భారత రమణి/మొదటి అంకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మొదటి అంకము

మొదటి రంగము

[దేవేందునింటిలో దేవేంద్రుడు సదానందుడును కూర్చుండి యుందురు]

దేవే-- ఏమి చేయుచుందువు? బి.ఏ.పరీక్ష నీయక ముందే సంతతి కల్గి సంసారకూపమున పడితివి. అంతట చదువు సాగక తక్కువజీవతముగల పనిలో ప్రవేశింపవలసి వచ్చెను.

సదా--మీతండ్రిగారు ఆస్తి నెట్లు పంపకము చేసిరి?

దేవే--ఆతని మరణశాసనము ప్రకారము యావదాస్తియు మా అన్నగారికి సంక్రమించి, పెద్దలనాటి ఈ యిల్లు ఇందలి సామగ్రియు నా వంతుకు వచ్చెను. ఐదువేల రూపాయల ఋణము మేము చెరి సగము తీర్చుకొనవలసివచ్చెను.

సదా-- చిత్రముగా నున్నదే !

దేవే--అట్ల నెదవేల?
భారత రమణి               [అం] 

సదా-- ఆర్జనపరుడగు సుతునకు ఆస్తి నంతయు నిచ్చి, అర్భకునకు అప్పు తలజుట్టిరా, మీతండ్రిగారు ?

దేవే-- దానికేమి ? స్వార్జితమును వారు ఇచ్చవచ్చినట్లు పంచవచ్చును, ఆక్షెపమేమి ? అందరికీ పిత్రార్జిత ముండునా ? ఆ విషయల్మున నా కేచింతయు లేదు.

సదా-- అతడొక అపూర్వ వ్యక్తి, నీకెందుకు సుతానము ?

దేవే--ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు.

సదా--కొడుకు లేమి చేయుచున్నారు ?

దేవే--పెద్దవాడు సన్యసించెను, చిన్నవాడు చదువు కొను చున్నాడు.

సదా--కూతుళ్లఖూ ఫేండ్లి చేసితివా ?

దేవే-- పెద్దది తలచెడ్డరి. తగినంత కట్నము నీయ లేనందున తగినల్లుడు దొరకలేదు. మా వియ్యఖుడు కడుబీదవాడగుటచే పిల్ల మాయొద్దనే ఉన్నది.

సదా-- రెండో పిల్ల ?

దేవే-- దానికే వరుని వెదకు చున్నాను. అది బి.ఏ. పరీక్ష నిచ్చినది.

సదా--ఓహో ! మావినయునితో నాడుకొనుచుండునది ఆపిల్లేనా ?

రం 1] భారత రమణి 3

దేవే-- అదే. దానిని ఏతలమాసినవానికో కట్టిబెట్టవీలులేదు. చద్వుకొన్న పిల్ల, తెలివైనది.

సదా-- పెద్దది కూడా చదువుకొనినట్లే యున్నది. ఒక నాడు హితోపదేశములోని శ్లోకమొకటి చదివినది.

దేవే--అవును, ఒక పిల్లకు సంస్కృతము, రెండచ్వ దానికి ఇంగ్లీషును మాతండ్రిగారు చెప్పించినారు. రెండు విద్యల పరిణామ మెట్లుండునో చూడవలయునని వారి యూహ.

సదా--సరే. మూడవది ?

దేవే-- అది చాలా చిన్నది, దానికెప్పుడును రోగాలే. పద్దదాని పెండ్లి తొ నాపేర్మి తగ్గినది, సంపద సన్నగిల్లినది. ఇప్పుడు రెండవదనికి పెండ్లిచేయక తీరదు. అదే గట్టిచిక్కొచ్చినది.

సదా-- దానిపెళ్లికి చిక్కేమి ? పిల్ల రూపవసి, చదువుకొన్నది, తెలివైన దేమో ?

దేవే-- కావుననే చిక్కు ఇప్పటి వరులతండ్రులు కోడళ్ల యందము చందమును చూఛుట లేదు. తమ సుతుల నడిబజారున పెట్టి ఎక్కువవెల యిచ్చినవారికి అమ్ముచున్నారు. దిక్కుమాలిన మన సంఘమున్ ధనహీనులు తమకూతుళ్లకు పెళ్లి చేయుట కదుప్రయాసముగా నున్నది.

 సదా-- సంఘమును నిందింపకు, అది చేసిననేరమేమి ?

దేవే--ఆడపిల్లల పెళ్లిళ్ల మూలమున చాలమంది సం 4 [ అం 1

భారత రమణీ

సారులు చితికి పోయినారు, ఎంతమంది గౌరవమో హీన మయినది. ఇది అన్యాయము కాదా?

సదా-- ఓయీ ! నీకు పుత్రులున్నారు, పుత్రిక లున్నారు. వారి భరణ పోషణములకు బాధ్యుడవు నీవే కదా? పుత్రులను ఇరివదియైదేండ్ల వరకు ఫేంచుదువు, కాని పుత్రికలకు పదేండ్ల పైబడిన తోడనే వారి భరణపోషణ భారము వరుని నెత్తిపై నెత్తుదువు. కొడుకులతో బాటు కూతుళ్లను కూడ తక్కిన పదునైదేండ్లును నీవు పోషింపనక్కరలేదా? అదిగాక ఆస్తినంతయు కొడుకులకు చెందజేసి ఆడపిల్లలకు చిల్లిగవ్వయైన అందనీయవు. కొడుకులతో సమముగా కూతుళ్లను నీవుచూడకుండుటకు వా రేయేటిలోనైన కొట్టుకొని వచ్చినారా? చేతనైనంత శీఘ్రముగా వారిని చేవదల్చుకొన జూతువు. కావున ఆడపిల్లల కన్నవారే అన్యాయమున కొడిగట్టుచుండ, అట్లు చేయదగదనియు, వారిని మగ పిల్లలతో సమముగా చూడవలయు నని సంఘము నిర్భంధించు చున్నది. అపరాధము చేయునది నీవు, దానిని సంఘమునెత్తిపై రుద్దెదవేల ?

 దేరే-- నాకూతుళ్ల విషయమున నేనట్లు ఛెయదలచు కొనలేదు. నాశక్తి కొలది వారి కెద్దియో ఒసంగుదును. ఇంత యిమ్మని వరుని తండ్రి పట్టు బట్టనేల ?
సదా-- అట్లు నిర్భందింపని యేడల తగినంత ధనము
భారత రమణి

నీవీయవు. నీపిల్లను యావజ్జీవము భరించు భారము వారిదే కదా ? తోచినంత యిత్తునని నీ వేతృణమో వారికిచ్చినచో నీ కూతురిని వారు తగినరీతిని పొషింప గలరా ?

దేవే-- సరే, నేనిచ్చిన ద్రవ్యమును వారింకొక విధమున కాజేసిన ?

సదా-- అబ్బో ! నీవే యెగవేసిన?,,,, వారెట్లు కావించినను, కోడలికి యావజ్జీవము అన్నవస్త్రములు నిచ్చు బాధ్యతను వహించియుందురు కదా ? పెండ్లివారు వారు నిన్ను నిర్భంధింపకున్న అ వెన్క నీవు పెట్టుపోతల సరిగా జరుపుదువో జవపవో ? ముందు జరుగబోవునది ఎవరు నిశ్చయింప గలరు ? "లగ్నము నాటి మాటలు నాగవిల్లినాడుండవు" అందుచే పెళ్లినాడే పిల్లతండ్రి యొద్ద తగినంత ధనము పుచ్చుకొనుట అవశ్యకము.

  దేవే--నా శక్తికొలది నేను కట్న మిచ్చెదనన్న, వారు తృప్తి నొందక నా యిల్లు గుల్ల చేయ నేల ?
  సదా-- వారు నీ నెత్తికొట్టి నీ సర్వస్వము నపహరించుట లేదు. నీవే వారి కొసంగ బోవుదువు.
  దేవే-- ఏమి ఛెయుదు ? కన్యను గన్న ఋణము తీర్వవలదా?
సదా-- కన్యకు వివాహము చేయుట తప్ప దంటివి; కాని ఆమె కన్నవస్త్రములకు ఆధారము కల్పించుట తప్పని

భారత రమణి

సరికాక నీ యిష్టానుసార మంతివి: అట్లైన నీశక్తికి తగిన చవక బేరమునకు నీవు పొమ్ము, అట్లు చేయక అల్లుడు పెద్ద పెద్ద పరీక్షల నీయవలె ననియు, ధనము నార్జించిలక్షాదికారి కావలెనని నీ యాశ; అట్టివాని తండ్రి ఐదారువేలు కట్నమిమ్మన్న అది తప్పా? చిన్న పరీక్షల నిచ్చినవారు వేనవేలు వేయిరూపాయిలను కుదురుదురు, అట్టివారికి నీ పిల్ల నేల ఈయగూడదు? ఇంకొకటి-- వారు నీపిల్ల రూపసి, తెలివితేటలు కలది, చదువుకొన్నది అని కట్నము తగ్గింతు రేమో?

దేవే-- ఎట్లైనను వివాహ మన వరవిక్రయము కదా?

సదా-- "విక్రయ" మన్నమాట చెడ్డదే, కాని ఈ లోకమున అన్ని దేశములయందు నిట్లే జరుగుచున్నది. కొడుకుల నమ్మి ధనము కూర్చువారు కూతుళ్ల అళ్లికి గొప్పగొప్ప శుల్కముల నర్పింతురు. పుచ్చుకొన్నవాని కిచ్చినది చెల్లు అందుచే కొడుకుల నెక్కడు కన్నవారికి లాభము; కూతుల నెక్కుడు కన్నవారికి నష్టము. ఇంత యేల ? సృష్టియందే ఇట్టి వైషమ్యము కనబడుచున్నది. ఒకడు లక్షాధికారి, ఇంకొకడు భిక్షాధికారి; ఒకడు బుద్దిమంతుటు, ఇంకొకడు మూర్ఖుడు; ఒకడు బలవంతుడు, వేరొకడు బలహీనుడు. ఏమి చేయూనగు ?

దేవే-- అంతేనా ? ఇక నెరవు లేదా ?

సదా-- నీకు లేదు, కాని నీపిల్లలకు లేకేమి? చిన్నప్పుడు వారికి పెండ్లిసేయకు; ధనము నార్జింపగల దార్ధ్యము,
రం 1]

7

భారత రమణి

మానవుల త్రిప్పుకొను సోర్సు, బాలకులకు అలవడకముందు సంసారభారం వారి నెత్తిపై కెత్తకు. ఈ బాల్యవివాహములే మనజాతికి శీర్ణతయు, శైధిల్యమును ప్రసాదించినవి. ఇట్టి మహోపకారమును ఇంకే అనాచారము చేయుటలేదు. హిందువుల కింత హానికరమగు దురాచారము ఇంకెద్దియు కాదు.

దేవే--ఓహో ! సనాత నార్యధర్మమును తారు మారు చేయునెంతునా?

సదా-- ఆహా అవశ్య మట్లే చేయనెంచితి, ఏలయన, ఆధర్మము లోపబాహుళ్యమున శిధిలము కాకున్న మనజాతి కిట్టి దుర్ధశ ప్రాప్తించి యుండదు. మన ఆచారద్రుమములు కేవల ధర్మరశ్మిసోషితము లనజెల్లదు. అధర్మము బదనిక రూపమున వాటియందు వేళ్లు తన్నియున్నది, దాని కూడ బెరకవలయును.

దేవే-- గట్టి చిక్కే తెచ్చిపెట్టితివే?

సదా--నీ సంగతి ఆలోచించుకో- నీకు బాల్యముననే వివాహము కాకున్న, నీ గతి యిట్టి హీనస్థితికి వచ్చియుండునా? నీకీ విధమదశ ప్రాప్తించి యుండునా?

దేవే--బాలకులకు చిన్నతనమున పెండ్లి చేయగూడదు, సర్: బాలికలకో?

సదా-- వివాహ యోగ్యమగు వయసున మంచి
భారత రమణి

వరుడు లభించెనా; వారికి పెండ్లి చేయవలసినదే.

 దేవే-- అట్టి వీలు చిక్కకున్న ?
 సదా-- పెండ్లియే వలదు. బ్రహ్మచర్యమున వారి నుంచవలయు. బాల వితంతువులు బ్రహ్మచర్య మాచరింప గల్గినచో, అవివాహితులు మాత్ర మాచరింప జాలరా ? వీరు ఛెయజాలరని అందువా, వారును చేయలేరు. కావూ కన్యలతో బాటు వితంతువులకు పెండ్లి కావలసినదే!
   దెవే-- నీ అభిప్రాయము నాకు తేటతల్లము కాలేదు.
  సదా-- చెప్పిన నాలకింపుము, యోగ్యుడగు వరున కిచ్చి పెండ్లి చేయ శక్తియున్నచో, కన్యకైనను వితంతువునకైనను వివాహహముచేయ దగును. అట్టి సామర్ధ్యము లేనిచో ఇల్లు వాకిలి నమ్మి వారిలో నెవ్వరికిని పెండ్లి సేయవలదు. ఇద్దర్కు బ్రహ్మచర్యమే గతి.
 దేవే--దాని వలన కీడు మూడదా ?
  సదా--ఆపజ్జనకము కాని ఆచారము ప్రపంచమున నెచ్చటనైన కలదా ?
 దేవే-- లేదు, నిజమే, కాని క్రొత్త యాపద నొక దానిని తెచ్చి పెట్టుచుంటివే ?
  సదా--వితంతువులకు పెండ్లి చేయుటచే కొంత ఆపద తగ్గుట్ లేదా? దేవేంద్రా ! మన దేశమున ధనవంతులు తక్కువైనను, ఉపజీవుల సంఖ్యను హెచ్చించు ఇచ్చ అన్ని 

భారత రమణి

దేశములకంటే ఇచ్చట ప్రబల మగుచున్నది. జారిద్ర్యమున మున్గియున్నవారి దరి కెవ్వరు చేరరు గాని, "తప్పులుగ్స చెరువు నిండిన, కప్పలు పదివేలు చేరు" అన్నట్లు ఏదో సంబంధము కల్పించుకొని ధనికులకొంపకందరు చేరుదురు. ఒక కవి భారత రమణుల నుద్దేశించి ఇట్లు ప్రార్ధింంచెను:-

   "కాంతలార మీరు కనబోవు డెన్నడు
    బలము వీర్యములేని పంద సుతుల."

కాని ఇందు స్త్రీలు దోషులు కారు, పురుషులే దొషులని అతడూహింప లేకపోయెను...దేవేంద్రా! బాల్య వివాహము వేగ మాని వేయ వలెను. దీనివలన ఇతరాచారములనేకములు జీర్ణము లగుచున్నవి. వాటిని కూడ సంస్కరింప వలయు, కాని మొదట దీనిపనిబట్టవలయును. బాల్య వివాహముల మూలముననె మనజాతి మజ్జాబావమున దుర్భలమై, అహారశూన్యత శీర్నమై, బలరాహిత్యమున భీరువై, ఉత్సాహవిరహత నిరర్ధక మగుచున్నది. మనలో ఇంతకన్న నష్టహేతువరు ఆచార మెంకెద్దియు లేదు...(నిట్టూర్పు)

దేవే--ఊరకుంటి వేమి?

సదా-- ఇక మాటాడజాలను..(పోవువు).

దేవే--ఇప్పటికి నీతని స్వభావ మప్పటిలాగుననే ఉన్నది. ఆహా! ఇతని జూచి ఎంతకాలమైనది ? పది సంవత్సరముల్కు తక్కువ్ కదు. బాల్యమిత్రుల జూడ బాధలు తగ్గును. హృదయతాపము చల్లారును, చిన్ననాటి దినములు యాదికి వచ్చును. ఆ దినములలో సదానందుని శిరముతో నాశిరము జేర్చి, అతని బాహువులతో నాబాహువులును కీలించి, నిస్సంకోచముగా మరుగు విడిచి మాటలాడు చుంటిని. ఆహా ! శైశవ మెంత మధురము! అప్పుడు శరధ్రాకచ్ంద్రకల జూచి ఊలుకు పలుకు లేక ఉప్పొందు చుంటిమి, వర్షర్తుమేఘగర్జనముల విని గెంతుచుంటిమి, గ్రీష్మరాత్రుల నిర్మలనక్షత్రపుల్ కితనభస్సోభ గాంచి, చీకట్లుక్రమ్ముకన్నుల ఆనందభాష్పవారి చిమ్ముచుంటిమి; అట్టి రమణీయ దినము లికరావు. అప్పుడు "రేపెట్లు గడుచును? కొడుకులకు చదువు చెప్పించుటకు, కూతుళ్లకు పెండ్లిసేయుటకును ధనమెట్లు కూడబెట్టుదును?" అను చింతయే లేకుండెను. "గతకాలంజు మేలు వచ్చుకాలము కంటెన్ "

        కేదారుడు వచ్చును.

కేదా-- వాడు వదలడు.

దేవే-- ఏమిటి?

కేదా-- ఈయిల్లు, అసలు పుచ్చుకొను గాక, వడ్డికూడబెట్టునట...నేను బారిష్టరు దగ్గరికి పోయెద, (ఫోబోవును)

దేవే--ఎక్కదికి పోయెదవు?

కేదా--బారిష్ట రింటికి.

దేవే-- కొంచమాగి పొమ్ము

కేదా-- వ్యవధి లేదు.

భారత రమణీ

దేవే-- దాహము పుచ్చుకొనుము.

కేదా-- ఆలస్య మగును.

దేవే-- వేళ--

కేదా-- మించినది. రేపు వచ్చేద- ఇదుగో -చూడు.... కాదు, ముందాలోచించవలయు. ఇం దేదో మోసమున్నదని నానమ్మకము.

దేవే--దేని యందు?

కేదా--కానీ... వెనుక చెప్పదను.. (పోబోవును)

         మానద వచ్చును.

మాన--వంటయినది, స్నానము చేయుడు... నవ్వెద రేమి?

దేవే--కేదారుడు వచ్చెను.

మాన--ఐన నేమి?

దేవే-- పాపము ! నాకప్పగించిన ఋణమునకు వడ్డీ మూడువేల రూపాయి లయినది. అప్పిచ్చువాడు వడ్డి వదలునా? వ్యర్ధప్రయాసము నెత్తిపై పెట్టుకొన్నాడు కేదారుడు.

మాన-- మీకిదితప్ప వేరు చింతయే లేదా? లెండు, స్నానము చేసి భోజనమునకు లెండు.

భారత రమణి

దేవే-- పాతాళహోమము ప్రారంభిచినాడు...సరే పద.

మాన--అన్నట్లు. మహేందునకు నూరు రూపాయిలు కావలెనట.

దేవే-- ఎందుకు?

మాన--అదేమో?

దేవే--జూదమాడి సొమ్ము పాడుచేయవ;ఎ మమ్మ తామే ఆర్జించి వెచ్చ బెట్టుకొమ్మని వానితో చెప్పు. తగలంబెట్టుటకు కూడ ధనము నేను తేజాలను.

మాన-- ఈయకున్న వాడలుగును.

దేవే--పోనీ

మాన--ఒకడు సొమ్ములేక సన్యసించెను గదా!

దేవే--వీడు కూడ లేచి పోనీ, ఇక భరించలేను. ఎప్పుడును "సొమ్ము తే, సొమ్ముతే" అను మాటేనా, కొడుకునకు తండ్రికి నుండవలసిన సంబధము? ప్రాణము విసుగు చున్నది...(ఫోవుదురు).

             ------
రెండవ రంగము

[ఉపేద్రు) నిల్లు-- అతని భక్తగనము కేదారుడును కూర్చుందురు]

నవీనుడు-- మాగురువుగారిని నీవు దర్శించనే లేదా, కేదారా?
రం 2]

13

భారత రమణి

కేదా-- చూదకేమి? పలుమారు దర్శించిరిని.

వినోదుడు-- అట్లైన వారి మహాత్యము నీకు తెలియలేనట్లున్నది!

కెదా--తెలిసినది, తెలిసినది. చక్కగా విదితమైనది.

శంకరుడు--ఎరుగ నెరుగవు. నీకు తెలియుండినచో వారి నిట్లు నిందితువా?.... వారు కేవలము విష్ణుభక్తులు, సాధువులు, పరమ భావతులు....

నవీ--అబ్బో ! వరి జడ లింత పొడవు...

కేదా-- ఓహో, జడల పొడవును బట్టి సాధుత్వ సాంద్రత నిర్ణయించు చున్నారా?

నవీ--కాదు కాదు. భక్తి ! భక్తి ! మాగురువు గారి బరిభక్తిని మీరు చూడలేదు. అందుచేతనే పొరబడుచున్నారు. వారి భక్తి మీకెట్లు తెలియగలదు?

కెదా--నాకు తెలియ నవసరము లేదు.

వినో--హరినామ సంకీర్తనము వారు చేయుచున్నప్పుడు వారికి విష్ణుమూర్తి పూనుటచే నిలువు నిటాకున పరవశమై వారు పడిపోవుదురు.

కెదా--అటులనా? వారి వెనువెంట మీరుకొడ పదిఫొవుదురా?

శంక--అది మాకు వశమా? వైష్ణవధర్మతత్వము వారియొద్ద నేర్చుకొను చున్నాము.

కేదా--నేర్చుకొనవలసినదే. చక్కగా నేర్చుకొనుడు,
14

[అం]

భారత రమణి

తరించిపోవుదురు. నశరీరస్వర్గము మీకు లభించును.

నవీ-- ఈ దౌర్బాగ్యుల కంతటి అదృష్టమా? దానికై వారి శ్రీ చరనములను సదా గొల్చుచున్నాము.

కేదా-- శ్రద్ధగా గొల్చు చుండుడు.

వినో-- అటువంటి త్యాగియు, మహాత్ముడును...

కేదా--త్యాగమా ? ఎవనికైన ఒక దమ్మిడీ వదలునా?

వినో-- దమ్మిడీ ! పాడు దమ్మిడీ ! తుచ్చము ! తుచ్చము ! అమూల్యమైన ఉపదేశము అందరికి వితరణము చేయుదురు.

కేదా-- డబ్బు పుచ్చుకొనకయే ?

వినో--వారికి ధనము తృణతుల్యము. వైష్ణవసంప్రదాయమునకు వ్యాఖ్యానము వారినోటనుండి మీదు వినినచో-

కేదా-- తరింతును కాబోలు?

వినో--అదే వారి త్యాగము. మాయధనము గొనకయే వారు మనోవ్యాధికి మందిత్తురు.

కేదా--రోగము కుదరకున్న సొమ్మును తిరుగ ఇచ్చి వేయుదురా?

శంక--ఇచ్చివేయుట ఏమిటి? మొదట పుచ్చుకొన నిదే !

కేదా-- బొత్తిగా ? అట్లైన రోగుల కుచితముగా సేవ జేయుదురు కాబోలు ?
రం 2]

15

భారత రమణి

వినో-- సేవ చేయుటా ? గురువుగారు రోగులకు సేవ చేయుదురా ? ఆయన ముఖచంద్రబింబము నారయుము. అట్టి దివ్యసుందరమూర్తి ఒకరికి సేవ చేయునా?

కేదా--అయ్యె బాబో ! ఎంతప్రమాదము? రోగిగాని రోగవతిగాని ఎక్కువ చక్కదనము కలవా రైనచో?

వినో--అవేటిమాటలు కేదారా? గురువుగరిని నిందింతువా ?

కేదా-- నిందించుట నా కలవాటు లేదు. నేడు ఇంటింట ఇట్టి మహాత్ములే వెలయుచున్నారు. కుక్కగొడుగులు లాగున ఎటుచూచినను దంభభావతులే ! వారి చుట్టును మీబోటి భక్తులు కూడ కురుదుపడినారు. దేశము బాగ్యము పండినది.

 వినో--అరుగో ! ప్రభువువారు విచ్చేయుచున్నారు.

కెదా--ఎవరు ? గురువుగారా ? అవతరించుచున్నారా? ఉదయించుచున్నారా ?

అందరు--అదుగో ! వచ్చినారు... (లేతురు)

[జపమాల త్రిప్పుఛు కన్నులరమోడ్చి ఉపేంద్రుడు వచ్చును]

భక్తులు--సద్దు ! సద్దు ! నమోనమ:
16

[అం]

భారత రమణి

ఉపే--భక్తకోటికి భద్రమగుగాక ! వత్సలారా ! లెండు...(అందరు నిలుతురు)

వినో--ప్రభూ--కేదారుడు--

ఉపే--ఓహో! కేదారా! (నవ్వుచు) నేడు గొప్ప సుదినము, చైతన్యకూటము చరితార్ద మైనది. కేదారా! ఊరక రారు నీబోటి మహాత్ములు.

కేదా-- ఒకసారి మీనోటినుండి వైష్ణవధర్త్మ తత్వోపన్యాసము వినుటకు వచ్చిరిని మహాత్మా ! వందనములు.

ఉప్--తత్వమా?...నాకేమి తెలియును? మూర్ఖుడను, జల్ముద, అవివేకిని! ఆ ధర్మతత్వము మహాజ్ఞానీయు, భక్తశిరోమణియు నగు గౌరాంగదేవుడు.. (కన్నులుమూసి నమస్కరించును)

భక్తు-- ఓహో! హో! హో! (నమస్కరింతురు)

ఉపే--శ్రీకృష్ణ చైతన్య-ప్రభు నిత్యానందా.

భక్తులు--(పాడుదురు)

ఉపే--హరేకృష్ణ హరే రామారాధాగోవిందా!

భక్తు--(పాడుదురు)

ఉపే-- వృక్షమునుండి పుష్పము, పుష్పమునుండి ఫలము, ఫలమునుండి బీజము.. కాబట్టి బీజమే ఉత్పత్తికి కారణము.

భక్రు--ఓహో ! ఏమి గూఢతత్వము!
రం 2]

17

భారత రమణీ

ఉపే--చూచుటకు పుష్ప మందముగా నుండును.. కాని

భక్తు--ఔను, కానీ...కానీ..

ఉపే-- పుష్పమే వృక్షమునకు చరమపరిమాణామము కాదు. చ్రమ పరిణతి బీజము. శ్రీకృష్ణుని బాల్యక్రీడలు పుష్పము. భగవద్గీత దానికి బీజము. రాదారమణ-కృష్ణా!

భక్తు-- ఓహో! హో! (నమస్కరింతురు)

కేదా-- పోకిరితనమునుండి జారత్వ చోరత్వములు, వానినుండి వంద్చనము.

భక్రు-- అదేమిటి " కేదారా?

కెదా-- చీ! చీ! కుక్కలారా, నోరు మూసుకొనుము. లేకున్న వంచనమునుండి కోపము, కోపమునుండి చెంపపేట్టులు, నేనేదైన సహింపగలను, కాని గొంగవేషముచూచిన నా కొడలు మండును. బీదసాదలకు కాసిచ్చిన తల ప్రాణము తోకకు తెచ్చుకొనెడు పిసినిగొట్టు-- పరుల దు:ఖమును పాటిసేయని పాషాణము-- ఈ బాలికుడు నోరున్నదని "నేనవతారపురుషుడను, మహాత్ముడన్ని దొంగవేషము వేసుకొని లోకులను వంచించుచున్నాడు. ఇట్టి పోకెరీని పోలీసు వారి కప్పగించవలెన్. ఇది చైతన్యకూటమా? దొంగల గూడేమా? మీపని పట్టేద నుండుడు.

భక్తు-- ఈర్ష్య! అసూయ !

కేదా-- ఔనౌను, మీబోటి మహనీయు లీముని
18

అం 1]

భారత రమణి

ముచ్చును పాగడుట విన్న నాకీర్ష్య పుట్టవలసినదే! నెను కూడ మీకు కల్లు, గంజాయి, జంగు నిచ్చుచు కడుపుకూటికి కాస్త దమ్మిచ్చినచో నాదగ్గర చేరి కుక్కలవలె కాలు నాకుచు తోక జాడించుచుందురు. మీబోటి తులువలతో నాకేం?... ఉపేంద్రప్రభూ! నేను మీకొరకు రాలేదు, యజ్ఞశ్వరుని వెతకుచు అత డిక్కడ చేరియుండునని తలచి వచ్చితిని... ఐన నీతో నొకమాట చెప్ప దలచినాను. మీ తండ్రిగారు తన యావదాస్తియు నీకు చెందవలెనని వీలువ్రాసి ఋణము మీసొదరుల కిద్దరికి చెరిసగము పంచి యిచ్చిరా? ఇది నమ్మజాలను. ఆలొచించినకొలది ఇది అబద్ధమని నాకు తట్టుచున్నది.

  ఉపే--నీ యభిప్రాయ మేమి? నీ వేందువు?

కేదా-- ఆ నీలసత్యము. నాయూహ నిజమని నిదర్శనము చూపించెదను... మహాత్మా నాకు సెలవు.

పోబోవును

ఉపే-- కేదారా ! ... ఒక మాట......

కేదా-- వలదు. ఇక సహించలేను. యజ్ఞశ్వరుడు మీకూటములొ నుండునని తలచి, అతడు కనబడలేదు. ఇక్కది వాతావరణము విషపూరితము, నాకూపిరాడుటలేదు. నేను పొయేదను.(పోవును)

ఉపే--ఒక్కమాట విను.
రం.2]

19

భారత రమణి

కేదా--(తెరలో) మిక్కుట మయ్యె! నిబ్బరము ! మతి పోవుచున్నది!

నవీ--ప్రభూ! ఆపాషండు నిక పిలువకుడు.

భక్తు-- పాలసుడు- పలువ- పాపి!

ఉపే-- ఆహా! పాడయ్యెనే ! వీని గతి ఏమి కావలయు?

వినో--ఆహా! హా ! ప్రభువువారు దయా సముద్రులు!

శంక-- పాపుల నుద్దరించుటకే పరమపురుషు లవత రింతురు. పనికిమాలినవరిని పరమపదమునకు పంపుదురు.

ఉపే--భక్తులారా! సృష్టిలో పనికిరాని పదార్దమే లేదు- చూడుడు.

[అందరు పాట పాడుదురు]

అండపిండబ్రహ్మాండము నంతట-
     నిండియుండుగద. నీరజనాభుడు.
సకలచరాచర.సర్గము గాంచియు
      సర్వేశ్వరుని-చాతురి తెలియదు ॥అండ॥
గడ్డిపొచయును-ఘనమగు వస్తువు
      కనుడది గోవుల-కనువగు మేత
తిని యొసగవె అవి తీయని పాలను
      మనలను పోషిం-పను నాహారము ॥అండ॥
పండున నిండుగ-నుండును రసము
      పీల్చిన తేలును-పీచును టెంకయు

20

అం1]

భారత రమణి

 బీజము నాటిన పెరుగు వృక్షము

భక్తు-- ఓహో! మహాత్మా ! మరొక్క తత్వం-

     [ఫలహారము కొనితెత్తురు]

ఉపే-- భక్తులారా, గోధుమలు బీజములు, వాటిని చూర్ణము చేసిన పిండి యగును. దానిని నేతితొ కలిపిన పూరీ అగును. ఎంతయొ కంటిరా !

భక్తు-- ఆహాహా! ఏమి వింత !

ఉపే--ఆపూరీ కోవా (చిక్కనిపాలు)తో కలిపినచో కడుపులోనికి సులువుగా పొవురు. (తినుచూ) శ్రీహరీ ! నీవే సత్యస్వరూపడవు.

భక్తు-- శ్రీహరియే సత్యస్వరూపుడు !

నవీ-- మహాప్రభూ ! మేముకూడా పోయి హరినామ ప్రభావ మారగించుము.

ఉపే--మంచి దట్లే చేయుడు. రాధేకృష్ణ!

భక్తు--గురూజీ ! మీచరణదాసులము, మామీద దయయుంచుడు, మేము పాపులము.

ఉపే-- హరినామ సంకీర్తనము చేయుడు, సంసార సాగరమున భయముండరు.

భక్తు--చిత్తము, సెలవు--[పాడుచుపొవుదురు]

ఉపే-- భజనసేయువారే భక్తులు, ఆభజన ముక్తికైన నెమి ? భక్తియే ప్రధానము.... కేదారునికి
40 2]

21

భారత రమణి

నాగుట్టు తెలిసినట్లున్నది. వాని కేదేని ఉపదేశించి మాకూటములో కూర్చవలయును. లేకున్న ముంచును.... ఎవరో వచ్చుచున్నట్లున్నది. ఇక గొంటుతన మారంఃభింపవలయును. రాధేకృష్ణ గొవించ, శ్రీహరి !

           (యజ్నేశ్వరుడు వచ్చును)

ఉపే-- రమ్ము- యజ్నేశ్వరా ! నీతో కొంత ప్రసంగింప వ్చలయును.

యజ్నే-- ఏమి టది?

ఉపే-- మా తండ్ర్గారు చేసిన అప్పు మాదేవేంద్రు నొద్ద పుచ్చుకొనుము.

యజ్నె--అత డెట్లివ్వగలడు ?

ఉపే-- ఇల్లు వాకలి అమ్మించుము.

యజ్నే-- ఏలా గిచ్చినను సరే, నాకభ్యంతరములేదు. ఒక చిల్లి గవ్వైన వదలను.

ఉపే-- నీదాహము తీరునట్టిదా ?

యజ్నే-- అబ్భో ! నీకు పెండ్లమా ? పిల్లలా ?

యజ్నె-- అదెంత సేపు?

ఉపే-- ఏమీ? తిరుగ పెండ్లియాదురువా? ఏమి?

యజ్నే-- పిల్లను వెదుకుచున్నాను.

ఉపే-- అలాగా! నాతో చెప్పవైతివి !
22

అం 1]

భారత రమణి

యజ్నే-- చెప్పుటకే వచ్చితిని.

ఉపే-- విశేషము లేమి?

యజ్నె--నీతమ్మునికి అవివాహితయగు పుత్రిల్కకలదట?

ఉపే-- ఆ ఉన్నది [కేదారుడు వచ్చును]కేదారా! తిరుగ వచ్చితిమేమి?

కేదా-- దేవర్షిగారి నొకసారి చూచిపోవలయునని.

యజ్నే-- దేవర్షెవరు?

కేదా--ఇప్పుడు మాటలాదున్నవారే! నా చిత్రమైన జొడు కుదిరినది ! ఉపేంద్రుడు, యజ్నెశ్వరుడు, మహర్షి, దేవర్షి.

ఉపే-- కేదారా! నెవుత్తముడవు.

కేదా--మీశిష్యుడు నైతే అబ్లాదునేమో, మహర్షి సత్తమా! పాపపుణ్యకలితగగు మర్త్యలోకమందలి మావవుడను. అనావృత త్వదీయూ దివ్యజ్యోతిని సహించగలనా?

ఉపే-- (ఉమ్ములకని లేచి) కెదారా! ఇప్పుడే వచ్చెద, అన్యధా తలంపకుము... (వెళ్ళును).

కేదా--మీరిద్ద రిక్కడ కూడి ఏదో పైశాచిక కృత్యము చేయదలచి దానిగూర్చి ప్రసంగించుచుంటిరా?.... ఆ గోలనాకేల? యజ్నేశ్వరా ! ఇటు విను. నీవు వడ్డీ వదలకున్న అసలు కూడ ఎగవేతుటకు నిశ్చయించితిమి. దిక్కున్న చోట చెప్పుకొనుము.

యజ్నే--అదేమి, కేదారా!
రం 2]

23

భారత రమణి

కేదా-- నీ వేమన్నను వినను, చిల్లిగవ్వయైన ముట్టదు; నీకు మాకు నింతటితో సరి.

యజ్నే--తుదకు దేవేంద్రుడు నీ సలహానుగొని యిట్లు చేయుటకు నిశ్చయించెనా?

కేదా-- ఇవ్వడు-నీ వేమి చేయగలవు? దావా తెచ్చుకొనుము, నేను బారిష్టరు నడిగినాను. పత్రము కృత్రిమము, శాసనం కల్పితము, ఋణము రుజువుకాదు సాక్ష్యమురాదు. వెఱ్ఱివాడా! వడ్డీ వదలుకో! అది మేలు. దావా చేసితివా అంతయు అంతరిచును.

యజ్నే--ఈ బెదరింపుల కెమిలే, దవాలతో నాతల నెరసినది, నాకా భయము లేదు తప్పక దావావేయుదును.

కేదా--ఇంకొకసరి చెప్పుచున్నారు. విను వడ్డి విడిచిపెట్టుము, వ్యవహారము మనలొ మనము పైసలు జేసుకొందము, లెకున్న అసలు సున్న, వడ్డియు సున్న.

యజ్నె--అసలు పోదు, వడ్డీపోదు-పైపెచ్చు దావా ఖర్చులు కూడ ముక్కునిలిపి పుచ్చుకొనెద.

కేదా--నా మాటవిని వడ్డీ వదులుకో, నీయాటలు మావద్ద సాగిరావు. పెంకెతనము మాను.

యజ్నె--నాది పెంకితనమా ?

కేదా-- అసలు విడువవు, వడ్డీ వదలవు, పెంకెతనము కాక మరేమి?

యజ్నే-- పెంకెతన మెవరిది? వడ్డీ కొర కేకదా
24

అం 1]

భారత రమణి

అప్పిచ్చుట ? వడ్డీని విడుచు వెంగలి యుండునా ? నాదా పెంకితనము?

కేదా--[వాచీ చూచి] ఓహో ! తొమ్మిదయినది. రెయిలుబందికి వేళ కావచ్చినది. యజ్నేశ్వరా! అయితే విడువవా?

యజ్నే-- విడువను

కేదా--నీకు నరకమె గతి! [పోవును]

యజ్నే-- కేదారా ! ఒక మాట

  [కేదార తిరుగవచ్చును]

కేదా--వదలుకొందువా? శపించినాను, ఇక దానిని క్రమ్మరింపజాలను ఇంతమాత్రము కరుణించెదను. వడ్డీ విడిచినచోనరకమున నొక సంవత్సరము కన్న నెక్కువకాలముండనక్కరలేకుండ జేసెదను.

యజ్నే-- ఈ మాటలకు నేను జంకువాడను కాను, నరకభయము నాకు లేదు. ఒకపని నీవుచేయగల్గినచో వడ్డీనే కాక అసలుకూడ విడిచెదను.

కేదా--ఇదేదో అసాధ్యమైన పని.

యజ్నే-- అసాధ్యము కాదు తన్మూలమున ఇద్దరకును మేగును.

కేదా-- అలాగా ఇదేదో తృణానృతకూపము. (చేతి కర్రనుంచి) వినవలయు, ఏమిటది?

యజ్నే--దేవేంద్రునకు వివాహయోగ్యయగు కూతు
రం 2]

25

భారత రమణి

చున్నదట నారెండవ భార్యా మొన్నే గతించినది, కావున ఆపిల్లను నాకు పెండ్లిచేసినచో--

కేదా-- నీకా? మంచి వికటమే నీకామెనిచ్చుటా?


యజ్నే--ఏమీ? తప్పా? పిల్ల ఎదిగినది. ఎవనికైన నిచ్చి పెండ్లి చేయవలయునా, లేదా? కావున నాకు--


కేదా--ఆపిల్లనిమ్మందువా? ఏమి వింత! ఏమి ముచ్చట! (నవ్వి) యజ్నేశ్వరా! నీకు మతి చెడినది, మందుమతిను నిజమే.

యజ్నే--నీకు నవ్వులాటగా నున్నదా? ఇది కుదిరినచో దేవేంద్రునకు "ఏకక్రియాద్య్వర్ధకరీ" అగును.

కేదా--యజ్నేశ్వరా! ఇటు విను, నాకొకకూతురుండి--దానికి గుడ్డి, చెవుడు, కుంటి..ప్రపంచమున ఎన్ని అవలక్షణమున్నచో, అన్నియునుండి, దానికి వివాహము చేయకున్న నన్ను శూలమునకు గుచ్చుదుమని కులమువారు నెఱిపించినను, దానిని కాలు చేతులు గట్టి ఏ గోతిలోనో, నూతిలోనో, పడదోసి శూలమును అమితసంతోష్గమున అందరి యెదుట ఆరోహింతును కాని, మూఢుడా! నీబోటి పాలసునకు కట్టిపెట్టుదునా? సత్యము, సత్యము, సత్యము..

(పోవును)

యజ్నే--నీకింత పొగరా! ఉండుండు నామహిమ చూ

పెదను (ఉపేంద్రుడు వచ్చును)
26

అం 1]

భారత రమణి

ఉపే--యజ్నేశ్వరా, ఆ మాట నీవు మనసార అన్న దేనా?

యజ్నే-- ఆహా! అట్టిదే.

ఉపే-- కాని, అది వివాహము కాజాలదుసుమా, వ్యభీచార మగును.

యజ్నే-- ఉపేంద్రా ! నాయెదుట మునిముచ్చుతనము మానుము. మనలో పరస్పర మెరుగనివా రెవరు ? ఒక్క సారి నీగుట్టు....

ఉపే--నీకు పుణ్య ముందును. ఊరకుండుము. మాట వరుస కంటిని.

యజ్నే--నాకన్ను కప్పజూచెదవా? మన మిద్దరమొకమందలోని వారమే, మన మిద్దరము చెనటులమే, పైపెచ్చు నీవు మునిముచ్చువు. నాకు పెద్దన్నవు.

ఉపే-- చాలించు. నన్నేమి సేయమందువు?

యజ్నే--ఇందు నాకు సాయము చేసెదవా?

ఉపే--అట్లే చేసెదను.

యజ్నే-- నిన్ను నమ్ముకొందునా?

ఉపే-- పూర్ణముగా!

యజ్నే-- సరే, నేను పోయి వచ్చెదను (పోవును)

----
రం 3]

27

మూ డ వ రం గ ము

          ----

[దేవేంద్రు నింటిలో అతడు భార్యయు ప్రవేశింతురు]

దేవే-- అప్పు తీర్చక నే నింకొక ఖర్చు తలపెట్టబోను.

మాన-- ఈడు వచ్చిన పిల్లను ఇంట నుంచుకొనుటకు వీలా ?

దేవే--బయటికి గెంటివేయుము.

మాన-- అట్లందు వేల ?

దేవే-- తండ్రిగారి అప్పు తీర్చకున్న తలవంపులు. అసలు ఫాయిదా కలిసి అయిదువే లయినది.

మాన--పిల్లకు పెండ్లిసేయుట తప్పునా?

దేవే--అదేమో, కుర్రవానికన్న కుర్రది ఎక్కువా?

మాన-- ఇద్దఱును సమానులే

దేవే-- ఇద్దఱు కొడుకు లుండిరి. పెద్దవాడు బెంగపెట్టు కొని సన్యసించెను, చిన్నవానికి చదువు చెప్పించ్చు శక్తి లెకుండుటచే పాఠశాల కంపక పాడుచేసితిమి.

మాన--వానికేమి ? ఏదో రీతిని వాడు పొట్టపోసుకొన గలడు. పిల్లమాట ?

దేవే-- దీనితో తీరినదా? మూడవ దున్నది... లోనికి పొమ్ము, పిల్లపెండ్లికై నీ వనుకునంత అసడ్డ నాకు లెదు.

[ఆమె పోవును]
28

అం]

భారత రమణి

 ఆహా! ఈ బాలసూర్యాచ్వతమున ఈ చేట్టుఆకులు ఎంత చక్కగా మిలమిల లాడుచున్నవి? ఈ చెట్టుపై నేను పుట్టిన మేలయి యుండును. హాయిగా అతపమును మలయపవనమును అనుభచ్వించు చుందునుకదా... కూతురికి పెండ్లి చేయలే నను విచారమే లేకపోవును. నే నేల పెళ్లి యాడితిని ?.... దానిద్ర్యము నాకేల దాపరించెన్?... సంతాన మేల కలుగవలయు? మొదటనె మూసమయ్యె.
        [సదానందుడు వచ్చును]
సదా-- ఏమి దేవేంద్రా ! చింతామగ్నుడ వైనట్ లున్నావు?

దేవే-- లేదు, లేదు, నాకేచింతయు లేదు.

సదా-- అట్లనకుము నీమోమున మందహాసము లేదు.. నాయెడ దాచెదవా?

దేవే-- దానికేమి గాని... సదానందా ! నీవు చిన్నప్పుడు పాటలుచేసి పాడుచుంటివే?

సదా-- ఇప్పుడు నట్లే చేయుచున్నాను కాని, ఈ పాటలు వేరు.

దేవే--ఎట్లు ?

సదా--ఇప్పుడు ప్రేమగీతములు వ్రాయును, పాడను, శృంగార హాస్య గీతముల రచించు దినములు గతించెను; నాకు చెల్లినవి, సంఘమునకును చెల్లినవి ఇప్పుడు జావళీలు, పదములు మానితిని ఇప్పటి పాటలు వేరు.,
రం.3]

29

భారత రమణి

దేవే-- నీటి నెవరు విందురు.

సదా-- వినక తప్పదు వాటిని నాటకములలో జొన్పి తివి. అన్నట్లు నేనొక నాటక సమాజమును స్థాపించితిని సుమా, నీవు వినలేదు. కాబోలు?

దేవే-- అటులనా? వేషము లెవరు వేయుదురు.

సదా--అబ్బో ! వారికి మనదేశమున కొదువ లేదు దేవేంద్రా నేను పోలయు.

దేవే--ఏమి?

సదా-- తొందరపని యున్నది. ఈ త్రోవను పోవుచు నిన్ను చూడవలయునని వచ్చితిని. రేపు మరల వచ్చెదను.

(పోవును)

దేవే--నాకు నిజమైన నేస్తము సదానందుడే.... ఈతని కుమాదునకు మా సుశేల నిచ్చి పెండ్లిచేసిఅన నెంతయు చక్కగా నుండియుండును, కాని అది అసంభవము. ఇతడు సముద్రయానముచేసి సంఘమునకు మహాపరాధము సల్పెను. కావున దానికి వెలియై నాడు.... కన్నము వేయవచ్చును, మోసము చేయవచ్చును, వేశ్య నుంచుకొనవచును. సంఘము వాటిని సహింపగలదు, కాని విదేశయానము విషతుల్యమని యెంచును. ఆ ఘోరపాప మపరిహార్యము! అమార్జనీయము!.... కూతురు పెళ్లి చింతచే కొన్ని రోజులనుండి నాకు నిద్ర లేదు. శరీరము....
30

అం 1]

భారత రమణి

  [లోప్;అల 'దేవేందు డున్నాడా ' అని కేక.] ఉన్నాను, రండు.
 (హరి నవీనుడు, శంకరుడు, వినోదుడును వత్తురు)

నవీ-- ఇల్లు వసతిగానే ఉన్నది.

శంక-- తాతలనాటిది. జమీందా రిల్లులాగున కట్టినారు. చాల పెద్దది.

హరి--కాని, కొంచెము పాతగిల్లినది.

నవీ-- ఐన నేమి ? మంచి వసతు లున్నవి.

హరి--అయినను అట్టే పెద్దది కాదు.

నవీ--దక్షిణజ్మున తెఱిసి యున్నది, గాలి చక్కగా వేయును. దొర లిండ్లవలె విశాలమైన జాగా అన్నివైపుల నున్నది... చంద్రకాంతుడు చేసిన పనియెల్ల నిగ్గు.

వినో--ఐదువేల రూపాయి లప్పుచేసి మూడూళ్ళను కొన్నాడు. ఆర్జనమ్న అతి చతురుడు.

హరి--జౌను కాని పంపకము మాత్రము పాడు చేసెను.

దేవే--అయ్యలారా! మాతండ్రిగారు చేసినది అనాలోచితము కాదు; ఆచింత నాకు లేశమైన లేదు.

హరి--ప్రస్తుత, నీకు అప్పుంచ కూడదు.

నవీ--దేవేంద్రా ! అప్పు విషయమున ఏమి చేయదలచితివి? యజ్నేశ్వరు డింక ఓపిక పట్టునట్లు కనిపించదు.
రం 3]

31

భారత రమణి

దేవే-- అప్పు తీరు నుపాయము ఇంతవర్కును నాకు తొచనేలేదు.

శంకరముదావా చేయవలెనని అతనికి లేదు, కాని ఏమి చేయగలడు?

దేవే-- నిజమే?

నవీ--ఆ చిక్కు వేగము వదల్చుకొనుట మేలు; దావా పడినచో ఖర్చులు కూడ తగులు కొనును.

దేవే-- అదియే ఆలోచించు చున్నాను. కాని సొమ్మెక్కడి నుండి తేగలను? నాకేమియు పాలుపోలేదు. ఇల్లు వాకిలి, పాత్రసామాను అమ్ముకోవలయు, సాధనాంతర్ము తోచకున్నది, మ్మత వీడకున్నది. పిత్రార్జితము.....

హరి-- ఇంకొక చిక్కున్నది. అప్పు తీరుటతో సరిపోదు. అమ్మాయి పెండ్లికి సిద్ధముగా నున్నది. దానికి ధనము కావలయు కావున

దేవే--నిజమే

హరి--'ఏకక్రియా ద్వ్యర్ధకరీ ' అన్నాడు కాబట్టి నీ కూతురిని... ఇదిగో- యగ్నేశ్వరుడు...(కేదారుడు వచ్చును)

కేదా--గాడిదె కొడుకు మారువాడీలను మించినాడు. ఒక దమ్మిడియైన వదలడట! పిసినిగొట్టు పీనుగ- అధమాధముడు.. ఇంకే మందును ? వానికి 'కుష్టురోగముపై గుఱుగుఱు పుట్టి ' నట్లున్నది. ఇంత పొగరా ! లుచ్చా ! దూబ!
32

అం1]

భారత రమణి

అప్పుడే మెత్తగా చితుకగొట్టవలసినది ఎందుకు మరచితివా అని యిప్పుడు చింతించునున్నాను, తులువ ! లండి ! పలువ !

దేవే-- కేదారా! అంత క్రుద్ధుడ వయ్యెదేల?

కేదా--క్రోధమా ! దౌర్భగునికి మూడుపాళ్ళా యువు చెల్లినది, కాటికి కాలుదాచుకొని యున్నాడు, బికారి! కూళ ! సుశీలను-తనకిచ్చి పెళ్ళీ చేసినచో, అసలును వడ్డీయు వదలుకొనునట తొత్తుకొడుకున కింత పొగరా? నెత్తి పగులగొట్టనైతిగదా అని విచారించుచున్నాను. యజ్నేశ్వరుడు తలచుకొనిన నా కరికాలైమంట నెత్తి కెక్కుచున్నది. దిక్కులేని పీనుగ, పశువు కని మానవుడా?

హరి--కేదారా! తగు మంష్యుని తూలనాడెదవేల?

కేదా--ఏమో నాకే తెలియదు తిట్టక మానను. నీచుని నీఛుడనుట నాస్వబావము ఏమిచేయుదును?

నవీ--కాని

కేదా-- నీవు నోరు మూసుకొనుము తగుదునమ్మా అని చెప్పవచ్చెదవు...మీరు వందిమాగధులు. చెప్పులు మోయు చెనటులు. పోయి వాని కాళ్ళపై బడి దుమ్ం తలధరింపుడు. మీరెక్కడచేరిరేమి! దేవేంద్రా! వీరి నిటనుండి త్వరలో సాగనంపుము. ఈ పాపులు ఏదో దుస్తంత్రము పన్ని నిన్ను మోసగింపు టకు వచ్చిరి. శీఘ్రమే వీరిని గెంటి వేయుము.

దేవే-- కేదారా ! అట్ల నరాదు. తగు మనుష్యులు
రం 3]

33

భారత రమణి

కేదా-- వీరా తగు మనుష్యులు? పెద్ద వేషము వేసిన పెద్దమనుష్యు లగుదురా? వీరి నిప్పుడు గెంటివేయకున్న నీకును నాకును సఖ్యము నేటితో సరి.

దేవే--కేదారా!

కేదా-- మంచిది. ఇచట నె నుండను (పోవును)

దేవే--కేదారా! కేదారా!... అయ్యలారా!

నవీ--మేము వీని మాటలను పాటిసేయము, తాగిన వానితో తగునా?

హరి--దేవేంద్రా ! వాని మాటల కేమి, ఇటువిను, నే నామాటయే నీకో ప్రస్తావించ్ వలెనని అనుకొను చున్నాను.

దేవే-- ఏది ?

హరి-- కేదారు డన్నదే-ఒక కార్యమున రెండు లాభములు రానున్నవి. అప్పు తీరును, అమ్మాయి పెండ్లి అగును.

దేవే-- సరే- ఆలోచించి చెప్పెదను.

హరి--అట్లే కానిమ్ము. ఇట్టి సౌకర్య మీజన్మమున నీకు రాదు.

శంక-- మేము పోవుదము. నిశ్చితాభిప్రాయము నెప్పుడు తెల్పెదవు? దేవే--రేపు

హరి-- మంచిది- ఇక మాకు సెలవు.
34

[అం 1

భారత రమణి

దేవే-- గొప్ప చిక్కులో తగుల్కొన్నాను..... వాడు మూడుకాళ్ళ ముసలి...కాని...ఏమి చేయుదును? ఇంతకన్న వేఱుపాయము తోచదు.. ఆ ! కాదుకాదు... వా ఢధముడు... నీఛుడు.. తెలిసి యుండియు కన్యను గంగలో తోయుదునా?

(ఉపేంద్రుడు వచ్చును)

ఉపే-- దేవేంద్రా ! నీ యోగక్షేమముల నారయ వచ్చితిని. అందరికిం గుశలమా?

దేవే-- శరీరమునకు కుశలమే, కాని మనసునకు మాత్రము అలమట తీరలేదు. సంసారమున అనేకములగు వ్యధలు.

ఉపే--తమ్ముడా! తధ్యము. సంసారము కేవల దు:ఖ మయము, సుఖమున్నది కాగడా న్వెదకినం గానరాదు. కావుననే జ్ఞానులు సంసరము మాయ యని వక్కాణింతురు. ఈ వ్యామోహజాలమున బడిన మానవుడు రాగరజ్జువుల ద్రెంపగల్గుట దుస్సాధ్యము. బుద్దదేవు డందుననె సంసరము నేవగించి సంఫదలను రోసి తురీయాశ్రమమును స్వీకతించెను. ఆ మహాత్ముని మనోబల మపారము. పాపిజీవు లట్లు చేల్యజాలరు. సాధ్యమగునంతవట్టు నిర్లిప్తులమై యుంవలయు, నీవు నాకు తమ్ముడవు గాన నుపదేశించుచుంటిని. చింతను వీడుము.

35

రం 3]

భారత రమణి

దేవే--నేను దానిని వుడుతు నన్నను నన్నది విడువ కున్నదే: పిల్లల గొంతుకలు పిసికి చంపలేను కదా ? మీరు మిక్కిలి...

ఉపే--సోదరా! ఈషణత్రితయము నేవగింపుము.శ్రీకృష్ణ నామసంకీర్తనము జీవకోటికి పరమాధారము. రాధేకృష్ణ! హరే ! గోవింద మురారే!

దేవే--పద్దవాడు దిగులొంద్ సన్యసించె, చిన్నవాడు తుంటరులతో చేరీ చేడినాడు. పెండ్లియైన పిల్ల వితంతువయ్యె. రెండవదాని వివాహమునకు దారి తోచకున్నది.

ఉపే--కర్మానుభవము ! సంసారకూపంబున ద్రెళ్ళి న వారికి కట్టించితలు ప్రాయికముగా ప్రాప్తించు చుండును. ఏమి సేయనగు?

దేవే--దిన వెచ్చము తీర్చుకొను సరిగి తలప్రాణము తోకకు వచ్చుచున్నది.

ఉపే--సోద్రా, కానిదినములు సమకూరినవి. ధనము లెనివానికి దారి కానరాదు. దేనిని కొందమన్ననూ ద్రవ్యము కావలయును...అన్నమునకు ద్రవ్యము. వస్త్రమునకు ద్రవ్యము, ద్రవ్యములేకున్న దైన్య మానహిల్లును. గోవిందా, హరే, మురారే, అనాధరక్షణ తత్పరా! ఆశ్రితాఅవనా!

దేవే--అన్నా! తండ్రిగారు చేసిన అప్పు నానతైదు వేలును నీవు తీర్చెదవా? కాలక్రమమున నేను నీయప్పు తీర్చెదను. అట్లుచేసితివేని ఈచిక్కు లన్నిటిని విప్పుకొన
36

[అం1

భారత రమణి

గల్గుదును. సోదరుడును, నీకన్న చిన్నవడును, అర్భకుడ.. ఈ మేలు నాకు గూర్చుము.

ఉపే--దేవేంద్రా! ఐదువేల రూపాయిలు! అంత సొత్తు గూర్చుట మాటలతో తీరునా?

దేవే--కష్టము కావుననే నిన్నడిగితిని. మొదట కన్నెరు గన్న ఋణము గడవనిమ్ము.

ఉపే-- దేవేంద్రా! నీ కొక్క సులభమగు నుపాయము నుపదేశింతు... యజ్నేస్వరునకు సుశీలనిచ్చి యుద్వాహ మొనర్చుము. దాన నాత డసలును వడ్డియు నొకసారియే వదలుకొనును. అట్లొనర్చునటుల నతని నే నొప్పించెద. నామాట వినుము. నీకన్న నేను బెద్దవాడను... లేకున్న...దానవభంజనా! శ్రీహరే, మురారే !

దేవే-- అన్నా, అట్లు చేయమందువా?

ఉపే--ఉపాయాంతరమున్న నీవే చూపుము...వాని యెద్ద నమితధనమున్నది.

దేవే--సరే! అత డిక నంతకాలము జీవింపగలడు?

ఉపే--తదనంతరమున తద్దనమంతయు సుశీలకు సంక్రమించును. నీ కేచింతయు నుండదు. దేవేంద్రా ! బాగుగ నాలోచించు కొనుము. నీకన్న జ్యేష్ఠుడ, కావున నీ శ్రేయోభివృద్దికై యింత దూరము బోధించితిని, అమితధనమున కధీశ్వరుడ నగుదువు, అన్ని పీడలు నపసారితము లగును. కేశవా! మధునూదనా!
రం 3]

37

భారత రమణి

దేవే-- ఊ.. (తల యూచును)

ఉపే-- చక్కగా నాలోచింపుము... ఇంటిచుట్టూ అడవి వల చెట్లు పెరిగియున్నవి. వీని ద్వరలో చేదించుము, లేకున్న వ్యాధి ప్రబలును చూవె! నీ హితముగోరి యిట్లుపదేశించుచున్నాడను.. నీ కెప్పు దేది కావలయునో నా కెఱింగించు చుందుము. అప్పుడప్పుడు వచ్చి చూచి పొవుచుండెదను. రాధేకృష్ణ!...(ఫోవును)

దేవే--అన్నా! అన్నా! నా మీద నీకమితదయ, మందహారములకును మధురబాషణములకును కొదవ యుంచవు. ఇట్లు శుష్కప్రియభాషణములు శూన్యక్రియలు గల వారెందరేని కలరు.

[మహేంద్రుడు వచ్చును]

మహే-- అమ్మ పిల్చుచున్నది.

దేవే--వచ్చెద పొమ్ము (అతడు పోవును)..సుశీల మడకు ఉరి పోసెదను. దుర్గకు బలి యొసంగెదను.. ఫిదకుదాని నుదుటి వ్రాత ఎట్లున్న అట్లుజరుగును. (సుశీల వచ్చును)

సుశీ--అమ్మ మిమ్ము పిలువమన్నది.

దేవే-- ఆమె నిట రమ్మను ...(ఆమెపోవును) హిందూ సంఘమా! నీ నియమముల మూలమున కూతురు గృహస్థునకు అభిశాపరూపమున పరిణ మించుచున్నది. దాని నేట్టులైన పతియింటికి పంపగలిగిన నాడు ధన్యుడు. ఇందు చేతనే ఆడరి పుట్తినదని వినినతోడనే ఆమె తల్లి మోము
38

[అం1

భారత రమణి

ముడుచును, తండ్రి తల వంచును...కానిమ్ము చింతించిన ఫలమేమి? ఇంటింట్య దూరేడు కుక్కయైన నాకన్నమేలు. కూరుతు పెండ్లి కాదాయెగా అను చింత దానికుండదు. అబ్బబ్బ! గుండియ వ్రీలుచున్నది. కన్నులు నీరు గ్రమ్ముచున్నవి.

(మానద వచ్చును.)

ప్రేయసీ ! నేను నిర్ధారణ జేసితిని.

మాన--ఏమని ?

దేవే--గొంతుక కోసెదను.

మాన--ఎవరిది?

దెవే--సుశీలది.

మాన--అయ్యో ! అట్లనెద రేల?

దెవే-- యజ్నేశ్వరునకు దానినిచ్చి పెండ్లి చేసెదను.

మాన-- అదేమి ! అతడు కడువృద్ధుడే ! మూడు పాళ్లాయువు గడచినది.

దేవే--ఇంకొక పాలున్నది కదా? దానికే పెండ్లి చేయునది.

మాన--మొన్న నేదో సంబంధ మున్నదంటిరే?

దేవేవ్--వారైదువేల నడిగిరి !

మాన-- జాగ్రత్త బెట్టుదు.

దేవే-- ఎక్కడనుంది తెమ్మందువు?
రం 3]

39

భారత రమణి

మాన--అప్పు చేసి

దేవే--అబ్బ ! ఎంత సులభమైన మార్గమును జూపితివి! అప్పు నీ విచ్చెదవా?

మాన--నేనా? సరి సరి, ఎవరినైన అడుగుడు.

దేవే--ఎవరి నడుగుమందువో దయచేసి చెప్పుము, నా కమితోపకార మొనర్చిన దాన వగుదువు, నాకు ప్పెవ రిచ్చెదరు?

మాన--ఏమి మీ అన్నగారి నడుగకూడదా?

దేవే--అన్నగారినా! (నవ్వి) అన్నగారు అప్పిచ్చెదరా! నాకు!

మాన--తమ్ముడు కష్టముల పాల బడుచున్నప్పుడు తగిన సాయ మన్నగారు చేయరా?

దేవే--ఇది కలికాలమని మరచితివా? కాంతామణీ

మాన--అడిగి చూడుడు

దేవే--ఆ ముచ్చటయు తీరినది. పరాబవ మయినది.

మాన--ఇక నేమి సాధనము?

దేవే-- సాధనమా? ఎటుచూచినను సాధనమును చూపు వారు కానరు, అంతట నిశ్శబ్దము- నీరసము- నిబిడాంధకారము !

మాన-- అట్లైన ఈ పెళ్లి నిశ్చితమే?

దేవే-- మన మిద్దరమును దానిని కని, లాలన పాలనలు చేసి, విద్యాబుధుల చెప్పించి, అ బంగారు బొమ్మను
40

[అం ]

భారత రమణి

పెద్దదానిని చేసితిమి. ఎందుకో తెలిసినదా? సంఘమను మహాశక్తికి బలి యిచ్చుటకు రా ! రమ్ము. నీవు దానికాళ్లను గట్టిగా పట్టుకొనుము, నేను తల పట్టుకొందును యజ్నేశ్వరుడు తెగని కత్తితో దానిని నరుకును. ఆ రక్తము సంఘమను బ్రహ్మరాక్షసి నోటిలో పోయుదము అంతట దాని కడుపు నిండును.

            -----

నా ల్గ వ రం గ ము

(దేవేందు నిల్లు - వినయ కుంరుడు, సుశీల)

విన-- సుశీలా, నీకు పెండ్లిమాట లయినవా?

సుశీ--(తలవంచి కాలి బొటనవ్రేలు నెల రాయును)

విన--వారు నిన్ను చూచి వెళ్ళిరా?

సుశీ--[తలవంచి] ఆ.

విన--అంతయు నిశ్చితమైనదా?

సుశీ-- అదేమో !

విన-- నీవు పెండ్లి యాడెదవా !

సుశీ-- నాకు తెలియదు.

విన--నీ పెళ్ళి భోగట్టా నీ వెరుగవా
రం 4]

41

భారత రమణి

సుశీ-- (కన్నీటితో) వినయా?

విన--ఎందుకు?... సుశీలా! ఊరుకుందువేల?

సుశీ-- నీకు నాపై ప్రేమ కలదా?

విన-- ప్రేమ యున్నదాఅని యడిగెదవా ! ఔను, నీ వడుగ వలసినదే, ఈ విషయము నీతొ నేనెప్పుడు ప్రస్తావించలేదు. దీనిని తలచునప్పు డెల్ల నా శరీరమందలి రక్తము వేదిచెందును. ఉన్మత్తునగు కైదివలె నామాటలు నిగ్ళమును తెంచుకొని బయటపడ నుద్యమించును. కావున నె నామాట నెత్తలేదు.

సుశీ--నీవు నన్ను ప్రేమింతువా?

విన--నీ వెరుగవా? గ్రహింప జాలవా? నేను నోరు విప్పి చెప్పలేదు, కాని నా కంఠస్వరము, నావైఖరి, నా జూలును, జూచిన నీకెమియు పొడకట్టుట లేదా?

సుశీ--నోటినిండ ఒక్కసారియైన అనకుంటె వేల?

విన--నీ మేలుకొరకే...మనకు పెండ్లి కాజాలదు.

సుశీ-- ఏం?

విన-- నీతండ్రి కిది సమ్మతము కాదు. ఏలయన నేను విదేశయానము చేసితిని.

సుశీ-- నా తండ్రి సమ్మతింపకున్నను నేను నిన్ను పెండ్లియాడిన?

విన-- ఏ మంటివి ! నాకొరకు నీవు కర్తవ్యము నుల్లంఘింతువా? సుశీలా ఇది నీకు తగదు. అట్లు చేయరాది.
42

అం1]

భారత రమణి

సుశీ-- నాకృత్యములకు పూచీ నాది, నీది కారు. నేను పసిపిల్లను కాను, నాకూ వ్యక్తిత్వ మున్నది. కావున స్వవిషయమున నాకును కొంత అధికార మున్నది. నా తండ్రిగారు తన కిష్టమైన ఏ ముసలిముద్దనో నా కంఠమునకు ఉరిపోయ్ నెంచిన నే నూరకుందు కాలము కాలము దాటినది. నా మంచిచెడ్డలు నిర్ణయింపజాలు వివేకము నాకు పొడమినది కావున ఇప్పు డాతని యాటలు సాగవు.

విన-- నీ తండ్రియెడ నీకు కర్తవ్యము లేదా?

సుశీ--నాయెడ నతనికి కర్తవ్యము లేదా?

విన--నీతండ్రి ఛేయునది నీమేలు కోరియే కదా?

సుశీ--ఈ మాట నీవు ధీరప్రశాంతస్థిరబుద్ధితోననుచుంటివా? అరువదేండ్ల తొక్కు లంపటము, వానికి నన్ను కట్టిబెట్ట దలచుచున్నాడు. ఎవరికొర్కు? సంఘబీతిచే, అర్ధాశచే ... నా సుంఅమునకై కాదు.

విన--అట్లె కానిమ్మొ. నీత్రాజ్ఞాపరిపాలనమునకై నీవు స్వార్ధమును త్యజింపవలదా?

సుశీ--ఏల?

విన--ఆత్మోత్సర్గము !

సుశీ--ఇట్లన్యాయముగా ఆత్మోత్సర్గము కావింపను. అది నా చేతకాదు. తండ్రి, సంఘము, భగవంతుడును సంతసింతురని ఆనిఛారకృత్య మాచరింఅను- ఆత్మత్యాగ మను
రం 4]

43

భారత రమణి

చుంటివి. పరుల హితమునకు బలి యగుట ఆత్మత్యాగ మగును కాని ఈ సమాజమును క్రూరరాక్షసి కడుపు నింపుటకు గొంతుక కోసుకొనుట ఆత్మత్యాగముకాదు, అది ఆత్మహత్య! అందుకు నేనొప్పను. నా తండ్రి కిష్టముకాకున్నను నేను నిన్ను పెండ్లి చేసుకొన దలచిన?

విన-- నీతండ్రి యనుమతి లేకున్న మనకు పెళ్లి కానేరదు. కర్తవ్యప్రతికూలములగు కార్యముల జరుగ నిచ్చువాడ గాను.

సుశీ--అయితే నామీద నీకు ప్రేమ లేదన్నమాటే.

విన--ప్రేఅబలముననే ఇంతదూరము హిత ముప దేశించితిని. నాప్రేమ యెట్టిదనిన--నిన్నంటినచొ నీ గాత్రము మలినమగునేమో అను శంకచే నీదఱి జేరవెరతును, నిన్ను తేరిచూచిన నీ రూపమందిరము అపవిత్ర మగునను బీతిచే కన్నులార నిన్ను జూడవరతును; శుభ్రనిశీధాకాశము జూచునప్పుడెల్ల నీశీలము జ్ఞప్తికివచ్చి దివ్యసుఖ మ్నుభవించు చుందును.... ఐనను నీజనకుని అనుమతిలేక నిన్ను పెళ్లి చేసికొన నొల్లను.

సుశీ-- అట్లైన ఇదే మనము చరమసమావేశము.

విన--కానిమ్ము. ఈశిక్ష అతికఠినము నిన్ను గాంచ కున్న నా కీప్రపంచమంతయు పాడుపడినట్లు తోచును, గుండె వ్రీలును.. గాని మనఉభయుల క్షేమమునకై-- మనకు
44

అం 1]

భారత రమణి

సమావేశము కాకుండుటయే శ్రేయము. నీతండ్రియజ్ఞ ననువతింపుము. అది విఘ్న మగునను బీతిచే నేడు నీకంట బడను. నీకర్తవ్యపాలనపరమును నిరాటంక మొనర్తును. నాకు సెలవిమ్ము-- నీకు మెలగుగాక !

సుశీ-- ఓహో! నీవు కూడ ఈ కుట్రలో చేరితివా! సరే... నాకు వివాహమే వలదు. వివాహము-- నిర్మములగు పురుషుల జేరుట న్యాయ్యము కాదు. వీరిని వలచుటా? వీరి చరణములకు దాస్య మొనర్చుటా? ఏమి దుష్క్ర్తము! వినయా! నన్ను రక్షించితివి... నా యారాటమును తొలగించితివి... నాకు పెళ్ళియే వద్దు.

        (వినోదిని వచ్చును)

వినో--సుశీలా, నీ నారయ లేవైతివి.

సుశీ--దేనిని?

వినో--వినయుని ఉదార హృదయమును

సుశీ--ఉదార...హృదయమా!

వినో-- సందియము మేమి? వినయు డెంత మహాత్ముడు! ఏమి ఆత్మోత్సర్గము ! ఏమి మనోదార్డ్యము! నీ నారయ నేరవు! అప్రాజ్ఞవు కావు.. హా! దైవమా, పురుషుల చిత్తము లింత ఉదారములా? వాటిని జూచి విస్మయచకితుల మగుటచే మాకు నొరాడకున్నది. వారి పాదరజమునేని మేము, పోజాలము.
రం 4

45

భారత రమణి

సుశీ-- ఏల?

వినో--వినయుడు నిన్నంత ప్రేమించునోనీకు తెలియలేదు. చేత జిక్కిన స్వర్గమును ధూళివలె ఎగురజిమ్మేనే- కర్తవ్యనిరహణార్ధము...నీ తండ్రియెడ నీ వొనర్పవలసిన దానిని నీవే నాచరింప జేయుటకు... అది నీకు బోధపడలేదు.

సుశీ-- నా తండ్రియెడ నేనెట్లు వర్తింపవలయునో నేనెరుగుదును. ఒకరు నాకు చెప్పనక్కరలేదు.

వినో-- నీ వేమియు నెఱుగవు. చెప్పినను నీకు బోధ పడదు. ఇంగ్లీషు చదువువల్ల నీకబ్బినది అహంకారమొక్కటే ఇంకేమియు అబ్బలేదు.

సుశీ--నీ యుపన్యాసమును ఈపాటి కట్టిపెట్టి దయ చేయుము.

వినో--తండ్రిగార్కి నీపై ప్రేమ లేదని తలచుచుంటివా? సంతారనమునకై అతడెట్టి సంతానము, ఎట్టివేదన, ఎట్టివ్యధ నొందుచుండెనో నీవు గుర్తింప గల్గితివా?

సుశీ-- అది నీవే ఎరుగుదువు కాబోలు?

వినో--ఆహా, నే నెరుగుదును. అహోరాత్రములు మనకై వారెట్లు కుందుచున్నారో నేను గాంచుచున్నాను. వారి కంటికి నిదురయున్నది లేదు. నేను ప్రక్కనే నిల్చి విసరుచుందును. వారి కాహారము నోటికి పోవుటలేదు. నా చేతు
46

అం 1]

భారత రమణి

లతో వారి కన్నము వడ్దించుచుందును. వారిమతి చెడినది. మనగతికి కుందుచూ తలా తోకా లేనిమాట లాడుచుందురు. వారి యారాట మంతయు నేను గాంచుచుందును. నీ వెరుగరు.

సుశీ--కుడిచి కూర్చుండి వారిట్లు కుందనేల?

వినో--నీ కిప్పుడు బోధపడదు, ఇకముందు బోధపడ గలదు. నీ మానస మిపుడు స్వార్ధలహంకారాంధతమ సంబునె నిబిడముగ వాచ్చారింపబడి యున్నది. త్యాగసూర్యుడు నీ చిత్తాకాశమున నుదయించిన తోడనే ఆహమిక యను పొగమంచు విరియబార, స్వార్ధమను ధ్యాంత మంతరింప, అప్పుడు వారి యంతరంగము నీ కవగతమగును.

సుశీ--తండ్రిగారు నన్ను బాగుగ నెరుగుదురు. ఎవరేది చెప్పినను నా చిత్తానుసారము వర్తించు ఆబాధ్య పుత్రిక నని పలువురతో పల్కుచుందురు. నా స్వభావమునకు ప్రతి కూలముగా సంచరించుట నాకు సాధ్యము కాదు. సంఘమునకు బలినగుటకు సమ్మతింపను. ప్రాణముండిన పోయిన పంతమిదియ.

వినో-- నీ కెవరు చెప్పగలదు ? (పోవును)

సిశీ--కాంతను భార్యగా పురుషున కర్పించుట దాసత్వమను త్రాటితో దాని మెడకురిపోయుటే... బలవంతముగా నాకు పెండ్లిసేయ నెవరు సాహసింతుతో చూచెద గాక!
రం 4]

47

భారత రమణి

[మానస వచ్చును]

మాన--అమ్మా ! సుశీలా ! ఒక్కర్తె నిక్కడ నెమి చేయుచున్నావు? కాలుసేతులు కడుగుకొని రమ్ము, జడ వేసెదను, పెళ్లికొడుకు వచ్చును.

సుశీ--వచ్చేవాడు వరుడు కాడు, యముడు అతని కొఱ కలకంకరించుకొన నక్కరలేదు. ఒడ లెంతబరువిఅన విడువడే యముడు.

మాన--ఇవేటి మాటలు?

సుశీ-- అమ్మా, నావలన మనయింటికి కీడుమూడ నున్నదా?

మాన--అట్ల నుచుండి వేమి?

సుశీ--లెకున్న, నన్ను వెళ్లగొట్టుటకు విశ్వప్రయత్న మేల? సొమ్మన్న నేనే పోదుననే.

మాన--నీకు మతిపోయిన ట్లున్నది.

సుశీ--నాబుద్ది సుంతయు చెడలేదు. అట్లైనచో నేను దీనిని గ్రహిచుటెట్లు? అమ్మా! నీకు వింతగా నున్నదా? (లోన నుండి కత్తిని తెచ్చి) ఇఅంత ఆర్భాట మక్కరలేదు. దీనితో నొక్కవేటు చాలును-కానీ!

మాన-- ఇదేమి?

సుశీ--ఒక్కదెబ్బతో తెగ నరుకుడు ముక్కలు ముక్కలుగా చిత్రవధ చేయకుండు. మీకన్న కసాయివారు మేలు, ఒకదెబ్బతో నరికి చంపును, శరీరము నిండ శూలము
48

అం1]

భారత రమణి

లను గుచ్చి బాధేట్టి చంపకు. ఇంత వృధాప్రయత్న మేల? పెళ్లి యేవద్దు.

మాన-- అలా గనవచునా?

సుశీ-- విను నేను మీయిల్లు గుల్లచేసి, మీ సంసార సుఖమునకు గొప్ప వ్యాఘాతమును కల్పించివి నని, మీదు కుందవద్దు రేపురాత్రినుండి మీకంట బడను. భీతి వలదు-- నాకి పెండ్లివద్దని నాన్నగారితో చెప్పు- బలవంతముగా పెళ్ళి చేయలేరు. ఏలయన తత్పూర్వమే ఈకత్తిని చూచి తివా? దీనితో గొంతుక కోసుకొందును.

మాన--(చేయి పట్టుకొని) ఆట్ల నరాదమ్మా!

సుశీ--నేను చేయునది సిగ్గుమాలినపని యని నాకు తెలుసును. కాని ఏమి చేయుదును? నా కెందుకు దిక్కులెదు, రక్షకుడగు తండ్రి, తొడమీద జేర్చి దు:ఖముల బాపు తల్లి, తొడు నీడయగు తోబుట్టువు. సంతానము దీర్చు స్వజనము, వీరందదు నాయెడ విముఖులైరి! ఇంత మంది నాపై కత్తిగట్టినారు. కన్నత్రల్లి కంఠమునకు చమురు పూయ, కన్నతండ్రి కత్తి నూరుచున్నాడు. ఇక నాకు రక్షణము నేనే సల్పుకొనవలయును. కావున కత్తిని చేత బట్టితిని. అమ్మా, ఇటు విను నెనీ వివాహమున కొప్పుకొనను. తప్పని సరి యంటిరా తల ద్రుంచుకొనెద-

పోవును

రం 4]

49

బారత రమణి

మాన-- నిజముగా, కాలుచేతులు గట్టి దీనిని గంగలో తోయుటే...పోయి వద్దని వారించెదను.(పోవును)

మహేంద్రుడు, కేదారుడు వత్తురు)

కేదా-- మహేంద్రా! మీతండ్రి ఏడీ?

మహే--ఎక్కడికో వెళ్ళినారు.

కేదా-- నేననుకొప్నిన ట్లయినది. క్షణములో సర్వ నాశనమైనది. కానిమ్ము. ఎటు వెళ్ళెను?

మహే--అదేమో.

కేదా--తెలిసినను ప్రయోజనము లేదు. ఇక నేనాగను. జరుగురు పని,చెప్పక తీరదు, (పైకి చూచి) కార్యప్రవాహ మిట్లున్నదేమి? అత్యవసరముగా అతని చూడవచ్చితిని, వెర్రి దేవేంద్రుడు వేళకు లేడు. ఇందుచే ఈశ్వరుడు లేడనియే సిద్దాంతము చేయవలయును. ఉన్నచో నిట్టి సమయమున ఈ పనికి విఘాతము రాజెల్లునా! శ్రీరామపురమునుంది ఈ మాట చెప్పుటకు ఇంత త్వరలో వచ్చితిని. వ్యవధి లేదు. (వాచి చూచి) ఆలస్యము చేయరాదు. మహేంధ్రా మీ నాన్నతో చెప్పు... కాదు కాదు...దానా విషయములు నీకు బోధపడవు...ఆ...విను...విని జ్ఞప్తియున్నంత మీ
50

అం 1]

భారత రమణి

అయ్యతో చెప్పు "నే నంతయు సరిచేసినాను. గాడిదె కొడుకు దానా త్రెచ్చుకోసి"...

మహే-- ఎవరు? యజ్నేశ్వరుడు గారా?

కెదా--"గార" యినాడెమి? తొత్తుకొడుకు, సారా లుచ్చ నాలిముచ్చు.

మహే--ఇంక దావా వెయ్యడు.

కేదా-జంకినాడూ! నెను జాక్సనుగారి నడిగినాను. అందుకే అడలు-- భ్రష్టుడు-- దావా చేయుట- పత్రమునకు సాక్ష్యము రాదు. అందుకే పంద జంకినాడు.

మహే-- అది కాదు-- అతనికి మా అక్క నిచ్చి పెండ్లి చేయుదుము.

కేదా--పెళ్లి! ఏమంటివి! సరిగా చెప్పు పెళ్లే! విధిపూర్వక వివాహమే?

మహె-- నెడు బ్రధానము. తాంబూలాలు పుచ్చుకొనుటకు వారు వచ్చెదరు.

కేదా--ప్రధానమే! తాంబూలములు పుచ్చుకొందురా? పిల్లను చూచుట- పిల్లదానిని చూచివచ్చుట- ఇచ్చుట- పుచ్చుకొనుత-కట్నము, కానుకలు, అన్నియు తెగినవా? చూడ వచ్చెదరా? ఎప్పుడు?

మహే--నేడే!

కెదా--సరే-- ఈపెళ్లి కాదు. నేనుండి నేదు రేపు పోయెదను. ఇచ్చటనే బోజనము చేసెదనని మీ అమ్మతో
రం 4]

51

భారత రమణి

చెప్పుము నా కొర కేమియు ప్రయత్నము చేయవద్దు. సుశీల ఏది?

మహే-- కనబడ లేదు

కేదా--దాని కీపెళ్ళి యిష్టముకాదు గదా?

మహె-- అదేమో?

కేదా-- దాని కిష్టమైన నేమి?

(సుశీల వచ్చును)

నీకు పెండ్లియట? (ఆమె ఊరకుండును) సరే, ఈ పెళ్ళి కాజాలదు. నేను కానీయను. నీకిది ఇష్టములేదుకదా? (ఆమె ఊరకుండును) తెలిసినది. మహెంద్రా! ఈ పెళ్ళి కాదు. సుశీలా, మీ నాన్నతో 'నాకు కూటికి గుడ్దకూ మీ రీయలేనిచో కేదారుడునన్ను పోషించుననుము. నా కాడపిల్లలు లేరు. నీవే నా కూతురవు. మా యింటికి రా! (సుశీల ఏడ్చును) ఏడువకు. ఈ పెళ్లికానీయను. నేను కానీయను. మహేంద్రా)! కాగితముజ్ కలమును తీసుకొనిరా! (పోవును, నవ్వి)దేవేంద్రా)! బోధపడినది. అంతయు తెలిసినది. నీయవస్థను నాకిచ్చి నా యవస్థను నీవు కొనుము..ఇట్టియెడ నేను చేయవలయునో మన సంఘమునకు చక్కగా బోదింతురు. దిక్కుమాలిన మన సమాజము కసాయి దుకాణము. పిశాచి! రాక్షసి! (సుశీలతో) అమ్మా! క్షమించు నీయెడల తిట్టకూడదు. మన సంఘము చాలా
32

అం 1]

భారత రమణి

మంచిది. పరమసాధువు, సనాతనార్యఋషి సంఘటితము అది పాడుపడునా? అట్లనగూడదు.

(కాగితము కలముతో మహేంద్రుడు వచ్చును)

మహేంద్రా, తెచ్చినావా? ఇటు తెమ్ము... కాదు. నీవే వ్రాయుము.

మహే--ఏమి వ్రాయను?

కేదా--'ఈపెండ్లి కాబోదు ' అని వ్రాయుము. పిమ్మట నందరికిని చూపవలయును... నవ్వెదమేమి? వ్రాయి! (అతడు వ్రాయును) ఏదీ చూపుము. (చదివి) ఏదీ కలము, ఇదిగో నా సంతకము. 'శ్రీ కేదారనాధ భట్టాచర్యులు ' చూడు. దీనిని జాగ్రత్తగా నుంచుము. అందరికీ చూపవలయు. సంతకమయినది. ఇక భయము లేదు. అమ్మా భీతిల్లకు, రమ్ము లోనికి పోవుదము (వెళ్లుదురు).

హే--అసాధ్యుడు లాగున్నాడు.(వెళ్లును)

         -----

పదవ రంగము

(దేవేంద్రుడు, ఉపేంద్రుడు, యజ్నేశ్వరుడు, సదానందుడు, ఉపేంద్రుని భక్తగణము)

ఉపే--దేవేంద్రా, జాగేల? ముహూర్త మాసన్నమైనది. ప్రధానము కానిమ్ము, "శుభస్య శీఘ్రమ్",
రం 5]

53

భారత రమణి

హరి--ఔనౌను. శీఘ్రం ఏమి నవీనా?

నవీ--ప్రభువుగారిమాట తప్పు;నా?

శంక--దేవేంద్రా, ఏమాలీచించుచున్నావు?

దేవే--ఏమియు లేదు. ఇంట్లో నేదో రోదనధ్వని యగుచున్నట్లున్నది. మీకు వినబడలేదా?

ఉపే--ఏమియూ లేదు, కానిండు

హరి--దేవేంద్రా! ఇట్టి వరుడు లభించుటకు మీకన్య అఖండతపస్సు చేసి యుండవలయును.

శంక--కుబేర సంపత్తి!

నవీ--ఓహో!

వినో--వయసు నెంచవు

హరి--దానికేమి? జుట్టుకు నల్లరంగు పూసినచో ఇరువదేండ్ల పెళ్లికుమారుని లాగుండును.

సదా--దంతములు కూడా కట్టించుకొనవలయు నేమో?

శంక--దేవేంద్రా, ఎందుకీ ఆలస్యము?

దేవే--లేదు లేదు. ఏమి సదానందా, సంకల్ప మారంబింతునా?

సదా--నీ చిత్తము.

దేవే--అట్లు కాదు మనస్పూర్తిగా ఈ పని చేయుమని నీవు చెప్పువరకు నేను చేయజాలను. నీవు చెప్పిన వెంటనే చేసెదను.

ఉపే-- నెను చెప్పచుంటనే?
54

అం 1]

భారత రమణి

నవీ-- మీరు కాదు, సదానందా, నీవు చెప్పవలయును.

సదా--నీ కూతురు నీయల్లుడు- నేనేమనగలను?

దేవే--అట్లనకుము, శుభకార్యము చేయుచున్నాను. సంతుష్టమగు మనసు ప్రసన్నమగు ముఖముతో నీవు సమ్మతింపకున నేను దీని నొనరింపను. మనసార నీవు వచింపుము... ప్రారంభింపనా? సదానందా! నీవు నాకు బాల్యమిత్రుడవూ ఇట్టి సమయమున నూరకుండుట నీకు తగదు. నీముఖ,మున మందహాసరేఖలు గాంచకున్న నేనీ కార్య ముపక్రమింపను.ఏమందువు?

సదా--సరే...నా అభిప్రాయ మెరిగింపుమని ఇంతగా అనురోధించు చున్నావు కావున, చెప్పుచున్నాను విను. నీకూతురికి ఈ పెండ్లి చేయుట మాఱుగ కాలుసేతులు కలియగట్టి గంగలో బడద్రోయుట మేలు.

హరి--ఏమి, సదానందా, అట్లనుచున్నావు?

ఉపే-- దేవేంద్రా! నేను చెప్పుచున్నాను,అది చాలదా? నామాటకన్న సదానందునిమాట నీకెక్కుడు శుభదాయకమా? నేను నీకు సోదరుడ, అగ్రజుడ, నామాట నీకు రుచింపదా?

నవీ--గురువుగారి వాక్యము-
రం 5]

55

భారత రమణి

సదా--ఉపేంద్రా నీవిట్లేల సలహా యిచ్చుచున్నావో నాకు బోధపడుట లేదు. నీస్నేహవాక్యములను తెఱమరుగున కౌటిల్య మమరియున్నదని నా నమ్మకము. నీ స్వరమును జూడ నీవు తడిగుడ్డతో గొంతుక కోయువాడవని స్ఫురించుచున్నది. ఎవరి కొంపమాపదలచితివి ? సుశీల గొంతుక కోయదలచితివా? అట్టి కృత్యము మాకు కల్పనాతీరము.

హరి--సదానందా, మహర్షిగారి నిటుల నిందించెద వేమి?

సదా-- మీకు జవాబు చెప్పనక్కరలేదు. మీరు క్షుద్రోపజీవులు... ఉపేంద్ర బాబూ ! నీ హృదయ మింత నీచమని నేనెరుగను, నేనొరుల నిందించువాడను కాను. నీబొటి తగుమనుష్యుని ఇంతకన్న నేమని దూషింపగలను? మంచి వేషదారివి ! మోసకాడవు!

నవీ--గురువుగారు..

ఉపే--నవీనా, ఊరకుండుము సదానందా పదిమంది నాయెడ భక్తిశ్రద్ధల నగపరచిన అది నా దోషమా? వృక్షపరిణతి ఫలమునుబట్టి యుండును. మంచి ఫలములను భుజించిన సరు భావృక్షమును కొనియాడిన, తప్పు దానిదా?

సదా--అయ్యా, క్షమించుము, దేవేంద్రునికి సోదరులై, వాని శుభోదర్కము నభిలషింప దగిన మీరే ఇట్టి సలహా నిచ్చినందుకు మిమ్ము నిందింపవలసి వచ్చెను. లోగడ మిమ్ము
56

అం 1]

భారత రమణి

ప్పుడైన పల్లెత్తు పాడుమాట అంటినా? దేవేంద్రా ! ఈవివాహము మీ సుశీలకు సమ్మతమా?

దేవే-- నాకు తెలియదు

ఉపే-- కన్యకసమ్మతితో నేమిపని? ఎద్దునడిగి గంత కట్టుదురా?

శంక--గురువుగరు చెప్పుచుండిరే!

సదా--(ఉపేంద్రుని వైపు చూచి ఘృణ నగపరుచును) దేవేంద్రా! నీ కొమార్తెకు బాల్యముననే వివాహ మొనర్చియుండిన ఆమె సమ్మతి గొన నక్కర యుండదు, కాని పదునారువత్సరములు పైబడినవి. చచువుకొన్నది, కావున ఆమె సుఖదు:ఖములయెడ ఆమె సమ్మతిని గొనక పెండ్లిచేయుట భావ్యంకాదు.

యజ్నే--సదానందా! చూడు, ఈ శూకార్యమున కంతరాయము కల్పింతువేల? దేవేంద్రా! యావదృణమును వడ్డీతో వదలెదను.

సదా--ముందు కన్య అభిప్రాయమును కనుగొని రండు.

ఉపే--ఆమె మాత్రము వలదనునా? మా అభీప్రాయమే ఆమె అభిప్రాయము.

(కేదారుడు మరికొందరును కర్రలతో వత్తురు)

కేదా--ఆ సమయమునకే వచ్చినాము

సదా--కేదారా, వీరంద రెవవు?
రం.6]

57

భారత రమణి

కేదా--అంతయు ఆఖరున చెప్పెదను. ముందుగా యీ మహాత్ముని (అజ్నేశ్వరునితో) పెండ్లి కొడుకా, పొమ్మిటనుండి.

యజ్నే--ఏమి యీ దురంతము! దేవేంద్రా?

కేదా--నేను పొమ్మన్న మూర్ఖా పోవేమి?

దేవే--కేదారా, ఏమిది?

కేదా--నీ వూరకుండుము, లేకున్న కలహముతప్పదు. లేవవేమిరా! కుక్కా! పందిలాగ బలిసి నావు. పద యయటికి, లేకున్న కిరీటపూజ తప్పదు. ఒక కాలు కాటికి ఇంకొకటి నరకమునకును దాచుకొన్న నీకు పెళ్లి కావలెనా? పెద్దమ్మా- పద- బాలికా! నిర్భాగ్య దామోదరా!

యజ్నే--నన్నెందుకు తిట్టెదవు?

ఉపే--పెద్దమ్నుష్యులయెడ నీవిట్లు వర్రింప జెల్లునా? కేదారా!

కేదా--ఓహో ! మహర్షిగారా ! మిమ్ము చూడనే లేదు. ఏమిరా! లేచెదవా ? చెప్పుదెబ్బలు కావలెనా? ఊ లేవవేమి?

సదా-- కెదారా!

కేదా-- మాటాడ వలదని చెప్పితినె సదానందా! నాకు రెయిలువేళ మించుచున్నది.ఈ కాకీమూక నిక్కడ నుండి వెడలవడసిన గాని నేను వెళ్లను. మంచిమటలతో వీరు వెళ్లినచో చెప్పులు పడవు,లేకున్న కర్రలకు పని కల్పిం
58

[అం 1

భారత రమణి

చవలసి యుండున్. నిజము పల్కిరి. ఏమి కదులుదురా?

హరి--యిదికేవల మన్యాయము. గౌరవనీయులయెడ కారుకూతలా?

కేదా--నోరుమూసుకొనుము, మీరందరును కుక్కలు, పందులు, గాడిదెలు, పరోఅజీవి కీటకములు, పోదురా? లేక దుమ్ములువిఱుగ పొడువనా?

శంక--ఏమయ్యా! వరుసపెట్టి అందరిని తిట్టుతున్నావు

కేదా--ఊరొకో గుడ్లగూబా !

శంకా-- నేను గూబనా?

యజ్నే--శంకరా, ఊరుకుండుముజ్, కయ్యమునకు కాలు దువ్వకు.

శంక--ఇంకొకసారి అననీ--

కేదా-- ఒకసారి కాదు, నూరుసార్లంటాను, గూబా! నాకాలస్య మగుచున్నది. సదానందా! నానేరము లెదు, తాటిటెంక లాగు తలా నీవు లేవవేమిరా? తన్నులు కావలెనా? (కాలియజ్నేశ్వరుని పొడుచును)

యజ్నే--నన్నుపొడిచెద వేమిరా?

కేదా-- తెలియలేదా? ఇదిగో(తిరుగ పొడచి) ఇప్పుడు తెలిసినదా? ...లే...అన్నలారా! కఱ్ఱ లెత్తుడు.
రం 5]

59

భారత రమణి

యజ్నే-- సరే- పోవుచున్నాను కాని దావా తెచ్చెదను. ఊరుకొనను. చూడు నాదెబ్బ! (వెళ్ళును)

భక్తు-- (వెళ్ళుచూ) చూడు మాదెబ్బ.

కేదా--చూచెద లెండి. పిచ్చికుక్కల్లారా! ఈ పింజారిక్కడ యజ్ఞేశ్వరుడు నేడో రేపో చావనున్నాడు. వీనికి పెళ్ళి కావలెనట; ఇంకొక క్షణ మాగిన పెద్దపెళ్ళి చేసి పంపుదును. మహర్షిసత్తమా! భక్తగణము పారిపోయినది. చిరిగిన గుడ్డ పీలిక వలె మీరిచట జీరాడ నేల? అనుష్ఠానసమయ మాసన్నమైనది. ఆశ్రమమున కరిగి భగవద్గీతా పారాయణ మొనర్చుడు.

ఉపే-- నీదౌష్ట్యమునకు కారావాసమే శిక్ష !(పోవును)

కేదా--ఒకసారి కాదు. లక్షసారు లేగుటకు సిద్ధము,కర్తవ్యము నిర్వర్తించితి. తత్ఫలము దైవాధీనము.

సదా--కేదారా! ఎందరో గీతలను చదువుచుందురు- నీవో వాని నాచరణమునకు తెచ్చితివి. ఏదీ, నీకౌగిలిమ్ము....

కేదా--ఇంక మూడు నిముసముల వ్యవధి యున్నది

దేవే-- కేదారా! ఎంత పనిచేస్తివి!

కేదా--నన్నేమియు ననవలదు, జగడము పెరుగును.
60

[అం1

భారత రమణి

ఇదేరైలునకు వేళసమీపించినది. తిరుగ నీమూర్ఖునకు నీకూతురునిచ్చి పెండ్లిచేసితివా- నేనొప్పను- కీడు మూడక తప్పదు. ఇప్పుడే చెప్పుచున్నాను. ఈమాటకు తిరుగు లేదు. మరునాడే యజ్నేశ్వరుని తల పగులగొట్టి, నీకుమార్తె సౌభాగ్యమును హరింతును. దీని మఱువక్వకుము--