Jump to content

పోతన తెలుగు భాగవతము/సప్తమ స్కంధము/వర్ణాశ్రమ ధర్మంబులు

వికీసోర్స్ నుండి

వర్ణాశ్రమ ధర్మంబులు


తెభా-7-408-సీ.
"నఘాత్మ! సకల వర్ణాశ్రమాచార స-
మ్మత ధర్మ మెయ్యది మానవులకు?
నే ధర్మమున నరుం డిద్ధ విజ్ఞానము-
క్తియుఁ బ్రాపించుఁ? ద్మజునకు
సాక్షాత్సుతుండవు ర్వజ్ఞుఁడవు నీకు-
నెఱుఁగరానిది ధర్మ మింత లేదు;
నారాయణపరాయ స్వాంతు లనఘులు-
శాంతులు సదయులు సాధువృత్తి

తెభా-7-408.1-ఆ.
మెఱయుచున్న ఘనులు మీవంటి వా రెద్ది
రమధర్మ మనుచు క్తిఁ దలఁతు
ట్టి ధర్మరూప ఖిలంబు నెఱిఁగింపు;
వినఁగ నిచ్ఛ గలఁదు విమలచరిత!"

టీక:- అనఘాత్మా = పుణ్యాత్మా; సకల = అఖిలమైన; వర్ణ = చాతుర్వర్ణముల {చాతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు}; ఆశ్రమ = చతురాశ్రమముల {చతురాశ్రమములు - 1బ్రహ్మచర్యము 2గార్హస్థ్యము 3వానప్రస్థము 4సన్యాసము}; ఆచార = ఆచారవ్యవహారములు; సమ్మత = అంగీకారయోగ్యమైన; ధర్మము = పద్ధతులు; ఎయ్యది = ఏది; మానవుల్ = నరుల {మానవులు - మనువువలన పుట్టినవారు, నరులు}; కున్ = కు; ఏ = ఎట్టి; ధర్మమున = ధర్మమునాచరించుటచే; నరుండు = మానవుడు; ఇద్ధ = మేలైన; విజ్ఞానమున్ = విజ్ఞానమును; భక్తియు = భక్తి; ప్రాపించున్ = పొందును; పద్మజున్ = బ్రహ్మదేవుని; కున్ = కి; సాక్షాత్ = స్వయముగ; సుతుండవు = కొడుకువు; సర్వ = సర్వమును; అజ్ఞుడవు = తెలిసినవాడవు; నీ = నీ; కున్ = కు; ఎఱుగ = తెలిసికొనుటకు; రానిది = అలవికానిది; ధర్మము = సదాచారము; ఇంతన్ = కొంచముకూడ; లేదు = లేదు; నారాయణ = విష్ణుని యందు; పరాయణ = తత్పరులైన; స్వాంతులు = మనసుగలవారు; అనఘులు = పుణ్యులు; శాంతులు = నిత్యశమసంపన్నులు; సదయులు = కరుణగలవారు; సాధువృత్తిన్ = సద్వర్తనమున.
మెఱయుచున్న = ప్రకాశించుచున్న; ఘనులు = గొప్పవారు; మీ = మీ; వంటి = లాంటి; వారు = వారు; ఎద్ది = ఏదయితే; పరమ = మేలైన; ధర్మము = స్వభావము; అనుచున్ = అనుచు; భక్తిన్ = భక్తితో; తలతురు = భావించెదరో; అట్టి = అటువంటి; ధర్మ = ధర్మముయొక్క; రూపము = రీతి; అఖిలంబున్ = అంతయును; ఎఱిగింపుము = తెలుపుము; వినగన్ = వినుటకు; ఇచ్ఛ = కోరిక; కలదు = కలిగినది; విమల = స్వచ్ఛమైన; చరిత = నడవడికగలవాడ.
భావము:- “పుణ్యాత్మా! నీవు సాక్షాత్తు పద్మసంభువుడైన బ్రహ్మదేవుని మానస పుత్రుడవు. స్వచ్ఛమైన నడవడిక కలవాడవు. సర్వదా నారాయణ చరణ స్మరణ పరాయణుడవు. శాంతమూర్తివి. దయాహృదయుడవు. సర్వజ్ఞుడవు. సకల ధర్మాలూ, ఆచార వ్యవహారాలూ నీకు తెలుసు. నీవు ఎరుగని ధర్మం లేదు. అన్ని వర్ణాల వారికి పనికివచ్చే ఉత్తమమైన ధర్మం ఏది? ఏ ధర్మం ఆచరిస్తే మానవునికి నిర్మలమైన భక్తి జ్ఞానాలు ప్రాప్తం అవుతాయి? తమ వంటి వారు ఏది ఉత్తమ ధర్మం అని భావిస్తారు? అటువంటి ధర్మస్వరూపాన్ని వివరంగా చెప్పండి. నాకు వినాలని కుతూహలంగా ఉంది.

తెభా-7-409-వ.
అనిన నారదుండు ధర్మరాజుం జూచి "దాక్షాయణి యందు నిజాంశంబున నవతరించి భువన శోభనంబు కొఱకు బదరికాశ్రమంబునఁ దపోనిరతుండయి యున్న నారాయణునివలన సనాతనంబగు ధర్మంబు వింటి; నది చెప్పెద; సకల వర్ణంబుల జనులకు సత్యంబును, దయయును, నుపవాసాది తపంబును, శౌచంబును, సైరణయును, సదసద్వివేకంబును, మనోనియమంబును, బహిరింద్రియ జయంబును, హింసలేమియును, బ్రహ్మచర్యంబును, దానంబును, యథోచితజపంబును, సంతోషంబును, మార్దవంబును, సమదర్శనంబును, మహాజనసేవయు, గ్రామ్యంబులయిన కోరికలు మానుటయు, నిష్ఫలక్రియలు విడుచుటయు, మితభాషిత్వంబును, దేహంబు గాని తన్ను వెదకికొనుటయు, నన్నోదకంబులు ప్రాణులకుం బంచి యిచ్చుటయుఁ, బ్రాణులందు దేవతాబుద్ధియు, నాత్మబుద్ధింజేయుటయు, శ్రీనారాయణచరణస్మరణ కీర్తన శ్రవణ సేవార్చన నమస్కార దాస్యాత్మసమర్పణ సఖ్యంబు లనియెడి త్రింశల్లక్షణంబులు గలుగ వలయు; నందు సత్కులాచారుం డయి మంత్రవంతంబు లయిన గర్భాదానాదిసంస్కారంబు లవిచ్ఛిన్నంబులుగాఁ గలవాఁడు ద్విజుండు ద్విజునకు యజన యాజనాధ్యయ నాధ్యాపన దానప్రతిగ్రహంబు లను షట్కర్మంబులు విహితంబులు రాజునకుఁ బ్రతిగ్రహ వ్యతిరిక్తంబు లయిన యజనాది కర్మంబులయిదును బ్రజాపాలనంబును బ్రాహ్మణులుగానివారివలన దండశుల్కాదులు గొనుటయు విహిత కర్మంబులు; వైశ్యునికిఁ గృషి వాణిజ్య గోరక్షణాది కర్మంబులును బ్రాహ్మణకులానుసరణంబులును విహితంబులు; శూద్రునకు ద్విజ శుశ్రూష జేయవలయు.
టీక:- అనినన్ = అనగా; నారదుండు = నారదుడు; ధర్మరాజున్ = ధర్మరాజును; చూచి = చూసి; దాక్షాయణి = మూర్తిదేవి {దాక్షాయణి - దక్షునికూతురు, మూర్తిదేవి}; అందున్ = అందు (ధర్మునకు); నిజ = తన; అంశంబునన్ = కళతోటి; అవతరించి = జనించి; భువన = జగత్తునకు; శోభనంబు = మంగళము; కొఱకు = కోసము; బదరిక = బదరిక యనెడి; ఆశ్రమంబునన్ = ఆశ్రమములో; తపస్ = తపస్సునందు; నిరతుండు = లగ్నమైన చిత్తము గలవాడు; అయి = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; నారాయణుని = నారయణుడు అను ఋషి; వలన = వలన; సనాతనంబు = శాశ్వతము, పురాతనము; అగు = అయిన; ధర్మంబున్ = ధర్మము; వింటిని = వినియున్నాను; అది = దానిని; చెప్పెదన్ = చెప్పెదను; సకల = అన్ని; వర్ణంబుల = కులముల; జనుల్ = వారి; కున్ = కి; సత్యంబును = సత్యము నందు నిష్ఠ; దయ = కరుణ; ఉపవాస = నిరాహారవ్రతము; ఆది = మొదలగు; తపంబును = తపస్సులు; శౌచంబును = సదాచారము; సైరణయును = ఓరుపు; సదసద్వివేకంబును = మంచిచెడ్డల యెరుక; మనః = మనసును; నియమంబును = వశమున నుంచుకొనుట; బహిరింద్రియ = వాక్పాణిపాదపాయూపస్థలను; జయంబును = లోబరచుకొనుట; హింస = చంపుట, బాధించుట; లేమియును = లేకపోవుట; బ్రహ్మచర్యంబును = బ్రహ్మత్వ మందలి తలపు; దానంబును = దానము నిచ్చుట; యథోచిత = దేశకాలములకు తగినట్లు; జపంబును = జపముచేయుట; సంతోషంబును = తృప్తి; మార్దవంబును = మృదుస్వభావము; సమదర్శనంబును = సర్వసమత్వభావనము {సమదర్శనము - సర్వభూతములను సమముగ చూచుట, ఆత్మీయ పరకీయ భ్రాంతి లేకుండుట}; మహా = గొప్ప; జన = వారి; సేవయు = సేవించుట; గ్రామ్యంబులు = తుచ్ఛములు; అయిన = ఐన; కోరికలు = కోరికలు; మానుటయు = వదలివేయుట; నిష్ఫల = ప్రయోజనములేని; క్రియలు = పనులు; విడుచుట = విడిచిపెట్టుట; మిత = మితిమీరక, తక్కువగా; భాషిత్వంబును = మాట్లాడుట; దేహంబుగాని = దేహముకంటె వేరైన; తన్ను = తనస్వరూపమున; వెదకికొనుట = అన్వేషించుకొనుట; అన్న = ఆహారము; ఉదకంబులు = నీరు (పానీయములు); ప్రాణుల్ = జీవుల; కున్ = కు; పంచియిచ్చుట = పంచిపెట్టుట; ప్రాణుల్ = జీవుల; అందున్ = ఎడల; దేవతా = దైవత్వముదర్శించెడి; బుద్ధి = భావన; ఆత్మబుద్ధిన్ = ఆత్మభావన, అభేదబుద్ధి; చేయుటయున్ = చేయుట; శ్రీ = శ్రీ; నారాయణ = హరి; చరణ = పాదములను; స్మరణ = స్మరించుకొనుట; కీర్తన = సంకీర్తనము; శ్రవణ = తత్కథాశ్రవణము; సేవ = కైంకర్యము; అర్చన = పూజ; నమస్కార = నమస్కరించుట; దాస్య = కొలచుట; ఆత్మసమర్పణ = తనను సమర్పించుకొనుట; సఖ్యంబులు = చెలిమిచేయుట; అనియెడి = అనెడి; త్రింశత్ = ముప్పది; లక్షణంబులున్ = లక్షణములు; కలుగవలయున్ = ఉండవలెను; అందున్ = వానిలో; సత్ = మంచి; కుల = కులము; ఆచారుండు = ఆచారములుగలవాడు; అయి = అయ్యి; మంత్రవంతంబులు = మంత్రపూతములు; అయిన = ఐన; గర్భాదానాదిసంస్కారంబుల్ = షోడశకర్మములు (16) {షోడశకర్మములు - 1గర్భాదానము 2పుంసవనము 3సీమంతము 4జాతకర్మము 5నామకరణము 6అన్నప్రాశనము 7చౌలము 8ఉపనయనము 9ప్రాజాపత్యము 10సౌమ్యము 11ఆగ్నేయము 12వైశ్వదేవము 13గోదానము 14సమావర్తము 15వివాహము 16అంత్యకర్మము}; అవిచ్చన్నంబు = ఎడతెగనివి; కాన్ = అగునట్లు; కలవాడు = చేయబడి యున్నవాడు; ద్విజుండు = బ్రాహ్మణుడు {ద్విజుడు - ద్వి (రెండు) జుడు (జన్మములు గలవాడు), బ్రాహ్మణుడు}; ద్విజున్ = బ్రాహ్మణున; కున్ = కు; యజన = యజ్ఞముచేయుట; యాజన = యజ్ఞముచేయించుట; అధ్యయన = వేదశాస్త్రములు చదువుట; అధ్యాపన = చదివించుట; దాన = దానమునిచ్చుట; ప్రతిగ్రహంబులు = దానము తీసుకొనుట యనెడి; షట్కర్మంబులున్ = ఆరుకర్మలు; విహితంబులు = శాస్త్రముచే విధింపబడినవి; రాజున్ = రాజున; కున్ = కు; ప్రతిగ్రహ = దానముపుచ్చుకొనుట; వ్యతిరిక్తంబులు = తప్పించి మిగిలినవి; అయిన = ఐన; యజన = యజ్ఞముచేయుట; ఆది = మొదలగు; కర్మంబులు = కర్మలు; అయిదును = ఐదు (5); బ్రాహ్మణులుగాని = బ్రాహ్మణులుకానట్టి; వారి = జనుల; వలన = నుండి; దండ = దండనలు, శిక్షలు; శుల్క = సుంకములు, పన్నులు; ఆదులు = మొదలైనవి; కొనుట = తీసుకొనుట; విహిత = విధింపబడిన; కర్మంబులు = ధర్మములు; వైశ్యుని = వైశ్యుని; కిన్ = కి; కృషి = వ్యవసాయము; వాణిజ్య = వ్యాపారము; గోరక్షణ = పశుపాలన; ఆది = మొదలగు; కర్మంబులును = పనులు; బ్రాహ్మణకుల = బ్రాహ్మణకులమును; అనుసరణంబులును = అనుసరించుటలు; విహితంబులు = చేయదగినవి; శూద్రున్ = శూద్రుని; కున్ = కి; ద్విజ = రెండు జన్మలు కల వారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణములవారల, సంస్కృత తెలుగు నిఘంటువులు, వావిళ్ళ, ముదిగొండ; శుశ్రూష = సేవించుట; చేయవలయు = చేయదగును.
భావము:- అని ధర్మరాజు నారదుడిని అడిగాడు. అంతట నారదమహర్షి ఇలా చెప్పాడు “పూర్వం దక్షప్రజాపతికి నారాయణుడు తన అంశతో అవతరించాడు. లోకక్షేమం కోసం బదరికా వనంలో తపోదీక్షలో ఉండగా నారాయణుడు ఈ సనాతన ధర్మమును నాకు వివరించాడు. అలా విన్నది నీకు వివరిస్తాను. అవి:-
(అ) సకల జనుల త్రింశతి లక్షణములు (30)
అన్ని వర్ణముల వారూ ఆచరించవలసిన ధర్మములు

<tbody> </tbody>
సత్యముదయ
ఉపవాసాది తపముశౌచము
సైరణసదసద్వివేకము
మనోనియమముబహిరింద్రియ జయము
హింస లేమిబ్రహ్మచర్యము
దానముయథోచిత జపము
సంతోషముమార్దవము
సమదర్శనముమహాజన సేవ
గ్రామ్యకోరికలునిష్ఫల క్రియలు విడుచుట
మితభాషిత్వముదేహముగాని తన్ను వెదకికొనుట
అన్నోదకంబులు ప్రాణులకు పంచి యిచ్చుటప్రాణులందు దైవత్వ బుద్ధి
యాత్మబుద్ధి చేయుటశ్రీనారాయణచరణ స్మరణకీర్తనము, శ్రవణము,సేవ
అర్చననమస్కారము
దాస్యముఆత్మసమర్పణము
సఖ్యముచెలిమి కలిగి ఉండుట

(ఆ) బ్రాహ్మణుని లక్షణములు - ఈ త్రింశతి (30) లక్షణాలు కలిగి, (31) సత్కులాచారాములు కలగి ఉండుట మరియు (32) మంత్రపూతములు అయిన గర్భాదానిది సంస్కారములు కలిగి ఉండుట
(1) బ్రాహ్మణుడు ఆచరించవలసిన ధర్మములు
షట్కర్మములు

1. యజన - యజ్ఞములు చేయుట
2. యాజన - యజ్ఞములు చేయించుట
3. అధ్యయన - వేదశాస్త్రములు అధ్యయనము (చదువులు చదువుకొనుట)
4. అధ్యాపన - చదువులు చెప్పుట
5. దాన - దానములు చేయుట
6. ప్రతిగృహము - దానములు పుచ్చుకొనుట
(2) క్షత్రియుడు ఆచరించవలసిన ధర్మములు
ఏడు కర్మములు

1. యజన - యజ్ఞములు చేయుట
2. యాజన - యజ్ఞములు చేయించుట
3. అధ్యయన - వేదశాస్త్రములు అధ్యయనము (చదువులు చదువుకొనుట)
4. అధ్యాపన - చదువులు చెప్పుట
5. దాన - దానములు చేయుట
6. ప్రజాపాలన - రాజ్యమును పాలించుట
7. దండశుల్కాదులు - బ్రహ్మణులు కానివారి నుండి దండుగలు, పన్నులు వసూలు చేయుట
(3) వైశ్యుడు ఆచరించవలసిన ధర్మములు
మూడు కర్మములు

1. కృషి - వ్యవసాయము
2. వాణిజ్యము - వ్యాపారము
3. గోరక్షణ - పశుపాలన
(4) శూద్రుడు ఆచరించవలసిన ధర్మము
ఒకటే కర్మము

1. ద్విజ శుశ్రూష - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణముల వారి సేవ

తెభా-7-410-సీ.
విను కర్షణాదికవృత్తికంటెను మేలు-
యాచింపనొల్లని ట్టివృత్తి;
ప్రాప్తంబు గైకొని బ్రతుకుకంటెను లెస్స-
నుదినంబును ధాన్య డిగికొనుట;
యాయవారముకంటె ధిక కళ్యాణంబు-
ఱిగ యెన్నుల ధాన్యక్షణంబు;
శిలవృత్తికంటెను శ్రేయ మాపణముల-
డ్డగింజలు దిని బ్రదుకుఁ గనుట

తెభా-7-410.1-ఆ.
యెడరుచోట నృపతి కీ నాల్గువృత్తులుఁ
గుఁ; బ్రతిగ్రహంబు గదు; తలఁప
నాపదవసరముల ధముఁ డెక్కువజాతి
వృత్తి నున్న దోషవిధము గాదు.

టీక:- విను = వినుము; కర్షణ = కర్షక {కర్షణవృత్తి - పొలము దున్ని జీవించెడి జీవిక, కర్షకవృత్తి}; ఆదిక = మొదలగు; వృత్తి = జీవికల; కంటెను = కంటె; మేలు = ఉత్తమము; యాచింపనొల్లని = ఒకరిని అడుగని; అట్టి = అటువంటి; వృత్తి = జీవిక; ప్రాప్తంబున్ = తనకు లభించినదానిని; కైకొని = తీసుకొని; బ్రతుకు = జీవించుట; కంటెను = కంటె; లెస్స = మంచిది; అనుదినంబును = ప్రతిదినము; ధాన్యము = ధాన్యమును; అడిగికొనుట = యాచించుట, ముష్టి; యాయవారము = ధాన్యపు ముష్టి; కంటెను = కంటె; అధిక = ఎక్కువ; కల్యాణంబు = శ్రేయము; పఱిగయెన్నుల = కోసేసినచేలోరాలినయెన్నుల; ధాన్య = ధాన్యముగింజలు; భక్షణంబు = తినుట; శిలవృత్తి = పరిగలేరుకొనెడి; శ్రేయము = మేలైనది; మాపణములన్ = అంగడులవద్ద; పడ్డ = పడిపోయిన; గింజలు = గింజలు; తిని = తిని; బ్రతుకుగనుట = జీవించుట.
ఎడరుచోట = ఆపద సంభవించినప్పుడు; నృపతి = రాజున; కిన్ = కు; ఈ = ఈ; నాల్గు = నాలుగు (4); వృత్తులు = జీవికలు; తగు = తగినవే; ప్రతిగ్రహము = యాచన, తీసుకొనుట; తగదు = తగినదికాదు; తలపన్ = తరచిచూసినచో; ఆపద = విపత్కర; అవసరములలో = సమయములో; అధముడు = తక్కువజాతివాడు; ఎక్కువజాతి = తనకంటెనెక్కువజాతివాని; వృత్తిన్ = జీవికలో; ఉన్నన్ = అవలంభించినను; దోష = తప్పు; విధము = పద్ధతి; కాదు = కాదు.
భావము:- ధర్మరాజా! విను. పొలం దున్ని జీవించే కర్షక వృత్తి మొదలైన వాని వల్ల కొంత జీవ హింస జరుగుతుంది. కాబట్టి వాని కంటె యాచించ కుండా లభించిన దానితో జీవించే వృత్తి “అయాచితం” మంచిది. దానికంటే ప్రతి దినమూ బియ్యము అర్థించి బ్రతుకుట “యాయవారం” మేలు. అలా యాచించి బ్రతికే కంటే పొలాలలో రాలిన పరిగలు ఏరుకుని జీవనం గడపటం మంచిది. అలా వరిమళ్ళ యందు రాలిన ఎన్నులు ప్రోగుచేసుకుని బ్రతికే “శిలావృత్తి” కంటె బజారులో కొట్ల వద్ద పడిన గింజలు ఏరుకుని బ్రతకటం మేలు. భంగపడిన రోజులలో క్షత్రియుడు ఈ నాలుగు వృత్తులను చేయవచ్చు; కాని అతనికి దానం గ్రహించటం మాత్రం నిషిద్ధం. ఆపత్కాలంలో నిమ్నజాతి వారు, అగ్రజాతుల వారి వృత్తులను స్వీకరించటం దోషం కాదు.

తెభా-7-411-వ.
వినుము; శిలవృత్తియు నుంఛవృత్తియు ఋత మనియు, నయాచిత వృత్తి యమృతమనియు, యాచ్నావృత్తి మృతమనియుఁ, గర్షకవృత్తి ప్రమృత మనియు నెన్నుదురు; అట్టి వృత్తు లెఱింగి జీవించుట మేలు; వాణిజ్యంబు సత్యానృతమనియు; శ్వవృత్తి నీచసేవ యనియుఁ బలుకుదురు; సర్వవేదమయుండు బ్రాహ్మణుండు; సర్వదేవ మయుండు క్షత్రియుండు; బ్రాహ్మణ క్షత్రియులకు నీచసేవనంబు కర్తవ్యంబు గాదు.
టీక:- వినుము = వినుము; శిల = రాలిన గింజ లేరుకొను; వృత్తియున్ = జీవిక; ఉంఛ = పరిగలేరుకొను; వృత్తియున్ = జీవికలు; ఋతము = ఋతము, సత్యము; అనియున్ = అని; అయాచిత = ఒకరినడుగకజీవించు; వృత్తి = జీవిక; అమృతము = అమృతము, చావులేనిది; అనియున్ = అని; యాచ్న = ముష్టెత్తుకొను; వృత్తి = జీవిక; మృతము = మృతము,చావుతోతుల్యము; అనియున్ = అని; కర్షక = పొలము దున్నుకొను; వృత్తి = జీవిక; ప్రమృతము = ప్రమృతము,నాతినింద్యము; అనియున్ = అని; ఎన్నుదురు = గణించుదురు; అట్టి = అటువంటి; వృత్తులు = జీవికలు; ఎఱింగి = తెలిసి; జీవించుట = బ్రతుకుట; మేలు = మంచిది; వాణిజ్యంబు = వర్తకము; సత్యానృతము = సత్యము యనృతము; అనియున్ = అని; శ్వవృత్తి = సేవ, కొలువు; నీచ = నీచమైన; సేవ = కొలచుట; అనియున్ = అని; పలుకుదురు = చెప్పుదురు; సర్వ = ఎల్ల; వేద = వేదముల; మయుండు = స్వరూపము; బ్రాహ్మణుడు = బ్రాహ్మణుడు; సర్వ = ఎల్ల; దేవ = దేవతల; మయుండు = స్వరూపము; క్షత్రియుడు = రాజు; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; క్షత్రియుల = రాజుల; కున్ = కు; నీచ = హీనుని; సేవనంబు = కొలచుట; కర్తవ్యంబు = చేయదగినది; కాదు = కాదు.
భావము:- శ్రద్ధగా వినవయ్యా ధర్మరాజా! శిలవృత్తిని ఉంఛవృత్తనీ, ఋతమని అంటారు. అయాచిత వృత్తిని అమృతమని అంటారు. నిత్యయాచనావృత్తిని మృతమని అంటారు. కర్షకవృత్తిని ప్రమృతం అంటారు. సమయానుకూలంగా ఆయా వృత్తులను స్వీకరించటం మంచిది. వాణిజ్యం సత్యాసత్యాల మిశ్రమ వృత్తి. నీచ సేవ శ్వవృత్తి అంటారు. సర్వవేద మయుండు బ్రాహ్మణుడు, సర్వ దేవ మయుండు క్షత్రియుడు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు నీచ సేవ తగదు.

తెభా-7-412-క.
మును శౌచముఁ దపమును
మును మార్దవముఁ గృపయు త్యజ్ఞాన
క్షలును హరిభక్తియు హ
ర్షము నిజలక్షణము లగ్రజాతికి నధిపా!

టీక:- దమము = బాహ్యేంద్రియనిగ్రహము; శౌచము = శుచిత్వము; తపమును = తపస్సు; శమమును = అంతరింద్రియనిగ్రహము; మార్దవమున్ = సౌమ్యత; కృపయున్ = దయ; సత్య = నిజము; జ్ఞాన = జ్ఞానము; క్షమలును = ఓర్పులు; హరిభక్తి = విష్ణుభక్తి; హర్షము = సంతోషము; నిజ = స్వాభావికమైన; లక్షణములు = లక్షణములు; అగ్రజాతి = ఉత్తమకులము,బ్రాహ్మణుల; కిన్ = కు; అధిపా = రాజా.
భావము:- బహిరింద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, శుచిత్వం, తపస్సు, సౌమ్యత, దయ, సత్యం, జ్ఞానం, క్షమ, విష్ణుభక్తి, హర్షము ఉత్తమ కులస్తులకు స్వాభావికమైన లక్షణములు.

తెభా-7-413-ఉ.
శౌర్యము దానశీలముఁ బ్రసాదము నాత్మజయంబుఁ దేజమున్
ధైర్యము దేవభక్తియును ర్మము నర్థముఁ గామమున్ బుధా
చార్యముకుందసేవలును త్కృతియుం బరితోషణంబు స
ద్వీర్యము రక్షణంబుఁ బృథివీవరశేఖర! రాజచిహ్నముల్.

టీక:- శౌర్యము = మగటిమి; దాన = దానముఇచ్చెడి; శీలమున్ = స్వభావము; ప్రసాదమున్ = ప్రసన్నత {ప్రసాదము - కోపాదులు లేక సౌమ్యతతో యుండుట, ప్రసన్నత}; ఆత్మజయంబున్ = మనోనిగ్రహము; తేజమున్ = ప్రకాశము; ధైర్యము = దిట్టదనము; దేవ = దేవతల యెడ; భక్తియును = భక్తి; ధర్మమున్ = మంచినడవడి, ధర్మనిష్ఠ; అర్థమున్ = ప్రయోజనము,అర్థసంపాదన; కామమున్ = ఇచ్ఛ; బుధా = జ్ఞానుల; ఆచార్య = గురువుల; ముకుంద = నారాయణుల {ముకుందుడు - మోక్షమునిచ్చువాడు, విష్ణువు}; సేవలును = సేవించుటలు; సత్కృతియున్ = మంచిపనులుచేయుట; పరితోషణంబున్ = సంతోషపరచుట; సద్వీర్యము = న్యాయమైనపరాక్రమము; రక్షణంబున్ = శిష్టపాలనము; పృథివీవరశేఖర = మహారాజా {పృథివీవరశేఖర - పృథివి (భూమి)కి వరుడు రాజు వారిలో శేఖరుడు (శ్రేష్ఠుడు), మహారాజు}; రాజ = రాచవానికి; చిహ్నములు = ఉండదగిన లక్షణములు.
భావము:- మహారాజా! ధర్మరాజ! క్షత్రియుల లక్షణాలు శౌర్యం; దానము; ప్రసన్నత; మనోనిగ్రహము; తేజస్సు; ధర్మనిష్ఠ; అర్థ సంపాదన; ఇచ్ఛా; బుధసేవ; ఆచార్యసేవ; విష్ణుసేవ; సత్కార్యాచరణ; సంతోషపరచుట; వీర్యం; సంరక్షణ.

తెభా-7-414-క.
ర్మార్థకామవాంఛయు
నిర్మల గురుదేవ విప్ర నివహార్చనముల్
నిర్మదభావముఁ బ్రమదము
ర్మకరత్వమును వైశ్యన లక్షణముల్.

టీక:- ధర్మ = ధర్మము, న్యాయము; అర్థ = అర్థము, సంపాదన; కామ = కామము, ఇచ్ఛ; వాంఛయున్ = కోరుట; నిర్మల = స్వచ్ఛమైన; గురు = గురువులను; దేవ = దేవతలను; విప్ర = బ్రాహ్మణులను; నివహ = సమూహమును; అర్చనములు = పూజించుటలు; నిర్మదభావము = గర్వములేకుండుట; ప్రమదము = సంతోషము; శర్మకరత్వమును = సంతోషపెట్టుట; వైశ్య = కోమటులైన; జన = వారి; లక్షణముల్ = లక్షణములు.
భావము:- వైశ్యుల లక్షణాలు ధర్మ, అర్థ, కామములు వాంఛించుట; గురువుల, దేవతల, బ్రాహ్మణుల సేవ; నిగర్వము; సంతోషం; తృప్తిపరచుట.

తెభా-7-415-ఉ.
స్తేము లేనివృత్తియు శుచిత్వము సన్నుతియున్ నిజేశులన్
మాలు లేక డాయుటయు మంత్రము జెప్పక పంచయజ్ఞముల్
చేయుటయున్ ధరామరుల సేవయు గోవులరక్షణంబు న
న్యాము లేమియున్ మనుజనాథ! యెఱుంగుము శూద్రధర్మముల్.

టీక:- స్తేయము = దొంగతనము; లేని = లేని; వృత్తియున్ = జీవిక; శుచిత్వమున్ = పరిశుద్ధత; సన్నుతియున్ = స్తుతించుట; నిజ = తన; ఈశులన్ = యజమానులను; మాయలు = మోసములు, టక్కులు; లేక = లేకుండగ; డాయుటయున్ = చేరుట; మంత్రము = మంత్రము; చెప్పక = చెప్పకుండగ; పంచయజ్ఞముల్ = పంచయజ్ఞములు {పంచయజ్ఞములు - 1బ్రహ్మ 2పితృ 3దేవ 4భూత 5మనుష్యయజ్ఞములు}; చేయుటయున్ = చేయుట; ధరామరులన్ = బ్రాహ్మణులను {ధరామరులు - ధర (భూమి)కి అమరులు (దేవతలు), బ్రాహ్మణులు}; సేవయున్ = కొలచుట; గోవులన్ = పశువులను; రక్షణంబున్ = కాచుట; అన్యాయమ = అధర్మము; లేమియున్ = లేకపోవుట; మనుజనాథ = రాజా; యెఱుంగుము = (అని)తెలియుము; శూద్ర = శూద్రుని యొక్క; ధర్మముల్ = లక్షణములు.
భావము:- నాలుగవ వర్ణము వారి లక్షణాలు చౌర్యము లేకుండా ఉండుట; పరి శుభ్రత కలిగి ఉండట; ప్రార్థన చేయుట; నిష్కపట సేవ; బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం నిర్వర్తించుట; పండితాదరణ; గోరక్షణ; న్యాయజీవనం.

తెభా-7-416-సీ.
నిలయము పాటించి నిర్మలదేహ యై-
శృంగార మేప్రొద్దుఁ జేయవలయు
త్యప్రియాలాపతురయై ప్రాణేశు-
చిత్తంబు ప్రేమ రంజింపవలయు
దాక్షిణ్య సంతోష ర్మ మేధాదుల-
దైవత మని ప్రియుఁ లఁపవలయు
నాథుఁ డే పద్ధతి డచు నా పద్ధతి-
డచి తద్బంధుల డపవలయు

తెభా-7-416.1-ఆ.
మార్దవమునఁ బతికి జ్జన భోజన
యన పాన రతులు రపవలయు
విభుఁడు పతితుఁడైన వెలఁది పాతివ్రత్య
హిమఁ బుణ్యుఁ జేసి నుపవలయు.

టీక:- నిలయమున్ = ఇంటినందుండుట; పాటించి = ధరించి; నిర్మల = శుచిత్వముగల; దేహ = దేహముగలామె; ఐ = అయ్యి; శృంగారము = అలంకారము; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; చేయవలయు = చేసికొనవలెను; సత్యము = బొంకులేని; ప్రియ = ప్రియకరమైన; ఆలాప = మాటలాడుటయందు; చతుర = నేరుపుగలది; ఐ = అయ్యి; ప్రాణేశు = భర్త యొక్క; చిత్తంబు = మనసు; ప్రేమన్ = ప్రేమతో; రంజింపవలయు = సంతసిల్లజేయవలెను; దాక్షిణ్య = మర్యాద, ఓపిక; సంతోష = తృప్తి; ధర్మ = న్యాయము; మేధ = తెలివి; ఆదులన్ = మున్నగువానిచే; దైవతము = దేవుడు; అని = అని; ప్రియున్ = భర్తను; తలపవలయున్ = భావింపవలెను; నాథుడు = భర్త; ఏ = ఎట్టి; పద్ధతిన్ = విధముగా; నడచున్ = మెలగునో; ఆ = అట్టి; పద్ధతిని = విధముగా; నడచి = చరించి; తత్ = అతని; బంధులన్ = బంధువులతో; నడపవలయున్ = వర్తింపవలెను.
మార్దవమునన్ = సౌమ్యతతో; పతికి = భర్తకు; మజ్జన = స్నానము; బోజన = భోజనము; శయన = పడక; పాన = పానీయసేవన; రతులు = సంభోగములను; జరపవలయున్ = ఆచరించవలెను; విభుడు = భర్త; పతితుడు = భ్రష్టుడు; ఐన = అయిన; వెలది = స్త్రీ {వెలది - వెలది (నిర్మలము)గలామె, స్త్రీ}; పాతివ్రత్య = పతివ్రతాధర్మమముయొక్క {పతివ్రత -పతియేదైవముగాగల యామె}; మహిమన్ = ప్రభావముతో; పుణ్యున్ = శుద్ధునిగా; చేసి = చేసి; మనుపవలయు = రక్షింపవలెను.
భావము:- స్త్రీ ధర్మాలు తమను తమ గృహాలను చక్కగా తీర్చి దిద్దుకొనుట, శరీరమును సుందరంగా నిర్మలంగా ఉంచుకొనుట, సత్యం ప్రియకరంగా పలుకుట, చాతుర్యంతో కూడిన వచన మాధుర్యం కలిగి ఉండి పతి మనస్సు రంజింప జేయుట, దాక్షిణ్యం, సంతోషం, ధర్మచింతన, మేధా చింతన కలిగి భర్తను దైవతమునిగా భావించుట, భర్త విధానానికి అనుగుణంగా మెలగుట, బంధువులతో సౌమ్యంగా మేలగుట, భర్తకు స్నాన పాన పడక భోజన సమకూర్చి సౌఖ్యం కలిగించుట. ఒకవేళ పతి పతితుడు అయితే తన పాతివ్రత్య బలంతో అతనిని ఉద్ధరించి, ఉత్తమునిగా తీర్చిదిద్దుకోవాలి.

తెభా-7-417-క.
రుణి దన ప్రాణవల్లభు
రిభావముగా భజించి తఁడున్ తానున్
సిరికైవడి వర్తించును
రిలోకము నందు సంతతానందమునన్.

టీక:- తరుణి = స్త్రీ {తరుణి - కన్యావస్థదాటినామె, స్త్రీ}; తన = తనయొక్క; ప్రాణవల్లభున్ = భర్తను {ప్రాణవల్లభుడు - ప్రాణముతో సమానమైన వల్లభుడు(ప్రియుడు ఇష్టముగలవాడు), భర్త}; హరి = విష్ణునిగా; భావముగా = తలపుతో; భజించి = కొలచి; అతడును = అతడు; తానున్ = తను; సిరి = లక్ష్మీదేవి; కైవడి = వలె; వర్తించును = తిరుగును; హరిలోకమున్ = వైకుంఠము; అందున్ = లో; సంతత = శాశ్వతమైన; ఆనందమునన్ = ఆనందముతో.
భావము:- స్త్రీకి తన భర్తను శ్రీ మహా విష్ణువుగా భావించుట, తాను వైకుంఠంలో నిత్యానందంతో వసించే లక్ష్మీదేవి వలె ప్రవర్తించుట ధర్మం.

తెభా-7-418-క.
వాసంబులు వ్రతములు
ములు వేయేల భర్త దైవత మని ని
ష్కటతఁ గొల్చిన సాధ్వికి
నృవర! దుర్లభము లేదు నిఖిలజగములన్.

టీక:- ఉపవాసంబులున్ = నిరాహారదీక్షలు; వ్రతములున్ = నోములు; తపములున్ = తపస్సులు; వేయు = పెక్కు; ఏల = ఎందుకు; భర్త = భర్త; దైవతము = దేవుడు; అని = అని; నిష్కపటతన్ = కపటములేనివిధముగ; కొలిచిన = సేవించినచో; సాధ్వి = పతివ్రత; కిన్ = కి; నృపవర = మహారాజా {నృపవర - నృప (రాజు)లలో వర (శ్రేష్ఠుడు), మహారాజు}; దుర్లభము = పొందరానిది; లేదు = లేదు; నిఖిల = సమస్చమైన; జగములన్ = లోకములందు.
భావము:- నరోత్తమా! ధర్మరాజా! ఉపవాస తపస్సుల కంటే, భర్తను నిష్కపటంగా నిర్మలంగా నారాయణునిగా భావించి సేవించటయే నారీమణులకు ధర్మం. అటువంటి పతివ్రతకు జగత్తులో దుర్లభం అన్నదే లేదు.

తెభా-7-419-వ.
మఱియు సంకరజాతు లయిన రజక చర్మకారక నట బురడ కైవర్తక మ్లేచ్ఛ భిల్లు లను నంత్యజాతు లేడ్వురకును జండాల పుల్కస మాతంగ జాతులకును నాయా కులాగతంబు లైన వృత్తులఁ జౌర్యహింసాదులు వర్జించి సంచరింపవలయు; మానవులకుఁ బ్రతియుగంబున నైసర్గికంబులైన ధర్మంబులు రెండు లోకంబు లందును సుఖకరంబు లని వేదవిదులైన పెద్దలు చెప్పుదురు; కారుకారున దున్నెడు క్షేత్రంబు లావు చెడు; నందు జల్లిన బీజంబులు నిస్తేజంబు లై యుండి లెస్సగ నంకురింపవు; నిరంతర ఘృతధారావర్షంబున దహనునకు దాహకత్వంబు లేక శాంతిం జెందు; నందు వేల్చిన హవ్యంబులు ఫలింపవు; తద్విధంబున ననవరత కామానుసంధానంబునఁ గామోన్ముఖంబైన చిత్తంబు కామంబులం దనిసి నిష్కా మంబై విరక్తి నొందుం; గావున సత్త్వస్వభావంబుతోడ నెప్పుడుఁ దప్పక నిజవంశానుగత విహితధర్మంబున వర్తించు నరుండు మెల్లన స్వాభావిక కర్మపరత్వంబు విడిచి ముక్తి నొందు; జాతి మాత్రంబునఁ బురుషునికి వర్ణంబు నిర్దేశింపం బనిలేదు; శమదమాది వర్ణలక్షణ వ్యవహారంబులఁ గనవలయు"నని మఱియు నారదుం డిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; సంకరజాతులు = సంకరజాతులు {సంకరజాతులు - అసమాన స్త్రీపురుషలవలన కలిగిన జాతులు}; అయిన = ఐన; రజక = చాకలి, బట్టలుతుకువారు; చర్మకారక = మాదిగ,చెప్పులుకుట్టువారు; నట = నట్టువ, వేశ్యలకాటనేర్పు వారు; బురడ = మేదర, బుట్టలల్లువారు; కైవర్తక = చేపలుపట్టువారు, జాలరి; మ్లేచ్ఛ = యవన; భిల్లులు = కొండజాతివారు; అను = అనెడి; అంత్యజాతులు = నీచజాతులు; ఏడ్వుర = ఏడుగుర; కునున్ = కు; చండాల = మాల; పుల్కస = బోయలలోనొకతెగ; మాతంగ = మాలలోనొకతెగ; జాతుల్ = జాతుల; కునున్ = కు; ఆయా = వారివారి; కుల = కులములకు; ఆగతంబులు = వంశానుగతముగవచ్ఛినవి; ఐన = అయిన; వృత్తులన్ = జీవికలను; చౌర్య = దొంగతనము; హింస = చంపుట; ఆదులు = మున్నగునవి; వర్జించి = వదలివేసి; సంచరింపవలయున్ = వర్తింపవలెను; మానవుల్ = నరుల; కున్ = కు; ప్రతి = ప్రతియొక్క; యుగంబునన్ = యుగమునందు; నైసర్గికంబులు = స్వభావమునగలిగెడివి; ఐన = అయిన; ధర్మంబులు = ధర్మములు; రెండు = పర అపర రెండు; లోకంబుల్ = లోకముల; అందును = లోను; సుఖ = మేలు; కరంబులు = చేకూర్చునవి; అని = అని; వేదవిదులు = వేదములనెరిగినవారు; పెద్ధలు = జ్ఞానులు; చెప్పుదురు = చెప్పుతుంటారు; కారుకారునన్ = ప్రతివర్షాకాలమునందు; దున్నెడు = దున్నుచున్న; క్షేత్రంబు = పొలము; లావు = బలము; చెడున్ = చెడిపోవును; అందున్ = దానిలో; చల్లిన = చల్లినట్టి; బీజంబులు = విత్తనములు; నిస్తేజంబులు = తేజస్సులేనివి; ఐ = అయ్యి; ఉండి = ఉండిపోయి; లెస్సగన్ = సరిగా; అంకురింపవు = మొలవవు; నిరంతర = ఎడతెగని; ఘృత = నేతి; ధారా = ధారల; వర్షంబునన్ = కుమ్మరించుటవలన; దహనున్ = అగ్ని; కున్ = కి; దాహకత్వంబు = కాల్చెడిశక్తి; లేక = ఉండక; శాంతిన్ = చల్లారిపోవుట; చెందున్ = పొందును; అందు = దానిలో; వ్రేల్చిన = హోమముచేసిన; హవ్యంబులున్ = వస్తువులు; ఫలింపవు = ఫలించవు; తత్ = ఆ; విధంబునన్ = లాగుననే; అనవరత = నిరంతర; కామ = కామములను, ఇచ్ఛలను; అనుసంధానంబునన్ = అనుభవించుటవలన; కామ = కామములందు; ఉన్ముఖంబు = కోరునది; ఐన = అయిన; చిత్తంబు = మనసు; కామంబులన్ = కామములయెడ; తనిసి = తృప్తిచెంది; నిష్కామంబు = కోరికలేనిది; ఐ = అయ్యి; విరక్తిన్ = రాగములేకపోవుటను; ఒందున్ = పొందును; కావునన్ = కనుక; సత్త్వ = సాత్విక; స్వభావంబు = లక్షణముల; తోడన్ = తోటి; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; తప్పక = తొలగక; నిజ = తన; వంశ = కులమునకు; అనుగత = అనుక్రమముగా; విహిత = విధింపబడిన; ధర్మంబున = ధర్మములందు; వర్తించు = నడచెడి; నరుండు = మానవుడు; మెల్లన = నెమ్మదిగా; స్వాభావిక = పుట్టుకతోవచ్చిన; కర్మ = కర్మలందు; పరత్వంబు = లగ్నమగుట; విడిచి = వదలివేసి; ముక్తిన్ = మోక్షమును {ముక్తి -సంసారబంధములనుండివిడుదల}; ఒందున్ = పొందును; జాతి = పుట్టుక; మాత్రంబునన్ = చేతనే; పురుషుని = మానవున; కిన్ = కు; వర్ణంబు = చాతుర్వర్ణములలోనిది {చాతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్రవర్ణములు నాలుగు}; నిర్దేశింపన్ = నిర్ణయించవలసిన; పని = అవుసరము; లేదు = లేదు; శమ = అంతరింద్రియనిగ్రహము; దమ = బహిరింద్రియనిగ్రహము; ఆది = మొదలగు; వర్ణ = వర్ణముల; లక్షణ = లక్షణములను; వ్యవహారంబులన్ = నడవడికలను; కనవలయును = చూడవలెను; అని = అని; మఱియున్ = ఇంకను; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- రజకులు నటకులు, కిరాతులు, మేదరులు. జాలరులు, చర్మకారులు, కుమ్మరులు అనే ఈ ఏడుజాతులవారూ; చండాల, పులస్క, మాతంగ, జాతులవారూ; వారి వారి కులాచారా వృత్తులను ఆచరిస్తూ జీవించాలి. అయితే చౌర్య, హింసాదులను మాత్రం ఎవరికీ తగవు. మానవులకు ప్రతియుగములోనూ సహజమైన యుగధర్మాలు ఇహలోక పరలోక సుఖాలను కలిగిస్తాయి. అని వైదిక ఋషులు చెప్పారు.
తడవ తడవకూ దున్నుతుంటే, పొలం సారం కోల్పోతుంది. అందులో చల్లిన విత్తనాలు మొలచి ఏపుగా పెరగవు. హోమకుండంలో ఎడతెగకుండా నెయ్యి పోస్తుంటే, అగ్నికి దాహకత్వం తగ్గిపోతుంది. అందులో వేసిన హోమ ద్రవ్యాలు నిరుపయోగం అవుతాయి. అలాగే నిరంతర కామకలాపాలతో మన్నథ మగ్నమైన చిత్తం తరువాత నిష్కామమై క్రమంగా విరక్తి పొందుతుంది.
కాబట్టి, మానవుడు సాత్త్విక భావంతో నియమానుసారంగా, నిజ వంశాచారాలను నిర్వర్తిస్తూ ఉండాలి. అటువంటి పురుషుడు క్రమంగా సహజంగానే కర్మబంధాలనుండి విముక్తుడు అవుతాడు. జాతి మాత్రం వలన పురుషునికి వర్ణం నిర్ణయం చేయరాదు. శమ దమాది ధర్మాలు పాటించటం ద్వారా వాని జాతి నిర్ణయించాలి” అని నారదుడు ధర్మరాజుతో చెప్పి, ఇంకా ఇలా అన్నాడు.

తెభా-7-420-క.
క్రమున వర్ణంబుల చి
హ్నము లెల్లను జెప్పఁబడియె నాశ్రమముల ధ
ర్మము లెఱిఁగించెద నన్నియు
దాహిత హృదయశూల! దమలశీలా!

టీక:- క్రమమునన్ = వరుసగా; వర్ణంబులన్ = బ్రాహ్మణాది జాతుల; చిహ్నములు = లక్షణములు; ఎల్లను = సర్వమును; చెప్పబడియెన్ = చెప్పబడినవి; ఆశ్రమముల = ఆశ్రమములయొక్క; ధర్మముల్ = ధర్మములను; ఎఱిగించెదన్ = తెలిపెదను; అన్నియున్ = సమస్తమును; సమద = పొగరుపట్టిన; అహిత = శత్రువుల; హృదయ = హృదయములకు; శూల = శూలమైనవాడా; సత్ = మంచి; అమల = స్వచ్ఛమైన; శీలా = స్వభావముగలవాడా.
భావము:- “అరివీరభయంకరా! ధర్మరాజా! నీవు నిర్మలమైన నడవడిక కలవాడవు. వరసగా అన్ని వర్ణాల వారి లక్షణాలనూ తెలియ జెప్పాను. ఇక అశ్రమాలు అన్నిటి ధర్మాలూ చెప్తాను.

తెభా-7-421-వ.
వినుము; బ్రహ్మచారి మౌంజీ కౌపీన యజ్ఞోపవీత కృష్ణాజిన పాలాశ దండ కమండలు ధరుండును, సంస్కారహీన శిరోరుహుండును, దర్భహస్తుండును, శీలప్రశస్తుండును, మౌనియు నై త్రిసంధ్యంబును బ్రహ్మగాయత్రి జపియించుచు సాయంప్రాతరవసరంబులు నర్క పావక గురు దేవతోపాసనంబులు చేయుచు గురుమందిరంబునకుం జని దాసుని చందంబున భక్తి వినయ సౌమనస్యంబులు గలిగి వేదంబు చదువుచు నధ్యయ నోపక్రమావసానంబుల గురుచరణంబులకు నమస్కరించుచు రేపుమాపును విహిత గృహంబుల భిక్షించి భైక్ష్యంబు గురువునకు నివేదించి యనుజ్ఞ గొని మితభోజనంబు కావించుచు నర్హకాలంబుల నుపవసించుచు నంగనలందు నంగనాసక్తులందుం బ్రయోజనమాత్ర భాషణంబు లొనర్చుచు గురు పరాంగనలవలన నభ్యంగ కేశప్రసాధన శరీరమర్దన మజ్జన రహస్య యోగంబులు వర్జించుచు గృహంబున నుండక జితేంద్రియత్వంబున సత్యభాషణుం డయి సంచరింపవలయు.
టీక:- వినుము = వినుము; బ్రహ్మచారి = బ్రహ్మచర్యాశ్రమస్థుడు; మౌంజి = ముంజి {మౌంజి - మూడు పేటల ముంజి, దర్భల (గడ్డి) మొలతాడు, ముంజి}; కౌపీనము = గోచి; యజ్ఞోపవీత = జందెము; కృష్ణ = జింక; అజిన = తోలు,చర్మము; పాలాశ = మోదుగ; దండ = దండము {దండము - జపతపాదులందు చేతిని ఆనించుకొనెడి పైన చిన్న అడ్డకఱ్ఱ యుండెడి కఱ్ఱ}; కమండలున్ = కమండలములు; ధరుండును = ధరించెడివాడును; సంస్కార = చక్కచేయబడుట; లేని = లేనట్టి; శిరోరుహుండును = శిరోజములుగలవాడు {శిరోరుహములు - శిరస్సున ఉరుహములు పుట్టునవి, శిరోజములు, తలవెంట్రుకలు}; దర్భ = దర్భలు; హస్తుండును = చేతిలోగలవాడు; శీల = మంచినడవడికచేత; ప్రశస్తుండును = ప్రసిద్ధుడు; మౌనియును = మౌనముగానుండువాడును; ఐ = అయ్యి; త్రిసంధ్యలు = మూడు (3) సంధ్యలందు {త్రిసంధ్యలు - త్రి (మూడు, ఉదయ మద్యాహ్న సాయంకాల) సంధ్యలు}; బ్రహ్మగాయత్రి = బ్రహ్మరూపమైన గాయత్రిని; జపియించుచున్ = జపించుచు; సాయం = సాయంత్రము; ప్రాతః = ఉదయపు; అవసరంబులు = సమయములలో; అర్క = సూర్యుని; పావక = అగ్నిని; గురు = గురువులను; దేవతల = దైవముల; ఉపాసనంబులు = ఉపాసించుటలు, కొలచుట; చేయుచు = ఆచరించుచు; గురు = ఉపాధ్యాయుని; మందిరంబునన్ = ఇంటి; కున్ = కు; చని = వెళ్ళి; దాసుని = సేవకుని; చందంబునన్ = విధముగ; భక్తి = భక్తి; వినయ = అణకువ; సౌమనస్యంబులు = చిత్తనైర్మల్యములు; కలిగి = ఉండి; వేదంబున్ = వేదములను; చదువుచున్ = పఠించుచు; అధ్యయన = అధ్యయనముచేయుటకు; ఉపక్రమ = మొదలిడునప్పుడు; అవసానంబులన్ = చాలించునప్పుడు; గురు = గురువుయొక్క; చరణంబుల్ = కాళ్ళ; కున్ = కు; నమస్కరించుచన్ = నమస్కారముచేయుచు; రేపుమాపునున్ = ప్రతిదినము; విహిత = విధాయకమైన; గృహంబులన్ = ఇండ్లలో; భిక్షించి = యాయవారమెత్తి; బైక్ష్యంబు = భిక్షగా వచ్చి నాహారాదులను; గురువున్ = గురువున; కున్ = కు; నివేదించి = చూపి; అనుజ్ఞన్ = అనుమతి; కొని = తీసుకొని; మితి = పరిమితముగ; భోజనంబు = ఆహారము తినుట; కావించుచున్ = చేయుచు; అర్హ = తగిన; కాలంబులన్ = దినములలో; ఉపవసించుచున్ = ఉపవాసముండుచు; అంగనల్ = స్త్రీల; అందున్ = తోలు,చర్మము; అంగనాసక్తులన్ = కామినుల యెడ; ప్రయోజన = అవసరార్థము; మాత్ర = అయినంతవరకే; భాషణంబుల్ = సంభాషణలు; ఒనర్చుచున్ = చేయుచు; గురు = గురువు యొక్క; పర = ఇతరుల; అంగనల = స్త్రీల; వలన = చేత; అభ్యంగన = తలస్నానము; కేశ = తల; ప్రసాధన = అలంకరించుకొనుట; శరీర = ఒడలు; మర్దన = నలుగుపెట్టించుకొనుట; మజ్జన = స్నానముచేయించుకొనుట; రహస్య = ఒంటరిగా; యోగంబులున్ = కలియుటలు; వర్జించుచున్ = విడిచిపెట్టి; గృహంబునన్ = ఇంటిలో; ఉండక = ఉండకుండగ; జితేంద్రియత్వంబునన్ = ఇంద్రియజయముతో; సత్య = సత్యముమాత్రమే; భాషణుండు = మాట్లాడువాడు; అయి = అయ్యి; సంచరింపవలయు = నడుచుకొనవలెను.
భావము:- శ్రద్ధగా విను ధర్మరాజా! ముందుగా బ్రహ్మచర్య లక్షణాలు చెప్తాను. బ్రహ్మచారి మౌంజీ, కౌపీనం, యజ్ఞోపవీతం, కృష్ణాజినం, పలాశదండం, కమండలం, దర్భలు ధరించాలి; కేశసంస్కారం చేసుకొనరాదు; శీలవంతుడై ప్రవర్తించాలి; మౌనంగా మూడుపూటలూ బ్రహ్మగాయత్రిని జపించాలి; ప్రాతఃకాల, సాయంకాలలో సూర్యోపసనం, ఆగ్ని ఆరాధన, గురువందనం, దేవతార్చన చేస్తుండాలి; గురువు గారి గృహంలో దాసుని వలె భక్తిగా, వినయంగా, సౌమ్యంగా ఉంటూ వేదాలు వల్లెవేయాలి; అధ్యయానికి ఆరంభంలోనూ, చివరా ఆచార్యదేవులకు పాదాభివందనం చేయాలి; ఉదయం సాయంకాలం మంచి గృహస్థుల నుంచి భిక్షాన్నం గ్రహించి గురువులకు నివేదించి; వారి అనుజ్ఞతో మితంగా భుజించాలి; నియమిత దినాలలో ఉపవాసాలు ఉండాలి; స్త్రీలతోనూ, స్త్రీలోలురతోనూ అనవసరంగా సంభాషించ రాదు; బ్రహ్మచారి గురుపత్నులతో, పరాంగనలతో తల అంటించుకోవటం, తల దువ్వించుకోవటం, శరీరం పట్టించుకోవటం, స్నాన సపర్యలు చేయించుకోవటం, ఏకాంతంగా ఉండటం పనికిరాదు; ఎల్లప్పుడూ ఇంటిలోనే ఉండక జితేంద్రియుడై సత్యభాషణుడై మెలగాలి.

తెభా-7-422-ఆ.
పొలఁతి దావవహ్ని పురుషుఁ డాజ్యఘటంబు
రఁగ కుండ రాదు దిసెనేని
బ్రహ్మ యైనఁ కూఁతుఁ ట్టకమానఁడు
డుగు కింతి పొత్తు లదు వలదు.

టీక:- పొలతి = స్త్రీ; దావవహ్ని = కార్చిచ్చు; పురుషుడు = మగవాడు; ఆజ్య = నేతి; ఘటము = కుండ; కరగక = కరిగిపోకుండగ; ఉండ = ఉండుట; రాదు = శక్యముకాదు; కదిసెనేని = దగ్గరకుచేరెనచో; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఐనన్ = అయినను; కూతున్ = పుత్రికను; పట్టక = పట్టుకొనక; మానడు = వదలడు; వడుగు = బ్రహ్మచారి; కిన్ = కి; ఇంతి = స్త్రీలతో; పొత్తు = సాంగత్యము; వలదు = వద్దే; వలదు = వద్దు.
భావము:- స్త్రీ సాంగత్యం ఏమాత్రం తగదు; స్త్రీ దావాగ్ని వంటిది;. పురుషుడు నేతి పాత్ర వంటివాడు; సెగ తగలగానే పాత్రలోని నెయ్యిలా కరిగిపోతాడు; బ్రహ్మదేవుడు అంతటి వాడు తన కూతురిపై వ్యామోహంతో పట్టుకున్నాడు కదా! కాబట్టి, బ్రహ్మచారికి ఆడవారి సాన్నిహిత్యం పనికి రాదు.

తెభా-7-423-వ.
వినుము; స్వరూపసాక్షాత్కారంబున దేహి బహిరింద్రియాదికం బయిన యింతయు నాభాసమాత్రంబుగా నిశ్చయించి యెందాఁక జీవుండు స్వతంత్రుఁ డయిన యీశ్వరుండు గాకుండు నంతదడవు నంగన యిది పురుషుండ నే ననియెడి భేదబుద్ధి మానుట కర్తవ్యంబు గాదు; బ్రహ్మచారి యతి గృహస్థులం దెవ్వఁ డైనఁ జిత్తంబు పరిపక్వంబు గాక యద్వైతానుసంధానంబుజేసిన మూఢుండగుంగావున రహస్యంబునఁ బుత్రిక నైనం డాయకుండవలయు.
టీక:- వినుము = వినుము; స్వరూప = ఆత్మ; సాక్షాత్కారంబునన్ = ఎరుకవలన; దేహి = జీవుడు; బహిరింద్రియ = బాహ్యేంద్రియములు; ఆదికంబు = మున్నగునవి; అయిన = ఐన; ఇంతయున్ = ఇదంతా; ఆభాస = భ్రాంతి; మాత్రంబు = మాత్రమే; కాన్ = అయినట్లు; నిశ్చయించి = నిశ్చయముగాతెలిసికొని; ఎందాక = ఎంతవరకు; జీవుండు = జీవుడు; స్వతంత్రుడు = దేనికిలొంగనివాడు; అయిన = ఐన; ఈశ్వరుండు = ఈశ్వరుడు; కాకుండున్ = కాడో; అంతతడవు = అందాక; అంగన = స్త్రీ; ఇది = ఈమె; పురుషుండన్ = పురుషుడను; నేన్ = నేను; అనియెడి = అనెడి; భేదబుద్ధి = భేదముచూసెడిబుద్ధి; మానుట = వీడుట; కర్తవ్యంబు = చేయదగినది; కాదు = కాదు; బ్రహ్మచారి = బ్రహ్మచార్యాశ్రమస్థుడు; యతి = సన్యాసాశ్రమస్థుడు; గృహస్థుల = గృహస్థాశ్రమస్థుల; అందున్ = లో; ఎవ్వండైనన్ = ఏవరైనాసరే; చిత్తంబు = మనసు; పరిపక్వంబు = పరిణతచెందినది; కాక = కాకుండగ; అద్వైత = స్త్రీపురుషాది యభేదమును; అనుసంధానంబు = భావనము; చేసినన్ = చేసినచో; మూఢుండు = మందబుద్ధిగలవాడు; అగున్ = అగును; కావునన్ = కనుక; రహస్యంబునన్ = ఒంటరిగా; పుత్రికన్ = కూతురుని; ఐనన్ = అయినను; డాయక = సమీపించక; ఉండవలయు = ఉండవలెను.
భావము:- ధర్మరాజా! ఆలకించు! ఆత్మసాక్షాత్కారం పొంది, ఇంద్రియాలకు కనిపించే బాహ్య ప్రపంచం అంతా స్వప్నమాత్రమే నని ఎరిగి, తనకూ పరబ్రహ్మకూ భేదం లేదని ఎప్పటివరకూ గ్రహించడో, అప్పటివరకూ స్త్రీ, పురుష భేదభావం వదలుట భావ్యం కాదు. కాబట్టి, బ్రహ్మచారి, యతి, గృహస్థుడు ఎవరైనా సరే మనస్సు పరిపక్వం చెందకుండా అద్వైతాను సంధానం చేసుకోవటం మూర్ఖత్వం అవుతుంది. కనుక, కన్న కుమార్తెతో కూడా రహస్యంగా ఏకాంతంగా మెలగరాదు.

తెభా-7-424-చ.
శిమున మేన సంస్కృతులు చేయక చందనభూషణాద్యలం
ణము లెల్ల మాని ఋతుకాలములన్ నిజభార్యఁ బొందుచుం
రుణుల జూడఁ బాఱక ధృవ్రతుఁడై మధు మాంస వర్జి యై
గురుతరవృత్తితో మెలఁగు కోవిదుఁ డొక్క గృహస్థు భూవరా!

టీక:- శిరమున = తలయందు; మేనన్ = శరీరమునందు; సంస్కృతులున్ = అభ్యంగనాదిసంస్కారములు; చేయక = చేయకుండగ; చందన = గంధధారణ; భూషణ = సొమ్ములు; ఆది = మొదలగు; అలంకరణములు = అలంకారములు; ఎల్లన్ = అన్నిటిని; మాని = విడిచిపెట్టి; ఋతు = ఋతముగల, అనువగు; కాలమునన్ = సమయమునందే; నిజ = తన; భార్యన్ = భార్యను; పొందుచున్ = కలియుచు; తరుణులన్ = ఇతరయౌవనవతులను; చూడబాఱక = మోహపడక; ధృత = గట్టి; వ్రతుడు = నిష్ఠగలవాడు; ఐ = అయ్యి; మధు = మద్యము మొదలగునవి; మాంస = మాంసాహారములను; వర్జి = విడిచిపెట్టినవాడు; ఐ = అయ్యి; గురుతరవృత్తి = పెద్దరికము; తోన్ = తోటి; మెలగు = ప్రవర్తించెడి; కోవిదుడు = పండితుడు; ఒక్క = గొప్ప; గృహస్థు = కాపురస్థుడు; భూవర = రాజా.
భావము:- రాజా! ధర్మరాజా! శిరోజసంస్కారాలు, అభ్యంగనాదిసంస్కారాలు మానుట; చందనం, భూషణాలు మున్నగు అలంకారాలు విడిచిపెట్టుట; తన భార్యను ఋజువైన సమయంలో మాత్రమే పొందుట; ఇతర స్త్రీలను చూసి మోహం చెందకుండా ఉండుట; చక్కని మన స్థైర్యం కలిగి ఉండుట; మధు మాంస విసర్జన; మిక్కిలి ఉత్తమమైన నడవడికతో మెలగుట కలిగి తన ధర్మం నిర్వర్తించు కోవిదుడే ఉత్తమ గృహస్థుడు.

తెభా-7-425-వ.
మఱియు ద్విజుండు గృహస్థుండై గురువువలన నుపనిషదంగ సహితంబైన వేదత్రయంబును బఠియించి నిజాధికారానుసారంబుగ నర్థవిచారంబు జేసి తన బలంబుకొలంది గురువులకు నభీష్టంబు లొసంగి గృహంబున నొండె వనంబున నొండె నైష్ఠికత్వంబు నాశ్రయించి యొండె బ్రాణులతోడ జీవించుచు గురువు నందు నగ్ని యందు నాత్మ యందు సర్వభూతంబు లందు నచ్యుతదర్శనంబు జేయుచు నింద్రియవ్యసనాది మగ్నుండుగాక యెఱుక గలిగి వర్తించుచు పరబ్రహ్మంబు నొందు.
టీక:- మఱియున్ = ఇంకను; ద్విజుండు = బ్రాహ్మణుడు {ద్విజుడు - ద్వి (రెండు) జుడు (జన్మలుగలవాడు), విప్రుడు}; గృహస్థుండు = గృహస్థుడు; ఐ = అయ్యి; గురువు = గురువు; వలనన్ = ద్వారా; ఉపనిషత్ = ఉపనిషత్తులు; అంగ = షడంగముల {షడంగములు - 1శిక్ష 2వ్యాకరణ 3ఛందము 4నిరుక్తము 5జ్యోతిషము 6కల్పము}; సహితంబు = కూడినది; ఐన = అయిన; వేదత్రయంబునున్ = వేదములుమూటిని (3) {వేదత్రయము - 1ఋగ్వేదము 2యజుర్వేదము 3సామవేదము}; పఠియించి = చదివి; నిజ = తన; అధికార = అర్హతకు, యోగ్యతకు; అనుసారంబుగన్ = తగినట్లు; అర్థ = భావమును; విచారంబు = చర్చించుకొనుట; చేసి = చేసి; తన = తన; బలంబు = సామర్థ్యము; కొలంది = ప్రకారము; గురువుల్ = గురువుల; కున్ = కు; అభీష్టంబులు = కోరినవి; ఒసంగి = ఇచ్చి; గృహంబునన్ = ఇంటియందు; ఒండెన్ = కాని; వనంబునన్ = అడవియందు; ఒండెన్ = కాని; నైష్ఠికత్వంబున్ = నియమములనుచి ధరించి; ఆశ్రయించి = పూని; ఒండెన్ = కాని; ప్రాణుల = జీవుల; తోడన్ = తోటి; జీవించుచున్ = బతుకుచుచు; గురువున్ = గురువు; అందున్ = ఎడల; అగ్ని = అగ్ని; అందున్ = ఎడల; ఆత్మ = తన; అందున్ = ఎడల; సర్వ = సమస్తమైన; భూతంబుల్ = జీవుల; అందున్ = ఎడల; అచ్యుత = విష్ణుమూర్తిని; దర్శనంబు = చూచుట; చేయుచున్ = చేయుచు; ఇంద్రియవ్యసన = విషయాసక్తి; ఆదిన్ = మొదలగువాని యందు; మగ్నుండు = మునిగినవాడు; కాక = కాకుండగ; ఎఱుక = వివేకము; కలిగి = తోనుండి; వర్తించుచున్ = మెలగుచు; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మస్వరూపమును; ఒందున్ = పొందును.
భావము:- మరియు, బ్రాహ్మణుడైన గృహస్థుడు గురువులు వలన షడంగాలు అనే వేదాంగాలైన ఉపనిషత్తులు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషము లను వాటితో సహా ఋక్, యజు, స్సామ వేదాలనే వేదత్రయాన్ని పఠించాలి. తన స్థాయికి తగినట్లు వాటి అర్థ విచారణ చేయాలి. యథాశక్తి గురువులు అభీష్టాలు తీర్చాలి. ఇంటిలో ఉన్నా, వనంలో ఉన్నా నిష్ఠాగరిష్ఠుడై ఉండాలి. ఇతర జీవాలతో సహజీవనం సాగిస్తూ, ముఖ్యంగా గురువుల, అగ్నుల యందు, తన యందు, సర్వ భూతము లందు అచ్యుతుడైన పరమాత్మను దర్శించాలి. అట్టి గృహస్థుడు ఆత్మజ్ఞానంతో, ఇంద్రియ లోలత్వం లేకుండా జీవించి పరబ్రహ్మమును చేరుకుంటాడు.

తెభా-7-426-క.
వినుము; వనప్రస్థునకున్
మునికథితము లైన నియమములు గల వా చొ
ప్పు వనగతుఁడై మెలఁగెడి
నుఁడు మహర్లోకమునకు మనించు నృపా!

టీక:- వినుము = వినుము; వనప్రస్థున్ = వానప్రస్థున; కున్ = కు; ముని = మునులచే; కథితములు = చెప్పబడినవి; ఐన = అయిన; నియమములు = నియమనిష్ఠలు; కలవు = ఉన్నవో; ఆచొప్పున = ఆలాగున; వనన్ = అడవియందు; గతుడు = చేరినవాడు; ఐ = అయ్యి; మెలగెడి = వర్తించెడి; ఘనుడు = గొప్పవాడు; మహర్లోకమున్ = మహర్లోకమున; కున్ = కు; గమనించు = పోవును; నృపా = రాజా {నృపా - నృ (నరులను) పా (పాలించువాడు), రాజు}.
భావము:- వినవయ్యా నరనాథా! ధర్మజా! ఇక వానప్రస్థాశ్రమ ధర్మాలు చెప్తాను. వానప్రస్థాశ్రమం స్వీకరించిన వాడు అడవులకు వెళ్ళి మునివృత్తి అవలంబించాలి. ఋషీశ్వరులు నియమించిన నియమాలు పాటించిన పుణ్యాత్ముడు మహర్లోకం చేరతాడు.

తెభా-7-427-వ.
అటమీఁద, గృహస్థాశ్రమంబు విడిచి వనంబునకుం జని దున్నక పండెడి నీవారాదికంబు లగ్నిపక్వంబు జేసి యొండె, నామంబులు చేసి యొండె, నర్కపక్వంబులైన ఫలాదు లొండె, భక్షింపుచు; వన్యాహారంబుల నిత్యకృత్యంబులయిన చరుపురోడాంశంబు లొనర్చుచుఁ; బ్రతిదినంబును బూర్వ సంచితంబులు పరిత్యజించి నూతన ద్రవ్యంబులు సంగ్రహించుచు; నగ్నికొఱకుఁ బర్ణశాల యైనఁ బర్వతకందరం బయిన నాశ్రయించుచు; హిమ, వాయు, వహ్ని, వర్షాతపంబులకు సహించుచు; నఖ, శ్మశ్రు, కేశ, తనూరుహంబులు ప్రసాధితంబులు జేయక జటిలుండై వసియించుచు; దండాజిన, కమండలు, వల్కల పరిచ్ఛదంబులు ధరియించి; పండ్రెండైన, నెనిమిదైన, నాలుగైన, రెండైన, నొక వత్సరంబయినఁ దపః ప్రయాసంబున బుద్ధి నాశంబు గాకుండ ముని యై చరించుచు; దైవవశంబున జరారోగంబులచేతఁ జిక్కి నిజ ధర్మానుష్ఠాన సమర్థుండు గాని సమయంబున నిరశన వ్రతుం డయి యగ్నుల నాత్మారోపణంబు జేసి; సన్యసించి యాకాశంబు నందు శరీరరంధ్రంబులును, గాలి యందు నిశ్శ్వాసంబును, దేజంబు లోపల నూష్మంబును, జలంబుల రసంబును, ధరణి యందు శల్య మాంస ప్రముఖంబులును, వహ్ని యందు వ్యక్తంబుతోడ వాక్కును, నింద్రుని యందు శిల్పంబుతోడఁ గరంబులును, విష్ణుని యందు గతితోడఁ బదంబులును, బ్రజాపతి యందు రతితోడ నుపస్థంబును, మృత్యువందు విసర్గంబుతోడఁ బాయువును, దిక్కులందు శబ్దంబు తోడ శ్రోత్రంబును, వాయు వందు స్పర్శంబుతోడ ద్వక్కును, సూర్యు నందు రూపంబుతోడఁ జక్షువులును, సలిలంబు లందుఁ బ్రచేతస్స హిత యయిన జిహ్వయు, క్షితి యందు గంధ సహితం బయిన ఘ్రాణంబును, జంద్రుని యందు మనోరథంబులతోడ మనంబును, గవియైన బ్రహ్మ యందు బోధంబుతోడ బుద్ధియు, రుద్రుని యందహంకారంబుతోడ మమత్వంబును, క్షేత్రజ్ఞుని యందు సత్త్వంబు తోడ జిత్తంబును. బరంబు నందు గుణంబులతోడ వైకారికంబును, డిందించి; యటమీఁదఁ, బృథివిని జలంబునందు; జలంబును దేజంబు నందుఁ; దేజంబును వాయువు నందు; వాయువును గగనంబు నందు; గగనంబును నహంకారతత్త్వంబు నందు; నహంకారంబును మహత్తత్త్వంబు నందు; మహత్తత్త్వంబును బ్రకృతి యందు; బ్రకృతిని నక్షరుండైన పరమాత్మ యందు లయంబు నొందించి చిన్మాత్రావశేషితుం డయిన క్షేత్రజ్ఞుని నక్షరత్వంబున నెఱింగి ద్వయరహితుండై దగ్ధకాష్ఠుండైన వహ్ని చందంబున బరమాత్మ యైన నిర్వికారబ్రహ్మంబునందు లీనుండ గావలయు.
టీక:- అటమీద = ఆ తరువాత; గృహస్థాశ్రమంబున్ = సాంసారికమార్గమును; విడిచి = వదలివేసి; వనంబున్ = అడవి; కున్ = కి; చని = వెళ్ళి; దున్నక = దున్నకుండగనే; పండెడి = పంటనిచ్చెడి; నీవార = తృణధాన్యములు; ఆదికంబుల్ = మున్నగువానిని; అగ్ని = నిప్పులమీద; పక్వంబు = పచనము, వండుట; చేసి = చేసి; ఒండెన్ = కాని; ఆమంబులు = పచ్చివిగా, అపక్వముగా; చేసి = చేసి; ఒండెన్ = కాని; అర్క = సూర్యుని యెండయందు; పక్వంబులు = ఎండబెట్టబడినవి, ఒరుగులు; ఐన = అయిన; ఫల = పండ్లు; ఆదులు = మున్నగునవి; ఒండెన్ = కాని; భక్షింపుచున్ = తినుచు; వన్య = అడవి యందు దొరకెడి; ఆహారంబులన్ = ఆహారములతో; నిత్య = ప్రతిదినము; కృత్యంబులు = చేయదగినవి; ఐన = అయిన; చరువు = హవ్యము, అత్తెసరన్నము; పురోడాంశంబులు = యజ్ఞార్థమైన పిండములు; ఒనర్చుచున్ = చేయుచు; ప్రతి = ప్రతియొక్క; దినంబున్ = దినమునందు; పూర్వ = ఇంతకుముందు; సంచితంబులు = కూడబెట్టినవానిని; పరిత్యజించి = విడిచిపెట్టేసి; నూతన = కొత్తవియైన; ద్రవ్యంబులున్ = పదార్థములు; సంగ్రహించుచున్ = సంపాదించుచు; అగ్ని = అగ్నిహోత్రము; కొఱకు = కోసము; పర్ణశాల = పాక, ఆకుటిల్లు; ఐనన్ = అయినను; పర్వత = కొండ; కందరంబున్ = గుహను; అయినన్ = అయినను; ఆశ్రయించుచున్ = చేరుచు; హిమ = మంచు; వాయు = గాలి; వహ్ని = నిప్పు; వర్ష = వాన; ఆతపంబుల్ = ఎండల; కున్ = కు; సహించుచు = ఓర్చుకొనుచు; నఖ = గోర్లు; శ్మశ్రు = మీసములు; కేశ = శిరోజములు; తనూరుహంబులునే = ఒడలివెంట్రుకలు; ప్రసాధితంబులున్ = చక్కజేయుట; చేయక = చేయకుండగ; జటిలుండు = జటలుదాల్చినవాడు; ఐ = అయ్యి; వసియించుచున్ = నివసించుచు; దండ = దండము; అజిన = చర్మము (ఆసనమునకు); కమండలున్ = కమండలము; వల్కల = నారచీర; పరిచ్ఛదంబులున్ = ఉత్తరీయములు; ధరియించి = తాల్చి; పండ్రెండున్ = పన్నెండు (12); ఐనన్ = అయిన; ఎనిమిది = ఎనిమిది (8); ఐనన్ = అయిన; నాలుగు = నాలుగు (4); ఐనన్ = అయిన; రెండు = రెండు (2); ఐనన్ = అయిన; ఒక = ఒక; వత్సరంబు = సంవత్సరము; అయినన్ = అయిన; తపః = తపస్సుయొక్క; ప్రయాసంబునన్ = క్లేశముతోటి; బుద్ధి = చిత్తము; నాశంబున్ = భ్రంశము; కాకుండన్ = కాకుండగ; ముని = ముని; ఐ = అయ్యి; చరించుచన్ = తిరుగుచు; దైవ = దైవ; వశంబునన్ = యోగమువలన; జర = ముసలితనము; రోగంబుల = రోగముల; చేతన్ = వలన; చిక్కి = నీరసించి; నిజ = తన; ధర్మ = ధర్మములను; అనుష్ఠాన = ఆచరించుటల యందు; సమర్థుండు = తగిన శక్తి గలవాడు; కాని = కానట్టి; సమయంబునన్ = సమయములలో; నిరశనవ్రతుండు = ఉపవాసమున నున్నవాడు; అయి = అయ్యి; అగ్నులన్ = అగ్నులను; ఆత్మా = తనయందు; ఆరోపణంబు = నిలుపుకొనుట; చేసి = చేసి; సన్యసించి = ఎల్లకర్మలనువర్జించి; ఆకాశంబునన్ = ఆకాశము; అందున్ = అందు; శరీర = దేహము యొక్క; రంధ్రంబులును = రంధ్రములను; గాలి = గాలి; అందున్ = అందు; నిశ్శ్వాసంబును = ఊపిరిని; తేజంబున్ = అగ్ని; లోపలన్ = అందు; ఊష్మంబును = దేహమందలి వేడిని; జలంబులన్ = నీటి యందు; రసంబును = దేహమందలి ద్రవములను; ధరణి = భూమి; అందున్ = అందు; శల్య = ఎముకలు; మాంస = మాంసము; ప్రముఖంబులును = మున్నగునవి; వహ్ని = అగ్ని; అందున్ = అందు; వ్యక్తంబు = పలుకదగినదాని; తోడన్ = తోటి; వాక్కునున్ = మాటను; ఇంద్రుని = ఇంద్రుని; అందున్ = అందు; శిల్పంబు = శిల్పము; తోడన్ = తోటి; కరంబులును = చేతులు; విష్ణుని = విష్ణుమూర్తి; అందున్ = అందు; గతి = నడక; తోడన్ = తోటి; పదంబులునున్ = కాళ్ళు; ప్రజాపతి = ప్రజాపతి; అందున్ = అందు; రతి = సురతము; తోడన్ = తోటి; ఉపస్థంబునున్ = రహస్యావయవము; మృత్యువు = మరణము; అందున్ = అందు; విసర్గంబు = మలవిసర్జన; తోడన్ = తోటి; పాయువును = గుదమును; దిక్కులు = దిక్కులు; అందున్ = అందు; శబ్దంబు = ధ్వని; తోడన్ = తోటి; శ్రోత్రంబును = చెవి; వాయువు = గాలి; అందున్ = అందు; స్పర్శంబు = స్పర్శ (తగులుట); తోడన్ = తోటి; త్వక్కును = చర్మము; సూర్యున్ = సూర్యుని; అందున్ = అందు; రూపంబు = రూపము; తోడన్ = తోటి; చక్షువులును = కన్నులు; సలిలంబు = నీటి; అందున్ = అందు; ప్రచేతస్ = వరుణాంశముతో; సహిత = కూడినది; అయిన = అయిన; జిహ్వయున్ = నాలుక; క్షితి = భూమి; అందున్ = అందు; గంధ = వాసనతో; సహితంబున్ = కూడినది; అయిన = అయిన; ఘ్రాణంబునున్ = ముక్కు; చంద్రుని = చంద్రుని; అందున్ = అందు; మనోరథంబుల = కోరికల; తోడన్ = తోటి; మనంబునున్ = మనస్సును; కవి = పాత్రలసృష్టించువాడు; ఐన = అయిన; బ్రహ్మ = బ్రహ్మదేవుని; అందున్ = అందు; బోధంబు = తెలివి; తోడన్ = తోటి; బుద్ధియున్ = బుద్ధి; రుద్రుని = శివుని; అందున్ = అందు; అహంకారంబు = నేనడిభావము; తోడన్ = తోటి; మమత్వంబును = నాదియనెడిభావమును; క్షేత్రజ్ఞుని = జీవుని; అందున్ = అందు; సత్త్వంబు = సామర్థ్యము; తోడన్ = తోటి; చిత్తంబును = చిత్తమును; పరంబున్ = పరబ్రహ్మ; అందున్ = అందు; గుణంబుల = గుణముల; తోడన్ = తోటి; వైకారికంబును = వికారము నొందిన చిత్తమును; డిందించి = చెందించి; అటమీద = ఆపైన; పృథివి = భూమి; అందున్ = అందు; పృథివిని = భూమిని; జలంబుల్ = నీటి; అందున్ = అందు; జలంబును = నీటిని; తేజంబున్ = అగ్ని; అందున్ = అందు; తేజంబునున్ = అగ్నిని; వాయువు = గాలి; అందున్ = అందు; వాయువును = గాలిని; గగనంబు = ఆకాశము; అందున్ = అందు; గగనంబునున్ = ఆకాశమును; అహంకార = అంహకారము; తత్త్వంబున్ = లక్షణము; అందున్ = అందు; అహంకారంబునున్ = అహంకారమును; మహత్తత్వంబున్ = బుద్ధి; అందున్ = అందు; మహత్తత్వంబునున్ = బుద్ధిని; ప్రకృతి = మూలప్రకృతి; అందున్ = అందు; ప్రకృతినిన్ = ప్రకృతిని; అక్షరుండు = నాశములేనివాడు; ఐన = అయిన; పరమాత్మ = పరమాత్మ; అందున్ = అందు; లయంబు = విలీనము; ఒందించి = చేసి; చిత్ = జ్ఞానము; మాత్ర = మాత్రమే; అవశేషితుండు = మిగిలినవాడు; అయిన = ఐన; క్షేత్రజ్ఞుని = జీవుని; అక్షరత్వంబునన్ = అవికారభావమునందు; ఎఱింగి = తెలిసికొని; ద్వయ = రెండవది, ఇతరము; రహితుండు = లేనివాడు; ఐ = అయ్యి; దగ్ధ = కాల్చబడిన; కాష్ఠుండు = కఱ్ఱలుగలవాడు; ఐన = అయిన; వహ్ని = అగ్ని; చందంబునన్ = వలె; పరమాత్మ = పరమాత్మ; ఐన = అయిన; నిర్వికార = శాశ్వత, మార్పులేని; బ్రహ్మంబు = బ్రహ్మము; అందున్ = అందు; లీనుండున్ = లయమైనవాడు; కావలయున్ = అయిపోవలెను.
భావము:- గృహస్థాశ్రమ ధర్మాలు చక్కగా నిర్వర్తించిన పిమ్మట వానప్రస్థాశ్రమం ఆరంభించాలి; అరణ్యాలలో నివసించాలి; అక్కడ దున్నకుండా దొరికే తృణ ధాన్యాలు ఉడకబెట్టినవి కానీ, పచ్చివి కానీ, ఎండలో ఎండిన ఫలాలు కానీ భుజిస్తూ జీవించాలి; అడవిలో లభించే ఆహారాలతో హవిస్సు పురోడాంశాదులు చేస్తూ, ప్రతి నిత్యం యజ్ఞం నిర్వహించాలి; నిన్నటి రోజు మిగిలిన పదార్థాలను పారేసి, ఏ రోజు కా రోజు క్రొత్తవి సంపాదించుకోవాలి; అగ్నిని కాపాడుకోవటం కోసం పర్ణశాలను కాని, కొండగుహను కానీ ఆశ్రయించ వచ్చును; గాలీ, చలీ, ఎండా, వానా మున్నగు వాటిని సహించాలి; గడ్డం గీసుకోరాదు; క్షౌరం పనికిరాదు; తల దువ్వుకోరాదు; కేవలం జటిలుడై జీవించాలి; దండం, కమండలం, జింకచర్మాలు, నారబట్టలూ ధరించాలి; పన్నెండేళ్లు కానీ, ఎనిమదేళ్ళు కానీ, నాలుగేళ్లు కానీ, రెండేళ్లు కానీ, ఒక సంవత్సరం కానీ ఏకాగ్రచిత్తంతో తపస్సు చేయాలి; బుద్ధిని చలించనీయకుండా మౌనియై జీవించాలి.
దైవవశాత్తూ కానీ, వృద్ధాప్యం వల్ల కానీ, రోగం వల్ల కానీ తన ధర్మాలూ, అనుష్ఠానాలు చేయలేని పరిస్థితులలో నిరాహార వ్రతం పూనాలి. ఆత్మ యందు అగ్నులను ఆరోపణ చేసి సన్యసించాలి. శరీర రంధ్రాలను ఆకాశంలోనూ, నిశ్వాసం గాలిలోనూ, శరీరంలోని వేడిని తేజస్సులోనూ, రసం జలంలోనూ, శల్య మాం సాదులను మట్టిలోనూ విలీనం చేయాలి. వాక్కును వక్తృత్వంతో పాటూ అగ్ని యందూ, హస్త ద్వయాన్ని శిల్పంతో పాటూ ఇంద్రుని యందూ, పాద ద్వయాన్ని నడకతో పాటు మృత్యువు నందూ, శ్రోత్రద్వయాన్ని శబ్దంతోపాటు దిక్కుల యందూ, చర్మాన్ని స్పర్శతో పాటూ వాయువు నందూ, కళ్ళను రూపంతో పాటు సూర్యుని యందూ అనుసంధానం చేయాలి. జిహ్వను వరుణ సహితంగా నీటి యందూ, నాసికను గంధ సహితంగా భూమి యందూ, మనస్సును మనోరథంతో పాటు చంద్రుని యందూ, బుద్ధిని బోధంతో పాటు కవియైన బ్రహ్మ యందూ, మమత్వమును అహంకారంతో పాటు రుద్రుని యందూ, మనస్సును సత్యంతో పాటు క్షేత్రజ్ఞుని యందూ, వికారం పొందిన క్షేత్రజ్ఞుని గుణాలతో పాటు పరబ్రహ్మము నందూ విలీనం చేయాలి. ఈ విధంగా ఆయా విషయేంద్రియాలను ఆయా అధిదేవతలతో ఐక్యం కావించాలి.
అటు పిమ్మట పృథ్విని జలంలోనూ, జలమును తేజస్సులోనూ, తేజస్సును వాయువు లోనూ, వాయువును గగనంలోనూ, గగనమును అహంకార తత్త్వములోనూ, అహంకారాన్ని మహత్తత్త్వంలోనూ, మహత్తత్త్వమును ప్రకృతిలోనూ, ప్రకృతిని శాశ్వతుడైన పరమాత్మలోనూ లయం చేయాలి. అపుడు కేవలం చిన్మయుడుగా మిగిలిన క్షేత్రజ్ఞుడిని జ్ఞానంతో తెలుసుకుని, అద్వైతుడై కట్టెలను దహించిన అగ్నివలె పరమాత్మ అయిన నిర్వికార బ్రహ్మములో విలీనం కావాలి.

తెభా-7-428-క.
ఘ! వనప్రస్థుండై
ని తద్ధర్మంబు లిట్లు లుపుచు మఱియున్
నెనేని సన్న్యసింపం
ను నటమీఁదటను ముక్త సంగత్వమునన్.

టీక:- అనఘ = పుణ్యుడ; వనప్రస్థుండు = వానప్రస్థాశ్రమస్థుడు; ఐ = అయ్యి; చని = వెళ్ళి; తత = ఆ; ధర్మంబులు = ధర్మములను; ఇట్లు = ఈ విధముగ; సలుపుచున్ = చేయుచు; మఱియున్ = ఇంకను; మనెనేని = బ్రతికినచో; సన్యసింపన్ = సన్యాసాశ్రమమునకు; చనున్ = వెళ్ళవలెను; అటమీదటను = ఆపైన; ముక్త = విడివడిన; సంగత్వమునన్ = తగులములతో.
భావము:- పుణ్యుడా! ధర్మజ్ఞా! మానవుడు వానప్రస్థాశ్రమం స్వీకరించి, ఆ ధర్మాలు పాటిస్తూ జీవించి, పిమ్మట ముక్తసంగుడై సన్న్యాసాశ్రమం తీసుకోవచ్చు.

తెభా-7-429-వ.
ఇట్లు వానప్రస్థాశ్రమంబు జరపి సన్న్యసించి దేహమాత్రావశిష్టుండును నిరపేక్షుండును భిక్షుండును నిరాశ్రయుండును నాత్మారాముండును సర్వభూతసముండును శాంతుండును సమచిత్తుండును నారాయణపరాయణుండును నై కౌపీనం బను నాచ్ఛాదకమాత్రం బయిన వస్త్రంబు ధరియించి దండాదివ్యతిరిక్తంబులు విసర్జించి యాత్మపరంబులుగాని శాస్త్రంబులు వర్జించి గ్రహనక్షత్రాది విద్యల జీవింపక భేదవాదంబులయిన తర్కంబులు దర్కింపక యెందును బక్షీకరింపక శిష్యులకు గ్రంథంబులు వంచించి యుపన్యసింపక బహువిద్యల జీవింపక మత్తాదివ్యాపారంబుల నుల్లసిల్లక పెక్కుదినంబు లొక్కయెడ వసియింపక యూరూర నొక్కొక్క రాత్రి నిలుచుచుఁ గార్యకారణవ్యతిరిక్తం బయిన పరమాత్మ యందు విశ్వంబు దర్శించుచు సదసన్మయంబయిన విశ్వంబు నందు బరబ్రహ్మంబయిన యాత్మ నవలోకించుచు జాగరణ స్వప్న సంధి సమయంబుల నాత్మనిరీక్షణంబు చేయుచు నాత్మకు బంధమోక్షణంబులు యామాత్రంబులుగాని వస్తుప్రకారంబున లేవనియును దేహంబునకు జీవితంబు ధ్రువంబు గాదనియును మృత్యువు ధ్రువంబనియును నెఱుంగుచు భూతదేహంబుల సంభవనాశంబులకు మూలంబయిన కాలంబు బ్రతీక్షించుచు నివ్విధంబున జ్ఞానోత్పత్తి పర్యంతంబుఁ జరియించి యటమీఁద విజ్ఞానవిశేషంబు సంభవించినఁ బరమహంసుండయి దండాదిచిహ్నంబులు ధరియించి యొండె ధరియింపక యొండె బహిరంగవ్యక్తచిహ్నుండు గాక యంతరంగవ్యక్తం బయిన యాత్మాను సంధానంబు గలిగి మనీషియై బాహ్యానుసంధాన భావంబున మనుష్యులకుఁ దనవలన నున్మత్త బాల మూకల తెఱంగుఁ జూపుచుండవలయు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వానప్రస్థాశ్రమంబున్ = వానప్రస్థాశ్రమమును; జరిపి = నడపి; సన్యసించి = సన్యసాశ్రమముస్వీకరించి; దేహ = శరీరము; మాత్ర = మాత్రమే; అవశిష్టుండును = మిగిలినవాడు; నిరపేక్షుండును = కోరికలులేనివాడు; భిక్షుండును = భిక్షమెత్తువాడు; నిరాశ్రయుండును = నివాసములేనివాడు; ఆత్మారాముండును = తనలోతానే క్రీడించువాడు; సర్వ = ఎల్ల; భూత = జీవులను; సముండును = ఒకే రీతిని చూచువాడు; శాంతుండును = నిత్యనమ్రుడును; సమచిత్తుండును = సుఖదుఃఖములందు సమభావముగలవాడు; నారాయణ = శ్రీహరియందు; పరాయణుండును = లగ్నమైనమనసుగలవాడు; కౌపీనంబు = గోచి; అను = అనెడి; ఆచ్ఛాదక = కప్పువస్త్రము; మాత్రంబు = మాత్రమే; అయిన = అయిన; వస్త్రంబు = వస్త్రమును; ధరియించి = కట్టుకొని; దండ = దండము; ఆది = మొదలైన; వ్యతిరిక్తంబులు = వేరైనవస్తువులను; విసర్జించి = వీడి; ఆత్మ = ఆత్మయందు; పరంబులు = లయించునవి; కాని = కానట్టి; శాస్త్రంబులు = శాస్త్రములను; వర్జించి = విడిచిపెట్టేసి; గ్రహనక్షత్ర = జ్యోతిషము; ఆది = మొదలగు; విద్యల = విద్యలచేత; జీవింపక = జీవికగాతీసుగొనక; భేదవాదంబులు = ద్వైతభావముగలవాదములు; అయిన = అయిన; తర్కంబులున్ = వాదించుటలను; తర్కింపక = తరచిచూడక; ఎందును = దేనియందును; పక్షీకరింపక = పక్షమువహింపక; శిష్యుల = శిష్యుల; కున్ = కు; గ్రంథంబులు = గ్రంథములను; వంచించి = మోసముచేసి; ఉపన్యసింపక = బోధించక; బహు = పలు; విద్యల = విద్యలతోటి; జీవింపక = పొట్టపోసుకొనక; మత్తు = (కల్లు)మత్తుకలిగించెడివాని; వ్యాపారంబులన్ = వాడుట యందు; ఉల్లసిల్లక = సంతోషింపకుండగ; పెక్కు = ఎక్కువ; దినంబులు = రోజులు; ఒక్క = ఒకే; ఎడన్ = ప్రదేశములో; వసియింపక = ఉండకుండగ; ఊరూరన్ = ప్రతి యూరునందు; ఒక్కొక్క = ఒకటిచొప్పున; రాత్రి = రాత్రులు; నిలుచుచున్ = వసించుచు; కార్య = కార్యభూతములైన ఘటపటాదులకంటెను; కారణ = కారణభూతములైన మృదాదులకంటెను; వ్యతిరిక్తంబు = వేరైనది, అతీతమైనది; అయిన = ఐన; పరమాత్మ = పరబ్రహ్మము; అందున్ = లో; విశ్వంబున్ = జగత్తును; దర్శించుచున్ = చూచుచు; సత్ = సత్తు, నిత్యమైనది; అసత్ = అసత్యమైనది,అనిత్యమైనది; విశ్వంబున్ = జగత్తు; అందున్ = అందు; పరబ్రహ్మంబు = పరమాత్మ; అయిన = ఐన; ఆత్మన్ = ఆత్మను; అవలోకించుచు = దర్శించుచు; జాగరణ = జాగృతి, మేలుకున్న; స్వప్న = స్వప్నము, కల; సంధి = సుషుప్తి, కలతనిద్ర; సమయంబుల్ = స్థితియందున్నకాలమందు; ఆత్మన్ = పరమాత్మను; నిరీక్షణంబు = చూచుట; చేయుచున్ = చేయుచు; ఆత్మ = ఆత్మ; కున్ = కు; బంధ = పట్టు; మోక్షంబులు = విడుపులు; మాయా = మాయచేతకల్పితంబులు; మాత్రంబులు = మాత్రమే; కాని = తప్పించి; వస్తుప్రకారంబున = భౌతికముగ; లేవు = లేవు; అనియును = అని; దేహంబున్ = దేహమున; కున్ = కు; జీవితంబు = జీవించియుండుట; ధ్రువంబు = నిత్యము; కాదు = కాదు; అనియును = అని; మృత్యువు = మరణము; ధ్రువంబు = సత్యము; అనియును = అని; ఎఱుంగుచున్ = అర్థముచేసికొనుచు; భూత = పంచభూతములకూడికైన; దేహంబుల = దేహముల యొక్క; సంభవ = పుట్టుక; నాశంబుల్ = మరణముల; కున్ = కు; మూలంబు = కారణభూతము; అయిన = ఐన; కాలంబున్ = కాలముకొరకు; ప్రతీక్షించుచున్ = ఎదురుచూచుచు; ఇవ్విధంబునన్ = ఈలాగున; జ్ఞాన = బ్రహ్మజ్ఞానము; ఉత్పత్తి = కలిగెడి; పర్యంతంబున్ = వరకు; చరియించి = మెలగి; అటమీద = ఆపైన; విజ్ఞాన = బ్రహ్మజ్ఞానము యనెడి; విశేషంబు = శ్రేష్ఠమైనది; సంభవించినన్ = కలుగగా; పరమహంసుండు = పరమహంస; అయి = అయ్యి; దండ = దండము {దండము - జపతపాదులందు చేతిని ఆనించుకొనెడి పైన చిన్న అడ్డకఱ్ఱ యుండెడి కఱ్ఱ}; ఆది = మొదలగు; చిహ్నంబులు = గుర్తులు; ధరించి = కలిగి; ఒండెన్ = కాని; ధరియింపక = కలియుండక; ఒండెన్ = కాని; బహిరంగ = బయటకు; వ్యక్త = వెల్లడగు; చిహ్నుండు = గుర్తులుగలవాడు; కాక = కాకుండగ; అంతరంగ = మనోనోత్రమునకు; వ్యక్తంబు = గోచరమగునది; అయిన = ఐన; ఆత్మానుసంధానంబున్ = జీవాత్మపరమాత్మల యైక్యత; కలిగి = కలిగిన; మనీషి = జ్ఞాని; ఐ = అయ్యి; బాహ్య = బాహ్యప్రపంచమునకు; అనుసంధాన = తెలియబడెడి; భావంబునన్ = విధములో; మనుష్యుల్ = మానవుల; కున్ = కు; తన = తన; వలన = గురించి; ఉన్మత్త = పిచ్చివాని; బాల = చిన్నపిల్లవాని; మూక = మూగవాని; తెఱంబున్ = వలె; చూపుచుండవలయున్ = కనబడవలెను.
భావము:- సన్న్యాసాశ్రమం స్వీకరించిన సన్న్యాసి దేహమాత్రావశిష్టుడై ఉండాలి. సర్వభూతము లందూ నిరపేక్షుడుగా, క్షుకుడుగా, ఆత్మారాముడుగా, సర్వప్రాణి సమ భావం కలవాడిగా, శాంతుడుగా, సమచిత్తుడుగా ఉండి, సదా నారాయణ పరాయణుడై తేజరిల్లుతూ ఉండాలి. సన్న్యాసి శరీరం మీద గోచీ మాత్రమే ధరించాలి. దండ, కమండలాలు విసర్జించాలి. ఆత్మపరములు కానట్టి శాస్త్రాలను విసర్జించాలి. జ్యోతిషం మొదలైన లౌకిక విద్యలు పరిత్యజించాలి. కుతర్కాలకు పోకుండా, ఎట్టి పక్షపాతం పెట్టుకోకుండా, ఆత్మచింతనలోనే నిమగ్నమైన సమాధి నిష్ఠలో ఉండాలి. శిష్యులకు వంచనతో గ్రంథాలు బోధించరాదు. రకరకాల విద్యలు ప్రదర్శింప రాదు. మత్తతలో నిమగ్నుడు కారాదు. పెక్కుదినాలు ఒకేచోట నివసించ కూడదు. ఒక ఊరిలో ఒక రాత్రి మాత్రమే గడపవచ్చు. కార్యకారణాలకు అతీతమైన పరమాత్మలో విశ్వాన్ని దర్శిస్తూ, సత్ అసత్ పదార్థాలతో నిర్మతమైన ఈ విశాల విశ్వంలో పరబ్రహ్మమైన ఆత్మను సందర్శిస్తూ ఉండాలి. జాగరణ, స్వప్న, సంధి సమయాలలో ఆత్మనిరీక్షణ చేయాలి. ఆత్మకు బంధమోక్షణాలు మాయామాత్రాలు కాని, వాస్తవంగా లేవు అని భావించాలి. జన్మకు జీవితం స్థిరం కాదనీ, మృత్యువు నిశ్చయం అని తెలుసుకొని ప్రవర్తించాలి. సకల జీవకోటి పుట్టుకలకూ, నాశములకు కాలం మూలం అని గ్రహించి, అట్టి కాలం కోసం నిరీక్షిస్తూ ఉండాలి. ఈ విధంగా జ్ఞానోత్పత్తి వరకూ ప్రవర్తించి, అటు పిమ్మట విజ్ఞాన విశేషం ప్రాప్తిస్తే “పరమహంస” అయి దండాది చిహ్నాలు ధరించికానీ, ధరించకుండా కానీ అంతరంగంలో ఆత్మను అనుసంధానం చేయగలిగి, విజ్ఞానియై ప్రకాశించాలి. బాహ్యానుసంధానాలు వలన ఇతరులకు పిచ్చివాని లాగ, అమాయక బాలుని లాగ, మూగవాడి లాగా కనిపించాలి.