భారత రమణి/నాల్గవ అంకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf

నా ల్గ వ అం క ము

:: మొదటి రంగము:: 

(సదానందుడు నిల్లు సదానంద వినయకుమారులు)

సదా--ఇంటినుండి తరిమెనా!

విన-- ఔను.

సదా-- తన భార్యను? దొంగతనము చేసెననియా? నిద్రాప్రచ్లనరోగమునుండి పిచ్చి కొకమెట్టు. సుశీయు పోయెన?

సదా--పోయెను, తల్లి ఆమెతో చెప్పకయే ఇల్లు వెడలెను. తండ్రి ఆమెను తరిమెనని వినినతోడనే సుశీలకు పట్టరాని కోపము వచ్చుటచేత ఆమె తండ్రియెద్దకు పోయి, "తండ్రీ! నేనుకొడ తరలెద నని" చెప్పి పోయనట.

సదా--అత డేమనెను?

విన--మాటాడ లేదు

సదా-- వింతగొల్పు బాల సుశీల! ఎంత విపరీతము! క్రిందు మీదైనది! ఇది ఆంగ్లవిద్యా మహిమ.

126

[అం 4

భారత రమణి

విన-- విద్యాభ్యాసమున విపర్యానము సంభవించునా! విద్యావంతులందరును స్వతంత్ర్యము బూన నెంతురా?

సదా--ఇప్పుడు ప్రత్యక్షము కాలేదా?

విన--ఆంగ్లవనితలు.. ... ...

సదా-- నాయనా! వారిమాట యెత్తకు, ఐదువందల లేడ్లనుండియు వారు విద్యాభ్యాస మొనర్చుచున్నారు. కావున వారికది స్వాబావికాచార మైనది. వారిలో నందరును చదువుకొన్నవారే, అందుచే విద్యాగర్వ మునకు వీలులేదు. విద్యావతు లౌట వారు వినయసంపన్నులగుదురు. మనదేశమున విద్యనేర్చిన వనిత నూటికొకతె. అందును పట్టపరీక్ష యిచ్చిన పడతిని పట్ట పగ్గముండదు, అమి తాహంకారము! స్త్రీసామాన్యమగు, అశక్తకు విద్య యొసగు దుస్సర్వజ్ఞత్వము తోడగును, కన్నులు నెత్తికెక్కును, భూమిపై అడుగు పడదు, క్రిందనున్న పంటలుండవు, మీదన్నున్న వర్షము లుండవు.

వినో--సుశీల చేసిన పని నింద్యమనియా మీ యభిప్రాయము?

సదా-- కొంతవరకు నింద్యమే పెద్దలయెడ భయభక్తి శ్రద్ధలతో మొలంగుట స్వతస్సిద్దమగు సుగుణము. తలిదండ్రుల చెప్పుచేతలకు లొంగని వారి భావి శుభావహము కానేరదు.

సదా--పెద్దల మాటలు పెడచెనిని బెట్టిన పడతులు మనదేశమున లేరా!

రం 1]

127

బారత రమణి

సదా-- ఏరీ? వేలు మడిచి చూపుము.

విన--సావిత్రి! ఆ సతీశిరోమణి పేర నొకవ్రతము నేడు ఆచరింపబడుట లేదా?

సదా--ఆమె అహమికతన్, అనర్గళతకును తగిన ఫలము లభించినది. అచిరకాలమున వైధవ్య మనుభవింపలేదా? సచ్చారిత్ర ప్రబావసాహాయ్యము సమగ్రముగా నుండెను కావున ఆకష్టము నామె కాలదన్నెను. నేతి బాలికలు సావిత్రియందలి హరము ఆ వినయమును మాత్రము అనుకరింప గల్గిరి కాని, తదితర గుణగనం అందును సచ్చరితాప్రభావమును న సాదించ గల్గిరా!

విన--అట్లనుకొనుటకు ప్రమాణమొ?

సదా--సుశీల ఎట్టిదని నీ యభిప్రాయము?

విన--ఆమె సార్ధక నామ సచ్చరితాప్రభావమును సంగహించె ననియే నా నమ్మకము.

సదా--(నవ్వి) ఈ కన్నుల నీ రెప్పలు దూరము కావుగదా?... ఆమె యెట్లేగెనో తెలిసినదా?

విన-- సరిగా తెలియదు.

సదా-- ఎద్దియు స్పురింపకున్నది. ఇప్పుడు దేవేంద్రుడీవిషయమునను నాతో నాలోచించుట మానినాడ్. నన్ను చూచుటయన్న అతనికి తలనొప్పి-ఐనను ఒకసారి చూచి వచ్చెదను..... పోవుదురు.

---

28

[అం 4

భారత రమణి

--రెండవ రంగము--

--(నడుత్రొవలొ భక్తగణము)-- 

హరి-- ఓరీ, ప్రభువుగారి భోగట్టా తెలియనే లేదు.

వినో--ఔను, ఏదో విశేష ముండవలయు

శంక--ప్రభువుగారి పంధ మరిన ట్లున్నది.

నవీ--మహాప్రబూ! ముమ్మువీడి ఎట బోయితిరి!

హరి--అయ్యో! వీడు కంట నీరుబెట్టు చున్నాడు!

నవీ--గురువుగారు నాకేదైన పని నిప్పిందెనని పల్కిరి. అయ్యో! గురువరా, ఇప్పు డెందుంటిరి!

హరి--అయ్యో! పాపము ఎంత దురదృష్టవంతుడవు.

వినో--బెంగ పెట్టుకొనకు, నవీనా.

నవీ--ఊరంతయు వెదకి ప్రభువుగారి పత్తా గంటినా

శంక--ఏమి చేయుదువు?

నవీ-- నాతృప్తితీర రెండిచ్చుకొందును/.

హరి-- ఏమిరా! అదేమి?

నవీ--ఎంత చాకిరీ చేసినాను! అంతయు నిష్పలము.

వినో--విసిగి వేసారి నిరాశ చెందకుము భక్తుల వాంచితముల ప్రభువువారు నెరవేర్చకపోరు.

శంక--వారిలీలలు అగమ్యగోచరములు!

(నవ్వుచు కేదారుడు వచ్చును

కేదా-- అహ్హహ్హహ్హహ్హ!

రం 2]

129

భారత రమణి

వినో--ఏమి కేదారా, ఎందు కా నవ్వు!

కేదా-- నోరు మూసుకో! నన్ను నవ్వనీ.

శంక--సంగ తేమో చెప్పుము.

కేదా-- ఓరీ! నన్నడ్డకు, సర్కారువరి రోడ్డిది. నాచిత్తము నేను నవ్వు కొనెదను. నీవెవ్వడవు ననండుగుటకు? హిహ్హిహ్హిహ్హి! అహ్హహ్హహా!

నవీ-- సరే కాని, కేదారా, ఇది....

కేదా-- నొరు మూసుకొనుము. గాడిదెగుడ్డు లాగు, తొత్తుకొడకా! పింజారీ! మీ దారిని మీరు పోక నాచేత తిట్లేల తిందురు? నేనెవ్వరిని తిట్టకూడదని తీర్మానము చేసుకొంటిని, కాని మీతుంటరిమూకను చూచినతొడనే నా నోరు ఊరకుండదు.

నవీ--మామతము మారినది మాకు బుద్ది వచ్చినది.

కెదా--నిజమే? మీ మాట కేమిలే- మీది కుక్క బుద్ధి! అతని బుద్ధి మారునా?... ఒరీ, నన్ను రేపకుడు. అహ్హహ్హా ఇప్పుడు జెయిలులోనికి పంపెదను. పెద్దన్నా! జైలునకు నడువుము. తా ధీం తానా కిటకిటతక తాధీం తానా (ఆడును)

వినో--అదేమి? కేదారా! ఆదుచుంటివి!

కేదా--కిటకిటక తా ధేం తానా... ప్రభువు గారికి కారాగృహ ప్రవేశము.

శంక-- కారా గృహమే!

130-

[అం 4

భారత రమణి

కేదా-- ఎవడురా వాడు? ఓరీకంచరగాడిదే! నరాధమా! పశువా!...ఆ! అదేమి? కేదారా! ఇక తిట్టనంటివే! పరనింద పాప హేతువు... మరియాదగా మాట లాడుము... అన్నలారా! శ్రీయుత ఉపేదమహాశయులు గారికి కారాగృహప్రవేశ మహోత్సవము కానున్నది.

నవీ--కారాగృహమే!

కేదా--ఆహా- కరాగృహమే. జెయిలె. చెరసాలయే. బందిఖానా. అచ్చటికి పోయిఅవతారపురుషులు కావున దానిని పవిత్రము చేయవలదా? అహ్హాహ్హ హ్హా అన్ని ముచ్చటలును తీరవలయునా లేదా?

నవీ-- ఏమంటివి? ఏల?

కేదా--ఇక చెప్పను, కాని కారాగృహప్రవేశ మహోత్సవమునకు ముందు రెండుమూ డర్ధచంద్రప్రయోగములను అలవడజేయ నైతిని. ఈకొతుకు నామానవమును జరుగనున్నది (నవ్వును)

నవీ-- ఏమి టాచిత్రము?

కేదా-- చెప్పనా!... చెప్పవలదని నిషేదీంచెనే?

వినో-- ఎవరు?

కేదా-- చెప్పుదునా!... చెప్పను... ఇదిగో వినుడు...

ప్రమాణము చేత జిక్కినది... ఇంకొక అక్షరము చెప్పినచో అంతయు బట్టబయలగును.

రం 2]

131

భారత రమణి

శంక-- ఐననేమి? ప్రమాదమా?

కేదా-- సందేహమా? అయ్యగరి పని అయినది.... తుదకు యజ్నేశ్వరుడు! ఓహో! చెప్పివేసితినే!... ఆ!.. మరి చెప్పను. ఇక చెప్పను.

శంక--ఎందుచేత?

కేదా--ఆమాట దాచుటకూడ అసాధ్యముగా నున్నదే!

వినో-- అట్లైన చెప్పకూడదా?

కేదా-- ఓహో! ఏమి చిత్ర మెమి చిత్రము !అహ్హహ్హాహ్హ.. యజ్నేశ్వరుడు! ఓహో! ఏమి వింత!... అలమరలో.. ఓహో బాలో! ఏమి మజా!

నవీ-- ఏమిటది? చంపక చెప్పుము.

కేదా-- అయ్యొ బాబో! చెప్పివేసితిని. ఇంకేమున్నది? దాచలేక పోయితిని. కడుపు పగిలిపొవుచున్నది. ఏమి చిత్రము!

అందరు-- చెప్పు! చెప్పు! చిరమేదో.

కేదా-- అహ్హహ్హహ్హా! గడ్దిచిక్కే వచ్చినది. సంగతేమిటో తెలియునా?... సాక్ష్యము సిద్ధముగా నున్నది... అలమరలో... హా:హా: .. ఇక నా తరం కాదు!

హరి-- సంగ తేమో చెప్పనే లేదే?

కేదా--చెప్పుదును. గ్రంధము చాలయున్నది. చెప్పవద్దన్నారు.

శంక--దానికేమి లే.

132

[అం 4

భారత రమణి

కేదా--మీ ప్రభువుగారికి కారాగృహప్రవేశము తప్పదు. ముడిమాట చెప్పితిని. మీది సంగతులు మీకేల?

హరి--సాంతము చెప్పుము.

కేదా--ఇంకిట నుండను. ఉండినచో దాచలేను పెదవి దాటునేమో!... నాలుక చివర నున్నది...(పారిపోవును)

నవీ-- వీనికి పిచ్చి ఎత్తినదా ఏమి?

హరి-- లేదులేదు మతిచెడినట్టు లెదు.

వినో--జైలునుండి వచ్చెను కదా?

శంక-- అట్లైన పిచ్చియెత్తి యుండును.

నవీ--కాని ప్రభువు....

హరి--ప్రభువు లేదు గిభువు లేదు. ఆమాట నెత్తక నడువుము.

వినో--కిరీటపూజ కాకుండగనే!

శంక--ఆ సత్కారము సాగింఅకయే మనము పొవుట భావ్యము కాదు. గురుదక్షిణ ఈయవలదా?

హరి--కంట పడినచో కానుక లిత్తుము వెదకుదము రండు... (ఫోవును)

              -----

---:మూడవరంగము:--

(పడవల రేవులో సుశీలా వినోదినులు)

వినో--ఇల్లు విడిచి ఇక్కడి కేల వచ్చితివి?

రం 3]

138

భారత రమణి

సుశీ-- నా కిల్లు లేదు, వాకిలి లేదు. నిరాశ్రయను.

వినో--ఎక్కడికి పోవ నెంఛితివి?

సుశీ-- ఏమో?

వినో-- ఇమ మరలుము.

సుశీ--ఎక్కడికి?

వినో--మన ఇంటికి.

సుశీ-- అట నా కనువుపడదు.

వినో--ఏమీ? అతడు తండ్రి కాడా?

సుశీ--అతడు మన అమ్మను ఇంటినుండి తరిమెను, తల్లిలేని పుట్టిల్లు తలపనేల? నేను--అమె తనయునయ్యి ఆయింటికి పోవుదునా? ఇంతకును ఆయన నననేల? అనాదినుండియు మనకు పురుషులచే అవమానము ప్రబలుచునే యున్నది. తండ్రిగారిది తప్పు కాదు, ఇది లోకమర్యాద!

వినో--ఆ వేటి మాటలు! మన కన్న వస్త్రములను వారేకదా యిచ్చుచున్నారు.

సుశీ--అబ్బా! ఏమి వారి దయాహిల్లోలము! పట్టెడు కూడు పెట్టుచున్నారని ఇంత అహంకృతి యేల? పరుల పాదములపై బడి పిడికె డన్నమునకై బిచ్చకత్తెలవలె పెనగులాడుట మన కేమి గౌరవము? అది లజ్జావహము కాదా?

వినో-- నీమాట లెంత వింతగా నున్నవి? చాల్చాలు ఇక నింటికి పద-నిన్ను వెదకుటకు నలుదెసల మనుష్యులు వెళ్ళిరి. నేనుకూడ నిన్ను వెదకి వేసారి తుద కిట గాంచితితిని!

134

[అం 4

భారత రమణి

సుశీ--ఇంత శ్రమపడి యేల వచ్చితివి?

వినో-- నీకు బుద్ది చెప్పుటకు నీ విట నుందువని వినయుడు చెప్పగా వాని తోదున వచ్చితిని. నేను నీ సోదరిని. పెద్దదానను, కావున నామాట వినుము. ఇంటికి నడువుము. ఆడదాని కింత యుద్దత శోభస్కరము కాదు. మనము దుర్బలులము, అజ్ఞానులము.

సుశీ--అట్లని పురుషులు మనల కాలితో తన్నవలయునా? వారి కంత పొగరా! ఆడది మానవ జాతిలోనిది కాదా?... రెండు పూటలు రెండు పిడికిళ్ళ కూటికై మనము వారిని యాచింప నక్కరలేదు. ఈపాటి గడించుకొనగలము.

వినో--చిన్నప్పుడు నీతీ రెట్లుండలేదు. తండ్రి యన్న ఎట్టి వాడని ఎంచితివి? అతడు దైవసమానుడు, అనితర ప్రీతి మాసన్నే ప్రియంతే సర్వదేవతా," అని శాస్త్రములు ఘోషించుదున్నవి.

సుశీ--శాస్త్రవచనములను నేను మన్నింపను. ఈవిషయము వేయిసారులు చెప్పియుంటిని...తండ్రిగారి యెడ నాకు భక్తి లేకపో లేదు. అది అందరికిని స్వాభవకమే. కాని అతడునన్ను కాలితోతన్ని, మా అమ్మను ఇంటనుండి తరిమిచంపిన నాకాత్మగౌరవ ముండగా! నేను మానవ జాతికి చెందనా?

వినో--ఇదంతయు పాశ్చాత్య విద్యా ప్రభావము

రం 3]

135

భారత రమణి

ఎంత చేసినను అతడు తండ్రి కదా, శ్రద్దాపాత్రుడు కాడా?

సుశీ--నా కాతనియెడ భక్తిశ్రద్ధలు లేకపోలేదు. అందుచేతనే అతడు నన్నెంత నిరసించినను సహించితిని. మన తల్లి మరణమునకు మాత్ర మతని నేను క్షమింపను.అతని యింట నుండ నొల్లను.

వినో--పోనీ, ఆయింట నుండ నక్కరలేదు, వినయుని పెండ్లి యాడుము. మాకదియే చాలును.

సుశీ--ఊహు (తల యూచును)

వినో--ఏల?

సుశీ--ఆచర్చ నీకేల?

వినో--పెండ్లియే చ్డేసుకోవా?

సుశీ--చేసుకొనను.

వినో--ఏమి చేహ్యదలచితివి?

సుశీ--బ్రహ్బ్మచర్యము.

వినో--అమ్మయ్యో! పాలన్ అ చేయగలవా?

సుశీ--నీకు చేతనగును కాని నాకు చేతకాదా?

వినో--నాప్రారబ్దము నీకేమే?

సుశీ--నా వరలబ్ద మది-కోరిక నీకు నచ్చినది, కోరుటచే నాకు వచ్చినది.

సుశీ--మన సంఘము....

సుశీ--ఘాతుకమృగము వంటిది. దాని విధానము

136

[అం 4

భారత రమణి

అను నేను సాటిసేయను.

వినో--పాటించినను, పాటింప కున్నను, పెండ్లియాడి నను, ఆడకున్నను.... ఇంటికి నడువుము.

సుశీ--నేను రాను. అక్కా! నా స్వభావము నీకు చక్కగా తెలియును. ప్రతికర్యమును, నాకు నచ్చినట్లు నాబుద్దికి దోచినట్లు, నాప్రవృత్యనుసారము చేయుచుందును, కాని ఒకరి మాట వినను, నామేలు నే నెరుగుదు.

వినో--ఇంటికి రావా?

సుశీ--ఎన్నిసారులు చెప్పుచుందువు! నేను రాను. నాతల్లి కట చోట లేకుండిన నాకు మాత్ర ముండునా? నీవు పోయి హయిగా కడుపునిండ తినుచు కంటినిండ నిద్రించుచు జీనములను భరించి యుండుము. అది నా చేత కాదు. అట్టి బ్రదుకు నాకేహ్యము.

వినో-- ఇంతకన్న నెక్కువ నేనేమి చెప్పగలను?... ఒకవేళ వినయుడు బోధించిన విందువేమో?(వెడ వెడ నవ్వును) కాని అతడు నీయెదుట పడుటకు కూడ సమ్మతింపకనన్నిట విడిచి నదీకూలమునకు నడిచెను. నీ నోటివడిచేతనే అతని మనసు నొవ్వజెసితివి.

సుశీ-- ఔ నక్కా, తప్పంతయు నాదే, అట్లే చాటుచుండుము. వినో-- అయితే ఇంటికి రావా?

సుశీ--రాను.

రం 3]

137

భారత రమణి

వినో-- ఎక్కడికి పోయెదవు?

సుశీ--వల్లకాటికి వినో-- అబ్బా! ఎంత మాటాడితివే! చెల్లలా, నాతో చెప్పిననేమికష్టము! నీకునేడు కోపంవచ్చినది. లేకున్న నాతొ నింత పరుషములు పల్కుదువా? ఆత్మహత్య కావించుకొనిన ఆమె నాకు మాత్రము తల్లి కాదా? కాని చెల్లెలా తండ్రి గారి మతి తల్లడిల్లినది. క్షమయే స్త్రీలకు పరమావధి- బరించియుండుటకే మనము పుట్టితిం. ఇది ఈశ్వరఇధానము కావున మనము దానిని మారుమటాడక మన్నింప వలయును.

సుశీ--మన్నింప వలసినదే, స్త్రీజాతిని అబలలచేసిన ఆ విధి తదనుకూలముగ పురుషుల మనసులయందు దయయు సానుబూతియు సృజించెను. పశువులకువలె కాలుసేతులు మాత్రమే కామ, మానవులకు వివేకము మానుషత్వమ్ను ప్రసాదించెను. పురుషుల మనికిని మన్నికకును మూలకారనము స్త్రీలే కదా! అట్టిస్త్రీలు అబలలైనంత మాత్రమున పురుషులు వారిన్ కేవల విలాససామగ్రిగ భావించి, అక్కద్ తీరుటకు మాత్ర ముపయోగించు కొనుచు, వారు జాత్యుద్దరణము నకు దేశాబివృద్ధికిని నేరుపురుగులని భావించుట న్యాయమా? ఇట్టి పురుషజాతి ఎన్నటికేని తలయెత్తుకొని తిరుగ గలదా? పురోభివృద్ది గాంచ గలదా?

వినో-- కాని--

సుశీ-- పలుమాట లేల? నాకై నీవు చింతింప నని

138

[అం 4

భారత రమణి

లేదు. హాయిగా యింటికి పొమ్ము నన్ను నేను పోషించుకొనగలను. రక్షించుకొన గలను. ఇటు చూడు, (రివాల్వరు చూప ఇనోదిని నివ్వెరపడును) ఇక పొమ్ము. తండ్రిగాగిని ధిక్కరించితి నని మీరు నాపై కినియకుడు. నాతప్పు సైరింపుడని నాన్నగారిని వేడుకొనుచున్నానని చెప్పుము. నా కాంగ్లభాష నేర్పి మిల్టన్, షెల్లీ, మిల్, కార్లైట్ మొదలగు మహాకవుల గ్రంధములను వారే పఠింపించినందుకు ఇంతకన్న నెక్కుడు ఫలము సమకూరునని తలుచుట భ్రమ అని యెంచుమనుము.

వినో-- నేను పోయివచ్చెదను. నీ చందము నాకు నచ్చలేదు. కాని ఏమి చేయుదును? నీకు శుభమగుగాక!... (ఫోవును)

సుశీ--ఇంటికే పోను. పురుషుల పెత్తనము నాకు పరమాసహ్యము. ఏమైన కానీ...(పోవును)

(దొంగలు వచ్చెదరు)

మొదటివాడు-- మరీ-అరుగుబా టెలాగా?

రెండవ వాడు--ఈపని మానుకొవాలి. అంతే

మూడవ వాడు-- మునుపు అయినా డంక్షామీద్దెబ్బ కొట్టి దోచుకొనే వోళ్ళు. అడ్డూ లేదు, గిడ్డూలేదు.

నాల్గవ వాడు-- ఇప్పు డెటుసూశినా పోలీసోళ్లే! ఆశ్చ కొపలు గూల-అడ్డనౌతారు. మనాటలు సాగలేదు.

నాయకుడు-- అందుకె. ఈపని మానేద్దాం రా.

రం 3]

139

భారత రమణి

రెండవవాడు-- నెత్తిమీద కత్తి, గొంతు క్కురి. దాని శిగ్గొయ్యా! ఏవి సాధనం? కాలూ సెయ్యీ ఆడదయ్యా!

మూడవవాడు--మనపని శితికింది-ఏం దారీ!

నాయకుడు-- ఇప్పుడు దారిపొయ్యెనోళ్ళు మునపటి నాగ లేనే లేర్రా! అందుకే మనం దీన్ని మానుకోవటం.

మొదటి--ఎంత తిరిగినా, నెల్లాళ్ళయి పాశిక పారందే. నచ్చేవొంతొచ్చింది రా!

రెండ-- కాని, ఇది మనేస్తేకడుపు జరగడ నెలాగా?

నాయ--సేద్దెం సేసుకుందాం.

మూడ-- సివరికి సేద్దెవా? సీ, సీ!

రెండ--లాభసాటి యవ్వారంఇ యిది మానేసి నాగలి పట్టి యిప్పుడు దునన్మమంటావూ?

నాయ--మనం వొద్దన్నా పోలీసొళ్ళు మనశాత దున్నించరట్రా? ఎఱ్ఱిమొగవా!

మొద--ఎవరో వొస్తున్నారా సద్దు సద్దు!

మూడ--ఆడది నగున్నాదిరా, ఏం!

రెండ--గొప్పోళ్ళ పడుసేనా?

మూడ-- ఒకత్తేనా, యెనక పిట్టైనా లేదు.

నాల్గ-- వొంటి న్నగలున్నాయి రోయి! వావ్వా!

అందరు-- దోసుకుందాం రా

నాయ--నాను పోతా.

140

[అం 4

భారత రమణి

మొద--ఆడదాన్ని సూస్తేనే అడలా! ఎంత పిరికోడవు?

నాయ-- అదేదోగాని ఆడదాని మొగం సూస్తే నసేతిలో కత్తి జారుతుంది, కర్ర కింద్ బడుతుందిరా నేనుండలేను బాబో, నావొల్ల కాదు.

రెండ--నువ్వు నేకుంటే మరీ పనెలాగా?

నాయ--మీ ర్నలుగురు ఒక్కాడది. కానీండి.

మూడ--రాశ్శి. శేతికి శిక్కింది శెడగొట్టకా.

నాయ--ఆడోళ్ళ మీద నేన్శెయి శేసుకోన్రా.

నాల్గ--నువ్వు శూస్తావుండూ! మేం దొస్కుంటాం.

నాయ--కానీండు మరి. నాకళ్ల గ్గంతలు కట్టుకొని, శెవుల్లో ఏళ్లెడ్తా- దాని వొంటిమీద శెయ్యెయ్యను.

నాల్గ-- అబ్బా! ఏవి దైర్యం! ఆడదానికన్న అదవుండవా!

నాయ--నీ మొగం ఐదుపుంజీల మొగోళ్లని అమాంతంగా నరికి, ఆళ్ళ పేగులు గుట్టబెట్టి ఆళ్ళు గిలగిల కొట్టుకుంటా వుంటే దగ్గర్నుండె సూశా- ఆడోళ్లంటే మాత్రం నాగుండె టు ఇమంటుందిరా! యేం కర్మనో ఆళ్ల బాద సూళ్లేను. కాలాడదు, శెయ్యాడదు.

మూడ-- మరి యాడవ లేకపొయ్యావూ!

నాయ--యేడవ్వాల నుందిగాని యేడుపు రాందే. ఏం శెయ్యనూ? నొకపాలి నాయింటిదాన్ని కర్రతొ వొక

రం 3]

141

భారత రమణి

టేశా, దెబ్బతిన్నాది. మాటాడలేదు మంతీ లేదు. నల్లగా నాకేసి చూస్తానే దబ్బున పది గిలగిలకొట్టుకొని పానం వొదిలేశించి. తల్సుకుంటే యిప్పుడు నావొళ్ళు గరిపొడుస్తారి. అప్పటాల్నుండి నంటడం మానేశాను.

రెండ--ఔన్రా! అంతకు ముందు యీడి మనసు రాయే! ఎంత తెగవూ? ఎంత బలవూ? మనిషే మారిపోయాడురా, పెట్టెగిరి పోగల్దు. కాలు సాగనీండి.- (పొవును)

(దొంగలు సుశీలయు వత్తురు)

సుశీ--మీరెవరు?

నాయ--అత్తెలిశి నీ కేం లాభం?

సుశీ--దొంగలా?

నాయ--సక్కగా పొల్చావు.

సుశీ--నా సొత్తంతయు కొనుడు (తీయబోవును)

నాయ--నగలు మాకొద్దు. నగ దిచ్చీ!

సుశీ--ఇదుగో.(నోటుల నిచ్చును)

నాయ--ఇం కొదిలేండిరా.

మొద--ఇంకే వుందో?

సుశీ--దైవము తోడు. ఇంక లేదు. నన్ను పోనీయుడు.

రెండ--అబ్బా! వొదిలేడనే?

143

[అం 4

భారత రమణి

పా ట

శిల్కనా గున్నది. శిత్తరువు బొమ్మా
సక్కగా నుశాను. శానిగా శేస్తాను ।శిల్క।

మూడవ-- ఓ ర్నువ్వుండురా!
వొదిలిపట్టా నొరి దీన్ని
వొళ్ళు గుఱగు ఱ్లాడేని ।శిల్క।

నాలవ--
మొగము సూశి-మురిశి నాను
సొగసులాడి ముద్దుబెట్టు ।శిల్క।

నాయ--ఒరే. మీకు మతో యిందిరా! సొత్తు దోసుకోపోక కారుకూతలు కూస్తారేం! ఒక్క సెడ్డ మాటొస్తే, ముక్కలు ముక్కలు శేస్తాను.

సుశీ--అయ్యా! రక్షించు, రక్షించు.

అతనిప్రక్క చేరును

(వినయుడు పిస్తోలుతో వచ్చును)

విన-- ఓరీ దూర్తులారా, జాగ్రత్త?

నాయ--మొగాడ్రోయి-ఇఖ మనవంతా నొకటి, రండి- ఏంట్రా పేల్తావు బాపడా! (వినయుని మీది కురికి గాయము చేయ అతడు పిస్తోలు కాల్చును, వెంటనే నాయకుడు కూలును, మిగిలినవారు పారిపోవుదురు.) సాటి మొగాడ్తో పొరాను, వచ్చాను. నాకంతే సాలు.(మృతి)

రం 3]

143

భారత రమణి

విన--(గాయముతగిలినచోటపట్టుకొని) సుశీలా, ఇంటికి పొమ్ము.

సుశీ-- వినయా! దెబ్బ ఎచట తగిలినదొ చూపుము (దగ్గర బోవును)

వినో--నాదెబ్బ నీకేమి? నీ వింటికి నడువుము.

సుశీ--ఒంటరిగా నిన్నువీడి ఇంటికి నేను పొవుదునా? స్త్రీ నైనను నాకు మానుషత్వము లేకపోలేదు- ఏదీ గాయము? (గుడ్డ చింఛి కట్టును)

విన--ఇక నీవింటికి పొమ్ము.

(కేదారుడు వచ్చును)

కేదా-- నీవేల పడియుంటివి? సుశీలా! ఇచటి కెట్లు వచ్చితివి?

విన--ఇచట నొక హత్యజరిగెను, పోలీసువారు వచ్చె దరు. ఈమె నింటికి చేర్పుము, కేదారా!

కేదా-- హత్య చేసిన దెవరు?

విన--నేను

సుశీ-- కాదు, నేను హత్య చేసితిని. ఇదుగో రివాల్వరు.

కేదా-- అసంభవము! హత్యచేసిన దెవరో నేనెరుగను, కాని మీలో నొకరు చేసిరనిన నేను నమ్మను.

114

[అం4

భారత రమణి

విన్__నిజముగా హత్యచేసినది నేను.తెరవాటు కాండ్రనుండి సుశీలను తప్పించుటకై హత్య కావించవలసి వచ్చెను. దీనికై నస్కురిశిక్ష తప్పదు.

కేదా__ఉరి తప్పనిచో ఈహత్య చేసినది నేను. ఉరికి పోవుట నాకు పరిచితమే. మీకు చేతకాదు. కావున హత్య చేసినది నేను.

విన__నీమాటలు వింతగా నున్నవి. ఈమె ఈమె నింటికి చేర్పుము, కేదారా!

సుశీ__నేను వెళ్ళను.

విన__నిన్నుకూడ ఈహత్యలో చేర్తురు.

సుశీ__కానిమ్ము.

కేదా__అట్లు కాదు. నిన్నింట విడిచి నేనురికి పోయెదను. వినయా! హత్యచేసినది నేను సుమా! మరువ వలదు.

సుశీ__నారక్షకుని వీడి అడుగైన కదలను.

విన__చెరసాలకు పోవుదువా?

సుశీ__సందియ మేల?

కేదా__మీరుపోనేల! నేను సిద్దముగా నున్నాను.

విన__నామాట విని మీరింటికి పొండు.

సుశీ__నేను పోను (సదానందుడు వచ్చును)

సదా__అమ్మా! సుశీలా! వినయునిగూర్చి నీకు బెంగవలదు, నీవింట్కిబొమ్ము; ధర్మమే జయము పొందెడుచో

రం 3]

145

భారత రమణీ

వినన కెట్టి ఆపదయు మూడదు. దూరమున నుండి నేనంతయు చూచుచుంటిని.

సుశీ--నే నింటికి పోను

సదా--ఇటనుండి నీవేమి సేయగలవు?

సుశీ--నాకును తెలియును.

సదా-- వినయుడు నా కుమారుడు, వాని రక్షించు భారము నాది. దైవము తోడు-ఇక నీ వింటికిపొమ్ము, ఇచ్చట నుండవలదు.

కేదా--వింటివా! సుశీలా! సదానందుడు ప్రమాణము చేసి చెప్పుచున్నాడు, వినయు డాతనికి కొడుకు అతని కెట్టి ఆపాయమును చేకూరదు. నేను ప్రమాణము చేసి చెప్పుచున్నాను, నీవు నాకుతురవు. లేకున్న నీపైనా కనురాగమేల జనించె! నీకెట్టి భీతియు వలదు. నాయింటికి రమ్ము. (పోవును)

సదా--నాయనా! దెబ్బ మోపుగా తగిలెనా?

విన-- లేదు, లేదు. ఎవరో వచ్చుచున్నారు (పోలీసువారువత్తురు)

పోలీ--శవమేదీ?

సదా-- అక్కడ నున్నది.

పోలీ-- హత్యచేసినవా రెవరు?

విన--నేను.

పోలీ--పట్టుడు.(జవానులు చుట్టవేయుదురు.)

140

[అం 4

భారత రమణి

సదా-- అయ్యా! స్టేషను వరకు నేను వచ్చి జామీనిచ్చెదను.

పోలీ-- మీరెవరు?

సదా--వీని తండ్రిని.

పోలీ--పాపము.. ఈతడు హత్య చేసెనె?

సదా--నేనెరుగుదు. జామీ నిచ్చెదను.

పోలీ--ఏపాటి ఈయగలవు?

సదా-- ఒక లక్షరూపాయీ లిచ్చెదను. మీయొద్ద నుండి వీని నిప్పుడు గొంపోవలెనన్న మీకు వేయిరూయీలు కూడ ఇవ్వనక్కరలేదు. అట్లైన "నేరముచేసినవాడు పరారి" అని మీరు వ్రాయుదురు, కాని అట్లు జరుగవలదు. ఈనేరము న్యాయము జరిగి, తీరవలయు. అందు నాకుమారున కురినిశ్చితమైనచొ నేను స్వయముగా వీని కంఠమున కురిపోసి ప్రాణముల తీసెదను.

పోలీ--అట్ల చుంటివేల? ఇతడు మీసుతుదో!

సదా-- మీకిది వింత గొల్పుచున్నదా? ఇతడు నా కేకపుత్రుడు. ఇట్టివారు నూర్గురుండి వారికందర కీరీతిని ఉరి తటస్థించెనా, వారికి వేరుమృత్యువును విధింపుమని విధాతను వేదుకొనను. ఓహో! నేదు నాబోటి ధన్యుడెవడు? ఇట్టి పుత్రుని కంటినని గర్వముతో వాడవాడల చాటుచు పొవుదును. వినయా! నిన్ను కన్న ఋణము తీర్చితిని. ఉత్స

రం 3]

147

భారత రమణి

నము సంపున నాకన్నులు మోదాశ్రువులచే నిండినవి. గౌరవదాయకుడగు పుత్రుడు కల్గెనను ఔత్సుక్యము నేడు తీరెను. నిన్ను పెంచి పెద్దవాని జేసి విద్యాబుద్ధుల కఱపిన ప్రయాసము నేడుఇ సఫలమయ్యె.. బలే! తనయా! తరించితిని... అయ్యా! మన మిక పొవుదము.