Jump to content

పోతన తెలుగు భాగవతము/సప్తమ స్కంధము/ప్రహ్లాదుడు స్తుతించుట

వికీసోర్స్ నుండి

ప్రహ్లాదుడు స్తుతించుట


తెభా-7-349-మ.
"రుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చి
త్తములన్ నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పా
ము ముట్టన్ నుతిచేయ నోపరఁట; నే క్షస్తనూజుండ గ
ర్వదోద్రిక్తుఁడ బాలుఁడన్ జడమతిన్ ర్ణింప శక్తుండనే?

టీక:- అమరుల్ = దేవతలు; సిద్ధులు = సిద్ధులు; సంయమి = ముని {సంయమీశ్వరులు - సంయమము (హింసాదులవలన విరమించుట) కలవారు, ముని}; ఈశ్వరులు = శ్రేష్ఠులు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల్ = మొదలగువారు; సతాత్పర్య = ఏకాగ్రతగల; చిత్తములన్ = మనసులతో; నిన్నున్ = నిన్ను; బహు = పలు; ప్రకారములన్ = విధములచే; నిత్యంబున్ = ఎల్లప్పుడు; విచారించి = విచారించినను; పారముముట్టన్ = తుద వరకు; నుతిన్ = స్తుతించుట; చేయన్ = చేయుటకు; ఓపరట = సరిపోరట; నేన్ = నేను; రక్షస్ = రాక్షసుని; తనూజుండన్ = పుత్రుడను {తనూజుండు - తనువున పుట్టినవాడు, కొడుకు}; గర్వ = గర్వము; మద = మదముల; ఉద్రిక్తుడన్ = విజృంభణములుగలవాడను; బాలుడన్ = చిన్నపిల్లవాడను; జడమతిన్ = మూర్ఖుడను; వర్ణింపన్ = కీర్తించుటకు; శక్తుండనే = సమర్థుండనా ఏమి (కాను).
భావము:- దేవతలూ, సిద్ధులూ, మునీశ్వరులూ, బ్రహ్మదేవుడు మున్నగువారు ప్రగాఢమైన కాంక్షతో నిన్ను నిత్యం అనేక విధాలుగా ఆరాధిస్తారు; నీ గుణాలను గానం చేస్తారు; కాని సంపూర్ణంగా నిన్ను తెలుసుకుని సమగ్రంగా నిన్ను అభివర్ణించలేరట! నేనేమో దైత్యునికి పుట్టినవాడిని; గర్వ మద స్వభావిని; చిన్నపిల్లాడిని; మూర్ఖుడిని; మరి నిన్ను కీర్తించటం నాకెలా సాధ్యం అవుతుంది?

తెభా-7-350-మ.
మున్ వంశముఁ దేజమున్ శ్రుతము సౌంర్యంబు నుద్యోగమున్
నిపుణత్వంబుఁ బ్రతాపపౌరుషములున్ నిష్ఠాబలప్రజ్ఞలున్
హోమంబులుఁ జాల వీశ్వర! భవత్సంతుష్టికై దంతి యూ
థఁపు చందంబున భక్తి జేయవలయుం దాత్పర్య సంయుక్తుఁడై.

టీక:- తపమున్ = తపస్సుచేయుట; వంశమున్ = కులము; తేజమున్ = తేజస్సు; శ్రుతము = వేదశాస్త్రాధ్యయనము; సౌందర్యమున్ = అందము; ఉద్యోగమున్ = ప్రయత్నము; నిపుణత్వంబున్ = నేర్పరితనము; ప్రతాప = పరాక్రమము; పౌరుషములున్ = పౌరుషము; నిష్ఠ = పూనిక; బల = శక్తి; ప్రజ్ఞలున్ = సామర్థ్యములు; జప = జపముచేయుట; హోమంబులున్ = హోమములుచేయుటలు; చాలవు = సరిపోవు; ఈశ్వర = ప్రభూ; భవత్ = నీకు; సంతుష్టి = మెప్పుకలిగించుట; కై = కొఱకు; దంతియూథంపు = గజేంద్రుని {దంతియూథము - దంతి (ఏనుగు) యూథము (వీరుడు), గజేంద్రుడు}; చందంబునన్ = వలె; భక్తిన్ = భక్తిని; చేయవలయును = చేయవలెను; తాతపర్య = దానియందేలగ్నమగుటతో {తాత్పర్యము - దానియందేలగ్నమగుట, ఏకాగ్రత}; సంయుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి.
భావము:- ప్రభూ! నారసింహా! గొప్ప గొప్ప జపతపాలు, సద్వంశమూ, తేజస్సూ, వేద నైపుణ్యాలూ, సౌందర్యాలు, గట్టి నిష్ఠలూ, సత్కార్యాలు చేసే నైపుణ్యాలు, పరాక్రమాలూ, పౌరుషాలు, నైష్ఠికాలూ, శక్తిసామర్థ్యాలూ, హోమాలూ యజ్ఞాలూ మొదలైని ఏవీ కూడ నిన్ను సంతోషపెట్టటానికి సరిపోవు. పూర్వం గజేంద్రుడు భక్తితో నిన్ను మెప్పించి మెక్షం సాధించాడు కదా. నిన్ను మెప్పించటానికి అలాంటి భక్తి తాత్పర్యాలు అలవరుచుకోవాలి.

తెభా-7-351-మ.
లజ్ఞాన సుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సర
త్వములన్ యజ్ఞ తపోనసూయలఁ గడున్ ర్పించు ధాత్రీసురో
త్తముకంటెన్ శ్వపచుండు ముఖ్యుఁడు మనోర్థ ప్రాణ వాక్కర్మముల్
తన్ నిన్ను నయించెనేని, నిజ వం శ్రీకరుం డౌఁ దుదిన్.

టీక:- అమల = స్వచ్ఛమైన; జ్ఞాన = జ్ఞానము; సు = మంచి; దాన = దానములు; ధర్మరతి = నీతి; సత్య = సత్యము; క్షాంతి = ఓర్పు; నిర్మత్సరత్వములన్ = ఈర్ష్యలేకపోవుటలు; యజ్ఞ = యాగములు; తపస్ = తపస్సుచేయుట; అనసూయ = అసూయలేకపోవుటలతో; కడున్ = మిక్కిలి; దర్పించు = గర్వపడెడి; ధాత్రీసురోత్తమున్ = బ్రాహ్మణశ్రేష్ఠుని {ధాత్రీసురోత్తముడు - ధాత్రీసుర (భూమిపైనిదేవతల వంటివాడైన బ్రాహ్మణ) ఉత్తముడు (శ్రేష్ఠుడు)}; కంటెన్ = కంటెను; శ్వపచుండు = నీచజాతివాడు {శ్వపచుడు - కుక్కలను తినువాడు, చండాలుడు}; ముఖ్యుడు = శ్రేష్ఠుడు; మనస్ = మనస్సు; అర్థ = ధనము; ప్రాణ = ప్రాణము, జీవితకాలము; వాక్ = మాట; కర్మముల్ = పనులు ఎడ; సమతన్ = సమత్వముతో; నిన్నున్ = నిన్ను; నయించెనేని = పొందినచో; నిజ = తన; వంశ = కులమునకు; శ్రీకరుడు = వన్నెతెచ్చినవాడు; ఔ = అగును; తుదిన్ = చివరకు.
భావము:- నిర్మల జ్ఞానం, దానం, నీతి, సత్యం, క్షాంతి, ఈర్ష్య లేకపోవుట, యజ్ఞాలు, తపశ్శక్తి, అసూయ లేమి వంటివి ఎన్ని ఉన్నా గర్విష్ఠి అయిన బ్రాహ్మణుని కంటె త్రికరణసుద్ధిగా సమబుద్ధితో నిన్ను సేవించే చండాలుడు ఉత్తముడు. అట్టివాడు నీ సాన్నిధ్యాన్ని పొంది తన వంశం మొత్తానికి శోభ కలిగిస్తాడు.

తెభా-7-352-సీ.
జ్ఞుండు చేసిన యారాధనములఁ జే-
ట్టఁ డీశ్వరుఁడు కృపాళుఁ డగుటఁ;
జేపట్టు నొకచోట; సిద్ధ మీశ్వరునకు-
ర్థంబు లేకుండు తఁడు పూర్ణు
డైన నర్థము లీశ్వరార్పణంబులు గాఁగఁ-
జేయుట ధర్మంబు; చేసెనేని
ద్దంబుఁ జూచిన ళికలలామంబు-
ప్రతిబింబితం బగు గిది మరల

తెభా-7-352.1-తే.
ర్థములు దోఁచుఁ; గావున ధికబుద్ధి
క్తి జేయంగవలయును క్తిఁ గాని
మెచ్ఛఁ డర్థంబు లొసఁగెడు మేరలందుఁ
రమ కరుణుండు హరి భక్తబాంధవుండు.

టీక:- అజ్ఞుండు = తెలియనివాడు; చేసిన = చేసినట్టి; ఆరాధనములన్ = భక్తిని; చేపట్టడు = స్వీకరింపడు; ఈశ్వరుడు = భగవంతుడు; కృపాళుడు = దయగలవాడు; అగుటన్ = అగుటచేత; చేపట్టున్ = స్వీకరించును; ఒకచోట = ఒక్కోసారి; సిద్ధము = సత్యము; ఈశ్వరున్ = భగవంతుని; కున్ = కి; అర్థంబున్ = ప్రయోజనము; లేకుండున్ = ఉండదు; అతడు = అతడు; పూర్ణుడు = పరిపూర్ణమైనవాడు; ఐనన్ = అయినను; అర్థములు = ఎల్లవిషయములు; ఈశ్వర = భగవంతునికి; అర్పణంబులున్ = సమర్పితములు; కాగన్ = అగునట్లు; చేయుట = చేయుట; ధర్మంబు = న్యాయము; చేసెనేని = చెసినచో; అద్దంబున్ = అద్దము (దర్పణము)న; చూచిన = చూసినచో; అళికలలామంబు = నొసలిబొట్టు; ప్రతిబింబితంబు = ప్రతిబింబించినది; అగు = అయ్యెడి; పగిదిన్ = వలె; మరల = మరల; అర్థములన్ = ప్రయోజనములు; తోచున్ = కలుగును; కావున = కనుక; అధిక = ఉన్నతమైన.
బుద్ధిన్ = బుద్ధితో; భక్తిన్ = భక్తిని; చేయవలయును = చేయవలెను; భక్తిన్ = భక్తిని; కాని = కాని; మెచ్చడు = మెచ్చుకొనడు; అర్థంబుల్ = పదార్థములు; ఒసగెడు = సర్పించెడి; మేరలు = సమయములలో; అందున్ = అందు; పరమ = అతిమిక్కిలి; కరుణుండు = దయగలవాడు; హరి = విష్ణుమూర్తి; భక్త = భక్తులకు; బాంధవుడు = బంధువు వంటివాడు.
భావము:- భగవానుడు అజ్ఞానులు చేసిన భక్తిని స్వీకరించడు. కాని ఆయన దయాసముద్రుడు కనుక కొందరు అజ్ఞానులు చేసిన ఆరాధనలను కూడా స్వీకరిస్తాడు. ఆయన పరిపూర్ణుడు కనుక భక్తులు చేసే భక్తివలన భగవంతునికి ఏ ప్రయోజనమూ లేదు. అయినా సర్వ కార్యాలు భగవదర్పణంగా చేయవలెను, అలా చేస్తే అద్దంలో నుదుటి బొట్టు కనబడినంత స్వచ్ఛంగా, సర్వ కార్యాలు ప్రయోజనాలు చేకూరుతాయి. భగవంతుడు హరి దయామయుడు, భక్తుల ఎడ బందువాత్సల్యం గలవాడు. ఆయన భక్తిని తప్ప మరి దేనిని మెచ్చడు అందుచేత విష్ణుభక్తి విడుక చేయవలెను.

తెభా-7-353-క.
కావున నల్పుఁడ సంస్తుతి
గావించెద వెఱపు లేక లనేరుపునన్;
నీ ర్ణనమున ముక్తికిఁ
బోవు నవిద్యను జయించి పురుషుఁ డనంతా!

టీక:- కావునన్ = కనుక; అల్పుడ = చిన్నవాడను; సంస్తుతి = స్తోత్రములు; కావించెద = చేసెదను; వెఱపు = బెదురు; లేక = లేకుండగ; కల = కలిగినంత; నేరుపునన్ = సామర్ధ్యముతో; నీ = నీ యొక్క; వర్ణనమునన్ = స్తుతించుటవలన; ముక్తి = మోక్షపదమున; కిన్ = కు; పోవున్ = వెళ్ళును; అవిద్యన్ = అవిద్యను; జయించి = జయించి; పురుషుండు = మానవుడు; అనంతా = నారాయణా {అనంతుడు - అంతము లేనివాడు, హరి}.
భావము:- శాశ్వతుడా! శ్రీహరీ! మానవుడు కేవలం నీ గుణాలను కీర్తించటం ద్వారా అవిద్యను జయించి కైవల్యాన్ని అందుకుంటాడు కదా. కనుక, నేను అల్పుడను. కొద్దిపాటి జ్ఞానమే నాకున్నా, బెదరకుండా నా నేర్పుకొలది స్తుతిస్తున్నాను. నా ప్రార్థన మన్నించు.

తెభా-7-354-సీ.
త్త్వాకరుఁడ వైన ర్వేశ! నీ యాజ్ఞ-
శిరముల నిడుకొని చేయువారు
బ్రహ్మాదు లమరులు య మందుచున్నారు-
నీ భీషణాకృతి నేఁడు చూచి;
రోషంబు మాను నీ రుచిరవిగ్రహములు-
ల్యాణకరములు గాని భీతి
రములు గావు లోములకు వృశ్చిక-
న్నగంబుల భంగి యముఁ జేయు

తెభా-7-354.1-తే.
సుర మర్దించితివి; సాధుర్ష మయ్యె;
వతరించిన పనిదీఱె లుక యేల?
లుషహారివి సంతోషకారి వనుచు
నిన్నుఁ దలఁతురు లోకులు నిర్మలాత్మ!

టీక:- సత్త్వాకరుడవు = నారయణుడవు {సత్త్వాకరుడు - సత్త్వగుణమునకు ఆకరుడు (ప్రధానుడు), విష్ణువు}; ఐన = అయిన; సర్వేశ = నరసింహా {సర్వేశుడు - సర్వులకును ఈశుడు, హరి}; నీ = నీ యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; శిరములనిడుకొని = నెత్తినపెట్టుకొని; చేయువారు = చేసెడివారు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; అదుల్ = మొదలైన; అమరుల్ = దేవతలు; భయమున్ = భయమును; అందుచున్నారు = పొందుతున్నారు; నీ = నీ యొక్క; భీషణ = భయంకరమైన; ఆకృతి = రూపము; నేడు = ఇప్పుడు; చూచి = చూసి; రోషంబున్ = కోపమును; మాను = విడువుము; నీ = నీ యొక్క; రుచిర = అందమైన; విగ్రహములు = రూపములు; కల్యాణ = శుభములను; కరములు = కలిగించెడివి; కాని = తప్పించి; భీతి = భయమును; కరములు = కలిగించెడివి; కావు = కావు; లోకముల్ = లోకముల; కున్ = కు; వృశ్చిక = తేళ్ళు; పన్నగంబుల = పాముల; భంగిన్ = వలె; భయమున్ = భయమును; చేయు = కలిగించెడి; అసురన్ = రాక్షసుని.
మర్ధించితివి = చంపితివి; సాధు = సజ్జనులకు; హర్షము = సంతోషము; అయ్యెన్ = అయినది; అవతరించిన = అవతరించినట్టి; పని = ప్రయోజనము; తీఱెన్ = తీరినది; అలుక = కోపము; ఏల = ఎందుకు; కలుష = పాపములను; హారివి = హరించెడివాడవు; సంతోష = సంతోషములను; కారివి = కలిగించెడివాడవు; అనుచున్ = అనుచు; నిన్నున్ = నిన్ను; తలతురు = భావించెదరు; లోకులు = ప్రజలు; నిర్మలాత్మ = నరసింహా {నిర్మలాత్మ - నిర్మల (స్వచ్ఛమైన) ఆత్మ (స్వరూపుడు), విష్ణువు}.
భావము:- ఓ జగదీశ్వరా! నారసింహా! నీవుసత్త్వగుణ ప్రధానుడవు. నీ ఆజ్ఞలు తలదాల్చు బ్రహ్మాది దేవతలు, ఇవాళ నీ భీషణ ఆకృతి చూసి బెదిరిపోతున్నారు. ప్రభూ! శాంతించు. నీ సుందర రూపాలు లోకానికి కల్యాణకారకాలు భక్తిప్రేరకాలు తప్పించి భయంకరాలు కావు కదా! తేలు లాగా, పాములాగా నిత్యం ప్రజలకు భయం పుట్టించే పాపాత్ముడూ రాక్షసుడూ అయిన మా తండ్రి హిరణ్యకశిపుని పరిమార్చావు. జనులు అందరికి సంతోషం సమకూరింది. నరకేసరి అవతార ప్రయోజనం సిద్ధించింది. ఇంకా ఈ సంతోష సమయంలో ఇంత కోపం ఎందుకు! ప్రజలు అందరూ నిన్ను సంతోషాలు కలుగజేసేవాడవనీ, పాపాలను తొలగించేవాడవనీ భావిస్తున్నారు నిర్మలమైన ఆత్మ స్వరూపా! నారాయణా! రోషము విడువుము, శాంతించుము.

తెభా-7-355-మ.
దంష్ట్రా భ్రుకుటీ సటా నఖయు నుగ్రధ్వానయున్ రక్త కే
యున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ
సింహాకృతిఁ జూచి నే వెఱవఁ బూర్ణ క్రూర దుర్వార దు
ర్భ సంసారదవాగ్నికిన్ వెఱతు నీ పాదాశ్రయుం జేయవే.

టీక:- ఖర = వాడియైన; దంష్ట్రా = కోరలు; భ్రుకుటి = బొమముడి; సటా = జటలు; నఖయును = గోరులు; ఉగ్ర = భయంకరమైన; ధ్వానయున్ = ధ్వనికలది; రక్త = రక్తమంటిన; కేసరయున్ = జూలుగలది; దీర్ఘతర = మిక్కిలి పోడవైన {దీర్ఘము - దీర్ఘతరము - దీర్ఘతమము}; ఆంత్ర = పేగులు; మాలికయున్ = మాలలుగలది; భాస్వత్ = వెలుగుతున్న; నేత్రయున్ = కన్నులుగలది; ఐనన్ = అయిన; ఈ = ఈ; నరసింహ = నరసింహుని; ఆకృతిన్ = ఆకారమును; చూచి = చూసి; నేన్ = నేను; వెఱవన్ = బెదరను; పూర్ణ = పూర్తిగ; క్రూర = క్రూరమైన; దుర్వార = దాటరాని; దుర్భర = భరింపరాని; సంసార = సంసారము యనెడి; దావాగ్ని = కార్చిచ్చున; కిన్ = కు; వెఱతు = బెదరెదను; నీ = నీ యొక్క; పాద = పాదములను; ఆశ్రయున్ = ఆశ్రయించినవానినిగా; చేయవే = చేయుము.
భావము:- ప్రభూ! భీకరమైన కోరలూ, కనుబొమలూ, జటలూ, గోళ్ళూ, భీషణ ధ్వనులు, రక్త రంజితమైన కేసరాలూ, మెడలో పొడవుగా వ్రేలాడుతున్న దండల్లా ఉన్న ప్రేగులూ తోటి పరమ భీకరమైన నీ ఉగ్రనరసింహ రూపం చూసి నేను ఏమాత్రం భయపడను. కానీ పూర్తిగా క్రూరమైనదీ, భయంకరమైనదీ, భరింపరానిదీ, నికృష్టమైనది అయిన సంసారమనే దావాగ్నిని చూసి మాత్రం బెదిరిపోతున్నాను. కరుణించి నీ చరణసన్నిధిలో నాకు ఆశ్రయం ప్రసాదించు.

తెభా-7-356-వ.
దేవా! సకల యోను లందును సుఖవియోగ దుఃఖసంయోగ సంజనితంబైన శోకానలంబున దందహ్యమానుండనై దుఃఖనివారకంబు గాని దేహాద్యభిమానంబున మోహితుండనై పరిభ్రమించుచున్న యేను నాకుం బ్రియుండవు సఖుండవుఁ బరదేవతవు నైన నీవగు బ్రహ్మగీతంబు లయిన లీలావతార కథావిశేషంబులఁ బఠియించుచు రాగాదినిర్ముక్తుండనై దుఃఖపుంజంబులఁ దరియించి భవదీయ చరణకమల స్మరణ సేవానిపుణులైన భక్తులం జేరి యుండెద; బాలునిఁ దల్లిదండ్రులును, రోగిని వైద్యదత్తంబయిన యౌషధంబును, సముద్రంబున మునింగెడు వాని నావయును, దక్కొరులు రక్షింపనేరని తెఱంగున సంసారతాప సంతప్యమానుండై నీచేత నుపేక్షితుం డయిన వాని నుద్ధరింప నీవు దక్క నన్యుండు సమర్థుండు గాఁడు; జగంబుల నెవ్వం డేమి కృత్యంబు నెవ్వనిచేతం బ్రేరితుండై యే యింద్రియంబులం జేసి యేమిటి కొఱకు నెవ్వనికి సంబంధి యై యే స్థలంబున నే సమయంబునం దేమి రూపంబున నే గుణంబున నపరంబయిన జనకాది భావంబున నుత్పాదించి పరంబయిన బ్రహ్మాదిభావంబున రూపాంతరంబు నొందించు నట్టి వివిధప్రకారంబు లన్నియు నిత్యముక్తుండవు రక్షకుండవు నైన నీవ; నీ యంశంబైన పురుషునికి నీ యనుగ్రహంబునఁ గాలంబుచేతం బ్రేరితయై కర్మమయంబును బలయుతంబును బ్రధానలింగంబును నైన మనంబును నీ మాయ సృజియించు; నవిద్యార్పితవికారంబును వేదోక్తకర్మప్రధానంబును సంసారచక్రాత్మకంబైన యీ మనమున నిన్ను సేవింపక నియమించి తరియింప నొక్కరుండును సమర్థుండు లేడు; విజ్ఞాననిర్జిత బుద్ధిగుణుండవు; నీ వలన వశీకృత కార్యసాధన శక్తి యైన కాలంబు మాయతోడం గూడ షోడశవికారయుక్తం బయిన సంసారచక్రంబుఁ జేయుచుండు; సంసారదావదహన తంతప్యమానుండ నగు నన్ను రక్షింపుము.
టీక:- దేవా = భగవంతుడా; సకల = అఖిలమైన; యోనులు = గర్భములు; అందును = లోను; సుఖ = సుఖము; వియోగంబును = తొలగుట; దుఃఖ = దుఃఖము; సంయోగ = కలుగుటలు; సంజనితంబు = పుట్టింపబడినది; ఐన = అయిన; శోక = దుఃఖము యనెడి; అనలంబునన్ = అగ్నిలో; దందహ్యమానుండను = మిక్కిలి కాల్చబడినవాడను; ఐ = అయ్యి; దుఃఖ = శోకమును; నివారకంబున్ = పోగొట్టునది; కాని = కాని; దేహ = దేహము; ఆది = మొదలగువానియందు; అభిమానంబునన్ = మమకారముచేత; మోహితుండను = మాయలోపడినవాడను; ఐ = అయ్యి; పరిభ్రమించుచున్న = తిరుగుతున్న; ఏను = నేను; నా = నా; కున్ = కు; ప్రియుండవు = ఇష్టుడవు; సఖుండవు = స్నేహితుడవు; పరదేవతవు = ఆరాధ్య దేవతవు; ఐన = అయిన; నీవి = నీవి; అగు = ఐన; బ్రహ్మ = బ్రహ్మచేత; గీతంబులు = కీర్తింపబడినవి; అయిన = ఐన; లీలా = విలాసములకైన; అవతార = అవతారముల యొక్క; కథా = గాథలు; విశేషంబులన్ = వృత్తాంతములను; పఠియించుచు = అధ్యయనము చేయుచు; రాగాది = రాగద్వేషాదులనుండి; నిర్ముక్తుండను = విడివడినవాడను; ఐ = అయ్యి; దుఃఖ = దుఃఖముల; పుంజములన్ = సమూహములను; తరియించి = దాటి; భవదీయ = నీ యొక్క; చరణ = పాదములు యనెడి; కమల = పద్మముల; స్మరణ = తలచుట; సేవా = కొలచుటలయందు; నిపుణులు = నేర్పరులు; ఐన = అయిన; భక్తులన్ = భక్తులను; చేరి = చేరి; ఉండెదన్ = ఉండెదను; బాలునిన్ = పిల్లలను; తల్లిదండ్రులును = తల్లిదండ్రులు; రోగిని = జబ్బుపడినవానిని; వైద్య = వైద్యునిచే; దత్తంబు = ఈయబడినది; అయిన = ఐన; ఔషధంబును = ఔషధము; సముద్రంబునన్ = సాగరమునందు; మునింగెడు = మునిగిపోతున్న; వానిన్ = వానిని; నావయును = పడవ; తక్క = తప్పించి; ఒరులు = ఇతరులు; రక్షింపన్ = కాపాడుటకు; నేరని = చాలని, సమర్థులుకాని; తెఱంగునన్ = విధముగ; సంసార = సంసారము యొక్క; తాప = తాపత్రయములచే, బాధలచే {తాపత్రయములు - 1ఆధ్యాత్మికము (తనవలన కలిగెడి బాధలు) 2ఆదిభౌతికములు (ఇతర భూతాదుల వలని బాధలు) 3ఆదిదైవికములు (దైవికములు ప్రకృతి వైపరీత్యాదుల వలని బాధలు)}; తప్యమానుండు = బాధింపబడినవాడు; ఐ = అయ్యి; నీ = నీ; చేతను = వలన; ఉపేక్షితుండు = అశ్రద్ధ చేయబడినవాడు; అయిన = ఐన; వానిన్ = వానిని; ఉద్ధరింపన్ = ఉద్ధరించుటకు; నీవు = నీవు; తక్క = తప్పించి; అన్యుండు = ఇతరుడు ఎవడును; సమర్థుండు = నేర్పుగలవాడు; కాడు = కాడు; జగంబులన్ = లోకములందు; ఎవ్వండు = ఎవడైనను; ఏమి = ఎట్టి; కృత్యంబు = కార్యము; ఎవ్వని = ఎవని; చేతన్ = చేత; ప్రేరితుండు = ప్రేరేపింపబడినవాడు; ఐ = అయ్య; ఏ = ఏ; ఇంద్రియంబులన్ = సామర్ధ్యముల; చేసి = వలన; ఏమిటి = ఎందు; కొఱకు = కు; ఎవ్వని = ఎవని; కిన్ = కి; సంబంధి = సంబంధముగలవాడు {నవవిధసంబంధములు - 1పితృపుత్ర సంబంధము 2రక్ష్యరక్షక సంబంధము 3శేషిశేష సంబంధము 4భర్తృభర్త సంబంధము 5జ్ఞాతృజ్ఞేయ సంబంధము 6స్వస్వామి సంబంధము 7శరీరిశరీర సంబంధము 8 ఆధారాధేయ సంబంధము 9భోక్తృభోగ్య సంబంధము}; ఐ = అయ్యి; ఏ = ఏ; స్థలంబునన్ = చోటునందు; ఏ = ఏ; సమయంబున్ = సమయము; అందున్ = లో; ఏమి = ఎట్టి; రూపంబునన్ = ఆకారముతో; ఏ = ఎట్టి; గుణంబునన్ = గుణములతో; అపరంబు = ఇహలోకపువి, శ్రేష్ఠముకానివి; అయిన = ఐన; జనక = తండ్రి; ఆది = మొదలగు; భావంబున్ = తలపులను; ఉత్పాదించి = కలిగించి; పరంబు = పరలోకపువి, శ్రేష్ఠమైనవి; బ్రహ్మ = పరబ్రహ్మతత్వము; ఆది = మొదలగు; భావంబునన్ = భావములగా; రూపాంతరంబున్ = రూపముమారుటను; ఒందించున్ = కలిగించు; అట్టి = అటువంటి; వివిధ = రకరకముల; ప్రకారంబులు = విధానములు; అన్నియున్ = సర్వమును; నిత్యముక్తుండవున్ = శాశ్వతమైనముక్తిగలవాడవు; రక్షకుండవున్ = కాపాడెడివాడవు; ఐన = అయిన; నీవ = నీవే; నీ = నీ యొక్క; అంశంబు = అంశ, భాగము; ఐన = అయిన; పురుషున్ = మానవుని; కిన్ = కి; నీ = నీ యొక్క; అనుగ్రహంబునన్ = దయవలన; కాలంబు = కాలము; చేతన్ = చేత; ప్రేరిత = ప్రేరేపింపబడినది; ఐ = అయ్యి; కర్మమయంబును = కర్మరూపము; బల = బలముతో; యుతంబునున్ = కూడినది; ప్రధాన = ప్రధానము యనెడి; లింగంబును = గురుతుకలది; ఐన = అయిన; మనంబును = మనసును; నీ = నీ యొక్క; మాయన్ = మాయ; సృజియించున్ = సృష్టించును; అవిద్యా = మాయచేత; అర్పిత = కల్పింబడిన; వికారంబును = వికారములుగలది {వికారములు - మార్పువలన కలుగునవి, ఇవి షోడశము (16) ఏకాదశేంద్రియములు మరియు పంచభూతములు}; వేద = వేదములందు; ఉక్త = చెప్పబడిన; కర్మ = కర్మలే; ప్రధానంబును = ముఖ్యముగాగలది; సంసార = సంసారము యనెడి; చక్ర = చక్రము; ఆత్మకంబు = రూపమైనది; ఐన = అగు; ఈ = ఈ; మనమును = మనసును; నిన్నున్ = నిన్ను; సేవింపక = కొలువకుండగ; నియమించి = కట్టడిచేసికొని; తరియింపన్ = తరించుటను; ఒక్కరుండును = ఒకడైనను; సమర్థుండు = నేర్చినవాడు; లేడు = లేడు; విజ్ఞాన = విశిష్ట జ్ఞానముచే; నిర్జిత = జయింపబడిన; బుద్ధిన్ = బుద్ధి; గుణుండవు = గుణములుగలవాడవు; నీ = నీ; వలనన్ = చేత; వశీకృత = స్వాధీనముచేసికొనబడిన; కార్య = కార్యములను, పనులను; సాధన = చక్కజేయ; శక్తి = సామర్థ్యము గలది; ఐన = అయిన; కాలంబున్ = కాలమును; మాయ = మాయ; తోడన్ = తోటి; కూడ = కలిపి; షోడశవికార = షోడశవికారములతో; యుక్తంబు = కూడినది; అయిన = ఐన; సంసార = పునర్జన్మల; చక్రంబున్ = పునరావృతమును; చేయుచుండున్ = కలిగించుచుండును; సంసార = సంసారము యనెడి; దావదహనన్ = కార్చిచ్చుచే; తంతప్యమానుండను = బాధింపబడుచున్నవాడను; అగు = అయిన; నన్నున్ = నన్ను; రక్షింపుము = కాపాడుము.
భావము:- భగవంతుడా! జన్మజన్మలలోనూ సుఖానికి వియోగం, దుఃఖానికి సంయోగం కలుగుతూనే ఉంది. దానితో నా కెప్పుడూ శోకమే ప్రాప్తిస్తూ ఉంది. ఈ శోకాగ్ని నన్నెప్పుడూ నిలువునా కాల్చివేస్తూ ఉంది. సుఖం ఇవ్వదని తెలిసినా, ఈ దేహం మీద అభిమానం వదలటంలేదు. అలా ఆ మోహంతో తిరుగుతున్నాను. అటువంటి నాకు ప్రియుడవు, సఖుడవు, పరదేవతవు సర్వం నీవే. నీ లీలావతారాలే బ్రహ్మగీతాలు. వాటినే నిత్యం పఠిస్తూ కోరికలనుండి విముక్తి పొంది, దుఃఖాలను అధిగమించి నీ పాదపద్మాలను సేవించే భక్తులతో కలిసి ఉంటాను.
చంటిపిల్లాడిని తల్లిదండ్రులూ, రోగిని వైద్యుడు ఇచ్చే ఔషధమూ, సముద్రంలో మునిగిపోతున్న వాడిని నావ ఎలాగైతే రక్షిస్తారో, అలాగే ఈ సంసార తాపత్రయాలతో తప్తులైన వారిని నీవే తప్ప మరెవరు రక్షించలేరు. నీచేత ఉపేక్షింపడిన వానిని, నువ్వు తప్ప మరెవ్వరూ ఉద్ధరించలేరు. లోకంలో ఎవడు, ఏ కార్యం, ఎవరి ప్రేరణతో, ఏ ఇంద్రియాల వలన, దేని కోసం, ఎవరికి సంబంధించి, ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏ రూపంలో, ఏ గుణం వలన నెరవేరుస్తాడో; ఇహలోకంలో జనకభావానికీ, పరలోకంలో బ్రహ్మభావానికీ రూపాంతరం పొందించే ఆ వివిధ ప్రకారాలూ నీవే. సమస్తమూ నీవే, నీవు నిత్యముక్తుడవు. సత్యరక్షకుడవు.
నీ అంశయైన పురుషునిలో నీ అనుగ్రహం వలననే కాలప్రేరితమూ, కర్మమయమూ, బలయుతమూ, ప్రధానలింగమూ అయిన మనస్సును, నీ మాయ సృష్టిస్తుంది. ఈ మనస్సు అవిద్యాజనకమైన వికారమూ, వేదోక్తకర్మ ప్రధానమూ, సంసారచక్రాత్మకమూ అయినది. ఇలాంటి మనస్సుతో నిన్ను సేవించకుండా తరించగల సమర్ధుడు ఎవడూ లేడు. నువ్వు విజ్ఞానం చేత బుద్ధిగుణమును జయించిన వాడవు. కార్యకారణ శక్తినీ కాలం నీ వలననే వశం చేసుకుంటుంది, ఈ కాలం మాయతో కూడి పదహారు విధాలైన వికారాలతో కూడిన సంసార చక్రమును నిర్మించి, త్రిప్పుతూ ఉంటుంది, నేను ఈ సంసార దావానలంలో పడిమాడిపోతున్నాను లోకరక్షామణీ! రక్షించు!

తెభా-7-357-సీ.
నులు దిక్పాలుర సంపదాయుర్విభ-
ములు గోరుదురు భవ్యంబు లనుచు;
వి యంతయును రోషహాసజృంభితమైన-
మాతండ్రి బొమముడి హిమఁ జేసి
విహతంబులగు; నట్టి వీరుండు నీ చేత-
నిమిషమాత్రంబున నేఁడు మడిసె;
కావున ధ్రువములు గావు బ్రహ్మాదుల-
శ్రీవిభవంబులు జీవితములుఁ;

తెభా-7-357.1-తే.
గాలరూపకుఁ డగు నురుక్రమునిచేత
విదళితములగు; నిలువవు; వేయు నేల?
యితర మే నొల్ల నీ మీఁది యెఱుక గొంత
లిగియున్నది గొలుతుఁ గింరుఁడ నగుచు.

టీక:- జనులు = మానవులు; దిక్పాలురన్ = దిక్పాలకాదులను {దిక్పాలకులు - 1ఇంద్రుడు (తూర్పునకు) 2అగ్ని (ఆగ్నేయము) 3యముడు (దక్షిణము) 4నిరృతి (నైరృతి) 5వరుణుడు (పడమర) 6వాయువు (వాయవ్యము) 7కుబేరుడు (ఉత్తరమునకు) 8ఈశానుడు (ఈశాన్యములకు) పాలకులు}; సంపద = సంపదలు, కలిమి; ఆయుర్ = జీవితకాలము; విభవములున్ = వైభవములను, ఇవి సౌఖ్యములవంటివి; కోరుదురు = కోరుచుందురు; భవ్యంబులు = గొప్పవి; అనుచున్ = అనుచు; అవి = అవి; అంతయున్ = అన్నియును; రోష = రోషపూరిత; హాస = నవ్వుచేత; విజృంభితము = చెలరేగినది; ఐన = అయిన; మా = మా యొక్క; తండ్రి = తండ్రి; బొమముడి = ముఖముచిట్లించినమాత్ర; మహిమన్ = ప్రభావము; చేసి = వలన; విహతంబులు = నష్టములు; అగున్ = అగును; అట్టి = అటువంటి; వీరుండు = శూరుడు; నీ = నీ; చేతన్ = వలన; నిమిష = రెప్పపాటుకాలము; మాత్రంబునన్ = మాత్రములోనే; నేడు = ఈ దినమున; మడిసె = మరణించెను; కావునన్ = అందుచేత; ధ్రువములు = నిత్యములు; కావు = కావు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల = మొదలగువారి; శ్రీ = సిరి; విభవంబులు = వైభవములు; జీవితములున్ = బతుకులు; కాల = కాలము; రూపకుడు = స్వరూపమైనవాడు; అగు = అయిన; ఉరుక్రముని = విష్ణుమూర్తి {ఉరుక్రముడు - ఉరు (గొప్ప) క్రముడు (పరాక్రమముగలవాడు), విష్ణువు}; చేత = వలన.
విదళితములు = చీల్చబడినవి; అగున్ = అగును; నిలువవు = నిలబడవు; వేయున్ = అనేకమాటలు; ఏలన్ = ఎందుకు; ఇతరమున్ = మిగిలినవి ఏవియును; ఏన్ = నేను; ఒల్లన్ = ఒప్పుకొనను; నీ = నీ; మీది = అందలి; ఎఱుక = వివేకము; కొంత = కొంచము; కలిగియున్నది = కలదు; కొలతున్ = కొలచెదను; కింకరుండను = సేవకుడను; అగుచు = అగుచు.
భావము:- ప్రజలు సిరి సంపదలూ, ఆయురారోగ్యాలు, వైభవమూ వంటి వాటినే దివ్యమైనవి అనుకుంటారు, వాటిని ఆశించి దిక్పాలకాదులను కొలుస్తారు. మా తండ్రి హిరణ్యకశిపుడు కోపంతో చూసే కడగంటి చూపుతో చెలరేగే భృకుటి ముడి మాత్రం చేతనే, ఆ దిక్పాలురు వణికిపోతారు. అంతటి మహాశూరుడు ఒక్క నిమిషంలో నీ చేతిలో ఇవాళ మరణించాడు. కనుక బ్రహ్మాది రూపధారుల వైభవాలు, సిరిసంపదలు, జీవితాలు ఏవీ శాశ్వతాలు కావు. ఇవన్నీ కాలరూపంలో మెదులుతుండే విష్ణుమూర్తీ! నీ చేతిలో నశించిపోతాయి. ఇవేమీ నాకు వద్దు. నీ మీద కొద్దిగా భక్తి, జ్ఞానం కుదిరాయి.కాబట్టి, నేను నిత్యం సేవకుడిగా నిన్ను సేవిస్తాను.

తెభా-7-358-మత్త.
ఎంమావులవంటి భద్రము లెల్ల సార్థము లంచు మ
ర్త్యుండు రోగనిధాన దేహముతో విరక్తుఁ డుగాక యు
ద్దం మన్మథవహ్ని నెప్పుడుఁ ప్తుఁడై యొకనాఁడుఁ జే
రండు పారము దుష్టసౌఖ్య పరంపరాక్రమణంబునన్.

టీక:- ఎండమావుల = మృగతృష్ణలను {ఎండమావులు - మధ్యాహ్న సమయమున ఎడారాదుల యందు నీటిచాలు వలె కనబడు నీడలు, భ్రాంతులు, మృగతృష్ణ, మరీచిక}; వంటి = పోలెడి; భద్రములు = సౌఖ్యములు; ఎల్లన్ = అన్నియును; సార్థములు = ప్రయోజనసహితములు; అంచున్ = అనుచు; మర్త్యుడు = మరణించువాడు, మనిషి; రోగ = జబ్బులకు; నిధానము = స్థానమైన; దేహము = శరీరము; తోన్ = తోటి; విరక్తుడు = విరాగముచెందినవాడు; కాక = కాకుండగ; ఉద్దండ = తీవ్రమైన; మన్మథ = కామమనెడి; వహ్నిన్ = అగ్నిచేత; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; తప్తుండు = బాధపడెడివాడు; ఐ = అయ్యి; ఒకనాడున్ = ఒకనాటికిని; చేరండు = చేరలేడు; పారము = తీరమును; దుష్ట = చెడ్డవి యగు; సౌఖ్య = సౌఖ్యముల; పరంపరా = సమూహములందు; ఆక్రమణంబునన్ = లోబడుట వలన.
భావము:- ఎండమావుల వంటివి ఈ సుఖాలూ, భోగాలూ. మనిషి ఇవే జీవిత పరమావధి అనుకుంటాడు. తన దేహం దుఃఖ భూయిష్ఠం, రోగగ్రస్తం అయినా సరే, విరక్తి పొందడు. ప్రజ్వలించే కామాగ్నిలో పడి తపించిపోతూ ఉంటాడు. అట్టివాడు ఈ దుష్టసౌఖ్య పరంపరలకు లోబడిపోయి ఎన్నటికీ తీరం చేరలేడు.

తెభా-7-359-ఉ.
శ్రీహిళా, మహేశ, సరసీరుహగర్భుల కైన నీ మహో
ద్దాకరంబుచే నభయదానము జేయవు; నేను బాలుఁడం
దాస వంశ సంభవుఁడ దైత్యుఁడ నుగ్ర రజోగుణుండ ని
స్సీ దయం గరాంబుజము శీర్షముఁజేర్చుట చోద్య మీశ్వరా!

టీక:- శ్రీమహిళా = లక్ష్మీదేవి {శ్రీమహిళ - శ్రీ (సంపదలకు) మహిళ (తల్లి), లక్ష్మి}; మహేశ = పరమశివుడు {మహేశుడు - మహా (గొప్ప) ఈశుడు, శివుడు}; సరసీరుహగర్భుల = బ్రహ్మల {సరసీరుహగర్భుడు - సరసీరుహ (పద్మమున) గర్భుడు (కలిగినవాడు), బ్రహ్మ}; కైనన్ = కి అయినను; నీ = నీ యొక్క; మహా = గొప్ప; ఉద్దామ = స్వతంత్రమైన; కరంబు = చేయి; చేన్ = చేత; అభయ = అభయమును; దానము = ఇచ్చుట; చేయవు = చేయవు; నేను = నేను; బాలుడన్ = చిన్నపిల్లవాడను; తామస = తమోగుణసంగతమైన; వంశ = కులమున; సంభవుడన్ = పుట్టినవాడను; దైత్యుడను = రాక్షసుడను; ఉగ్ర = భయంకరమైన; రజోగుణుండన్ = రజోగుణముగలవాడను; నిస్సీమ = హద్దులేని; దయన్ = కరుణతో; కర = చేయి యనెడి; అంబుజమున్ = పద్మమును; శీర్షమునన్ = తలపైన; చేర్చుట = పెట్టుట; చోద్యము = అద్భుతము; ఈశ్వరా = నరసింహా {ఈశ్వరుడు - ప్రభువు, విష్ణువు}.
భావము:- ప్రభూ! లక్ష్మీ పతి! నరసింహా! పద్మంలో పుట్టిన ఆ బ్రహ్మదేవుడికి అయినా సరే నీ చెయ్యెత్తి తలమీద పెట్టి అభయం ఇవ్వలేదు. నేనేమో చిన్న పిల్లాడిని; తామసగుణంతో కూడిన రాక్షసవంశంలో పుట్టిన వాడిని; దైత్యుడిని; ఉగ్ర మైన రజోగుణం కలవాడను; అలాంటి నా తల మీద, అవ్యాజ్యమైన కృపతో నీ దివ్య భవ్య హస్తాన్ని ఉంచి దీవించావు. ఇది నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది.

తెభా-7-360-వ.
మహాత్మా! సుజనులయిన బ్రహ్మాదు లందును దుర్జనులైన మా యందును సేవానురూపంబుగం బక్షాపక్షంబులు లేక కల్పవృక్షంబు చందంబున ఫలప్రదానంబు జేయుదువు; కందర్ప సమేతం బగు సంసారకూపంబునం గూలుచున్న మూఢజనులం గూడి కూలెడు నేను భవదీయభృత్యుం డగు నారదుని యనుగ్రహంబునం జేసి నీ కృపకుం బాత్రుండ నైతి; నన్ను రక్షించి మజ్జనకుని వధియించుట నా యందులఁ బక్షపాతంబు గాదు; దుష్టదనుజ సంహారంబును శిష్ట భృత్య మునిజన రక్షాప్రకారంబును నీకు నైజగుణంబులు; విశ్వంబు నీవ; గుణాత్మకం బయిన విశ్వంబు సృజియించి యందుం బ్రవేశించి హేతుభూతగుణయుక్తుండవై రక్షకసంహారకారాది నానారూపంబుల నుండుదువు; సదసత్కారణకార్యాత్మకం బయిన విశ్వంబునకు పరమకారణంబు నీవ; నీ మాయచేత వీఁడు దా ననియెడి బుద్ధి వికల్పంబు దోఁచుగాని నీకంటె నొండెద్దియు లేదు; బీజంబు నందు వస్తుమాత్రభూత సౌక్ష్మ్యంబును వృక్షంబు నందు నీలత్వాది వర్ణంబునుం గలుగు తెఱంగున; విశ్వంబునకు నీ యంద జన్మ స్థితి ప్రకాశ నాశంబులుం గలుగు; నీ చేత నయిన విశ్వంబు నీ యంద నిలుపు కొని తొల్లి ప్రళయకాలపారావారంబునఁ బన్నగేంద్రపర్యంకంబునఁ గ్రియారహితుండవై నిజసుఖానుభవంబు జేయుచు నిద్రితుని భంగి యోగనిమీలితలోచనుండవై మెలంగుచుఁ గొంత కాలంబునకు నిజ కాలశక్తిచేతం బ్రేరితంబులై ప్రకృతిధర్మంబు లయిన సత్త్వాదిగుణంబుల నంగీకరించి సమాధిచాలించి విలసించుచున్న నీనాభి యందు వటబీజంబువలన నుద్భవించు వటంబు తెఱంగున నొక్క కమలంబు సంభవించె; నట్టి కమలంబువలన నాల్గుమోముల బ్రహ్మ జన్మించి దిశలు వీక్షించి కమలంబునకు నొండయిన రూపంబు లేకుండుటఁ జింతించి జలాంతరాళంబుఁ బ్రవేశించి జలంబు లందు నూఱు దివ్యవత్సరంబులు వెదకి తన జన్మంబునకు నుపాదానకారణం బైన నిన్ను దర్శింప సమర్థుండు గాక, మగిడి కమలంబుకడకుం జని విస్మయంబు నొంది చిరకాలంబు నిర్భరతపంబు జేసి పృథివి యందు గంధంబు గను చందంబునఁ దన యందు నానాసహస్రవదన శిరో నయన నాసా కర్ణ వక్త్ర భుజ కర చరణుండును బహువిధాభరణుండును మాయాకలితుండును మహాలక్షణలక్షితుండును నిజప్రకాశదూరీకృత తముండును బురుషోత్తముండును నయిన నిన్ను దర్శించె; న య్యవసరంబున.
టీక:- మహాత్మా = గొప్పవాడా; సుజనుల్ = దేవతలు; అయిన = ఐన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలైనవారి; అందును = ఎడలను; దుర్జనులు = రాక్షసులు; ఐన = అయిన; మా = మా; అందును = ఎడలను; సేవా = కొలచినందులకు; అనురూపంబులు = తగినవి; కన్ = అగునట్లు; పక్ష = స్వపక్షమువారు; అపక్షంబులు = పరపక్షమువారను తలపు; లేక = లేకుండగ; కల్పవృక్షంబు = కల్పవృక్షము; చందంబునన్ = విధముగ; ఫల = ఫలితములను; ప్రదానంబు = ఇచ్చుటను; చేయుదువు = చేసెదవు; కందర్ప = మన్మథునితో, కామముతో; సమేతంబు = కూడినది; అగు = అయిన; సంసార = సంసారము యనెడి; కూపంబునన్ = నూతిలో; కూలుచున్న = పడిపోతున్నట్టి; మూఢ = తెలివిహీనులైన; జనులన్ = వారిని; కూడి = కలిసి; కూలెడు = కూలిపోవుచున్న; నేను = నేను; భవదీయ = నీ యొక్క; భృత్యుండు = దాసుండు; అగు = అయిన; నారదుని = నారదుని; అనుగ్రహంబునన్ = దయ; చేసి = వలన; నీ = నీ యొక్క; కృప = కరుణ; కున్ = కు; పాత్రుండను = తగినవాడను; ఐతి = అయితిని; నన్నున్ = నన్ను; రక్షించి = కాపాడి; మత్ = నా యొక్క; జనకుని = తండ్రిని; వధియించుట = చంపుట; నా = నా; అందున్ = ఎడల; పక్షపాతంబు = మొగ్గుచూపుట; కాదు = కాదు; దుష్ట = చెడ్డ; దనుజ = రాక్షసులను; సంహారంబును = చంపుట; శిష్ట = మంచివారు; భృత్య = దాసులు; ముని = మునుల యైన; జన = వారిని; రక్షా = కాపాడెడి; ప్రకారంబును = విధానము; నీ = నీ; కున్ = కు; నైజ = సహజ; గుణంబులు = లక్షణములు; విశ్వంబు = జగత్తు; నీవ = నీవే; గుణా = త్రిగుణముల {త్రిగుణములు - 1సత్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; ఆత్మకంబు = రూపమైనది; అయిన = ఐన; విశ్వంబున్ = జగత్తును; సృజియించి = సృష్టించి; అందున్ = దానిలో; ప్రవేశించి = చేరి; హేతుభూత = కారణభూతమైన; గుణ = లక్షణములతో; యుక్తుండవు = కూడినవాడవు; ఐ = అయ్యి; రక్షక = కాపాడుట; సంహార = చంపుటలను; కార = కలిగించుట; ఆది = మొదలగు; నానా = వివిధరకముల; రూపంబులన్ = రూపములలో; ఉండుదువు = ఉండెదవు; సత్ = సత్తు, సత్యమైనది; అసత్ = అసత్తు, సత్యదూరమైనది; కారణ = కారణము; కార్యా = కార్యముల; ఆత్మకంబు = రూపమైనది; అయిన = ఐన; విశ్వంబున్ = జగత్తును; కున్ = కు; పరమ = ముఖ్య; కారణంబు = హేతువు; నీవ = నీవే; నీ = నీ యొక్క; మాయ = మహిమ; చేతన్ = వలన; వీడు = ఇతడు; తాన్ = తను; అనియెడి = అనెడి; బుద్ధి = బుద్ధి; వికల్పంబున్ = భ్రాంతిచే; తోచున్ = అనిపించును; కాని = తప్పించి; నీ = నీ; కంటెన్ = కంటెను; ఒండు = ఇతరము; ఎద్దియున్ = ఏదియు; లేదు = లేదు; బీజంబున్ = విత్తు; అందున్ = లో; వస్తుమాత్ర = అణువంతది; భూత = అయినట్టి; సౌక్ష్మ్యంబును = చిన్నది యగుటను; వృక్షంబు = చెట్టును; అందున్ = వానిలో; నీలత్వ = నీలపురంగు; ఆది = మొదలగు; వర్ణంబునున్ = రంగులు; కలుగు = కలిగెడి; తెఱంగునన్ = విధముగనే; విశ్వంబున్ = జగత్తున; కున్ = కు; నీ = నీ; అంద = అందే; జన్మ = పుట్టుట; స్థితి = ఉండుట; ప్రకాశ = వృద్ధినొందుట; నాశంబులున్ = నాశనములు; కలుగున్ = కలుగును; నీ = నీ; చేతన్ = వలన; అయిన = గలిగినట్టి; విశ్వంబున్ = జగత్తు; నీ = నీ; అంద = అందే; నిలుపుకొని = ఉంచుకొని; తొల్లి = పూర్వము; ప్రళయకాల = ప్రళయకాలమునందలి; పారావారంబునన్ = (పాల) సముద్రమునందు; పన్నగేంద్ర = ఆదిశేషుడను; పర్యంకంబునన్ = పాన్పుపైన; క్రియా = పనులు; రహితుండవు = మానినవాడవు; ఐ = అయ్యి; నిజ = సత్యమైన; సుఖ = సుఖమును; అనుభవంబున్ = అనుభవించుటను; చేయుచున్ = చేయుచు; నిద్రితుని = నిద్రించువాని; భంగిన్ = వలె; యోగ = యోగధ్యానమున; నిమీలిత = సగముమూయబడిన; లోచనుండవు = కన్నులు గలవాడవు; ఐ = అయ్యి; మెలంగుచున్ = వర్తించుచు; కొంత = కొంత; కాలంబున్ = సమయమున; కున్ = కు; నిజ = నీకుసంబంధించిన; కాల = కాలముయొక్క; శక్తి = ప్రభావము; చేతన్ = వలన; ప్రేరితంబులు = ప్రేరేపింబడినవి; ఐ = అయ్యి; ప్రకృతి = అవిద్యా; ధర్మంబులు = గుణములు; అయిన = ఐన; సత్వాదిగుణంబులన్ = త్రిగుణములను; అంగీకరించి = స్వీకరించి; సమాధిన్ = ధ్యానసమాధిని; చాలించి = ఆపి; విలసించుచున్న = విలసిల్లిన; నీ = నీ యొక్క; నాభి = బొడ్డు; అందున్ = అందు; వట = మఱ్ఱి; బీజంబు = విత్తనము; వలనన్ = వలన; ఉద్భవించు = పుట్టెడి; వటంబు = మఱ్ఱచెట్టు; తెఱంగునన్ = విధముగ; ఒక్క = ఒక; కమలంబు = పద్మము; సంభవించెన్ = పుట్టినది; అట్టి = అటువంటి; కమలంబు = పద్మము; వలనన్ = నుండి; నాల్గు = నాలుగు (4); మోముల = ముఖములుగల; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; జన్మించి = పుట్టి; దిశలు = అన్ని ప్రక్కలకు; వీక్షించి = చూసి; కమలంబున్ = పద్మమున; కున్ = కు; ఒండు = ఇతరమైనది; అయిన = ఐన; రూపంబున్ = ఆకారములు; లేకుండుటన్ = లేకపోవుటను; చింతించి = యోచించి; జల = నీటి; అంతరాళంబున్ = లోనికి; ప్రవేశించి = చేరి; జలంబుల్ = నీటి; అందున్ = లో; నూఱు = వంద (100); దివ్యవత్సరంబులు = దివ్యసంవత్సరములు {దివ్యసంవత్సరము - 360 మానవ సంవత్సరములు (దేవతల దినము - మానవ సంవత్సరము)}; వెదకి = వెతికి, అన్వేషించి; తన = తన యొక్క; జన్మంబున్ = పుట్టుక; కునున్ = కు; ఉపాదాన = ప్రధాన {ఉపాదానకారణము - కుండకు మట్టి బట్టకు దారము ఉపాదానకారణములు}; కారణంబు = హేతువు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; దర్శింపన్ = చూచుటకు; సమర్థుండు = శక్తిగలవాడు; కాక = కాలేక; మగిడి = మరల; కమలంబు = పద్మము; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; విస్మయంబున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; చిర = ఎంతో; కాలంబున్ = కాలము; నిర్భర = భరింపరాని; తపంబున్ = తపస్సును; చేసి = చేసి; పృథివి = భూమి; అందున్ = లో; గంధంబు = వాసన; కను = చూచెడి; చందంబునన్ = విధముగనే; తన = తన; అందున్ = లోననే; నానా = పలు; సహస్ర = వేలకోలది; వదన = మోములు; శిరః = తలలు; నయన = కన్నులు; నాసా = ముక్కులు; కర్ణ = చెవులు; వక్త్ర = నోర్లు; భుజ = భుజములు; కర = చేతులు; చరణుండును = పాదములుగలవాడు; బహు = అనేకమైన; విధ = రకముల; ఆభరణుండును = అలంకారములుగలవాడు; మాయా = మాయతో; కలితుండును = కూడినవాడు; మహా = గొప్ప; లక్షణ = గుణములు; లక్షితుండును = ప్రకాశించెడివాడును; నిజ = తన; ప్రకాశ = ప్రకాశముచేత; దూరీకృత = పోగొట్టబడిన; తముండును = అజ్ఞానముగలవాడు; పురుషోత్తముడును = పురుషులలో శ్రేష్ఠుడు; అయిన = ఐన; నిన్నున్ = నిన్ను; దర్శించెన్ = చూచెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:- మహాత్మా! నరకేసరి రూపదారీ! శ్రీహరీ! బ్రహ్మాది దేవతలకూ, దుష్టాత్ములము అయిన మాకూ ఏమాత్రం పక్షపాతం లేకుండా కొలచిన భక్తి చూసి ఫలితాన్ని ప్రసాదిస్తావు. అలా స్వ పర భేదం లేకుండా అనుగ్రహించటంలో కల్పవృక్షానివి. మన్మథుడు విహరించే సంసారకూపంలో మదాంధులుతో పాటూ నేనూ పడవలసిన వాడను. నీ దాసుడు అయిన నారద మహర్షుల వారి ఉపదేశం వలన నీ కృప పొందగలిగాను. నన్ను రక్షించి నా తండ్రిని శిక్షించటం నా మీది పక్షపాతంతో కాదు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ నీ సహజగుణాలు కదా. విశ్వమూర్తివీ, విరాట్ స్వరూపానివీ నీవే. నీవే త్రిగుణాత్మకమైన విశ్వాన్ని సృష్టిస్తావు. ఆ సృష్టిలో ప్రవేశిస్తావు. కారణభూత రూపా లైన గుణములతో నీవే రక్షకుడవుగా, శిక్షకుడవుగా నానా రూపాలూ ధరిస్తావు, నిత్యా అనిత్య, కార్య కారణ సంబంధం కలిగిన ఈ ప్రపంచానికి మూలకారణం నువ్వే. నీ మాయ చేతనే వీడూ, వాడూ, నేను, నువ్వూ అనే భ్రాంతి కలుగుతుంది. అంతేకాని ఈ విశ్వంలో నువ్వు తప్ప ఇతరమైనదేదీ లేదు.
విత్తనంలో అతి సూక్ష్మరూపంలో వస్తుతత్వం నిక్షిప్తం అయినట్లు, వృక్షంలో నీలం మొదలైన రంగులు దాగి ఉన్నట్లు, విశ్వం నీలోనే జన్మ, స్థితి, ప్రకాశ, నాశనములను పొందుతుంది. నీ చేత సృష్మింపబడిన ఈ విశ్వాన్ని నువ్వు నీలోనే దాచుకుని ప్రళయకాలంలో క్షీరమహాసముద్రం మధ్యలో శేషతల్పం మీద క్రియారహితంగా శయనించి, ఆత్మానందం అనుభవిస్తూ యోగనిద్రలో ఉంటావు. యోగి నిద్రపోతున్నట్లు నిమీలిత నేత్రాలతో శయనించి ఉంటావు. కొంత కాలానికి స్వకీయమైన కాలమహిమ వలన నీవు ప్రకృతి ధర్మాలైన సత్త్వాది గుణాలను స్వీకరించి, సమాధి చాలించి, తేజరిల్లుతుంటావు. అటువంటి సమయంలోనే వటబీజం నుండి మహా వృక్షం వెలువడే విధంగా, నీ నాభి కమలం నుండి ముందుగా ఒక కమలం పుట్టింది. ఆ కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మదేవుడు పుట్టాడు. నాలుగు ముఖాలతో నాలుగువైపులా పరిశీలించాడు, కమలం తప్ప మరొకటేదీ కనబడలేదు. ఆలోచించి జలాలలోకి వెళ్ళి నూరు (100) దివ్య సంవత్సరాలు వెతికి కూడా తన జన్మకు ప్రధానకారణమైన నిన్ను దర్శించలేక పోయాడు. మళ్ళీ కమలం చేరి, ఆశ్చర్యపడి, చాలాకాలం గొప్ప తపస్సు చేసాడు. చివరకు పృథివి యందు గంథాన్ని కనుగొన్నట్లు, తనలో నిన్ను చూడగలిగాడు. అపుడు నువ్వు సహస్ర శీర్షుడవై,సహస్రాక్షుడవై, సహస్ర వదనుండవై, పెక్కువేల నాసికలతో, పెక్కువేల వీనులతో, పెక్కువేల భుజాలతో, అనేకానేక కర, చరణలతో ఒప్పుతూ దర్శనమిచ్చావు. నానాలంకార భూషితుడవు, మాయా మయుడవు, మహాలక్షణ లక్షితుడవు, స్వయం ప్రకాశుడవూ, తమస్సును తొలగించువాడవూ, పురుషోత్తముడవూ అయిన విశ్వవిరాట్ స్వరూపాన్ని బ్రహ్మ దేవుడుదర్శించాడు.

తెభా-7-361-క.
ఘోకవదనుఁడ వై మధు
కైభులం ద్రుంచి నిగమణముల నెల్లం
బాటించి యజున కిచ్చిన
కూస్థుఁడ వీశ్వరుఁడవు కోవిదవంద్యా!

టీక:- ఘోటకవదనుడవు = హయగ్రీవావతారుడవు {ఘోటకవదనుడు - గుఱ్ఱపుముఖము గలవాడు, హయగ్రీవుడు, విష్ణువు}; ఐ = అయ్యి; మధు = మధుడు; కైటభుల్ = కైటభులను; త్రుంచి = చంపి; నిగమ = వేదములు; గణములన్ = సమూహములను; ఎల్లన్ = అన్నిటిని; పాటించి = ఉద్ధరించి; యజున్ = బ్రహ్మదేవుని; కిన్ = కి; ఇచ్చిన = ఇచ్చినట్టి; కూటస్థుడవు = పరమాత్మవు {కూటస్థుడు - సర్వకాలసర్వాస్థలయందు వికారమునొందక ఒక్కతీరున శాశ్వతుడుగానుండు వాడు, కూటము వలె నిర్వికారముగా నుండు వాడు, పరమాత్మ, విష్ణువు}; ఈశ్వరుడవు = ప్రభువవు; కోవిదవంద్యా = నరసింహా {కోవిదవంద్యుడు - కోవిదుల (పండితుల)చే వంద్య (నమస్కరింపబడువాడు), విష్ణువు}.
భావము:- ఓ పరమేశ్వరా! నరసింహా! నీవు పండితులచే వంద్యమానుడవు. ఆ సమయంలో హయగ్రీవావతారుడవై వచ్చి మధుకైటభ రాక్షసులను సంహరించావు. వేదాలను ఉద్ధరించి బ్రహ్మదేవునికి ఇచ్చావు. అటువంటి కూటస్థుడవైన భగవానుడవు నీవు,

తెభా-7-362-వ.
ఇవ్విధంబున గృత త్రేతా ద్వాపరంబులను మూఁడు యుగంబు లందును దిర్యఙ్మానవ ముని జలచరాకారంబుల నవతరించి లోకంబుల నుద్ధరించుచు, ధరించుచు, హరించుచు యుగానుకూల ధర్మంబులం బ్రతిష్ఠించుచు నుండుదువు; దేవా! యవధరింపుము.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ; కృత = కృతయుగము; త్రేత = త్రేతాయుగము; ద్వాపరంబులన్ = ద్వాపరయుగములను; మూడు = మూడు(3); యుగంబులు = యుగములు; అందును = లోను; తిర్యక్ = జంతువుల, వరాహాది; మానవ = మనుష్యల, రామ కృష్ణాది; ముని = మునుల, నారద వ్యాసాది; జలచర = మత్స్యకూర్మ; ఆకారంబులన్ = రూపములలో; అవతరించి = అవతరించి; లోకంబులన్ = లోకములను; ఉద్ధరించుచు = కాపాడుచు; ధరించుచు = పాలించుచు; హరించుచు = నశింపజేయుచు; యుగ = ఆయా యుగములకు; అనుకూల = అనుకూలమైన; ధర్మంబులన్ = ధర్మములను; ప్రతిష్ఠించుచున్ = పాదుకొలుపుచు; ఉందువు = ఉందువు; దేవా = నరసింహా; అవధరింపుము = వినుము.
భావము:- ఇలా ప్రతి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అను మూడు యుగాలలోనూ జంతు, మానవ, ఋషి, జలచరాల ఆకారాలతో అవతరించి లోకాలను ఉద్ధరిస్తూ, హరిస్తూ ఉంటావు; ఆయా యుగాలకు అనుకూలమైన ధర్మాలను ప్రతిష్ఠించి పరిపాలిస్తుంటావు. ఓ నరకేసరి దేవా! ఇంకా విను.

తెభా-7-363-సీ.
కామహర్షాది సంటితమై చిత్తంబు-
వదీయ చింతనదవి చొరదు;
ధురాదిరసముల రగి చొక్కుచు జిహ్వ-
నీ వర్ణనమునకు నిగుడనీదు;
సుందరీముఖములఁ జూడఁగోరెడి జూడ్కి-
తావకాకృతులపైఁ గులుపడదు;
వివిధ దుర్భాషలు వినఁ గోరు వీనులు-
వినవు యుష్మత్కథావిరచనములు;

తెభా-7-363.1-తే.
ఘ్రాణ మురవడిఁ దిరుగు దుర్గంధములకు
వులు గొలుపదు వైష్ణవర్మములకు;
డఁగి యుండవు కర్మేంద్రిములు పురుషుఁ
లఁచు, సవతులు గృహమేధిఁ లఁచు నట్లు.

టీక:- కామ = కోరిక; హర్ష = సంతోషము; ఆది = మొదలైనవాని; సంఘటితము = కూడినది; ఐ = అయ్యి; చిత్తంబు = మనసు; భవదీయ = నీ యొక్క; చింతన = స్మరించెడి; పదవిన్ = ఉన్నతస్థితి, త్రోవ; చొరదు = ప్రవేశించదు; మధుర = తీపి; ఆది = మొదలగు; రసములన్ = రుచులను; మరగి = అలవాటుకుబానిసయై; చొక్కుచున్ = మిథ్యానందమునొందుచు; జిహ్వ = నాలుక; నీ = నీ యొక్క; వర్ణనమున్ = కీర్తించుటకు; నిగుడనీదు = సాగనీయదు; సుందరీ = అందమైన; ముఖులన్ = ముఖము కల వారిని; చూడన్ = చూచుటను; కోరుచున్ = ఆశించుచు; చూడ్కి = చూపులు; తావకీన = నీ యొక్క; ఆకృతుల = రూపముల; పైన్ = మీద; తగులుపడదు = లగ్నముకాదు; వివిధ = అనేకరకములైన; దుర్భాషలున్ = చెడుమాటలను; వినన్ = వినుటను; కోరు = కోరెడి; వీనులు = చెవులు; వినవు = వినవు; యుష్మత్ = నీ యొక్క; కథా = గాథల; విరచనములున్ = చక్కటి రచనలను.
ఘ్రాణము = ముక్కు; ఉరవడిన్ = వేగముగా; తిరుగున్ = స్పందించును; దుర్గంధముల్ = చెడు వాసనలవైపున; కున్ = కు; తవులుగొలుపదు = లగ్నముకానీయదు; వైష్ణవ = విష్ణునకు ప్రీతికరములైన; ధర్మముల = ధర్మముల; కున్ = కు; అణగి = వశములై; ఉండవు = ఉండవు; కర్మేంద్రియములు = పనులుచేసెడి సాధనములు {పంచకర్మేంద్రియములు - 1వాక్ 2పాణి 3పాద 4పాయు 5ఉపస్థులు}; పురుషున్ = మానవుని; కలచున్ = కలతనొందిచును; సవతులు = సవతులు; గృహమేధిన్ = గృహస్థుని; కలచునట్లు = కలతపెట్టువిధముగ.
భావము:- ఈ చిత్తం ఉందే కామం, హర్షం మున్నగు గుణాలతో నిండి ఉండి, నీ చింతన మార్గంలో ప్రవేశించదు; నాలుక మాధుర్యం మొదలైన రుచులకు అలవాటు పడి, నీ నామ స్మరణామృతం రుచి చూడదు; కన్నులు కామినీ ముఖం చూడాలని కోరుతాయి, కానీ నీ దివ్యమంగళమూర్తిని దర్శించటానికి లగ్నం కావు; రకరకాల దుర్భాషలు వినగోరే ఈ చెవులు, నీ కథలను వినవు; నాసిక దుర్వాసనలకేసి పోవటానికి అలవాటు పడి, వైష్ణవ ధర్మ సుగంధాలు ఆఘ్రాణించదు; గృహస్థును సవతులు అందరూ చుట్టుముట్టి వేపుకు తిన్నట్లు, కర్మేంద్రియాలు నిత్యం పురుషుడిని బాధిస్తాయి.

తెభా-7-364-వ.
ఇ వ్విధంబున నింద్రియంబులచేతఁ జిక్కుపడి స్వకీయ పరకీయ శరీరంబు లందు మిత్రామిత్ర భావంబులు జేయుచు జన్మమరణంబుల నొందుచు సంసారవైతరణీ నిమగ్నంబైన లోకంబు నుద్ధరింటుట లోక సంభవ స్థితి లయ కారణుండ వైన నీకుం గర్తవ్యంబు; భవదీయ సేవకులమైన మా యందుఁ బ్రియభక్తు లయిన వారల నుద్ధరింపుము.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = లాగున; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; చేతన్ = వలన; చిక్కుపడి = తగుల్కొని; స్వకీయ = తమయొక్క; పరకీయ = ఇతరులయొక్క; శరీరంబుల్ = దేహముల; అందున్ = ఎడల; మిత్రా = చెలిమి; అమిత్ర = విరోధ; భావంబులన్ = తలపులను; చేయుచున్ = చేయుచు; జన్మ = పుట్టుక; మరణంబులన్ = చావులను; ఒందుచున్ = పొందుచు; సంసార = సంసారము యనెడి; వైతరణిన్ = వైతరణీనది యందు {వైతరణీనది - నరకము దారిలో నుండెడి నిప్పుల యేరు}; నిమగ్నంబు = మునిగినది; ఐన = అగు; లోకంబున్ = లోకములను; ఉద్ధరించుచు = తరింపజేయుట; లోక = లోకముల; సంభవ = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయములకు; కారణుండవున్ = కారణభూతుడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; కర్తవ్యంబు = చేయదగినది; భవదీయ = నీ యొక్క; సేవకులము = దాసులము; ఐన = అయిన; మా = మా; అందున్ = అందలి; ప్రియ = ఇష్టమైన; భక్తులు = భక్తులు; అయిన = ఐన; వారలన్ = వారిని; ఉద్ధరింపుము = కాపాడుము.
భావము:- అలా ఇంద్రియాల వలలో చిక్కుకుని లోకం తన వారి విషయంలో మిత్రత్వం, పరుల విషయంలో శత్రుత్వం పాటిస్తూ ఉంటుంది. జనన మరణ వలయాలలో తిరుగుతూ ఉంటుంది. సంసారం అనే వైతరణిలో మునిగిపోతూ ఉంటుంది ఈ లోకం. ఈ లోకాన్ని ఉద్ధరించాలంటే సృష్టి, స్థితి, లయ కారకుడవైన నీవలననే సాధ్యపడుతుంది. అది నీ కర్తవ్యం కూడా. నీ సేవకులము అయిన మాలో నీ కిష్టమైన భక్తులను ఉద్ధరించు.

తెభా-7-365-మ.
వద్దివ్య గుణానువర్తన సుధాప్రాప్తైక చిత్తుండ నై
బెడన్ సంసరణోగ్రవై తరణికిన్; భిన్నాత్ములై తావకీ
గుణస్తోత్ర పరాఙ్ముఖత్వమున మాయాసౌఖ్యభావంబులన్
సుతిం గానని మూఢులం గని మదిన్ శోకింతు సర్వేశ్వరా!

టీక:- భగవత్ = భగవంతుని {భగవంతునిగుణషట్కములు - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యములు}; దివ్య = దివ్యమైన; గుణ = గుణషట్కము (6); అనువర్తన = అనుసరించుటవలని; సుధా = అమృతము; ప్రాప్త = లభించుటయందలి; ఏక = ఏకాగ్రమైన; చిత్తుండను = చిత్తముగలవాడను; ఐ = అయ్యి; బెగడన్ = బెదరను; సంసరణ = సంసారము యనెడి; ఉగ్ర = భయంకరమైన; వైతరణి = వైతరణీనది; కిన్ = కి; భిన్నాత్మలు = భేదబుద్ధిగలవారు; ఐ = అయ్యి; తావకీయ = నీ యొక్క; గుణ = గుణముల; స్తోత్ర = స్తుతించుటయందు; పరాఙ్ముఖత్వమునన్ = వ్యతిరిక్తతచే; మాయా = మిథ్యా; సౌఖ్య = సుఖములను; భావంబులన్ = భావములలో; సుగతిన్ = ఉత్తమగతిని; కానని = చూడని; మూఢులన్ = అజ్ఞానులను; కని = చూసి; మదిన్ = మనసునందు; శోకింతున్ = దుఃఖించెదను; సర్వేశ్వరా = నరసింహా {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు, విష్ణువు}.
భావము:- ఓ లోకేశ్వరా! భగవంతుడవైన నీ దివ్యభవ్య సుగుణాలను కీర్తించటం అనే అమృత పానం చేశాను. నీ చింతనంతోనే నా చిత్తం నిండిపోయింది. కనుక సంసారమనే దారుణ వైతరణిని చూసి నేను ఏమాత్రం భయపడటం లేదు. కానీ భేదభావంతో, నీ గుణకీర్తనకు విముఖులు అయి, మాయా సౌఖ్యాలలో పడి, దుర్గతి పొందే మూర్ఖులను చూసి బాధపడుతున్నాను.

తెభా-7-366-వ.
దేవా! మునీంద్రులు నిజవిముక్త కాములయి విజనస్థలంబులం దపంబు లాచరింతురు; కాముకత్వంబు నొల్లక యుండువారికి నీ కంటె నొండు శరణంబు లేదు గావున నిన్ను సేవించెదరు; కొందఱు కాముకులు కరద్వయ కండూతిచేతం దనియని చందంబునఁ దుచ్ఛంబయి పశు పక్షి క్రిమి కీట సామాన్యం బయిన మైథునాది గృహ మేది సుఖంబులం దనియక కడపట నతి దుఃఖవంతు లగుదురు; నీ ప్రసాదంబు గల సుగుణుండు నిష్కాముం డయియుండు. మౌనవ్రత జప తప శ్శ్రుతాధ్యయనంబులును నిజధర్మవ్యాఖ్యాన విజనస్థల నివాస సమాధులును మోక్షహేతువులగు; నయిన నివి పదియు నింద్రియజయంబు లేనివారికి భోగార్థంబులయి విక్రయించువారికి జీవనోపాయంబులయి యుండు; డాంభికులకు వార్తాకరంబులై యుండు, సఫలంబులుగావు; భక్తి లేక భవదీయజ్ఞానంబు లేదు; రూపరహితుండ వైన నీకు బీజాంకురంబులకైవడిఁ గారణకార్యంబు లయిన సదసద్రూపంబులు రెండును బ్రకాశమానంబు లగు; నా రెంటి యందును భక్తియోగంబున బుద్ధిమంతులు మథనంబున దారువులందు వహ్నిం గనియెడు తెఱంగున నిన్ను బొడఁగందురు; పంచభూత తన్మాత్రంబులును ప్రాణేంద్రియంబులును మనోబుద్ధ్యహంకార చిత్తంబులును నీవ; సగుణంబును నిర్గుణంబును నీవ; గుణాభిమాను లయిన జననమరణంబుల నొందు విబుధు లాద్యంతంబులు గానక నిరుపాధికుండవైన నిన్నెఱుంగరు; తత్త్వజ్ఞులయిన విద్వాంసులు వేదాధ్యయనాది వ్యాపారంబులు మాని వేదాంతప్రతిపాద్యుండ వగు నిన్ను సమాధివిశేషంబుల నెఱింగి సేవింతు; రదిగావున.
టీక:- దేవా = భగవంతుడా; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; నిజ = సత్యమైన; విముక్త = విడువబడిన; కాములు = కోరికలుగలవారు; అయి = అయ్యి; విజన = నిర్జన; స్థలంబులన్ = ప్రదేశములందు; తపంబున్ = తపస్సును; ఆచరింతురు = చేయుదురు; కాముకత్వంబున్ = కోరికలకులొంగెడిగుణమును; ఒల్లక = అంగీకరింపక; ఉండు = ఉండెడి; వారి = వారి; కిన్ = కి; నీ = నీ; కంటెన్ = కంటెను; ఒండు = ఇతరమైన; శరణంబు = శరణము; లేదు = లేదు; కావునన్ = కనుక; నిన్నున్ = నిన్ను; సేవించెదరు = కొలిచెదరు; కొందఱు = కొంతమంది; కాముకులు = కోరికలుగలవారు; కర = చేతులు; ద్వయ = రెంటిచేతను; కండూతి = దురద; చేతన్ = వలన; తనియని = తృప్తిచెందని; చందంబునన్ = విధముగ; తుచ్ఛంబు = నీచమైనది; అయి = అయ్యి; పశు = పశువులు; పక్షి = పక్షులు; క్రిమి = పురుగులు; కీట = కీటకములకు; సామాన్యంబు = సామాన్యధర్మము; అయిన = ఐన; మైథున = సురతము; ఆదిన్ = మొదలగానిచే; గృహమేధి = గృహస్థులు; సుఖంబులన్ = సుఖములందు; తనియక = తృప్తిచెందక; కడపడటన్ = చివరకు; అతి = మిక్కిలి; దుఃఖవంతులు = దుఃఖముగలవారు; అగుదురు = అగుదురు; నీ = నీ; ప్రసాదంబున్ = అనుగ్రహము; కల = కలిగిన; సుగుణుండు = సజ్జనుడు; నిష్కాముండు = కోరికలులేనివాడు; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; మౌన = మౌనముగానుండెడి; వ్రత = దీక్ష; జప = జపము; తపస్ = తపస్సు; శ్రుత = వేదశాస్త్రములను చదువుకొనుట; అధ్యయనంబులును = మననముచేసికొనుట; నిజ = తన; ధర్మ = ధర్మములను; వ్యాఖ్యాన = వివరించుకొనుచు; విజన = నిర్జన; స్థల = ప్రదేశములందు; నివాస = నివసించుట; సమాధులను = యోగసమాధులు; మోక్ష = ముక్తిపద; హేతువులు = సాధనములు; అగున్ = అయినట్టివి; అయిన = అయిన; ఇవి = ఇవి; పదియున్ = పది (10); ఇంద్రియ = ఇంద్రియ; జయంబు = నిగ్రహము; లేని = లేని; వారి = వారి; కిన్ = కి; భోగ = అనుభవైక; అర్థంబులు = ప్రయోజనములు; అయి = అయ్యి; విక్రయించు = అమ్ముకొను; వారి = వారి; కిన్ = కి; జీవనోపాయంబులు = జీవనోపాధులు; అయి = అయ్యి; డాంభికుల్ = దంభముబూనువారల; కున్ = కు; వార్తా = వృత్తాంత; కరంబులు = జనకములు; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; సఫలంబులు = సార్థకములు {సఫలంబులు - తగిన ప్రయోజనములు గలవి, సార్థకములు}; కావు = కావు; భక్తి = భక్తి; లేక = లేకుండగ; భవదీయ = నీకుసంబంధించిన; జ్ఞానంబు = ఎరుక; లేదు = లేదు; రూప = ఆకారము; రహితుండవు = లేనివాడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; బీజ = విత్తు; అంకురంబుల = మొలకల; కైవడిన్ = వలె; కారణ = కారణము; కార్యంబులు = కార్యములు; అయిన = ఐన; సత్ = శాశ్వతము; అసత్ = భంగురములునైన; రూపంబులు = రూపంబులు; రెండును = రెండును (2); ప్రకాశమానంబులు = తెలియబడుచున్నవి; అగున్ = అగును; ఆ = ఆ; రెంటి = రెంటి; అందునున్ = లోను; భక్తియోగంబునన్ = భక్తియోగముచేత; బుద్ధిమంతులు = జ్ఞానులు; మథనంబునన్ = తరచిచూచుటద్వారా; దారువులు = కట్టెల; అందున్ = లో; వహ్నిన్ = అగ్ని; కనియెడి = తెలిసికొను; తెఱంగునన్ = విధముగ; నిన్నున్ = నిన్ను; పొడగందురు = చూచెదరు; పంచభూత = పృథివ్యాదుల; తన్మాత్రంబులును = లేశములు, పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంధము}; ప్రాణ = పంచప్రాణములు; ఇంద్రియంబులును = దశేంద్రియములు; మనస్ = మనస్సు; బుద్ధి = బుద్ధి; అహంకార = అహంకారము, మమత్వము; చిత్తంబులును = చిత్తములు; నీవ = నీవే; సగుణంబును = గుణసహితమైనవి; నిర్గుణంబును = గుణరహితమైనవి; నీవ = నీవే; గుణ = గుణములందు; అభిమానులు = తగులముగలవారు; అయిన = ఐనచో; జనన = పుట్టుక; మరణంబులన్ = చావులను; ఒందున్ = పొందును; విబుధులు = విద్వాంసులు; ఆది = పుట్టుక; అంతంబులున్ = చావులను; కానక = తెలియక; నిరుపాధింకుడవు = ఉపాధిరహితుండవు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; తత్త్వజ్ఞులు = తత్త్వజ్ఞానముగలవారు; అయిన = ఐన; విద్వాంసులు = పండితులు; వేద = వేదములను; అధ్యయన = అధ్యయనముచేయుట; ఆది = మొదలైన; వ్యాపారంబులు = పనులను; మాని = విడిచి; వేదాంత = వేదాంతములచే; ప్రతిపాద్యుండవు = వర్ణింపబడినవాడవు; అగు = అయిన; నిన్నున్ = నిన్ను; సమాధి = యోగసమాధి యొక్క; విశేషంబులన్ = భేదములచేత; ఎఱింగి = తెలిసికొని; సేవింతురు = కొలచెదరు; అదిగావునన్ = అందుచేత.
భావము:- భగవంతుడా! మునీశ్వరులు కోరికలు వదలి ఏకాంత ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. కామవికారాలు లేనివాళ్లకు నీ కంటె కాంక్షించ దగ్గది మరేదీ ఉండదు; అందుకే నేను నిన్ను సేవిస్తాను. దురద వేసిందని రెండు చేతులతోటి గోక్కున్నా దురద తీరదు, తృప్తి పొందలేరు. అలాగే కాముకులు తుచ్ఛమైన పశుపక్ష్యాదులకూ క్రిమి కీటకాలకూ సామాన్యమైన మైథునాది గృహస్థ సుఖాలలో మునిగితేలుతూ, ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. చివరకు దుఃఖాల పాలవుతారు. నీ దయ పొందిన బుద్ధిమంతుడు నిష్కాముడై దివ్య సుఖం పొందుతాడు.
1) మౌనం, 2) వ్రతం, 3) జపం, 4) తపం, 5) స్మరణం, 6) అధ్యయనం, 7) స్వధర్మం, 8) వ్యాఖ్యానం, 9) ఏకాంతవాసం, 10) ఏకాగ్రత అనే ఈ పది ముముక్షువులకు మోక్షహేతువులు, ఈ పదీ (అ) ఇంద్రియ నిగ్రహం లేనివారికి భోగకారణాలు. (ఇ) విక్రయించే వారికి జీవనోపాయాలు, (ఉ) ఆడంబరులకు కాలక్షేపవిషయాలు. ఇలాంటి వారికి ఈ మోక్షహేతువులు సఫలం కావు. భక్తి భావం మనసులో లేనివారికి నీ తత్వజ్ఞానం అంతుపట్టదు,
రూపంలేని నీ యందు, విత్తనాల నుండి మొలకలు బయలుదేరినట్లు, కార్య కారణాలైన, అసత్తు సత్తు రూపాలు రెండూ తేజరిల్లుతూ ఉంటాయి. బుద్ధిమంతులు భక్తియోగంతో, ఆరణిలో అగ్నిని కనుగొన్నట్లు, ఆ రెంటిలోనూ నిన్ను దర్శిస్తారు. 1) భూమి, 2) జలము, 3) అగ్ని, 4) వాయువు, 5) ఆకాశం అనే పంచభూతాలూ; 1) శబ్దము, 2) స్పర్శము, 3) రూపము, 4) రసము, 5) గంధము అనే పంచతన్మాత్రలూ; 1. ప్రాణము, 2. అపానము, 3. వ్యానము, 4. ఉదానము, 5. సమానము అనే పంచప్రాణాలూ; 1 చెవి, 2 చర్మము, 3 కన్ను, 4 నాలుక, 5 ముక్కు, 6 నోరు, 7 చేయి, 8 కాలు, 9 గుదము, 10 రహస్యేంద్రియము అనే దశేంద్రియాలూ; మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అన్నీ నీవే. సగుణం, నిర్గుణం నీవే. సత్త్వ, రజ, స్తమో గూణాభిమానులూ, జననమరణాలు పొందే వారూ అయిన పండితులు, నీ ఆద్యంతాలు తెలుసుకోలేరు. ఉపాధిరహితుడవు అయిన నిన్ను గుర్తించలేరు. తత్వజ్ఞులైన విద్వాంసులు వేదాధ్యాయాది కర్మలు మాని, వేదాంత ప్రతిపాదకుడవైన నిన్ను ఏకాగ్రచిత్తంతో దర్శించి సేవిస్తుంటారు.

తెభా-7-367-సీ.
నీ గృహాంగణభూమి నిటలంబు మోవంగ-
మోదించి నిత్యంబు మ్రొక్కఁడేని
నీ మంగళస్తవ నికర వర్ణంబులు-
లుమాఱు నాలుకఁ లుకఁడేని
నీ యధీనములుగా నిఖిలకృత్యంబులు-
ప్రియభావమున సమర్పింపఁడేని
నీ పదాంబుజముల నిర్మల హృదయుఁడై-
చింతించి మక్కువఁ జిక్కఁడేని

తెభా-7-367.1-తే.
నిన్నుఁ జెవులార వినఁడేని నీకు సేవ
చేయరాఁడేని బ్రహ్మంబు జెందఁ గలఁడె?
యోగి యైనఁ దపోవ్రతయోగి యైన
వేది యైన మహాతత్త్వవేది యైన.

టీక:- నీ = నీ యొక్క; గృహ = గుడి; అంగణ = ముంగిలి; భూమి = ప్రదేశమునందు; నిటలంబు = నొసలు; మోవంగ = తాకునట్లు; మోదించి = ముదమంది; నిత్యంబున్ = ప్రతిదినము; మ్రొక్కడేని = నమస్కరింపనిచో; నీ = నీ యొక్క; మంగళ = శుభకరములైన; స్తవ = స్తోత్రముల; నికర = సమూహముయొక్క; వర్ణంబులు = అక్షరసముదాయము; పలు = అనేక; మాఱు = సార్లు; నాలుకన్ = నాలుకతో; పలుకడేని = పలుకనిచో; నీ = నీకు; అధీనములు = సమర్పించినవి; కాన్ = అగునట్లు; నిఖిల = సర్వ; కృత్యంబులు = కార్యములు; ప్రియ = ఇష్టపూర్వక; భావమునన్ = తలపులతో; సమర్పింపడేని = సమర్పించనిచో; నీ = నీ; పద = పాదములు యనెడి; అంబుజములన్ = పద్మములను; నిర్మల = స్వచ్ఛమైన; హృదయుడు = హృదయముగలవాడు; ఐ = అయ్యి; చింతించి = ధ్యానించి; మక్కువ = ప్రేమయందు; చిక్కడేని = తగుల్కొననిచో.
నిన్నున్ = నిన్ను; చెవులార = చెవులనిండుగా; వినడేని = విననిచో; నీ = నీ; కున్ = కు; సేవన్ = పూజ; చేయన్ = చేయుటకు; రాడేని = రాకపోయినచో, సిద్దపడనిచో; బ్రహ్మంబున్ = పరబ్రహ్మస్వరూపమైననిన్ను; చెందగలడే = పొందగలడా ఏమి, లేడు; యోగి = యోగసాధనచేయువాడు; ఐనన్ = అయినను; తపోవ్రతయోగి = తపస్సు వ్రతముగల యోగి; ఐనన్ = అయినను; వేది = వేదములుచదివినవాడు; ఐనన్ = అయినను; మహా = గొప్ప; తత్త్వవేది = తత్త్వజ్ఞానముగలవాడు; ఐనన్ = అయినను.
భావము:- నీ గుడి ప్రాంగణంలో నిత్యం నీకు తలవంచి మ్రొక్కని వాడు; మంగళకరాలైన నీ కీర్తనలు పలుమార్లు నాలుకతో పలుకని వాడూ; కర్మలు సమస్తం నీ అధీనం అని భక్తిభావంతో తలచి సమర్పణ చేయనివాడూ; నీ పాదపద్మాలు నిర్మలమైన మనస్సుతో నిత్యం ధ్యానించి పరవశించని వాడూ; చెవులారా నీ సంకీర్తనలు వినని వాడూ; చేతులారా నీ సేవ జేయనివాడూ; యోగి అయినా, మహా తపశ్శక్తిశాలి యైన యోగి అయినా, ఎంతటి పండితుడైనా, ఎంతటి తత్వవేత్త అయినా ఎప్పటికీ పరమపదం అందుకోలేడు.

తెభా-7-368-వ.
కావున భవదీయ దాస్యయోగంబుఁ గృపజేయు"మని ప్రణతుండైన ప్రహ్లాదుని వర్ణనంబులకు మెచ్చి నిర్గుణం డయిన హరి రోషంబు విడిచి; యిట్లనియె.
టీక:- కావునన్ = కనుక; భవదీయ = నీ యొక్క; దాస్య = సేవచేసికొనుట; యోగంబున్ = లభించుతెరువు; కృపజేయుము = దయతోకలిగింపుము; అని = అని; ప్రణతుండు = నమస్కరించువాడు; ఐన = అయిన; ప్రహ్లాదుని = ప్రహ్లాదుని; వర్ణనంబుల = స్తోత్రముల; కున్ = కు; మెచ్చి = మెచ్చుకొని; నిర్గుణుండు = రాగద్వేషాదులు లేనివాడు {రాగద్వేషాదులు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10 అసూయ 11దంభము 12దర్పము 13 అహంకారము}; అయిన = ఐన; హరి = విష్ణువు; రోషంబున్ = కోపమును; విడిచి = వదలివేసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- నీ సేవ చేయని వాడు పరమ పదం చేరలేడు కనుక, నీ దాస్యం చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించు” అని ప్రహ్లాదుడు వందన మాచరించాడు. ఆ సంస్తుతికి సంతోషించి, గుణరహితుడూ భగవంతుడూ నైన శ్రీనృసింహస్వామి రోషం మాని ప్రసన్నుడై నవ్వుతూ ఇలా అన్నాడు.

తెభా-7-369-శా.
"సంతోషించితి నీ చరిత్రమునకున్ ద్భద్ర మౌఁగాక నీ
యంర్వాంఛితలాభ మెల్లఁ గరుణాత్తుండనై యిచ్చెదం
జింతం జెందకు భక్తకామదుఁడ నే సిద్ధంబు దుర్లోక్యుఁడన్
జంతుశ్రేణికి నన్నుఁ జూచినఁ బునర్జన్మంబు లే దర్భకా!

టీక:- సంతోషించితి = ముదమునందితిని; నీ = నీ యొక్క; చరిత్రమున్ = నడవడిక; కున్ = కు; సత్ = మంచి; భద్రము = శుభములు; ఔగాక = కలుగుగాక; నీ = నీ యొక్క; అంతర్ = మనసులోపల; వాంఛిత = కోరుచున్న; లాభము = ప్రయోజనములు; ఎల్లన్ = అన్నిటిని; కరుణా = కృప; ఆయత్తుండను = కలిగినవాడను; ఐ = అయ్యి; ఇచ్చెదన్ = ఇచ్చెదను; చింతంజెందకు = విచారపడకు; భక్త = భక్తుల యొక్క; కామదుడన్ = కోర్కెలతీర్చువాడను; నేన్ = నేను; సిద్ధంబు = తప్పకజరుగునది; దుర్లోక్యుండన్ = చూడశక్యముగానివాడను; జంతు = జీవ; శ్రేణి = కోటి; కిన్ = కి; నన్నున్ = నన్ను; చూచినన్ = దర్శించినమాత్రమున; పునర్జన్మంబు = మరలపుట్టుట; లేదు = ఉండదు; అర్భకా = బాలుడ.
భావము:- “బాలకా! ప్రహ్లాదా! నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది. నీ ప్రవర్తనకు చాలా సంతోషించాను. నీకు మిక్కిలి శుభం కలుగుతుంది. నేను భక్తుల కోరికలు తప్పక తీర్చే వాడిని. నీ మనసులో వాంఛించే వరాలను దయాహృదయుడనై అనుగ్రహిస్తాను. ఏ దిగులూ పెట్టుకోకు. నేను చూడశక్యంకాని వాడినే. కాని ప్రాణి కోటికి నన్ను ఒకసారి చూస్తే చాలు, పునర్జన్మ ఉండదు.

తెభా-7-370-ఆ.
కలభావములను సాధులు విద్వాంసు
ఖిల భద్రవిభుఁడ నైన నన్నుఁ
గోర్కు లిమ్మటంచుఁ గోరుదు రిచ్చెదఁ
గోరు మెద్ది యైనఁ గుఱ్ఱ! నీవు."

టీక:- సకల = అఖిలమైన; భావములన్ = విధములచేతను; సాధులు = సజ్జనులు, దేవతలు; విద్వాంసులు = జ్ఞానులు; అఖిల = సమస్తమైన; భద్ర = క్షేమకరమైన; విభుడన్ = ప్రభువును; ఐన = అయిన; నన్నున్ = నన్ను; కోర్కులు = కోరికలు; ఇమ్ము = ఇవ్వవలసినది; అని = అని; అటంచున్ = అనుచు; కోరుదురు = అడిగెదరు; ఇచ్చెదన్ = ఇచ్చెదను; కోరుము = కోరుకొనుము; ఎద్ది = ఏది; ఐనన్ = అయినను; కుఱ్ఱ = పిల్లవాడ; నీవు = నీవు.
భావము:- సకల శుభప్రదాతను నేను. నన్ను సాధువులూ, విద్వాంసులూ ఎన్నెన్నో రకాల కోరికలు కోరుతుంటారు. వారి కోరికలు తీరుస్తుంటాను. వత్సా! నీవు ఏదైనా కోరుకో, తప్పకుండా ఇస్తాను.”

తెభా-7-371-వ.
అని పరమేశ్వరుండు ప్రహ్లాదునియందుఁ గల సకామత్వంబుఁ దెలియుకొఱకు వంచించి యిట్టానతిచ్చిన; నతండు నిష్కాముండైన యేకాంతి గావునఁ గామంబు భక్తియోగంబునకు నంతరాయం బని తలంచి యిట్లనియె; "నుత్పత్తి మొదలు కామాద్యనుభవాసక్తి లేని నాకు వరంబు లిచ్చెదనని వంచింపనేల? సంసారబీజంబులును హృదయబంధకంబులు నయిన గామంబులకు వెఱచి ముముక్షుండనై సేమంబుకొఱకు నేమంబున నిన్నుం జేరితి; కామంబులును నింద్రియంబులును మనశ్శరీర ధైర్యంబులు మనీషా ప్రాణ ధర్మంబులును లజ్జాస్మరణలక్ష్మీసత్యతేజోవిశేషంబులును నశించు; లోకంబు లందు భృత్యు లర్థకాము లయి రాజుల సేవింతురు రాజులుం బ్రయోజనంబు లర్థించి భృత్యులకు నర్థంబు లొసంగుదు; రవ్విధంబు గాదు; నాకుం గామంబు లేదు; నీకుం బ్రయోజనంబు లే; దయినను దేవా! వరదుండ వయ్యెద వేనిఁ గామంబులు వృద్ధిఁబొందని వరంబుఁ గృపజేయుము; కామంబులు విడిచిన పురుషుండు నీతోడ సమాన విభవుం డగు నరసింహ! పరమాత్మ! పురుషోత్తమ!"యని ప్రణవ పూర్వకంబుగా నమస్కరించిన హరి యిట్లనియె.
టీక:- అని = అని; పరమేశ్వరుండు = నరసింహుడు {పరమేశ్వరుడు - పరమ (సర్వాతీతమైన) ఈశ్వరుడు, విష్ణువు}; ప్రహ్లాదునిన్ = ప్రహ్లాదుని; అందు = ఎడల; కల = ఉన్నట్టి; సకామత్వంబున్ = కోరికలి గలిగి యుండుట; తెలియు = తెలుసుకొనుట; కొఱకు = కోసము; వంచించి = వక్రీకరించి, డొంకతిరుగుడుగా; ఇట్లు = ఈ విధముగ; ఆనతిచ్చినన్ = చెప్పగా; అతండు = అతడు; నిష్కాముండు = కోరికలులేనివాడు; ఐన = అయినట్టి; ఏకాంతి = ఆత్మనిష్ఠాపరుడు {ఏకాంతి - ఏక (ఒకే) అంతి (అంత్య ఫలము, ముక్తి) మాత్రము కోరెడివాడు, ఆత్మనిష్ఠాపరుడు}; కావునన్ = కనుక; కామంబు = కోరికలు; భక్తి = భక్తియందు; యోగంబున్ = కూడియుండుట; కున్ = కి; అంతరాయంబు = విఘ్నములు; అని = అని; తలచి = భావించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఉత్పత్తి = పుట్టినది; మొదలు = మొదలుపెట్టి; కామ = కోరికలు {కామాది - అరిషడ్వర్గములు, 1కామము 2క్రోధము 3లోభము 4మోహము 5మదము 6మాత్సర్యము}; ఆది = మొదలైనవాని; అనుభవ = అనుభవించుట యందు; ఆసక్తి = ఆసక్తి; లేని = లేనట్టి; నా = నా; కున్ = కు; వరంబుల్ = వరములను; ఇచ్చెదన్ = ఇచ్చెదను; అని = అని; వంచింపన్ = మోసపుచ్చుట; ఏల = ఎందులకు; సంసార = సంసారమునకు; బీజములునున్ = కారణములైనవి; హృదయబంధకంబులు = తగులములు {హృదయబంధకములు - హదయమును జ్ఞానము వంక పోనీయక కట్టివేసెడివి, తగులములు}; అయిన = ఐన; కామంబుల్ = కోరికల; కున్ = కు; వెఱచి = బెదరి; ముముక్షుండను = ముక్తిబొందకోరువాడను; ఐ = అయ్యి; సేమంబు = క్షేమము; కొఱకు = కోసము; నేన్ = నేను; నేమంబునన్ = నియమములతో; నిన్నున్ = నిన్ను; చేరితిన్ = ఆశ్రయించితిని; కామంబులును = కోరికలు; ఇంద్రియములు = ఇంద్రియములు; మనస్ = మనస్సు; శరీర = దేహము; ధైర్యంబులున్ = బలములు; మనీషా = ప్రజ్ఞలు, బుద్ధి; ప్రాణ = ప్రాణము; ధర్మంబులును = న్యాయములు; లజ్జ = సిగ్గు; స్మరణ = జ్ఞప్తి; లక్ష్మీ = సంపదలు; సత్య = సత్యము; తేజస్ = వర్చస్సు; విశేషంబులు = అతిశయములు; నశించు = క్షయమగు; లోకంబులు = లోకముల; అందున్ = లో; భృత్యులు = సేవకులు; అర్థ = ధనము; కాములు = కోరువారు; ఐ = అయ్యి; రాజులన్ = ప్రభువులను; సేవింతురు = కొలచెదరు; రాజులున్ = ప్రభువులును; ప్రయోజనంబులు = కావలసిన కార్యములు; అర్థించి = కోరి; భృత్యుల్ = సేవకుల; కున్ = కు; అర్థంబులు = ధనము,ప్రయోజనములను; ఒసంగుదురు = ఇచ్ఛెదరు; అవ్విధంబు = అలా; కాదు = కాదు; నా = నా; కున్ = కు; కామంబు = కోరదగినది; లేదు = లేదు; నీ = నీ; కున్ = కు; ప్రయోజనంబు = కావలసిన కార్యము; లేదు = లేదు; అయినను = ఐనను; దేవా = భగవంతుడ; వరదుండవు = వరములనిచ్చువాడవు; అయ్యెదవేనిని = అగుదునన్నచో; కామంబులు = కోరికలు; వృద్ధి = పెరగుట; పొందని = పొందని; వరంబున్ = వరములను; కృపజేయుము = దయతోనిమ్ము; కామంబులు = కోరికలు; విడిచిన = వదలివేసినచో; పురుషుండు = మానవుడు; నీ = నీ; తోడన్ = తోటి; సమాన = సమానమైన; విభవుండు = వైభవముగలవాడు; అగున్ = అగును; నరసింహ = నరసింహ {నరసింహుడు - నరుడు సింహము రూపములుకూడియున్నవాడు, విష్ణువు}; పరమాత్మ = నరసింహ {పరమాత్మ - పర (సర్వాతీతమైన) ఆత్మ, విష్ణువు}; పురుషోత్తమ = నరసింహ {పురుషోత్తముడు - పురుషులలో (కారణభూతులలో) ఉత్తముడు, విష్ణువు}; అని = అని; ప్రణవ = ఓంకారము; పూర్వకంబు = ముందుండునది; కాన్ = అగునట్లు; నమస్కరించినన్ = నమస్కరించగా; హరి = నరసింహుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా పరమేశ్వరుడు నరకేసరి, ప్రహ్లాదుడు కోరికలను జయించాడా లేదా అన్నది తెలియటం కోసం కపటంగా “వరాలు కోరుకో ఇస్తాను” అని అన్నాడు. ప్రహ్లాదుడు జితేంద్రియులలో అగ్రగణ్యుడు, ఏకాంత భక్తుడు కాబట్టి, భక్తియోగానికి కోరికలు ఆటంకం అని నిశ్చయించుకుని స్వామితో ఇలా పలికాడు “ఓ దేవదేవా! పుట్టుక నుండీ కామాది అనుభవాలలో ఆసక్తి లేని నాకు వరాలు ఇస్తానని పరీక్షిస్తున్నావా? సంసార బీజములైన కామములు హృదయగ్రంథులు. అటువంటి కామములకు భయపడి నేను మోక్షార్థినై, క్షేమాన్ని కోరుతున్నవాడనై, నియమ వంతుడనై నీ సన్నిధికి వచ్చాను. కోరికలూ, ఇంద్రియాలూ, మనస్సు, శరీరం, ధైర్యం, బుద్ధి, ప్రాణం, ధర్మం, లజ్జ, స్మరణం, సిరిసంపదలు, తేజో విశేషాలూ సమస్తం నశించేవే. ఇది సత్యం. లోకంలో సేవకులు ధనంకోసం రాజులను ఆశ్రయిస్తారు. రాజులు తమ ప్రయోజనాల కోసం సేవకులకు ధనం ఇచ్చి పోషిస్తారు. తండ్రీ! నరసింహా! పరమాత్మా! పరమపురుషా! నా సేవను ఆ విధంగా భావించకు. నాకా ఏ కోరికలు లేవు, నీకా నా వల్ల ప్రయోజనమూ లేదు. అయినా నాకు వరప్రదానం చేస్తానంటే, కామములు వృద్ధిపొందని వరం దయతో అనుగ్రహించు. కామములు విడిచినవాడు, నీతో సమానమైన వైభవం పొందుతాడు” అని భక్తితో ప్రణవ పూర్వకంగా నమస్కారం చేసాడు ప్రహ్లాదుడు. అంతట భగవంతుడైన నరసింహస్వామి ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు.

తెభా-7-372-సీ.
"నీ యట్టి సుజ్ఞాన నిపుణు లేకాంతులు-
గోర్కులు నా యందుఁ గోర నొల్ల;
ట్లైనఁ బ్రహ్లాద! సురేంద్రభర్తవై-
సాగి మన్వంతర మయ మెల్ల
నిఖిలభోగంబులు నీవు భోగింపుము-
ల్యాణబుద్ధి నా థలు వినుము;
కలభూతములందు సంపూర్ణుఁ డగు నన్ను-
జ్ఞేశు నీశ్వరు నాత్మ నిలిపి

తెభా-7-372.1-ఆ.
ర్మచయము లెల్ల ఖండించి పూజన
మాచరింపు మీశ్వరార్పణముగ;
భోగముల నశించుఁ బుణ్యంబు; వ్రతములఁ
బాప సంచయములు పాయు నిన్ను.

టీక:- నీ = నీ; అట్టి = వంటి; సుజ్ఞాన = మంచిజ్ఞానమునందు; నిపుణులు = నేర్పుగలవారు; ఏకాంతులున్ = అంతరంగభక్తులు; నా = నా; అందున్ = నుండి; కోరన్ = కోరుకొనుటను; ఒల్లరు = అంగీకరించరు; అట్లైనన్ = అలా అయినప్పటికిని; ప్రహ్లాద = ప్రహ్లాదుడ; అసురేంద్ర = రాక్షసులకు; భర్తవు = రాజు యైనవాడవు; ఐ = అయ్యి; సాగి = ప్రవర్తిల్లి; మన్వంతర = మన్వంతర {మన్వంతరంబు - ఒక మనువు పాలించు కాలపరిమితి, డెబ్బైయొక్క మహాయుగములు}; సమయము = కాలము; ఎల్లన్ = అంతయును; నిఖిల = సమస్తమైన; భోగంబులున్ = అనుభవింపదగినవానిని {అష్టభోగములు - 1నిథి 2నిక్షేపము 3జల 4పాషాణ 5అక్షీణ 6ఆగామి 7సిద్ధ 8సాధ్యములు మరియొకవిధమున 1గృహము 2శయ్య 3వస్త్రము 4ఆభరణము 5స్త్రీ 6పుష్పము 7గంధము 8తాంబూలము}; నీవు = నీవు; భోగింపుము = అనుభవింపుము; కల్యాణ = మంగళకరమైన; బుద్ధిన్ = బుద్ధితో; నా = నా గురించిన; కథలున్ = గాథలను; వినుము = వినుము; సకల = సర్వ; భూతములు = జీవుల; అందున్ = లోను; సంపూర్ణుడు = నిండి ఉండు వానిని; అగు = అయిన; నన్నున్ = నన్ను; యజ్ఞేశున్ = నారాయణుని; ఈశ్వరున్ = నారాయణుని; ఆత్మన్ = మనసున; నిలిపి = ధరించి.
కర్మ = కర్మముల; చయమున్ = సమూహములను; ఎల్లన్ = సమస్తమును; ఖండించి = త్రుంచి; పూజనము = అర్చన, కైంకర్యము; ఆచరింపుము = చేయుము; ఈశ్వర = భగవతునికి; అర్పణము = సమర్పించినది; కాన్ = అగునట్లు; భోగములన్ = బోగములవలన; నశించున్ = తొలగిపోవును; పుణ్యంబున్ = పుణ్యములు; వ్రతములన్ = దీక్షలతోటి; పాప = పాపములు; సంచయములు = కూడబెట్టినవి; పాయున్ = తొలగిపోవును; నిన్నున్ = నిన్ను.
భావము:- “ప్రహ్లాదా! నీ వంటి మంచి జ్ఞాన సంపన్నులు, ఏకాంత భక్తులు, కోరికలు ఏవీ కోరుకోరు. అయినా కూడా నీవు దానవ చక్రవర్తివి అయి మన్వంతరం కాలం సకల భోగాలూ అనుభవించు. శుభప్రదమైన బుద్ధితో నా గాథలు విను. సర్వ భూతాతంరాత్ముడను అయిన నన్ను యజ్ఞేశునిగా, పరమేశ్వరునిగా తెలుసుకుని ఆత్మలో నిత్యం ఆరాధించు. కర్మబంధాలు ఖండిచి, ఈశ్వరార్పణ బుద్ధితో నన్ను పూజించు. సుఖాలనూ అనుభవించుట చేత పూర్వం సంపాదించిన పుణ్యాలు వ్యయం అవుతాయి. వ్రతాల వలన పాపాలు తొలగిపోతాయి.”

తెభా-7-373-వ.
మఱియు నటమీఁదటఁ గాలవేగంబునం గళేబరంబు విడిచి త్రైలోక్యవిరాజ మానంబును దివిజరాజజేగీయమానంబును బరిపూరిత దశదిశంబును నయిన యశంబుతోడ ముక్తబంధుండవై నన్ను డగ్గఱియెదవు; వినుము.
టీక:- మఱియున్ = ఇంకను; అటమీదటన్ = ఆ పైన; కాల = కాలము యొక్క; వేగంబునన్ = గతిచే; కళేబరంబున్ = ప్రాణముమినహాదేహము; విడిచి = వదలివేసి; త్రైలోక్య = ముల్లోకములందును; విరాజమానంబును = మిక్కిలి ప్రకాశించునది; దివిజరాజ = దేవేంద్రునిచే {దివిజరాజు - దివిజుల (దేవతల)కు రాజు, దేవేంద్రుడు}; జేగీయమానంబునున్ = పొగడబడునది; పరిపూరిత = పూర్తిగానిండిన; దశదిశంబునున్ = పదిదిక్కులుగలది {దశదిశలు - అష్టదిక్కులు (8) మరియు కింద పైన}; అయిన = అయిన; యశంబు = కీర్తి; తోడన్ = తోటి; ముక్త = వీడిన; బంధుండవు = బంధనములుగలవాడవు; ఐ = అయ్యి; నన్నున్ = నన్ను; డగ్గఱియెదవు = చేరెదవు; వినుము = వినుము.
భావము:- అటు పిమ్మట, కాలప్రవాహానికి లోబడి, కళేబరం వదలిపెట్టి, ముల్లోకాల లోనూ ప్రకాశించేదీ, దేవేంద్రుని చేత పొగడబడేదీ, దశదిక్కులందు పరిపూర్ణంగా నిండి ఉండేదీ అయిన గొప్ప కీర్తితో నా సాన్నిధ్యం పొందుతావు.

తెభా-7-374-ఆ.
రుఁడు ప్రియముతోడ నాయవతారంబు,
నీ యుదారగీత నికరములను
మానసించునేని ఱి సంభవింపఁడు
ర్మబంధచయముఁ డచిపోవు.

టీక:- నరుడు = మానవుడు; ప్రియము = ఆదరము; తోడన్ = తోటి; నా = నా యొక్క; అవతారంబున్ = అవతారమును; నీ = నీ యొక్క; ఉదార = గొప్ప; గీత = కీర్తిగానముల; నికరములనున్ = సమూహములను; మానసించునేని = తలపోసినచో; మఱి = ఇంక; సంభవింపడు = పుట్టడు; కర్మ = కర్మముల; బంధ = బంధనముల; చయమున్ = సర్వమును; కడచిపోవు = దాటేయును.
భావము:- మానవుడు నా ఈ నారసింహావతారాన్నీ, నీవు చేసిన ఈ సంస్తుతినీ నిండుగా మనసులో నిలుపుకుంటే, వానికి పునర్జన్మ ఉండదు. వాడు కర్మ బంధాలను దాటేస్తాడు.”

తెభా-7-375-వ.
అనినఁ బ్రహ్లాదుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = ఇలా; అనియె = అనెను.
భావము:- అలా పరమపురుషుడు పలుకగా. ప్రహ్లాదుడు ఇలా అన్నాడు

తెభా-7-376-సీ.
"దంష్ట్రివై తొల్లి సోరుని హిరణ్యాక్షు-
నీవు చంపుటఁ జేసి నిగ్రహమున
మా తండ్రి రోషనిర్మగ్నుఁడై సర్వలో-
కేశ్వరుఁ బరము ని న్నెఱుఁగ లేక
రిపంథి పగిది నీ క్తుండ నగు నాకు-
పకారములు జేసె తఁడు నేఁడు
నీ శాంతదృష్టిచే నిర్మలత్వము నొందెఁ-
గావున బాప సంఘంబువలనఁ

తెభా-7-376.1-తే.
బాసి శుద్ధాత్మకుఁడు గాఁగ వ్యగాత్ర!
రము వేఁడెద నా కిమ్ము నజనేత్ర!
క్తసంఘాత ముఖపద్మ ద్మమిత్ర!
క్త కల్మషవల్లికా టు లవిత్ర!"

టీక:- దంష్ట్రివి = వరాహాతారుడవు {దంష్ట్రి - దంష్ట్రములు (కోరపళ్ళు) గలది వరాహము యొక్క రూపము ధరించినవాడు, వరహావతారుడు, విష్ణువు}; ఐ = అయ్యి; తొల్లి = పూర్వము; సోదరునిన్ = సహోదరుని; హిరణ్యాక్షున్ = హిరణ్యాక్షుని; నీవు = నీవు; చంపుటన్ = సంహరించుట; చేసి = వలన; నిగ్రహమున = తిరస్కారముతో; మా = మా యొక్క; తండ్రి = తండ్రి; రోష = కోపమునందు; నిర్మగ్నుడు = పూర్తిగా మునిగినవాడు; ఐ = అయ్యి; సర్వలోకేశ్వరున్ = హరిని {సర్వలోకేశ్వరుడు - సమస్తమైన లోకములకు ప్రభువు, విష్ణువు}; పరమున్ = హరిని {పరము - పరాత్పరుడు, సర్వాతీతుడు, విష్ణువు}; నిన్నున్ = నిన్ను; ఎఱుగన్ = తెలియ; లేక = లేకపోవుటచే; పరిపంథి = శత్రువు {పరిపంథి - పరి (ఎదుటి) పంథి (పక్షమువాడు), శత్రువు}; పగిదిన్ = వలె; నీ = నీ; భక్తుండను = భక్తుడను; అగు = అయిన; నా = నా; కున్ = కు; అపకారములు = కీడు; చేసెన్ = చేసెను; అతడు = అతడు; నేడు = ఈ దినమున; నీ = నీ యొక్క; శాంత = శాంతింపజేసెడి; దృష్టి = చూపుల; చేన్ = వలన; నిర్మలత్వమున్ = పవిత్రతను; ఒందెన్ = పొందెను; కావున = కనుక; పాప = పాపముల; సంఘంబు = సమూహముల; వలనన్ = నుండి; పాసి = వీడినవాడై;
శుద్ద = స్వచ్ఛమైన; ఆత్మకుండు = ఆత్మకలవాడు; కాగన్ = అగునట్లు; భవ్యగాత్ర = నరసింహ {భవ్యగాత్రుడు - దివ్యమంగళమైన గాత్ర (దేహముగలవాడు), విష్ణువు}; వరమున్ = వరమును; వేడెదన్ = కోరెదను; నా = నా; కున్ = కు; ఇమ్ము = ఇమ్ము; వనజనేత్ర = నరసింహ {వనజనేత్రుడు - వనజ (పద్మము) వంటి నేత్ర (కన్నులుగలవాడు), విష్ణువు}; భక్తసంఘాతముఖపద్మపద్మమిత్ర = నరసింహ {భక్తసంఘాతముఖపద్మపద్మమిత్ర - భక్త (భక్తుల) సంఘాత (సమూహముల) యొక్క ముఖములు యనెడి పద్మ (కమలములకు) పద్మమిత్ర (సూర్యుని వంటివాడ), విష్ణువు}; భక్తకల్మషవల్లికాపటులవిత్ర = నరసింహ {భక్తకల్మషవల్లికాపటులవిత్రుడు - భక్త (భక్తుల యొక్క) కల్మష (పాపములు) యనెడి వల్లికా (లతలకు) పటు (గట్టి) లవిత్ర (కొడవలివంటివాడు), విష్ణువు}.
భావము:- “ఓ పద్మాక్షా! నారసింహా! నీవు భక్తుల ముఖాలనే పద్మాలకు పద్మముల మిత్రుడైన సూర్యుని వంటివాడవు. భక్తుల పాపాలు అనే లతల పాలిట లతలను తెగగోసే కొడవలి వంటివాడవు. తన తమ్ముడు హిరణ్యాక్షుడిని, పూర్వకారలంలో నీవు వరాహరూపంలో వచ్చి, సంహరించావని మా తండ్రి హిరణ్యకశిపుడు నీపై ద్వేషం, రోషం పెట్టుకున్నాడు. సర్వేశ్వరుడవైన నిన్ను గుర్తించలేకపోయాడు. నిన్ను బద్ధవిరోధిగా భావించాడు. నేను నీ భక్తుడను అయ్యానని కోపంతో నన్ను నానా బాధలూ పెట్టాడు. అటువంటి నా తండ్రి ఈవాళ నీ శాంత దృష్టి సోకి నిర్మలుడు అయ్యాడు. అందువల్ల ఆయన పాపాలు పోయి పరిశుద్ధాత్ముడు అయ్యేలా వరం ప్రసాదించు.”

తెభా-7-377-వ.
అనిన భక్తునికి భక్తవత్సలుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; భక్తుని = భక్తుని; కిన్ = కి; భక్తవత్సలుండు = నరసింహుడు {భక్తవత్సలుడు - భక్తుల యెడ వాత్సల్యముగలవాడు, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా భక్తాగ్రేస్వరుడైన ప్రహ్లాదుడు పలుకగా, భక్తుల ఎడ వాత్సల్యము చూపే వాడైన నరసింహావతారుడు.

తెభా-7-378-మ.
"నిభక్తుండవు నాకు నిన్నుఁ గనుటన్ నీ తండ్రి త్రిస్సప్త పూ
ర్వజులం గూడి పవిత్రుఁడై శుభగతిన్ ర్తించు విజ్ఞాన దీ
జితానేక భవాంధకారు లగు మద్భక్తుల్ వినోదించు దే
నుల్ దుర్జనులైన శుద్ధులు సుమీ త్యంబు దైత్యోత్తమా!

టీక:- నిజ = నా యొక్త; భక్తుండవు = భక్తుడవు; నా = నా; కున్ = కు; నిన్నున్ = నిన్ను; కనుటన్ = జన్మనిచ్చుటచేత; నీ = నీ యొక్క; తండ్రి = తండ్రి; త్రిస్సప్త = ఇరవైయొక్క, ముయ్యేడు (21); పూర్వజులన్ = ముందు తరమువారితో; కూడి = కలిసి; పవిత్రుడు = పరిశుద్ధుడు; ఐ = అయ్యి; శుభ = శ్రేయో; గతిన్ = మార్గమున; వర్తించున్ = నడచును; విజ్ఞాన = సుజ్ఞానము యనెడి; దీప = దీపముచే; జిత = తరించిన; భవ = సంసారము యనెడి; అంధకారులు = చీకటి(అజ్ఞానము)గలవారు; అగు = అయిన; మత్ = నా యొక్క; భక్తుల్ = భక్తులు; వినోదించు = క్రీడించెడి; దేశ = ప్రదేశమునందు; జనుల్ = వసించెడివారు; దుర్జనులు = చెడ్డవారు; ఐనన్ = అయినను; శుద్ధులు = పవిత్రులే; సుమీ = సుమా; సత్యంబున్ = నిజముగ; దైత్య = రాక్షసులలో; ఉత్తమ = ఉత్తముడ.
భావము:- “రాక్షస కులంలో ఉత్తమమైన వాడా! ప్రహ్లాదా! నీవు నాకు పరమ భక్తుడవు. నిన్ను కనడం వలన నీ తండ్రి ముయ్యేడు (21) ముందు తరాలవారితో పాటు శుభస్థితి పొందాడు. విజ్ఞానదీపికలు వెలిగించి సంసారా మాయాంధకారాన్ని పోగొట్టే నా భక్తులు నివసించే ప్రదేశాలలో ఉండి వారి ప్రేమకు పాత్రులైన వాళ్ళు దుర్జను లైనా కూడా పరిశుద్ధులు అవుతారు. ఇది సత్యం.

తెభా-7-379-సీ.
న సూక్ష్మ భూత సంఘాతంబు లోపల-
నెల్ల వాంఛలు మాని యెవ్వ రయిన
నీ చందమున నన్ను నెఱయ సేవించిన-
ద్భక్తు లగుదురు త్పరులకు
గుఱిజేయ నీవ యోగ్యుఁడ వైతి విటమీఁద-
వేదచోదిత మైన విధముతోడఁ
జిత్తంబు నా మీఁదఁ జేర్చి మీ తండ్రికిఁ-
బ్రేతకర్మములు సంప్రీతిఁ జేయు

తెభా-7-379.1-తే.
తఁడు రణమున నేఁడు నా యంగమర్శ
మున నిర్మల దేహుఁడై వ్యమహిమ
పగతాఖిల కల్మషుఁ డైఁ తనర్చి
పుణ్యలోకంబులకు నేఁగుఁ బుణ్యచరిత!"

టీక:- ఘన = మిక్కిలి పెద్దవానినుండి; సూక్ష్మ = మిక్కిలి చిన్నవానివరకు; భూత = జీవుల; సంఘాతంబు = సమూహము; లోపల = లోను; ఎల్ల = సమస్తమైన; వాంఛలున్ = కోరికలను; మాని = వదలివేసి; ఎవ్వరైనన్ = ఎవరైనసరే; నీ = నీ; చందమునన్ = విధముగ; నన్నున్ = నన్ను; నెఱయన్ = నిండుగా; సేవించినన్ = కొలచినచో; మత్ = నా యొక్క; భక్తులు = భక్తులు; అగుదురు = అయ్యెదరు; మత్ = నాకు; పరుల్ = చెందినవారి; కున్ = కి; గుఱి = దృష్టాంతముగ; చేయన్ = చూపుటకు; నీవ = నీవే; యోగ్యుడవు = తగినవాడవు; ఐతివి = అయినావు; ఇటమీద = ఇప్పటినుండి; వేద = వేదములచే; చోదితము = నిర్ణయింపబడినవి; ఐన = అయిన; విధము = పద్ధతి; తోడన్ = తోటి; చిత్తంబున్ = మనసును; నా = నా; మీదన్ = ఎడల; చేర్చి = లగ్నముచేసి; మీ = మీ యొక్క; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రేత = అపర, (పరలోకయాత్రకైన); కర్మములు = కర్మలు; సంప్రీతిన్ = ఇష్టపూర్తిగా; చేయుము = చేయుము; అతడు = అతడు.
రణంబునన్ = యుద్ధమున; నేడు = ఈ దినమున; నా = నా యొక్క; అంగ = శరీర; మర్శనమునన్ = స్పర్శచేత; నిర్మల = పావనమైన; దేహుడు = దేహముహలవాడు; ఐ = అయ్యి; నవ్య = నూతనమైన; మహిమన్ = వైభవముతో; అపగత = పోగొట్టబడిన; అఖిల = సమస్తమైన; కల్మషుడు = పాపములుగలవాడు; ఐ = అయ్యి; తనర్చి = ఒప్పి; పుణ్యలోకంబుల్ = పుణ్యలోకముల; కున్ = కు; ఏగున్ = వెళ్ళును; పుణ్యచరిత = పావనమైననడవడికగలవాడ.
భావము:- పావన మూర్తీ! ప్రహ్లాదా! నీలాగే ఎవరైనా సరే చిన్నవారైనా, పెద్దవారైనా, ఎల్లవాంఛలూ మాని నన్ను ఉపాసిస్తారో, వాళ్ళు నా భక్తులు, నా భక్తులలో నువ్వు ఉత్తముడవు. ఇంక నీవు నీ మనస్సు నా మీద నిలిపి సంతోషంగా వేదోక్తవిధిగా నీ తండ్రికి ఉత్తర క్రియలు చెయ్యి. అతడు నా శరీరస్పర్శతో నిర్మల దేహం పొందాడు. కల్మషాలు కడిగేసుకుని పుణ్యలోకాలకు పయనిస్తాడు.”

తెభా-7-380-వ.
అని యిట్లు నరసింహదేవుం డానతిచ్చిన హిరణ్యకశిపునకుం బ్రహ్లాదుండు పరలోకక్రియలు జేసి, భూసురోత్తములచేత నభిషిక్తుండయ్యె; నయ్యెడం బ్రసాద సంపూర్ణ ముఖుండైన శ్రీనృసింహదేవునిం జూచి దేవతాప్రముఖసహితుం డైన బ్రహ్మదేవుం డిట్లనియె,
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; నరసింహ = నరసింహుడు ఐన; దేవుడు = భగవంతుడు; ఆనతిచ్చినన్ = చెప్పగా; హిరణ్యకశిపున్ = హిరణ్యకశిపున; కున్ = కు; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; పరలోక = మరణానంతర యాత్ర కైన; క్రియలున్ = కార్యక్రమములను; చేసి = చేసి; భూసుర = బ్రాహ్మణ {భూసురులు - భూ (భూమిపైని) సురులు (దేవతలు), బ్రాహ్మణులు}; ఉత్తముల = శ్రేష్ఠుల; చేతన్ = చేత; అభిషిక్తుండు = పట్టాభిషేక్తుడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; ఎడన్ = సమయములో; ప్రసాద = అనుగ్రహముచేత; సంపూర్ణ = నిండైన, తృప్తిచెందిన; ముఖుండు = ముఖముగలవాడు; ఐన = అయిన; శ్రీ = శ్రీ; నృసింహ = నరసింహరూపుడైన; దేవునిన్ = భగవంతుని; చూచి = చూసి; దేవతా = దేవతలు; ప్రముఖ = మొదలగు ముఖ్యులతో; సహితుండు = కూడినవాడు; ఐన = అయిన; బ్రహ్మదేవుండు = బ్రహ్మదేవుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా భగవంతుడైన నరసింహస్వామి చెప్పగా హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పరలోక క్రియలు చేసి బ్రాహ్మణోత్తములచేత, పట్టాభిషేక్తుడు అయ్యెను; ఆ సమయములో అనుగ్రహముతో నిండైన మోము గల శ్రీ నృసింహస్వామిని చూసి దేవతలు మొదలగు ముఖ్యులతో కూడిన బ్రహ్మదేవుడు ఈ విధముగ పలికెను.

తెభా-7-381-సీ.
"దేవదేవాఖిలదేవేశ! భూతభా-
న! వీఁడు నా చేత రముపడసి
త్సృష్టజనులచే రణంబు నొందక-
త్తుఁడై సకలధర్మములుఁ జెఱచి
నేఁడు భాగ్యంబున నీచేత హతుఁ డయ్యెఁ-
ల్యాణ మమరె లోముల కెల్ల
బాలు నీతని మహాభాగవతశ్రేష్ఠుఁ-
బ్రతికించితివి మృత్యు యముఁ బాపి

తెభా-7-381.1-తే.
రముఁ గృపజేసితివి మేలు వారిజాక్ష!
నీ నృసింహావతారంబు నిష్ఠతోడఁ
గిలి చింతించువారలు దండధరుని
బాధ నొందరు మృత్యువు బారిఁ పడరు."

టీక:- దేవదేవా = నరసింహ {దేవదేవుడు - దేవుళ్ళకే దేవుడు, హరి}; అఖిలదేవేశ = నరసింహ {అఖిలదేవేశుడు - ఎల్లదేవతలకు ఈశ్వరుడు, విష్ణువు}; భూతభావన = నరసింహ {భూతభావనుడు - సర్వజీవులను కాపాడువాడు, విష్ణువు}; వీడు = ఇతడు; నా = నా; చేతన్ = నుండి; వరమున్ = వరములను; పడసి = పొంది; మత్ = నా యొక్క; సృష్టి = పుట్టింపబడిన; జనుల్ = వారి; చేన్ = వలన; మరణంబున్ = చావును; ఒందకన్ = పొందనని; మత్తుడు = గర్వించినవాడు; ఐ = అయ్యి; సకల = సర్వ; ధర్మములు = వేదధర్మములను; చెఱచి = పాడుచేసి; నేడు = ఈ దినమున; భాగ్యంబునన్ = అదృష్టబలమువలన; నీ = నీ; చేతన్ = చేతిలో; హతుడు = మరణించినవాడు; అయ్యెన్ = కాగలిగెను; కల్యాణము = శుభములు; అమరెన్ = కలిగెను; లోకముల్ = లోకములు; ఎల్లన్ = అన్నిటికిని; బాలున్ = కుఱ్ఱవానిని; ఈతని = ఇతనిని; మహా = గొప్ప; భాగవత = విష్ణుభక్తులలో; శ్రేష్ఠున్ = ఉత్తముని; బ్రతికించితివి = కాపాడితివి; మృత్యు = మరణ; భయము = భయమును; పాసి = దూరముచేసి.
వరమున్ = వరమును; కృపజేసితివి = దయతో యిస్తివి; మేలు = లెస్స, మంచిది; వారిజాక్ష = నరసింహ {వారిజాక్షుడు - వారిజ(పద్మమువంటి) అక్షుడు(కన్నులుగలవాడు), విష్ణువు}; నీ = నీ యొక్క; నృసింహ = నరసింహ; అవతారంబున్ = అవతారమును; నిష్ఠ = స్థిరమైన పూనిక; తోడన్ = తోటి; తగిలి = విడువక; చింతించు = మననముచేయు; వారలు = వారు; దండధరునిబాధన్ = యమయాతనలను {దండధరుడు - దండించుటను ధరించినవాడు, యముడు}; ఒందరు = పొందరు; మృత్యువు = మరణము; బారిన్ = వాతను; పడరు = పడరు.
భావము:- “ఓ పద్మాక్షా! నరసింహావతారా! సర్వేశ్వరా! నీవు దేవతోత్తము లందరి పైన దేవుడవు. ఈ హిరణ్యకశిపుడు నా చేత సృష్టించబడిన ప్రాణుల చేత చావని విధంగా నా వల్ల వరం పొంది గర్వించాడు; సకల ధర్మాలను మంటగలిపాడు; ఈ రోజు అదృష్టవశాత్తు నీ చేతిలో మరణం పొందాడు; లోకాలు అన్నిటికి మేలు కలిగింది. ఈ పిల్లాడు ప్రహ్లాదుడు పరమ భాగవతశ్రేష్ఠుడు; ఇతనికి దయతో మృత్యుభయం లేకుండా వరం ప్రసాదించావు. నీ నరసింహ అవతారాన్ని నిష్ఠతో ఉపాసించే వారు యముని వలన బాధలు బడరు; మృత్యుభయంపొందరు.”

తెభా-7-382-వ.
అనిన నరసింహదేవుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; నరసింహ = నరసింహరూపుడైన; దేవుండు = దేవుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా బ్రహ్మ దేవుడు పలుకగా, నరసింహస్వామి ఇలా అన్నాడు.

తెభా-7-383-క.
"మన్నించి దేవశత్రుల
కెన్నఁడు నిటువంటి వరము లీకుము పా పో
త్పన్నులకు వరము లిచ్చుట
న్నగముల కమృత మిడుట పంకజగర్భా!"

టీక:- మన్నించి = సమ్మానించి; దేవశత్రుల్ = రాక్షసుల; కున్ = కు; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; ఇటువంటి = ఇలాంటి; వరములు = వరములను; ఈకుము = ఈయకుము; పాపన్ = నీచపు; ఉత్పన్నుల్ = జన్మముగలవారి; కున్ = కి; వరముల్ = వరములను; ఇచ్చుట = ప్రసాదించుట; పన్నగముల్ = పాముల; కున్ = కు; అమృతము = అమృతము; ఇడుట = ఇచ్చుట; పంకజగర్భా = బ్రహ్మదేవుడా {పంకజగర్భుడు - పంకజ (పద్మమున) గర్భుడ (పుట్టినవాడు), బ్రహ్మ}.
భావము:- “పద్మసంభవా! బ్రహ్మదేవా! దేవతా ద్వేషులను ఆదరించి ఇక ఎప్పుడూ ఇలాంటి వరాలను ఇవ్వకు. పాపాత్ములకు వరములు ఇవ్వటం, పాములకు పాలు పోయటం వంటిది సుమా.”

తెభా-7-384-వ.
అని యిట్లానతిచ్చి బ్రహ్మాదిదేవతాసమూహంబుచేఁ బూజితుఁడై భగవంతుండైన శ్రీనృసింహదేవుండు తిరోహితుండయ్యె; ప్రహ్లాదుండును శూలికిఁ బ్రణమిల్లి తమ్మిచూలికి వందనంబులు జేసి బ్రజాపతులకు మ్రొక్కి భగవత్కళలైన దేవతలకు నమస్కరించినం జూచి బ్రహ్మదేవుండు శుక్రాది మునీంద్ర సహితుండై దైత్యదానవరాజ్యంబునకుం బ్రహ్లాదుం బట్టంబు గట్టి యతనిచేతం బూజితుండై దీవించె; నంత నీశానాది నిఖిల దేవతలు వివిధంబులగు నాశీర్వాదంబులచేత నా ప్రహ్లాదునిఁ గృతార్థుం జేసి తమ్మిచూలిని ముందట నిడుకొని నిజస్థానంబునకుఁ జని; రిట్లు విష్ణుదేవుండు నిజపార్శ్వచరు లిరువురు బ్రాహ్మణశాపంబునం జేసి బ్రథమ జన్మంబున దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపు లను వరాహ నారసింహ రూపంబుల నవతరించి వధియించె; ద్వితీయ భవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామ రూపంబున సంహరించె; తృతీయ జన్మంబున శిశుపాల దంతవక్త్రులను పేరులం బ్రసిద్ధి నొందిన వారలను శ్రీకృష్ణ రూపంబున ఖండించె; నివ్విధంబున మూఁడు జన్మంబుల గాఢ వైరానుబంధంబున నిరంత రసంభావిత ధ్యానులై వారలు నిఖిల కల్మష విముక్తు లై హరిం గదిసి"రని చెప్పి నారదుం డిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; ఆనతిచ్చి = చెప్పి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలైన; దేవ = దేవతల; సమూహంబు = సమూహముల; చేన్ = చేత; పూజితుండు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; భగవంతుండు = షడ్గుణైశ్వర్యసంపన్నుడు {భగవంతునిగుణషట్కములు - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యములు}; ఐన = అయిన; శ్రీ = శ్రీ; నరసింహ = నరసింహరూప; దేవుండు = దేవుడు; తిరోహితుండు = అదృశ్యుడు, అంతర్ధానుడు; అయ్యెన్ = అయ్యెను; ప్రహ్లాదుండును = ప్రహ్లాదుడుకూడ; శూలి = పరమశివుని {శూలి - శూలాయుధము ధరించువాడు, శివుడు}; కిన్ = కి; ప్రణమిల్లి = నమస్కరించి; తమ్మిచూలి = బ్రహ్మదేవున {తమ్మిచూలి - తమ్మి (పద్మమున) చూలి (పుట్టినవాడు), బ్రహ్మ}; కిన్ = కు; వందనంబులు = నమస్కారములు; చేసి = చేసి; ప్రజాపతుల్ = ప్రజాపతుల; కున్ = కు; మ్రొక్కి = నమస్కరించి; భగవత్ = భగవంతుని; కళలు = అంశజులు; ఐన = అయిన; దేవతల్ = దేవతల; కున్ = కు; నమస్కరించినన్ = నమస్కరించగా; చూచి = చూసి; బ్రహ్మదేవుండు = బ్రహ్మదేవుడు; శుక్ర = శుక్రుడు; ఆది = మొదలైన; ముని = మునులలో; ఇంద్ర = ఉత్తములతో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; దైత్య = దితివంశజుల; దానవ = దనుజుల; రాజ్యంబున్ = రాజ్యమున; కున్ = కు; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; పట్టంబుగట్టి = పట్టాభిషిక్తునిజేసి; అతని = అతని; చేతన్ = చేత; పూజితుండు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; దీవించెన్ = ఆశీర్వదించెను; అంతన్ = అంతట; ఈశాన = ఈశానుడు; ఆది = మొదలైన; నిఖిల = ఎల్ల; దేవతలున్ = దేవతలును; వివిధంబులు = పలువిధములైన; ఆశీర్వాదంబుల = ఆశీర్వచనముల; చేతన్ = చేత; ఆ = ఆ; ప్రహ్లాదునిన్ = ప్రహ్లాదుని; కృతార్థున్ = సార్థకున్; చేసి = చేసి; తమ్మిచూలిని = బ్రహ్మదేవుని; ముందటన్ = ముందుభాగమున; ఇడుకొని = ఉంచుకొని; నిజస్థానంబున్ = స్వస్థానముల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; ఇట్లు = ఈ విధముగ; విష్ణుదేవుండు = విష్ణుమూర్తి; నిజ = తన; పార్శ్వచరులు = పక్కనమెలగువారు; ఇరువురు = ఇద్దరు (2); బ్రాహ్మణ = బ్రాహ్మణులైన సనకాదుల; శాపంబునన్ = శాపము; చేసి = వలని; ప్రథమ = మొదటి; జన్మంబునన్ = జన్మలో; దితి = దితియొక్క; పుత్రులు = కుమారులు; ఐన = అయిన; హిరణ్యాక్ష = హిరణ్యాక్షుడు; హిరణ్యకశిపులన్ = హిరణ్యకశిపులను; వరాహ = వరాహ; నారసింహ = నరసింహ; రూపంబులన్ = స్వరూపములలో; అవతరించి = అవతరించి; వధియించెన్ = సంహరించెను; ద్వితీయ = రెండవ (2); భవంబునన్ = జన్మములో; రాక్షస = రాక్షసకులమున; జన్మంబున్ = జన్మము; తాల్చిన = ధరించిన; రావణ = రావణుడు; కుంభకర్ణులను = కుంభకర్ణులను; శ్రీరామ = శ్రీరామ; రూపంబునన్ = స్వరూపముతో; సంహరించెన్ = చంపెను; తృతీయ = మూడవ (3); జన్మంబునన్ = జన్మలో; శిశుపాల = శిశుపాలుడు; దంతవక్త్రులు = దంతవక్త్రులు; అను = అనెడి; పేరులన్ = పేరులతో; ప్రసిద్ధి = పేరుపొందిన; వారలను = వారిని; శ్రీకృష్ణ = శ్రీకృష్ణ; రూపంబునన్ = స్వరూపముతో; ఖండించెన్ = చంపెను; ఈ = ఈ; విధంబునన్ = లాగున; మూడు = మూడు (3); జన్మంబులన్ = జన్మలలో; గాఢ = తీవ్రమైన; వైర = విరోధ; అనుబంధంబునన్ = సంబంధమువలన; నిరంతర = ఎడతెగకుండెడి; సంభావిత = అలవడిన; ధ్యానులు = ధ్యానముగలవారు; ఐ = అయ్యి; వారలు = వారు; నిఖిల = సమస్తమైన; కల్మష = పాపములనుండి; విముక్తులు = విడివడినవారు; ఐ = అయ్యి; హరిన్ = విష్ణుమూర్తిని; కదిసిరి = చేరిరి; అని = అని; చెప్పి = చెప్పి; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈలాగున; అనియె = పలికెను.
భావము:- నృసింహస్వామి బ్రహ్మదేవునికి ఇలా తెలియజెప్పి, బ్రహ్మాది దేవతల పూజలను స్వీకరించి, అంతర్ధానం అయ్యాడు. ప్రహ్లాదుడు పరమేశ్వరునికి ప్రణామాలు ఆచరించాడు. విధాతకు వందనం చేసాడు. ప్రజాపతులకు ప్రణతులు చేసాడు. భగవదంశతో ప్రకాశించే దేవతలకు నమస్కారాలు చేసాడు. అంతట చతుర్ముఖ బ్రహ్మ, శుక్రుడు మొదలైన మునీంద్రులతో కలిసి ప్రహ్లాదుడిని దైత్య, దానవ రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేసి రాజ్యం అప్పజెప్పి, ఆశీర్వదించాడు. ప్రహ్లాదుడు దేవతలను అందరిని అర్హమైన విధంగా పూజించాడు. ఈశానుడు మొదలగు సమస్త దేవతలు ప్రహ్లాదుడిని నానావిధ ఆశీస్సులతో ధన్యుడిని చేశారు. బ్రహ్మదేవుడితో సహా దేవతలు అందరూ తమతమ స్థానాలకు బయలుదేరి వెళ్ళారు.
ఇలా సనకాది విప్రోత్తముల శాపానికి గురైన ద్వారపాలకులు, జయ విజయులు ప్రథమ జన్మలో దితి కడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా పుట్టారు. విష్ణుమూర్తి వరాహా, నారసింహ అవతారాలు ఎత్తి పరిమార్చాడు. ద్వితీయజన్మలో రావణ, కుంభకర్ణులుగా పుట్టారు. శ్రీరామునిగా అవతరించి అంతం చేసాడు. తృతీయజన్మగా శిశుపాల. దంతవక్త్రులుగా జన్మించారు. శ్రీకృష్ణుడై వారిని పరిమార్చాడు. ఇలా మూడు జన్మలలో గాఢమైన వైరభావంతో నిరంతం హరి స్మరణ చేస్తూ వీళ్ళు శాప విముక్తులు అయ్యారు. చివరకు స్వస్థానం అయిన వైకుంఠ ద్వారపాలకులు చేరారు.” అని నారద మహర్షి, మహారాజైన ధర్మరాజునకు వివరించి ఫలశ్రుతిగా ఇలా పలికాడు.

తెభా-7-385-ఉ.
"శ్రీ మణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం
హాముఁ బుణ్య భాగవతుఁడైన నిశాచరనాథపుత్ర సం
చాము నెవ్వఁడైన సువిచారత విన్నఁ బఠించినన్ శుభా
కాముతోడ నే భయముఁ ల్గని లోకముఁ జెందు భూవరా!

టీక:- శ్రీ = శోభకరము; రమణీయము = మనోజ్ఞము; ఐన = అయిన; నరసింహ = నరసింహుని; విహారమున్ = క్రీడ; ఇంద్రశత్రు = హిరణ్యకశిపుని; సంహారమున్ = చంపుట; పుణ్య = పావన; భాగవతుడు = భాగవతుడు; ఐన = అయిన; నిశాచరనాథపుత్ర = ప్రహ్లాదుని {నిశాచరనాథపుత్రుడు - నిశాచర రాజు (రాక్షస రాజు యైన హిరణ్యకశిపుని) పుత్రుడు, ప్రహ్లాదుడు}; సంచారమున్ = నడవడికను; ఎవ్వడు = ఎవరు; ఐనన్ = అయినను; సు = చక్కటి; విచారతన్ = విమర్శతో; విన్నన్ = వినినను; పఠించినన్ = చదివినను; శుభ = మంగళ; ఆకారము = విగ్రహము; తోడన్ = తోటి; ఏ = ఎట్టి; భయమున్ = భయము; కల్గని = కలగనట్టి; లోకమున్ = లోకమును; చెందున్ = చేరును; భూవర = రాజా.
భావము:- “మహారాజా! ధర్మజ! శుభకరమైన శ్రీ నరసింహ అవతారం; విహారం; హిరణ్యకశిపుని సంహారం; పుణ్యమూర్తి ప్రహ్లాదుని సంచారం; మంచి మనస్సుతో వినిన, చదివిన మానవుడు ఏ భయమూ కలుగని పుణ్యలోకానికి చేరుకుంటాడు.

తెభా-7-386-మ.
జాతప్రభవాదులున్ మనములోఁ ర్చించి భాషావళిం
లుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ యింటిలోఁ
జెలి యై మేనమఱంది యై సచివుఁడై చిత్తప్రియుండై మహా
సంధాయకుఁడై చరించు టది నీ భాగ్యంబు రాజోత్తమా!

టీక:- జలజాతప్రభవ = బ్రహ్మదేవుడు {జలజాతప్రభవుడు - జలజాత (పద్మమున) ప్రభవుడు (ఉద్భవించినవాడు), బ్రహ్మ}; ఆదులున్ = మొదలగువారుకూడ; మనము = మనసుల; లోన్ = లోపల; చర్చించి = తరచిచూసుకొని; భాషావళిన్ = వాక్కులచేత; పలుకన్ = పలుకుటకు; లేని = వశముకాని; జనార్దన = విష్ణుమూర్తి {జనార్దనుడు - వ్యు. జన్మ మరణార్యర్థయతీ- నాశయతీతి, జనన మరణములను పోగొట్టువాడు, విష్ణువు}; ఆహ్వయ = పేరుగల; పరబ్రహ్మంబు = పరమాత్మ; నీ = నీ యొక్క; ఇంటి = నివాసము; లోన్ = అందు; చెలి = మిత్రుడు; ఐ = అయ్యి; మేనమఱంది = మేనత్తకొడుకు; ఐ = అయ్యి; సచివుడు = మంత్రాంగముచెప్పువాడు; ఐ = అయ్యి; చిత్త = మనసునకు; ప్రియుండు = ఇష్టుడు; ఐ = అయ్యి; మహా = గొప్ప; ఫల = ఫలితములను; సంధాయకుండు = కూర్చువాడు; ఐ = అయ్యి; చరించుట = మెలగుట; అది = అది; నీ = నీ యొక్క; భాగ్యంబు = అదృష్టము; రాజోత్తమ = రాజులలో ఉత్తముడ.
భావము:- రాజోత్తమా! ధర్మరాజా! బ్రహ్మాదులు సైతం ఆలోచించి, పరిశోధించి మాటలలో చెప్పలేనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు శ్రీకృష్ణుడు. అంతటివాడు మీకు మిత్రుడుగా, బావమరిదిగా, మంత్రిగా, ఆత్మప్రియుడుగా, మహా ఫల ప్రదాతగా నీ ఇంటిలో విహారం చేయటం నీ మహాభాగ్యం.” అని ధర్మరాజునకు నారద మునీంద్రుడు ప్రహ్లాద చరిత్ర వివరించాడు.