భారత రమణి/మూడవ అంకము

వికీసోర్స్ నుండి

మూడవ అంకము

మొదటి రంగము

(దేవేంద్రు నింటిలో నొక్కడే పచారు ఛేయును)

దేవే--ఒక ఆపద గడవకముందే వేరొకటి దాపురించినది. ఒక కెరటము మీద మరొకటి, కాలుజారి కొట్టుకొనిపోవుచున్నప్పు డెవ రాపగలరు? ఒకదానిమీద నొకటి. విరామమే లేదు నిర్భర మగుచున్నది.... అదిగో నా భార్య వచ్చుచున్నది. రానీ, మనసు రాయి చేసికొంటి. ఇక నేమి ఛేయగలదు?

(మానస వచ్చును)

దేవే--ఔను. కాని పోయిది.

మాన-- మీ రేమియు చేయలేదే?

దేవే--లేదు.

మాన--చూచుచు నిలుబడితిరా?
88

అం 3]

భారత రమణి

దేవే--ఔను వింతను చూచుచుంటిని.

మాన--అడ్డుపెట్ట లేదేమి?

దేవే-- లేదు.

మాన-- ఎందుచేత?

దేవే--పోలీస్వువారు పిల్లవానిని విడుతురనే భయముచేత.

మాన--ఆ భయము చేతనా?

దేవే--పోలీసువారు నాకు మేనత్త కొడుకులు

మాన--మీకు మతి చలించినట్లున్నది.

దేవే--నిజము కావచ్చును.

మాన--వాని చెఱ తప్పించుడు

దేవే--ఎవరిది? (నవ్వును)

మాన--అబ్బాయిది; నవ్వుతారేమి?

దేవే--బాగు బాగు, నేకే చింతయులెదు. లోకమర్యాద తెలియదు. దైవము నన్నాడ దానిని ఛేయక మగవానినెందుకు చేసెనో? ఇప్పుడు నూరు ప్రసవవేదన లగుభవించుచున్నాద్ను.

మాన--కుర్రవాని కేమగును?

దేవే-- జైలునకు వెళ్లును. పట్టుబడకున్న దొంగతన ము గొప్ప విద్య. పట్టుబదినచో చెఱసాల తప్పదు. ఆహా! గవర్నమెంటువా రెట్టి నియమము చేసిరి? బలే!

మాన-- బాలుడు జెయిలులోపడిన నేను బ్రతుకను.
అం 1]

89

భారత రమణి

దేవే-- సరే, ఉరిపోసుకొమ్ము- చావుము. ఒకకొడుకు సన్యసించెను; ఇంకొకడు చెఱలోపడెను; ఒకకూతురు తగిన మందు లేక తనువు బాసెను; ఇంకొకతె తగిన వరుడు లెక తలచెడెను. ఇంకొకతె ఉన్నది. దానికెమి! మిగిలనచానవు నీవు ఉరిపోసికొనుము. నేను మిగిలి యుందును...ఆహా! దయామయా! ఏమి నీరచనాకౌశలము; 'మ్రింగుటకు మెతుకులు లేవు, మీసమునకు సంపంగి నూనె ' అన్నట్లు పెళ్లిచేసు కొంటిని- ఫల మనుభవించు చుంటిని. కర్మఫలము కట్టి కుదుపదా? ఎవరిని నిందింపను?

మాన--బాలునకు చెఱ తప్పదా?

దేవే--తప్పునని తోచదు.

మాన--తగిన ప్లీడౌను పెట్తిన తప్పించగలడా?

దేవే--తప్ప వచ్చును

మాన-- అయితే ఏల పెట్టరాదు ?

దేవే--(నవ్వి) నీ కసాధ్యమన్నది లేదు. నీకేదియు తోచదు. తగిన ప్లీడరునకు తగిన ఫీజు, ధనమెట్లు దాపదించు? నీవిత్తువా?

మాన--అప్పు తెండు

దేవే-- హాయి హాయి ! కర్త్యము నీముక్కునకు సూటిగా కనబడుచున్నది. అన్నియు సులభముగనే తొచుచున్నవి.(నవ్వును)
90

[అం 3

భారత రమణి

మాన-- ఇంకే మున్నది! పిల్లవాదు జెయిలులో పడ్డాడు. మీరిక్కడ నవ్వు ప్రారంభించినారు.

దేవే--లేదు లెదు, నాది తప్పే, ఇక నవ్వను. తండ్రి గారి అప్పు తీర్ప తాతలనాటి యిల్లి సగ మమ్మితిని. నీవు చూచుచుంటివి. అప్పా? అప్పూ ఇదివర కెన్నదును ఛేయలేదు. ఇక చేయను. పిల్లవాడు జెయిలులో పడనీ...

మాన--ఇంకేమి సాధనము?(ఏడ్చును)

దేవే--సొమ్ము, నా ప్రాణములు తీయకు (ఆమెపోవును)

పెళ్ళాడినందుకు ఫల మనుభవించుచున్నాను. ఎవరినందును? ఎళ్లి కొప్పుకొంటిని. బార్యాధరసుధారసము గ్రోలుచుండిన కుక్షి నిండు ననుకొంటిని. ఆమె మోమునెల కాయ వెన్నెలలో విహరించిన చాలు ననుకొంటిని. ఇంకే మేమో భావించు చుంటిని. అదంతయు స్వప్నగతవృత్తాంత మాయె. ఇట్లగునని ఎన్నదు ననుకొన లేదు. కర్మ మెట్టిదో ఫలమట్టిది. విత్తొకటి వేసిన చెట్టు వేరొకటి మొలుచునా? ఓహో! పరమేశ్వరా! ఏమి నీ సృష్టిచాతురి!

వినోదిని వచ్చును

వినో--నాన్నగారూ!

దేవే-- ఏమి కావలె? ఓహో, తెలిసినది, కాని నీవు కోరినది కాజాలదు.

వినో--మహేంద్రుని...
రం 1]

91

భారత రమణి

దేవే--ఊఱకుందుమూ మాటాడితినా, నేనాత్మహత్య కావించుకొనెదను.

(సుశీల వచ్చును)

ఏమి కావలయు?

సుశీ-- నాకేమియు వలదు... మహేంద్రు....

దేవే--ఇమ చాలించి పొమ్ము.

సుశీ-- నన్నేమి చేసినను వలదనను, మహేంద్రుని రక్షించిన చాలును. మీ పదము లంటదను.

దేవే-- నన్నంటవలదు. దూరమున నుందు--

సుశీ--జనకా! ఇటు తగునా? (కాళ్లపైబడును)

దేవే--ఇక నుండ జాలదు... ఎంతని మ్రింగను! వినోదినీ..సుశీలా...అబ్బా! మీరే మెఱుగ గలరు? అయ్యో~ అయ్యో? నిర్భరము...నిర్బరము....

                          (త్వరగా పోవును)

(నగలపెట్టేతో మానస వచ్చును)

మాన--వినోదినీన్ ! ఈ నగలు పట్టుకొని సదానందుని వద్దకు వెళ్లి వీటినమ్మి సొమ్ము యిమ్మను.

వినో--ఇదే మమ్మా!

మాన--కొడుకు చెఱలో బడిన పిమ్మట కొఱగాని యీ నగలు నాకేల? తీసుకొని పొమ్ము.
92

[అం 3

భారత రమణి

వినో--ఇవి నీ పుట్టింటివారు పెట్టినవనియు ప్రాణము లుండ వీటిని బాయగూడవనియు చెప్పియుంటివే?

మాన--ఔను, కాని కుఱ్ఱవాని కిట్టి యవస్థ తటస్థించునని అప్పుడెరుగను. ప్రాణములకన్న ప్రియతరమైన ఆంధకారావృతమగు ఇంటికి దీపమై, కుల ముద్దరింపదగు కొడుకు చీకటికొణములో నుండ నేనీ యాభరణములతో నింట నుండ గలనా? కొని పొమ్ము.

వినో--నాన్నగారి నడిగితివా?

మాన--లెదు. వారి నడుగ నక్కరలేదు. ఆయనకు మతి చెడినది. మా అమ్మ నాకిచ్చిన నగలు, నా హృదయము, నా శరీరార్ధబాగమునగు నాపుకు నకై అర్పించుచున్నాను. నీవు సంకోచింప వలదు. ఇతరులకు నే నిచ్చుటలేదే! ఆపదుద్దారకా ! ఆర్మరక్షణా! నా మొఱాలకించి మమ్మీపదబ్ధినుండి ఉద్దరింపుము. (పోవును)

                 ---

రెం డ వ రం గ ము

[దేవేంద్రు నిల్లు-- దేవేంద్రుడు నిద్రలో]

దేవే-- డబ్బు ! డబ్బు! డబ్బు! ప్రపంచమున నింకెడ్ది యు లేదు. డబ్బే! పిల్లలకు డబ్బు, పెద్దలకు డబ్బు, కొడుకులకు డబ్బు, కూతుళ్లకు డబ్బు, పెండ్లానికి డబ్బు, మగనికి
రం 2]

98

భారత రమణి

డబ్బు; దొంగకు డబ్బు, దొరకు డబ్బు; భావ్యవంతునకు, బీదవానికి; గొప్పవానికి, కొద్దివానికి; భకునకు తుదకు భగవంతునికి కూడ డభ్భే ధనము దాపరించుటకే ధాత్రీ మహా దేవిని దహించి, త్రవ్వీ, ఆమె గర్భమును చీల్చుచున్నారు. సముద్రమునందలి అగాధమున మునిగి రత్నమ్లను సేకరించుచున్నారు. చేతకాదుగాని ఆకాశమందలి సూర్యాది గ్రహతారామండల చీల్చి కరుగబోసి టంకసాలయందు నాణెమ్లుగా దింపియుందురు. బాపురే! ప్రపంచమా, నీబిడ్దల నందర ధనచింతాంబుధిని ముంచి తేల్చు చున్నావు. నీక్రోదమునుంది రత్నగర్భమా, వారు వెడలునప్పుడు ఒక కాసైన వారి నంటి బోవునా?... హా! శంకరా, నా ఐదువేల రూపాయలపై ఇంటిలో నదరును కన్నువేసి యున్నారు. పిల్లవానిచేతిలో బెల్లముముక్కను కాకి తన్నుకొని పోవునట్లు వీరు నాచేతినుండి దీనిని గ్రహింప దలచుచున్నారు. దీనిపని చక్కచేయవలయును (ఇనుపపట్టెతీసి) ఇక్కడ దీని నుంతునా? రేపు కచేరిలో కట్టివేయుదును... తండ్రిచేసిన అప్పు తాతల నాటి యిల్లమ్మితీర్చెదను. నాకొఱ కమ్మలెదే! ఆస్తి తండ్రిగా రిచ్చినదే, అప్పు తండ్రిగ రిచ్చినదే... ఇక్కడనుంతునా?.... వలదు. గొయ్యితీసి పాతుదునా? అది మేలు. (గునపము తెచ్చి త్రవ్వి) అబ్బో చప్పు డగుచున్నది. ఎవఱైన వత్తురు. ఇదివ్లదు. అలమరలో నుంచెద. ఇదెవ్వరును చూడబోరు. ఇనుపపెట్టె యండ ఇంతసొమ్ము అలమరలో నుండుననుకొందురా? సరే.
94

[అం 3

భారత రమణి

ఇచ్చటనే దాచెదను. (తాళము తీసి అరలాగి లోనచూచి) ఓ హో! దీనిలో దొంగ అర కూడ యున్నది బలే! ఇది చాలుమేలు. ఇందులో నుంచెద. (తడిమిచూచి) ఇందేదో కాగితము లున్నటులున్నవి. ఇవి చూచినవారి కిందు సొమ్ముందునను ఆపోహము పుట్టదు. వాహ్వా ! ఇది మేలైన చోటు. అవరును చూడలెదు కదా, లేదు. అర్ధరాత్రమున నిట నెవ్వరుందురు? ఈసారి వీటిని తీయుట సాధ్యము కాదు. (అందులో పెట్టి తాళము వేసి) హాయి హాయి.(పోయి నిద్రించును.)

(వినోదిని వచ్చును)

వినో--మా తండ్రిగా రేదో మాటలాదు చున్నటులున్నది. (అంతట చూచి) ఇందెవ్వరును లేరే...ఓహో! నిద్రలో లేచి తిరుగుచుండుటయు మాటలాడుటయు వీరికి అలవాటే. అదిగో నిద్రించి నట్లున్నది. (పోవును)

                    ----

మూ డ వ రం గ ము

(ఉపేంద్రు నిల్లు, ఉపేంద్రుడు భక్తులు)

ఉపే--వత్సలారా, ఆహారము గొనుట కూడ అధ్యాత్మిక వ్యాపార మని నేను సిద్ధాంతము చేసినాను. ఇదిగో నవనీతము ఇది శ్రీకృష్ణుడే ! దేవకీనందనుదే!

భక్తు-- ఓహోహో!
రం 3]

95

భారత రమణి

ఉపే-- పీతాంబరధర- శఖపించభూషణ వంశీధర గోపాలా!

భక్తు-- (పాడుదురు)

ఉపే-- మక్ఖన్ చోర-మధ్సూదన- శ్యామలా నవనీ రదసదేహ విశాలా

భక్తు--(పాడుదురు)

ఉపే--శ్రీకృష్ణుడు వెన్నవలె కోమలుడు, కావుననే వెన్నదొంగ అనిపించు కొనెను.

భక్తు--వోహే హో!

ఉపే--భక్తులారా! చూడుడు (లడ్దుచూసి) ఈపదార్థము ఆండాకారము గలది. చెక్కెరతో చేసినది కావున రసవంతము, మధురము కారణముయొక్క గుణములు కార్యమందుండును. కావుననే దీనిని "రసగొళ" మందురు. ఆర్యఋషి గనము దీనిని జూచియే, భూమి గోళాకారముగా నుండునని సిద్ధాంతము చేసిరి. ఇది నోటిలో వేసుకొనినచోకరిగి కడుపులో కలియునట్లే జీవాత్మ భక్తి యోగముచేత పరమాత్మలో లీనమగును. చూడుడు (నోటిలే వేసుకొనును)

బక్తు-- సత్యం సత్యం ఓహోహో!

ఉపే-- (సీసాను చూపి) చూచితిరా? ఇది పానీయ ద్రవ్యము-- దీనిని దేశభాషలో "షర్బతు" అందురు. ఇదే భగవంతుని ఆదిసృష్టి- ఇందే సర్వభూతములు ఉత్పన్నములయినవి. "సర్వభూతేషు శ్రికృష్ణ:" ఇందెట్టి అపూర్వరహస్య
96

[అం 3

భారత రమణి

మున్నదో కనుడు-- 'సర్వభూత" శబ్దము "షర్బతు" గా మారినది. ఇందుచేతనే సర్వభూతములును పరమేశ్వరునియందు ఇట్లే లీనమగును.

భక్తు-- ఏమి అధ్యాత్మిక తత్వం.

ఉపే--ఇంకొకటి మిగిలియున్నది. (గుడిగుడి చూసి) ఇది పొగను సృజించురు. ఇట్లే అనేక యంత్రములు చేయగలవు. ధూమయంత్రములను చేయుటయే మానవుడు గ్రహించెను. ఇందు విష్ణుతేజ మున్నది. ఇందుజ్ఞానపత్రి యుంచి పీల్చినచో సర్వలోకములును సాక్షాత్కరించును. (పీల్సును)

(యజ్నేశ్వరుడు వచ్చును)

ఓహో! యజ్నేశ్వరా! రమ్ము.... వత్సలారా! నేను కొంత సేపు ఆత్మసాక్షాత్కార మాచరింపవలయు. మీ రిండ్లకు పొండు. ఆహా! గోపీజనమనోర్ంజనా, జీవులకు పరమావధి నీవేకదా? సర్వోధారకుడవు సర్వనియంతవు శ్రీహరి నీ చరణములె నమ్మియుంటిని.

భక్తులు--(పాడుదురు)

పా ట

నీదుచరణములే-- గతియని--ఎదనునమ్మినవారమురా! శ్రీకృష్ణా!
రం 3]

97

భారత రమణి

వేదవేదాంతుడనని-వెలయుశ్రీసర్వేశ్వర కృష్ణా ! (పోవుదురు)యజ్నే--పీడ వదిలినది...ఉపేంద్రా నీతో నొక మాట చెప్ప వచ్చితిని.

ఉపే--నేనుకూడ నీకొకమాట చెప్పవలెను.

యజ్నే--ఆహా నీవే, నన్నే-మీతండ్రి అప్పు తమ్ముని తలపై రుద్దితివి. ఇల్లమ్మి ఋణము అతడు దీర్చునని నమ్మించి తిని. ఇల్లమ్ముడైనది- అప్పరకాసైన నాకందలేదు.

ఉపే--ఇందు నాదోషమేమి?

యజ్నే--దోషము నీది కాదా? ఉండుండు. నీచెవులు నులిమి సొమ్మంతయు రాబట్టెదను.

ఉపే--కానిమ్ము నేను వకీలును, లా ఎరుగుదును.

యజ్నే--అబ్బో! అటులనా? నేను షరాబును; బీదలను పీల్చి పిప్పిచేయుట మనకిద్దరకు సహజధర్మము. నీవు మునిముచ్చువైతివి. నేనట్లుకాలేదు. ఇదే భేదము. చూడు సొమ్మంతయు నీనుండి వసూలుచేసెదను.

ఉపే--నేనీయవలసిన పైకము నంతయునీకిచ్చినట్లు రసీదు నాకిచ్చితివి. ఎక్కు వెట్లు రాబట్టెదవో చూచెదను.
98

[అం 3

భారత రమణి

యజ్నే-- అటులనా? మీతండ్రి వ్రాసిన 'విల్లు 'లో నేను సాక్షిసంతకము చేసితిని, జ్ఞప్తి యున్నదా?

ఉపే--ఆ"విల్లు" ఇప్పు డెక్కడ నున్నది?

యజ్నే--లేకేమి? చేన అలమరలో నున్నది. పోలేదు.

ఉపే--సరిసరి.

యజ్నే--సరిలేదు, బేసిలేదు, అదేయున్నచొ దేవేంద్రుని కగపడదా అని సంశయించుచుంటివి కాబోలు! చెప్పెద విను అందులో గొంగ అరయున్నది. ఆ సంగతి నాకు తప్ప వేరెవ్వరికి తెలియదు. అలమర యిప్పుడు దేవేంద్రుని యెద్దనే ఉన్నది. నేనిప్పుడే పోయి వానితోచెప్పెదను. సొమ్ము రాబట్టు నుపాయము నాచేతిలో నున్నది. ఆ "విల్లు" ప్రకారము యావదాస్తిలో మూడుపాళ్లు దేవేంద్రునకు ఒక పాలు, నీకునువచ్చును, సొమ్మిచ్చెదవా? లేదా? చెప్పు.

ఉపే--రెండవ "విల్లు" నందు నీవు సంతకము చేయలేదా?

యజ్నే--నేను చేయలేదనియు నీవే నాసంతకము చేసితి వనియెద.

ఉపే--నీమాట నమ్మువారెవరు?

యజ్నే--తండ్రివ్రాలు చేయగలవాడు సాక్షివ్రాలు చేయలే దనుకొందురా? చెప్పు, సొమ్మిచ్చెదవా? లేదా?

ఉపే--నాకు మిత్రుడవయ్యు ఇంత ఘోరమునకు ఒడిగట్టుదువా?
రం 3]

99

భారత రమణి

యజ్నే--ఒక సంసారిని పాడుచేయుటకు కుట్ర పన్నుటయందే కదా మనకు మైత్రి అలవడెను అది ఘోరము కాదా? ఇంకొకతి, ఇద్దరు సాధుజనులు మిత్రులగుదురు. కాని ఇద్దరు వంచకు లట్లు కానేరరు. వారినొక గదిలో పదివత్సరములుంచినను వారికి మైత్రి అలవడనేరదు. బయటికి వెడలినతోడనే వారన్యోన్య వంచనమునకు గడుగుదురు.

ఉపే--యజ్నేశ్వరా (కన్నుల నీరు నించును)

యజ్నే--ఆడదాని బుడిబుడి దు:ఖములటుంచి సొమ్మిచ్చెదవో, ఇయ్యవో చెప్పు.

ఉపే--ఒక్కమాట వినవా?

యజ్నే--వినను నీవు వకీలువో? సొమ్మిచ్చెదవా లేదా? మాట తేల్చుము.

ఉపే--ఇచ్చెద

యజ్నే--ఇప్పుడిమ్ము

ఉపే--ఇప్పుడే?

యజ్నే--ఆహా, ఇప్పుడే, నిన్నెవరు నమ్ముదురు?

ఉపే--ఇప్పుడు నావద్ద సొమ్ములేదు.

యజ్నే--మంచిది...(వెళ్ళభొవును.)

ఉపే-- ఉండుండు ఇచ్చెదను.

యజ్నే-- తే.

ఉపే--ఇప్పుడు నావద్ద
100

అం 3]

భారత రమణి

ఉపే-- ఇదిగో! ఇట్లు నిర్భంధించుట న్యాయమా? మనలో మన మెట్లయిన తగవు తీర్చుకొందము.

యజ్నే-- అలాగు దారికిరమ్ము, తగవుదిద్దుకొందమా?

ఉపే--అలాగే కానిమ్ము

యజ్నే--ఎట్లు?

ఉపే-- నీవు చెప్పినట్లు చేసెదను

యజ్నే--నేను చెప్పినపని చేసినచో అప్పే కాక వడ్డీ కూడ వదలెదను.

ఉపే-- ఏమి చేయమందువు?

యజ్నే-- నానోటనే బల్కింతువా? నేను చెప్పజాలను ఆమాట వెలువడిన తోడనే ధరణీచక్రము తల్లిడిల్లదా? అమావాస్యనాతి చీకటి ఆకాసమంతట నాచ్చాదింపదా?... ధర్మ మేమైన ఈ ధాత్రి యందున్న, అది వాడి, వత్తియై, చచ్చి, కుళ్ళి, దుర్గంధము కుప్పనవడదా?

ఉపే--అబ్బా! అంతఘోరకృత్యమును తలపెట్టితివా ఏదో చెప్పుము.

యజ్నే--ఇంకను తెలియలేదా? నీవు పాపివి, నేను పాపిని, ఐనను మాట చెప్పుట నాకు నోరాడకున్నద్. నా వివాహము... ఇప్పుడైన గ్రహించితివా?

ఉపే--చప్పున చెప్పరాదా?

యజ్నే-- విను.(చెవిలోచప్పున్డు).. మ్రాన్పడెదననేల?
రం 5]

101

భారత రమణి

ఉపే--నాతమ్ముని కూతురినా?...................... (యజ్నేరుని మెడబట్టి) ఓరి బాలిశా, ఓరీ చండాల! కూళా!

యజ్నే--నన్ను వదలుము.. తెలివి తెచ్చుకొనుము విదుతువా? లేదా?

ఉపే-- విడిచెద. మఱచితిని.

యజ్నే-- ఇప్పు డిష్టపడుదువా?

ఉపే-- ఇష్టమే, ఇష్టమే...ఎవఱది?

యజ్నే--ఎవరును లేరు. నణుకుచుంటివేమి?

ఉపే-- పోదము, రా... (పోవుదురు)

                  ---
:: నా ల్గ వ రం గ ము :: 

(దేవేంద్రు నిల్లు--మానదా వినోదులు)

మాన-- ఏ మయినది?

వినో-- "వస్తుల నమ్మనక్కరలేదు, తాకట్టుపెట్టి తగినంద్ దస్తు తేవచ్చునని అత డనెను.

మాన--దానితో చెఱవీడునా? అత డేమనెను.

వినో--శక్తివంచన లేక సాధించెద ననెను.

మాన--భగవంతు డాతనికి మేలు చేయుగాక చూడు ఈ సంగతి మీతండ్రిగారికి తెలిసెనా, మన యత్న మంతయు మట్టిలో కలుపును. తెలిఅనీయకుము.
102

అం 3]

భారత రమణి

వినో-- అభయము నీకు వలదు. తెలియనీయను. (పోవును)

మాన--అనాధరక్షకా! ఆపదుద్దారకా! రక్షింపుము (దేవేంద్రుడు వచ్చును)

దేవే--వంట యింక కాలేదా?

మాన--అయ్యో! మఱచితిని.

దేవే-- మీరు నన్ను ఇంట నుండనీయరా?

మాన--క్షణములో వంట చేసెదను బాలుని సమాచార మేమైన తెలిసినదా?

దేవే-- నా ప్రాణము తీయక పొమ్ము...(ఆమె పోవును) చిన్నవాడు చెఱలో పడినాడు పోనీ తండ్రిగారి అప్పు తీర్చి కౌపీనము కట్టి వాడవాడల తిరిగెదను భార్యయు, ఇద్దరు కూతుళ్ళును మిగిలెదరు వారికిని ఇదే గతి కొడుకు కూటికై బెంగగొన నక్కరలేదు. అదియు మేలే.

(సుశీల వచ్చును)

నీవేల వచ్చితివి? పొమ్ము

సుశీ--సదానందుడుగారు మీతో మాటలాడ వలె నని వచ్చియున్నారు.

దేవే--ఇతడు నన్నుబ్రతూకనీయడు, ఇప్పుడు వీలు లేదని చెప్పుము. నా ఒంట్లో బాగుగలేదని చెప్పుము...ఊ పోనీ, రమ్మనుము..(ఆమెపోవును) దేవేంద్రునికొడుకు చెఱలో పడెనని దేశమంతటను వ్యాపించినది. నాగుండె నీరగు
రం 4]

103

భారత రమణి

చున్నది. (సదానందుడు ప్రవేశము) సదానందా! ఏమి వార్తలు? నేడు నా శరీరమునకు స్వస్థత తగ్గినది.

సదా--వైధ్యుని పిలిపించనా?

దేవే-- వైద్యశాస్త్రమున ఈవ్యాధికి మందులేదు.

సదా--మిత్రమా! చింతింపకుము, అపీలు చేయుదము, బాలుని చెఱనుంది తప్పించ వచ్చును.

దేవే-- వలదు, అపీలు చేయవలదు. వాడు చెఱలో నుండుటయే శ్రేయము. కూర్చుండబెట్టి కూడు పెట్టలేను. కొంతభారమైన తగ్గిన మేలే. నాభార్యను కూతుళ్లను కూడ అచ్చట చేర్చు ఉపాయము నాలోచింతునేని నన్ను రక్షించినవాడ వగుదువు.

సదా--అదేమి అట్లనుచుంటివి?

దేవే--ఇంతవరకు జరిపిన చర్యకే వకీలునకు చాల ధన మొసంగితిని, నీకును నావలె మతిపోయి నట్లున్నది. అన్నట్లు ఇప్పడి కైదు వేలు వ్రయపడెనట!

సదా--దాదా పయుండును.

దేవే-- ఇంత సొత్తు నీ కెక్కడిది? ఇది అడుగవ్లెనని ఎన్నియో సారు లనుకొంటిని, ఇంతలో నాకు మతిచెడినది. ఇప్పుడు సావధానుడనై యున్నాను. ఇంతసొమ్మెక్కడిది? చెప్పుము.

సదా-- అదేల అడిగదవు? ఎట్లో జతపడినది. ఇప్పు డామాట యేల?
104

[అం 3

భారత రమణి

దేవే-- నీవిచ్చితివా ఏమి? నా కొరకై నీ వొక కాసైన వ్యయపరిచితివా? యావజ్జీవము నిన్ను శత్రువుని వలె బావింతును. నీవు నన్ను బాగుగ నెరుగుదువు కదా? నా పూర్వు లెవరును దానముల పట్టలేదు, నేను కూడ, ప్రతిగ్రహించు వాడను కాను.

సదా--నీ కీఆందోలన మేల? ఇదే ప్రమాణము చేసి చెపుచున్నాను. ఇందు నాసొమ్ము ఒక గవ్వయైన లేదు.

దేవే--అట్లైన నీ కీసొమ్మెక్కడిది?

సదా--నీ భార్య పంపినది.

దేవే-- నాభార్యయా? ఆమె కైదువేల రూపాయ లెట్లువచ్చెను.?

సదా--నాకు తెలియదు. నాకుమారుడు నాకీ సొమ్మిచ్చను. అత డిట్లు చెప్పెను.

సదా--ఇది ఆమె కెట్లు లభించెనో అదిగితివా?

సదా--ఆవిషయము మెవరికిని చెప్పవలదని ఆమె నిషేధించె నట.

దేవే--సరే, నేనామ నడిగెదను సదానందా, నాపై తీర్పుచెప్పబడిన డిక్రీసొమ్ము జాగ్రత చేసితిని, కొర్టులో దాఖలు చెయుదువా? నీకు వీలున్నదా?

సదా--తెమ్ము, నేడే చెల్లించెదను. తీరుబడి కావసినంత ఉన్నది.
రం 4]

105

భారత రమణి

దేవే--ఇది నేనే చెల్లించియుందును, కాని నాకు స్సుస్తీగా నున్నది. జ్వరము తగులునేమో, జతపడిన పిదప జాగేల? శేషించిన ఆస్థినమ్మి దీనిని జతపెట్టితి.

సదా--ఇల్లమ్మితివా ఏమి?

దేవే--అమ్మకున్న అప్పెట్లు తీరును?

సదా--అమ్ముటకు ముందు నాతో చెప్పలేదేమి?

దేవే--చెప్పినచో నీ వట్లు చేయనిత్తువా?

సదా--చేయనీయను నిజమే, కాని జీవేంద్రా! ఎంత పని చేసితివి! తాతలనాటి యిల్లు ఎంత పవిత్రము! ఇత్రార్జితమగు సొత్తు ఎంత ప్రీతిదాయకము!

దేవే--పిత్రార్జితమగు సంపదకన్న పితౄణము పవిత్రమని నాయూహ...

(ఇనుపపెట్టె తీయును)

సదా--దేవేంద్రా! నీవెంత మహాత్ముడవు! ఎంత ఉదారుడవు! ఐనను ఆపన్మేఘ మన్నివైపుల నిన్నేల ఆవరించియున్నదో ఆపరమాత్మునకే తెలియును ఏమి వెతకుచున్నావు?

దేవే--ఏమిది? నోట్లకట్ట యేదీ?

సదా--పెట్టెలో లేదా?

దేవే--లేదే?...అనుకొన్నట్లే అయినది.

సదా--నొట్లా? రూపాయలా?

దేచ్వే--నూరురూపాయిల నోట్లు
106

అం 3]

భారత రమణి

సదా--ఎవరికైన నిచ్చితివేమో?

దేవే--లేదు అపహరించినారు. ఆహా! దొంగతనమే?

సదా--ఇనుపపెట్టె తీసి ఎవ రపహరింతురు?

దేవే--ఇంకెవరు? హుం! హుం!

సదా--దేవేంద్రా! తొందరపడకు ఎవరు దొంగిలియుండరు ఎక్కడనో నీవే దాచి యుండవచు జ్ఞప్తికి తెచ్చుకొనుము స్నానమాడి భుజించి నిమ్మళముగా వెతకుము. కలవరపడకు నేను సాయంత్రము వచ్చి తీసికొనిపోయెదను. (ఫోవును)

దేవే--మానదా! బోధపడినది. నీ కైదువేల రూపాయ లెట్లు వచ్చెనొ నేడు తెలిసినది. ఆసొమ్ము స్వార్జితమో, పిత్రార్జితమో, అనునట్లు మీ రందరును కన్ను వేసియుండి... ... నీకుమారుని రక్షించుటకు నాఅయిదువేల రూపాయిల దొంగిలించితివా? తుద కెబ్బెనా గొంగతనము? దారిద్ర్యదశ ఎంతకు తెచ్చినది! చీ! చీ!

(మానద వచ్చును)

మాన--వంటయైనది...స్నానము చేయవచ్చును.

దేవే--(కోపముతో) మానదా?

మాన--అమ్మయ్యో! అట్లుచూచెదవేమి?

దేవే--తుర్కు నీకు దొంగతన మబ్బెనా?
రం 4]

107

భారత రమణి

మాన--దొంగనన మేమిటి?

దేవే--ఏమి ధైర్యము ! నా ఇనుపపెట్టేనుండియే గొంగలించితివా?

మాన--దొంగతన మెవరు చేసిరి?

దేవే--నీవు

మాన--నేనా? బాగున్నది.

దేవే--నేను కనిపెట్టినాను. ఆసొమ్ము చూచినప్పుడే నీకన్ను కుట్టినది. అది నాహృదయమందలి రక్తమాంసములను ధారపోసి కూర్చిరిని. మా తాతల నాటి యిల్లు నమ్మి- ఆహా ఎట్టి యిల్లు --జతపెట్టితిని. నీవు దానిని హరింతువా?

మాన--బాగుబాగు, నేను దొంగతనము చేయుదునా?

దేవే--దాని కేమిలే. నారూపాయి లిమ్ము

మాన-- ఏమి మాటలవి! మీ ఇనిపపెట్టెతీసి మీ సొమ్ము నే నపహరింతునా?

దేవే-- అంతేకాదు. ఏమియు నెరుగనిదానివలె నటించుచున్నావు! పాపము. ఎంత ముద్దరాలవు? ఎంత కపటపుదుర్జాతి మీది! ఎంతకైన తగురుదు. ఏమి సాహసము! ఇది వరకే నాకు విషముపెట్టి యుండవలయు. అట్లేల చేయవైతివి? ఆశ్చర్యముగా నున్నది. అవకాశము కావలసినంత కల్గెనే?

మాన--మీసొత్తుతో నా కేమిపని?

దేవే--ఏమిచేసితివో నీ వెరుగవా? మొన్న నీసుతు
108

[అం 3

భారత రమణి

నికై జరిపిన చర్యకు సొమ్ము సదానందనకు నీవు పంపలెదా? తెమ్ము నా సొమ్ము.

మాన--ఎంత అపకీర్తి ముచ్చట! నేను చేసితినే అనుకొనుడు, వాడు మాసుడు కాడా?

దేవే-- ఏమో? ఆచర్చ యిపుడేల? కాని రక్షించుటకు నాసొమ్మేల వ్యయముచేసితివి? తాతలనాటి యిల్లు-- నానినాము, నాపరము నాఆత్మ-- అమ్మి కూడబెట్టిన ధనము నా సొమ్మిమ్ము

మాన-- అట్లయిన ఇది వినుము. కుర్రవాని చెర బాపుటకు సదానందునకు నే పంపినసొమ్ము నా పుట్టింటివారు నాకు పెట్టిన నగలను తాకట్టుపెట్టి తెచ్చితనది. కాని అందు ఒక కాసైన మీ సొత్తుకాదు. ఇది సత్యము. మీరు నాపై నారోపించిన దొంగతనమును అపదూరును నేను పాటి సేయను. మీకు చిత్తవిభ్రమము కలిగియుండుటచే మీమాట మీకే తెలియదు, (ఏడ్చును)

దేవే-- నన్ను కన్ను మొరగ చేయజాలవు. ఏడ్పు మీ కశిక్షముగా అలవడును. కావలయునన్నప్పుడు కన్నులనుండి కన్నీరు పారజేయుదురు. నాకడ నీజిత్తులు చెల్లవు. సొమ్ము నిమ్ము, లేనిచో--

మాన-- లేనిచో--

దేవే-- నిన్నెమియు ననను. ఇంటినుండి వెడల నడిపదను. ఇంటిదొంగనుంచుకొనుటెట్లు?
రం 5]

109

భారత రమణి

మాన-- మంచి మాటయే.

దేవే-- అటులనా? ఇప్పుడే లేచిపొమ్ము.

మాన-- ఎటు పొవుదు?

దేవే-- నీ చిత్తము నా యింటనుండవలదు (పోవును)

                     ----
ఐ ద వ రం గ ము ::

(చెరసాలలో కేదారుడు మహేంద్రుడు)

కేదా-- నీవు చెరలో ఏల పడితివి?

మహే--మోసము చేసి

కేదా- ఇంత ఆలస్య మైనదేమి?

మహే-- ముందు వచ్చినచో సదుపాయముము లుండి యుండునా?

కేదా-- ఇద్దరము కలిసి మాటలాడుటకు వీలుండి యుండును. నా కీనాడే విడుదల.

మహె--చెఱలో నుండవలసిన కాలము జరిగిపోయినదా?

కేదా-- ఐన నేమి? తిరిగి రావలెనన్న లేక పోలెదు. యజ్నేశ్వరుని కొట్టినందున ఆరు నెలలు శిక్ష అయినది, ఇచ్చటి కావలివానిని కొట్టిన ఇంకొక వత్సరము శిక్షపడును.
110

[అ 3

భారత రమణి

కాని అలాగు చేయను. ఇప్పుడు ఇంటికిపోవుట అత్యవసరము. ఇంకొకసారి వచ్చెదను భయపడకు.

మహే-- ఆపాటిదానికి ఇంటికి వెళ్లనేల?

కేదా-- అవశ్యకమైన పనియున్నది.

గదాధరుడు, హరిపదుడు, కిశోరుడు.(ఇట్లు రెండు మూడు సారు లనును)

మహే--అదేమిటి?

కేదా--నిత్యమును ప్రాత:కాలౌన ఇదే నాజపము.

మహే-- ఏల?

కేదా-- నీ కేమి తెలియను? గదాధరుడు, హరిపదుడు, కిశోరుడు... మీతండ్రి గారికి నేమమా?

మహే--అతనికి శిరోవాతము చేసి మతి భ్రమించినది.

కేదా--అటులనా? నిద్రలో లేచి తిరుగు రోగము నుండి శిరోరోగమున కొకమెట్టు. దానికిమందు నేనెరుగుదును.

మహే--ఏమి టది?

కేదా--గదాధరుడు, హరిపదుడు, కిశోరుడు.

మహే--నీకుకూడ మతి పోయినట్లున్నది.

కేదా--ఔను-పోవుల్చున్నదా? గధాదరుడు-హరిపదుడు..కిసశోరుడు... నీవిక్కడ నుండగానే నేఘు తిరుగ త్వరలో వచ్చెదను. బెంగపడకుము. ఈ శరీరము దేనికైన సహించ గలదు. పుత్రశోమునే భరించును. దీనికై సిగ్గుపడవలదు, ఇది మనయిల్లే అనుకొనుము.
రం 5]

111

భారత రమణి

మహే--నీవ్చు తమాషా మనిషిలా గున్నావు.

కేదా--మఱచినాను యజ్నేశ్వరునకు సుశీలనిచ్చి పెళ్లి చేసినారా? చేయలేదు కదా?

మహే-- లేదు లేదు.

కేదా-- బ్రతికితిని ఇంతవరకు నాకిదేబెంగ, ఇక చింత లేదు, మహారాజుకొడుకున కిచ్చి దానికి పెండ్లిచేయుదును,

మహే-- ఎట్లు?

కేదా--గధాధరుడు, హరిపదుడు, కిశొరుడును, ప్రతిదినము నియమి తాహారము, నియమిత పరిశ్రమ, గాఢనిద్ర, అనుదినమున్ రెండుసారులు వైధ్యుడు చూచిపోవుచుండును. ఇచ్చటి అధికారు లగపరచు ఆదరము అత్తివారింట కూడజరుగదు. భూలోకస్వర్గమన చెఱసాలయే కాని హేతువు మాత్రము ధర్మానసారి కావలయును, లెకున్న ఇది నరకమే

మహే-- అదెట్లు?

కేదా-- నన్ను కక్కా అని పిలువుము

మహే-- అలాగే, చెఱసాల భూమిలొ స్వర్గమంటివి. కక్కా, అదెట్లో చెప్పుమఱి

కేదా--స్వర్గమే, నాకేమి? వేళకు భోజనము, ఇంటి వద్ద అది దొరకదు. రెండుసారులు వైద్యుడు సొమ్ముపుచ్చుకొనకయే చూచిపోవుచుండుల్ను. నేను మాయింటనున్నప్పుడు
112

[అం 3

భారత రమణి

నాకొకసారి జ్వరము వచ్చినది. మూడురోజు లొకతీరున హెచ్చినది. నాల్గవనాడు కాని వైద్యుడు రాలేదు. నాఅదృష్టము వలన నాడి ఆడుచుండబట్టి బ్రతికితిని గాని, లేకున్న ఇంతకాలము జీవించి యుండక పోవుదును, నీ విక్కడ కక్కా అని పిలిచియుండవు.

మహే-- గానుగ మాట?

కేదా--వెర్రివాడా! దానివలన దేహముగట్టిపడును. పెక్కుమంది ప్రొద్దుల్టనే అటు ఇటు తిరుగుచుందురు, దేహారోగ్యమునకే కదా? నాకు నాల్గుసారు లీగానుగను తిప్పినచో శరీరము గట్టిపడుటయే కాక చమురు దిగును. నీవు దీనికి చింతింపకు, నీకండరములు పొంగి శరీరము దృడమగును. రోగమి నీ చెంత రాదు.

మహే--బాగు బాగు

కేదా-- ఇచటినుండి పోయినవెన్క ఎముకలు బైట పడును. ఓపిక పట్టుము. నిజమని నీవే అందువు. చెఱసాల స్వర్గమే!

)(చెఱకాపరి వచ్చును)

చె॥కా-- కేదారా ! వెలపల రమ్ము.

కేదా--గదధరుడు, కిశోరుడు, హరిపడుడు (వెళ్లును)
రం 6]

113

భారత రమణి

ఆ ర వ రం గ ము.::

(రాజమార్గమున మానద)

మాన-- దారిపొడుగున అడుగుచు ఇంతచ్వరకు వచ్చి తిని జైలు ఇటేయున్నదట, కాని నన్ను అందులోనికి పోనిత్తురా? మనసు విరిగి యిల్లు వెడలి వచ్చితిని, ఇప్పుడేమి చేయుదును, భగవంతునిపై భారమువేసి కాలు సాగించెదను జే! పరమేశ్వరా!

(కేదారు డెదురుగా వచ్చును.)

కేదా-- ఇదేమి వదినా! ఒక్కర్తెవు ఎట పోవుచున్నావు?

మాన--నాబిడ్డను చూచుటకు, చెఱసాల ఈవైపుననే కదా? నాకొడు కక్కడ నున్నాడు, వాని జూచుటకు పోవుచున్నాను.

కేదా--ఆడదానవు, అక్కడి కెట్లు పోగలవు? నిన్ను వెళ్ళనిత్తునా? నేనిప్పుడే వానిని జూచివచ్చితిని. సుఖముగా నున్నాడు.

మాన--నీవు చూచితివా? నాతండ్రి సుఖముగా నున్నాడా?

కేదా--ఆహా! సుఖముగా నున్నాడు, నీవింక మరలుము, నిన్ను మీయింటికి తీసుకొని పోయెద.

మాన--నేనిక నక్కడికి పోను.
114

[అం 3

భారత రమణి

కేదా--అదేమి?....ఊరకుంటివి. అక్కడి కెందుకు పోవు?

మాన--నేను వెళ్లను

కేదా--ఇంకెక్కడికి వెళ్ళుదువు?

మాన--కనబదు చోటికి.

కేదా--ఎన్నియే చోటులు కనబడును, అన్ని చోటులకును పోగలవా? నిజము చెప్పుము. ఎక్కడికి పొయెదవు?

మాన-- కాటికి.

కేదా--కాటికి బో నీకేమిటికి? ఇంటికి పద, సుఖము కలుగ గలదు.

మాన--నేను పోను, గ్రుక్కెడు ప్రాణము విడువక మునుపు కొడుకు నొకసారి చొడవచితిని.

కేదా--నీమతి చెడినది. దానికి మందు నేనెరుగుదును, గదాధరుడు, హరిపదుడు, కిశోరుడు. మాన--వీరెవరు?

కేదా--ఇక్కడ నేను చెప్పను, ఇంటికి పద, జైలు నుంది నాకిప్పుడే విడుదల ఐనది.

మాన--నీవు పొమ్ము, నేను రాను

కేదా--నీకు రాక తీరదు.

మాన--ఊహు! నేను రాను.!

కేదా--ఎందుకు రావు? నాతొ చెప్పరాదా? నేను నీకు మఱదిని కానా? మీయింటికి పోనందువేల?
రం 6]

115

భారత రమణి

మాన-- నన్నింటినుండి గెంటినారు.

కేదా--ఎవరు? అన్నగారే? వదినా, ఇది కలయా, నిజమా? ఏదో జగడ మాడియుందురు. సంసార మున్నచోట జగడము లుండవా? అట్లుండుటయే మేలు. లేకున్న లోకయాత్ర పాతగిల్లి సుఖమునీయదు. అమ్మా! ఇంటికే పద. నీవు గృహలక్ష్మివి.

మాన--నేనక్కడికి పొను.

కేదా--పోనీ! ఎచ్చటికి పోవ నెంచితివి.

మాన--పుట్టింటికి.

కేదా--సరే, కోపము తగ్గినతోడనే రావచ్చును... స్త్రీ స్త్రీచిత్త మతి విచిత్రముజ్. గడియలో అగ్నివలె నుండును, గడియలో మంచువలె చల్లారును, నీకు తోడెవరు?

మాన--ఎవరును లేరు.

కేదా-- నేను నీవెంటవచ్చి నిన్నక్కడ విడిచెదను. లేదా, నీకిష్టమున్నచో మాయింటికిపద. నాయిల్లు నీయిల్లుగ భావించుము. (పోవును)

---
116

అం 2]

భారత రమణి

::ఏ డ వ రం గ ము::

(ఉపేంద్రు నింటిలో అతడు, వినోదిని)

వినో--బాబయ్యగారూ, నన్నింటికి పోనిండు, నా పల్లకిబోయీల పిలువనంపుడు; నేను పోయెదను.

ఉపే--కలవర పడెదవేల? నీకు భయములేదు.

వినో--మీదు భయములే దనుటచేతనే నాకు దిగులు కలుగుచున్నది. మీస్వరము గద్గద మౌచున్నది. దృష్టి మారినది, ముఖము వెలవెలబరు చున్నది. మీ చందమొప్పటివలె నుండక మారిపోయినది.

ఉపే--నీకు భయము వలదు, నామాట నమ్ము

వినో--అదిగో మీనాలుక తడబడుచున్నది. నాకు భీతి కలుగుచున్నది. నన్ను కొట్టినను, తిట్టినను, ఇంటినుడి తరిమినను, ఇంకేమి చేసినను, అతడు నన్ను కన్నతండ్రికదా? పుట్టినిల్లుసాటి భువినుండబోదు! పల్లకిబోయీల పిలిపించుము లేకున్న నడచి పొవుదును. (బైటకి పోబోవును)

ఉపే--నీవిట నుండుము, నేను పోయి వారిని పిలుచుకొని వచ్చెదను.

వినో-- నేనుకూడ మీవెంట వచ్చెదను.

ఉపే--ఏల?

వినో-- ఇక్కడ నే నొంటరిగా నెట్లుందును? మీరెట్టి వారైనను నాకు పితృవ్యులు కదా? నేను మీబిడ్డను.
రం 7]

117

భారత రమణి

ఉపే-- కేశవా ! మధుసూదనా!

వినో-- అమ్మో! హరినామస్మరణ చేసే వేల? అట్లు మీరొనర్చునపుడెల్ల మీమనమున దెద్దియో పైశాచిక సంకల్పము పుట్టుచుండును, అందులకే నాకు దిగులు.

ఉపే--బోయీల పిలిచెద, నీవిట నుండుము.

వినో-- నేనుగూడ వచ్చెదను.

ఉపే-- వలదు (బైటనుండి తలుపు వేయును)

వినో--బాబయ్యగారూ! ఏమిది ? తలుపేల వేసితిరి? తలుపు తీయుడు.

(తలుపు తీసుకొని యజ్నేశ్వడు వచ్చును

వినో-- (అదిఱిపడి) ఇత డెవడు?

యజ్నే--(వింతపడి) ఈమె ఎవతె?

వినో--మీ రెవరు?

యజ్నే--నేను యజ్నేశ్వరుడను... ఆమకన్న అందకత్తె- మేలయ్యె

వినో-- మారిటుల వచ్చితిరి?

యజ్నే-- ఇప్పుడే తెలయ గలదు నీచెల్లి లేది? ఆమె యిటనున్న దనుకొంటిని.

వినో-- ఆదుకొంటిరా ఆమె యిటనున్నదని!

యజ్నే-- లొచ్చులేదు నీవామకన్న నందకత్తెవు, అనాధవు--రమ్ము!

వినో-- ఎక్కడికి?
118

అం 8]

భారత రమణి

యజ్నే-- భయమెల?... ... రమ్ము... బండి సిద్దముగా నున్నది. నిన్ను సుఖపెట్టేదను-ఏమది? రెప్పవాల్చక తదేకధ్యానమునచూచుచు నిలుచుండెదేల? రమ్ము పొవుదము (చేయి పట్టుకొనును)

వినో-- ఇంత దౌష్ట్యమా? చేయివదలు (విదిలించుకొని తలుపుతట్టి) బాబయ్యా! బాబయ్యా!

యజ్నే--(నవ్వి) ఎవరిని పిలుచుచున్నావు? బెబ్బులి బారినుండి తప్పించుమని వరడును. వేడుకొను మేక పిల్లవలె అరచెదవేల? అడవినుంది పరుగెత్తివచ్చి పసరిక కప్పిన పాడు నూతిలో పడితివి... అతని కిదంతయు తెలియును.

వినో-- ఆ! తెలియునా ! అతని కిది తెలియు నందువా

యజ్నే--బేలా! తెలియకున్నచో అతనియింట అతని తమ్మునికూతురింట సాహసించుమొగలి నగుదునా!మ తెలియుటే కాదు.ఈ సదుపాయము నాకు చేసిపెట్టినవాడు అతడే. నీ అధరసుదారసము నానుటకు నాకడను కల్పించిన వాడతడే. ఈ విషఘంటిక నాకొసంగినవా డాతడే.

వినొ--నేనిది నమ్మజాలను. నాతండ్రి ఇట్లు కానించునా?

యజ్నే--ఇది అసంబవ మనుకొనుచుంటివా? గోలా, ధనాశాప్రేరితుడైనచొ పురుషుడెట్టి పాపమునకైన వడిగట్టును. ధనమునకై ప్రాణములు తీయును, విషయసుఖమునకై విరాగులవలె జనుల ధరించును, తగినంత ధనమిచ్చినచో
రం 7]

119

భారత రమణి

ఎట్టిదారునకృత్య మొనర్చుటకైన వెనుదీయడు...ఏల నాపై నెర్రబారి చూచెదవు?

వినో-- అయ్యో! నరకము ! నరకము!

యజ్నే-- జాగుసేయక రమ్ము

వినో-- అబ్బా! హా దైవమా, నా కేదిదారి?

యజ్నే-- నేనుఇ చూపద రమ్ము...(చేయిపట్టుకొనిన తోడనె ఆమె మూర్చిల్లును)

యజ్నే- ఏమిది! ఆ తెలిసెను. పిత్రువ్యుడు పెద్దవాడు.. ఇట్లొనప నెంచునా? పాప మీముగ్ద యీమాత్రము బావింప లేకపోయె. దనమాహాత్మ్యమిది. దాత్రినంతటిని తాఱుమాఱు చేయగలదు. రక్త మాంస సంబంధముతొ దానికి పనిలేదు... కాంచనము కన్న కాంత ఘోరతరము. (విణొదినిని చూచి) స్త్రీలు కమనీయగత్రలు, మనోహరిణులు, గావున లోకమోహినులు... రిపుగ్ణమున కామము మిక్కిలి బలిష్ఠము. తుఫాను కన్న దుర్దమము, ఆవలముకన్న అవార్యము పిడుగుకన్న దృఢము, మహమారికన్న మమతాశూన్యము; హింసకన్న అంధతరము, లొభముకన్న అతృప్తతరము-- ఈ సంగతుల నెల్ల జనులు వినుచుందురు. కనుచుందురు. దీనిమూలమున ఎన్ని రాష్ట్రములు నశించెను. నిరతిశయబలశాలురగు సుందోపసుందులు దీని మూలముననేకదా సమసిరి. అనన్యసామాన్య మహిమోపేతుడు, ఆపదల హ్మయు నగు విశ్వామిత్రుడు దీని
120

[అం 3

భారత రమణి

మూలముననే కదా తపోభంగ మొనర్చుకొనెను. పరమపావని యగు అహల్య దీనిమూలముననే కదా పతిత యయ్యెను. అనుపదీవిశాలురగువా రింకెందరో ఆధ:పతితులైరి. దీనికటాక్షవీక్షణమున లొకవిద్రావణుండగు రావణుడు దీనివలననే సమూలము నశించెను.. ఈవుత్తాంతముల నందరు ఎరుగుదురు కాని జ్ఞప్తియం దుంచుకొనరు. ఇదియే ఇందలి రహస్యము... కామినులు విశ్వమోహినులు, "నెలదివేగుచుక్క తిలకించి నంతనే తెలివితెల్లవారును"... కోమలమగుఈమాంసపిండము నకు ఐదువేలరూపాయి లర్పించితిని. అయినను నష్టముజ్ తొపదయ్యె...నిండిన కడుపు, మూసిన సిగ్గు, కమనీయ కాంత... ఈమూడును ఒక్కచోట జతపడెనేని హృదయమను నరకకూపమునుండి పైశాచికభవగణము పెల్లుబుకును...ఈమెకు తెలివి వచ్చుచున్నట్లున్నది... ఆ! నలువైపుల తిలకించు చున్నది... ఏమి రూపవతి! అయ్యారే! భువ్నమోహిని!

వినో-- ఏట నున్నాను? నీ వెడవు...అయ్యో ! నీవేనా? ఇది కలగాదా ఏమి భయావహదృశ్యము!

యజ్నే-- సుందరీ!

వినో-- (చెవులు మూసికొని) అబ్బా! అబ్బా! నీపని మానవా? ఎంత ఘోరము!

యజ్నే-- యువతీమణి ! (చేయిపట్టుకొనును.)

వినో-- మాం రక్ష! మాం రక్ష!
రం 7]

121

భారత రమణి

యజ్నే-- ఎవరికై మొరనెట్టుచుంటివి! ఇంట నెవ్వరును లేదు. నేను నీవే సంకోచింపకుము.

వినో-- ఆయ్యో, అయ్యో, ఘోరము!

యజ్నే-- నవలామణి, నిన్ను బలాత్కరింపను... నెను నిన్ని వలచితిని.

వినో--ఏమంటివి? పులి మేకను, పాము కప్పను వలె నీవు నన్ను వలచితివా? వలదు. వలపుమాని నన్నేవగింపుము, నిరసింపుము, నిన్ను వేడుకొనెద-- ఇదేమొక్కుచుంటిని.

యజ్నే--బండి వేచియున్నది, పోవుదమ్ము రమ్ము.

వినో-- అయ్యా! నన్ను విదువుము.

యజ్నే--సంకోచింపకు, నిన్ను కష్టపెట్టను.

వినో-- వలదు-నాకేమియు వలదు. విడిన చాలును. ఇదే నీపారములపై బడెదను.

యజ్నే-- మోహినీ, మన మీదేశమున నుండక నీచిత్తమువచ్చిన చోటునకు పోవుదము, పద.

వినో-- అయ్యా! నన్ను విదువరా?

యజ్నే-- విదువను, ఇది నాప్రతిన.

వినో-- ఓహో! ఏమి మాత్ర్పతిజ్ఞ! నాప్రతిన వినుము. ప్రాణము వీడెద్ గాని మానము వీడను.

యజ్నే-- పాడిన పాటయే పాడుచుంటివి, అప్రశంస మాని రమ్ము పోవుదము.
122

[అం 3

భారత రమణి

వినో--అయ్యో ! రక్షింపుడు, రక్షింపుడు.

యజ్నే--ఇందెవరును లేరు. ఇమ నీసంకేతనం మాని నావెంట రమ్ము (మెడపై చేయివేయును.)

వినో--ధూర్తా! దూరమున నుండు (త్రోయును)

యజ్నే--అబ్బో! ఇక దాసనేల! (కత్తిచూపును)

వినో--నన్ను పొడిచి చంపుము. చూచెదవేల!

యజ్నే--అట్లుచేయుటకు నేను రాలేదు. నాకు నీపాటి బలము లేకపోలెదు. రమ్ము,(పట్టుకొనును)

కత్తిదాచును

వినో--అయ్యో! అయ్యో! అన్ను రక్షించువారు లేరా! విపత్సముద్రమున మున్గిన అనాధల మానరక్షణము నకై దివ్యు లవతిరింతురని వింటిని. ఎవరును రారేమి! శాస్త్రములు, పురాణములు, స్మృతులును అసత్యము పల్కునా? నాకెవరును దిక్కి లేదా? శరణాగతత్రాసహారులు దీనమానరక్షకులు. నన్నుగాచు భద్రాత్మకులులేరా- నేను దిక్కు లేనిదాననైతితినా?

యజ్నే--ఆ! దిక్కు లేకేమి? నేనున్నాను.

వినో--మీరా! ఇక నాకుభయమేల! ఆర్యా నీవీ నా రక్షకుడవు. నీ పాశవప్రకృతికి ప్రతికూలముగా నీ మహత్ప్రవృత్తి నాశ్రయింతును. నాప్రాణమును గొని మానమును నాకుంచుము. నీ అత్యాచారమునకు విరుద్దముగా నీమానవధర్మము నాశ్రయించి ఈభిక్ష యాచించుచుంట్టి
రం 7]

123

భారత రమణి

ప్రాణమును నీయధీనము చేసితిని, మానమును నా అధీనము నుంచుము. నీవివక్షమున నీవే నిల్చి నాకు మానభిక్షపెట్టుము. నన్ను రక్షించు, మహాత్ర్మా, నీ దాసురాల, నీ కూతురను-- నీ పాదములపై బదుచున్నాను. మాంరక్ష!

యజ్నే--నేనా?

వినో-- ఆహా! నీవే-నీ మహత్వౌర్గమున నాకాశ్రయమిమ్మని వేడుచున్నాను. ఎట్లొసంగవొ చూచెదగాక!.... ఆశ్రయించిన అబల నావలకు ద్రోయుదువా? పరాంత్నై, ఆపదనగు నేను నా పరమశత్రువగు నీపాషాణదుర్రమున తలదాచుకొన తావిమ్మనుచున్నాను. ఆదుర్వము మొదట జీర్ణము శీర్ణమునై నన్ను రక్షింపలేకుండుటచే నట్టడవికి పరుగెత్తితిని. అట నామొర అరణ్యరోదన మయ్యె. అనిన మనమొనర్చలేకపొయె. మాతృగర్భమునుండి నన్ను చీల్చి, బయటి కీడ్చి, నాశత్రువగు నీవు ప్రతిహింసాప్రేరితుడవై, నామానము హరింప కృతప్రతిజ్ఞడవిఅ, నాపక్షమున కత్తితొ పొడువనను కట్టినచో నాకుచరమాశ్రయము. అంతిమరక్ష-నీమానవత్వమే. పాదములపై బది, కన్నీరుమున్నీరుగా నేడ్చుచు, శిరమువంచి కరములు జోడించి, పరాభూతయు, ప్రదీడితయు నగు అనాధయువతి క్షమాబిక్ష యాచింప, ఎట్టిముష్కరహస్తము నలంకరించిన ఖడ్గమును తానుగ జారి క్రిందఫడదా! కోపపరితాపఘూర్ణితములగు కన్నులు శోకానుతాప భష్పపూరితములు కావా! మానసమున కనసలాడు సరసాగ్ని నీఱు
124

[అం 3

భారత రమణీ

కాదా? నిరాశ్రయను, అనాధ నగు బాలికను నన్ను నీవు సొదరీభావమున జూడకుందువా? భూతదయార్ద్రమై, దివ్యతేజోమయమగు నీ ఉదారహృద్యదుర్గమున నాకిరవుకల్పింపనేరవా? దైవాంశసంభూతంబగు దయ విలసిల్లుటంజేసి అది లోహముకంటె దృడతరము, పుణ్యతీర్ధములకంటె పవిత్రతరము ఇహమందలి స్వర్గము-అట్టి నీ మానుషత్వదుర్గరాజమే నాకే కాశ్రయం, అందే నేను తలదాచుకొన నెంచితిని. వయసుమీరిన వాడవు. ధనాడ్యుడవు. ఇద్దరుభార్యల గూడి ముద్దుముచ్చటల వీగినాడవు- బ్రాహ్మణుడవు-- విచక్షణుడవు.. నేను చెప్పగల్గినది చెప్పితిని. ఆపైని నీవూహించుకొనుము. పిదప నీ చిత్తము, నాబాగ్యము.

యజ్నే--వలదు. భీతి వలదు-కుమారీ! నీ కెట్టిహానియు చేయను. నేనెంత నీచుడనైనను మానవుడను-నాకన్నులు విషయస్నేహసిక్తములగుటచే కనబడకయుండెను. నిన్ను చూచుటచేతన్, నీమాటలను వినుటచేతను, నాహృదయమున సద్భావ ప్రబోధప్రత్యూష మగుటచే అజ్ఞానాంధతమన మంతరించెను. నీ స్వచ్చశీలకాంతి నన్ను పవిత్ర మొనర్చెను. ఆమ్మా! నాతప్పు సైరించుము. నాదుండగమును క్షమింపుము. నాకు సెలవొసంగుము...పొవును

                  ------