్రునిల్లు-దేవేంద్రుడు,సదానందుడు.)

దేవే--కేదారున కొక నెల కైదువిధింపబడునా?

సదా--అంతవరకు రాదు.పది పదిహేను రూపాయిలు జరిమానా పడవచ్చును ఐననేమి ? కేదారు డద్బుత వ్యక్తి సుమా!

దేవే--ఏల ?

సదా--'నీవు కొట్టితివా? అని న్యాయాధికారి అడుగ 'గట్టిగా కొట్టితిని ' అనెను. 'దానికి నీవుచింతింతువా?' అని యడుగ 'ఎంతమాత్రమూ చింతింపను; వీలున్నచో ఇంకొక సారి చితగగొట్టెదన ' నెను.

దేవే--పాపము! అతనికి నామూలమున కైదయ్యెను. నేను నాకూతురుని జంపుటకు కత్తినెత్త ఆవ్రేటుకు కేదారుడు తన వక్షమున కొనెను. తండ్రికి బలికాకుండ తనయును తప్పించెను.

62

[అం

భారత రమణి

సదా--నేడు నీవు కచీరికి పోదువా?

దెవే--పాపము! నాకై జెయిలులో పడినాడు.

సదా--మీచిన్నపల్లకు జ్వర మెట్టున్నది?

దేవే-- నా కొఱకు నాకూతురినైనా- నేను తండ్రిని ఓహో!....

సదా--వైద్యుడు వచ్చెనా?

దేవే-- ఆహా! సంఘమా!

సదా--అట్లు చూచెద వేమి?

దేవే--మంచి సంఘమే, సదానందా, మనలో నిరుపేదలకు స్త్రీసంతాన మేలకల్గునో ఎరుగుదువా? పాడువడిన ఈ బజారున పరమపూత లేల అవతరింతురు? వారి దోషమేమి?

సదా--దేవేంద్రా ! సమాజమును నిందింతువేల? దోషము దానిగి కాదు. నీది.. చదువు ముగియకుండగనే నీ నేల పెళ్లియాడితివి?

దేవే-- మాతండ్రిగారు ఛేసిరి.

సదా-- సరే, తండ్రి తప్పునకు తనయుడు దండింపబడును. ఇది క్రొత్త కాదు.

దేవే-- ఆ ఈ త ప్పాతనిది కాదు. పెళ్లివిషయమున కనుకొమ్మని ఆయన మా అమ్మతో చెప్పెను. మాయమ్మ నన్నడుగ నే నంగీకార సూచనముగ తల యూచితిని. నాకు బాగుగ జ్ఞప్తియున్నది. ఆ దినములలో వివాహమను సందన

రం 1]

63

భారత రమణి

వనమున పారిజాతములే పూచుచుండు ననియు,సురభిస్నగ్ద మలయవనము లెప్పుడు వీచుచుండు ననియు, కోకిలలు గానము సేయుచుండు ననియు, ఎంచుచుంటిని, కాని ఇట్టి విషఫలముల నాస్వాదింపవలయునని కలనైన తలపలేదు. ఇప్పుడు సంసారమను వలలో చిక్కుకొంటిని; చిక్కులను విప్పినకొలది చిక్కము బిగియుచున్నది. తప్పించుకొను దారి తట్టుటలేదు. దరిదాపు కానరాకున్నవి. సదానందా, ఏది నెరవు?

సదా-- మొన్నొకనాడు చెప్పితినే.

దేవే--ధైర్యము చిక్కదాయె. ఏల?....ఆ! నేను పురుషుడను కానా?.... కాదు...విడెచద.... నిశ్చయించుకొంటిని. తెంచి వైచెదను.

సదా--దేనిని?

దేవే-- చేతికి చిక్కితిని కదా అని చెంపలు వాయించు చున్నది...బాధ మిక్కుట మగుచున్నది. ఇక భరించలేను.

సదా--ఏమిది దేవేంద్రా, అట్లనుచుంటివి?

దేవే-- సదానందా, నిన్నొకటియాచింతు, ఇచ్చెదవా?

సదా--ఏమి కావలయునో అడుగుము, సంకోచము వలదు. ఇన్నాళ్ళనుండి నాతో మెలగుచుల్న్నను నా నైజ మెగుగలేకుంటివి. నా సంపదలో సగమడిగినను సంసముతో ఇచ్చెద ఇదివర కొసగనందుకు హేతువిది. నీవు నన్నడుగ లేదు. ఒకసారి అడిగిచూడు.

64

[అం 2

భారత రమణి

దేవే--నీవు నాకు ధన మీయ నక్కరలేదు. దాని కన్న విలువగల పదార్ధ మడిగెదను. నీ కుమారుని నాకిచ్చి నాకుమార్తెను నీవు కొనుము.

సదా--నీవునోరువిడిచి అడిగినది. నా చేతిలోనిది కాదు. నాకుమారుంహి వివాహము వాని ఇష్టముపై నున్నది.

దేవే--నీకుమారుని కిది సమ్మతమని నేనెరుగుదు

సదా--అట్లైన నేటి నుండియు నీకూతురు నాకోడలు.

దేవే-- ఇప్పుడు నీ వింటికేగుము. నేను మనసు దిట్టము చేసుకొనదను.

(సదానందుడు పోవును, ఉపేంద్రుడు వచును)

ఉపే-- దేవేంద్రా ! ఆ విషయమున నేమి నిశ్చయించితివి?

దేవే-- అన్నా ! సుశీలను సదానందుని తనయున కిచ్చి పెండ్లి చేసెదను. ఇక ఆ విషయమున చింత లేదు.

ఉపే--అయ్యో ! అయో ! నీకు మతి పోయినదా ఏమి?

దేవే--ఔనుకాబోలు.

ఉపే--సంఘము?

దేవే--విడిచెద.

ఉపే-- సోదరా! నీ కుమారిక యోగ క్షేమముల నారయు పూచీ నీయందున్నది. నీవు సనాతనధర్మమునువిలువ బెట్టినచో నందఱకును మేలొనగూడును. ఈ పురాతన

రం 1]

65

భారత రమణి

దేవే-- పురాతనమే కానిమ్ము ఈపాడు సమాజము నకై నాసౌఖ్యమంతయు త్యజించి నేను దానికి దాసుడనగు టకు అది నాకొనర్చిన మేలేద్ది? సంఘము నాకొక కాసైన నొసగదే? పైపెచ్చు నాపై కార్యభారము మోపియే యున్నది. సనాతన ధర్మముల శాసించునాడు ఒకనికి కష్టము ఘటిల్లిన పదిమందియు దానిని పంచుకొను చుండెడివారు. ఇప్పుడో ఒకడు చచ్చుచున్నను ఇరుగు పొరుగువారు వాని వైపు తొంగి చూడరు. ఇట్టి నిర్మమసమాజ ముండిన నేమి? మండిన నేమి?

ఉపే-- తమ్ముడా, స్వార్ధమును త్యజింపవలయు,,, స్వార్ధత్యాగ మెంత సుందరము ! ఎంత మధురము! ఆహా! నేను తద్ధర్మము నాచరించు చుంటిని. బడాయి కొట్టను. ఆ ప్రయత్నముననే మగ్నుడనై యున్నాను. నారాయణ ! గోవిందా ! గోవిందా !

దేవే--(నవ్వి) స్వార్ధత్యాగ మొనర్చుమంటివి. దేనికొఱకు? ఈ సంఘమును కొఱకా! పోనీ నాసుఖము నాకొమార్తె సుఖమును సంఘమున కర్పింతు ననుకో. అంతటితో దీనికడుపు నిండునా? తినుచున్నకొలది దీనికి తనివితీరకున్నదే. పొట్ట పెరిగిపోవుచున్నదే కాని దీని ఆకలి అణగుట లేదు. దీని అత్యాచారము ఉచ్చృంఖలమై పెచ్చుపెరుగుచున్నది..... నేను దీనిని మన్నింప జాలను.

ఉపే-- తమ్ముడా ! తప్పువడితివి. కులధర్మమును కూల

66

అం 2]

భారత రమణి

ద్రోయు చున్నావు. "స్వధర్మే నిధనం శ్రేయ: అరధర్మో భయానహ:" సముద్రయాన మొనర్చిన వానికి నీ సుత నీయజనుదునా ? సంఘము నిన్ను వెలిబెట్టదా?

దేవే-- వెలి వేయనీ... ఇప్పుడు వెలియన్న అవమాన ముగా గణింపబడుట లేదు, మూదుమిక్కిలి గౌరవభ్యాజనముగ గన్పట్టుచున్నది. స్వర్గీయులగు విద్యాసాగరుడు, రామమోహనరాయలు, కేశవచంద్రసేనుల బోటి మహాపురుషులతో బాటు సంఘమునుండి బహిష్కరింపబడుట లజ్జావహము కాదు. వెలిబడినవా రెట్టివారు? అంత్యజుల సోదరభావమున అక్కున జేర్చువారు, బాలవితంతువుల దుస్దితికి వీలుపడిన గుండె కలవారు. కూటికి లేక కూతుళ్ళ పెండ్లికి కట్నము నీయ లేక వారి నవివాహితులుగ నుంచువారు, దారాపుత్రాదుల దేహపరిశ్రమచే ధనము నార్జించి దైన్యము లేని జీవిక బరువు వారు, విద్యాభ్యాసమునకు దేశోద్ధారణమునకును విదేశ యానము సేయువారు,... ఇట్టి యుత్తమకార్యముల నిర్వహింపబూనువారే కదా వెలివేయబడినవారు!... కాంహి వేశ్యాలోలురు, వ్యభిచారులు, నాలిముచ్చులు, దొంగలు, స్త్రీహత్యజేయువారు, పదిసారులు బందిగ్రాహులయినవారు, పంచమహాపాతకులు, కులసతుల కాపురముల మాపి వారికూటమి యందు కులుకు చుండెడువారు, కులహీనులచేతి కూడు తినువారు, బాహాటముగా కల్లుత్రాగువారు, జూదరులు, వేలకొద్ది నిరీహుల కొంపలకు చిచ్చుపెట్టు వారు, సజ్జనుల గొంతు

రం 1]

67

భారత రమణి

కలుకోసి, సంగడిగాండ్ల పచ్చనికొంపలు మాపి, మెత్తని వారి సొత్తును హత్తుకొనువారు, వంచకులు, వేషధారులు-- ఇట్టివారు సంఘముచే సాదరముగా సమ్మానింపబడుచున్నారు. పతితులగువారు పరమధార్మికులయి ప్రజ్వరిల్లుచుండ, విద్యాసాగరుని వంటి వివేకులు వెలివేయ బడుచున్నారు. అట్టిచో వెలికి వెనుదీయ నేల?

ఉపే-- నీవు శాస్త్రాధ్యయనము సేయలేదు. నేనూ శాస్త్రములనన్నిటిని చదివితినని విఱ్ఱవీగను. ప్రధానమైనవాటిని పఠించితిని.

దేవే-- మీరు చదివినందుకు ఫలము ప్రత్యక్షము కాలెదా? సంఘములో నున్నను సంకటములు తప్పవు. దానిని వీడిననూ సంకటములు తప్పవు. ఈ రెండుమార్గములలో నొక దాని నెంచుకొనవలయును. నేనురెండవదానిని నెంచుకొంటిని. మీరు నాకేమియు బోధింపనక్కరలేదు. వైష్ణవసంప్రదాయానుసారులగు మీ భక్తబృందమును తరింపజేయుడు. ఇక దయసేయుడు.

ఉపే--సరే నీ యిష్ట మెట్లో అట్లే ఒనర్చుము. మధుసూదనా! గోవిందా ! మురారే!.... (పోవును)

దేవే-- ఈ విషయమున నింతవరకూ నాకించుక సంశయ ముండెను, కాని ఈతని ఆచరణమున అది నివృత్తిమయ్యెను. బ్రతికితిని.

68

అం 2]

భారత రమణి

(మానద వచ్చును)

ప్రాణేశ్వరీ ! నే డుత్సవదినము, మన మానందింప వలయును.

మాన-- ఏల?

దేవే-- నేను బంధముల తెంచుకున్నాను. సంఘమను తాడును సడలించు చున్నాను. పంజరమును చేదించి బయటికి పరుగెత్తుచున్నాను. నావెంట నీవుగూడ వత్తువా?

మాన-- ఎటకు?

దేవే--(పైకిచూసి) అటకు, నీలాకాశతలమునకు, అంశుమంతుని ఆలయమునకు, పరమపవిత్రమగు వాయుమండలమునకు-- సదానందుని తన యునకు సుశీల నిచ్చి పెళ్ళి చేసెదను.

మాన--ఎవరికి?

దేవే--సదానందుని కుమారుడు వినయునకు

మాన--నిశ్చిత మైనదా?

దేవే-- ఆహా, సునిశ్చితము. ఇదివర కించుక సంశయముండెను. కాని అన్నగారి సందర్శనమున అదీ తీరినది. ఇక నీవు పెండ్లిపనులు సాగింప వచ్చును.

మాన--నాధా! నేడు సుదినమే! ఇంతకన్న సుఖ దాయక మగువార్త ఊండబోదు. సుశీల కిది సమ్మతమే.

దేవే--నీకు?

రం 1]

69

భారత రమణి

మాన-- మీకెద్ది సమ్మతమో నాకదే సమ్మతము. నేను పోయి సుశీలతో చెప్పదను. (పోవును)

దేవే-- ప్రే యసీ! నీ మనసులోని మాట ఇన్నాళ్ళు దాచగల్గితివా? "నీకేది సమ్మతమో నాకదే సమత" మని నోటినిండ మాటాడి పతిభక్తి బయలుపరిచితివి. యజ్నేశ్వరునితో వివాహప్రసంగము సల్పునపుడు కన్నుల నీరుపెట్టితివే కాని పెదవి కదల్పలేదు. వినయన కిచ్చి వివాహ మొనర్తునన్న ఆనందమును పెట్టలేక పోతివా? కాయము స్థూలము కాకున్న నృత్యము చేసియుందువు కాబోలు.(పోవును)

(మానసా వినోదులు వత్తురు)

మాన--సుశీల ఏదీ?

వినో--కాళ్ళు కడుగుకొను చున్నది.

మాన--మీకొక సుభవార్త తెచ్చితిని.

వినో-- ఏదది?

మాన--సుశీలను వినయున కిచ్చుటకు మీ తండ్రి గారు నిశ్చయించిరి.

వినో--నిజముగా?

మాన-- ఆహా ! నెను సుశీలతో చెప్పివచ్చెదను.(పోవును)

వినో--ఆహా! సుశీల కిది ఎంత సుఖదాయకమైన వార్త!.... నాకో?..... వద్దు. దాని సుఖమే నా సుఖము.

70

అం 2]

భారత రమణి

ఇంతకన్న నాకేమి కావలెను? నేను బ్రహ్మచర్యము పూనెదను, దైవమా దీనినెట్లు నాచే నిర్వహింప జేసెదవో నీదేభారము.(సుశీల వచ్చును) చెల్లెలా శుభవార్త వింటివా?

సుశీ-- వింటిని, కాని ఇప్పుడట్లు జరుగనేరదు.

వినో--ఏది జరుగనేరదు?

సుశీ--నేనాతని పెండ్లియాడను.

వినో--చిత్రముగా నున్నదే! -- ఇంకెవని పెండ్లి యాదుదువు?

సుశీ--నాకు పెళ్లియే వలదు.

వినో--సరి సరి ఆడది పెళ్లిచేసుకోనకున్న నెట్లు?

సుశీ--ఆకాశము విరిగిపడునా? బ్రహ్మాండము బద్దలగునా?

వినో--అమ్మో! ఎంత మాటాడితివి ! మనదేశమున అనాదినుండియు ఆడది పెండ్లియాడుచునేయున్నది. ఇదే మన ఆచారము.

సుశీ--ఔను, నేనెరుగుదును. మన దేశమున ఆడవారి యెడ అత్యాచారము ప్రబలుట గనుచుంటివా? శ్రీరామచంద్రుని వంటివాడు ప్రజలను సంతసింపజేయుటకు నిరపరాధిని అగు ధర్మపత్ని నింటనుండి తరిమెను. అది ఉత్కృష్టమగు స్వార్ధ త్యాగమని అందరూ ఆ మహారాజును ప్రశంసింతురు. ప్రజలు కోఐనచో తన తల్లిని కూడ తరిమియుండును కాబోలు! సకల దర్మవేత్తయగు యుధిష్టురుడు మాయ దురోదరంబున మహా

రం 1]

71

భారత రమణి

సాధ్వియగు ద్రౌపది నోడెను. ఈ పురుషజాతికి సర్వనాశనము సంభవింప వలదా? కాలానుక్రమణమున కోట్లకొద్ది హిందూనారీమణుల బాష్పప్రవాహము వారి వేడినిట్టూర్పులచే అవిరియై ఆకసము నిండియున్నది. అది నేడభిశాప రూపమున ఈ పురుషజాతిపై విషవృష్టి కురిపించదాయె. ఇంత స్వార్ధపరులగు పురుషులు మనల ఆటలలజేసి అనాదినుండియు మనయెడ ఆత్యాచారము సల్పుచున్నారు. ఇట్టి జాతి మట్టిలో కలియవద్దా?

వినో--సుశీలా ! ఒక్క గుక్క నెన్ని మాటలాడితివే? నీవు ఒక పక్షముననే పల్కుచున్నావు. మంచియు చెడ్డయు నెంచవలదా? మనకు సంభవించిన అవిచారమునకు అత్యాచారమునకును పురుషులే కారణభూతులనుకొన్నను, మనలను సుగుణములచే నలంకరించినవారు వారుకారా? స పీడితయు పరిష్కర్తయు నైన సీత అవసానకాలమున "జన్మజన్మాంతరములయందు శ్రీరాముడే నాకు పతియగుగాక" అని మొరపెట్టలేదా? ఇట్టిమాట వేరొక దేశమున వేరొక జాతీయుడు, వేఱొక మహిళాబృందము నోట వెలువడునా?

సుశీ-- ఇంకేదేసముననెన తండ్రి యాజ్ఞానుసారము తల్లితల నరికిన సుతు డుండునా? అక్క్సా యుక్తుల కేమిలే. క్రోధోద్రేకమున నాఒళ్ళు సమూలము దహింప బడుచున్నది. మనదేశమందలి మగవారు, సతులకు పతులే ప్రేమ భాజనములు, పరమధ్యేయులు, ఉత్కృష్ట దైవములనియు

72

[అం 2

భారత రమణి

ఉగ్గుపాలనుండియూ నూరిపోసి ఊహింపశక్యముగాని ఉచ్చాదర్శముల నిర్మించి యున్నారు. వాటిని పట్టుకొని పడతులందరు పాకులాడుచున్నారు. అభాగినులమగు మనజాతికి ఇట్టి మాననీయ కఠోర నియమములచే ఆత్మగౌరవమును అణగగొట్టుట వారి స్వార్ధసిద్దికే గాని మరొకటి కాదు. పురుషులు వేశ్యల నుంచుకొందురు. వారికి ఎనుబదేళ్ళు నిండినను ముక్కుపచ్చలారని ముద్దురాండ్లను పెండ్లిచేసుకొప్ని ఆకల్యణుల కాలితో తన్నుదురు; దీని నంతయు మనసంఘము సహించి యుండును. అందుననే నారీజాతి సుఖసాధనసామగ్రిల్యను నియమము కల్పింపబడెను ఇది ఏదేశముననైన కలదా?

వినో-- చెల్లెలా! పురుషజాతి చెడ్డదైన మనము సదా దర్శములనుండి స్ఖలితలముకానేల? వారిని ఉదారుల జెయగూడదా? వరు మనకొనర్చిన అన్యాయమునకు మనము బదులుసేయుటకు వారేమి మనకు శత్రువులా? సుశీలా! నమ్రత వీడకు, సహన మభ్యసింపుము. సహించియుండుటకే సతులు జన్మించిరి. మనజీవముల నర్పించుటయే మనకు విధి. భగవంతుడు మనలను పురుషులతో సమానముగా సృజింపడయ్యె, ఎట్టి దుర్ధినములందైన హిందూజాతి తలయెత్తి తిరుగ గల్గుటకు వారి నారీచరితమే మూలహేతువు, వారి స్త్రీధర్మమే ప్రబలకారణము. అట్టి చారిత్రము అట్టి నారీ ధర్మము మనము కోలునో జెల్లునా?

సుశీ-- సరే, నీవు నాకు చెప్పనక్కరలేదు. అట్లు నీ

రం 1]

73

భారత రమణి

నాచరింప గలవు, నాచేత గాదు; నీ కందు విశ్వాసమున్నది. నాకు లేదు. తగవు తీఱినది. ఇక చాలించు...(పోవును)

(మహేంద్రుడు వచ్చును.)

మహే-- ఇదే నోటుల కట్ట ఇప్పుడు నాసముడెవరు? దీనితో కొన్నాళ్లు కాలక్షేపమగును.

వినో--మహేంద్రా! నీ చేతిలోని దేమి?

మహె--ఆ? యేమీ లేదు... కాగితములు

వినో--ఏ కాగితములు?

మహే--కాదు-పత్రములు

వినో--నేను నమ్మను. ఏవీ చూపుము.

మహే--ఇవి నోట్లు

వినో--ఏ కెక్కడివి? నిజము చెప్పు

మహే--ఆటలో గెలుపు

వినో--అయ్యో! తమ్ముడా జూదమాడుటమానవా? నీవు బొత్తిగా పాడయినావు. ఎన్నిసారులు చెప్పినను వినవు. మన దారిద్ర్యము నీ మనసున గలుగుట లేదా? ఇట్టి చెడుదినములయందు తండ్రిగారికి తగినంత సాయము చేయుట మాని, ఉన్నదంతయు నూడ్చి జూదమున పెట్టుచుంటివి! ధనమెచ్చటనుండి తేగల్గుదువు? దొంగిలింతువు కాబోలు! అయ్యో! తమ్ముడా, పండువంటి కులగౌరవమును పల్చన చేయుచుంటివా? తుదకు దొంగతనము కూడ అబ్బెనా?

మహే--లేదు లేదు, నేను దొంగలాడ లేదు.

74

[అం.2

భారత రమణి

వినో--పోనీ! వంచన చేసితివా? ఊరక నీకీధనము లభించి యుండదు.

మహే--అక్కా! జూదమాడుటకు చేతిలో ధనము లేకపోవుటచే మోసము చేసి చేజిక్కించు కొంటిని.

వినో--చీ! చీ! అట్టి ద్రవ్యమంటకూడునా? ఇదెవరిదో వారికిచ్చి క్షమించుమని వారిని బతిమాలుకొనుము. గతమున నీవొనర్చిన పాపమును పశ్చాత్తాపభాష్ప రాశితో కడిగి వేయుము. అంతవర కింటికి రాకు; నేను నిన్ను రానీయల్ను. (పోవును.)

మహే--బుద్ధి వచ్చినది. అక్కయ్య చెప్పినట్లు చేసెదను. అవరి సొత్తు వారి కందజేసి వారి కాళ్లంటి మొరవెట్టు కొనెదను. తల్లిదండ్రుల మనములు తల్లడిల్లు చున్నది. నాకిది తగదు. (పోవును)

            ----
    రెండవ రంగము

(చెఱసాలలో కేదారుడు)

కేదా--ఇది బొత్తిగా చెడ్డదికాదు....ఇందును కొని విచిత్రములు పొడగట్టుచున్నవి. గానుగ ఆదుచున్నది, నూనె దిగుచున్నది. ఇట్లే తల తిరుగునప్పుడు బుద్ధి పుట్టుచుండును. బుద్దిలేని బుఱ్ఱ బరువునకు చేటు. ఆ కూళను కొట్టుటచే కొంత

రం 2]

75

భారత రమణి

సంతస మాయెను. తలలు అగులగొట్టు వానికి గొడపగులగొట్టుటెంత?--ఆహా కైది కన్నులు మూసుకొని ఎంత హాయిగా గానుగ తిప్పుచు పాడుచున్నాడు

తెఱలో పాట

   తిరుగు తిరుగు గానుగ-మరి
   తిరుగుమీవు గానుగా
   కనులుమూసి నున్నులాగి
   కొనుచు ననయ మెను జనగ
   కడువడు నగ్డాకుచెత్త
   సుడిగాలిని సుడివడి నతు తిరుగు
శీతాతసనర్ష వనం తాతరి ఋతువలయమందు
ఏతనధాత్రీతలంబు చెన్నుదరిగి తిరుగునతూళా టేఏ
ఛంద్రసూర్యతారకాగ్ర హేంద్రగణముభ్రమణ మొంద
పల్సుజీవి నీవులెక్క యా తిరుగక వశమె నీకు! తిరు
జననమరణచక్రమందు ననయము తిరుగాడుచుందు
ఎందుకీవు తిరిగెదవో ఎందుజేర జరిగెదవో
ఎవరి కెఱుక ఈశ్వరుడే ఎరుగు నీరహస్యమెల్ల: తిరు
     అయ్యా నీవెవ్వడవు?
     కైది--నేనా? కైధీని.
కేదా-- నీ జాడ జూడ తగుమనుష్యునివలె తట్తుచు
న్నావు. నీవిక్కడి కేల రావలసివచ్చె? నా వలెనే ఏదో మంచిపని చేసి వచ్చియుండవలయు.

76

[అం 2

కైది-- లేదు నాయనా, చెడుపని చేయనందున చెఱలో త్రోసిరి.

కేదా--ఎట్లు?

కైది-- అటులైన వినుం. ఉపేంద్రుడను నొకవకీలు తాను సృజించిన ఉయిలులో నన్ను సంతకము చేయమని నిర్భంధించెను. నిజమైన ఉయిలులో నేను సంతకము చేసితిని, కావున కల్పితమగుదానిపై నెట్లు వ్రాలుచేయుదును? అందుకు నాపై పగబట్టి ఒక అబద్ధపు దావాలో నన్నుదూర్చి చెఱలో త్రోయించెను. అతడు ప్లీడరు. కావున ఎట్టిదుండగమైన మొనర్చగలడు... నో రెండుచున్నది... నీళ్ళున్నవా?

కేదా-- గొప్పహేతువే! నిజమైన వెల్ల ట్టన్నది, కల్పిత మెట్లు వ్రాయబడెను?

కైది--ఉపేంద్రుని తండ్రి వ్రాసినదానిలో యావదాస్తిలో మూడు వంతులు చిన్నకొడుకగు దేవేందు నకు ఒక వంతు ఉపేంద్రునకును పంచి యుండెను. దేవేంద్రుని కూతుళ్లిరువురకు ప్రామిసరీనోటులపై వడ్డీ ప్రతినెల యిచ్చుచుండవలయునని ఉన్నది. దానికి నేనూ మరిముగ్గురూ-- గదాధరుడు, కిశోరుడు, హరిపదుడును సాక్షులము. కల్పితమున ఈ పంపకము తారుమారు చేయబడెను. అయ్యా! నో రెండు చున్నది, కొంచెము నీరిమ్ము.

కేదా--తెలిసినది. ఇపు డొక చిత్రము జరుగనున్నది. నాకీ చెఱ వీడనిమ్ము... అయ్యా ! ఆ ముగ్గురు సాక్షులు

రం 2]

77

భారత రమణి

నెవరు? యజ్నేశ్వరుడు, హరిపదుడు-ఇంకొక రెవరు?

కైది--యజ్నేశ్వరుడు కాదు-గదాధరుడు-హరిసదుడు. కిశోరుడు.

కేదా--ఓహో ! ఓహో ! సరే, నారిప్పలెక్కడ నున్నాను?

కైది--గదాధరుడు-హరిసదుడును కాళీవాసము చేయు చున్నారు. కిశొరుడు ప్రయాగలో నున్నాదు. కాబోలు నేనిక్కదికి రాకపూర్వ మతి నిక్కడ వకీలుగా నుండెను... నోరెండుచున్నది. కొంచెము నీరిమ్ము.

కేదా--నీరా? నీదప్పి తీరునట్లు పంచదార పానకము రేపు నాయింట పోసెదను... ఇంత చర్య జరిగినదా? అయ్యా! ఇప్పుడు నాకంటె ధన్యుడెవడు? తా, ధీంతా, తత్తత్తకిటకతా ధీంతా....

కైది--నీకు మతిపోయినదా ఏమి!

కేదా--సాక్షులెవరు? గదాధరుడు-శ్యామపదుడు...

కైది--శ్యామపదుౠ కాదు హరిపదుడు.

కేదా--వీ రెవరు?

కైది--హరిపదుడు పనిచాలించుకొన్న సబ్ జబ్, గజాధరుడు జమీందారు, కిశోరుడు వకీలు, నీరిమ్ము. మాటాడ జాలను.

కేదా--(పేరులు తబ్బిబ్బుగా పల్కునుల్, కైది వాటిని దిద్ద లెక విసుగుకొనును) వట్టి నీరే కావలెనా? లేక పాన

78

[అం 2

భారత రమణి

కమా? ఔను పానక మెట్లు వచ్చును?

కైది-- నీరు చాలును, కొంచె మిమ్ము. రక్షింతువు.

కేదా-- లోనికి రమ్ము, కావలసినంత యిచ్చెద.

          -----

మూడవ రంగము

(దేవేంద్రు) నిల్లు-- భార్యా భర్తలు కూర్చుందురు)

మాన--అది పెళ్లాడకున్న నేనేమి చేతును?

దేవే-- పెండ్లియే వలదనెనా?

మాన--వలదట!

దేవే-- సరే!

మాన--ఏమి సాధనము?

దేవే--దేనికి? మంచిదే. సొమ్ము మిగులును.

మాన--ఎట్లు?

దేవే-- సదానందుడు కట్న మడుగకున్నను పెళ్లి ఖర్చులకు సొమ్ము కావలెను కదా? అది మిగులదా?

మాన--బాగు బాగు!

దేవే--ఇందు తప్పేమి?

మాన--పిల్లకు పెళ్లి సేయరా?

దేవే--అదే వలదన్న నేనేమి చేయుదును?

మాన--మీరొకసారి చెప్పిచూడుడు.

దేవే-- నెను చెప్పను.

రం 3]

79

భారత రమణి

మాన--కన్నెచెఱ విడిపించ వద్దా?

దేవే--వివాహము కాకున్న అది వీడుటెట్లు?

మాన--కులములోనుండి వెలివేవరా?

దేవే--అందుకు మొదటనుండియు సిద్ధమే!

(తెఱలో దేవేంద్రా ! అని కేక)

ఆ రమ్ము, నీవు లోనికి పొమ్ము, (ఆమె పోవును) తంటా తీరినది.(సదానందుడు వచ్చును)

సదా-- మిత్రమా, నీదేహస్ధితి బాగులేదని వింటిని.

దేవే--వెఱేమియు లేదు. మనోవ్యాధిచే అప్పుడప్పుడు దేహస్వస్థత తగ్గుచుండును.

సదా--మనోవ్యాధి నేల తెచ్చిపట్టుకుందువు?

దేవే--వలదన్నను నన్ను వదలకున్నది. సంతానముపై కూర్మి ఎక్కుడయి మమత పఱుగుటచేత నే,మో?

సదా-- సుశీల గూర్చి బెంగగొంటివా?

దేవే-- లెదు, లేదు అది మంచిపని చేసినది. పెళ్లి కొప్పుకొనుటయే లెదు... ఈకుటుంబము మట్టిలో కలిసిన మేలగును. సకలపాపసంకులము. ఆపదలకు పదము. సర్వ నాశహేతుభూతము. పిల్లలను తాచుపాములకు పాలుపోసి పెంచుచున్నాము... అబ్బబ్బ ! ఎంత అవివేకము.

సదా-- నీ అభిప్రాయ మిదేనా?

దేవే-- వేఱేముండును?

80

[అం 2

భారత రమణి

సదా--మిత్రమా, నీవు వ్యత్యస్తముగా తలచుచుంటివి.

దేవే--స్వానుభవ మిది. నీకు చోఱక లోతు నిజముగా తెలియదు.

సదా--నీయెడ నాకు భక్తిశ్రద్ధలు మెందు. ఇట్టి సామాన్యవిషయమున నీమది సంచలించున్నదేల?

దేవే--లేదు లేదు. ఆ విషయమున చర్చతో పని లేదు. అది అనావశ్యకము.

సదా-- ఏది?

దేవే--పిల్ల పెళ్లి

సదా--కాదు. అది అత్యంతా వశ్యకము

దేవే-- ఏల?

సదా-- జన్మాంతరవాదము, అధ్యాత్మికచర్చయు అటుంచుము. సంతానము వాయుభక్షణమున జీవించు ననుకొంటివా? యావజ్జీవమును వారి అన్నవస్త్రములకు అనువు కల్పించుట్ తలిదండ్రులకు విధి కాదా?

దేవే--వారి తప్పేమి?

సదా--సంతానము కల్గుటకు తలిదండ్రులు కారణ భూతులుకారా? వారి సంరక్షణ వీరికి విధికాదా? పిల్లలు పెద్దవారై దు:ఖాకాంతులైన ఆ తప్పు తలిదండ్రులదికాదా? సంతానము కడుమాడి కఱకఱి బడిన కన్నవారు మిధ్యులు కారా?

రం 3]

81

భారత రమణి

దేవే-- తరువాత, తరువార,

సదా--కుమారునికి విద్యాబుద్ధులు కరపి వాని అన్న వస్త్రముల కాధారము కల్పించుచున్నారు. అట్లే కొమారికి కూడ కల్పించ వలదా? పిల్లకు పెళ్లి చేయుట వలన దానికి జీవనాధారముకల్గును. కావున నీకూతుర్కి నీవు పెండ్లిచేయుట తప్పదు...కాని

దేవే-- ఊరకుంటి వేమి?

సదా-- స్త్రీలయెడ భగవంతుడే నిష్ఠురుడు, దానికి మనమెమి చేయగలము? వారి యోగక్షేమములకై సాధ్యమైనంత యత్నముచెయుట పురుషులకు విధి. స్త్రీలకు రానున్న క్లేశముల తొలగింప బూనుట పురుషుల కావశ్యకము.

దేవే--నాకు బోధ పడలేదు.

సదా--స్త్రీలు దుర్బలులు, అబలలైనను వారు మానవులే కదా? వారి హృదల్యములను అవమానము ఉపేక్షయు పురుషుల హృదయము తోపాటు నొవ్వ జేయును. స్త్రీలు పురుషులకంటె బుద్ది తక్కువ వారైనను, వారికిని ఇష్టానిష్టములుండును. వారిమతము కేవలము గహక్యామనరాదు. పసితనమున వారికి వివేకముండదు, కావున తలిదండ్రులు తమకు నచ్చిన వారికి వారిని కట్టిపెట్ట వచ్చును. బాలికకు పదిహేను పదహారు వత్సరములవరకు పెళ్లిచేయకున్న, అప్పటికి వారు ప్రాజ్ఞలై వరుల నెంచుకొనుటయందు మతామత ములు కల్గియుండును. వాటిని సరకు చేయకుండుట భావ్యము కాదు, సుశీల అభిరుచికి

82

[అం 2

భారత రమణి

ప్రతికూలముగ మా వినయన కామెను నీవు కట్తతలచినచో నేను సమ్మతింపను.

దేవే-- హిందూకులమున పుట్టిన ఆడది హిందువుల కులాచారముల మన్నించుట యుక్తముకాదా?

సదా--సావిత్రి హిందువులలో పుట్టలేదా? ఎరిగిన పిల్లకు ఇష్టానిష్టము లుండితీరును. మన శాస్త్రకారులు మూర్ఖులనుకొంటివా?

(మహేంద్రుడు వచ్చును)

మహే--నాన్నా! కుముదిని ఏమేమో పలమాట లాడుచున్నదని అమ్మ చెప్పుచున్నది.

దేవే--ఈ మాట నాతో కూడ చెప్పినది. పలమాట లాడక పాటలు పాడునా ఏమి?

మహే--అమ్మ మిమ్ము పిల్చుచున్నది.

దేవే-- ఇప్పుడు వచ్చుటకు వీలు లేదు, పొమ్ము.

సదా--అట్లుకాదు, ఒకసరి వెళ్లిరమ్ము

దేవే-- నేనేమి వీరి నౌఖరునా?

సదా-- వైధ్యుని పిలువనంపవా?

దేవే-- వలదు, నీతో నెన్నిసారులు చెప్పుదును?... ఇమ నీవింటి కరుగుము.

సదా-- సరే...నీవు పొయి ఆడవారి దిగులు తీర్చుము (పోవును)

రం 3]

83

భారత రమణి

(వినోదిని వచ్చును)

దేవే-- నాకొఱకే కాబోలు- నాకు ప్రాణాంతముగా నున్నది.... ప్రాణ మున్నదా? (పోవును)

వినో--తండ్రిగారి మతి తల్లడిల్లినది. లేకున్న ఇంత కోపము, చిటపటలాడుట పూర్వముండెనా?

          ------

నాల్గవ రంగము

[దేవేంద్రు నిట్లు-గాలివాన, వడగండ్లు, ఊరుములు కుముదిని మంచముపై పదుక్కొనుచు, ప్రక్కను తల్లి కునుకుచుండును. దేవేంద్రుడు నిలుచును]

దేవే--తాత్రి యెంత భయానహమై యున్నది? ముసలధారలు కట్టి వర్షము కురియుచున్నది. వడగండ్లు పడుచుండుటచే తలుపులు చిల్లులుపడుచున్నది, మేఘములు-వలలో బదిన వ్యాఘ్రముల భాతికోపోద్రేకమున గంభీరముగా గర్ఝించుచున్నవి. సృష్టియంతయు లోపించినటుల చిమ్మచీకటి కమ్ముచున్నది. పాడుపడిన యీకొంపయు నేను మాత్రమే నిల్చియున్నాము. దౌర్భాగ్యుడను నాచుట్టు వేరెవ్వౌను లేరు కాబోలు, ఈతుపా నడగి, ఈయంధకార మంతరించినవెన్క సూర్యకిరణప్రసారమున పూవులు పూసి, పక్షులు కలస్వరములతో నాకసమున నెగురుచుండ, వసంత వాయువీచికలు శ్యామలలతలపై మెల్లమెల్లగ వీచుచుండ, కమ్మని తెమ్మె

84

అం 2]

భారత రమణి

రలు లతాగృహముల సుగంధముల నెలకొల్పుచుండు నప్పుడు నాఛుట్టు నుండువారెవరు? ప్రపంచమా? నావైపు వంగి నాలదే! అన్నగారు-- మేమిద్దరం ఏకగర్భుజనితులమని వాడుక. ఇక నీ ప్రపంచమున నా కిద్దరు సుతులు. ఒకడు సన్యసించె, రెండవవాడు తగిన శిక్షలేకుండుటచే ఉచ్చృంఖలు డయ్యె. ఇద్దరు కూతుళ్లలో ఒకతె అనాధ. రెండవదానికి పెండ్లి కాలేదు. నాభార్య అహోరాత్రములు దాసివలె పాటుపడుచుండుట చే నిద్రాదేవి అమెపై అనుజ్కంపజూసి అక్కునచేర్చెను. రుగ్లయగు ఈకన్యకు మరణ మాసన్న మగుచున్నది. దీనినంతయు నేను కన్నులార గాంచుచుంటిని.

కుము--అమ్మా! అమ్మా!

మాన-- ఏమమ్మా?

కుము--దాహము

దేవే--ఇదుగో నమ్మా.

కుము--నాన్నగారూ!

దేవే-- ఇదిగో మంచినీరు.

కుము--వలదు, బాధ భరించ జాలను, అమ్మా!

మాన--ఏమమ్మా, ఇక్కడనే ఉన్నాను.

కుము--అక్కేదీ?

దేవే--నిద్రపోవుచున్నది. లేపనా?

రం 4]

85

భారత రమణి

కుము-- వలదు, లేచిన పిమ్మటా వాళ్లతో చెప్పుడు. అబ్బా!

దేవే--బాధ హెచ్చుగా నున్నదాఅ అమ్మా?

కుము--లేదు, అంతయు అణుగుచున్నది.

మాన--అదేమమ్మా, అలా గంటున్నావు. హా! దైవమా ఎట్టిగతి తెచ్చిపెట్టితివి.

కుము--అమ్మా (లేచి మెడపట్టుకొనును.) అబ్బా!

మాన--వైధ్యుని పిలిపుడు (కుముదిని పడును)

కుము--అబ్బా! బాధ తిరుగ వచ్చుచున్నది.

మాన--వైధ్యుని పిలివరేమి?

దేవేవ--వైద్యుడా? బైట యెట్లున్నదో నీ కగపడుట లేదా? అర్దరాత్రమున తుపాను పట్టియున్నది. ఇప్పుడు వైధ్యుడా? నూరు రూపాయీ లిచ్చినను ఎవ్వరును రారు. అంత సొమ్మిచ్చుటకు శక్తియు లేదు.

కుము--ఇకను వైద్యుడేల? నాన్నా- కిటికీ తీయుడు (అత డట్లుచేయ ఓరుగాలికి దీపమారును కుముదిని ప్రాణము పోవును)

దేవే--అమ్మా, కుముదిని !

మాన-- కుముదిని ! కుముదినీ ! (పైనిపడును)

86

అం 2]

భారత రమణి

దేవే--గట్టిగా పట్టుకొనుము. ఈ చీకటిలొ మన కన్నులు మూసి ఎటకైన పారొఫొవును సుమా! జాగ్రత్త!

మాన--అయ్యే! పోయినది. నాతల్లి ఎగిరిపోయినది.

దేవే-- విదిచితివా పట్టిఉంచలేక పోతివా? పలుగాకీ! అట్లైన నదువుము, మనముగాడ పొవుదము. చీకటిలో ఒక్కర్తె ఎక్కడికి పోయెనో చూతము. కుముదినీ! కుముదినీ! (పోవును)

Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf