పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము/వృత్రాసుర వృత్తాంతము

వికీసోర్స్ నుండి

వృత్రాసుర వృత్తాంతము

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము)
రచయిత: సింగయ


తెభా-6-317-మ.
పుత్రం డగు విశ్వరూపజనకుం డా త్వష్ట దుఃఖాయతో
ద్ధ రోషానల దహ్యమానుఁ డగుచుం దా నింద్రుపై మారణ
క్రతు హోమం బొనరింప నందుఁ బొడమెం ల్పాంతకాకార వి
శ్రు కీలానల నిష్ఠురేక్షణగుణక్షుభ్యత్త్రిలోకోగ్రుఁడై.

టీక:- హత = చంపబడ్డ; పుత్రుండు = కుమారుడు కలవాడు; అగు = అయిన; విశ్వరూపజనకుండు = విశ్వరూపుని తండ్రి అయినట్టి; ఆ = ఆ; త్వష్ట = త్వష్ట; దుఃఖ = దుఃఖముచే; ఆయత = కలిగిన; ఉద్ధతర = మిక్కిలి అతిశయించిన {ఉద్ధము - ఉద్ధతరము - ఉద్ధతమము}; రోష = క్రోధము యనెడి; అనల = అగ్నిచే; దహ్యమానుడు = కాలిపోవువాడు; అగుచున్ = అగుచూ; తాన్ = తను; ఇంద్రు = ఇంద్రుని; పైన్ = మీద; మారణ = హింసించుటకై; క్రతు = చేసెడి; హోమంబు = హోమము; ఒనరింప = చేయగా; అందున్ = దానిలో; పొడమెన్ = జనించెను; కల్పాంత = విలయము యొక్క; ఆకార = ఆకారము గల; విశ్రుత = ప్రసిద్ధమైన; కీల = మంటలతో కూడిన; అనల = నిప్పు వంటి; నిష్ఠుర = కఠినమైన; ఈక్షణ = చూచెడి; గుణ = గుణముచే; క్షుభ్యత్ = క్షోభింపజేసిన; త్రిలోక = ముల్లోకములకు; ఉగ్రుడు = క్రోధము గలవాడు; ఐ = అయ్యి.
భావము:- కొడుకు మరణించడంతో విశ్వరూపుని తండ్రి త్వష్ట దుఃఖంతోను, రోషంతోను మండిపడ్డాడు. ఇంద్రుణ్ణి సంహరించడం కోసం మారణహోమం ప్రారంభించగా ఆ యజ్ఞకుండంలో నుంచి ప్రళయకాలంలోని అగ్నిజ్వాలల వంటి భయంకరమైన చూపులతో ముల్లోకాలకు భయంకరుడై (వృత్రాసురుడు) పుట్టాడు.

తెభా-6-318-సీ.
యుము ద్రుంగెడునాఁడు ములు పొలియించు-
నంతకుమూర్తిపై నింత యగుచుఁ;
ఱపును బొడువును బ్రతిదినంబును నొక్క-
పాత మంగంబు విరివిగొనుచుఁ,
డు దగ్ధ శైల సంకాశ దేహము నందుఁ-
రము సంధ్యారాగకాంతి బెరయ;
మును గాఁక రాగిచేఁ నుమించు మించులఁ-
ఱకుమీసలు కచాగ్రములు మెఱయఁ;

తెభా-6-318.1-తే.
జండ మధ్యాహ్న మార్తాండ మండ లోగ్ర
టుల నిష్ఠుర లోచనాంల విధూత
శ దిశాభాగుఁ డుజ్జ్వలర కరాళ
భిదుర సునిశిత దంష్ట్రోరు నగుహుఁడు.

టీక:- యుగము = యుగములు; త్రుంగెడు = అంత మగు; నాడు = సమయము నందు; జగములు = లోకములు; పొలియించు = నాశనము చేసెడి; అంతకుమూర్తి = హరుని, యముని {అంతకుమూర్తి - అంతకు (అంతము చేసెడి) మూర్తి (స్వరూపము), యముడు, హరుడు}; పైన్ = మీద; ఇంత = ఇంత పెద్ద; అగుచున్ = అగుచు; పఱపును = లావు; పొడువును = పొడుగు; ప్రతిదినము = దినదినమునకు; ఒక్క = ఒక శరపాతము = బాణముపడుదూరమంత; అంగంబు = దేహము; విరివిగొనుచున్ = పెద్దదగుచు; కడు = మిక్కిలి; దగ్ధ = కాలిబొగ్గయిన; శైల = కొండశిఖరము; సంకాశ = వంటి; దేహము = శరీరము; అందున్ = మీద; సంధ్యారాగ = సంధ్యారాగపు; కాంతి = ప్రకాశము; పెరయ = అతిశయించగా; మునున్ = ముందే; కాక = ఎఱ్ఱగాకాల్చిన; రాగి = రాగి; చే = చేత; కనుమించు = చూడ మిక్కిలి; మించులన్ = మెఱుపుతీగలవంటి; కఱుకు = బిరుసైన; మీసలు = మీసములు; కచ = వెంట్రుకల; అగ్రములు = చివర్లు; మెఱయన్ = మెరుస్తుండగా; చండ = భయంకరమైన;
మధ్యాహ్న = మధ్యాహ్నపు; మార్తాండ = సూర్యుని; మండల = మండలమువలె; ఉగ్ర = తీవ్రమైన; చటుల = భయంకరమైన; నిష్ఠుర = కఠినమైన; లోచన = కన్నుల; అంచల = అంచుల నుండి, కడ కన్నుల నుండి; విధూత = ఎగరగొట్టబడిన; దశదిశాభాగుండు = పది దిగ్భాగములు కలవాడు; ఉజ్జ్వలతర = మిక్కిలి ఉజ్జ్వలమైన {ఉజ్జ్వలము - ఉజ్జ్వలతరము - ఉజ్జ్వలతమము}; కరాళ = భయంకరమైన; భిదుర = వజ్రాయుధము వంటి; దంష్ట్ర = దంతములు గల; ఉరు = పెద్ద; వదన = నోరు యనెడి; గుహుడు = గుహ గలవాడు.
భావము:- ప్రళయకాలంలో లోకాలను నాశనం చేసే యమధర్మరాజు కంటే భయంకరమైన స్వరూపంతో, ప్రతిదినమూ ఒక్కొక్క కోలవేటు (బాణాన్ని ప్రయోగిస్తే అది పోయే దూరాన్ని కోలవేటు అంటారు) ప్రమాణంలో పొడుగు, వెడల్పు పెరిగే అవయవాలతో, చెట్లు గుట్టలు కాలిపోయిన కొండ వంటి ఎఱ్ఱని సంధ్యాకాంతులు వెలువడుతుండగా, ఎఱ్ఱగా కాల్చిన రాగిరేకుల వంటి కరుకైన మీసాలు శిరోజాలు మెరుస్తుండగా, మధ్యాహ్న కాలంలో భగభగ మండే సూర్యమండలం వలె భయంకరమైన కఠోరమైన చూపులతో పదిదిక్కులను బ్రద్దలు చేస్తూ ధగధగ మెరిసే వజ్రాయుధం వంటి పదునైన కోరలతో కూడిన గుహవంటి నోరుతో (వృత్రాసురుడు పుట్టాడు).

తెభా-6-319-ఉ.
నింగికి నేలకుం బొడవు నిచ్చలమై శిఖలందుఁ బర్వు ను
త్తుంత రాగ్నిజాలములఁ దొట్రిలుచున్ గ్రహపంక్తి జాఱ ని
స్సం కరాళ శాత ఘన ద్ఘృణి మండల చండ శూలము
ప్పొంగుచుఁ గేల లీలఁ గొని భూమిచలింపఁగ సోలియాడుచున్.

టీక:- నింగి = ఆకాశమున; కి = కు; నేల = భూమి; కున్ = కి; పొడవు = పొడుగు; నిచ్చలము = నిశ్చయముగ సరిపడెడి వాడు; ఐ = అయ్యి; శిఖలు = శిరసు నందలి జటలు; అందున్ = లో; పర్వున్ = పరచుకొనెడి; ఉత్తుంగతర = మిక్కిలి ఎత్తైన; అగ్ని = అగ్ని; జాలములు = మంటలు; తొట్రిలుచున్ = తుళ్ళుతుండగా; గ్రహ = గ్రహముల; పంక్తి = సమూహము; జాఱన్ = జారిపోగా; నిస్సంగ = చిందరవందరైన; కరాళ = వెఱపు పుట్టించే; శాత = పదునైన; ఘనసత్ = అతి గొప్ప; ఘృణి = కాంతుల; మండల = సమూహములు గల; చండ = భయంకరమైన; శూలమున్ = శూలమును; ఉప్పొంగుచు = ఉత్సాహముతో; కేలన్ = చేతిలో; లీలన్ = క్రీడవలె; కొని = తీసుకొని; భూమి = భూమి; చలింపగన్ = అదురిపోవునట్లు; సోలియాడన్ = ఊగిపోతూ.
భావము:- నేలనుండి ఆకాశానికి అంటుతున్న దేహంతో, శిఖల మీది భయంకరమైన అగ్నిజ్వాలలకు గ్రహాలు పెటిల్లుమని రాలి పడుతుండగా, చిందర వందరై మిక్కిలి కఠోరమైన పదునైన కాంతులతో మిలమిల మెరిసే శూలాన్ని అవలీలగా చేత ధరించి భూమి చలింపగా తూలి సోలి ఆడుతూ (వృత్రాసురుడు పెరిగాడు).

తెభా-6-320-సీ.
దలక విరివిగా దనంబుఁ దెఱచుచు-
నాకాశమంతయు ప్పళించుఁ;
డనాల్క నిగిడించి గ్రహతారకంబుల-
య మెల్ల దిగజాఱ నాకి విడుచు;
లవోకయునుబోలె ట్టహాసము చేసి-
మెఱసి లోకములెల్ల మ్రింగఁ జూచుఁ;
నరు దిగ్దంతి దంములు చెక్కలువాఱ-
నుగ్రదంష్ట్రలు ద్రిప్పు నుక్కుమిగిలి;

తెభా-6-320.1-తే.
త్వష్ట బలితంపుఁ దపమునఁ బుష్టినొంది
ఖిల లోకంబు లెల్లఁ దా నాక్రమించి
వృత్రనాముండు దేవతాత్రుఁ డగుచు
దారుణాకారుఁ డఖిల దుర్దముఁడు మెఱసె.

టీక:- వదలక = ఎడతెగకుండ; విరివిగా = పెద్దగా; వదనంబు = నోరు; తెఱచుచు = తెరుస్తూ; ఆకాశము = ఆకాశము; అంతయున్ = అంతటిని; అప్పళించున్ = చప్పరించును; కడన్ = చివరకు; నాల్కన్ = నాలుకను నిగిడించి = చాపి; గ్రహ = గ్రహముల; తారకంబుల = తారకల యొక్క; నయము = చక్కదనము; ఎల్ల = అంతయును; దిగజాఱ = తరిగిపోవునట్లు; నాకి = నాకి; విడుచున్ = విడిచిపెట్టును; అలవోకయును = అలవోకగా; పోలెన్ = చేసినట్లు; అట్టహాసము = భయంకరముగ నవ్వుట; చేసి = చేసి; మెఱసి = అతిశయించి; లోకములు = లోకములు; ఎల్లన్ = అఖిలమును; మ్రింగన్ = మింగేయాలని; చూచున్ = చూచును; దిగ్దంతి = దిగ్గజముల; దంతములు = దంతములు; చెక్కులువాఱ = పగిలిపోవునట్లుగ; ఉగ్ర = భయంకరమైన; దంష్ట్రలు = దంతములు; త్రిప్పున్ = కదిలించును; ఉక్కుమిగిలి = అతిశయించి;
త్వష్ట = త్వష్టమనువు యొక్క; బలితంపు = బలమైన; తపమునన్ = తపస్సువలన; పుష్టిన్ = బలమును; ఒంది = పొంది; అఖిల = సమస్తమైన; లోకంబుల = లోకములను; ఎల్లన్ = అన్నిటిని; తాన్ = అతను; ఆక్రమించె = జయించెను; వృత్ర = వృత్రుడు; నాముండు = అనెడి పేరుగలవాడు; దేవతా = దేవతలకు; శత్రుడు = శత్రువు; అగుచున్ = అగుచు; దారుణ = భయంకరమైన; ఆకారుడు = ఆకారము గలవాడు; అఖిల = సర్వులకు; దుర్దముడు = జయింపరానివాడు; మెఱసె = అతిశయించెను.
భావము:- ఆ వృత్రాసురుడు తరచుగా నోరు తెరుస్తూ ఆవులించి ఆకాశాన్నంతా చప్పరిస్తాడు. పొడుగైన నాలుకను చాచి గ్రహాలను, నక్షత్రాలను క్రిందికి లాగి నాకి విడుస్తాడు. అలవోకగా అట్టహాసం చేసి లోకాలన్నింటినీ మింగబోతాడు. దిగ్గజాల దంతాలు పగిలి బీటలువారే విధంగా అహంకారంతో భీకరమైన కోరలను త్రిప్పుతాడు. త్వష్ట యొక్క తపశ్శక్తి వల్ల పుష్టిని పొంది లోకాలన్నిటినీ ఆక్రమించి భయంకరమైన ఆకారంతో ఎవరినీ లెక్క చేయకుండా సమస్త దేవతలకు శత్రువై మొక్కవోని పరాక్రమంతో విజృంభించాడు.

తెభా-6-321-మత్త.
ట్టి వృత్రునిమీఁద దేవత ల్కతోఁ బెనుమూఁక లై
చుట్టిముట్టి మహాస్త్రవిద్యలు చూపి యేపున నేయ నా
గొట్టువీరుఁడు వార లేసిన క్రూరశస్త్రము లన్నియుం
జుట్టి పట్టుక మ్రింగి శూరత జోక నార్చె మహోగ్రుఁడై.

టీక:- అట్టి = అటువంటి; వృత్రుని = వృత్రుడి; మీద = పైని; దేవతలు = దేవతలు; అల్క = కోపము; తోన్ = తోటి; పెను = పెద్దపెద్ద; మూకలు = గుంపులు కట్టినవారు; ఐ = అయ్యి; చుట్టిముట్టి = చుట్టిముట్టి; మహా = గొప్ప; అస్త్ర = అస్త్రముల; విద్యలు = విద్యలను; చూపి = ప్రదర్శించి; ఏపునన్ = విస్తారముగా; ఏయన్ = వేయగా; ఆ = ఆ; గొట్టు = దుష్ట; వీరుడు = వీరుడు; వారలు = వారు; ఏసిన = వేసిన; క్రూర = భయంకరమైన; శస్త్రములు = శస్త్రములు; అన్నియున్ = సర్వమును; చుట్టిపట్టుక = కలిపిచుట్టి; మ్రింగి = మింగేసి; శూరతన్ = శౌర్యముతో; జోకనార్చెన్ = గర్జించెను {జోకనార్చు - జోకను (ఉత్సాహముతో) అర్చు (అరచుట), గర్జించు}; మహా = గొప్ప; ఉగ్రుడు = భయంకరుడు; ఐ = అయ్యి.
భావము:- అటువంటి వృత్రాసురుని దేవతలంతా మూకుమ్మడిగా కోపంతో చుట్టుముట్టి దివ్యాస్త్రాలను ప్రయోగించారు. వీరాధివీరుడైన ఆ వృత్రాసురుడు ఆ అస్త్రాలను చుట్టచుట్టి నోటిలో పెట్టుకొని గుటుక్కున మ్రింగి మహా భయంకరంగా గర్జించాడు.

తెభా-6-322-క.
క్షితదివ్యాస్త్రుం డగు
క్షోనాయకుని నమరరాజప్రముఖుల్
వీక్షింప వెఱచి పఱచిరి
క్షకుఁ జింతించు కొనుచు య మొప్పారన్.

టీక:- భక్షిత = మింగిన; దివ్య = దివ్యమైన; అస్త్రుండు = అస్త్రములు గలవాడు; అగు = అయిన; రక్షస్ = రాక్షస; నాయకుని = ప్రభువును; అమరరాజ = ఇంద్రుడు; ప్రముఖుల్ = మొదలగు ముఖ్యులు; వీక్షింప = చూడ; వెఱచి = భయపడి; పఱచిరి = పారిపోయిరి; రక్షకున్ = కాపాడేవానికై; చింతించుకొనుచు = ఆలోచించుకొనుచు; రయము = వేగమును; ఒప్పారన్ = ఒప్పుచుండగా.
భావము:- తమ అస్త్రాలను భక్షించిన రాక్షసరాజును దేవేంద్రుడు మొదలైన దేవతలు చూడడానికి కూడా భయపడి తమను రక్షించేవాడు ఎవరా అని చింతిస్తూ వేగంగా పారిపోయారు.

తెభా-6-323-వ.
ఇట్లు సర్వసాధనంబులతోడ సాధుజనంబుల వృత్రాసురుండు మ్రింగిన, నచ్చరుపడి చేయునది లేక త త్తేజోవిశేష విభవంబునకు భయంబు నొంది, కందిన డెందంబునం గుందుచుం, బురందర ప్రముఖు లార్తరక్షకుండగు పుండరీకాక్షునకుం గుయ్యిడు వారలై.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సర్వ = సమస్తమైన; సాధనంబుల = ఆయుధముల; తోడ = తోటి; సాధు = దేవతా; జనంబులన్ = జనులను; వృత్ర = వృత్రుడు యనెడి; అసురుండు = రాక్షసుడు; మ్రింగినన్ = మింగివేయగా; అచ్చరుపడి = ఆశ్చర్యపోయి; చేయునది = చేయగలది; లేక = లేక; తత్ = అతని; తేజః = తేజస్సు యొక్క; విశేష = విశిష్టమైన; విభవంబున్ = వైభవమున; కున్ = కు; భయంబున్ = భయమును; ఒంది = పొంది; కందిన = తపించిన; డెందంబునన్ = హృదయము నందు; కుందుచు = బాధపడుతు; పురంధర = ఇంద్రుడు; ప్రముఖుల్ = మొదలగు ముఖ్యులు; ఆర్త = దుఃఖము చెందినవారిని; రక్షకుడు = కాపాడెడివాడు; అగు = అయిన; పుండరీకాక్షున్ = నారాయణుని; కున్ = కి; కుయ్యిడు = మొరపెట్టుకొను; వారలు = వారు; ఐ = అయ్యి.
భావము:- ఈ విధంగా సర్వ శస్త్రాస్త్రాలతో దేవతలను వృత్రాసురుడు మ్రింగి వేయగా ఆశ్చర్యంతో ఏమీ చేయలేక, అతని తేజోవిశేషాన్ని చూచి బెదరి చెదరిన హృదయాలతో ఆర్తరక్షకుడైన శ్రీహరిని శరణు పొందుదా మనుకొని...

తెభా-6-324-లగ్రా.
"వీఁడు కడు దుర్దముఁడు వాఁడి మన కైదువులు;
పోఁడి చెడఁగా మెసఁగి యీడు గనకున్నాఁ;
డే బ్రతుకింకఁ? బెనుకీడు పొడమెన్ మనకుఁ;
దోడుపడ నొక్కరుఁడు లేఁడు హరి దక్కన్;
వేఁడుదము శ్రీధరునిఁ; గూడుదము సద్భటులఁ;
బాడుదము గీతముల; జాడఁపడు నంతన్
వీఁడు చెడు త్రోవ దయతో నెఱిగించు ఘనుఁ;
డోక సురాలయము పాడుపడ దింకన్. "

టీక:- వీడు = ఇతడు; కడు = మిక్కిలి; దుర్దముడు = ఓడింపరానివాడు; వాడి = పదునైన; మన = మన యొక్క; కైదువులు = ఆయుధముల; పోడి = గొప్పదనము; చెడగ = పాడైపోవునట్లు; మెసఁగి = తినేసి; ఈడు = సరిసాటివారు; కనక = కనబడక; ఉన్నాడు = ఉన్నాడు; ఏడ = ఎక్కడ; బ్రతుకు = బతుకుటకు గలదు; ఇంక = ఇంక; పెను = పెద్ద; కీడు = ఆపద; పొడమెన్ = కలిగెను; మన = మన; కున్ = కు; తోడుపడ = సహాయము చేయ; ఒక్కరుడున్ = ఇంకెవ్వరును; లేడు = లేరు; హరి = నారాయణుడు; తక్కన్ = తప్పించి; వేడుదము = వేడుకొనెదము; శ్రీధరునిన్ = విష్ణుమూర్తిని {శ్రీ ధరుడు - శ్రీ (లక్మీదేవిని) (వక్షమున) ధరుడు (ధరించినవాడు), విష్ణువు}; కూడుదము = కలసెదము; సద్భటులన్ = సుసేవకులను, మంచి విష్ణుభక్తులను; పాడుదము = ఆలపించెదము; గీతములన్ = కీర్తనలను; జాడపడునంతన్ = కనబడువరకు; వీడు = ఇతడు; చెడు = నాశనమగు; త్రోవ = దారి; దయ = కృప; తోడన్ = తోటి; ఎఱిగించు = తెలుపును; ఘనుడు = గొప్పవాడు (నారాయణుడు); ఓడక = అవశ్యము; సురాలయము = స్వర్గము {సురాలయము - సురల (దేవతల) ఆలయము (నివాసము), స్వర్గము}; పాడుపడదు = పాడైపోదు; ఇంకన్ = ఇక.
భావము:- “ఈ వృత్రాసురుడు మనకు అజేయుడు. మన పదునైన ఆయుధాలన్నీ మ్రింగివేశాడు. వీనికి సాటి అయిన మేటి ఎక్కడా లేడు. ఇక మన బ్రతుకులు పాడైపోయాయి. మనకు కీడు మూడింది. ఇప్పుడు శ్రీహరి తప్ప మనకు తోడుపడేవాడు ఎవ్వడూ లేడు. అందువల్ల ఆ శ్రీమన్నారాయణుని రక్షింపమని వేడుకుందాము. ఆయన భక్తులతో చెలిమి చేద్దాము. ఆయనకు జాలి కలిగేటట్లు సంకీర్తనలు చేద్దాము. మనం అలా చేస్తే ఆ స్వామి కరుణించి వీడు నాశనమయ్యే విధానం మనకు దయతో వెల్లడిస్తాడు. అప్పుడు మన స్వర్గం పాడుపడకుండా ఉంటుంది”.

తెభా-6-325-క.
ని తలపోయుచుఁ దమలో
మునుకుచుఁ దికమకలు గొనుచు మురరిపు కడకున్
గునుకుచుఁ దినుకుచుఁ నేగిరి
రాక్షసుఁ గన్న కన్నుఁవ బెగ్గిలఁగన్.

టీక:- అని = అని; తలపోయుచున్ = అనుకొనుచు; తమలోన్ = తమలోతాము; మునుకుచున్ = సంతాపించుచు; తికమకలుగొనుచు = తిరమకపడుతు; మురరిపు = విష్ణుమూర్తి; కడ = వద్ద; కున్ = కి; కునుకుచున్ = తూగుతూ; తినుకుచున్ = ముక్కుతూ; ఏగిరి = వెళ్లిరి; ఘన = గొప్ప; రాక్షసు = రాక్షసుని; కన్న = చూసిన; కన్ను = కళ్ళు; గవ = రెండు; బెగ్గిలన్ = భీతిచెందగా.
భావము:- అని దేవతలు తమలో తాము తికమకలు పడుతూ సందేహిస్తూ ఎలాగో పోలేక పోలేక విష్ణువు సన్నిధికి వెళ్ళారు. దారి పొడవునా ఎక్కడ చూసినా వారి కన్నులకు వృత్రాసురుని భయంకర రూపమే కనిపించింది.

తెభా-6-326-వ.
ఇట్లు భయార్తులై యమర్త్యవ్రాతంబు చనిచని ముందట నభంగ భంగ రంగ దుత్తుంగ డిండీర మండల సముద్దండాడంబర విడంబిత నారాయణ నిరంతర కీర్తిలతా కుసుమగుచ్ఛ స్వచ్ఛంబును, అనవరత గోవింద చరణారవింద సేవా సమాకుల కలకలఫలిత మహాపుణ్య ఫలాయమాన సముద్దీపితావర్తవర్తిత దక్షిణావర్త రుచిర శంఖమండల మండితంబును, నతినిష్ఠుర కఠిన పాఠీన పృథురోమ రాజిసంకుల తిమి తిమింగిల కర్కట కమఠ కచ్ఛప మకర నక్ర వక్రగ్రహ గ్రహణ ఘుమఘుమారావ దారుణగమన విషమిత విషమ తరంగఘట్టన ఘట్టిత సముద్ధూత శీకర నికర నీరంధ్ర తారకిత తారాపథంబును, మహోచ్ఛ్రయ శిలోచ్చయ శిఖరాగ్ర ప్రవహిత దుగ్ధనిర్ఝర సమ్మార్జిత పురాణపురుష విశుద్ధ శుద్ధాంత విహరణధురీణ నవవసుధాధౌత ధావళ్య ధగద్ధగాయమాన రమ్య హర్మ్య నిర్మాణ కర్మంబును, నతి పవిత్రగుణ విచిత్ర నిజకళత్ర ప్రేమానంద సందర్శిత ముకుంద పరిస్రవదంతరంగ కరుణారస పరిమిళిత భావబంధుర విద్రుమ వల్లీమతల్లి కాంకుర శోభితంబును, ప్రసిద్ధ సిద్ధరసాంబువాహ సంగమ సముత్థిత గంభీర ఘోష పరిదూషిత సకల రోదోంతరాళంబును, సముద్రమేఖలాఖిల ప్రదేశ విలసిత నవీన దుకూలాయమానంబును, హరిహర ప్రముఖ దేవతానిచయ పరిలబ్ధామృత మహైశ్వర్య దానధౌరేయ మహానిధానంబును, వైకుంఠపుర పౌరవర కామ్యఫలఫలిత మందార పారిజాత సంతాన కల్పవృక్ష హరిచందన ఘన వనానుకూలంబు నునై యొప్పుచుఁ గుబేరు భాండాగారంబును బోలెఁ బద్మ, మహా పద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర సమగ్రంబై, విష్ణు కరకమలంబునుం బోలె సుదర్శనావర్త ప్రగల్భంబై, కైలాస మహీధరంబునుం బోలె, నమృతకళాస్థాన శేఖరపదార్పణంబై, యింద్ర వైభవంబునుం బోలెఁ గల్పవృక్ష, కామధేను, చింతామణి జనితంబై, సుగ్రీవసైన్యంబునుం బోలె నపరిమిత నిబిడ హరిసంచారంబై, నారా యణోదరంబునుం బోలె నఖిల భువన భారభరణ సమర్థంబై, శంకరు జటాజూటంబును బోలె గంగాతరంగిణీ సమాశ్రయం బై, బ్రహ్మలోకంబునుం బోలె బరమహంసకుల సేవ్యంబై, పాతాళ లోకంబునుం బోలె ననంత భోగి భోగయోగ్యంబై, నందనవనంబునుం బోలె నైరావత మాధవీ రంభాది సంజననకారణంబై, సౌదామినీ నికరంబునుం బోలె నభ్రంకషంబై, విష్ణునామకీర్తనంబునుం బోలె నిర్మలస్వభావంబై, క్రతు శతగతుండునుం బోలె హరిపదభాజనంబై యొప్పుచున్న దుగ్థవారాశి డాసి, శ్వేతద్వీపంబున వసియించి, యందు సకల దిక్పాలకాది దేవతలు దేవదేవు నాశ్రయించి యిట్లని స్తుతియించి; రంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; భయ = భయముచే; ఆర్తులు = బాధపడువారు; ఐ = అయ్యి; అమర్త్య = దేవతా {అమర్త్యులు - మరణములేనివారు, దేవతలు}; వ్రాతంబు = సమూహము; చనిచని = వెళ్లి; ముందటన్ = ఎదురుగ; అభంగ = భంగపాటునొందని; భంగ = అలలతో; రంగత్ = ఒప్పుతున్న; ఉత్తుంగ = ఎత్తైన; డిండీర = నురగల; మండల = ముద్దలతో; సమ = మిక్కిలి; ఉద్దండ = అధికమైన; ఆడంబర = ఆడంబరముతో; విడంబిత = కలగలసిన; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; నిరంతర = ఎడతెగని; కీర్తి = యశస్సు యనెడి; లతా = లతల యొక్క; కుసుమ = పూల; గుచ్ఛ = గుత్తుల; స్వచ్ఛంబును = స్వచ్ఛతయును; అనవరత = ఎల్లప్పుడు; గోవింద = విష్ణుమూర్తి యొక్క; చరణ = పాదము లనెడి; అరవింద = పద్మములను; సేవా = సేవించుటల; సమాకుల = చక్కగా కలిగిన; కలకల = కలకలములచే; ఫలిత = ఫలించినట్టి; మహా = గొప్ప; పుణ్య = పుణ్యము; ఫలాయమాన = పరిపక్వతగల; సమ = మిక్కిలి; ఉద్దీపిత = ప్రకాశించుతున్న; ఆవర్త = సుడులు తిరుగుతూ; వర్తిత = ప్రవర్తిల్లుతున్న; దక్షిణావర్త = కుడివైపునకు సుడి తిరిగి; రుచిర = వెలుగొందుతున్న; శంఖ = శంఖముల; మండల = మండలములచే; మండితంబునున్ = ప్రకాశించుతున్నదియు; అతి = మిక్కిలి; నిష్ఠుర = పరుషమైన; కఠిన = గట్టి; పాఠీన = వేయి కోరల చేపల; పృథు = బిరుసైన; రోమ = రోమముల; రాజి = సమూహముతో; సంకుల = వ్యాపించిన; తిమి = పెద్దచేప {తిమి - నూరు యోజనముల పొడవుగల చేప, పెద్దచేప}; తిమింగల = తిమింగలము {తిమింగలము - తిమిని మింగెడు చేప}; కర్కట =పీత, ఎండ్రకాయ; కమఠ = తాబేలు; కచ్ఛప = మెట్టతాబేలు; మకర = మొసలి; నక్ర = పెద్ద మొసలి; వక్రగ్రహ = సెలయేటి మొసళ్ళు; గ్రహణ = పట్టుటలతో; ఘుమఘుమ = ఘుమఘుమ యనెడి; ఆరావ = శబ్దములతో; దారుణ = భయంకరమైన; గమన = గమనములతో; విషమిత = మిక్కిలి చలిస్తున్న; విషమ = ఎత్తైన; తరంగ = అలల; ఘట్టన = తాకిడులచే; ఘట్టిత = కొట్టబడిన; సమ = మిక్కిలి; ఉద్ధూత = చిందుతున్న; శీకర = తుంపరల; నికర = గుంపులచే; నీరంధ్ర = దట్టమైన; తారకిత = తారకలదిగ జేయబడి నట్టి; తారాపథంబును = తారాపథమును; మహా = గొప్ప; ఉచ్ఛ్రయ = ఉన్నతమైన; శిలోచ్చయ = బండరాళ్లమయమైన; శిఖర = కొండశిఖరముల; అగ్ర = పైన; ప్రవహిత = ప్రవహించెడి; దుగ్ధ = పాల; నిర్ఝర = సెలయేర్లచే; సమ = చక్కగా; ఆర్జిత = సేవింపబడుతున్న; పురాణపురుష = నారాయణుని; విశుద్ధ = పరిశుద్ధమైన; శుద్ధాంత = అంతఃపుర; విహరణ = విహరించుటలో; ధురీణ = నేర్పరి; నవ = కొత్తగా; వసుధాధౌత = సున్నము కొట్టబడిన; ధావళ్య = తెల్లదనముతో; ధగధగాయమాన = తళతళలాడి పోతున్న; రమ్య = మనోహరమైన; హర్మ్య = భవనముల; నిర్మాణకర్మంబున = నిర్మించుటవలన; అతి = మిక్కిలి; పవిత్ర = పావన; గుణ = గుణములతో; విచిత్ర = విశిష్టముగ చిత్రింపబడినది; నిజ = తన; కళత్ర = భార్య; ప్రేమానంద = ప్రేమ ఆనందములను; సందర్శిత = చూసిన; ముకుంద = నారాయణుని; పరిస్రవత్ = కరగుతున్న; అంతరంగ = మనసు నందలి; కరుణా = దయా; రస = రసముచే; పరిమళిత = పరిమళిస్తున్న; భావబంధుర = భావములతో నిండిన; విద్రుమ = పగడాల; వల్లీమతల్లిక = లతల యొక్క; అంకుర = మొలకలచే; శోభితంబును = శోభించుతున్నది; ప్రసిద్ధ = ప్రసిద్ధమైన; సిద్దరస = మంచినీటి; అంబువాహ = నదుల; సంగమ = సముద్రసంగమముచే; సమ = ఎక్కువగా; ఉత్థిత = పుట్టిన; గంభీర = గంభీరమైన; ఘోష = సముద్రపు ఘోషచే; పరిదూషిత = తిరస్కరింపబడిన; సకల = సమస్తమైన; రోదస్ = అంతరిక్షము; అంతరాళంబును = లోపలంతయు గలది; సముద్ర = సముద్రము యనెడి; మేఖల = మొలనూలుగాగల; అఖిల = సమస్తమైన; ప్రదేశ = భూప్రదేశముతో; విలసిత = సుందరమైన; నవీన = కొత్త; దుకూలాయమానంబును = పట్టుబట్టల వంటిది; హరి = విష్ణుమూర్తి; హర = పరమశివుడు; ప్రముఖ = మొదలగు; దేవతా = దేవతల; నిచయ = సమూహమునకు; పరిలబ్ధ = చక్కగా లభించిన; అమృత = అమృతము యనెడి; మహా = గొప్ప; ఐశ్వర్య = ఐశ్వర్యమును; దాన = దక్కునట్లు చేసిన; ధౌరేయ = సామర్థ్యము యొక్క; మహా = గొప్ప; నిధానంబును = నిధియును; వైకుంఠపుర = వైకుంఠములో నుండెడి; పౌర = జనుల; వర = ఉత్తముల; కామ్య = కోరిన కోరికలు; ఫల = తీర్చెడి; ఫలిత = ఫలవంతమైన; మందార = మందారము; పారిజాత = పారిజాతము; సంతాన = సంతానము; కల్పవృక్ష = కల్పవృక్షము {కల్పవృక్షములలో రకములు - 1మందారము 2పారిజాతము 3సంతానము 4కల్పవృక్షము 5హరిచందనము}; హరిచందన = మంచి గంధముల; ఘన = గొప్ప; వన = తోటలతో; అనుకూలంబును = అనుకూలముగా నున్నది; ఐ = అయ్యి; ఒప్పుచున్ = ఒప్పుతూ; కుబేరు = కుబేరుని; భాండాగారంబును = ధనాగారము; పోలె = వలె; పద్మ = పద్మము {నవనిధులు - 1పద్మము 2మహాపద్మము 3శంఖము 4మకరము 5కచ్చపము 6ముకుందము 7కుందము 8నీలము 9వరము}; పద్మ = పద్మరాగరత్నములు; మహాపద్మ = మహాపద్మము; మహాపద్మ = పెద్దపద్మ రాగ రత్నములు; శంఖ = శంఖము; శంఖ = శంఖములు; మకర = మకరము; మకర = మొసళ్ళు; కచ్ఛప = కచ్ఛపము; కచ్చప = తాబేళ్ళు; ముకుంద = ముకుందము; ముకుంద = ముకుందరత్నము; కుంద = కుందము; కుంద = కుందరత్నము; నీల = నీలము; నీల = నీలమణులతో; వర = వరములతో; వర = శ్రేష్ఠమై; సమగ్రంబు = సంపూర్ణమైనది; ఐ = అయ్యి; విష్ణు = నారాయణుని; కర = చేతులు యనెడి; కమలంబునున్ = పద్మములను; పోలెన్ = వలె; సుదర్శనా = సుదర్శనచక్రము యొక్క; సుదర్శనా = చక్కగా కనబడెడి; ఆవర్త = సుడి గలిగి వర్తించెడి; ఆవర్త = సుడిగుండములు కలిగి ఉండెడి; ప్రగల్భంబు = ప్రతిభగలది; ఐ = అయ్యి; కైలాస = కైలాసము యనెడి; మహీధరంబునున్ = పర్వతము {మహీధరము - మహి (భూమి)ని ధరము (ధరించెడిది), పర్వతము}; పోలెన్ = వలె; అమృతకళాస్థానశేఖర = పరమశివుని {అమృత కళాస్థాన శేఖరుడు - అమృత (అందమైన) కళా (కళలకు) ఆస్థాన (నివాసమైన చంద్రుని) శేఖరుడు (శిఖ యందు ధరించినవాడు), పరమశివుడు}; పద = పాదములకు; అర్పణంబు = అర్పింపబడినది; ఐ = అయ్యి; ఇంద్ర = ఇంద్రుని; వైభవంబు = వైభవము; పోలెన్ = వలె; కల్పవృక్ష = కల్పవృక్షము {కల్పవృక్షము - కల్ప (భావించిన వానిని యిచ్చెడి) వృక్షము (చెట్టు)}; కామధేను = కామధేనువు {కామధేనువు - కామ (కోరినవి యిచ్చెడి) ధేనువు (ఆవు)}; చింతామణి = చింతామణి {చింతామణి - చింత (చింతించినవానిని యిచ్చెడి) మణి (రత్నము)}; జనితంబు = కలిగినది; ఐ = అయ్యి; సుగ్రీవ = సుగ్రీవుని; సైన్యంబును = సైన్యము; పోలెన్ = వలె; అపరిమిత = లెక్కలేనన్ని; నిబిడ = దట్టమైన; హరి = కోతుల, నారాయణుని; సంచారంబు = సంచరించుటలు గలది; ఐ = అయ్యి; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; ఉదరంబునున్ = కడుపును; పోలెన్ = వలె; అఖిల = సమస్తమైన; భువన = లోకములను; భువన = భూమి యొక్క; భార = బరువును; భరణ = భరించగల; సమర్థంబు = ప్రతిభ గలది; ఐ = అయ్యి; శంకరు = పరమశివుని; జటా = జటల; జూటంబునున్ = చుట్టలను; పోలెన్ = వలె; గంగా = గంగానది యొక్క; గంగా = నీటి; తరంగణీ = అలలతో; సమాశ్రయంబు = మిక్కిలి చేరినది; ఐ = అయ్యి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; లోకంబునున్ = లోకమును; పోలెన్ = వలె; పరమహంస = పరమహంసల; పరమహంస = శ్రేష్ఠమైన హంసల; కుల = సమూహములచే; కుల = గుంపులచే; సేవ్యంబు = కొలువబడునది; సేవ్యంబు = తాగబడుతున్నది; ఐ = అయ్యి; పాతాళ = పాతాళము యనెడి; లోకంబునున్ = లోకమును; పోలెన్ = వలె; అనంత = ఆదిశేషుడు యనెడి; అనంత = అంతులేని; భోగి = సర్పము యొక్క; భోగి = భోగములను; భోగ = పడగలచే; భోగ = అనుభవించుటకు; యోగ్యంబు = యోగ్యత గలది; యోగ్యంబు = అనుకూలమైనది; ఐ = అయ్యి; నందన = నందనము యనెడి; వనంబునున్ = వనము; పోలెన్ = వలె; ఐరావత = నిమ్మచెట్లు; ఐరావత = ఇంద్రుని ఐరావతము; మాధవీ = మాధవీలతలు; మాధవీ = లక్ష్మీదేవి; రంభ = అరటిచెట్లు; రంభ = అప్సరస రంభ; ఆది = మొదలగువాని; ఆది = మొదలైనవారి; సంజనన = పుట్టుటకు; కారణంబు = కారణము; ఐ = అయ్యి; సౌదామినీ = మెరుపుతీగల; నికరంబు = సమూహముల; పోలెన్ = వలె; అభ్రంకషము = ఆకాశమును అంటునది; అభ్రంకషము = ఆకాశమునంటెడి అలలుగలది; ఐ = అయ్యి; విష్ణు = నారాయణుని; నామ = నామములను; కీర్తనంబునున్ = స్తుతించుటను; పోలెన్ = వలె; నిర్మల = స్వచ్ఛమైన; స్వభావంబున్ = లక్షణము గలది; ఐ = అయ్యి; క్రతు = యజ్ఞములు; శత = నూరింటిని; గతుండునున్ = చేసినవాని; పోలెన్ = వలె; హరి = ఇంద్రుని; హరి = నారాయణుని; పద = పదవికి; పద = పాదములను; భాజనంబు = యోగ్యత గలవాడు; భాజనంబు = నివాసమైనది; ఐ = అయ్యి; ఒప్పుచున్న = చక్కనైన; దుగ్ధవారాశిన్ = పాలసముద్రమును; డాసి = చేరి; శ్వేతద్వీపంబునన్ = శ్వేతద్వీపము నందు; వసియించి = చేరి; అందు = దానిలో; సకల = సమస్తమైన; దిక్పాలక = దిక్పాలకులు; ఆది = మొదలగు; దేవతలు = దేవతలు; దేవదేవున్ = విష్ణుమూర్తిని; ఆశ్రయించి = శరణుకోరి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించిరి = కీర్తించిరి; అంత = అంతట.
భావము:- ఈ విధంగా భయకంపితులైన దేవతలు పోయి పోయి పాలసముద్రం చేరుకున్నారు. ఆ సముద్రమంతటా శ్రీమన్నారాయణుని కీర్తి లతలకు పూచిన తెల్లని పూల గుత్తుల వలె ప్రకాశిస్తున్న నురుగు ముద్దలు, ఎత్తుగా ఎగిరి పడుతున్న తరంగాలపై అంతటా కనిపిస్తున్నవి. నిరంతరం గోవిందుని పాదపద్మాల సేవలో అనురక్తులైన భక్తుల పుణ్యఫలాల వలె సుడులతో తిరుగుతున్న దక్షిణావర్త శంఖాలు విరాజిల్లుతున్నాయి. మిక్కిలి కఠినంగా ఉన్న వేయి కోరలు, పృథురోమాలు కలిగిన తిమి తిమింగిలాలు మొదలైన మహా మత్స్యాలు, పీతలు, తాబేళ్ళు, మొసళ్ళు మొదలైన జలచరాలు గిరిగిరా గుండ్రంగా తిరుగుతున్నాయి. వాటి వక్రగమనం ఏర్పడే సముద్ర తరంగాల పై ఎగిరిపడే పాల తుంపురులు ఆకాశం నిండా నక్షత్రాల వలె మెరుస్తున్నాయి. ఆ సముద్రంలో పెద్ద పెద్ద పర్వతాలున్నాయి. ఆ పర్వత శిఖరాలపై సముద్ర తరంగాలు ఎగిరిపడి క్రిందికి ప్రవహిస్తున్నాయి. అవి మిక్కిలి పరిశుద్ధమైన అంతఃపురాలలో విహారాలలో క్రొత్తగా సున్నం కొట్టబడిన తెల్లని కాంతులతో ధగధగలాడే అందమైన మేడల వలె, మందిరాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ క్షీరసాగరంలో పగడాల తీగలున్నాయి. అవి తన రమణీమణులతో క్రీడించే గోవిందుని ఆనందాన్ని ప్రదర్శిస్తూ కరిగిపోయిన ఆయన అంతరంగం నుండి కరుణారసంతో కూడిన అనురాగ తరంగాల వలె అలరారుతున్నాయి. సిద్ధరసాలైన మేఘాలు ఆ సముద్రంలో నుండి నీరు నింపుకొంటున్నాయి. ఆ మేఘాలు పరస్పరం ఒరుసుకోవటం వల్ల సంభవించిన గంభీరమైన ఉరుములతో భూమ్యాకాశాలు దద్దరిల్లుతున్నాయి. భూమికి మేఖల అయిన ఈ సముద్ర జలాలు క్రొంగ్రొత్త పట్టుచీర వలె ఒప్పుతున్నాయి. విష్ణువు, శివుడు మొదలైన దేవతలకు అమృతాన్ని అందించే మహైశ్వర్యంతో కూడిన ఔదార్యసంపదకు ఆ పాలసముద్రం నిధానంగా ఉన్నది. వైకుంఠనగర వాసుల కోరికలు తీర్చే మందారం, పారిజాతం, సంతానం, కల్పవృక్షం, హరిచందనం వంటి దేవతా వృక్షాలు ఆ సముద్రం ఒడ్డున కనువిందు చేస్తున్నాయి. ఆ సముద్రం పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్ఛపం మొదలైన వాటితో కూడి నవనిధులతో కూడిన కుబేరుని ధనాగారం వలె ఉన్నది. మంచి దర్శనాన్ని ఇస్తూ శోభించే ఆ సముద్ఱ్ఱం సుదర్శన చక్రంతో కూడిన విష్ణుదేవుని కరకమలం వలె ఉన్నది. అమృత కిరణుడైన చంద్రుని కళలకు ఆస్థానమైన ఆ సముద్రం చంద్రకళాశేఖరుని కైలాసం వలె ఉన్నది. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి మొదలైన వానికి జన్మస్థానమైన ఆ సముద్రం దేవేంద్ర వైభవాన్ని పుణికి పుచ్చుకున్నట్లున్నది. అపరిమితమైన హరి సంచారంతో కూడిన ఆ సముద్రం అపరిమిత హరి (కోతుల) సంచారం కలిగిన సుగ్రీవుని సైన్యం వలె ఉన్నది. సమస్త లోకాల భారాన్ని భరించటానికి సమర్థమైన ఆ సముద్రం విష్ణుదేవుని ఉదరం వలె ఉన్నది. పరమహంస సమూహాలకు సేవింపదగిన ఆ సముద్రం బ్రహ్మలోకం వలె ఉన్నది. అనంత భోగ భాగ్యాలకు యోగ్యమైన ఆ సముద్రం పాతాళలోకం వలె ఉన్నది. ఐరావతం, లక్ష్మీదేవి, రంభ మొదలైనవారి పుట్టుకకు కారణమైన ఆ సముద్రం మెరుపుతీగల సమూహం వలె మేఘాలను తాకుతున్నది. హరినామ సంకీర్తనం వలె నిర్మల భావం కలిగి ఉన్నది. నూరు యజ్ఞాలు చేసినవాని వలె దేవేంద్రపదవికి తగి ఉన్నది. అటువంటి పాల సముద్రాన్ని సమీపించి, శ్వేతద్వీపాన్ని చేరిన దిక్పాలకులు మొదలైన దేవతలు దేవదేవుడైన విష్ణువును ఆశ్రయించి ఈ విధంగా స్తుతించారు.

తెభా-6-327-సీ.
"పంచమహాభూత రినిర్మితంబైన-
ముజ్జగంబుల కెల్ల నొజ్జ యైన
బ్రహ్మయు నేమును రఁగ నందఱుఁ గూడి-
యెవ్వనికై పూజలిత్తు మెపుడు
ట్టి సర్వేశ్వరుం డాగమ వినుతుండు-
ర్వాత్మకుఁడు మాకు రణ మగును
తిపూర్ణకాము నహంకారదూరుని-
ముని శాంతునిఁ గృపాస్పదుని గురుని

తెభా-6-327.1-తే.
మాని యన్యుని సేవింపఁ బూనునట్టి
పటశీలుని నతి పాపర్మబుద్ధి
శుక వాలంబు పట్టుక తరాబ్ధి
రియఁ జూచుట గాదె? తాఁ దామసమున.

టీక:- పంచమహాభూత = పంచ మహా భూతములచే {పంచ మహా భూతములు - 1పృథివి 2అప్పు 3తేజస్సు 4వాయువు 5ఆకాశము}; పరినిర్మితంబు = నిర్మాణముచేయబడినది; ఐన = అయిన; ముజ్జగంబుల్ = ముల్లోకముల {ముల్లోకములు - 1స్వర్గము 2మర్త్యము 3పాతాళము}; కున్ = కు; ఎల్ల = అన్నిటికిని; ఒజ్జ = గురువు; ఐన = అయిన; బ్రహ్మయున్ = బ్రహ్మదేవుడు; నేమునున్ = నేను; పరగన్ = ప్రసిద్దముగ; అందఱున్ = అందరము; కూడి = కలిసి; ఎవ్వని = ఎవని; కై = కోసమై; పూజలు = సేవించుటలు; ఇత్తుము = సమర్పించెదము; ఎపుడున్ = ఎల్లప్పుడును; అట్టి = అటువంటి; సర్వేశ్వరుండు = విష్ణుమూర్తి {సర్వేశ్వరుడు - సర్వులకు (అందరకును) ఈశ్వరుడు (ప్రభువు), విష్ణువు}; ఆగమవినుతుండు = విష్ణుమూర్తి {ఆగమ వినుతుడు - ఆగమ (వేదముల)చే వినుతుడు (కీర్తింపబడువాడు), విష్ణువు}; సర్వాత్మకుడు = విష్ణుమూర్తి {సర్వాత్మకుడు - సర్వ (సమస్త ప్రాణుల) ఆత్మకుడు (ఆత్మలలో యుండెడివాడు), విష్ణువు}; మా = మా; కున్ = కు; శరణము = రక్ష; అగును = అగుగాక; అతిపూర్ణకామున్ = నారాయణుని {అతి పూర్ణ కాముడు - పూర్తిగా తీరిన కోరికలు గలవాడు, విష్ణువు}; అహంకారదూరుని = నారాయణుని {అహంకార దూరుడు - అహంకారము లేనివాడు, విష్ణువు}; సముని = నారాయణుని {సముడు - సర్వము యెడల సమమైన భావము గలవాడు, విష్ణువు}; శాంతుని = నారాయణుని {శాంతుడు - శాంతమైన స్వభావము గలవాడు, విష్ణువు}; కృపాస్పదుని = నారాయణుని {కృపాస్పదుడు - దయకు నివాసమైనవాడు, విష్ణువు}; గురుని = నారాయణుని {గురుడు - పెద్దవాడు, విష్ణువు};
మాని = వదలి; అన్యుని = ఇతరుని; సేవింపన్ = పూజింప; పూను = పూనుకొను; అట్టి = అటువంటి; కపట = కపటమైన; శీలుని = ప్రవర్తనము గలవాని; అతి = మిక్కిలి; పాప = పాపపు; కర్మ = కార్యములు చేసెడి; బుద్ధిన్ = బుద్ధి గలవాని; శునక = కుక్క; వాలంబు = తోక; పట్టుక = పట్టుకొని; ఘనతర = అతిపెద్దదైన {ఘన - ఘనతర - ఘనతమ}; అబ్ధిధి = సముద్రమును; తరియన్ = దాటవలెనని; చూచుట = అనుకొనుట; కాదె = కాదా ఏమి; తాన్ = తను; తామసమునన్ = తామస గుణముతో.
భావము:- పంచభూతాలతో నిర్మింపబడిన ఈ ముల్లోకాలకు గురువైన బ్రహ్మదేవుడు, మేము కలిసి ఎవరిని పూజిస్తామో ఆ సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, వేదవేద్యుడు మాకు శరుణు. పరిపూర్ణుడు, నిరహంకారుడు, సర్వసముడు, శాంతస్వరూపుడు, కరుణామయుడు అయిన ఆ జగద్గురువును కాదని అన్యులను సేవించేవాడు కపటశీలుడు, దొంగ. అటువంటి ధూర్తుడు కుక్కతోక పట్టుకొని మహాసముద్రాన్ని దాటడానికి ప్రయత్నించే బుద్ధిహీనుని వంటివాడు కదా!

తెభా-6-328-చ.
కమయంబునన్ వసుధ నోడగఁ జేసి తనర్చు కొమ్మునన్
లక యంటఁగట్టి మనుల్లభుఁ గాచిన మత్స్యమూర్తి స
మ్మమున మమ్ము బ్రోచు ననుమానము మానఁగ వృత్రుచేతి యా
దొలగించి నేఁడు సురపాలుర పాలిటి భాగ్య దైవమై.

టీక:- ఉదక = నీటితో; మయంబునన్ = నిండినదాని యందు; వసుధన్ = భూమండలమును; ఓడగన్ = పడవగా; చేసి = చేసి; తనర్చు = విజృంభించిన; కొమ్మునన్ = కొమ్ము నందు; వదలక = విడువక; అంటగట్టి = తగుల్చుకొని; మను = మనువైన (సత్యవ్రతుడు); వల్లభున్ = శ్రేష్ఠుని; కాచిన = కాపాడిన; మత్స్యమూర్తి = మత్స్యావతారుడు; సమ్మదమునన్ = సంతోషముతో; మమ్మున్ = మమ్మలను; ప్రోచున్ = కాపడును; అనుమానము = సందేహము; మానగన్ = పోవునట్లుగ; వృత్రు = వృత్రాసురుని; చేతి = చేతిలో; ఆపద = విపత్తులను; తొలగించి = పోగొట్టి; నేడు = ఈ దినమున; సుర = దేవతల; పాలురన్ = ప్రభువుల; పాలిటి = ఎడల; భాగ్య = భాగ్యముల నిచ్చెడి; దైవము = దేవుడు; ఐ = అయ్యి.
భావము:- సమస్త సృష్టి జలమయ మైనప్పుడు ఈ భూమిని ఓడగా చేసి తన ముట్టెపై నున్న కొమ్ముకు కట్టుకొని సత్యవ్రతుడనే మనువును, మమ్ములను కాపాడిన మత్స్యమూర్తి అయిన శ్రీహరి మా పాలిటి భాగ్యదేవతయై ఈనాడు ఈ వృత్రాసురుని బారినుండి సమ్మోదంతో మమ్ములను రక్షించుగాక!

తెభా-6-329-మత్త.
రంతు చేయుచు వాతధూత కరాళ భంగుర భంగ దు
ర్దాం సంతత సాగరోదక ల్ప మొంది వసించు బ
మ్మంవానిని బొడ్డుఁదమ్మిని నాఁచి కాచిన నేర్పరిం
తంవాఁ డనరాని యొంటరి యాదరించు మముం గృపన్.

టీక:- రంతు = క్రీడించుట; చేయుచున్ = చేయుచూ; వాత = గాలిచే; ధూత = ఎగురగొట్టబడిన; కరాళ = వెరపు పుట్టించెడి; భంగుర = విరిగిపడెడి; భంగ = అలలతో; దుర్దాంత = దాటరాని, దుస్తరమైన; సంతత = శాశ్వతముగ; సాగర = సముద్రపు; ఉదక = నీటి; తల్పము = పాన్పు, మంచము; ఒంది = పొంది; వసించు = నివసించెడి; బమ్మ = బ్రహ్మ; అంతవానిని = అంతవాడిని; బొడ్డు = నాభి; తమ్మి = కమలమున; ఆచి = ఉంచుకొని; కాచిన = కాపాడిన; నేర్పరిన్ = నేర్పరిని; ఇంతంతవాడు = ఇంతటి వాడు; అనరాని = అనుటకు శక్యము కానివాడు; ఒంటరి = ఏకాత్మ; ఆదరించున్ = మన్నించును; మమున్ = మమ్ములను; కృపన్ = దయతో.
భావము:- ప్రళయకాలంలో పెనుగాలులతో అల్లకల్లోలమైన సముద్ర తరంగాలను శయ్యగా చేసుకొని పవళించినవాడు, ఆ మహాసాగరంలో పడిపోకుండా బ్రహ్మ అంతటివాణ్ణి తన నాభికమలంలో దాచి రక్షించినవాడు, ఇంతటివాడు అంతటివాడు అనే నిర్ణయాలకు అందనివాడు అయిన అద్వితీయుడు మమ్ములను దయతో ఆదరించుగాక!

తెభా-6-330-తే.
దేవతలమైన మే మిట్టి దేవదేవు
ర్వలోక శరణ్యుని రణు చొచ్చి
లితమైనట్టి వీని యాదలఁ బాసి
మీఱి శుభములఁ జేకొనువా మిపుడు."

టీక:- దేవతలము = వేల్పులము; ఐన = అయినట్టి; మేము = మేము; ఇట్టి = ఇటువంటి; దేవదేవున్ = నారాయణుని {దేవ దేవుడు - దేవ (దేవుళ్ళ)కు దేవుడు, విష్ణువు}; సర్వలోకశరణ్యుని = నారాయణుని {సర్వ లోక శరణ్యుడు - సర్వ (సమస్తమైన) లోక (లోకములకు) శరణ్యుడు (అభయము నిచ్చువాడు), విష్ణువు}; శరణుచొచ్చి = రక్షణకోరి; బలితము = బలిష్ఠము; ఐనట్టి = అయినట్టి; వీని = ఇతనివలన; ఆపదలను = కీడులను; పాసి = తొలగించుకొని; మీఱి = అతిశయించి; శుభములన్ = శుభములను; చేకొనువారము = పొందితిమి; ఇపుడు = ఇప్పుడు.
భావము:- దేవతలమైన మేము ఇటువంటి దేవదేవుని, సర్వలోక శరణ్యుని శరణు జొచ్చి ఆ వృత్రాసురుని ఆపదనుండి విముక్తి పొంది సకల శుభాలను అందుకోగలం.”

తెభా-6-331-వ.
ఇట్లు స్తుతియించుచున్న దేవతలకు భక్తవత్సలుండైన వైకుంఠుండు ప్రసన్నుం డయ్యె నప్పుడు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; స్తుతియించుతున్న = కీర్తించుతున్న; దేవతల్ = దేవతల; కున్ = కు; భక్త = భక్తుల యెడ; వత్సలుండు = వాత్సల్యము గలవాడు; ఐన = అయిన; వైకుంఠుండు = విష్ణుమూర్తి {వైకుంఠుడు - వైకుంఠమున యుండువాడు, విష్ణువు}; ప్రసన్నుండు = సంతుష్టుండు; అయ్యెన్ = అయ్యెను; అప్పుడు = అప్పుడు.
భావము:- అని ఈ విధంగా పొగడుతున్న దేవతలకు భక్తవత్సలుడు, వైకుంఠవాసుడు అయిన శ్రీహరి ప్రసన్నుడైనాడు. అప్పుడు...

తెభా-6-332-సీ.
గు శంఖ చక్ర గదా ధరుం డగువానిఁ-
శ్రీవత్స కౌస్తుభ శ్రీల వానిఁ
మనీయ మాణిక్య న కిరీటమువాని-
దివ్యవిభూషణ దీప్తివాని
మండిత కేయూర కుండలంబులవాని-
సిరి యురస్థలమునఁ జెలఁగు వానిఁ
నుఁబోలు సేవకతండంబు గలవానిఁ-
జిలుగైన పచ్చని లువవాని

తెభా-6-332.1-ఆ.
దెల్ల దమ్మివిరులఁ దెగడు కన్నులవాని
వసుధాద్రవంపు వ్వువానిఁ
నియె వేల్పుపిండు ప్పరపాటుతోఁ
న్నులందు నున్న ఱవు దీఱ.

టీక:- తగు = యుక్త మగు; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గద = గదలను; ధరుండు = ధరించినవాడు; అగున్ = అయిన; వానిన్ = వాడిని (హరిని); శ్రీవత్స = శ్రీవత్సము; కౌస్తుభ = కౌస్తుభమణి; శ్రీల = శోభలు గల; వానిన్ = వాడిని (హరిని); కమనీయ = అందమైన; మాణిక్య = మాణిక్యములు పొదిగిన; ఘన = గొప్ప; కిరీటము = కిరీటము; వానిన్ = వాడిని (హరిని); దివ్య = దివ్యమైన; విభూషణ = విశిష్టాలంకారముల; దీప్తి = ప్రకాశము గల; వానిన్ = వాడిని (హరిని); మండిత = అలంకరింపబడిన; కేయూర = భుజకీర్తులు; కుండలంబుల = చెవికుండలములు గల; వానిన్ = వాడిని (హరిని); సిరి = లక్ష్మీదేవి; ఉరస్థలమునన్ = వక్షస్థలము నందు; చెలగు = వర్తించెడి; వానిన్ = వాడిని (హరిని); తనున్ = తనను; పోలు = పోలిన; సేవక = సేవకుల; తండంబు = సమూహము; కల = కలిగిన; వానిన్ = వాడిని (హరిని); జిలుగైన = మెరుపు గల; పచ్చని = పచ్చని; వలువ = వస్త్రములు గల; వానిన్ = వాడిని (హరిని); తెల్ల = తెల్లని; తమ్మి = పద్మము; విరులన్ = పువ్వులను; తెగడు = నిరసించెడి;
కన్నుల = కన్నులు గల; వానిన్ = వాడిని (హరిని); నవ = సరికొత్త; సుధాద్రవంపు = అమృతపు; నవ్వు = దరహాసము గల; వానిన్ = వాడిని (హరిని); కనియె = దర్శించెను; వేల్పు = దేవతల; పిండు = సమూహము; కప్పరపాటు = తొట్రుపాటు; తోన్ = తోటి; కన్నుల = కన్నుల; అందు = లో; ఉన్న = ఉన్నట్టి; కఱవు = కరువు; తీఱ = తీరిపోగా.
భావము:- శంఖ, చక్ర, గదలను ధరించినవాడు; శ్రీవత్సం, కౌస్తుభం శోభించే ఉరోభాగం కలవాడు; తలపై విరాజిల్లుతున్న రమణీయ కిరీటం కలవాడు; ప్రకాశిస్తున్న భుజకీర్తులు మకరకుండలాలు కలవాడు; లక్ష్మీదేవి విలసిల్లే వక్షఃస్థలం కలవాడు; తనతో సమానులైన సేవకుల సమూహం కలవాడు; వెలుగులు వెదజల్లే పట్టు పీతాంబరం కలవాడు; తెల్లతామర రేకుల సోయగాలు వెల్లివిరిసే కన్నులు కలవాడు; మధుర సుధారసాలు పొంగి పొరలే మందహాసం కలవాడు అయిన శ్రీహరి యొక్క దివ్య సుందర స్వరూపాన్ని దేవతల సమూహం కన్నుల కరువు తీరే విధంగా చూసింది.

తెభా-6-333-సీ.
న సేవకులలోనఁ డఁబడు రూపంబు-
శ్రీవత్స కౌస్తుభ శ్రీలఁ దెలుప
వికచాబ్జములతోడ వీడ్వడు కన్నుల-
డలు దైవాఱెడు రుణఁ దెలుప
నెల్ల లోకములకు నిల్లైన భాగ్యంబుఁ-
గాపురం బుండెడు మల దెలుప
మూఁడుమూర్తులకును మొదలైన తేజంబు-
ధాతఁ బుట్టించిన మ్మి దెలుప

తెభా-6-333.1-ఆ.
బుద్ధిఁ బోల్పరాని పుణ్యంబుఁ దత్పాద
మల జనిత యైన గంగ దెలుప
ప్రమేయుఁ డభవు వ్యక్తుఁ డవ్యయు
డాదిపురుషుఁ డఖిలమోది యొప్పె.

టీక:- తన = తన యొక్క; సేవకుల = భక్తుల; లోనన్ = మనములలో; తడబడు = చలించెడి; రూపంబు = స్వరూపము; శ్రీవత్స = శ్రీవత్సము; కౌస్తుభ = కౌస్తుభమణి; శ్రీలన్ = శోభలను; తెలుపన్ = తెలియజేయ; వికచ = వికసించిన; అబ్జముల = పద్మముల; తోడన్ = తోటి; వీడ్వడు = మారుపడగల; కన్నుల = కన్నుల యొక్క; కడలు = చివరలు; దైవాఱెడు = పొంగిపొరలెడి; కరుణన్ = కృపను; తెలుపన్ = తెలియజేయ; ఎల్ల = సమస్తమైన; లోకముల్ = లోకముల; కున్ = కు; ఇల్లు = నివాసము; ఐన = అయినట్టి; భాగ్యంబున్ = భాగ్యమును; కాపురంబుండెడు = కాపురము చేస్తున్న; కమల = లక్ష్మీదేవి; తెలుపన్ = తెలియజేయ; మూడుమూర్తుల్ = త్రిమూర్తుల {త్రిమూర్తులు - 1బ్రహ్మ 2విష్ణు 3మహేశ్వరులు}; కును = కి; మొదలు = మూలము; ఐన = అయిన; తేజంబున్ = శక్తిని; ధాతన్ = బ్రహ్మదేవుని; పుట్టించిన = జనింపజేసిన; తమ్మి = పద్మము; తెలుపన్ = తెలియజేయ;
బుద్ధిన్ = మనసుతో; పోల్పరాని = పోల్చుకొన శక్యము గాని; పుణ్యంబున్ = పుణ్య స్వరూపమును; తత్ = అతని; పాద = పాదములు యనెడి; కమల = పద్మము లందు; జనిత = పుట్టినట్టిది; ఐన = అయిన; గంగ = గంగానది; తెలుపన్ = తెలియజేయ; అప్రమేయుడు = హరి {అప్రమేయుడు - ప్రమేయములు (పరిమితులు) లేనివాడు, విష్ణువు}; అభవుడు = హరి {అభవుడు - భవము (పుట్టుక) లేనివాడు, విష్ణువు}; అవ్యక్తుడు = హరి {అవ్యక్తుడు - వ్యక్తము (తెలియ) శక్యము కానివాడు, విష్ణువు}; అవ్యయుడు = హరి {అవ్యయుడు - వ్యయము (నాశము) లేనివాడు, విష్ణువు}; ఆదిపురుషుడు = హరి {ఆదిపురుషుడు – సృష్టి మొదటి పరమాత్మ (కారకుడు), విష్ణువు}; అఖిలమోది = హరి {అఖిల మోది - అఖిల (అందరను) మోది (సంతోషింప జేయువాడు), విష్ణువు} ఒప్పె = చక్కకా నుండెను.
భావము:- రూపు రేఖలన్నీ ఒకే విధంగా ఉన్నా వక్షఃస్థలాన విలసిల్లే శ్రీవత్సం, కౌస్తుభం సేవకుల కంటే ఆయన ప్రత్యేకతను వెల్లిడిస్తున్నాయి; వికసించిన తామరల వలె ఉన్నా కన్నులు దయను కురిపిస్తూ తమ ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి; లోకాలన్నింటికీ ఆలవాలమైన ఐశ్వర్యాన్ని అతనితో కాపురం చేసే లక్ష్మీదేవి తెలుపుతున్నది; ముమ్మూర్తులకు మూలభూతమైన అతని తేజస్సును బ్రహ్మను పుట్టించిన నాభి కమలం తెలియజేస్తున్నది; అతని పాదపద్మాల నుండి పుట్టిన గంగానది బుద్ధికి తోచని పుణ్యాన్ని వెల్లడిస్తున్నది; ఈ విధంగా అభవుడు, అవ్యయుడు, అప్రమేయుడు, అవ్యక్తుడు, ఆది పురుషుడు అయిన శ్రీమన్నారాయణుడు విలసిల్లాడు.

తెభా-6-334-వ.
ఇట్లు జగన్మోహనాకారుండయిన నారాయణుని కృపావలోక నాహ్లాద చకిత స్వభావ చరితులై సాష్టాంగదండప్రణామంబు లాచరించి ఫాలభాగ పరికీలిత కరకమలులై యిట్లనిరి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; జగన్ = జగత్తు అంతటికిని; మోహన = మోహింప జేసెడి; ఆకారుండు = స్వరూపము గలవాడు; అయిన = ఐన; నారాయణుని = నారాయణుని; కృపా = దయామయమైన; అవలోకన = చూపులుచే; ఆహ్లాద = సంతోషపడిన; చకిత = సంభ్రమమైన; స్వభావ = తమ మనసులు; చరితులు = వర్తనలు గలవారు; ఐ = అయ్యి; సాష్టాంగదండప్రణామంబులు = సాషాంగ నమస్కారములు; ఆచరించి = చేసి; ఫాలభాగ = నుదిట; పరికీలిత = తగల్చబడిన; కర = చేతులు యనెడి; కమలులు = పద్మములు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఈ విధంగా భువన మోహనాకారుడైన నారాయణుని కరుణా కటాక్ష వీక్షణాలతో ఆశ్చర్యాన్ని పొందిన దేవతలు సాష్టాంగ నమస్కారాలు చేసి ఫాలభాగాన చేతులు జోడించి ఇలా అన్నారు.

తెభా-6-335-ఆ.
"దుర్గమంబు లయిన స్వర్గాది ఫలములఁ
బుట్టఁజేయఁ జాలుట్టి గుణము
లిగి మెలఁగుచున్న నుఁడ వై నట్టి నీ
రయ మ్రొక్కువార మాదిపురుష!

టీక:- దుర్గమంబులు = దాటరానివి; అయిన = అయినట్టి; స్వర్గ = స్వర్గప్రాప్తి; ఆది = మొదలగు; ఫలములన్ = ఫలితములను; పుట్టన్ = జనించునట్లు; చేయ = చేయుటకు; చాలు = సామర్థ్యము గలిగిన; అట్టి = అటువంటి; గుణము = లక్షణములు; కలిగి = ఉండి; మెలుగుచున్న = ప్రవర్తిస్తున్న; ఘనుడవు = గొప్పవాడవు; ఐనట్టి = అయినట్టి; నీ = నీ; కున్ = కు; అరయ = మాటిమాటికిని; మ్రొక్కువారము = నమస్కరించెడివారము; ఆదిపురుష = విష్ణుమూర్తి.
భావము:- “ఆదిపురుషా! అందరాని స్వర్గాది పుణ్యఫలాలను ప్రాప్తింప జేసే సహజగుణం కలిగిన మహానుభావుడవు. నీకు మ్రొక్కుతున్నాము.

తెభా-6-336-సీ.
దండంబు యోగీంద్రమండల నుతునకు-
దండంబు శార్ఙ్ఘ కోదండునకును;
దండంబు మండిత కుండల ద్వయునకు-
దండంబు నిష్ఠుర భండనునకు;
దండంబు మత్తవేదండ రక్షకునకు-
దండంబు రాక్షసఖండనునకు;
దండంబు పూర్ణేందు మండల ముఖునకు-
దండంబు తేజః ప్రచండునకును;

తెభా-6-336.1-తే.
దండ మద్భుత పుణ్యప్రధానునకును;
దండ ముత్తమ వైకుంఠధామునకును;
దండ మాశ్రిత రక్షణ త్పరునకు;
దండ మురు భోగినాయక ల్పునకును.

టీక:- దండంబు = నమస్కారము; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; మండల = సమూహములచే; నుతున్ = స్తుతింపబడెడివాని; కున్ = కి; దండంబు = నమస్కారము; శార్ఙ్ఘ = శార్ఙ్ఘము అనెడి; కోదండున్ = విల్లుగలవాని; కును = కి; దండంబు = నమస్కారము; మండిత = అలంకరింపబడిన; కుండల = చెవికుండలముల; ద్వయున్ = జంటగలవాని; కు = కి; దండంబు = నమస్కారము; నిష్ఠుర = అతి కఠినమైన; భండనున్ = యుద్ధము చేయువాని; కు = కి; దండంబు = నమస్కారము; మత్తవేదండ = గజేంద్రమును; రక్షకున = కాపాడినవాని; కున్ = కి; దండంబు = నమస్కారము; రాక్షస = రాక్షసులను; ఖండనున్ = సంహరించినవాని; కు = కి; దండంబు = నమస్కారము; పూర్ణ = నిండు; ఇందు = చంద్ర; మండల = మండలమువంటి; ముఖున్ = ముఖము గలవాని; కు = కి; దండంబు = నమస్కారము; తేజస్ = తేజస్సు; ప్రచండున్ = అతి తీవ్రమైనది గలవాని; కున్ = కి;
దండము = నమస్కారము; అద్భుత = అద్భుతమైన; పుణ్య = పుణ్యములను; ప్రధానున్ = ఇచ్చెడివాని; కును = కి; దండము = నమస్కారము; ఉత్తమ = శ్రేష్ఠమైన; వైకుంఠ = వైకంఠము; ధామున్ = నివాసముగా గలవాని; కును = కి; దండము = నమస్కారము; ఆశ్రిత = ఆశ్రయించినవారిని; రక్షణ = కాపాడుట యందు; తత్పరున్ = లగ్నమగువాని; కు = కి; దండము = నమస్కారము; ఉరు = శ్రేష్ఠమగు; భోగినాయక = ఆదిశేషుని {భోగి నాయకుడు - భోగి (సర్పము)లకు నాయకుడు, శేషుడు}; తల్పున్ = పాన్పుగా గలవాని; కును = కి.
భావము:- యోగుల సమూహం చేత స్తుతింపబడే నీకు వందనం; శార్ఙ్గమనే ధనుస్సును ధరించినవానికి వందనం; ప్రకాశించే రెండు కుండలాలు గలవానికి వందనం; కఠినమైన కవచం కలవానికి వందనం; మదగజాన్ని రక్షించినవానికి వందనం; రాక్షసులను శిక్షించినవానికి వందనం; నిండు చంద్రుని వంటి ముఖం కలవానిని వందనం; గొప్ప తేజస్సు కలవానికి వందనం; అద్భుతమైన పుణ్యాల నిచ్చేవానికి వందనం; ఉత్తమమైన వైకుంఠంలో నివసించేవానికి వందనం; ఆశ్రయించిన వారిని రక్షించేవానికి వందనం; శేషతల్పునకు వందనం.

తెభా-6-337-ఉ.
చిక్కిరి దేవతావరులు చిందఱ వందఱలైరి ఖేచరుల్;
స్రుక్కిరి సాధ్యసంఘములు; సోలిరి పన్నగు లాజి భూమిలో;
మ్రక్కిరి దివ్యకోటి; గడు మ్రగ్గిరి యక్షులు వృత్రుచేత నీ
చిక్కినవారి నైన దయచేయుము నొవ్వకయండ నో! హరీ!

టీక:- చిక్కిరి = తగ్గిపోయినారు; దేవతా = దేవతలు యనెడి; వరులు = ఉత్తములు; చిందఱవందఱలు = చెల్లాచెదురులు; ఐరి = అయినారు; ఖేచరుల్ = ఆకాశ విహారులు; స్రుక్కిరి = కుంగిపోయినారు; సాధ్య = సాధ్యుల; సంఘములు = సమూహములు; సోలిరి = మూర్చిల్లినారు; పన్నగులు = సర్పములు; ఆజి = యుద్ధ; భూమి = భూమి; లోన్ = అందు; మ్రక్కిరి = అవిసిపోయిరి; దివ్య = దేవతల; కోటి = పెద్దసమూహము; కడు = మిక్కిలి; మ్రగ్గిరి = విహ్వలులైనారు; యక్షులు = యక్షులు; వృత్రు = వృత్రుని; చేతన్ = చేతిలో; ఈ = ఈ; చిక్కిన = మిగిలిన; వారిన్ = వారిని; ఐనన్ = అయినా; దయచేయుము = కృపచూడుము; నొవ్వక = బాధలు పొందక; ఉండన్ = ఉండునట్లు; ఓ = ఓ; హరీ = విష్ణుమూర్తి.
భావము:- శ్రీహరీ! ఆ వృత్రాసురుని వలన దేవతలు కృశించారు. కిన్నరులు చిందర వందర అయ్యారు. సాధ్యులు అలసిపోయారు. యుద్ధభూమిలో నాగులు సొమ్మసిల్లారు. సిద్ధులు వెలవెల బోయారు. యక్షులు విహ్వలులైనారు. ప్రాణాలతో బయట పడిన మమ్ములనైనా వాని బాధనుండి దయతో కాపాడు.

తెభా-6-338-క.
మొలాఱిన రక్కసులకు
మొలై మా కాపదలకు మూలం బగుచుం
దు మొదలు లేని రక్కసు
తుది చూపఁ గదయ్య! తుదకుఁ దుది యైన హరీ!

టీక:- మొదలు = మూలము; ఆఱిన = నశించిన; రక్కసుల్ = రాక్షసుల; కున్ = కు; మొదలు = మూలాధారము; ఐ = అయ్యి; మా = మా; కున్ = కు; ఆపదల్ = విపత్తుల; కున్ = కు; మూలంబు = మూలకారణము; అగుచున్ = అగుచూ; తుద = అంతము; మొదలు = ఆది; లేని = లేనట్టి; రక్కసున్ = రాక్షసుని; తుది = మరణము; చూపగద = తెలుపుము; అయ్య = తండ్రి; తుదకుఁదుది = అనంతుడవు {తుదకు తుది - అంతమునకు అంతమైనవాడు, అనంతుడు}; ఐన = అయిన; హరీ = విష్ణుమూర్తి.
భావము:- శ్రీహరీ! అంతానికి అంతమైన అనంతుడవు నీవు. మొదలంటా నశించిన దానవులకు వీడు మళ్ళి మొదలై మా కష్టాలకు కారణమైనాడు. తుదీ మొదలూ లేకుండా విజృంభిస్తున్న ఈ రాక్షసుణ్ణి తుదముట్టించు.

తెభా-6-339-తే.
కట! దిక్కుల కెల్ల దిక్కైన మాకు
నొక్క దిక్కును లేదు కాలూనఁ నైన;
దిక్కుగావయ్య! నేఁడు మా దిక్కుఁ జూచి
దిక్కు లేకున్నవారల దిక్కు నీవ.

టీక:- అకట = అయ్యో; దిక్కుల్ = దిక్కుల; ఎల్లన్ = అన్నిటికిని; దిక్కైన = అధినాయకులమైన; మా = మా; కున్ = కు; ఒక్క = ఏ యొక్క; దిక్కు = మూలను కూడ; లేదు = లేదు; కాలూనన్ = నిలబడెడి యాధారము; ఐనన్ = అయినప్పటికిని; దిక్కు = శరణిచ్చు వాడవు; కావుము = అగుము; అయ్య = తండ్రి; నేడు = ఇప్పుడు; మా = మా; దిక్కు = వైపునకు; చూచి = చూసి; దిక్కు = ఆధారము; లేకున్న = లేనట్టి; వారల = వారికి; దిక్కు = రక్షకుడవు; నీవ = నీవే.
భావము:- అయ్యో! దిక్కులకు అధిపతులమైన మాకు ఈనాడు కాలూని నిలబడటానికి కూడా దిక్కు లేకుండా పోయింది. మా దిక్కు చూచి నీవే మా దిక్కు కావాలి. దిక్కులేని దీనులకు నీవే దిక్కు కదా!

తెభా-6-340-క.
నీ దిక్కు గానివారికి
నే దిక్కును లేదు వెదక యిహపరములకున్
మోదింపఁ దలఁచువారికి
నీ దిక్కే దిక్కు సుమ్ము; నీరజనాభా!

టీక:- నీ = నీ; దిక్కు = వైపు; కాని = కానట్టి; వారి = వారి; కిన్ = కి; ఏ = ఏ విధమైన; దిక్కును = రక్షణయు; లేదు = లేదు; వెదకన్ = ఎంత వెదికిననూ; ఇహపరముల్ = ఈలోక పైలోక ప్రయోజనముల; కున్ = కు; మోదింపన్ = సంతోషింప; తలచు = కోరెడి; వారి = వారల; కిన్ = కి; నీ = నీ యొక్క; దిక్కే = రక్షణ మాత్రమే; దిక్కు = శరణ్యము; సుమ్ము = సుమా; నీరజనాభా = విష్ణుమూర్తి {నీరజ నాభుడు - నీరజము (పద్మము) నాధుడు (బొడ్డున గలవాడు), విష్ణువు}.
భావము:- ఓ పద్మనాభా! నీ దిక్కు చూచి నీవే దిక్కని మ్రొక్కని వారికి ఈ ప్రపంచంలో ఏ దిక్కూ లేదు. ఇహపరాలలో కూడా వారు దిక్కుమాలినవారే. లోకంలో సురక్షితంగా ఉండి సుఖపడాలనుకొనే వారికి నీ దిక్కే సరైన దిక్కు.

తెభా-6-341-తే.
రయ మాతేజములతోడ నాయుధములు
మ్రింగి భువన త్రయంబును మ్రింగుచున్న
భీకరాకారు వృత్రునిఁ బీచ మడఁచి
యెల్ల భంగుల మా భంగ మీఁగు మభవ!

టీక:- అరయ = చూడగా; మా = మా యొక్క; తేజముల్ = శక్తిసామర్థ్యముల; తోడన్ = తోటి; ఆయుధములున్ = ఆయుధములను కూడ; మ్రింగి = మింగేసి, భక్షించి; భువనత్రయంబునున్ = ముల్లోకములను; మ్రింగుచున్న = భక్షిస్తున్న; భీకర = భయంకరమైన; ఆకారున్ = ఆకారము గలవాడైన; వృత్రునిన్ = వృత్రుని; పీచము = గర్వము; అడచి = అణచివేసి; ఎల్ల = అన్ని; భంగుల = విధముల; మా = మా యొక్క; భంగము = భంగపాటును; ఈగుము = పోగొట్టుము; అభవ = హరి {అభవుడు - భవము (పుట్టుక) లేనివాడు, విష్ణువు}.
భావము:- పుట్టుకయే లేని ఓ దేవా! భీకరాకారుడైన వృత్రాసురుడు మా తేజస్సులనే కాక ఆయుధాలను కూడా మ్రింగి ముల్లోకాలకు సైతం దిగమ్రింగుతున్నాడు. ఈ రాక్షసుని అహంకారాన్ని అణచి మా భంగపాటుకు ప్రతీకారం చేయాలి.

తెభా-6-342-ఆ.
రమపురుష! దుఃఖభంజన! పరమేశ!
క్తవరద! కృష్ణ! వవిదూర!
లరుహాక్ష! నిన్ను రణంబు వేఁడెద
భయ మిచ్చి కావయ్య! మమ్ము.

టీక:- పరమపురుష = హరి {పరమ పురుషుడు - సర్వాతీతమైన పురుషుడు, విష్ణువు}; దుఃఖభంజన = హరి {దుఃఖ భంజనుడు - దుఃఖములను భంజన (నాశము చేయువాడు), విష్ణువు}; పరమేశ = హరి {పరమేశుడు - పరమ (అత్యున్నతమైన) ఈశుడు (ఈశ్వరుడు), విష్ణువు}; భక్తవరద = హరి {భక్త వరదుడు - భక్త (భక్తులకు) వరదుడు (వరములను యిచ్చువాడు), విష్ణువు}; కృష్ణ = హరి {కృష్ణుడు - నల్లనివాడు}; భవవిదూర = హరి {భవ విదూరుడు - భవ (సంసార బంధనములను) విదూరుడు (తొలగించెడివాడు), విష్ణువు}; జలరుహాక్ష = హరి {జలరుహాక్షుడు - జలరుహము (పద్మము) వంచి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; నిన్ను = నిన్ను; శరణంబున్ = శరణమునకై; వేడెదము = ప్రార్థించెదము; అభయము = రక్షణ; ఇచ్చి = ఇచ్చి; కావు = కాపాడుము; అయ్య = తండ్రి; మమ్ము = మమ్ములను.
భావము:- ఓ పరమ పురుషా! దుఃఖనాశకా! పరమేశ్వరా! భక్రవత్సలా! కృష్ణా! భవబంధాలను దూరం చేసే పద్మాక్షుడవు. నిన్ను శరణు జొచ్చినాము. అభయమిచ్చి మమ్ము కాపాడు.

తెభా-6-343-వ.
నమస్తే భగవన్నారాయణ! వాసుదేవ! యాదిపురుష! మహానుభావ! పరమమంగళ! పరమకళ్యాణ! దేవ! పరమకారుణికు లయిన పరమహంస లగు పరివ్రాజకులచేత నాచరితంబు లగు పరమసమాధి భేదంబులఁ బరిస్ఫుటం బయిన పరమహంస ధర్మంబుచేత నుద్ఘాటితం బగు తమః కవాటద్వారంబున రసావృతంబయిన యాత్మలోకంబున నుపలబ్ధమాతృండవై, నిజ సుఖానుభవుండ వై యున్న నీ వాత్మ సమవేతంబు లై యపేక్షింపఁ బడని శరీరంబులకు నుత్పత్తి స్థితి లయ కారణుండ వై యుండుదువు; గుణసర్గ భావితుండవై యపరిమిత గుణగణంబులుగల నీవు, దేవదత్తుని మాడ్కిఁ బారతంత్ర్యంబున నబ్బిన కుశల ఫలంబుల ననుభవించి చింతింతువు; షడ్గుణైశ్వర్యసంపన్నుండవైన నీ వాత్మారాముండ వయి యుండుదువు; గుణసర్గ భావితుండవయి యపరిమిత గుణగణంబు లర్వాచీన వితర్క విచార ప్రమాణభావంబులగు తర్కశాస్త్రంబులఁ గర్కశంబు లయిన ప్రజ్ఞలు గలిగి, దురవగ్రహవాదు లయిన విద్వాంసుల వివాదానుసరణంబుల యందు నుపరతంబులగు నస్తినాస్తీత్యాది వాక్యంబుల సమస్త మాయామయుండ వై నిజ మాయచేతఁ గానంబడక యుక్తిగోచరుండవై, సమస్త విషమ రూపంబులఁ బ్రవర్తింతువు; దేవా! రజ్జువు నందు సర్పభ్రాంతి గలుగునట్లు ద్రవ్యాంతరంబులచేత బ్రహ్మం బయిన నీ యందుఁ బ్రపంచ భ్రాంతి గలుగుచుండు సర్వేశ్వరా! సర్వజగత్కారణరూపం బైన నీవు సర్వభూత ప్రత్యగాత్మ వగుటంజేసి సర్వగుణాభావభాసోపలక్షితుడవై కానంబడుదువు, లోకేశ్వరా! భవన్మహిమ మహామృతసముద్ర విప్రుట్సకృత్పాన మాత్రంబున సంతుష్టచిత్తులై, నిరంతర సుఖంబున విస్పారిత దృష్ట శ్రుత విషయ సుఖ లేశాభాసులైన పరమభాగవతులు భవచ్చరణకమల సేవాధర్మంబు విడువరు; త్రిభువనాత్మభవ! త్రివిక్రమ! త్రినయన! త్రిలోక మనోహరానుభావ! భవదీయ వైభవ విభూతి భేదంబు లైన దనుజాదులకు ననుపమక్రమ సమయం బెఱింగి, నిజమాయాబలంబున సుర నర మృగ జలచరాది రూపంబులు ధరియించి, తదీయావతారంబుల ననురూపంబైన విధంబున శిక్షింతువు; భక్తవత్సలా! భవన్ముఖ కమల నిర్గత మధుర వచనామృత కళావిశేషంబుల, నిజ దాసులమైన మా హృదయతాపం బడంగింపుము; జగదుత్పత్తి స్థితి లయకారణ ప్రధాన దివ్య మాయా వినోదవర్తివై సర్వజీవనికాయంబులకు బాహ్యభ్యంతరంబుల యందు బ్రహ్మ ప్రత్యగాత్మ స్వరూప ప్రధానరూపంబుల దేశకాల దేహావస్థాన విశేషంబులఁ, దదుపాదాను భవంబులు గలిగి, సర్వప్రత్యయసాక్షివై, సాక్షాత్పరబ్రహ్మస్వరూపుండవై యుండెడి నీకు నేమని విన్నవించువారము? జగదాశ్రయంబై, వివిధ వృజిన సంసార పరిశ్రమోపశమనం బైన భవదీయ దివ్యచరణ శతపలాశచ్ఛాయ నాశ్రయించెద;"మని పెక్కువిధంబుల వినుతించి యిట్లనిరి.
టీక:- నమస్తే = నమస్కారము; భగవన్నారాయణ = హరి {భగవన్నారాయణుడు - భగవంతుడు అయిన నారాయణుడు, విష్ణువు}; వాసుదేవ = హరి {వాసుదేవుడు - సర్వాత్మ లందు వసించెడి దేవుడు, విష్ణువు}; ఆదిపురుష = హరి {ఆది పురుషుడు - సృష్టి ఆది (మూలము) యైన పురుషుడు}; మహానుభావ = హరి {మహానుభావుడు - గొప్పవాడు, విష్ణువు}; పరమమంగళ = హరి {పరమ మంగళుడు - పరమ (అత్యుత్తమమైన) మంగళుడు (శుభకరుడు), విష్ణువు}; పరమకళ్యాణ = హరి {పరమ కళ్యాణుడు - పరమ (అత్యున్నతమైన) కళ్యాణుడు (శ్రేయస్సు కలిగించువాడు), విష్ణువు}; దేవ = హరి; పరమ = అత్యధికమైన; కారుణికులు = కరుణ గలవారు; అయిన = అయిన; పరమహంసలు = పరమోత్తమ సాధులు; అగు = అయిన; పరివ్రాజకుల్ = సన్యాసులు; చేతన్ = చేత; ఆచరితంబులు = చేయబడినవి; అగు = అయిన; పరమ = అత్యుత్కృష్టమైన; సమాధి = సమాధుల యందలి; భేదంబులన్ = రకములను; పరిస్ఫుటంబు = మిక్కిలి ప్రసిద్ధమైనది; అయిన = అయిన; పరమహంస = పరమహంసల యొక్క; ధర్మంబు = ధర్మముల; చేతను = వలను; ఉద్ఘాటితంబు = గట్టిగా చెప్పబడెడిది; అగు = అయిన; తమస్ = తమోరూపమైన; కవాట = గుమ్మము; ద్వారంబునన్ = వలన; అపావృతంబు = ముసుగు తొలగింపబడినది; అయిన = ఐన; ఆత్మ = తన; లోకంబునన్ = సంపూర్ణ రూపమును; ఉపలబ్ధమాతృండవు = పొందినవాడవు; ఐ = అయ్యి; నిజ = సత్యమైన; సుఖ = సుఖము; అనుభవుండవు = అనుభవము పొందిన వాడవు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; నీవు = నీవు; ఆత్మ = ఆత్మతో; సమవేతంబులు = కూడి యున్నవి; ఐ = అయ్యి; అపేక్షింపబడని = కోరకపోయినను; శరీరంబుల్ = దేహధారుల; కున్ = కు; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయములకు; కారణుండవు = కారణమైన వాడవు; ఐ = అయ్యి; ఉండుదువు = ఉండెదవు; గుణ = గుణముల; సర్గ = జననముతో; భావితుండవు = భావింపబడెడి వాడవు; ఐ = అయ్యి; అపరిమిత = అంతులేని; గుణ = గుణముల; గణంబులు = సమూహములు; కల = కలిగిన; నీవు = నీవు; దేవదత్తుని = దేవతలకు దత్తమైనవాని; మాడ్కి = వలె; పారతంత్ర్యంబునన్ = ఇతరులపై ఆధారపడుట వలన; అబ్బిన = కలిగిన; కుశల = శ్రేయో; ఫలంబులన్ = ప్రయోజనములను; అనుభవించి = అనుభవించి; చింతింతువు = బాధపడెదవు; షడ్గుణ = ఆరుగుణములు {షడ్గుణములు - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యము}; ఐశ్వర్య = అష్ఠైశ్వర్యముల {అష్టైశ్వర్యములు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8వశత్వము}; సంపన్నుండవు = సమృద్ధిగా గలవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; ఆత్మా = ఆత్మ యందు; ఆరాముండవు = ఆనందించెడివావు; అయి = అయ్యి; ఉండుదువు = ఉండెదవు; గుణ = గుణముల; సర్గ = స్వభావములచే; భావితుండవు = భావింపబడెడివాడవు; అయి = అయ్యి; అపరిమిత = అంతులేని; గుణ = గుణముల; గణంబులన్ = సమూహములచే; ఆర్వాచీన = తరువాత పుట్టిన వైన; వితర్క = విపరీతమైన తర్కముతో; విచార = చర్చించెడి; ప్రమాణ = ప్రమాణములచే; అభావంబులు = సరికాని ఆలోచనలు; అగు = అయిన; తర్కశాస్త్రంబులన్ = తర్కశాస్త్ర నియమములచే; కర్కశంబులు = కరుకైనవి; అయిన = అయినట్టి; ప్రజ్ఞలు = సామర్థ్యములు; కలిగి = కలిగి; దురవగ్రహవాదులు = తప్పుడు అవగాహనతో వాదించువారు; అయిన = అయిన; విద్వాంసులు = పండితులు; వివాద = సందగ్ధతలు; అనుసరణంబుల = అనుసరించు వాని; అందు = అందు; ఉపరతంబులు = ఉడిగినవి; అగు = అయిన; అస్తి = ఉన్నది; నాస్తి = లేనిది; ఇత్యాది = మొదలగు; వాక్యంబులన్ = వాదనలతో; సమస్త = అఖిలమైన; మాయా = మాయతో; మయుండవు = కూడినవాడవు; ఐ = అయ్యి; నిజ = తన; మాయ = మాయ; చేతన్ = వలన; కానంబడక = కనిపించకుండగ; యుక్తి = యోగ ప్రయుక్తము నందలి నేర్పునకు; గోచరుండవు = తెలియబడువాడవు; ఐ = అయ్యి; సమస్త = సమ; విషమ = విషమ; రూపంబులన్ = రూపములలో; ప్రవర్తింతువు = వర్తిల్లుచుందువు; దేవా = భగవంతుడా; రజ్జువు = తాడు; అందు = అందు; సర్ప = పాము యనెడి; భ్రాంతి = భ్రాంతి; కలుగున్ = కలిగెడి; అట్లు = విధముగ; ద్రవ్యాంతరంబుల = ఇతరవస్తువుల; చేత = వలన; బ్రహ్మంబు = పరబ్రహ్మము; అయిన = అయినట్టి; నీ = నీ; అందు = అందు; ప్రపంచ = ప్రపంచము యనెడి; భ్రాంతి = భ్రాంతి; కలుగుచుండు = కలుగుతుండును; సర్వేశ్వరా = హరి; సర్వ = అఖిల; జగత్ = లోకములకు; కారణరూపంబు = కారణభూతుడవు; ఐన = అయిన; నీవు = నీవు; సర్వ = సమస్తమైన; భూత = ప్రాణులకు; ప్రత్యగాత్మవు = ప్రత్యగాత్మవు {ప్రత్యగాత్మ - ప్రత్యక్ (ప్రత్యక్షముగ) ఆత్మవు (ఆత్మ)}; అగుటన్ = అగుట; చేసి = వలన; సర్వ = సమస్తమైన; గుణ = గుణముల; అభావ = లేకపోవుట; అభాస = లేనిది ఉన్నట్లు కనబడుట; ఉపలక్షితుడవు = ఆరోపింపబడినవాడవు; ఐ = అయ్యి; కానంబడుదువు = తెలియబడెదవు; లోకేశ్వరా = హరి; భవత్ = నీ యొక్క; మహిమ = మహత్మ్యము యనెడి; మహా = గొప్ప; అమృత = అమృతపు; సముద్ర = సముద్రము యొక్క; విప్రుట్ = తుంపరలను; సకృత్ = ఏదో నొకమారు; పాన = తాగిన; మాత్రంబునన్ = మాత్రముచేతనే; సంతుష్ట = సంతృప్తిచెందిన; చిత్తులు = మనసులు గలవారు; ఐ = అయ్యి; నిరంతర = ఎడతెగని; సుఖంబునన్ = సుఖముతో; విస్మారిత = మరచిన; దృష్ట = చూసినవి; శ్రుత = విన్నవి; విషయ = ఇంద్రియార్థముల వలని; సుఖ = సౌఖ్యపు; లేశ = పిసర్లు; అభాసులు = అభాసములు గలవారు; ఐన = అయిన; పరమ = అత్యుత్తమ; భాగవతులు = భగవద్భక్తులు; భవత్ = నీ యొక్క; చరణ = పాదములు యనెడి; కమల = పద్మములను; సేవా = పూజించెడి; ధర్మంబున్ = విధానమును; విడువరు = వదలరు; త్రిభువనాత్మభవ = హరి {త్రిభువనాత్మభవుడు - త్రిభువన (ముల్లోకములును) ఆత్మన్ (తానే అయ్యి) భవ (దివ్యమైనవాడు), విష్ణువు}; త్రివిక్రమ = హరి {త్రివిక్రముడు - త్రివిక్రమ రూపము దరించిన వామనావతారుడు, విష్ణువు}; త్రినయన = హరి {త్రినయనుడు - శివస్వరూపుడు, విష్ణువు}; త్రిలోకమనోహరానుభావ = హరి {త్రిలోక మనోహరానుభావుడు - తిలోక (ముల్లోకములకు) మనోహరమైన అనుభవముల యిచ్చువాడు, విష్ణువు}; భవదీయ = నీ యొక్క; వైభవ = వైభవముల; విభూతి = ఐశ్వర్యముల; భేదంబులు = రూపములు; ఐన = అయిన; దనుజ = రాక్షసులు; ఆదుల్ = మొదలగువారి; కున్ = కి; అనుపమక్రమ = విరామము చెందెడి; సమయంబు = కాలమును; ఎఱింగి = తెలిసి; నిజ = తన; మాయా = మాయ యొక్క; బలంబునన్ = సామర్థ్యముతో; సుర = దేవతలు; నర = మానవులు; మృగ = జంతువులు; జలచర = జలచరములు; ఆది = మొదలైన; రూపంబులున్ = స్వరూపములను; ధరియించి = ధరించి; తదీయ = అతని యొక్క; అవతారంబులన్ = అవతారములలో; అనురూపంబు = అనుకూలము; ఐన = అయిన; విధంబునన్ = విధముగ; శిక్షింతువు = శిక్షించెదవు; భక్తవత్సలా = హరి {భక్త వత్సలుడు - భక్తుల యెడ వాత్సల్యముగలవాడు, విష్ణువు}; భవత్ = నీ యొక్క; ముఖ = ముఖము యనెడి; కమల = పద్మములనుండి; నిర్గత = వెలువడు; మధుర = తీయని; వచన = మాటలు యనెడి; అమృత = అమృతము యొక్క; కళా = కళల; విశేషంబులన్ = విశిష్ఠతలచే; నిజ = సత్యమైన; దాసులము = భక్తులము; ఐన = అయిన; మా = మా యొక్క; హృదయ = హదయములలోని; తాపంబున్ = తాపములను; అడంగింపుము = అణచివేయుము; జగత్ = జగత్తునకు; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయములకు; కారణ = కారణమును; ప్రధాన = ప్రధానము యనెడి; దివ్య = దివ్యమైన; మాయా = మాయ లందు; వినోదవర్తి = క్రీడించెడివాడవు; ఐ = అయ్యి; సర్వ = అఖిలమైన; జీవ = ప్రాణుల; నికాయంబుల్ = సమూహముల; కున్ = కు; బాహ్య = వెలుపలను; అభ్యంతరంబుల = లోపలలను; అందున్ = అందును; బ్రహ్మ = పరబ్రహ్మము; ప్రత్యగాత్మ = ప్రత్యగాత్మ; స్వరూప = స్వరూపముల; ప్రధాన = ముఖ్య; రూపంబులన్ = రూపములలో; దేశ = ప్రదేశము; కాల = కాలము; దేహ = శరీరము; అవస్థాన = అవస్థల; విశేషంబులన్ = విశిష్ఠతలచే; తత్ = వానికి; ఉపాదాన = కారణభూతములు; అనుభవంబులు = అనుభవములు; కలిగి = కలిగినట్టి; సర్వ = సమస్తమైన; ప్రత్యయ = ప్రత్యయములకు {ప్రత్యయములు - అనుభవమునకు వచ్చునవి}; సాక్షివి = సాక్షీభూతుడవు; ఐ = అయ్యి; సాక్షాత్ = స్వయముగ; పరబ్రహ్మ = పరబ్రహ్మము యొక్క; స్వరూపుండవు = తన యొక్క రూపముగా గలవాడవు; ఐ = అయ్యి; ఉండెడి = ఉండునట్టి; నీ = నీ; కున్ = కు; ఏమి = ఏమి; అని = అని; విన్నవించువారము = మనవిచేసుకొనగల వారము; జగత్ = జగత్తునకు; ఆశ్రయంబున్ = ఆశ్రయము యిచ్చునది; ఐ = అయ్యి; వివిధ = అనేక రకముల; వృజిన = క్లేశములుగల; సంసార = సంసారము యనెడి; పరిశ్రమ = బాధలనుండి; ఉపశమనంబున్ = శాంతి కలిగించెడిది; ఐన = అయిన; భవదీయ = నీ యొక్క; దివ్య = దివ్యమైన; చరణ = పాదములు యనెడి; శతపలాశ = కమలముల; ఛాయన్ = నీడను; ఆశ్రయించెదము = అండ చేకొనెదము; అని = అని; పెక్కు = అనేక; విధంబులన్ = రకములుగా; వినుతించి = స్తుతించి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- భగవంతుడవైనా నారాయణా! వాసుదేవా! ఆదిపురుషా! మహానుభావా! సర్వ మంగళ స్వరూపా! కళ్యాణ మూర్తీ! దేవా! నీకు నమస్కారం. దయా పరిపూర్ణులు, పరమహంసలు అయిన పరివ్రాజకులు సమాధి యోగాన్ని అనుష్ఠించినవారై చిత్తైకాగ్రతను సాధిస్తారు. అప్పుడు పరిశుద్ధమైన అంతఃకరణంలో పారమహంస్య ధర్మం ఆవిర్భవిస్తుంది. మనస్సులోని తమోరూపమైన తలుపు తెరుచుకుంటుంది. ఆత్మలోకం ప్రకాశితమౌతుంది. ఆ సమయంలో కలిగే ఆత్మసుఖ స్వరూపమైన ఆనందానుభూతి ఏదైతే ఉన్నదో అదే నీవు. నిర్గుణుడవు, బ్రహ్మస్వరూపుడవు అయినప్పటికీ నీవు అనంతమైన గుణగణాలతో కూడి దేవదత్తుని వలె కాలకర్మాదులకు అధీనుడవై స్వయంకృతాలైన శుభాశుభాలను అనుభవిస్తావు. షడ్గుణైశ్వర్య సంపన్నుడవైన నీవు ఆత్మారాముడవై కూడా అపరిమిత గుణగణాలకు ఆశ్రయమై ఉన్నావు. ఈశ్వరుడవైన నీ మాహాత్మ్యం ఇతరులకు అనూహ్యం, అనవగాహ్యం. ఆధునికాలైన వికల్పం, వితర్కం, విచారం మొదలైన ప్రమాణాభాసాలతో కూడి జటిలమైన కుతర్కాలలో పడి కర్కశబుద్ధులైన విద్వాంసులు వ్యర్థమైన శాస్త్రవాదాలలో క్రిందు మీదు లౌతుంటారు. దేవుడున్నాడు, లేడు అనే తెలిసి తెలియని వాదోపవాదాలతో కీచులాడుకుంటారు. మాయామయుడవైన నీవు నిజమాయా ప్రభావం వల్ల వారికి కనిపించవు. అంతర్యామివైన నీవు సమ విషమ రూపాలతో ప్రవర్తిస్తూ యుక్తిమాత్ర గోచరుడవు అవుతున్నావు. దేవా! త్రాడును చూచి పామను భ్రాంతి కలిగినట్లు అంతర్యామివైన నీయందు అన్యవస్తు భ్రాంతి కలుగుతున్నది. సర్వేశ్వరా! సమస్త విశ్వానికి కారణమైన నీవు సర్వభూతాలలో అంతర్యామిగా ఉన్నందువల్ల సకల గుణగణాలతో ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తావు. జగదీశ్వరా! నీ మహిమ అపారమైన అమృత సముద్రం వంటిది. ఆ అమృతసాగరంలోని ఒక చిన్న బిందువును రుచి చూచిన భాగవతోత్తములు సంతుష్టాంతరంగులై అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ పరమ భాగవతులు ఆ ఆనందంతో పరవశించి చూచినవాటి వల్ల విన్నవాటి వల్ల కలిగే సుఖలేశాన్ని విస్మరిస్తారు. వారు నీ చరణ కమల సేవా వ్రతాన్ని వదలిపెట్టరు. నీవు ముల్లోకాలలో నిండి ఉన్నావు. ముల్లోకాలను ఆక్రమించిన త్రివిక్రముడవు. ముల్లోకాలను దర్శించే త్రిలోచనుడవు. ముల్లోకాల ఆత్మలను ఆకర్షించే మహా మహిమాన్వితుడవు. నీ విభూతి భేదాలైన దానవులు మొదలైన వారికి అంత్యకాలం ఆసన్నం అయిందని తెలుసుకొని నీ మాయా ప్రభావం వల్ల వామనాది దేవతా రూపాలను, రామకృష్ణాది మానవ రూపాలను, వరాహాది మృగరూపాలను, మత్స్యకూర్మాది జలచర రూపాలను ధరించి తగిన విధంగా శిక్షిస్తూ ఉంటావు. భక్తవత్సలా! నీ ముఖ కమలం నుండి వెలువడిన వాక్కులనే అమృతతరంగాలతో మా అంతరంగాల్లోని సంతాపాన్ని చల్లార్చు. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు కారణభూతమైన మూలప్రకృతి మాయ నీకు వశవర్తిని అయి ఉంటుంది. ఈ సృష్టిలోని సమస్త ప్రాణికోటికి లోపల బయట ప్రత్యగాత్మగా, పరమాత్మగా నీవు వర్తిస్తూ ఉంటావు. దేశం కాలం దేహం మొదలైన వాని స్థితిగతులకు, అనుభవాలకు, సర్వవిషయాలకు సాక్షివై సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడవైన నీకు మా గోడు ఏమని విన్నవించుకోగలం? సమస్త విశ్వానికి ఆశ్రయమై, నానావిధ పాపాలను, సంసార తాపాలను ఉపశమింప జేసే నీ పవిత్ర పాదపద్మాల నీడను ఆశ్రయిస్తున్నాము” అని ఎన్నో విధాలుగా వినుతించి ఇలా అన్నారు.

తెభా-6-344-క.
"తేజంబు నాయువును వి
భ్రాజిత దివ్యాయుధములుఁ రువడి వృత్రుం
డాజి ముఖంబున మ్రింగెను
మా య మింకెందుఁ? జెప్పుమా; జగదీశా! "

టీక:- తేజంబున్ = తేజస్సులను; వాయువును = ప్రాణములను; విభ్రాజిత = విశిష్టముగా ప్రకాశించెడి; దివ్య = దివ్యమైన; ఆయుధములున్ = ఆయుధములను; పరువడి = క్రమముగా; వృత్రుండు = వృత్రుడు; ఆజి = యుద్ధ; ముఖంబునన్ = భూమిలో; మ్రింగెను = మింగివేసెను; మా = మా యొక్క; జయము = విజయము; ఇంకెందు = ఇంకెక్కడిది; చెప్పుమా = చెప్పుము; జగదీశా = హరి {జగదీశుడు - జగత్ (జగత్తునకు) ఈశుడు, విష్ణువు}.
భావము:- “ఓ జగదీశ్వరా! ఆ వృత్రాసురుడు మా తేజస్సును, ఆయుస్సును, గొప్ప గొప్ప ఆయుధాలను యుద్ధరంగంలో బలవంతంగా కబళించి వేశాడు. ఇక మాకు గెలుపనేది ఎక్కడున్నది?”

తెభా-6-345-వ.
అని యి ట్లతిమనోహర చతుర వచనంబుల భక్తిపరవశులయి వినుతి చేయుచున్న దేవతలం జూచి, య ప్పరమేశ్వరుండమృత ప్రాయంబు లగు గంభీరభాషణంబుల ని ట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; అతి = మిక్కిలి; మనోహర = రమణీయమైన; చతుర = చమత్కారమైన; వచనంబులన్ = మాటలతో; భక్తి = భక్తితో; పరవశులు = పరవశించిపోయిన వారు; అయి = అయ్యి; వినుతి = స్తుతులు; చేయుచున్న = చేస్తున్న; దేవతలన్ = దేవతలను; చూచి = చూసి; ఆ = ఆ; పరమేశ్వరుండు = హరి; అమృత = అమృతమునకు; ప్రాయంబులు = సమానములు; అగు = అయిన; గంభీర = గంభీరమైన; భాషణంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని ఈ విధంగా మిక్కిలి రమణీయమైన మాటలతో భక్తి పరవశులై ప్రార్థిస్తున్న దేవతలను చూచి శ్రీమన్నారాయణుడు అమృతం చిలికే మాటలతో గంభీరంగా ఇలా అన్నాడు.

తెభా-6-346-క.
"మ దుపస్థానం బగు మీ
మల సుజ్ఞానమునకు సంతోషమునం
బొలె మదిఁ బ్రీతి నొందితి
లక నా భక్తి పొడమి వ్యర్థం బగునే?

టీక:- మత్ = నా యొక్క; ఉపస్థానంబు = సాన్నిధ్యము కల్పించుకొన్నది; అగు = అయిన; మీ = మీ; సత్ = మిక్కిలి; అమల = నిర్మలమైన; సు = మంచి; జ్ఞానమున్ = జ్ఞానమున; కున్ = కు; సంతోషమునన్ = సంతోషముతో; పొదలెన్ = ఉప్పొంగెను; మదిన్ = మనసులో; ప్రీతి = స్నేహభావము; ఒందితి = పొందితిని; వదలక = తప్పక; నా = నా యొక్క; భక్తి = భక్తి; పొడమి = పుట్టి; వ్యర్థంబు = వృథా; అగునే = అగునా ఏమి.
భావము:- “నా సాన్నిధ్యాన్ని సంపాదించుకొన్న మీ స్వచ్ఛమైన జ్ఞానానికి నా మనస్సు ఎంతో సంతోషించింది. తృప్తి చెందాను. నా యందలి ఎడతెగని భక్తి వ్యర్థం కాదు.

తెభా-6-347-వ.
మఱియును, బ్రీతుండనైన నాయందు భక్తులకుం బొందరాని యర్థంబు లేదు, విశేషించి నాయందునేకాంతమతి యైన తత్త్వవిదుం డన్యంబులం గోరకుండు; గుణంబుల యందుఁ దత్త్వజ్ఞానగోచరుం డైన వాఁడు విషయనివృత్తచిత్తుండై సంసార మార్గంబు నిచ్ఛింపడు; కావున మీకు శుభం బయ్యెడు; దధీచియను ఋషి సత్తముండు గలం డతని శరీరంబు మద్విద్యాతిశయ మహత్త్వంబునను దేజోవిశేషంబు నను సారవంతంబై యున్నయది; నతని నడిగి, తచ్ఛరీరంబుఁ బుచ్చికొనుం; డతండు పూర్వకాలంబున యశ్వినీదేవతలకు నశ్వశిరోనామం బను బ్రహ్మస్వరూపం బగు నిష్కళంకం బయిన విద్య యుపదేశించిన; వారలు జీవన్ముక్తిత్త్వంబు నొందిరి మఱియు త్వష్టృ పుత్రుండయిన విశ్వరూపునకు మదాత్మకం బయిన యభేద్య కవచంబు నిచ్చెఁ; గావున నతం డతివదాన్యుండు; దేహంబు వంచింపక మీకిచ్చు; నతని శల్యంబులు విశ్వకర్మ నిర్మితంబు లై, శతధారలు గల యాయుధ శ్రేష్ఠంబయి, మత్తేజోపబృంహితం బయి వృత్రాసురశిరోహరణ కారణం బయి యుండు; దానం జేసి మీరు పునర్లబ్ధ తేజోస్త్రాయుధ సంపదలు గలిగి వెలింగెదరు; విశేషించియు మద్భక్తవరులైన వార లే లోకంబుల నెవ్వరికి నజయ్యులు; కావున మీకు భద్రం బయ్యెడు"మని భూతభావనుం డైన భగవంతుం డదృశ్యుం డయ్యె; నప్పుడు దేవతలు దధీచిముని కడకుం జని; ర త్తఱి నింద్రుం డిట్లనియె.
టీక:- మఱియునున్ = ఇంకను; ప్రీతుండను = సంతుష్టుండను; ఐన = అయిన; నా = నా; అందు = ఎడల; భక్తుల్ = భక్తుల; కున్ = కు; పొందరాని = పొందలేని; అర్థంబున్ = ప్రయోజనము; లేదు = లేదు; విశేషించి = ప్రత్యేకించి; నా = నా; అందు = ఎడల; ఏకాంత = ఏకాగ్రమైన, అనన్యమైన; మతి = బుద్ధి గలవాడు; ఐన = అయిన; తత్త్వవిదుండు = తత్త్వము తెలిసినవాడు; అన్యంబులన్ = ఇతరములను; కోరకుండు = కోరుకొనడు; గుణంబుల్ = గుణములు; అందున్ = అందు; తత్త్వజ్ఞాన = తత్త్వము యొక్క జ్ఞానము; గోచరుండు = దర్శనమైనవాడు; ఐనవాడు = అయినట్టివాడు; విషయ = ఇంద్రియార్థముల వలని; నివృత్త = మరలిన; చిత్తుండు = మనసు గలవాడు; ఐ = అయ్యి; సంసార = సంసారము యొక్క; మార్గంబున్ = మార్గమును; ఇచ్ఛింపడు = ఇష్టపడడు; కావున = కనుక; మీ = మీ; కున్ = కు; శుభంబు = శుభములు; అయ్యెడున్ = కలిగెడును; దధీచి = దధీచి; అను = అనెడి; ఋషి = ఋషులలో; సత్తముండు = సమర్థుడు; కలండు = ఉన్నాడు; అతని = అతని యొక్క; శరీరంబు = దేహము; మత్ = నా గురించిన; విద్యా = విద్యయందు; అతిశయ = ఆధిక్యత; మహత్త్వంబునను = మహత్మ్యము వలనను; తేజస్ = తేజస్సుయొక్క; విశేషంబునను = విశిష్టతచేతను; సారవంతంబు = చేవదేరినది; ఐ = అయ్యి; ఉన్నయది = ఉన్నది; అతనిన్ = అతనిని; అడిగి = అడిగి; తత్ = ఆ; శరీరంబున్ = దేహమును; పుచ్చికొనుడు = తీసుకొనుడు; అతండు = అతడు; పూర్వ = ఇంతకు పూర్వపు; కాలంబునన్ = కాలములో; అశ్వినీదేవతల్ = అశ్వినీదేవతల; కున్ = కు; అశ్వశిరోనామంబు = అశ్వశిరోనామము; అని = అనెడి; బ్రహ్మ = పరబ్రహ్మ; స్వరూపంబు = స్వరూపమైనది; అగు = అయిన; నిష్కళంకంబు = స్వచ్ఛమైనది; అయిన = ఐన; విద్యన్ = విద్యను; ఉపదేశించిన = ఉపదేశించగా; వారలు = వారు; జీవన్ముక్తిత్త్వంబున్ = జీవన్ముక్తిని {జీవన్ముక్తి - జీవించి యుండగనే కలిగెడు ముక్తి}; ఒందిరి = పొందిరి; మఱియున్ = ఇంకను; త్వష్టృ = త్వష్ట యొక్క; పుత్రుండు = కుమారుడు; అయిన = అయిన; విశ్వరూపున్ = విశ్వరూపున; కున్ = కు; మత్ = నేనే; ఆత్మకంబు = ఆత్మగా గలది; అయిన = అయిన; అభేద్య = భేదింప శక్యము గాని; కవచంబున్ = కవచమును; ఇచ్చెన్ = ఇచ్చెను; కావునన్ = అందుచేత; అతండు = అతడు; అతి = గొప్ప; వదాన్యుండు = దాత; దేహంబున్ = శరీరమును; వంచింపక = తిరస్కరించక; మీ = మీ; కున్ = కు; ఇచ్చున్ = ఇచ్చును; అతని = అతని యొక్క; శల్యంబులు = ఎముకలు; విశ్వకర్మ = విశ్వకర్మచేత; నిర్మితంబులు = తయారుచేయబడినవి; ఐ = అయ్యి; శత = నూరు (100); ధారలు = పదునులు; కల = కలిగిన; ఆయుధ = ఆయుధములలో; శ్రేష్ఠంబు = ఉత్తమమైనది; అయి = అయ్యి; మత్ = నా యొక్క; తేజస్ = తేజస్సుచేత; ఉపబృంహితంబు = సంవృద్ధమైనది; అయి = అయ్యి; వృత్రాసుర = వృత్రుడు అనెడి రాక్షసుని; శిరస్ = తలను; హరణ = నాశనము చేసెడి; కారణంబు = కారణభూతము; అయి = అయ్యి; ఉండున్ = అగును; దానన్ = దాని; చేసి = వలన; మీరు = మీరు; పునః = మరల; లబ్ధ = లబించిన; తేజస్ = తేజస్సులు; అస్త్ర = అస్త్రములు; ఆయుధ = ఆయుధములు; సంపదలు = సంపదలు; కలిగి = పొంది; వెలింగెదరు = ప్రకాశించెదరు; విశేషించియు = విశేషముగా; మత్ = నా యొక్క; భక్త = భక్తులలో; వరులు = ఉత్తములు; ఐన = అయిన; వారలు = వారు; ఏ = ఏ; లోకంబులన్ = లోకము లందును; ఎవ్వరికిన్ = ఎవరికి కూడ; అజయ్యులు = జయింపరానివారు; కావున = కనుక; మీ = మీ; కున్ = కు; భద్రంబు = శ్రేయము; అయ్యెడుము = అగునుగాక; అని = అని; భూత = సర్వప్రాణులచే; భావనుండు = స్మరింపబడువాడు; ఐన = అయిన; భగవంతుండు = హరి; అదృశ్యుండు = మాయమైనవాడు; అయ్యెన్ = అయ్యెను; అప్పుడు = అప్పుడు; దేవతలు = దేవతలు; దధీచి = దధీచి యనెడి; ముని = ముని; కడ = వద్ద; కున్ = కు; జనిరి = వెళ్ళిరి; ఆ = ఆ; తఱిన్ = సమయము నందు; ఇంద్రుండు = ఇంద్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- నేను మిక్కిలిగా తృప్తి చెందితే భక్తులకు దుర్లభమైనది లేదు. విశేషంగా నాయందు అనన్యమైన చిత్తం కలిగిన తత్త్వవేత్త నన్ను తప్ప దేనిని కోరుకొనడు. తత్త్వజ్ఞనాన్ని దర్శించి తెలుసుకొన్నవాడు విషయ సుఖాలనుండి విరక్తుడై సంసార బంధాలను ఇష్టపడడు. మీకు శుభం కలుగుతుంది. దధీచి అనే మహర్షి ఉన్నాడు. అతని శరీరం నాదైన గొప్ప విద్యా ప్రభావం వల్ల మహాతేజస్సుతో సారవంతమై ఉన్నది. అతనిని అడిగి అతని శరీరాన్ని పుచ్చుకొనండి. అతడు పూర్వకాలంలో అశ్వినీదేవతలకు బ్రహ్మస్వరూపం, నిష్కళంకం అయిన అశ్వశిరం అనే విద్యను ఉపదేశించగా వారు జీవన్ముక్తులైనారు. అంతేకాక త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపునకు అభేద్యమై, నా పేర ప్రసిద్ధమైన నారాయణ కవచాన్ని ఇచ్చాడు. అతడు గొప్ప దాత. తన దేహాన్ని తప్పకుండా మీకిస్తాడు. అతని ఎముకలతో విశ్వకర్మ నూరంచుల ఆయుధాన్ని సిద్ధం చేస్తాడు. నా తేజోవిశేషంతో నిండిన ఆ వజ్రాయుధం వృత్రాసురుని శిరస్సును ఖండిస్తుంది. దానితో మీ తేజస్సులు, అస్త్రాలు, సంపదలు తిరిగి పొంది ప్రకాశిస్తారు. ముఖ్యంగా నా భక్తవరేణ్యులైన వారిని ఏలోకంలోను ఎవ్వరూ జయింపలేరు. మీకు శుభం కలుగుగాక!” అని సర్వ భూతాలచే స్మరింపబడే ఆ భగవంతుడు అదృశ్యమైనాడు. అప్పుడు దేవతలతో ఇంద్రుడు దధీచి మహర్షి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు.

తెభా-6-348-ఆ.
"దేహి సుఖము గోరి దేహంబు ఘటియించి
దేహి విడువ లేఁడు దేహ మెపుడు;
దేహి! యస్మదీయ దేహంబుకొఱకునై
దేహ మీఁగదయ్య! దేవతలకు.

టీక:- దేహి = జీవుడు; సుఖమున్ = సుఖమును; కోరి = కోరుకొని; దేహంబున్ = శరీరమును; ఘటియించి = ఏర్పరచుకొని; దేహి = జీవుడు; విడువ = వదల; లేడు = లేడు; దేహమున్ = శరీరమును; ఎపుడున్ = ఎప్పుడును; దేహి = ఇమ్ము; అస్మదీయ = మా యొక్క; దేహంబున్ = శరీరముల; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; దేహమున్ = శరీరమును; ఈగదు = ఇమ్ము; అయ్య = తండ్రి; దేవతల్ = దేవతల; కున్ = కు.
భావము:- “అయ్యా! జీవుడు సుఖాలను ఆశించి దేహాన్ని ధరిస్తాడు. అందువల్ల దేహి తన దేహాన్ని విడువడానికి ఇష్టపడడు. ఇప్పుడు దేవతలమైన మేము “దేహీ!” అని నీ దేహాన్ని అడగటానికి వచ్చాము. నీ దేహాన్ని మాకు ఇవ్వు.

తెభా-6-349-ఉ.
క్కడ నెల్ల లోకముల నెవ్వరు గోరని కోర్కి, నేఁడు మా
తెక్కలిపాటునన్ దివిరి దేహము వేఁడగ వచ్చినార; మే
మెక్కడ? తీవ్ర కర్మగతి యెక్కడ? దైవకృతంబు గాక; యీ
రొక్కపు దాన మీ వరుస రోయక వేఁడుదురే జగంబులన్?

టీక:- ఎక్కడన్ = ఎక్కడా; ఎల్ల = అఖిలమైన; లోకములన్ = లోకములను; ఎవ్వరున్ = ఎవరును; కోరని = కోరనట్టి; కోర్కి = కోరికను; నేడు = ఈ దినమున; మా = మా యొక్క; తెక్కలిపాటునన్ = ఆపదవలన; తివిరి = పూని; దేహమున్ = శరీరమును; వేడగన్ = కోరగా; వచ్చినారము = వచ్చితిమి; మేము = మేము; ఎక్కడ = ఎక్కడ; తీవ్ర = తీవ్రమైన; కర్మగతి = కర్మముల ఆచరణములు; ఎక్కడ = ఎక్కడ; దైవ = భగవంతునిచే; కృతంబు = చేసినది; కాక = కాకుండగ; ఈ = ఇలాంటి; రొక్కపు = ఒత్తిడి చేసెడి; దానమున్ = దానమును; ఈ = ఈ; వరుసన్ = విధముగ; రోయక = అసహ్యపడక; వేడుదురే = కోరుతారా ఏమి; జగంబులన్ = లోకములలో;
భావము:- ఎక్కడ కూడా ఏ లోకంలోను ఎవ్వరుకూడా కోరని కోరికతో నేడు మేము మా కష్టాలు గట్టెక్కటానికి నీ శరీరాన్ని అర్థించటానికి వచ్చాము. దేవతలమైన మేము ఇటువంటి కోరరాని కోరిక కోరుకునే గతికి దిగజారామంటే ఇదంతా విధివైపరీత్యం కాక మరేమిటి? లోకంలో ఎక్కడైనా ఇటువంటి కక్కుర్తి దానాన్ని ఎవరైనా సిగ్గు విడిచి అడుగుతారా?

తెభా-6-350-క.
నీగతి యెల్లభంగుల
యాన యని తెలిసి తగని డుగుదు రేనిన్
యాక వర్గము లోపల
నీకులనఁ బడరె? యెంత నేర్పరులైనన్.

టీక:- నీచ = నీచమైన; గతిన్ = విధము; ఎల్ల = అన్ని; భంగులన్ = రకములుగా; యాచన = యాచించుట; అని = అని; తెలిసి = తెలిసి; తగనిది = యుక్తము కానిది; అడుగుదురేని = అడిగినను; యాచక = యాచకుల; వర్గము = సమూహముల; లోపల = అందును; నీచకులు = అతి నీచులు; అనబడరె = అనబడరా ఏమి; ఎంత = ఎంతటి; నేర్పరులు = నేర్పులు గలవారు; ఐనన్ = అయినను
భావము:- యాచన అన్ని విధాల నీచమైన కృత్యమని తెలిసికూడా తగనిదానిని అడగటానికి సిద్ధమైన యాచకులు పరమ నీచులని అనటంలో సందేహం లేదు. ఈ విషయంలో ఎంత నేర్పరులైనా యాచకులు నీచాతినీచులే!

తెభా-6-351-క.
డుగంగరాని వస్తువు
డుగరు బతిమాలి యెట్టి ర్థులు నిను నే
డిగితిమి దేహమెల్లను
డు నడిగెడు వారికేడ రుణ? మహాత్మా! "

టీక:- అడుగంగరాని = కోరకూడని; వస్తువులున్ = వస్తువులను; అడుగరు = కోరరు; బతిమాలి = బతిమాలి; ఎట్టి = ఎటువంటి; అర్థులున్ = వేడువారైనను; నిను = నిన్ను; నేము = మేము; అడిగితిమి = కోరితిమి; దేహమున్ = శరీరము; ఎల్లన్ = అంతయును; కడున్ = మిక్కిలి; అడిగెడువారి = కోరెడివాని; కిన్ = కి; ఏడన్ = ఎక్కడ యుండును; కరుణ = దయ; మహాత్మా = గొప్పవాడా.
భావము:- ఓ మహానుభావా! యాచకులు అర్థింపదగిన వస్తువునే అర్థిస్తారు కాని అడుగరాని వస్తువును బతిమాలి అడగరు. మేము నీ దేహం మొత్తాన్ని అడుగుతున్నాము. నిజానికి దాతలను అడిగేవారికి దయా దాక్షిణ్యాలు ఉండవు”.

తెభా-6-352-ఉ.
నావుడునా దధీచియు మనంబున సంతసమంది నవ్వి సం
భావిత వాక్య పద్ధతులఁ ల్కుచు నిట్లనెఁ బేర్మితోడ "నో!
దేతలార! ప్రాణులకుఁ దెక్కలి మృత్యుభయంబు పూనుటే
భాములం దలంపరు కృపామతి నెన్నఁడు మీ మనంబులన్.

టీక:- నావుడున్ = అనగా; ఆ = ఆ; దధీచియు = దధీచి; మనంబునన్ = మనసులో; సంతసము = సంతోషమును; అంది = పొంది; నవ్వి = నవ్వి; సంభావిత = యుక్తమైన; వాక్య = సంభాషణల; పద్ధతులన్ = రీతులలో; పల్కుచున్ = పలుకుచు; ఇట్లు = ఈ విధముగ; అనెన్ = పలికెను; పేర్మి = కూరిమి; తోడన్ = తోటి; ఓ = ఓ; దేవతలారా = దేవతలూ; ప్రాణుల్ = ప్రాణులు; కున్ = కు; తెక్కలి = వంచకపు; మృత్యు = మరణ; భయంబున్ = భయమును; పూనుట = కలుగుట; ఏ = ఎట్టి; భావములన్ = ఆలోచనలలోను; తలంపరు = ఊహించరు; కృపా = దయగల; మతిన్ = బుద్ధితో; ఎన్నడున్ = ఎప్పుడును; మీ = మీ యొక్క; మనంబులన్ = మనసులలో.
భావము:- ఇంద్రుని మాటలు విని దధీచి లోలోపల సంతోషించి చిరునవ్వు నవ్వి గౌరవ పురస్సరంగా ఆప్యాయంగా ఇలా అన్నాడు “దేవతలారా! మానవులకు మృత్యుభయం సహజంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఎన్నడూ మీ మనస్సులలో తలపోయరు.

తెభా-6-353-ఆ.
లమి బ్రదుక నిచ్ఛయించిన వారికి
దేహ మెల్లభంగిఁ దీపు గాదె?
చ్యుతుండు వచ్చి ర్థించె నేనిని
న్ను నిచ్చునట్టి దాత గలఁడె?

టీక:- ఎలమిన్ = సంతోషముతో; బ్రతుకన్ = జీవించవలెనని; నిచ్ఛయించిన = నిశ్చయించుకొనిన; వారి = వారల; కిన్ = కి; దేహమున్ = శరీరము; ఎల్ల = అన్ని; భంగిన్ = విధములగను; తీపు = తీపి; కదే = కాదా ఏమి; అచ్యుతుండు = హరి; వచ్చి = వచ్చి; అర్థించెనేనినిన్ = అడిగినప్పటికిని; తన్నున్ = తనను, తన దేహమును; ఇచ్చునట్టి = ఇచ్చునట్టి; దాత = దానము చేయువాడు; కలడె = ఉన్నాడా ఏమి.
భావము:- జీవించాలనే నిశ్చయించుకొనిన వారికి తమ తమ శరీరమంటే ఎంతో తీపి. భగవంతుడు వచ్చి యాచించినా తన దేహాన్ని ఇచ్చే దాత ఎవడూ ఉండడు.

తెభా-6-354-వ.
అదియునుం గాక
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతేకాక...

తెభా-6-355-సీ.
ర్థంబు వేఁడెడు ర్థులు గలరు గా-
కంగంబు వేఁడెడి ర్థి గలఁడె?
గు కోరికల నిచ్చు దానశీలుఁడు గల్గుఁ-
న దేహ మీ నేర్చు దాత గలఁడె?
యీ నేర్చువాఁడు దన్నిచ్చిన రోయక-
చంపెడునట్టి యాకుఁడు గలఁడె?
చంపియుఁ బోవక ల్యంబు లన్నియు-
నేఱి పంచుక పోవువారు గలరె?

తెభా-6-355.1-ఆ.
మణ లోకమెల్ల క్షించు వారికి
హింస చేయుబుద్ధి యెట్టు పొడమె?
భ్రాతి యైనయట్టి ప్రాణంబుపైఁ దీపు
మకుఁ బోలె నెదిరిఁ లఁప వలదె?"

టీక:- అర్థంబున్ = ధనమును; వేడెడు = కోరెడు; అర్థులున్ = వేడెడివారు; కలరు = ఉన్నారు; కాక = అలాకాకుండ; అంగంబున్ = శరీరమును; వేడెడి = అర్థించెడి; అర్థి = కోరెడివాడు; కలడె = ఉన్నాడా ఏమి; తగు = యుక్తమైన; కోరికలన్ = అడిగినవాటిని; ఇచ్చు = ఇచ్చెడి; దానశీలుడు = దాన మిచ్చెడి వర్తన గలవాడు, దాత; కల్గున్ = ఉండును; తన = తన యొక్క; దేహమున్ = శరీరమును; ఈన్ = ఇచ్చెడి; నేర్చు = నేర్పు గల; దాత = దానము నిచ్చువాడు; కలడే = ఉండునా ఏమి; ఈన్ = ఇచ్చెడి; నేర్చు = నేర్పుగల; వాడు = వాడు; తన్నున్ = తనదేహమును; ఇచ్చినన్ = ఇచ్చి నప్పటికిని; రోయక = ఏహ్యపడక; చంపెడునట్టి = చంపివేసెడి; యాచకుడు = అర్థి; కలడె = ఉన్నాడా ఏమి; చంపియు = చంపేసి; పోవక = వెళ్ళిపోక; శల్యంబులు = ఎముకలు; అన్నియున్ = అన్నిటిని; ఏఱి = ఏరుకొని; పంచుకపోవు = పట్టుకుపోయెడి; వారు = వారు; కలరె = ఉన్నారా ఏమి.
రమణన్ = మనోజ్ఞముగ; లోకము = లోకములు; ఎల్లన్ = అన్నిటిని; రక్షించు = పాలించెడి; వారు = వారల; కిన్ = కి; హింస = సంహరము; చేయు = చేసెడి; బుద్ధి = భావము; ఎట్టు = ఏ విధముగ; పొడమె = పుట్టెను; భ్రాతి = ప్రేమ కలది; ఐనన్ = అయిన; అట్టి = అటువంటి; ప్రాణంబు = ప్రాణముల; పై = మీద; తీపు = తీపి; తమ = తమ; కున్ = కు; పోలెన్ = వలె; ఎదిరి = ఎదుటివారిని; తలప = భావించ; వలదె = వద్దా.
భావము:- ఈ లోకంలో సంపద లిమ్మని అడిగే యాచకులు ఉంటారు కాని దేహం ఇమ్మని అర్థించేవాడు ఉంటాడా? అడిగిన కోరికలను తీర్చే దాతలు ఉంటారు కాని దేహాన్ని దానంగా ఇచ్చే దాత ఉంటాడా? ఒకవేళ దాత దేహమిచ్చినా కాదనక చంపే యాచకు డుంటాడా? దాతను చంపినా ఎముకలన్నీ ఏరి పంచుకొనే వారుంటారా? లోకాలను దయతో రక్షించే మీకు ఈ హింసాత్మకమైన బుద్ధి ఎలా పుట్టింది? మీ ప్రాణాలు మీకెంత తీపో ఎదుటివాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళకు అంత తీపి అన్న విషయం మీ ఆలోచనకు రాలేదా?

తెభా-6-356-వ.
అనిన నింద్రుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; ఇంద్రుండు = ఇంద్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అన్న దధీచి మాటలను విని దేవతలు ఇలా అన్నారు.

తెభా-6-357-తే.
"ర్వ భూతదయాపర స్వాంతులకును
బుణ్యవర్తను లగు మిమ్ముబోఁటి వారి
మిత సత్కీర్తి కాముల లఘుమతుల
కియ్యరాని పదార్థంబు లెవ్వి గలవు?

టీక:- సర్వ = సమస్తమైన; భూత = ప్రాణుల యెడ; దయ = కృప; అపర = అత్యంత; స్వాంతుల్ = సాధుస్వభావుల; కునున్ = కు; పుణ్య = పావన; వర్తనులు = నడవడిక గలవారు; అగు = అయిన; మిమ్ము = మీ; పోటి = వంటి; వారి = వారల; కిన్ = కు; అమిత = మిక్కిలి; సత్కీర్తి = మంచి యశస్సు; కాములు = కోరెడివారల; కున్ = కు; అలఘుమతుల్ = బుద్ధిమంతుల; కున్ = కు; ఇయ్యరాని = ఇవ్వలేనట్టి; పదార్థంబులు = వస్తువులు; ఎవ్వి = ఏమి; కలవు = ఉన్నవి.
భావము:- “సర్వ భూతాల పట్ల దయాదాక్షిణ్యాలు కలవారు, పుణ్యాత్ములు, కీర్తిని కోరేవారు, వివేకవంతులు అయిన మీవంటి వారికి ఈయరాని పదార్థాలంటూ ఏముంటాయి?

తెభా-6-358-ఆ.
డుగరాని సొమ్ము డుగ రాదని మానఁ
డుగువాని మాట డుగ నేల?
భ్రాంతి నడుగుచోటఁ బ్రాణంబు లేనియు
నిచ్చువాఁడు దాఁపఁ డిచ్చుఁ గాని."

టీక:- అడుగరాని = కోరకూడని; సొమ్మున్ = వస్తువును; అడుగ = కోర; రాదు = రాదు; అని = అని; మానడు = మానివేయడు; అడుగువాని = వేడెడివాని; మాటలు = వివరములను; అడుగన్ = విచారించుట; ఏల = ఎందుకు; భ్రాంతిన్ = భ్రాంతితో; అడుగుచోటన్ = కోరినప్పుడు; ప్రాణంబులు = ప్రాణములు; ఏనియున్ = అయినప్పటికిని; ఇచ్చువాడు = దాత; దాపడు = దాచుకొనడు; ఇచ్చున్ = ఇచ్చును; కాని = తప్పక.
భావము:- అడుగ వచ్చినవాడు అడుగరానిదని అడగడం మానుకొనడు. అడిగేవాని మాట లెలా ఉంటాయో వేరే అడగడం ఎందుకు? ఇచ్చే గుణం ఉన్న దాత ఆశపడి ఎవరైనా అడిగితే ప్రాణాలనైనా ఇస్తాడు.”

తెభా-6-359-వ.
అని పరసంకటంబు దలంపక నిలింపులు గార్యపరతన్ సవినయ వాక్యపరంపరలఁ బ్రార్థించిన, నతండు దరహసితవదనుండై, యఖిల లోకధర్మం బెఱింగియు నొక్కింత కాలంబు ప్రతివాక్యం బిచ్చితి; దీని సహింపదగుదురు; మీయట్టి వారలకుం బ్రియం బగునేని నెప్పుడైన విడువందగిన శరీరంబు విడుచుట యేమి దుర్లభంబు? నధ్రువం బైన యీ దేహంబుచేతం గీర్తి సుకృతంబుల నెవ్వం డార్జింపకుండు నతండు పాషాణాదులకంటె నతి కఠినుండు; మీయట్టి పుణ్యశ్లోకులచేతఁ గాంక్షింపబడిన శరీరం బప్రమేయ ధర్మార్జితం; బే దేహంబుచేత సకలభూతంబులు శోకానుభవంబున శోకించు; హర్షానుభవంబున హర్షించునట్టి మహాకష్ట దైన్యాకరం బైన శరీరంబు కాక శునకసృగాలాదుల పాలు గాకుండ మేలయ్యె; నని నిశ్చితాత్ముం డయి దధీచి దత్త్వాలోకనంబుచేత నిరసిత బంధనుండై, బుద్ధీంద్రియ మానసంబు లతోఁ గూడిన క్షేత్రజ్ఞునిఁ బరబ్రహ్మస్వరూపంబైన భగవంతు నందు నేకీభూతంబు చేసి, యోగజ్ఞానంబున శరీరంబు విడిచె; నప్పుడింద్రుం డతని శల్యంబుల విశ్వకర్మ నిర్మితం బైన, నిశిత శతధారా సమావృతంబై వెలుంగు వజ్రాయుధంబుఁ గైకొని, భగవత్తేజోపబృంహితుం డై, యైరావతారూఢుండై, సకలదేవోత్తమ గరుడ గంధర్వ ఖచర కిన్నర కింపురుష సిద్ధ విద్యాధర పరిసేవితు డై సకల ముని జనంబులు వినుతింపఁ ద్రిలోక హర్షకారియై, భగవదనుగ్రహ సంప్రాప్త మహోత్సాహ వికసిత వదనారవిందుండై వృత్రాసురుపై నడచె; నప్పుడు.
టీక:- అని = అని; పర = ఇతరుల; సంకటంబున్ = కష్టమును; తలంపక = లెక్కించక; నిలింపులున్ = దేవతలు; కార్యపరతన్ = పని సాధించుకొనుటకు; సవినయ = వినయ పూర్వకమైన; వాక్య = మాటల; పరంపరల = వరుసలతో; ప్రార్థించిన = వేడుకొనగా; అతండు = అతడు; దరహసిత = చిరునవ్వు గల; వదనుండు = మోము గలవాడు; ఐ = అయ్యి; అఖిల = సర్వ; లోక = లోకముల; ధర్మంబు = ధర్మములు; ఎఱింగియు = తెలిసినప్పటికిని; ఒక్కింత = కొద్ది; కాలంబు = సమయము; ప్రతివాక్యంబిచ్చితి = ఎదురుమాటాడితి; దానిన్ = దీనిని; సహింపదగుదురు = సహింపగలరు; మీ = మీ; అట్టి = లాంటి; వారు = వారల; కున్ = కు; ప్రియంబు = ఇష్టుడను; అగునేని = అయినచో; ఎప్పుడైన = ఎప్పుడైన; విడువన్ = వదల; తగిన = వలసిన; శరీరంబున్ = దేహమును; విడుచుట = వదలుట; ఏమి = ఏపాటి; దుర్లభంబు = అసాధ్యము; అధ్రువంబు = స్థిరము కానిది; ఐనన్ = అయినట్టి; ఈ = ఈ; దేహంబున్ = శరీరము; చేతన్ = వలన; కీర్తి = యశస్సు; సుకృతంబులన్ = పుణ్యములను; ఎవ్వండు = ఎవడైతే; ఆర్జింపకుండున్ = సంపాదించడో; అతండు = అతడు; పాషాణ = బండరాయి; ఆదులు = మొదలగువాని; కంటెను = కంటెను; అతి = మిక్కిలి; కఠినుడు = కఠిన స్వభావము గలవాడు; మీ = మీ; అట్టి = లాంటి; పుణ్యశ్లోకులు = స్తుతింప దగిన పుణ్యులు; చేతన్ = చేత; కాంక్షింపబడిన = కోరబడిన; శరీరంబున్ = దేహము; అప్రమేయ = అపరిమితమైన; ధర్మ = ధర్మమున; ఆర్జితంబు = సంపాదించినది; ఏ = ఏ; దేహంబున్ = శరీరము; చేతన్ = చేత; సకల = సర్వ; భూతంబులు = ప్రాణములు; శోక = దుఃఖపు; అనుభవంబునన్ = అనుభవముతో; శోకించున్ = దుఃఖించును; హర్ష = సంతోషపు; అనుభవంబునన్ = అనుభవముతో; హర్షించున్ = సంతోషించును; అట్టి = అలాంటి; మహా = గొప్ప; కష్ట = కష్టములను; దైన్య = దీనత్వములను; ఆకరంబు = కలిగించెడిది; ఐన = అయిన; శరీరంబున్ = దేహమును; కాక = కాకులు; శునక = కుక్కలు; సృగాల = నక్కలు; ఆదుల = మొదలగువాని; పాలుగాక = గురికాకుండగ; మేలు = మంచిది; అయ్యెన్ = అయినది; అని = అని; నిశ్చిత = నిశ్చయించుకొన్న; ఆత్ముండు = మనసు గలవాడు; అయి = అయ్యి; దధీచి = దధీచి; తత్త్వ = యోగ; ఆలోకనంబు = దృష్టి; చేతన్ = వలన; నిరసిత = తిరస్కరించిన; బంధనుండు = బంధనములు గలవాడు; ఐ = అయ్యి; బుద్ధి = బుద్ధి; ఇంద్రియ = ఇంద్రియములు; మానసంబులు = మనసులు; తోన్ = తోటి; కూడిన = కలిసిన; క్షేత్రజ్ఞుని = జీవుని; పరబ్రహ్మ = పరబ్రహ్మయే; స్వరూపంబు = తనరూపము; ఐన = అయినట్టి; భగవంతున్ = భగవంతుని; అందు = అందు; ఏకీభూతంబు = ఏకీకృతము; చేసి = చేసి; యోగజ్ఞానంబునన్ = యోగవిద్యతో; శరీరంబున్ = దేహమును; విడిచెన్ = వదలివేసెను; అప్పుడు = అప్పుడు; ఇంద్రుండు = ఇంద్రుడు; అతని = అతని; శల్యంబులన్ = ఎముకలవలన; విశ్వకర్మ = విశ్వకర్మచేత; నిర్మితంబు = తయారుచేయబడినది; ఐన = అయిన; నిశిత = మిక్కిలి వాడియైన; శత = నూరు (100); ధార = పదునైన యంచులతో; సమావృతంబు = చక్కగా కూడియున్నది; ఐ = అయ్యి; వెలుంగు = ప్రకాశించెడి; వజ్ర = వజ్రము అనెడి; ఆయుధంబున్ = ఆయుధమును; కైకొని = చేపట్టి; భగవత్ = భగవంతుని; తేజస్ = తేజస్సుచేత; ఉపబృంహితుడు = సంవర్ధితుండు; ఐ = అయ్యి; ఐరావత = ఐరావతమును {ఐరావతము - ఇంద్రుని వాహనమైన తెల్లఏనుగు}; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; సకల = సర్వ; దేవోత్తమ = ఉత్తములైన దేవతలు; గరుడ = గరుడులు; గంధర్వ = గంధర్వులు; ఖచర = ఖేచరులు; కిన్నర = కిన్నరులు; కింపురుష = కింపురుషులు; సిద్ద = సిద్ధులు; విద్యాధర = విద్యాధరులుచేత; పరిసేవితుండు = చుట్టూచేరి సేవింపబడువాడు; ఐ = అయ్యి; సకల = సర్వ; ముని = మునుల; జనంబులు = సమూహములు; వినుతింపన్ = స్తుతించుచుండగ; త్రిలోక = ముల్లోకములకు; హర్ష = సంతోషమును; కారి = కలిగించెడిది; ఐ = అయ్యి; భగవత్ = భగవంతుని; అనుగ్రహ = అనుగ్రహము వలన; సంప్రాప్త = చక్కగా లభించిన; మహా = గొప్ప; ఉత్సాహ = ఉత్సాహముతో; వికసిత = వికసించిన; వదన = మోము యనెడి; అరవిందుడు = పద్మము గలవాడు; ఐ = అయ్యి; వృత్రాసురు = వృత్రుడు అనెడి రాక్షసుని; పైన్ = మీదకు; నడచెన్ = దాడికి వెళ్ళెను; అప్పుడు = అప్పుడు.
భావము:- అలా అంటూ దేవతలు ఇతరుల ఇబ్బందులను ఆలోచించకుండా తమ పనులు నెరవేర్చుకోవాలనే భావం కలిగినవారై వినయంతో కూడిన మాటలతో దధీచి మహర్షిని ప్రార్థించగా అతడు ముఖంలో చిరునవ్వు చిందిస్తూ “నాకు లోక స్వభావం బాగా తెలిసి కూడా కొంచెంసేపు మీకు ఎదురు చెప్పాను. మరొక విధంగా అనుకోవద్దు. ఎప్పుడైనా విడువ వలసిన శరీరాన్ని మీవంటి వారు కోరుకున్నపుడు విడువడం కష్టమా? అశాశ్వతమైన ఈ దేహంతో శాశ్వతమైన కీర్తిని, పుణ్యాన్ని ఎవడు సంపాదింపడో వాడు పాషాణం కంటే కఠినుడు. మీవంటి పుణ్యాత్ములు కోరుకున్న ఈ శరీరం అపరిమితమైన ధర్మాన్ని సంపాదిస్తుంది. లోకంలోని జీవులకు కష్టాలు సంభవించినపుడు ఈ దేహం దుఃఖిస్తుంది. సుఖాలు సంభవించినప్పుడు సంతోషిస్తుంది. ఇటువంటి కష్టాలకు, దైన్యాలకు నిలయమైన ఈ దేహం కాకుల, గ్రద్దల, నక్కల పాలు కాకుండా మీ వల్ల మేలైన స్థితిని పొందుతున్నది” అని మనస్సులో స్థిరమైన నిశ్చయానికి వచ్చి; ఆత్మావలోకనం చేసుకొని; సమస్త బంధాలు త్రెంచుకొని; మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో కూడిన జీవుణ్ణి భగవంతునిలో ఐక్యం చేసి; యోగమార్గం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టాడు. విశ్వకర్మ ధధీచి మహర్షి ఎముకలతో నూరంచులతో ప్రకాశించే పదునైన వజ్రాయుధాన్ని తయారు చేసాడు. ఇంద్రుడు దాన్ని ధరించి దివ్యమైన తేజస్సుతో ఐరావతాన్ని ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు. దేవతలు, గరుడులు, గంధర్వులు, ఖేచరులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు మొదలైన వారంతా అతనిని అనుసరించారు. మునీంద్రులు కొనియాడారు. ముల్లోకాలు హర్షించాయి. ఈ విధంగా భగవంతుని అనుగ్రహం వల్ల ప్రాప్తించిన మహోత్సాహంతో వికసించిన ముఖారవిందం కల ఇంద్రుడు వృత్రాసురుని మీద దండెత్తాడు. అప్పుడు...

తెభా-6-360-ఉ.
వృత్రుఁడు దాన వాన్వయ పవిత్రుఁడు లోకజిఘాంసకక్రియా
సూత్రుఁడు నిగ్రహాగ్రహణ సుస్థిర వాక్య వివేక మాన చా
రిత్రుఁడు దేవతోరగ దరీకృత వక్త్రుఁడు రోష దూషితా
మిత్రుఁడు శత్రురాకఁ గని మిక్కలియైన యుగాంతకాకృతిన్.

టీక:- వృత్రుడు = వృత్రుడు; దానవ = దానవుల; అన్వయ = వంశమును; పవిత్రుండు = పావనము చేయువాడు; లోక = లోకములను; జిఘాంసక = సంహరించ కోరెడి; క్రియా = కార్యము లందు; సూత్రుడు = కంకణము కట్టుకొన్నవాడు; నిగ్రహ = నిగ్రహింటుట యందు; ఆగ్రహణ = పట్టుపట్టుట యందు; సుస్థిర = గట్టి; వాక్య = మాటలను ప్రయోగించుట యందు; వివేకమాన = వివేకము కల; చారిత్రుడు = ప్రవర్తన గలవాడు; దేవత = దేవతలు; ఉరగ = సర్పములను; దరీకృత = హద్దులలో పెట్టగల (దరి = హద్దు, మేర); వక్త్రుడు = నోరు గలవాడు; రోష = కోపముతో; దూషిత = నిందింపబడిన; అమిత్రుడు = శత్రువులు గలవాడు; శత్రు = శత్రువుల; రాకన్ = వచ్చుటను; కని = చూసి; మిక్కిలి = పెద్దది; ఐన = అయిన; యుగాంత = ప్రళయము వంటి; ఆకృతిన్ = ఆకారముతో.
భావము:- దానవ వంశాన్ని పావనం చేసినవాడు, లోకాన్ని సంహరించటానికి కంకణం కట్టినవాడు, నిగ్రహానుగ్రహాలకు తగిన వాక్యాలను ప్రయోగించడంలో ఆరితేరిన ప్రవర్తన కలవాడు, దేవతలనే సర్పాలను మ్రింగే గుహవంటి నోరు కలవాడు అయిన వృత్రాసురుడు శత్రువులు దండెత్తి వస్తున్నారని తెలుసుకొని, కోపవాక్కులతో దూషిస్తూ ప్రళయకాల యముని వలె భయంకరాకారంతో...

తెభా-6-361-క.
మెండు గల దనుజ నాయక
మంలములు గొల్వ నడచె హితోద్ధతి వే
దంముల నడుమ జను నడ
గొంయునుం బోలె నిబిడ గోపోద్ధతుఁడై.

టీక:- మెండు = అధికముగా; కల = ఉన్నట్టి; దనుజ = రాక్షస; నాయక = ప్రభువుల; మండలములు = సమూహములు; కొల్వ = సేవించుచుండగా; నడచెన్ = వెళ్ళెను; మహిత = గొప్ప; ఉద్ధతిన్ = అతిశయముతో; వేదండముల = ఏనుగుల; నడుమ = మధ్యన; చనున్ = వెళ్ళెడి; నడగొండయునున్ = నడచి వచ్చెడి కొండను; పోలెన్ = వలె నిబిడ = దట్టమైన; కోప = కోపముచే; ఉద్ధతుడు = అతిశయించినవాడు; ఐ = అయ్యి.
భావము:- రాక్షస నాయకుల పెక్కు సమూహాలు సేవిస్తూ తన వెంట రాగా, ఆగ్రహావేశంతో ఉద్ధతుడై మదపుటేనుగుల మధ్య కదలి వస్తున్న మహాపర్వతం వలె బయలుదేరాడు.

తెభా-6-362-క.
కాగళుఁ డడిరి కడువడిఁ
గాలునిపైఁ గవయు మాడ్కి రతర రవ సం
చాలిత పూర్వ దిగంతరుఁ
డై లీల మహేంద్రుమీఁద తఁ డరిగె నృపా!

టీక:- కాలగళుడు = నీలకంఠుడు {కాలగళుడు - కాల (నల్లని) గళుడు (కంఠము గలవాడు), శివుడు}; అడరి = కోపించి; కడు = మిక్కిలి; వడిన్ = వేగముగా; కాలుని = యముని; పైన్ = మీద; కవయు = కలియబడెడి; మాడ్కి = వలె; ఖరతర = అతి కఠినమైన; రవ = శబ్దములచే; సంచాలిత = మిక్కిలి చలించిన; పూర్వ = తూర్పు; దిగంతరుండు = దిగంతము గలవాడు; ఐ = అయ్యి; లీలన్ = క్రీడవలె; మహేంద్రు = ఇంద్రుని; మీదన్ = పైకి; అతడు = అతడు; అరిగె = దాడికి వెళ్ళెను; నృపా = రాజా.
భావము:- రాజా! శివుడు రౌద్రావేశంతో యమధర్మరాజు మీదికి లంఘించినట్లు వృత్రాసురుడు తూర్పుదిక్కు దద్దరిల్లేటట్లు గర్జిస్తూ ఇంద్రుని మీదికి దూకాడు.

తెభా-6-363-వ.
ఇట్లు రుద్రగణంబులు, మరుద్గణంబులు, నాదిత్యగణంబులు, నశ్వినీదేవతలుఁ, బితృదేవతలు, విశ్వేదేవులు, వహ్ని, యమ, నైరృతి, వరుణ వాయు, కుబే, రేశా నాదులు, సిద్ధ, సాధ్య, కిన్నర, కింపురుష, గరుడ, గంధర్వ, ఖేచరప్రముఖంబు లగు నింద్ర సైన్యంబులతోడ నముచియు, శంబరుండును, ననుర్వుండును, ద్విమూర్ధండును, వృషభుండును, నంబరుండును, హయగ్రీవుండును, శంకుశిరుండును, విప్రచిత్తియు, నయోముఖుండును, బులోముండును, వృషపర్వుండును, హేతియుఁ, బ్రహేతియు, నుత్కటుండును, ధూమ్రకేశుండును, విరూపాక్షుండును, గపిలుండును, విభావసుండును, నిల్వలుండును, బల్వలుండును, దందశూకుండును, వృషధ్వజుండును, గాలనాభుండును, మహానాభుండును, భూతసంతాపనుండును, వృకుండును, సుమాలియు, మాలియు మున్నగు దైతేయ దానవ యక్ష రాక్షసాద్యసంఖ్యంబు లగు వృత్రాసురు బలంబు లంతం దలపడి, సమరంబు చేసి; రప్పుడు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; రుద్రగణంబులు = రుద్రగణములు; మరుద్గణంబులు = మరుత్తులగణములు; ఆదిత్యగణంబులు = ఆదిత్యగణములు; అశ్వనీదేవతలు = అశ్వనీదేవతలు; పితృదేవతలు = పితృదేవతలు; విశ్వేదేవులు = విశ్వేదేవులు; వహ్ని = అగ్ని; యమ = యముడు; నైరృతి = నైరృతి; వరుణ = వరుణుడు; వాయు = వాయువు; కుబేర = కుబేరుడు; ఈశాన = ఈశానుడు; ఆదులు = మొదలగువారు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; కిన్నర = కిన్నరులు; కింపురుష = కింపురుషులు; గరుడ = గరుడులు; గంధర్వ = గంధర్వులు; ఖేచర = ఖేచరులు; ప్రముఖంబులగు = మొదలగు; ఇంద్ర = ఇంద్రుని; సైన్యంబు = సైన్యము; తోడన్ = తోటి; నముచియు = నముచి; శంబరుండును = శంబరుడు; అనుర్వుండును = అనుర్వుడు; ద్విమూర్థుండును = ద్విమూర్థుడు; వృషభుండును = వృషభుడు; అంబరుండును = అంబరుడు; హయగ్రీవుండును = హయగ్రీవుడు; శంకుశిరుండును = శంకుశిరుడు; విప్రచిత్తియున్ = విప్రచిత్తి; అయోముఖుండును = అయోముఖుడు; పులోముండును = పులోముడు; వృషపర్వుండును = వృషపర్వుడు; హేతియున్ = హేతి; ప్రహేతియును = ప్రహేతి; ఉత్కటుండును = ఉత్కటుడు; ధూమ్రకేశుండును = ధూమ్రకేశుడు; విరూపాక్షుండును = విరూపాక్షుడు; కపిలుండును = కపిలుడు; విభావసుండును = విభావసువు; ఇల్వలుండు = ఇల్వలుడు; బల్వలుండును = బల్వలుడు; దందశూకుండును = దందశూకుడు; వృషధ్వజుండును = వృషధ్వజుడు; కాలనాభుండును = కాలనాభుడు; మహానాభుండును = మహానాభుడు; భూతసంతాపనుండును = భూతసంతాపనుడు; వృకుండును = వృకుడు; సుమాలియున్ = సుమాలి; మాలియున్ = మాలి; మున్నగు = మొదలగు; దైతేయ = దైత్యులు; దానవ = దానవులు; యక్ష = యక్షులు; రాక్షస = రాక్షసులు; ఆది = మొదలగు; అసంఖ్యంబులు = సంఖ్యాతీతములు; అగు = అయిన; వృత్రాసురు = వృత్రాసురుని; బలంబులన్ = సైన్యములను; తలపడి = ఎదుర్కొని; సమరంబు = యుద్ధము; చేసిరి = చేసిరి; అప్పుడు = అప్పుడు.
భావము:- ఈ విధంగా రుద్రగణాలు, మరుద్గణాలు, ఆదిత్యగణాలు, అశ్వినీదేవతలు, పితృదేవతలు, విశ్వేదేవుళ్ళు, అగ్ని, యముడు, నైరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, ఖేచరులు మొదలైన వారున్న ఇంద్రుని సైన్యంతో నముచి, శంబరుడు, అనర్వుడు, ద్విమూర్ధుడు, హేతి, ప్రహేతి, ఉత్కటుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, కపిలుడు, విభావసుడు, ఇల్వలుడు, పల్వలుడు, దందశూకుడు, వృషధ్వజుడు, కాలనాభుడు, మహానాభుడు, భూతసంతాపనుడు, వృకుడు, సుమాలి, మాలి మొదలైన దైత్య దానవ యక్ష రాక్షసులు అసంఖ్యాకంగా ఉన్న వృత్రాసురుని సైన్యం కలియబడి సంగ్రామం చేశారు. అప్పుడు...

తెభా-6-364-చ.
సురులకున్ సురావళికి య్యె మహారణ మప్పు డొండొరుల్
ముల గదాసి కుంత శర ముద్గర తోమర భిందిపాల ప
ట్టి పటుశూల చక్రముల ఠేవలు చూపి యదల్చి యార్చుచున్
లక కప్పి రస్త్రముల మార్కొని మంటలు మింట నంటగన్.

టీక:- అసురుల్ = రాక్షసులు; కున్ = కి; సుర = దేవతా; ఆవళి = సమూహమున; కిన్ = కు; అయ్యెన్ = జరిగెను; మహా = గొప్ప; రణము = యుద్ధము; అప్పుడు = అప్పుడు; ఒండొరుల్ = ఒకరినొకరు; ముసల = రోకలివంటి ఆయుధము; గద = గద; అసి = కత్తి; కుంత = కుంతలము, ఈటెలు; శర = బాణములు; ముద్గర = తవ్వుగోల; తోమర = చిల్లగోల; భిందిపాల = భిండిపాల, గుదియలు; పట్టిస = అడ్డకత్తులు; పటు = పటిష్టమైన; శూల = శూలములు; చక్రములన్ = చక్రములు; ఠేవలు = ప్రయోగవిశిష్టతలు; చూపి = ప్రదర్శించి; అదల్చి = బెదిరించి; ఆర్చుచున్ = అరచుచు; మసలక = వెనుదిరగక; కప్పిరి = కప్పివేసిరి; అస్త్రములన్ = ఆయుధములతో; మార్కొని = ఎదుర్కొని; మంటలు = మంటలు; మింటన్ = ఆకాశమును; అంటగన్ = తగులునట్లుగ.
భావము:- రాక్షసులకు, దేవతలకు మధ్య భయంకరమైన మహాసంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో వాళ్ళు రోకళ్ళతో, గదలతో, ఖడ్గాలతో, ఈటెలతో, బాణాలతో, తవ్వుకొలలతో, చిల్లకోలలతో, గుదియలతో, అడ్డకత్తులతో, శూలాలతో, చక్రాలతో గర్వంగా అరుస్తూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఒకరి పైకి ఒకరు లంఘించి అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటే విధంగా శస్త్రాస్త్రాలతో శత్రు సైన్యాలను కప్పివేశారు.

తెభా-6-365-క.
ఒండొరులఁ గడవ నేసిన
కాంము లాకాశపథముఁ ప్పి మహోల్కా
దండంబు లొలసి నిష్ఠుర
భంన ముఖ మొప్పెఁ జూడఁ బ్రళయోచితమై.

టీక:- ఒండొరులన్ = ఒకరినొకరు; కడవన్ = సంహరించుటకు; ఏసిన = వేసినట్టి; కాండముల్ = బాణములు; ఆకాశపథమున్ = ఆకాశమార్గమును; కప్పి = కప్పివేసి; మహా = గొప్ప; ఉల్కాదండంబున్ = తోకచుక్కలతో; ఒలసి = కలసిపోయి; నిష్ఠుర = అతికఠినమైన; భండనముఖము = యుద్ధభూమి; ఒప్పెన్ = ఒప్పియున్నది; చూడన్ = చూచుటకు; ప్రళయ = ప్రళయము; ఉచితము = అనదగినది; ఐ = అయ్యి.
భావము:- ఒకరి నొకరు సంహరించడానికి ప్రయోగించిన బాణాలు ఆకాశ మార్గమంతా నిండి నిప్పులు చిమ్మగా యుద్ధరంగం మహాప్రళయంగా కనిపించింది.

తెభా-6-366-చ.
సువరు లేయు బాణములు చూడ్కి కగోచరమై నభస్థలం
ఱిముఱి గప్పి రేసి దివసాంతముఁ జేసిన లీల నా సురే
శ్వ బలయూధ వీరులను సాయక పంక్తుల చేత వాని రూ
శతధూళిఁ జేసి పఱపైన తమం బొనరించి రార్చుచున్.

టీక:- సురవరులు = ఉత్తములైనదేవతలు; ఏయు = వేసెడి; బాణములు = బాణములు; చూడ్కి = చూపుల; కున్ = కు; అగోచరము = కనబడనివి; ఐ = అయ్యి; నభస్థలంబు = ఆకాశమండలము; అఱిముఱిన్ = కలతబడునట్లు; కప్పిరి = కప్పివేసిరి; ఏసి = విజృంభించి; దివసాంతమున్ = సాయంసంధ్యగా; చేసినన్ = చేయగా; లీలన్ = క్రీడవలె; అసురేశ్వర = రాక్షసుల; బల = సైనిక; యూధ = సమూహముల; వీరులను = వీరులను; సాయక = బాణముల; పంక్తుల్ = సమూహముల; చేతన్ = వలన; వాని = వారి; రూపఱన్ = రూపుమాయునట్లుగ; శత = అనేక; ధూళిన్ = చిన్నముక్కలు; చేసి = చేసి; పఱపు = చిక్కని; ఐన = అయిన; తమంబున్ = చీకట్లను; ఒనరించి = ఏర్పరచి; ఆర్చుచున్ = కేకలుపెట్టుచు.
భావము:- దేవతలు ప్రయోగించే బాణాలు కంటికి కనిపించకుండా ఆకాశమంతా కప్పి సంధ్యాసమయాన్ని తలపింపజేశాయి. ఆ దానవ వీరులు తమ బాణాలతో దేవతల బాణాలను నుగ్గు నుగ్గు చేసి కేకలు వేస్తూ రణరంగమంతా దట్టమైన చీకట్లు క్రమ్మేటట్లు చేశారు.

తెభా-6-367-చ.
రమదాంధు లై సుర నిశాచర వీరులు సైనికాంఘ్రి సం
క్రమిత మహీపరాగములు గ్రమ్మిన నుమ్మలికంపుఁ జీకటుల్
కనుదోయి కడ్డముగఁ దార్కొనినం జల మేది పోరి రా
క్రమిత నిజాంతరంగ పరిట్టిత రోష మహాగ్ని పెంపునన్.

టీక:- సమర = రణ; మద = ఆవేశముతో; అంధులు = కన్నులుకనబడినివారు; ఐ = అయ్యి; సుర = దేవతా; నిశాచర = రాక్షస; వీరులు = బలములు; సైనిక = సైనికుల; అంఘ్రి = పాదములచే; సంక్రమిత = కలిగిన; మహీపరాగములు = ధూళిధూసరితములు; క్రమ్మినన్ = కమ్ముకొనగా; ఉమ్మలికంపు = చిమ్మ; చీకటుల్ = చీకట్లు; తమ = తమ యొక్క; కను = కళ్లు; దోయిన్ = రెంటి; కిన్ = కి; అడ్డముగన్ = అడ్డముగ; తార్కొనినన్ = ముసురుకొనచుండ; చలము = పట్టుదలల; ఏది = పెంచుకొని; పోరిరి = పోరాటముచేసిరి; ఆక్రమిత = ఆక్రమింపబడిన; నిజ = స్వంత; అంతరంగ = మనసులలో; పరిఘట్టిత = ఉద్రేకపరచబడిన; రోష = రోషము యనెడి; మహా = గొప్ప; అగ్ని = అగ్ని యొక్క; పెంపునన్ = అతిశయమువలన.
భావము:- దేవ దానవ వీరులు ఆవేశంతో కన్నులు గానక పోరాడుతూ ఉంటే వారి కాళ్ళ త్రొక్కిళ్ళకు పైకి లేచిన దుమ్ముతో ఆ ప్రదేశమంతా అంధకారంతో నిండిపోయింది. ఆ చీకట్లలో తమకు ఏమీ కనిపించక పోయినా తమ హృదయాలలో చెలరేగిన కోపాగ్ని జ్వాలల బలంతో వారు పట్టు విడువకుండా యుద్ధం చేశారు.

తెభా-6-368-క.
తిగళిత రక్తధారా
క్షములతోఁ గానఁబడిరి సైనికులు మహో
ద్ధ రోషవహ్ని కీలలు
వితం బై పెల్లగిల్లి వెడలెడి భంగిన్.

టీక:- అతి = మిక్కిలిగ; గళిత = కారుతున్న; రక్త = రక్తపు; ధార = ధారల; క్షతముల్ = గాయముల; తోన్ = తోటి; కానబడిరి = కనిపించుతున్నారు; సైనికులు = సైనికులు; మహా = గొప్ప; ఉద్ధతన్ = అతిశయించిన; రోష = రోషము యనెడి; వహ్ని = అగ్ని; కీలలు = మంటలు; వితతంబు = విస్తారించినవి; ఐ = అయ్యి; పెల్లగిల్లి = ఉవ్వెత్తుగ; వెడలెడి = లేస్తున్న; భంగిన్ = విధముగ.
భావము:- మిక్కిలి గాయపడిన వీరుల శరీరాలనుండి పొంగి ప్రవహించే రక్తధారలతో సైనికులు భగభగ మండుతూ ఉవ్వెత్తుగా లేచే కోధాగ్ని జ్వాలల వలె కనిపించారు.

తెభా-6-369-సీ.
వణించు శింజినీ టంకార రవములు-
ట సింహనాదంబుఁ రిఢవింప
భీషణోత్తమ హయ హేషావిఘోషంబు-
రి బృంహితస్ఫూర్తిఁ గ్రందుకొలుప
మర నిశ్శంకాంశ శంఖ నినాదంబు-
నేమి స్వనంబుల నిహ్నవింపఁ
దుములమై చెలఁగెడు దుందుభి ధ్వానంబు-
ట్టహాసంబుల నాక్రమింప

తెభా-6-369.1-తే.
టిత శస్త్రాస్త్ర నిష్ఠుర ట్టనోత్థ
ర కఠో రోరు విస్ఫులింగంబు లడరి
దివ్య కోటీర మణిఘృణి ధిక్కరింప
మర మొనరించి రసురులు మరవరులు.

టీక:- ఠవణించు = కావించు; శింజినీ = అల్లెతాటి, వింటినారి; టంకార = టం యనెడి; రవములు = శబ్దములు; భట = భటుల యొక్క; సింహనాదంబున్ = అరుపులను; పరిఢవింపన్ = అగ్గలించ, పెంపార; భీషణ = భయంకరమైన; ఉత్తమ = ఉత్తమమైన; హయ = గుఱ్ఱముల; హేషా = సకిలింపుల; విఘోషంబున్ = అధికమైన శబ్దములు; కరి = ఏనుగుల; బృంహిత = ఘీంకారముల; స్ఫూర్తిన్ = స్ఫూర్తిని; క్రందుకొలుపన్ = అతిశయించుతుండగ; సమర = రణమున; నిశ్శంకాంశ = అనుమానమేమి లేని; శంఖ = శంఖముల యొక్క; నినాదంబున్ = శబ్దములను; నేమి = రథచక్రముల ఇరుసుల; స్వనంబులన్ = శబ్దములను; నిహ్నవింపన్ = మరుగుపరచుచుండగ; తుములము = దొమ్మి యుద్ధము; ఐ = జరుగ; చెలగెడు = చెలరేగెడు; దుందుభి = యుద్ధభేరీల; ధ్వానంబులు = శబ్దములు; అట్టహాసంబులన్ = సైనికుల భీకరనవ్వులను; ఆక్రమింప = అతిక్రమించుతుండగా;
ఘటిత = పుట్టిన; శస్త్ర = శస్త్రములు; అస్త్ర = అస్త్రములు; నిష్ఠర = మిక్కిలి గట్టిగ; ఘట్టన = గ్రుద్దుకొనుటచే; ఉత్థ = పుట్టిన; ఖర = వేడివేడి; కఠోర = కఠినమైన; ఉరు = విస్తారమైన; విస్పులింగంబుల్ = నిప్పురవ్వలు; దివ్య = దేవతల; కోటీర = కిరీటము లందలి; మణి = మణుల; ఘృణి = కాంతులను; ధిక్కరింపన్ = తిరస్కరించుచుండగ; సమరము = యుద్ధము; ఒనరించిరి = చేసిరి; అసురులున్ = రాక్షసులు; అమరవరులు = శ్రేష్ఠులైన దేవతలు;
భావము:- పెద్దగా ధ్వనించే వీరుల ధనుష్టంకారాలు వారి సింహనాదాలను మించుతుండగా, గుఱ్ఱాల భీషణ హేషారావాలు ఏనుగుల ఘీంకారాలను ఆక్రమిస్తుండగా, విశృంఖలంగా మ్రోగుతున్న శంఖధ్వానాలు రథచక్ర ధ్వనులను క్రిందు చేస్తుండగా, సంకులంగా చెలరేగిన దుందుభి నినాదాలు వీరుల వికటాట్టహాసాలను మరుగు పరుస్తుండగా, శస్త్రాస్త్రాల పరస్పర ఘర్షణ వల్ల ఉద్భవించిన అగ్నికణాల కాంతులు వారి కిరీటాలలోని రత్నాల కాంతులను తిరస్కరిస్తుండగా దేవ దానవులు యుద్ధం చేశారు.

తెభా-6-370-వ.
ఇట్లు ప్రళయసంరంభ విజృంభిత సముత్తుంగ రంగత్తరంగిత భైరవారావ నిష్ఠ్యూత నిష్ఠుర మహార్ణవంబునుం బోలె యుగాంత సంక్రాంత ఝంఝాపవన పరికంపిత దీర్ఘ నిర్ఘాత నిబిడ నిష్ఠుర నీరదంబులుం బోలె, నుభయ సైన్యంబులు గలసి సంకుల సమరంబు సలుపు సమయంబున, యుగాంత కృతాంత సకలప్రాణి సంహార కారణలీలయుం బోలెఁ, బదాతిరాతి మావంత రథిక మహారథిక వీరు లొండురులు చండగతిం గాండంబులు పఱపుచు, గదలం జదుపుచుఁ, గత్తులఁ గత్తళంబులఁ జినుఁగం బొడుచుచు, నడిదంబుల నఱకుచుఁ, గుంతలంబులం గ్రుచ్చుచు, గుఠారంబుల వ్రచ్చుచు, ముసలంబుల మోఁదుచు, ముద్గరంబులం బాఁదుచుఁ, జక్రంబులం ద్రుంచుచు, సబళంబుల నొంచుచు, చురియల మెఱుముచు, శూలంబులఁ దుఱుముచు, వాజుల కుఱికియు, వాలంబుల నఱికియుఁ, దొడలు తుండించియుఁ, దొండంబులు ఖండించియు, మెడ లెడయించియు, మెదళ్ళు గెడయించియు, నములు ద్రుంచియు, నాసికలు ద్రెంచియుఁ, బదంబుల విఱిచియుఁ, బార్శంబులం జఱచియు, గజంబులఁ బఱపియు, గాత్రంబుల మఱపియుఁ, గుంభంబులఁ బగిలించియుఁ, గొమ్ములఁ బెకలించియు, హస్తంబులఁ దుండించియు, నంగంబులఁ జించియు, రథంబుల చలియించియు, రథికుల బొలియించియు, సారథుల జంపియు, సైంధవంబులఁ దంపియు, శిరంబు నొగిలించియు, సీసకంబు లగిలించియు, ఛత్రంబుల నుఱుమాడియుఁ, జామరంబులం దునుమాడియు, సైన్యంబులఁ జిదిపియు, సాహసుల మెదిపియు, నడుములు ద్రుంచియు, మఱియును బరస్పర గుణవిచ్ఛేదనంబున, నన్యోన్య కోదండ ఖండన పటుత్వంబు నుభయ సైంధవ ధ్వజ సారథి రథిక రథ వికలనంబును, నొండొరుల పాద జాను జంఘా హస్త మస్తక నిర్దళనంబును, రక్త మాంస మేదః పంకసంకలిత సమరాంగణంబునునై యతి ఘోర భంగిం బెనంగి; రప్పుడు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ప్రళయ = ప్రళయకాలపు; సంరంభ = ఆటోపముతో; విజృంభిత = విజృంభిస్తున్న; సముత్తుంగ = ఉవ్వెత్తు; తరంగ = అలలచే; తరంగిత = అల్లకల్లోలపు; భైరవ = భయంకరమైన; ఆరావ = శబ్దములు; నిష్ఠ్యూత = వెలువడుతున్నట్టి; నిష్ఠుర = భీకరమైన; మహార్ణవంబునున్ = సముద్రమును; పోలెన్ = వలె; యుగ = యుగము; అంత = అంత్యకాలమున; సంక్రాంత = సంక్రమణపు, సంధ్యాకాల; ఝంఝాపవన = ఝంమ్మని అతి వేగముగా వీచెడి; పవన = గాలులచే; పరికంపిత = చలించిపోవు; దీర్ఘ = పెద్ద పెద్ద; నిర్ఘాత = పిడుగులచే; నిబిడ = దట్టమైన; నిష్ఠుర = కఠినమైన; నీరదంబులున్ = మేఘములను; పోలెనున్ = వలె; ఉభయ = రెండు ప్రక్కల; సైన్యంబులున్ = సైన్యములును; కలసి = కలిసి; సంకుల = దొమ్మి; సమరంబు = యుద్ధము; సలుపు = చేసెడి; సమయంబున = సమయములో; యుగాంత = యగము లంతం బగునప్పటి; కృతాంత = యముని {కృతాంతుడు – అంతము చేసెడివాడు, యముడు}; సకల = సమస్తమైన; ప్రాణి = ప్రాణుల; సంహార = సంహరించుట; కారణ = కోసమైన; లీలయున్ = కార్యముల; పోలెన్ = వలె; పదాతి = కాల్బలము; రాతి = గుఱ్ఱపురౌతులు; మావంత = ఏనుగు మావటీలు; రథిక = రథులు {రథి - రథముపైనుండి యుద్ధముజేయు వాడు}; మహారథిక = మహారథులు {మహారథి - రథముపైనుండి పదకొండువేలమందితో యుద్ధము జేయగలవాడు}; వీరులు = వీరులు; ఒండొరులన్ = ఒకరి నొకరు; చండ = భయంకరముగా; కాండంబులు = బాణములు; పఱపుచు = వేయుచు; గదలన్ = గదలతో; చదుపుచున్ = నలగగొట్టుతు; కత్తులన్ = కత్తులతో; కత్తళంబులన్ = కవచములను; చినుగన్ = చిరిగిపోవునట్లు; పొడుచుచున్ = పొడుచుచు; అడిదంబులన్ = ఖడ్గములతో; నఱకుచున్ = నరకుచు; కుంతలంబులన్ = ఈటెలతో; గ్రుచ్చుచు = పొడుచుచు; కుఠారంబులన్ = గొడ్డళ్ళతో; వ్రచ్చుచున్ = బద్దలుకొట్టుచు; ముసలంబులన్ = రోకళ్ళతో; మోదుచున్ = మొత్తుచు; ముద్గరంబులన్ = గుదియలతో, సమ్మెటలతో; బాదుచున్ = బాదుచు; చక్రంబులన్ = చక్రములతో; త్రుంచుచున్ = తుంచివేయుచు; సబళంబులన్ = వెడల్పైన ఈటెలతో, సబడి ఆయుధము; ఒంచుచున్ = వంచుచు; చురియలన్ = సురకత్తులతో; మెఱముచు = పొడిచి తిప్పుచు; శూలంబులన్ = శూలములతో; తుఱుముచున్ = తురుముచు; వాజుల్ = గుఱ్ఱముల; కున్ = కు; ఉఱికియున్ = ఉరుకుచు; వాలంబులన్ = కత్తులతో; నఱకియున్ = నరకుచు; తొడలున్ = తొడలను; తుండించియున్ = ఖండించి; తొండంబులున్ = తొండములను; ఖండించియున్ = ఖండించి; మెడలున్ = కంఠములను; ఎడయించియిన్ = విరిచేసి; మెదళ్ళు = మెదళ్ళను; గెడయించియున్ = కెలికుచు; నడుములున్ = నడుములను; త్రుంచియున్ = విరగొట్టి; నాసికలు = ముక్కులను; త్రెంచియున్ = కోసి; పదంబులన్ = కాళ్ళను; విఱిచియున్ = విరిచేసి; పార్శంబులన్ = పక్కలను; చఱచియున్ = చరచి; గజంబులన్ = ఏనుగులను; పఱపియున్ = పారదోలి; గాత్రంబులన్ = ఏనుగు కాలి ముందరి పిక్కలను; మఱపియున్ = మడిచేసి, మాటుపరచి; కుంభంబులన్ = ఏనుగు కుంభస్థలములను; పగిలించియున్ = పగులగొట్టి; కొమ్ములన్ = ఏనుగు దంతములను; పెకలించియున్ = పీకివేసి; హస్తంబులన్ = తొండములను; తుండించియున్ = తునకలుచేసి; అంగంబులన్ = అవయవములను; చించియున్ = చించివేసి; రథంబులన్ = రథములను; చలియించియున్ = కుదిపేసి; రథికులన్ = రథములోని వీరులను; పొలియించియున్ = చంపి; సారథులన్ = రథముల నడపెడివారిని; చంపియున్ = చంపి; సైంధవంబులన్ = గుఱ్ఱములను; చంపియున్ = చంపి; శిరంబున్ = తలలు; ఒగిలించియు = పగులగొట్టి; సీసకంబులున్ = కిరీటములను; అగిలించియున్ = ఊడగొట్టి; ఛత్రంబులన్ = గొడుగులను; ఉఱుమాడియున్ = విరగొట్టి; చామరంబులన్ = చామరములను; తునుమాడియున్ = ముక్కలుచేసి; సైన్యంబులున్ = సైనికుల సమూహములను; చిదిపియున్ = చిదిమేసి; సాహసులన్ = వీరులను; మెదపియున్ = చంపి; నడుములున్ = నడుములను; త్రుంచియున్ = విరిచేసి; మఱియున్ = ఇంకను; పరస్పర = ఒకరి కొకరి; గుణ = విల్లుతాడు, అల్లెతాడు; విచ్ఛేదనంబునన్ = తెంపుటలు; అన్యోన్య = ఒకరి దొకరి; కోదండ = విల్లులను; ఖండన = విరగొట్టెడి; పటుత్వంబునున్ = గట్టిదనములు; ఉభయ = రెండు; సైంధవ = గుఱ్ఱములను; ధ్వజ = జండాకొయ్యలను; సారథి = రథసారథులను; రథిక = రథులను; రథ = రథములను; వికలనంబునున్ = వికలనముచేయుట; ఒండొరులన్ = ఒకరి నొకరు; పాద = కాళ్ళు; జాను = మోకాళ్ళు; జంఘ = పిక్కలు; హస్త = చేతులు; మస్తక = తలలు; నిర్దళనంబునున్ = తెగొట్టుట; రక్త = రక్తము; మాంస = మాంసపు ముద్దల; మేదస్ = మెదళ్ళ ముద్దల; పంక = బురదలతో; సంకలిత = కూడిన; సమరాంగణంబును = యుద్ధభూమి; ఐ = అయ్యి; అతి = మిక్కిలి; ఘోర = ఘోరమైన; భంగిన్ = విధముగ; పెనగిరి = దొమ్మి యుద్ధము చేసిరి; అప్పుడు = అప్పుడు.
భావము:- ఈ విధంగా రణరంగమంతా పొంగి పొరలే ఉత్తుంగ తరంగాల భీషణ ఘోషలతో భయంకరమైన ప్రళయకాల మహాసముద్రం లాగా హోరెత్తుతున్నది. కల్పాంతకాలంలో విజృంభించి వీస్తున్న పెనుగాడ్పులకు కంపించి పోతూ పిడుగులు వర్షించే కారు మేఘాల వలె ఉభయ సైన్యాలు సంకుల సమరం సాగిస్తున్న ఆ దృశ్యం యుగాంత సమయంలో సమస్త ప్రాణులను సంహరించే యమధర్మరాజు క్రీడా విహారం లాగా ఉన్నది. ఆ యుద్ధభూమిలో కాలిబంట్లు, గుఱ్ఱపు రౌతులు, గజారోహకులు, రథికులు, మహారథికులు ఒకరిపై ఒకరు భయంకరంగా బాణాలను ప్రయోగిస్తూ, గదలతో కొట్టుకొంటూ, కత్తులతో కవచాలు చీలిపోయే విధంగా పొడుచుకొంటూ, ఖడ్గాలతో ఒకరినొకరు అణచివేస్తూ, ఈటెలను గ్రుచ్చుతూ, గొడ్డళ్ళతో నరుకుకుంటూ, రోకళ్ళతో బాదుతూ, ఇనుప గుదియలతో మోదుకుంటూ, చక్రాలను విరిచివేస్తూ, కుంతాలతో బాధిస్తూ, చురకత్తులతో నొప్పిస్తూ, శూలాలతో పొడుస్తూ, గుఱ్ఱాలపైకి ఉరికి తోకలు ఖండిస్తూ, ఏనుగుల మీదికి దూకి తొండాలను నరుకుతూ, మెడలు నరికి, మెదళ్ళు నేల రాల్చి, నడుములు విరుగగొట్టి, ముక్కులు కోసి, కాళ్ళు విరుగగొట్టి, ప్రక్కలు చీల్చి, ఏనుగులను పారద్రోలి, వాటి శరీరాలను చీల్చి, కుంభస్థలాలను పగులగొట్టి, దంతాలను పెకలించి, తొండాలను ముక్కలు చేసి, అవయవాలను చించివేసి, రథాలను కుదిపేసి, రథాలమీది వీరులను సారథులను చంపి, గుఱ్ఱాలను చంపి, తలలు పగులగొట్టి, కిరీటాలను ఎగురగొట్టి, గొడుగులను విరగ్గొట్టి, చామరాలను ముక్కలు చేసి, సైన్యాలను చిదిమివేసి, వీరులను చంపి, నడుములు విరుగగొట్టి, ఒకరి అల్లెత్రాడులను ఒకరు త్రెంచివేసి, ధనుస్సులను విరగ్గొట్టి, ఎదుటి పక్షంవారి గుఱ్ఱాలను, జెండాకొయ్యలను, సారథులను, రథులను, రథాలను ఛిన్నాభిన్నం చేసి, పరస్పరం కాళ్ళు, మోకాళ్ళు, పిక్కలు, చేతులు, తలలు తెగగొడుతూ, రక్తమాంసాల మెదళ్ళ బురదతో కూడిన యుద్ధభూమిలో భయంకరమైన యుద్ధాన్ని చేశారు. అప్పుడు...

తెభా-6-371-చ.
జయమున్ సమాపజయ సామ్య పరిశ్రమమున్ సమోరు వి
క్రము సమాస్త్రశస్త్రబల ర్వము నై కడు ఘోర భంగి నా
ముచి విరోధి సైన్య గణనాథులతోడ నిశాచరేశ్వ రో
త్తములు దురంబుజేసి రొగిఁ దార్కొని వృత్రుబలంబు ప్రాపునన్.

టీక:- సమ = సరిసమానమైన; జయమున్ = గెలుపులు; సమ = సరిసమానమైన; అపజయ = ఓటములు; సామ్య = సమత్వము గల; పరిశ్రమమున్ = కష్టపడుటలు; సమ = సరిసమానమైన; ఉరు = అధికమైన; విక్రమము = పరాక్రమము; సమ = సరిసమానమైన; అస్త్ర = బాణముల; శస్త్ర = ఆయుధముల; బల = సైనికబలము యొక్క; గర్వమున్ = అతిశయమును; ఐ = అయ్యి; కడు = మిక్కిలి; ఘోర = భయంకరమైన; భంగిన్ = విధముగ; ఆ = ఆ; నముచివిరోధి = ఇంద్రుని; సైన్య = సైన్యపు; గణ = సమూహముల; నాథుల్ = నాయకుల; తోడన్ = తోటి; నిశాచర = రాక్షస; ఈశ్వర = ప్రభువులలో; ఉత్తములున్ = శ్రేష్ఠులు; దురంబు = యుద్ధములు; చేసిరి = చేసిరి; ఒగిన్ = పూని; తార్కొని = తాకి; వృత్రు = వృత్రుని; బలంబున్ = శక్తి; ప్రాపునన్ = చేరుటవలన.
భావము:- దేవ దానవుల సైన్యాలు జయాపజయాలలోను, పోరాడే పరిశ్రమలోను, పరాక్రమంలోను, శస్త్రాస్త్ర సముదాయలోను, బలగర్వంలోను సరిసమానంగా ఉన్నాయి. ఇంద్రుని సేనానాయకులతో వృత్రాసురుని అండదండలు కలిగిన రాక్షస సైన్యాలు పోరాడసాగాయి.

తెభా-6-372-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = అప్పుడు.
భావము:- ఆ సమయంలో...

తెభా-6-373-లగ్రా.
మొత్తముగఁ బాఱు పెనునెత్తురు మహానదులఁ;
త్తరముతో నుఱికి కుత్తుకలు మోవం
జిత్తముల నుబ్బి వెస నెత్తుకొను భూతముల;
త్తుకొని శాకినులు జొత్తిలుచు మాంసం
బుత్తలముతో మెసఁగి నృత్తములు జేయు మద;
త్తఘన ఢాకినులు వృత్తగతిఁ బ్రేవుల్
బిత్తరములం దిగిచి మెత్తమెదడుల్ మొనసి;
గుత్తగొనుచుండ భయవృత్తిఁ గల నొప్పెన్.

టీక:- మొత్తముగన్ = అధికముగ; పాఱు = పారెడి; పెను = పెద్ద; నెత్తురు = రక్తపు; మహా = గొప్ప; నదులన్ = నదులందు; తత్తరము = సంభ్రమము; తోన్ = తో; ఉఱికి = దూకి; కుత్తుకలుమోవన్ = పీకలదాకా; చిత్తములన్ = మనసులలో; ఉబ్బి = సంతోషించి; వెసనెత్తుకొను = వేగిరించెడి; భూతములన్ = భూతములను; అత్తుకొని = అంటుకొని; శాకినులున్ = ఒకరకము భూతములు; జొత్తిలుచున్ = రంజిల్లుతూ; మాంసంబున్ = మాంసమును; ఉత్తలము = ఆత్రము; తోన్ = తో; మెసగి = మెక్కి; నృత్తములు = నృత్యములు; చేయు = చేసెడి; మద = మదించిన; మత్త = మత్తెక్కిన; ఢాకినులున్ = ఒకరకపు భూతములు; వృత్తగతిన్ = గుండ్రముగ తిరుగుటలు; ప్రేవుల్ = పేగులను; బిత్తరములన్ = తొట్రుపాటులతో; తిగిచి = లాగుతూ; మెత్త = మెత్తటి; మెదడుల్ = మెదళ్ళను; మొనసి = పూని; గుత్తన్ = మొత్తముగ; కొనుచుండన్ = తినుచుండగ; భయవృత్తన్ = భీకరముగ; కలను = యుద్ధము; ఒప్పెన్ = ఒప్పియుండెను.
భావము:- రణరంగమంతా రక్తపుటేరులు ప్రవహించాయి. పెనుభూతాలు కుత్తుకలోతు నెత్తురు ప్రవాహాలలో దుమికి విచ్చలవిడిగా విహరింపసాగాయి. శాకినులు మాంసపు కండలను కడుపునిండా భుజిస్తూ నృత్యం చేశాయి. మదంతో మైమరచిన డాకినులు ప్రేవుల దండలను మెడలనిండా ధరించి మెత్తని మెదళ్ళను తింటూ మిక్కిలి భయంకరంగా గంతులు వేశాయి.

తెభా-6-374-వ.
ఇట్లు దేవదానవులు నర్మదాతీరంబునఁ గృతయుగంబునం దలపడి త్రేతాయుగంబు చొచ్చునంత కాలంబుఁ బోరు దారుణంబుగాఁ జేయు చుండ; నంత వృత్రాసురు భుజబలంబు పెంపునఁ దెంపుచేసి కంపిం పక నిలింపులపై రక్కసులు గుంపులై పెంపు చూపి మహా వృక్ష పాషాణ గిరిశిఖరంబులు వర్షించిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; దేవ = దేవతలు; దానవులున్ = రాక్షసులు; నర్మదా = నర్మద యొక్క; తీరంబునన్ = ఒడ్డున; కృతయుగంబునన్ = కృతయుగములో; తలపడి = మొదలు పెట్టి; త్రేతాయుగంబున్ = త్రేతాయుగము; చొచ్చు = ప్రవేశించెడి; అంత = అంత; కాలంబున్ = కాలమును; పోరు = యుద్ధము; దారుణంబుగా = భయంకరముగా; చేయుచుండన్ = చేయుచుండగా; అంత = అంతట; వృత్ర = వృత్రుడు యనెడి; అసురు = రాక్షసుని; భుజబలంబు = బాహుబలము యొక్క; పెంపునన్ = అతిశయమువలన; తెంపుచేసి = తెగించి; కంపింపక = భయపడక; నిలింపుల్ = దేవతల; పై = మీద; రక్కసులు = రాక్షసులు; గుంపులై = గుంపులుకట్టి; పెంపున్ = అతిశయమును; చూపి = చూపి; మహా = పెద్దపెద్ద; వృక్ష = చెట్లు; పాషాణ = బండరాళ్లు; గిరిశిఖరంబులున్ = కొండశిఖరములు; వర్షించినన్ = వర్షమువలె వేయగా.
భావము:- ఈ విధంగా దేవతలు, రాక్షసులు నర్మదానది ఒడ్డున కృతయుగంలో ప్రారంభించి యుద్ధం చేస్తుండగా త్రేతాయుగం ప్రారంభమైనది. అప్పుడు వృత్రాసురుని బాహుబలంతో పెంపొందిన రాక్షసులు గుంపులుగా తెగించి, చలించకుండా దేవతల మీద పెద్ద పెద్ద వృక్షాలను, బండలను, కొండ శిఖరాలను కురిపించారు.

తెభా-6-375-మ.
గిరి పాషాణ మహీజముల్ గుఱియఁగా గీర్వాణులన్నింటి ని
ష్ఠు నారాచపరంపరల్ పఱపుచున్ జూర్ణంబుఁ గావింప ని
ర్భ లీలం దమచేయు సత్త్వములు దోర్భంగంబు లై పోవఁగాఁ
దెలన్ రాక్షస యోధవీరుల మదోద్రేకంబు సంఛిన్నమై.

టీక:- గిరి = కొండశిఖరములు; పాషాణ = బండరాళ్లు; మహీజముల్ = చెట్లు; కుఱియగా = వానజల్లులా పడగా; గీర్వాణులు = దేవతలు; అన్నిటిన్ = అన్నిటిని; నిష్ఠుర = కఠినమైన; నారాచ = ఇనుప బాణముల; పరంపరలన్ = వరుసలను; పఱపుచు = వేయుచూ; చూర్ణంబున్ = నుజ్జునుజ్జుగా; కావింపన్ = చేయగ; నిర్భర = భరింపలేని; లీలన్ = విధముగ; తమ = తాము; చేయు = చేసెడి; సత్త్వముల్ = ప్రయత్నములు; దోర్భంగంబులు = భుజబలములు విఫల మగుట; ఐపోవగాన్ = అయిపోగా; తెరలన్ = తొలగిపోయెను; రాక్షస = రాక్షసుల; యోధవీరుల = యుద్ధవీరుల; మద = మదము యొక్క; ఉద్రేకంబు = ఉద్రేకము; సంఛిన్నము = ముక్కలైపోయినది; ఐ = అయ్యి.
భావము:- దానవులు కొండలను, బండలను, చెట్లను తమమీద కురిపిస్తూ ఉండగా దేవతలు నిశితమైన బాణాలను ప్రయోగించి వాటిని ముక్కలు ముక్కలుగా ఖండించారు. ఈ విధంగా తమ బల ప్రయోగాలు విఫలం కావడంతో దానవవీరులు మదోద్రేకంతో మరింత చెలరేగారు.

తెభా-6-376-క.
ప్రచురముగ రాక్షసావళి
రులపై నేయు నిబిడకాండావళి దు
ర్వనుఁ డెడ నాడు మాటలు
సురిత్రుని యందుఁ బోలెఁ జొరవయ్యె నృపా!

టీక:- ప్రచురముగన్ = అధికముగా; రాక్షస = రాక్షసుల; ఆవళి = సమూహములు; ఖచరుల్ = దేవతల; పైన్ = మీద; ఏయు = వేసెడి; నిబిడ = దట్టమైన; కాండ = బాణముల; ఆవళి = సమూహములు; దుర్వచనుడు = చెడు మాట్లాడెడివాడు; ఎడన్ = వ్యతిరేకముగ; ఆడు = పలికెడి; మాటలు = మాటలు; సుచరిత్రుని = వంచివర్తన గలవాని; అందున్ = ఎడల; పోలెన్ = వలె; చొరవు = ప్రవేశింపనివి; అయ్యెన్ = అయినవి; నృపా = రాజా {నృపుడు - నృ (నరులకు) అధిపుడు, రాజు}.
భావము:- రాజా! రాక్షసులు దేవతలపై ఎడతెరపి లేకుండా కురిపించిన బాణాలు సజ్జనుల విషయంలో దుర్జనుల దూషణల వలె వృథా అయిపోయాయి.

తెభా-6-377-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = అప్పుడు.
భావము:- ఆ సమయంలో...

తెభా-6-378-వన.
అం సురలేయు నిబిడాస్త్రములపాలై
పంములు దక్కి హత పౌరుషముతో ని
శ్చింగతి రక్కసులు సిగ్గుడిగి భూమిం
గంతుగొని పాఱి రపకారపరు లార్వన్.

టీక:- అంతన్ = అంతట; సురలు = దేవతలు; ఏయు = వేసెడి; నిబిడ = దట్టమైన; అస్త్రముల = బాణములకు; పాలు = తగిలినవారు; ఐ = అయ్యి; పంతములు = పట్టుదలలు; తక్కి = తగ్గి; హత = పోయిన; పౌరుషము = పౌరుషము; తోన్ = తో; నిశ్చింత = నిశ్చేష్టుల; గతిన్ = వలె; రక్కసులు = రాక్షసులు; సిగ్గు = సిగ్గు; ఉడిగి = విడిచి; భూమిన్ = యుద్ధభూమిని; గంతుగొని = దాటివేసి; పాఱిరి = పారిపోయిరి; అపకారులు = శత్రువులు; అర్వన్ = అరచుచుండగ.
భావము:- దేవతలు నిర్విరామంగా శస్త్రాస్త్రాలు గుప్పించగా రాక్షసులు తట్టుకోలేక పంతాలు, పౌరుషాలు వదలి సిగ్గు విడిచి తోకలు ముడిచి పరాజితులై పారిపోయారు. వారిని చూసి దేవతలు అవహేళనగా కేకలు వేశారు.

తెభా-6-379-క.
కొంలఁ బోలెడు రక్కసు
లొండొరులం గడవఁ బాఱి రుక్కఱి పటు కో
దంముఖ సాధనంబులు
భంనమున వైచి దివిజతు లార్వంగన్.

టీక:- కొండలన్ = పర్వతాలను; పోలెడు = వంటి; రక్కసులు = రాక్షసులు; ఒండొరులన్ = ఒకరినొకరు; కడవన్ = దాటుకొంటు; పాఱిరి = పారిపోయిరి; ఉక్కు = స్థైర్యము, బలము; అఱి = నశించి; పటు = బలిష్టమైన; కోదండ = విల్లులు; ముఖ = మొదలగు; సాధనంబులు = ఆయుధములు; భండనమునన్ = యుద్ధభూమిలో; వైచి = పారవేసి; దివిజ = దేవతా; పతులు = నాయకులు; ఆర్వంగన్ = అరచుచుండగ.
భావము:- కొండల వంటి ఉద్దండులైన రాక్షసులు పౌరుషం కోల్పోయి ధనుర్బాణాలు విడిచి యుద్ధరంగం నుండి పారిపోవటం చూసి దేవతలు వేళాకోళం చేస్తూ పెద్దగా అట్టహాసాలు చేశారు.

తెభా-6-380-వ.
ఇట్లు సమరతలంబువాసి తన ప్రాపుమాసి, తీసిపఱచుచుండు దండనాయకులం జూచి, యకుటిలమతిం బకపక నగి వృత్రాసురుం, డిట్లనియె
టీక:- ఇట్లు = ఈ విధముగ; సమరతలంబున్ = యుద్ధభూమిని; వాసి = విడిచిపెట్టి; తన = తన యొక్క; ప్రాపున్ = ప్రాపకము, పొందును; మాసి = వదలి; తీసి = వేసి; పఱచుచుండు = పారిపోవు; దండనాయకులన్ = సేనానాయకులను; చూచి = చూసి; అకుటిల = స్వచ్ఛమైన; మతిన్ = మనసుతో; పకపక = పకపకమని; నగి = నవ్వి; వృత్ర = వృత్రుడు యనెడి; అసురుండు = రాక్షసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా తన అధీనంలోని దానవ సేనానాయకులు రణరంగాన్ని విడిచి పారిపోవటం చూచి వృత్రాసురుడు పకపక నవ్వి ఇలా అన్నాడు.

తెభా-6-381-ఉ.
"క్షుల్లకవృత్తి మీ కగునె? శూరుల కిమ్మెయిఁ గీర్తి భోగముల్
గొల్లగఁ జేయు చావు మదిఁ గోరినవారల కైనఁ గల్గునే?
ల్లడ మంది యీ సమరర్మము మాని తలంగఁ బాడియే?
ల్లుఁడు దుర్దమప్రథనత్తుఁడు వృత్రుని పాటెఱుంగరే?

టీక:- క్షుల్లక = నీచపు; వృత్తి = ప్రవర్తన; మీ = మీ; కున్ = కు; అగునె = తగునా ఏమి; శూరుల్ = వీరుల; కిన్ = కి; ఈ = ఈ; మెయిన్ = విధమైన; కీర్తి = యశస్సులు; భోగముల్ = భోగములు; కొల్లగజేయు = పోవునట్లుచేసెడి; చావు = మరణము; మదిన్ = మనసున; కోరిన = కోరెడి; వారల్ = వారి; కైనన్ = కైనప్పటికిని; కల్గునే = లభించునే; తల్లడము = తల్లడిల్లి; అంది = చెంది; ఈ = ఈ; సమర = యుద్ధ; ధర్మమున్ = ధర్మమును; మాని = వదలి; తలంగన్ = తొలగిపోవుట; పాడియె = యుక్తమైనదా ఏమి; మల్లుడు = మల్లయోధుడు; దుర్దమ = దమింపరాని; ప్రథన = యుద్ధము చేయుట యందు; మత్తుడు = మదించినవాడు, అతి ఆసక్తి గల వాడు; వృత్రుని = వృత్రుని యొక్క; పాటు = సామర్థ్యము; ఎఱుంగరే = తెలియరా ఏమి.
భావము:- “వీరాధివీరులైన మీరు ఈ విధంగా పారిపోవటం నీచమైన కార్యం. ఇది మీకు తగని పని. కీర్తిని, సుఖాలను కొల్లలుగా ఇచ్చే ఇటువంటి వీరమరణం ధీరులకు మాత్రమే లభిస్తుంది. కోరుకున్న వారి కందరికీ ప్రాప్తిస్తుందా? యుద్ధధర్మాన్ని వదలి ఇలా పిరికిపందలై రణరంగం నుండి పారిపోవడం న్యాయమా? యుద్ధరంగంలో సాటిలేని మేటి వీరుడనైన ఈ వృత్రుని శక్తి సామర్థ్యాలు మీకు తెలియదా?

తెభా-6-382-క.
చావు ధ్రువమైన ప్రాణికిఁ
జావులు రెం డరసికొనుఁడు మరమునందున్
భావింప యోగమందును
జావంగా లేని చెడుగుచావుం జావే? "

టీక:- చావు = మరణము; ధ్రువము = తప్పనిది; ఐన = అయినట్టి; ప్రాణి = జీవి; కిన్ = కి; చావులు = మరణములు; రెండు = రెండు (2); అరసికొనుడు = తెలిసికొనుడు; సమరమున్ = యుద్ధము; అందున్ = లోను; భావింపన్ = తరచిచూసిన; యోగము = యోగ మార్గము; అందునున్ = లోను; చావంగన్ = మరణించ; లేని = లేనట్టి; చెడుగు = చెడ్డ; చావున్ = చావు కూడ; చావే = ఒక చావా ఏమి.
భావము:- మరణం స్థిరమైన ప్రాణికి రెండు విధాలైన చావులే ఉత్తమమైనవి. రణరంగంలోను, యోగమార్గంలోను కాక మరొక విధంగా చావడం నీచమైనది”.

తెభా-6-383-వ.
అని వాసుదేవ తేజోవిశేష విశేషితులై దవానలకీలలం బోలె వెలుంగుచు వెఱచి వెన్నిచ్చి పాఱెడు నసురుల వెనుకొని తఱుము సురవీరులం జూచి హుంకరించి స్వర్గానుభవంబున నిచ్చలేకుండె నేని మదవలోకన స్పర్శన మాత్రంబు ముందర నిలుతురు గాక; యని యేచి కల్పాంతానల్ప ఘనఘనాటోపంబునుం బోలెఁ గఠోరకంఠ హుంకార తర్జనంబులన్ గర్జిల్లుచుఁ, బ్రళయకాల పవన పరిభావిత మహాశిఖిశిఖావళులఁ దృణీకరించు కుటిలావలోకనంబుల నాలోకించుచుం, గాల పరిపక్వ లీలాలోలుండయిన శూలి పోలిక నాభీలమూర్తి యై సకల జీవభార భరణ దుర్భర భగ్న బ్రహ్మాండ మహాధ్వానంబు భంగి నాస్పోటించిన.
టీక:- అని = అని; వాసుదేవ = విష్ణుమూర్తి యొక్క; తేజస్ = తేజస్సుయొక్క; విశేష = విశిష్టతవలన; విశేషితులు = అతిశయించినవారు; ఐ = అయ్యి; దవానల = అగ్ని; కీలలన్ = మంటల; పోలెన్ = వలె; వెలుంగుచున్ = ప్రకాశించుతు; వెఱచి = భయపడి; వెన్నిచ్చి = వెనుతిరిగి; పాఱెడున్ = పారిపోవుచున్న; అసురులన్ = రాక్షసులను; వెనుకొని = వెన్నంటి; తఱుము = తరుముతున్న; సుర = దేవతా; వీరులన్ = వీరులను; చూచి = చూసి; హుంకరించి = అట్టహాసముచేసి; స్వర్గ = స్వర్గసుఖములను; అనుభవంబునన్ = అనుభవించుట యందు; ఇచ్చ = కోరిక; లేకుండెనేని = లేకపోయినచో; మత్ = నా యొక్క; అవలోకన = చూచుట; స్పర్శన = తాకుట; మాత్రంబు = మాత్రపు సమయము; ముందరన్ = ఎదుట; నిలుతురుగాక = నిలబడండి; అని = అని; ఏచి = విజృంభించి; కల్పాంత = ప్రళయకాలపు; అనల్ప = పెద్దవైనట్టి; ఘన = మేఘముల; ఘనాటోపంబునున్ = ఉరుముల; పోలెన్ = వంటి; కఠోర = కఠినమైన; కంఠ = గొంతు; హుంకార = హుంకారములు; తర్జనంబులన్ = బెదిరించుటలతో {తర్జనము - తర్జని (చూపుడువేలు) చూపి బెదిరించుట}; గర్జిల్లుచున్ = గర్జించుచు; ప్రళయకాల = ప్రళయకాలపు; పవన = వాయువులచే; పరిభావిత = రగులుతున్న; మహా = గొప్ప; శిఖి = అగ్ని; శిఖా = మంటల; ఆవళులన్ = సమూహములను; తృణీకరించి = తిరస్కరించెడి; కుటిల = వంకర; అవలోకనంబులన్ = చూపులతో; ఆలోకించుచున్ = చూచుచు; కాల = కాలము; పరిపక్వ = పరిపక్వము యగుట యనెడి; లీలన్ = క్రీడ యందు; ఆలోలుండు = ఆసక్తి గలవాడు; అయిన = ఐనట్టి; శూలి = శంకరుని; పోలికన్ = వంటి; ఆభీల = భయంకరమైన; మూర్తిన్ = స్వరూపము గలవాడు; ఐ = అయ్యి; సకల = సర్వ; జీవ = ప్రాణుల; భార = బరువు; భరణ = భరించుటను; దుర్భర = భరింపలేక; భగ్న = పగిలిన; బ్రహ్మాండ = బ్రహ్మాండము యొక్క; మహా = గొప్ప; ధ్వానంబు = శబ్దము; భంగిన్ = వలె; ఆస్ఫోటించినన్ = భుజము చరచగ.
భావము:- అని చెప్పి వాసుదేవుని తేజోవిశేషం వల్ల దావాగ్ని జ్వాలలవలె వెలుగుతూ రాక్షస సైనికుల వెంటబడి తరుముతున్న అమర వీరులను చూచి వృత్రాసురుడు హుంకరించి “స్వర్గ సుఖాలను ఇంకా అనుభవించాలనే కోరిక లేనివాళ్ళైతే నా కళ్ళముందు నిలబడండి” అని విజృంభించి కల్పాంత కాలపు కాలమేఘం వలె గంభీర కంఠస్వరంతో కఠోరంగా గర్జిస్తూ బెదరిస్తూ, ప్రళయకాలపు వాయువువల్ల ఎగసిపడే అగ్నికీలలను తిరస్కరించే కటిక వీక్షణాలను ప్రసరింపజేస్తూ లయకాల మహారుద్రుని వలె రౌద్రాకారం ధరించి మహోద్రేకంతో బ్రహ్మాండ భాండం బ్రద్దలయ్యే విధంగా భుజాలను చరిచాడు. అప్పుడు...

తెభా-6-384-ఉ.
కూడె జగంబు లన్నియును; గ్రుంకిరి సూర్య సుధాంశు; లద్రు లూ
టాడె; నభస్థ్సలం బగిలె; నంబుధు లింకె; నుడుగ్రహాళి ప
ట్టూడె; వడిం దిశల్ పగిలె; నుర్వర క్రుంగె; నజాండభాండ మ
ల్లాడె; విధాత బెగ్గడిలె; నార్చుచు వృత్రుఁడు బొబ్బపెట్టినన్.

టీక:- కూడెన్ = కలసిపోయినవి; జగంబులు = లోకములు; అన్నియున్ = సర్వము; క్రుంకిరి = కూలిరి; సూర్య = సూర్యుడు; సుధాంశులు = చంద్రులు {సుధాంశుడు - సుధ (అమృతము) అంశుడు (అంశగా గలవాడు), చంద్రుడు}; అద్రులు = పర్వతములు; ఊటాడెన్ = ఊగిపోయెను; నభస్థలంబు = ఆకాశము; పగిలెన్ = పగిలిపోయెను; అంబుధులు = సముద్రములు {అంబుధి - అంబు (నీటికి) నిధి, సముద్రము}; ఇంకెన్ = ఇంకిపోయెను; గ్రహ = గ్రహముల; ఆళి = సమూహముల; పట్టు = పట్టు; ఊడెన్ = జారెను; వడిన్ = వేగముగ; దిశల్ = దిక్కులు; పగిలెన్ = పగిలిపోయెను; ఉర్వర = భూమి; క్రుంగెన్ = కుంగిపోయినది; అంజాండభాండము = బ్రహ్మాండభాండము {అజాండభాండము - అజ (పుట్టుక లేని వాడైన బ్రహ్మ) అండ భాండము, బ్రహ్మాండభాండము}; అల్లాడె = ఊగిసలాడెను; విధాత = బ్రహ్మదేవుడు; బెగ్గడిలెన్ = భయపడెను; ఆర్చుచున్ = అరచుచు; వృత్రుడు = వృత్రుడు; బొబ్బ = కేక; పెట్టినన్ = పెట్టగా.
భావము:- వృత్రాసురుడు పెద్దగా బొబ్బ పెట్టగా మహాధ్వనికి లోకాలు చీకాకు పడ్డాయి. సూర్య చంద్రులు అస్తమించారు. పర్వతాలు ఊగిసలాడాయి. ఆకాశం బ్రద్దలయింది. సముద్రాలు ఇంకిపోయాయి. నక్షత్రాలు, గ్రహాలు పట్టు తప్పాయి. దిక్కులు పగిలిపోయాయి. భూమి క్రుంగిపోయింది. బ్రహ్మాండభాండం అల్లాడిపోయింది. బ్రహ్మ తల్లడిల్లాడు.

తెభా-6-385-లగ్రా.
కూలిరి వియచ్చరలు; సోలిరి దిశాధిపులు;-
వ్రాలి రమరవ్రజము; దూలి రురగేంద్రుల్;
ప్రేలిరి మరుత్తు; లెద జాలిగొని రాశ్వినులు;-
కాలుడిగి రుద్రు లవలీ బడి రార్తిన్;
వ్రేలిరి దినేశ్వరులు; కీలెడలినట్లు సుర;-
జాములు పెన్నిదుర పాగుచు ధారా
భీ గతితోడఁ దమ కేలిధనువుల్ విడిచి;-
నేలఁబడి మూర్ఛలను దేలిరి మహాత్మా!

టీక:- కూలిరి = పడిపోయిరి; వియచ్ఛరలు = ఆకాశగమనులు; సోలిరి = నీరసించిరి; దిశాధిపులు = దిక్పాలకులు {దిక్పాలకులు - అష్టదిక్కులను పాలించువారు}; వ్రాలిరి = పడిపోయిరి; అమర = దేవతల {అమరులు - మరణములేనివారు, దేవతలు}; వ్రజమున్ = సమూహములు; తూలిరి = తూలిపోయారు; ఉరగ = సర్ప {ఉరగము - ఉర (వక్షముతో) గము (కదులునది), పాము}; ఇంద్రుల్ = శ్రేష్ఠులు; ప్రేలిరి = అరచిరి; మరుత్తులున్ = మరుద్దేవతలు; ఎదన్ = హృదయములో; జాలిగొనిరి = భయపడిరి; అశ్వినులు = అశ్వినీదేవతలు; కాలుడిగి = నడవలేక; రుద్రులు = రుద్రగణములు; అవలీలల్ = అవలీలగా; పడిరి = పడిపోయారు; ఆర్తిన్ = బాధలలో; వ్రేలిరి = వేళ్ళాడిపోయారు; దినేశ్వరులు = ఆదిత్యులు; కీలు = శీల; ఎడలిన్ = ఊడిపోయిన; అట్లు = విధముగ; సుర = దేవతల; జాలములు = సమూహములు; పెన్నిదుర = మరణము; పాలగుచు = పొందుచు; ధారా = ఎడతెగని; ఆభీల = భయపడిన; గతిన్ = విధము; తోడన్ = తోటి; తమ = తమ యొక్క; కేలి = చేతులలోని; ధనువుల్ = విల్లులను; విడిచి = వదలి; నేలన్ = నేలమీద; పడి = పడిపోయి; మూర్ఛలనున్ = మూర్ఛర్చలలో; తేలిరి = తేలిపోయిరి; మహాత్మా = గొప్పవాడా.
భావము:- మహాత్మా! ఆ వృత్రాసురుని పెడబొబ్బకు గంధర్వాదులైన వియచ్చరులు నేల కూలారు. దిక్పతులు సోలిపోయారు. దేవతల సమూహం వ్రాలిపోయారు. నాగులు తూలిపోయారు. మరుత్తులు ప్రేలిపోయారు. అశ్వినీ కుమారులు దిగులుపడ్డారు. రుద్రగణాలు కాలు జారి పడ్డారు. ద్వాదశాదిత్యులు కీలూడి వ్రేలాడ బడ్డారు. సురసైనికులు పెద్ద నిద్దుర ఆవహించినట్లు చేతులలోని విల్లమ్ములను జార విడిచి నేలమీద పడి మూర్ఛిల్లారు.

తెభా-6-386-వ.
ఇట్లు కఠోర కంఠనాదం బొనర్చిన నశనిపాతంబునం గూలు ప్రాణిచయంబు భంగి నంగంబు లెఱుంగక రణరంగంబునం బడి బిట్టు మూర్ఛిల్లిన, దివిజరాజసైన్యంబుల వృత్రాసురుండు సంగరరంగ దుర్దముండై మహీవలయంబు పదాహతంబుల గడగడ వడంక, నిశితశూలంబు గేల నంకించుచు, మదించిన భద్రమాతంగంబు కమల వనంబు చొచ్చి, మట్టిమల్లాడు విధంబున నిమీలితాక్షుండయి, తన పదతలంబుల రూపంబులు మాయం జమురుచు, వెక్కసంబుగఁ గ్రీడించు వానింగని వజ్రి వజ్రశతోపమ నిష్ఠుర గదాదండం బాభీల భంగిఁ బ్రళయకాల మార్తాండ చండపరివేష ప్రేరితంబుగాఁ ద్రిప్పి వైచిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కఠోర = కఠినమైన; కంఠ = గొంతుతో; నాదంబు = అరుపు; ఒనర్చిన = అరవగా; అశని = పిడుగు; పాతంబునన్ = పడుటవలన; కూలు = చనిపోయెడి; ప్రాణి = జీవి; చయంబున్ = కోటి; భంగిన్ = వలె; అంగంబులు = అవయవములుపై; ఎఱుంగక = తెలివి లేకుండగ; రణరంగంబునన్ = యుద్ధభూమి యందు; పడి = పడిపోయి; బిట్టు = మిక్కిలిగ; మూర్ఛల్లిన = మూర్ఛపోయిన; దివిజరాజ = దేవేంద్రుని {దివిజరాజు - దివి (స్వర్గమున) జులు (చెందినవారు) దేవతలు రాజు, ఇంద్రుడు}; సైన్యంబులన్ = సైన్యములను; వృత్ర = వృత్రుడు యనెడి; అసురుండు = రాక్షసుడు; సంగరరంగ = యుద్ధభూమి యందు; దుర్దముండు = జయింపరానివాడు; ఐ = అయ్యి; మహీవలయంబున్ = భూమండలమును; పద = పాదముల; హతంబులన్ = తాకిడులచే; గడగడ = గడగడ అని; వడంక = వణకిపోగా; నిశిత = వాడియైన; శూలంబున్ = శూలమును; కేలన్ = చేత; అంకించుకొని = పట్టుకొని; మదించిన = మదించిన; భద్రమాతంగంబు = భద్రగజము, జాతి ఏనుగు {గజజాతులు - త్రివిధగజములు, 1భద్రము 2మందము 3మృగము}; కమలవనంబు = పద్మముల చెరువు; చొచ్చి = ప్రవేశించి; మట్టిమల్లాడు = తొక్కి చిందరవందర చేసెడి; విధంబునన్ = విధముగ; నిమీలిత = అరమూసిన; అక్షుండు = కన్నులు గలవాడు; అయి = అయ్యి; తన = తన యొక్క; పదతలంబులన్ = అరికాళ్ళతో; రూపంబులున్ = స్వరూపములు; మాయన్ = మాసిపోవునట్లు; చమురుచున్ = చరుచుచు; వెక్కసంబుగ = సహింపరానివిధముగ; క్రీడించు = లీలగాతిరుగు; వానిన్ = వాడిని; కని = చూసి; వజ్రి = ఇంద్రుడు {వజ్రి - వజ్రాయుధము ధరించువాడు, ఇంద్రుడు}; వజ్ర = వజ్రముల; శత = నూరిటితో (100); ఉపమ = పోల్చదగిన; నిష్ఠుర = కఠినమైన; గదాదండంబున్ = గదాయుధముతో; ఆభీల = భయంకరమైన; భంగిన్ = విధముగ; ప్రళయకాల = ప్రళయకాలపు; మార్తాండ = సూర్యుని; చండ = తీవ్రమైన; పరివేష = సూర్యునిచుట్టుకట్టెడి గుడిచే; ప్రేరితంబుగ = ప్రేరేపింపబడినట్లుగ; త్రిప్పి = గుండ్రముగతిప్పి; వైచినన్ = విసరగా.
భావము:- ఈ విధంగా కర్ణకఠోరంగా వృత్రాసురుడు పెడబొబ్బ పెట్టగా విని దేవేంద్రుని సైన్యాలు పిడుగుపాటుకు నేల కూలిన ప్రాణిసమూహం వలె ఒడలు తెలియక యుద్ధరంగంలో పడి మూర్ఛిల్లాయి. సాటిలేని సమర వీరుడైన వృత్రుడు చేతిలో శూలాన్ని ధరించి మదపుటేనుగు కమలవనంలోకి ప్రవేశించినట్లు కన్నులు మూసుకొని కదనభూమిలో తిరుగుతూ ఉండగా అతని పాదాల క్రింద పడి దేవతల దేహాలు నలిగిపోసాగాయి. ఈ విధంగా విశృంఖలంగా విహరిస్తున్న ఆ వీరుణ్ణి చూచి ఇంద్రుడు వంద వజ్రాయుధాల శక్తి కలిగిన తన గదాదండాన్ని గ్రహణకాలంలో సూర్యుని చుట్టూ వరదగూడు కట్టినట్లు గిరగిర త్రిప్పి వానిపై విసరివేయగా...

తెభా-6-387-మ.
ది మింటం బెనుమంట లంటఁ బఱపై యాభీల వేగంబునం
దియన్ వచ్చిన లీల వామకర సంక్రాంతంబు గావించి, బె
ట్టిదుఁడై చేరి సురారి దానిఁ గొని కాఠిన్యోరు పాతంబులం
దియన్ మోఁదె గజేంద్ర మస్తకము నుత్సాహైక సాహాయ్యుఁడై.

టీక:- అది = అది; మింటన్ = ఆకశము నందు; పెను = పెద్ద పెద్ద; మంటలు = మంటలు; అంటన్ = అంటుకొగా; పఱపు = మిక్కిలి విస్తారము గలది; ఐ = అయ్యి; ఆభీల = భయంకరమైన; వేగంబునన్ = వడితో; కదియన్ = చేరుటకు; వచ్చిన = రాగా; లీలన్ = క్రీడవలె; వామ = ఎడమ; కర = చేతి; సంక్రాంతంబున్ = ప్రవేశించినదిగ; కావించి = చేసి; బెట్టిదుడు = ఉద్ధతుడు; ఐ = అయ్యి; చేరి = చేరి; సురారి = రాక్షసుడు {సురారి - సుర (దేవతలకి) అరి (శత్రువు), రాక్షసుడు}; దానిన్ = దానిని; కొని = తీసుకొని; కాఠిన్య = కఠినమైన; ఉరు = పెద్ద; పాతంబులన్ = దెబ్బలతో; చదియన్ = చరచి; మోదెన్ = గట్టిగ కొట్టెను; గజేంద్ర = ఐరావతము {గజేంద్రము - గజము (ఏనుగు)లలో ఇంద్రము (శ్రేష్ఠమైనది), ఐరావతము}; మస్తకమునన్ = తలను; ఉత్సాహ = ఉత్సాహము; ఏక = మాత్రమే; సాహాయ్యుడు = సహాయముగ గలవాడు; ఐ = అయ్యి.
భావము:- ఆ ఇంద్రుని గదాదండం ఆకాశమంతా పెనుమంటలను క్రక్కుతూ మహావేగంతో వచ్చి వృత్రాసురుని తాకగా వాడు దానిని ఎడమ చేతితో అవలీలగా పట్టుకొని ఇంద్రుని వాహనమైన ఐరావతం కుంభస్థలం మీద గట్టిగా ఒక్క పెట్టు పెట్టాడు.

తెభా-6-388-ఆ.
గ్గజంబు గులిశతిఁ గూలు కులమహీ
ధ్రంబుఁ బోలె రక్తధార లురల
స్తకంబు పగిలి దమఱి జిరజిరఁ
దిరిగి భీతితోడఁ దెరలి పఱచె.

టీక:- ఆ = ఆ; గజంబున్ = ఏనుగు; కులిశ = వజ్రాయుధము యొక్క; హతిన్ = దెబ్బకు; కూలు = కూలిపోయెడి; కులమహీధ్రంబు = కులపర్వతముల; పోలెన్ = వలె; రక్త = రక్తపు; ధారలు = ధారలు; ఉరల = కారుతుండగ; మస్తకంబు = తలకాయ; పగిలి = పగిలిపోయి; మదము = మదము; ఆఱి = పోయి; జిరజిరన్ = జిరజిర అని; తిరిగి = గుండ్రముగ తిరిగి; భీతి = భయము; తోడన్ = తోటి; తెరలి = కళవెళపడి; పఱచె = పారిపోయెను.
భావము:- ఆ దెబ్బకు ఐరావతం వజ్రాయుధం దెబ్బ తిన్న పర్వతం వలె తల బ్రద్దలై నెత్తురు చిమ్మగా తల్లడిల్లి గిరగిర తిరిగి భయంతో పరుగు తీసింది.

తెభా-6-389-ఉత్సా.
ము దెరలి దాని కొఱలి కంప మొంది పాఱఁగా
న నింద్రుఁ డంకుశమునఁ ట్టి బిట్టు నిల్పుచున్
నిసుధారసైకపాన నిర్ణ యార్ద్ర కరమునన్
త మీఱ నిమిఱె నదియు రీతి మెఱసి క్రమ్మఱన్.

టీక:- గజము = ఏనుగు; తెరలి = కళవళపడి; దాని = ఆ దెబ్బ; కి = కి; ఒఱలి = దెబ్బతిని; కంపము = ఒణుకు; ఒంది = పొంది; పారగా = పారిపోతుండగా; భజనన్ = ఓదార్పుగ; ఇంద్రుడు = ఇంద్రుడు; అంకుశమునన్ = అంకుశమును {అంకుశము - ఏనుగులను నడపుటకైన చిన్నగునపము వంటి సాధనము}; పట్టి = పట్టుకొని; బిట్టు = గట్టిగ; నిల్పుచున్ = నిలబెట్టుచు; నిజ = స్వంత; సుధారస = అమృతమును; ఏక = మఖ్యముగ; పాన = తాగుటకు; నిర్ణయార్థ = నిర్ణయింపబడిన; కరమునన్ = చేతితో; ఋజతన్ = చక్కదనము; మీఱన్ = అతిశయించగ; నిమిఱెన్ = నిమిరెను; అదియున్ = అదికూడ; రీతి = ఒడుపు; మెఱసి = సాధించి; క్రమ్మఱన్ = మరల.
భావము:- ఈ విధంగా దెబ్బతిని బెదరి గుండె చెదరి పారిపోతున్న ఐరావతాన్ని ఇంద్రుడు అంకుశంతో అదుపులోకి తెచ్చి అమృతరసాన్ని ఆస్వాదించే తన చల్లని చేతితో దానిని మెల్లగా నిమిరాడు.

తెభా-6-390-వ.
ఇవ్విధంబున నైరావతంబును సేదదేర్చుచు, నెదురనిలుచున్న భిదురపాణింగని, తోఁబుట్టువుఁ జంపిన తెంపుఁ దలంచి, మోహశోకంబున విపర్యాసంబుగా నవ్వుచు నాహవకామ్యార్థి యై వృత్రుం డిట్లనియె.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ఐరావతంబునున్ = ఐరావతమును; సేదదేర్చుచున్ = ఓదార్చుచు; ఎదురు = ఎదురుగ; నిలుచున్న = నిలబడిన; భిదురపాణిన్ = ఇంద్రుని {భిదురపాణి - భిదురము (వజ్రాయుధము) పాణి (చేతపట్టినవాడు), ఇంద్రుడు}; కని = చూసి; తోబుట్టువున్ = సోదరుని (విశ్వరూపుని); చంపిన = సంహరించిన; తెంపున్ = తెంపరిదనమును; తలంచి = తలచుకొని; మోహ = మోహము; శోకంబునన్ = దుఃఖములతో; విపర్యాసంబుగా = వికృతముగా; నవ్వుచున్ = నవ్వుచు; ఆహవ = యుద్ధమును; కామ్య = కార్యమును; అర్థి = కోరెడివాడు; ఐ = అయ్యి; వృత్రుండు = వృత్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా ఐరావతాన్ని సేద తీరుస్తూ ఎదుట నిలిచిన ఇంద్రుని చూచి వృత్రాసురుడు తన తోబుట్టువైన విశ్వరూపుని చంపినవాడు వీడే కదా అని పట్టరాని దుఃఖంతో, ఆగ్రహావేశాలతో వికటాట్టహాసం చేస్తూ ఇలా అన్నాడు.

తెభా-6-391-శా.
"నాకుం బెద్దయు నీకు సద్గురువు దీవ్రాత రక్షున్ శుభా
లోకుం జంపితి విట్లు పాపమతివై లోభంబుతో నియ్యెడన్
లోకుల్ నవ్వఁగ మద్భుజాపటిమకున్ లోనైతి వీ శూలమం
దాకంపింపఁగ నిన్ను గ్రుచ్చి ఋణముక్తాత్ముండనై పేర్చెదన్.

టీక:- నా = నా; కున్ = కంటెను; పెద్దయున్ = పెద్దవాడు; నీ = నీ; కున్ = కు; సత్ = మంచి; గురువు = గురువు; దీన = దీనుల; వ్రాత = సమూహములను; రక్షున్ = కాపాడువానిని; శుభ = శుభకరమైన; ఆలోకున్ = చూపు గలవానిని; చంపితివి = చంపివేసితివి; ఇట్లు = ఈ విధముగ; పాప = పాపపు; మతిన్ = ఆలోచన గలవాడవు; ఐ = అయ్యి; లోభంబున్ = లోభము; తోన్ = తోటి; ఈ = ఈ; ఎడన్ = సమయమున; లోకుల్ = లోకులు; నవ్వగ = నవ్వగా; మత్ = నా యొక్క; భుజా = బాహు; పటిమ = బలమున; కున్ = కు; లోనైతివి = ప్రభావమున పడిన వాడివి; ఈ = ఈ; శూలము = శూలము; అందు = పైని; ఆకంపింపగ = కంపించిపోగా; నిన్ను = నిన్ను; గ్రుచ్చి = గుచ్చి; ఋణ = (భాత్రు) ఋణమునుండి; ముక్త = విముక్తమైన; ఆత్ముండను = ఆత్మ గలవాడను; ఐ = అయ్యి; పేర్చెదన్ = అతిశయించెదను.
భావము:- “నాకు అన్న, నీకు గురువు, దీనజన రక్షకుడు, అందరికీ మేలు కూర్చే చల్లని చూపులవాడు అయిన విశ్వరూపుని దుర్భుద్ధితో చంపిన పాపాత్ముడవు నీవు. ఈనాడు ఇక్కడ చేవ దక్కి నా భుజబలానికి లొంగి నవ్వులపాలైనావు. ఈ నా శూలాన్ని దడదడ కొట్టుకుంటున్న నీ గుండెల్లో గ్రుచ్చి మా అన్న ఋణం తీర్చుకొంటాను.

తెభా-6-392-క.
ట్టి తులు వయినఁ గానీ
నెట్టన తన బ్రదుకుకొఱకు నీవలె గురువుం
జుట్టమును బుణ్యు బ్రాహ్మణుఁ
ట్టి వధింపంగఁ గలఁడె? శువుం బోలెన్.

టీక:- ఎట్టి = ఎటువంటి; తులువ = తుచ్ఛుడు; అయినగానిన్ = ఐనప్పటికిని; నెట్టన = తెగించి; తన = తను; బ్రతుకు = జీవించుట; కొఱకు = కోసము; నీ = నీ; వలె = వలె; గురువున్ = గురువును; చుట్టమునున్ = బంధువును; పుణ్యున్ = పుణ్యాత్ముని; బ్రాహ్మణున్ = బ్రాహ్మణుని; పట్టి = పట్టుకొని; వధింపంగన్ = సంహరించగ; కలడె = సమర్థుడా ఏమి; పశువున్ = పశువు; పోలెన్ = వలె.
భావము:- ఎటువంటి నీచుడైనా బ్రతుకు కోసం నీవలె కుటిల బుద్ధితో గురువును, అందులోను ఆత్మబంధువును, పుణ్యమూర్తిని, బ్రాహ్మణుని పట్టుకొని పశువును కోసినట్లు గొంతు కోసి చంపుతాడా?

తెభా-6-393-చ.
యును సత్యమున్ విడిచి ర్మముమాని యశంబుఁబాసి శ్రీ
ములఁ బాఱఁదోలి పురుత్వము గానక లోకనిందితా
హ్వయుఁ డగువాని చావునకు నార్యులు గుందుదురే? సృగాలముల్
ప్రిమున నంటునే శవముఁ? బ్రేలక చేరునె? కంకగృధ్రముల్.

టీక:- దయయును = దయ; సత్యమున్ = సత్యము; విడిచి = వదలివేసి; ధర్మమున్ = ధర్మవర్తన; మాని = వదలి; యశంబున్ = ప్రతిష్టని; పాసి = దూరమై; శ్రీ = శోభ; జయములన్ = జయకరములను; పాఱదోలి = గెంటేసి; పురుషత్వమున్ = పౌరుషమును; కానక = చూడక; లోకనిందిత = లోకనిందలకు; ఆహ్వయుండు = పేరుగాంచిన వాడు; అగు = అయిన; వానిన్ = వాని యొక్క; చావున్ = మరణమున; కున్ = కు; ఆర్యులు = పూజ్యులు; కుందుదురే = బాధపడతారా ఏమి; సృగాలముల్ = నక్కలు; ప్రియమునన్ = ఇష్టపడి; అంటునే = ముట్టుకొనునా ఏమి; శవమున్ = పీనుగను; ప్రేలకన్ = వదరకుండగ; చేరునే = దగ్గరకు వచ్చునా ఏమి; కంక = రాబందులు; గృధ్రముల్ = గద్దలు.
భావము:- దయను, సత్యాన్ని విడిచి, ధర్మాన్ని మాని, కీర్తిని పోగొట్టుకొని, సిరి సంపదలను దూరం చేసుకొని, పౌరుషాన్ని వదలి లోకం చీవాట్లు పెట్టే పాడు పని చేశావు. ఇటువంటి నీ చావుకు సజ్జనులైన వారెవరైనా బాధ పడతారా? నీ శవాన్ని నక్కలు కూడా ముట్టుకోవు. కాకులు, గ్రద్దలు సైతం అంటవు.

తెభా-6-394-క.
నిక్కమగు పాపములచేఁ
జిక్కితివి నిశాత శూల శిఖరాగ్రమునన్
క్కించి నీదు మాంసము
క్కలుఁ గుక్కలును జేరి మల నొనర్తున్.

టీక:- నిక్కము = సత్యము; అగు = అయిన; పాపముల్ = పాపముల; చేతన్ = వలన; చిక్కితివి = దొరకిపోయావు; నిశాత = వాడి యైన; శూల = శూలము; అగ్రమునన్ = మొనతో; మక్కించి = చంపి; నీదు = నీ యొక్క; మాంసమున్ = మాంసమును; నక్కలున్ = నక్కలు; కుక్కలునున్ = కుక్కలు; చేరి = కూడి; నమలన్ = తినునట్లు; ఒనర్తున్ = చేసెదను.
భావము:- నిజమైన పాపఫలితంగా నాచేత చిక్కావు. ఈ పదునైన శూలంతో నిన్ను చంపి, నీ మాంసాన్ని నక్కలు, కుక్కలు తినేటట్లు చేస్తాను.

తెభా-6-395-ఉ.
దీకొని నీకు నేఁ డిచట దిక్కని వచ్చినవారు గల్గిరే?
నేమతిం బిశాచముల కెల్లను దృప్తిగ మన్నిశాత శూ
లై మహాగ్ని కీలల ననేకవిధంబుల సోమయాజి నై
మేఁల జేసి వ్రేల్చెద నమేయ మదోద్ధతి వ్రాలి యియ్యనిన్.

టీక:- దీకొని = ఎదిరించి; నీ = నీ; కున్ = కు; నేడు = ఈ దినమున; ఇచటన్ = ఇక్కడ; దిక్కు = రక్షకుడను; అని = అని; వచ్చిన = వచ్చెడి; వారు = వారు; కల్గిరే = ఉన్నారా; ఏన్ = నేను; ఏకమతిన్ = ఏకాగ్రబుద్ధితో; పిశాచముల్ = భూతములలో ఒకరకము; కున్ = కు; ఎల్లనున్ = అన్నిటికి; తృప్తిగన్ = తృప్తి కలుగునట్లు; మత్ = నా యొక్క; నిశాత = వాడియైన; శూల = శూలమునుండి; ఏక = వెలువడిన; మహా = గొప్ప; అగ్ని = నిప్పు; కాలలన్ = మంట లందు; అనేక = అనేకమైన; విధంబులన్ = విధములుగ; సోమయాజిని = యజ్ఞము చేయువానిని; ఐ = అయ్యి; మేకలన్ = యజ్ఞ పశువులనుగా; చేసి = చేసి; వ్రేల్చెదన్ = హోమమున వ్రేల్చెదను; అమేయ = తిరుగులేని; మద = గర్వము యొక్క; ఉద్ధతిన్ = అతిశయముతో; వ్రాలి = ఒరిగి; ఈ = ఈ; అనిన్ = యుద్ధభూమి యందు.
భావము:- నన్నెదిరించి నీకు దిక్కుగా ఉంటానని వచ్చిన వాడెవడైనా ఉన్నాడా? దుర్వారమైన గర్వోద్రేకంతో యుద్ధరంగంలో దూకి నా పదునైన శూలం అంచున భగభగ మండే అగ్నిజ్వాలలలో సోమయాజి మేకలను వేల్చినట్లు నిన్ను వేల్చి పిశాచాల కన్నింటికీ తృప్తిగా విందు చేస్తాను

తెభా-6-396-క.
కా ననుఁ గులిశధారల
దీకొని నిర్జింపఁ గలిగి తేనిఁ బ్రభూతో
ద్రేకంబు చేసి శూరుల
ప్రాట పదపద్మ ధూళి భాగంగగుదున్.


 4-396/1-వ. 
అని మఱియు వాసుదేవ కృపాలబ్ధదుర్నిరీక్ష్యుం డైన వజ్రహస్తునిం గని యిట్లనియె.

- తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి



టీక:- కాక = అలాకాకుండగ; ననున్ = నన్ను; కులిశ = వజ్రము యొక్క; ధారలన్ = పదునులతో; దీకొని = ఎదిర్చి; నిర్జింపన్ = సంహరింప; కలిగితేని = సమర్థుడవైనచో; ప్రభూత = చక్కగా పుట్టిన; ఉద్రేకంబు = ఉద్రేకము; చేసి = వలన; శూరుల = వీరుల; ప్రాకటన్ = ప్రసిద్ధముగ; పద = పాదములు యనెడి; పద్మ = పద్మమముల; ధూళిన్ = ధూళిలోని; భాగంగన్ = భాగముగ; అగుదున్ = అవుతాను.
భావము:- అలా కాకుండా నీవు నన్ను వాడిగల వజ్రాయుధంతో ఓడించ గలిగితే ఈ పంచభూతాలలో కలిసిపోయి రణవీరుల పవిత్ర పాదపద్మ పరాగంలో భాగాన్ని సంపాదించుకొని కృతార్థుణ్ణి అవుతాను.

తెభా-6-397-సీ.
సందేహ మేటికి జంభారి వేవేగ-
భిదురంబు వ్రేయు మాభీల భంగి
తిలోభి నడిగిన ర్థరాశియుఁ బోలె-
డపకు మిది వృథ గాదు సుమ్ము;
మురమర్దనుని తేజమున నా దధీచి వీ-
ర్యాతిశయంబున ధికమయిన
దిగాన హరిచే నియంత్రి తోన్నతుఁడ వై-
గెలువుము శత్రుల గీ టడంచి

తెభా-6-397.1-ఆ.
యెందుఁ గలఁడు విష్ణు డందు జయశ్రీలు
పొందు గాఁగ వచ్చి పొందుచుండు;
గాన భక్తవరదుఁ మలాక్షు సర్వేశు
దములందు మనముఁ దిలపఱతు.

టీక:- సందేహము = అనుమానము; ఏటికిన్ = ఎందులకు; జంభారి = ఇంద్రుడా {జంభారి - జంభాసురుని సంహరించినవాడు, ఇంద్రుడు}; వేవేగ = వెంటనే; భిదురంబున్ = వజ్రాయుధమును; వ్రేయుము = ప్రయోగింపుము; ఆభీల = భయంకరమైన; భంగిన్ = విధముగ; అతి = మిక్కిలి; లోభిన్ = పిసినారిని; అడిగిన = కోరిన; అర్థ = సంపదల; రాశియున్ = సమూహములను; పోలెన్ = వలె; గడపకుము = దాటించివేయకుము; ఇది = ఇది; వృథా = వ్యర్థమైనది; కాదు = కాదు; సుమ్ము = సుమా; మురమర్ధనుని = విష్ణుమూర్తి యొక్క {మురమర్ధనుడు - ముర యనెడి రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు}; తేజమునన్ = తేజస్సుచేతను; ఆ = ఆ; దధీచి = దధీచి యొక్క; వీర్య = సామర్థ్యపు; అతిశయంబునన్ = గొప్పదనముతోను; అధికము = గొప్పది; అయినయది = ఐనది; కాన = కనుక హరి = విష్ణుమూర్తి; చేన్ = చేత; నియంత్రిత = నియమింపబడిన; ఉన్నతుడవు = గొప్పదనము గలవాడవు; ఐ = అయ్యి; గెలువుము = జయింపుము; శత్రుల = శత్రువుల; కీటు = గర్వమును; అడంచి = అణచివేసి;
ఎందున్ = ఎక్కడ; కలడు = ఉన్నాడో; విష్ణుడు = విష్ణుమూర్తి; అందున్ = అక్కడ; జయ = విజయము; శ్రీలు = శుభములు; పొందుగాగ = చక్కగా; వచ్చి = వచ్చి; పొందుచుండున్ = చేరుచుండును; కాన = కావున; భక్తవరదున్ = విష్ణుమూర్తి {భక్తవరదుడు - భక్త (భక్తులకు) వరదుడు (వరములను యిచ్చువాడు), విష్ణువు}; కమలాక్షున్ = విష్ణుమూర్తి {కమలాక్షుడు - కమలముల వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; సర్వేశున్ = విష్ణుమూర్తి {సర్వేశుడు - సర్వులకు ఈశుడు, విష్ణువు}; పదముల్ = పాదముల; అందున్ = ఎడల; మనమున్ = మనసును; పదిల = స్థిరముగ; పఱతున్ = ఉంచెదను.
భావము:- ఇంద్రా! అనుమాన మెందుకు? వెంటనే నీ వజ్రాయుధాన్ని భయంకరంగా ప్రయోగించు. మిక్కిలి పిసినారిని అడిగిన అర్థరాశి వలె నీ వజ్రాయుధం వ్యర్థం కాదు. విష్ణుదేవుని తేజస్సుతోను, దధీచి మహర్షి తపశ్శక్తితోను నీ వజ్రాయుధం శక్తి సంపన్నమై ఉన్నది. అందువల్ల శ్రీహరి ప్రోత్సాహంతో పోటుబంటువై నీ శత్రువునైన నన్ను జయించు. విష్ణువు ఎక్కడ ఉంటాడో విజయలక్ష్మి అక్కడే విరాజిల్లుతుంది. నేను భక్తవరదుడు, కమలలోచనుడు అయిన భగవంతుని పాదపద్మాల యందు నా హృదయాన్ని పదిలపరచుకొంటున్నాను.

తెభా-6-398-వ.
ఇప్పుడు వజ్రధారలం ద్రెంపబడిన విషయ భోగంబులు గలవాఁడ నయి, శరీరంబు విడిచి, భగవద్ధామంబు నొందెద; నారాయణుని దాసుండ నైన నాకు స్వర్గమర్త్యపాతాళంబులం గల సంపద్భోగంబులు నిచ్చగింపంబడవు; త్రైవర్గికాయాస రహితంబైన మహైశ్వర్యంబు ప్రసాదించుం గావున ననుపమేయం బైన భగవత్ప్రసాదం బన్యుల కగోచరం; బద్దేవుని పాదైక మూలంబుగా నుండు దాసులకు దాసానుదాసుండ నగుచున్నవాఁడ"నని యప్పరమేశ్వరు నుద్దేశించి.
టీక:- ఇప్పుడు = ఇప్పుడు; వజ్ర = వజ్రాయుధము యొక్క; ధారలన్ = పదునులచేత; త్రెంపబడిన = త్రుంచబడిన; విషయ = ఇంద్రియార్థములను; భోగంబులు = అనుభవించుటలు; కల = కలిగిన; వాడను = వాడను; అయి = అయ్యి; శరీరంబు = దేహము; విడిచి = వదలి; భగవత్ = భగవంతుని; ధామంబున్ = పథమును; ఒందెదన్ = పొందెదను; నారాయణుని = విష్ణుమూర్తి యొక్క; దాసుండను = సేవకుడను; ఐన = అయిన; నా = నా; కున్ = కు; స్వర్గ = సర్గలోకము; మర్త్య = మానవలోకము; పాతాళంబులన్ = పాతాళలోకములలోను; కల = ఉన్నట్టి; సంపద = సంపదలు; భోగంబులున్ = భోగములను; ఇచ్చగింపబడవు = రుచించవు; త్రైవర్గిక = ధర్మార్థకామముల వలని; ఆయాస = ఆయాసము; రహితంబు = లేనట్టిది; ఐన = అయిన; మహా = గొప్ప; ఐశ్వర్యంబున్ = ఐశ్వర్యమును; ప్రసాదించున్ = దయచేయును; కావునన్ = అందుచేత; అనుపమేయంబు = సాటిలేనిది; ఐన = అయిన; భగవత్ = భగవంతుని; ప్రసాదంబు = ప్రసాదము; అన్యుల్ = ఇతరుల; కున్ = కు; అగోచరంబు = కనిపించనిది; ఆ = ఆ; దేవుని = భగవంతుని; పాద = పాదములు; ఏక = మాత్రమే; మూలంబున్ = ఆధారముగ; ఉండు = ఉండెడి; దాసుల్ = భక్తుల; కున్ = కు; దాస = సేవకుల; అనుదాసుండను = కింది సేవకుడను; అగుచున్నవాడను = అవుతున్నవాడను; అని = అని; ఆ = ఆ; పరమేశ్వరున్ = నారాయణుని; ఉద్దేశించి = గురించి.
భావము:- ఇలా వజ్రాయుధం వ్రేటుకు నా సంసార బంధాలన్నీ తెగిపోయి, పాంచభౌతికమైన ఈ శరీరాన్ని విడిచి సర్వేశ్వరుని సన్నిధికి చేరుకుంటాను. నేను నారాయణ భక్తి పరాయణుడను. నాకు స్వర్గ మర్త్య పాతాళ లోకాలలో కల భోగభాగ్యాలు ఏవీ ఇష్టం కావు. ధర్మార్థకామాల జంజాటాలు ఏమాత్రం లేని మహైశ్వర్యాన్ని ప్రసాదించే భగవంతుని అనుగ్రహం అనుపమాన మైనది. అన్యులకు అగోచరమైనది. నేను ఆ దేవాదిదేవుని పాదాలు సేవించే దాసులకు దాసానుదాసుడను” అని చెప్పి వృత్రాసురుడు పరమేశ్వరుని ఉద్దేశించి...

తెభా-6-399-చ.
"యఁగ భక్తపాలనము లైన భవద్గుణజాల మాత్మ సం
స్మణము చేయ వాక్కు నిను న్నుతి చేయ శరీరమెల్లఁ గిం
పరివృత్తి చేయ మదిఁ గాంక్ష యొనర్చెదఁ గాని యొల్ల నే
రిది ధ్రువోన్నతస్థలము బ్జజు పట్టణ మింద్ర భోగమున్.

టీక:- అరయగన్ = తరచి చూసినచో; భక్త = భక్తులను; పాలనములు = పాలించెడివి; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; గుణ = సుగుణముల; జాలమున్ = సమూహమును; ఆత్మన్ = మనసు; సంస్మరణము = చక్కగా స్మరించుటను; చేయన్ = చేయగా; వాక్కు = మాట; నినున్ = నిన్ను; సన్నుతిన్ = స్తుతించుటను; చేయన్ = చేయగా; శరీరము = దేహము; ఎల్ల = సర్వ; భంగిన్ = విధములగను; కింకర = సేవకుల యొక్క; పరివృత్తిన్ = చక్కగటి పనులను; చేయన్ = చేయగా; మదిన్ = మనసున; కాంక్ష = గట్టికోరుటను; ఒనర్చెదన్ = చేసెదను; కాని = అంతేకాని; ఒల్లన్ = ఒప్పుకొనను; నేన్ = నేను; అరిది = దుర్లభమైన; ధ్రువ = ధ్రువుని వంటి; ఉన్నత = ఉన్నతమైన; స్థలమున్ = పథమును; అబ్జజు = బ్రహ్మదేవుని; పట్టణము = నగరిని; ఇంద్ర = ఇంద్రుని; భోగమున్ = భోగములను.
భావము:- “నా హృదయం భక్తులను పాలించే నీ సద్గుణాలను స్మరించాలని, నా వాక్కు నిన్నే సన్నుతించాలని, నా శరీరం నీకు సేవ చేయాలని కోరుకుంటున్నది. ఇంతకు మించి నేను ధ్రువలోకాన్ని కాని, బ్రహ్మపదాన్ని కాని, ఇంద్రభోగాలను కాని ఇష్టపడను.

తెభా-6-400-ఉ.
ఆఁలి గొన్న క్రేపులు రయంబున నీకలురాని పక్షులున్
దీకొని తల్లికిన్ మఱి విదేశగతుండగు భర్త కంగజ
వ్యాకులచిత్త యైన జవరాలును దత్తఱ మందు భంగి నో!
శ్రీర! పంకజాక్ష! నినుఁ జేరఁగ నామది గోరెడుం గదే.

టీక:- ఆకలి = ఆకలి; కొన్న = వేస్తున్నట్టి; క్రేపులు = దూడలు; రయంబునన్ = శ్రీఘ్రముగను; ఈకలు = రెక్కలు; రాని = రానట్టి; పక్షులున్ = పక్షిపిల్లలు; దీకొని = ఎదురుచూసెడి; తల్లి = తల్లి; కిన్ = కి; మఱి = మఱి; విదేశ = పరాయి దేశములకు; గతుండు = వెళ్ళినవాడు; అగు = అయిన; భర్తన్ = భర్త; కున్ = కోసము; అంగజ = మన్మథుని వలన; వ్యాకుల = వ్యాకులమైన; చిత్త = మనసు గలది; ఐన = అయిన; జవరాలునున్ = స్త్రీ; తత్తఱము = తొందర; అందు = పడెడి; భంగిన్ = వలెనే; ఓ = ఓ; శ్రీకర = హరి {శ్రీకర - శ్రీ (శుభములను) కర (కలిగించెడివాడ), విష్ణువు}; పంకజాక్ష = హరి {పంకజాక్షుడు - పంకజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; నినున్ = నిన్ను; చేరగన్ = చేరవలెనని; నా = నా యొక్క; మదిన్ = మనసులో; కోరెడుంగదే = కోరెదనుగాక.
భావము:- శ్రీపతీ! కమలాక్షా! ఆకలితో ఉన్న లేగదూడలు, ఈకలు రాని పక్షిపిల్లలు తల్లి రాకకోసం ఎదురు చూసేవిధంగా, విరహ వ్యాకుల అయిన జవరాలు పరదేశ మేగిన భర్తకోసం ప్రతీక్షిస్తున్నట్లుగా నీ సమాగమం కోసం నా హృదయం ఉవ్విళ్ళూరుతున్నది కదా!,
వృత్రాసుర వృత్తాంతం భాగవత అంతరార్థానికి ఒక చక్కటి ఉదాహరణ, విశిష్ఠ మైన భక్తి పరాకాష్ఠను వివరించే చక్కటి కథ. వృత్రాసురుడు అరివీర భయంకర ప్రతాపం తో యుద్ధం చేస్తున్నాడు. భగవంతుని అనుగ్రహం సంపాదించిన ఇంద్రుడు అతనిని వజ్రాయుధంతో సంహారం చేయ బోతున్నాడు. అప్పుడు వృత్రాసురుడు భగవంతుని చేసిన ప్రార్థనలో ఒకటి ఈ పద్యం.

తెభా-6-401-క.
నాకును సఖ్యము పుణ్య
శ్లోకులతోఁగాని తత్త్వశూన్యులు సంసా
రై విమోహులతోడం
గాకుండనొనర్పుమయ్య కంజదళాక్షా"

టీక:- నా = నా; కునున్ = కు; సఖ్యము = స్నేహము; పుణ్యశ్లోకులు = ఎవరిని కీర్తించినచో పుణ్యముకలుగునో వారి; తోన్ = తోటి; కాని = తప్పించి; తత్త్వ = తత్త్వజ్ఞానము; శూన్యులు = లేనివారు; సంసార = సంసారము నందు; ఏక = మాత్రమే; విమోహుల్ = మిక్కిలి మోహమున పడినవారి; తోడన్ = తోటి; కాకుండన్ = జరుగకుండగ; ఒనర్పుము = చేయుము; అయ్య = తండ్రి; కంజదళాక్ష = హరి {కంజదళాక్షుడు - కంజ (నీట పుట్టడి పద్మ) దళలముల వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}.
భావము:- పద్మదళనేత్రా! నాకు పుణ్యాత్ములైన మహనీయులతో మాత్రమే తప్ప తత్త్వజ్ఞానం లేనివారితో, సంసార బంధాలలో చిక్కుకున్న వారితో సంబంధం లేకుండే విధంగా అనుగ్రహించు.”

తెభా-6-402-వ.
అని పలుకుచు.
టీక:- అని = అని; పలుకుచున్ = అనుచు.
భావము:- అని చెప్తూ...

తెభా-6-403-మస్ర.
రిపై సర్వాత్ముపై నత్యగణితగుణుపై నంతరంగంబు పర్వన్
రిమేనుప్పొంగఁ జావుంయమును సరిగాసంతసంబందుచుం భీ
రుఁడై కాలాగ్ని పోలెం నులుచుఁ గవిసెన్ ర్వదుర్వారుఁడై దు
ర్భలీలన్ భూమి గంపింపఁగ దిశల ద్రువన్ భండనోద్దండవృత్తిన్.

టీక:- హరి = నారాయణుని; పైన్ = మీద; సర్వాత్మున్ = నారాయణుని; పైన్ = మీద; అత్యగణితగుణు = నారాయణుని; పైన్ = మీద; అంతరంగంబు = మనసు; పర్వన్ = లగ్నము కాగ; సరి = చక్కగ; మేను = దేహము; ఉప్పొంగన్ = ఉప్పొంగుతుండగ; చావున్ = మరణము; జయమునున్ = విజయముల యందును; సరిగా = సరిసమానముగా; సంతసంబు = సంతోషమును; అందుచున్ = పొందుతూ; భీకరుడు = భయంకరుడు; ఐ = అయ్యి; కాలాగ్నిన్ = కాలాగ్నిని; పోలెన్ = వలె; కనలుచున్ = కోపగించుతూ; కవిసెన్ = తాకెను; గర్వ = మదమువలన; దుర్వారుడు = వారింపరానివాడు; ఐ = అయ్యి; దుర్భర = భరింపరాని; లీలన్ = విధముగ; భూమి = భూమి; కంపింప = కంపించిపోగా; దిశల్ = దిక్కులు; అద్రువన్ = చలించిపోగా; భండన = యుద్ధము యొక్క; ఉద్దండ = దిట్టదనము గల; వృత్తిన్ = విధముగ.
భావము:- వృత్రాసురుడు సర్వాంతర్యామి, అనంత గుణుడు అయిన శ్రీహరిపై తన మనస్సును లగ్నం చేసి సంతోషంతో శరీరం పొంగిపోగా రణరంగంలో సంభవించే జయం, చావు సమానమే అని భావించి, గర్వోద్రేకంతో ప్రళయాగ్నిలాగా భగభగ మండిపోతూ భయంకరాకారంతో, భూమి కంపించగా, దిక్కులు దద్దరిల్లగా యుద్ధరంగంలో దుమికాడు.

తెభా-6-404-క.
దొరఁకొని ప్రళయోదకమున
రిపైఁ గైటభుఁడు గవియు హంకారమునన్
సునాథు మీఁద వృత్రా
సురుఁడు మదోద్వృత్తి నడచె శూలాయుధుఁడై.

టీక:- దొరకొని = పూనుకొని; ప్రళయ = ప్రళయకాలపు; ఉదకమున = నీటిలో; హరి = నారాయణుని; పైన్ = మీద; కైటభుడు = కైటభుడు; కవియు = కలియబడెడి; హంకారమునన్ = అహంకారమువలె; సురనాథు = ఇంద్రుని {సుర నాథుడు - సుర (దేవతలకు)నాథుడు, ఇంద్రుడు}; మీదన్ = పైన; వృత్రాసురుడు = వృత్రాసురుడు; మద = గర్వము యొక్క; ఉద్వత్ = పెరిగిన; వృత్తిన్ = విధముగ; నడచె = వెళ్ళెను; శూల = శూలము; ఆయుధుడు = ఆయుధముగా గలవాడు; ఐ = అయ్యి.
భావము:- కల్పాంత కాలంలో సముద్ర జలాలలో కైటభుడనే రాక్షసుడు శ్రీహరిపై దూకిన విధంగా వృత్రాసురుడు రోషావేశాలతో శూలాన్ని ధరించి ఇంద్రునిపైకి కుప్పించి దూకాడు.

తెభా-6-405-శా.
ల్పాంతాగ్నియుబోలె నుల్కలెగయంగాఁ ద్రిప్పుచున్ "దీన నో!
ల్పా! చావు"మటంచు శూలము రయం బారంగఁ బైవైచినం
బోల్పం గోటిరవిప్రకాశత దివిం బోవంగ వీక్షించి యా
వేల్పుల్ పొంగఁగ వజ్రధారఁ దునిమెన్ విన్నాణ మొప్పారఁగన్.

టీక:- కల్పాంత = ప్రళయకాలపు; అగ్నిన్ = అగ్ని; పోలెన్ = వంటి; ఉల్కలు = ఉల్కలు, అగ్నికణములు {ఉల్కలు - ఆకాశముననుండి పడెడి రేఖాకార తేజములు}; ఎగయంగా = ఎగురునట్లుగా; త్రిప్పుచున్ = తిప్పుచు; దీనన్ = దీనితో; ఓ = ఓ; అల్పా = అల్పుడా; చావుము = మరణించుము; అంచున్ = అనుచు; శూలమున్ = శూలమును; రయంబారంగన్ = వేగవంతముగా; పైన్ = మీద; వైచినన్ = వేయగా; పోల్పన్ = పోల్చిచూడగా; కోటి = కోటి (1,00,00,000); రవి = సూర్యుల; ప్రకాశతన్ = వెలుగులతో; దివిన్ = ఆకాశమున; పోవంగ = వెళుతుండగ; వీక్షించి = చూసి; ఆ = ఆ; వేల్పుల్ = దేవతలు; పొంగగన్ = ఉప్పొంగుతుండగ; వజ్ర = వజ్రాయుధము యొక్క; ధారన్ = అంచులతో; తునిమెన్ = తుంచివేసెను; విన్నాణము = నేర్పరితనము; ఒప్పారగన్ = ఒప్పునట్లుగా.
భావము:- వృత్రాసురుడు నిప్పులు చెరుగుతూ ప్రళయాగ్ని జ్వాలలను కక్కుతున్న శూలాన్ని గిరగిర త్రిప్పుతూ “ఓ ఇంద్రా! చావు” అంటూ ఇంద్రుని పైకి విసిరాడు. కోటి సూర్యుల కాంతితో తన పైకి వస్తున్న ఆ శూలాన్ని ఇంద్రుడు వజ్రాయుధంతో నేర్పుగా ఖండించాడు. అది చూచి దేవతలంతా పొంగిపోయారు.

తెభా-6-406-ఆ.
శూల మప్పు డతఁడు స్రుక్కక ఖండించి
పూని తోన కదిసి భుజము ద్రుంచె;
సుర గనలి యేకస్తుఁడై పరిఘంబు
గొని మహేంద్రుఁ గిట్టి నువు లడిచె.

టీక:- శూలమున్ = శూలమును; అప్పుడు = అప్పుడు; అతడు = అతడు; స్రుక్కక = వెనుదీయక; ఖండించి = ముక్కలుచేసి; పూనిన్ = పూనిక; తోన = తోటి; కదిసి = సమీపించి; భుజమున్ = భుజమును; త్రుంచెన్ = ఖండించెను; అసుర = రాక్షసుడు; కనలి = కోపగించి; ఏక = ఒకటే; హస్తుడు = చేయి గలవాడు; ఐ = అయ్యి; పరిఘంబున్ = పరిఘాయుధమును {పరిఘ - ఇనుపకట్ల గుదియ}; కొని = తీసుకొని; మహేంద్రున్ = ఇంద్రుని; కిట్టి = సమీపించి; హనువుల్ = చెక్కిలిపైభాగమును; అడిచె = చరిచెను.
భావము:- ఇంద్రుడు వృత్రాసురుని శూలాన్ని వజ్రాయుధంతో ఖండించి దానితోనే అతని హస్తాన్ని నరికివేశాడు. వృత్రుడు ఆగ్రహోదగ్రుడై ఒంటిచేతితో పెద్ద ఇనుప గుదియను పట్టుకొని ఇంద్రుని పైకి ఉరికి దవడ మీద కొట్టాడు.

తెభా-6-407-వ.
ఇట్లు ప్రళయకాల భీషణ పరివేష పోషంబుగా రోషంబునం బరిఘంబుఁ ద్రిప్పి కుప్పించి గజ కుంభస్థలంబు భగ్నంబు చేసి యింద్రు హనుప్రదేశంబును నిష్ఠురాహతి నొప్పించిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ప్రళయకాల = ప్రళయకాలపు; భీషణ = భయంకరమైన; పరివేష = సూర్యునిచుట్టు కట్టెడి గుడిని; పోషకంబుగా = విస్తరింపజేయునదిగా; రోషంబునన్ = కోపముతో; పరిఘంబున్ = గొలుసుల గుదియను; త్రిప్పి = తిప్పి; కుప్పించి = గెంతి; గజ = ఐరావతము యొక్క; కుంభస్థలంబు = కుంభస్థలమును; భగ్నంబుచేసి = బద్దలుకొట్టి; ఇంద్రు = ఇంద్రుని; హనుప్రదేశంబునున్ = చెక్కిలిపైభాగమును; నిష్ఠుర = గట్టి; ఆహతిన్ = దెబ్బతో; నొప్పించినన్ = కొట్టగా.
భావము:- ఈ విధంగా ప్రళయకాలంలో సూర్యమండలాన్ని చుట్టుకొని ఉన్న పరివేషం వలె ఇనుప గుదియను గిరగిర త్రిప్పుతూ దూకి ఐరావతం కుంభస్థలం మీద గట్టిగా ఒక్క పెట్టు పెట్టి ఇంద్రుని దవడ మీద పెద్దగా కొట్టి నొప్పించగా...

తెభా-6-408-క.
ము మద ముడిగి తిరుగుచు
గుగుజనై గీఁకపెట్టఁ గులిశము నేలన్
న చెడి విడిచె నింద్రుఁడు
జిబిజితో బెగడె నసుర డిమి జగంబుల్.

టీక:- గజము = ఏనుగు; మదము = మదము; ఉడిగి = జారి; తిరుగుచున్ = గుండ్రముగ తిరుగుతూ; గుజగుజన్ = పీడితము; ఐ = అయ్యి; గీకపెట్టన్ = బాధతో కేక పెట్టగ {గీక - ఏనుగు యొక్క అరుపు, ఘీంకారము}; కులిశము = వజ్రాయుధము; నేలన్ = భూమిపైన; భజనచెడి = వశముతప్పి, పట్టుతప్పి; విడిచెన్ = పడవేసెను; ఇంద్రుడు = ఇంద్రుడు; గజిబిజి = కలత; తోన్ = తోటి; బెగడెన్ = అల్లాడెను; అసుర = రాక్షసులు; కడిమి = తప్పించి ఇతరమైన; జగంబుల్ = లోకములు.
భావము:- ఇనుప గుదియ దెబ్బకు ఇంద్రుని ఐరావతం మదమణగి గుండ్రంగా తిరుగుతూ తల్లడిల్లి గీ పెట్టింది. ఇంద్రుడు సొమ్మసిల్లి వజ్రాయుధాన్ని జార విడిచాడు. వృత్రాసురుని పరాక్రమానికి రాక్షసులు తప్ప మిగిలిన జగాలు అల్లాడిపోయాయి.

తెభా-6-409-క.
రుడుఁడు పొదవిన నాగము
ణిన్ వృత్రాసురేంద్రు డిమికి లోనై
తిరుగుడు పడ్డ హరిం గని
పుపుర నాహా! యటంచుఁ బొగిలె జగంబుల్.

టీక:- గరుడుడు = గరుత్మంతుడు; పొదవిన = పొదవిపట్టుకొన్న; నాగము = పాము; కరణిన్ = వలె; వృత్రా = వృత్రుడు యనెడి; అసుర = రాక్షసులలో; ఇంద్రు = శ్రేష్ఠుని; కడిమి = సామర్థ్యమున; కిన్ = కి; లోనై = లొంగిపోయి; తిరుగుడుపడ్డ = తిరగబడిపోయిన; హరిన్ = ఇంద్రుని; కని = చూసి; పురపురన్ = పురపుర అని ఆపేక్షపడి; ఆహా = ఆహా; అటంచున్ = అనుచు; పొగిలెన్ = కుమిలిపోయినవి; జగంబుల్ = లోకములు.
భావము:- గరుత్మంతుడు పట్టుకున్న కాలసర్పం వలె వృత్రాసురుని పరాక్రమానికి లోబడిన ఇంద్రుని చూచి లోకాలన్నీ “అయ్యో” అని కుమిలిపోయాయి.

తెభా-6-410-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = అప్పుడు.
భావము:- ఆ సమయంలో...

తెభా-6-411-ఆ.
జముపాటు చూచి డు దీనగతిఁ జూచి
రికరంబు జాఱి డుటఁ జూచి
యుద్ధధర్మ మెఱిఁగి యున్న శత్రునిఁ జూచి
సిగ్గుతోడ వజ్రి శిరము వాంచె.

టీక:- గజము = ఐరావతము యొక్క; పాటు = పడిపోవుట; చూచి = చూసి; కడు = మిక్కిలి; దీన = దీనమైన; గతిన్ = స్థితిని; చూచి = చూసి; పరికరంబు = ఆయుధము; జాఱిపడుట = జారిపడిపోవుటను; చూచి = చూసి; యుద్ధధర్మమున్ = యుద్ధనీతిని {యుద్ధధర్మము - ఆయుధము జారిన లేదా దీనుడైన శత్రువుపైకి వెళ్శరాదు అనెడిది ఒక యుద్ధనీతి}; ఎఱిగి = తెలిసి; ఉన్న = ఆగినట్టి; శత్రుని = శత్రువును; చూచి = చూసి; సిగ్గు = సిగ్గు; తోడన్ = తోటి; వజ్రి = ఇంద్రుడు {వజ్రి - వజ్రము ఆయుధముగా గలవాడు, ఇంద్రుడు}; శిరము = తల; వాంచె = వంచెను.
భావము:- తన వాహనమైన ఐరావతం భంగపాటును, తన దైన్యస్థిని, చేతిలోని ఆయుధం జారిపోవడం, యుద్ధ ధర్మాన్ని గుర్తించి తనపైకి రాకుండా నిబ్బరంగా నిలుచున్న శత్రువును చూసి ఇంద్రుడు సిగ్గుతో తల వంచుకున్నాడు.

తెభా-6-412-వ.
ఇట్లు యుద్ధంబున శత్రు సన్నిధిం గరంబు జాఱిపడిన వజ్రంబుఁ బుచ్చికొనక నివ్వెఱపడి, లజ్జించి యున్న పాకశాసనుం జూచి వృత్రుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; యుద్ధంబునన్ = యుద్ధము నందు; శత్రు = శత్రువు; సన్నిధిన్ = సమీపములో; కరంబున్ = మిక్కిలి; జాఱిపడిన = జారిపడిపోయిన; వజ్రంబున్ = వజ్రాయుధమును; పుచ్చికొనక = తీసుకొనకుండ; నివ్వెఱబడి = నిశ్చేష్టుడై; లజ్జించి = సిగ్గుపడి; ఉన్న = ఉన్నట్టి; పాకశాసనున్ = ఇంద్రుని; చూచి = చూసి; వృత్రుండు = వృత్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా యుద్ధభూమిలో శత్రువు ముందు చేజారి క్రిందపడిన తన వజ్రాయుధాన్ని తిరిగి అందుకోకుండా నివ్వెరపాటుతో, సిగ్గుతో ఉన్న ఇంద్రుని చూచి వృత్రాసురుడు ఇలా అన్నాడు.

తెభా-6-413-క.
"దుమునఁ గైదువు వదలిన
ణన్నను వైరిజనులఁ జంపరు వీరుల్
వెఱఁగంద నేల? కులిశము
మరుదుగఁ బుచ్చికొనుము కాచితి నింద్రా!

టీక:- దురమునన్ = యుద్ధము నందు; కైదువ = ఆయుధము; వదలిన = పడవేసిన; శరణు = కాపాడు; అన్ననున్ = అనినను; వైరి = శత్రువులైన; జనులను = వారిని; చంపరు = సంహరింపరు; వీరుల్ = వీరులైనవారు; వెఱగు = భయము; అందన్ = పడుట; ఏలన్ = ఎందులకు; కులిశమున్ = వజ్రాయుధమును; కరమున్ = మిక్కిలి; అరుదుగ = అద్భుతముగ; పుచ్చికొనుము = తీసుకొనుము; కాచితిన్ = ఆగితిని; ఇంద్రా = ఇంద్రుడా.
భావము:- “ఇంద్రా! రణరంగంలో ఆయుధం విడిచి ఉన్నప్పుడు, శరణు కోరినప్పుడు వీరులైనవారు శత్రువును వధింపరు. నీకు అభయ మిస్తున్నాను. భయపడకు. నీ ఆయుధాన్ని నీవు తీసుకో.

తెభా-6-414-సీ.
జ్రంబుఁ గైకొని వైరి నిర్జింపు; మి-
ట్లడలంగ వేళ గా మరనాథ!
మర దేహాధీను లైన మూర్తుల కెల్ల-
నీశు లక్ష్మీశు సర్వేశుఁ బాసి
డతేఱ జయములు ల్గునె యెందైనఁ?-
లపోసి చూడుమా; త్త్వబుద్ధి
నీ లోకపాలకు లెవ్వని వశగతి-
లఁ బడ్డ పక్షుల ర్తనమునఁ

తెభా-6-414.1-తే.
జిక్కి చేష్టలు చేయుచుఁ జింతగాంతు
ట్టి మృత్యు బలంబుల నాత్మజయము
మదిగాఁ గోరి యజ్ఞాన తంత్రు లగుచుఁ
మలలోచను లీలా వికారములను.

టీక:- వజ్రంబున్ = వజ్రాయుధమును; కైకొని = చేపట్టి; వైరిన్ = శత్రువును; నిర్జింపుము = సంహరించుము; ఇట్లు = ఈ విధముగ; అడలంగన్ = భీతిచెందుటకు; వేళ = సరియగు సమయము; కాదు = కాదు; అమరనాథ = ఇంద్రుడా {అమరనాథుడు - అమర (దేవతలకు) నాథుడు (ప్రభువు), ఇంద్రుడు}; అమరన్ = అమరిన, సిద్దించిన; దేహ = శరీరములపై; అధీనులు = ఆధారపడెడివారు; ఐన = అయిన; మూర్తుల్ = వ్యక్తుల; కున్ = కి; ఎల్లన్ = అందరకును; ఈశున్ = హరిని {ఈశుడు - ప్రభువు, విష్ణువు}; లక్ష్మీశున్ = హరిని {లక్ష్మీశుడు - లక్ష్మీదేవి యొక్క ఈశుడు (ప్రభువు), విష్ణువు}; సర్వేశున్ = హరిని {సర్వేశుడు - సర్వుల(అందరి)కి ఈశుడు (ప్రభువు), విష్ణువు}; పాసి = దూరమై; కడతేఱన్ = చనిపోయినచో; జయముల్ = విజయములు; కల్గునే = లభించునా ఏమి; ఎందైనన్ = ఎక్కడైనను; తలపోసి = ఆలోచించి; చూడుమా = చూడుము; తత్త్వ = సత్యమైనట్టి; బుద్ధిన్ = బుద్ధితో; ఈ = ఈ; లోక = లోకములను; పాలకుల్ = పరిపాలకులు; ఎవ్వని = ఎవని యొక్క; వశగతి = వశవర్తులై; వలన్ = వలలో; పడ్డ = పడిన; పక్షుల = పక్షుల యొక్క; వర్తనమున = విధముగ; చిక్కి = తగుల్కొని;
చేష్టలు = చేష్టలు; చేయుచున్ = చేయుచు; చింతన్ = బాధలను; కాంతురు = పొందెదరు; అట్టి = అటువంటి; మృత్యు = మృత్యువు యొక్క; బలంబులన్ = శక్తిని; ఆత్మ = తమ యొక్క; జయమున్ = విజయములను; తమదిగాన్ = తమ సమర్థతగా; కోరి = అనుకొని; అజ్ఞాన = అజ్ఞానమునకు; తంత్రులు = లోబడినవారు; అగుచున్ = అగుచు; కమలలోచను = నారాయణుని; లీలా = క్రీడల యొక్క; వికారములను = ప్రభావముల వలన.
భావము:- ఇంద్రా! వజ్రాన్ని అందుకొని శత్రువును ఓడించు. ఈ విధంగా చింతించడానికి ఇది సమయం కాదు. శరీరధారులైన జీవులు సమస్త భువనాధీశ్వరుడైన శ్రీమహావిష్ణువును కాదని స్వతంత్రించి మిట్టిపడితే జయాన్ని పొందలేరు. నీవే ఆలోచించు. సత్యాన్ని గ్రహించు. ఈ లోకపాలకులందరూ ఆ పరాత్పరునికి లోబడి వలలో చిక్కిన పక్షుల వలె వర్తిస్తున్నారు. చెప్పినట్లు చేస్తున్నారు. సుఖ దుఃఖాలను, మృత్యుభయాన్నీ అనుభవిస్తున్నారు. ఇదంతా ఆ శ్రీహరి లీలావిలాసమన్న సంగతి మరిచిపోయి తమకు ప్రాప్తించిన విజయానికి తామే కారణ మనుకొని విఱ్ఱవీగుతూ అజ్ఞానంలో మునిగి తేలుతున్నారు.

తెభా-6-415-తే.
మెఱయ యంత్రమయం బైన మృగము భంగి
దారునిర్మితమైనట్టి రణిపోల్కి
క్ర! యెఱుఁగుమ యీ భూతజాల మెల్ల
ళిత పంకేరుహాక్షు తంత్రంబు గాఁగ.

టీక:- మెఱయ = ప్రకాశముగ; యంత్రమయంబు = యంత్రములతో చేయబడిన; ఐన = అయిన; మృగము = జంతువు; భంగిన్ = వలె; దారు = చెక్కతో; నిర్మితము = తయారైనట్టిది; ఐనట్టి = అయిన; తరణి = పడవ; పోల్కిన్ = వలె; శక్ర = ఇంద్రుడా; ఎఱుగుము = తెలియుము; ఈ = ఈ; భూత = జీవుల; జాలము = సమూహము; ఎల్లన్ = సర్వము; దళితపంకేరుహాక్షున్ = నారాయణుని {దళిత పంకేరుహాక్షుడు - దళిత (వికసించిన) పంకేరుహ (పద్మముల) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; తంత్రంబున్ = తంత్రము; కాగన్ = అయినట్లు.
భావము:- ఇంద్రా! యంత్ర నిర్మితమైన జంతువుల వలె, కొయ్యచెక్కతో చేసిన పడవల వలె ఈ ప్రపంచంలోని ప్రాణులందరూ మహావిష్ణువు మాయాతంత్రం వల్ల కదులుతున్న బొమ్మలని తెలుసుకో.

తెభా-6-416-వ.
మఱియు; భూతంబులచేతను, నింద్రియంబులచేతను, నవశుండైన పురుషుండు ప్రకృతిచేత వేఱుచేయంబడిన యాత్మం బరమేశ్వరానుగ్రహంబు వాసి సుఖియించుచుండు; నవిద్వాంసుండైన వాఁ డనవరతంబుఁ దన్ను స్వతంత్రుంగాఁ దలంచుచుండు; భూతంబుల వలన భూతంబులు పుట్టుచుండును; నా భూతంబులు భూతంబులచేత భక్షింపబడుచుండు; పురుషున కాయువు, శ్రీయును, గీర్తియు, నైశ్వర్యంబును మొదలైనవి యనుభవింప నెంతగాలంబు ప్రాప్తం బంత గాలంబు నివసించు, ప్రాప్తంబు దీఱినఁ బురుషుండు జాలిం బొందిన నవి యుండక పోవుచుండును; కావున గుణంబును నవగుణంబును గీర్త్యప గీర్తులును, జయాపజయంబులును, సుఖదుఃఖంబులును, జావుబ్రతుకులును, సమంబులై కలుగుచుండు; నజ్ఞాని యైన వానికి సత్త్వరజస్తమో గుణంబులు గలిగి యుండు; నట్టివానికి గుణమయంబులైన యింద్రియాదులే యాత్మ యని తోఁచుచుండును; కావున వాఁ డా గుణంబులచేత బద్ధుం డగు; నా గుణంబులకు సాక్షి మాత్రంబగు శరీరంబు వేఱని యెవ్వఁ డెఱుంగనోపు, వాఁ డా గుణంబులచేత బద్ధుండు గాఁడు; కావున గుణంబులును, గుణియు, భోక్తయును, భోగ్యంబును, జయంబును, నపజయంబును, హర్తయును, హాన్యంబును, నుత్పత్తిస్థితిలయకర్తయై, సర్వోత్కృష్టుండైన యప్పరమేశ్వరుండె కాని యన్యంబు లే; దిప్పు డొక్క హస్తంబు నాయుధంబునుం బోయినను భవత్ప్రాణాహరణంబునకు సమర్ధుండ నగుచున్న నన్నుం జూడు"మని వృత్రాసురుండు మఱియు నిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; భూతంబుల్ = భూతముల; చేతనున్ = వలన; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; చేతనున్ = వలన; అవశుండున్ = వశము తప్పిన వాడు; ఐన = అయిన; పురుషుండు = జీవుడు; ప్రకృతి = ప్రకృతి; చేత = వలన; వేఱుచేయంబడిన = వేరు పరుప బడిన; ఆత్మన్ = ఆత్మతో; పరమేశ్వర = నారాయణుని; అనుగ్రహంబున్ = అనుగ్రహమును; వాసి = దూరమై; సుఖియించుచుండున్ = సుఖిస్తూ ఉండును; అవిద్వాంసుండు = అజ్ఞానుడు; ఐనవాడు = అయినవాడు; అనవరతంబున్ = ఎల్లప్పుడు; తన్ను = తనను తాను; స్వతంత్రున్ = స్వతంత్రుడు; కాన్ = అగునట్లు; తలంచుచుండున్ = అనుకొనుచుండును; భూతంబుల్ = జీవుల; వలనన్ = వలన; భూతంబులున్ = జీవులు; పుట్టుచుండున్ = జనించుచుండును; ఆ = ఆ; భూతంబులున్ = జీవులు; భూతంబుల్ = జీవుల; చేత = వలన; భక్షింపబడుచుండున్ = తినివేయబడును; పురుషున్ = జీవుని; కిన్ = కి; ఆయువు = జీవితకాలము; శ్రీయును = శుభములు; కీర్తియున్ = యశస్సు; ఐశ్వర్యంబునున్ = సంపదలు; మొదలైనవి = మొదలగునవి; అనుభవింపన్ = అనుభవించుటకు; ఎంత = ఎంత; కాలంబున్ = కాలము; ప్రాప్తంబు = కూడుకొన్నవో; అంత = అంత; కాలంబున్ = కాలము; నివసించున్ = ఉండును; ప్రాప్తంబున్ = కూడుకొనుట; తీఱినన్ = తీరిపోయినచో; పురుషుండు = జీవుడు; జాలిన్ = దుఃఖమును; పొందినన్ = పొందినచో; అవి = అవి; ఉండకన్ = లేకుండగ; పోవుచుండును = పోవును; కావునన్ = అందుచేత; గుణంబునున్ = సుగుణములు; అవగుణంబునున్ = దుర్గుణములు; కీర్తి = కీర్తి; అపకీర్తులును = అపకీర్తి; జయ = విజయములు; అపజయంబులునున్ = ఓటములు; సుఖ = సుఖములు; దుఃఖంబులును = దుఃఖములు; చావు = మరణములు; బ్రతుకులును = జీవించుటలు; సమంబులు = సరిసమానములు; ఐ = అయ్యి; కలుగుచుండున్ = లభించుచుండును; అజ్ఞాని = అవిద్వాంసుడు; ఐన = అయిన; వాని = వాని; కిన్ = కి; సత్త్వ = సత్త్వగుణము; రజస్ = రజోగుణము; తమోగుణంబులు = తమోగుణములు; కలిగి = ఉండి; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; వాని = వాడి; కిన్ = కి; గుణ = గుణముల; మయంబులు = తోకూడినవి; ఐన = అయిన; ఇంద్రియ = ఇంద్రియములు {ఇంద్రియాదులు - ఇంద్రియములు మనసు దేహము}; ఆదులే = మొదలగునవే; ఆత్మ = తాను; అని = అని; తోచుచుండును = అనిపించుతుండును; కావునన్ = అందుచేత; వాడు = వాడు; ఆ = ఆ; గుణంబుల్ = గుణముల; చేతన్ = వలన; బద్ధుండు = బంధింపబడినవాడు; అగున్ = అగును; ఆ = ఆ; గుణంబుల్ = గుణముల; కున్ = కు; సాక్షి = సాక్షి; మాత్రంబున్ = మాత్రమే; అగు = అయిన; శరీరంబు = దేహము; వేఱు = ఇతరమైనది; అని = అని; ఎవ్వండు = ఎవడైతే; ఎఱుగన్ = తెలియ; ఓపున్ = సమర్థుడో; వాడు = వాడు; ఆ = ఆ; గుణంబుల్ = గుణముల; చేతన్ = వలన; బద్దుండు = బంధింపబడినవాడు; కాడు = కాడు; కావునన్ = అందుచేత; గుణంబులునున్ = గుణములు; గుణియున్ = గుణములు గల వాడును; భోక్తయును = అనుభవించువాడు; భోగ్యంబును = అనుభవింపబడువాడు; జయంబును = విజయములు; అపజయంబును = అపజయములు; హర్తయును = సంహరించువాడు; హన్యంబునున్ = సంహరింపబడువాడు; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయములకు; కర్త = కారణము యైన వాడు; ఐ = అయ్యి; సర్వ = సమస్తమున కంటెను; ఉత్కృష్టుండు = శ్రేష్ఠమైనవాడు; ఐన = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుండె = నారాయణుడే; కాని = తప్పించి; అన్యంబున్ = ఇతరమైనది; లేదు = లేదు; ఇప్పుడు = ఇప్పుడు; ఒక్క = ఒక; హస్తంబున్ = చేయి; ఆయుధంబునున్ = ఆయుధము; పోయిననున్ = పోయినప్పటికిని; భవత్ = నీ యొక్క; ప్రాణ = ప్రాణములను; హరణంబున్ = తీయుట; కున్ = కు; సమర్థుండను = శక్తి గలవాడను; అగుచున్న = అయివున్నట్టి; నన్నున్ = నన్ను; చూడుము = చూడుము; అని = అని; వృత్రాసురుండు = వృత్రాసురుడు; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇంకా పంచభూతాలకు, పంచేంద్రియాలకు లోబడిన జీవుడు తనను తాను ప్రత్యేకంగా భావిస్తున్నాడు. త్రిగుణాత్మకమైన ప్రకృతి చేత వేరు చేయబడి అస్వతంత్రుడైన జీవుడు స్వతంత్రుడనని భావించి భగవంతుని అనుగ్రహానికి దూరమౌతున్నాడు. ఆ అజ్ఞానావస్థలోనే సుఖాన్ని అనుభవిస్తున్నాడు. లోకంలో జీవుల నుండి జీవులు జన్మిస్తున్నవి. ఆ జీవులే జీవులను భక్షిస్తున్నవి. పురుషుడు ఆయుర్దాయం, సంపద, యశస్సు, ఐశ్వర్యం మొదలైన వాటిని ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే అనుభవిస్తాడు. ప్రాప్తం తీరిపోగానే పురుషునితో పాటు అవి కూడా అంతరిస్తాయి. జనన మరణాలకు నడుమ ఉన్నదే జీవితం. అది ఉన్నంతవరకే సంపదలు, సౌఖ్యాలు. అది తీరిపోయాక సుఖాలు, ఐశ్వర్యాలు అన్నీ అదృశ్యమై పోతాయి. సుగుణాలు, దుర్గుణాలు, కీర్తులు, అపకీర్తులు, జయాపజయాలు, సుఖదుఃఖాలు, చావు బ్రతుకులు సమానంగానే సంభవిస్తుంటాయి. సత్త్వరజస్తమో గుణాలకు లోబడిన అజ్ఞాని అయిన పురుషుడు ఆ గుణాలతో కూడిన ఇంద్రియాలు, దేహం తానని భావించి బంధాలలో చిక్కుకుంటాడు. ఆ గుణాలకు సాక్షి మాత్రమేయైన ఆత్మయే తానని, దేహేంద్రియాదులు వేరని గ్రహించిన బుద్ధిమంతుడు ఆ గుణాలలో బద్ధుడు కాడు. అందువల్ల గుణాలు, గుణాలు కలవాడు, భోగ్య వస్తువు, జయం, అపజయం, చంపేవాడు, చంపబడేవాడు అన్నీ ఆ భగవంతుని స్వరూపాలే కాని వేరు కాదు. సృష్టి స్థితి లయాలకు హేతువైనవాడు, సర్వోత్కృష్టుడు అయిన ఆ పరాత్పరుని కంటె అన్యమైనది ఈ విశ్వంలో ఏదీ లేదు. నా ఆయుధం విరిగి పోయింది. నా చెయ్యి తెగిపోయింది. అయినా నీతో యుద్ధం చేయటానికి, నీ ప్రాణాలు తీయటానికి సంసిద్ధంగా ఉన్న నన్ను చూడు” అని వృత్రాసురుడు ఇంకా ఇలా అన్నాడు.

తెభా-6-417-తే.
"వాహనంబులు సారెలు వాఁడిశరము
లూర్జి తాక్షము లసువులె యొడ్డణములు
గాఁగఁ బోరెఁడు నీ ద్యూతర్మమందు
నెసఁగ జయమును నపజయ మెవ్వఁ డెఱుఁగు? "

టీక:- వాహనంబులున్ = వాహనములు; సారెలు = పాచికలు; వాడి = పదునైన; శరములు = బాణములు; ఊర్జిత = దృఢమైన; అక్షములు = వ్యవహారములు; అసువులె = ప్రాణములే; ఒడ్డణములు = ఒడ్డెడి పందెములు; కాగన్ = అగునట్లు; పోరెడు = యుద్ధముచేసెడి; ఈ = ఈ; ద్యూతకర్మము = జూదము; అందున్ = లో; ఎసగన్ = అతిశయించి; జయమునున్ = విజయము; అపజయమున్ = అపజయములు; ఎవ్వడు = ఎవడు మాత్రము; ఎఱుగు = తెలియగలడు.
భావము:- “వాహనాలే ఆటబల్లలు, వాడి బాణాలే పాచికలు, ప్రాణాలే పందాలు అయిన ఈ యుద్ధమనే జూదంలో జయాపజయాలు ఎవరివో ఎవరికి తెలుసు?”

తెభా-6-418-చ.
వుడు వృత్రుమాటలకు ద్భుత మంది సురేంద్రుఁ డెంతయుం
మదిఁ గుత్సితం బుడిగి దైవముగా నతనిన్ భజించి కై
కొనియెఁ గరంబునన్ దిగువఁ గూలిన వజ్రము, నప్పు డాత్మలోఁ
రె జగంబు లన్నియు ముదంబునఁ బొందిరి ఖేచరావళుల్.

టీక:- అనవుడు = అనగా; వృత్రు = వృత్రుని; మాటల్ = పలుకుల; కున్ = కు; అద్భుతము = ఆశ్చర్యమును; అంది = పొంది; సురేంద్రుడు = దేవేంద్రుడు; ఎంతయున్ = ఎంతగానో; తన = తన యొక్క; మదిన్ = మనసునందు; కుత్సితంబు = కుటిలత్వమును; ఉడిగి = వదలి; దైవముగా = దేమునిగా; అతనిన్ = అతనిని; భజించి = పూజించి; కైకొనియెన్ = తీసుకొనెను; కరంబునన్ = చేతిలోనికి; దిగువన్ = కింద; కూలిన = పడిపోయిన; వజ్రమున్ = వజ్రాయుధమును; అప్పుడు = అప్పుడు; ఆత్మ = మనసు; లోన్ = అందు; తనరెన్ = అతిశయించినవి; జగంబులు = లోకములు; అన్నియున్ = సర్వము; ముదంబునన్ = సంతోషమును; పొందిరి = పొందిరి; ఖేచర = దేవతల {ఖేచరులు - ఖః (ఆకాశమున) చరులు (సంచరించెడివారు), దేవతలు}; ఆవళుల్ = సమూహములు.
భావము:- ఆ వృత్రాసురుని మాటలకు ఇంద్రుడు మిక్కిలి ఆశ్చర్య చకితుడైనాడు. అతని మనస్సులోని మాత్సర్యం మాయమయింది. అతనికి వృత్రాసురుడు భగవంతుడుగా కనిపించాడు. ఇంద్రుడు వంగి నేలపై పడి ఉన్న వజ్రాయుధాన్ని మళ్ళీ అందుకున్నాడు. అది చూచి లోకాలన్నీ ఆనందించాయి. దేవతలు సంతోషించారు.

తెభా-6-419-క.
రాహుగ్రహ వక్త్ర గుహా
గేహాంతము వాసి వచ్చి కిరణావళి స
ద్భాహుళ్య మొప్ప వెలిఁగెడు
నా రిదశ్వుండుఁ బోలె రి యొప్పె నృపా!

టీక:- రాహు = రాహువు యనెడి; గ్రహ = గ్రహము యొక్క; వక్త్రగుహా = నోటి యందలి; గేహాంతమున్ = నివాసమును; వాసి = వదలి; వచ్చి = బయటకువచ్చి; కిరణ = కిరణముల; ఆవళిన్ = సమూహములు; సత్ = చక్కటి; బాహుళ్యమున్ = విస్తారముతో; ఒప్పన్ = ఒప్పుతుండగా; వెలిగెడున్ = ప్రకాశించెడు; ఆ = ఆ; హరిదశ్వుండున్ = సూర్యుని {హరిదశ్వుడు - హరిత (పచ్చని) అశ్వుడు (అశ్వములు గలవాడు), సూర్యుడు}; పోలెన్ = వలె; హరి = ఇంద్రుడు; ఒప్పెన్ = చక్కగా నుండెను; నృపా = రాజా {నృప - నృ (నరులను) ప (పరిపాలించువాడు), రాజు}.
భావము:- రాజా! వజ్రాయుధం ధరించిన ఇంద్రుడు గ్రహణానంతరం రాహుగ్రహం ముఖం నుండి వెలువడి వేయి కిరణాలతో ప్రకాశించే సూర్యబింబం వలె విరాజిల్లాడు.

తెభా-6-420-వ.
ఇట్లు కరకలిత వజ్రాయుధ రుఙ్మండల మండిత దిఙ్మండలుం డైన జంభారి గంభీర వాక్యంబుల విస్మయ మందస్మిత ముఖారవిందుం డయి వృత్రున కిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కర = చేతిలో; కలిత = కలిగిన; వజ్రాయుధ = వజ్రాయుధము యొక్క; రుక్ = ప్రకాశపు; మండల = వలయములచే; మండిత = అలంకరింపబడిన; దిఙ్మండలుండు = పరిసరములు గలవాడు; ఐన = అయిన; జంభారి = ఇంద్రుడు {జంభారి - జంభాసురుని అరి (శత్రువు), ఇంద్రుడు}; గంభీర = గంభీరమైన; వాక్యంబులన్ = పలుకులతో; విస్మయ = ఆశ్చర్యకరమైన; మందస్మిత = చిరునవ్వుతో కూడిన; ముఖ = ముఖము యనెడి; అరవిందుండు = పద్మము గలవాడు; అయి = అయ్యి; వృత్రున్ = వృత్రున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా తన చేతిలోని వజ్రాయుధ కాంతులు దిక్కుల నిండా వెలుగులు వెదజల్లుతూ ఉండగా ఇంద్రుడు ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు చిందే ముఖంతో వృత్రాసురుని చూచి గంభీరంగా ఇలా అన్నాడు.

తెభా-6-421-క.
"ఓ! దానవేంద్ర! నీ మతి
వేదాంతముఁ బోలెఁ దత్త్వ విజ్ఞాన కళా
మోము నీ వతిభక్తుఁడ
వాదిమ పురుషునకు హరికి బ్జాక్షునకున్.

టీక:- ఓ = ఓ; దానవ = రాక్షసులలో; ఇంద్ర = శ్రేష్ఠమైనవాడ; నీ = నీ యొక్క; మతి = బుద్ధి; వేదాంతమున్ = ఉపనిషత్తుల; పోలెన్ = వలె; తత్త్వ = తత్త్వము యొక్క; విజ్ఞాన = శాస్త్రపు; కళ = నేర్పుచే; ఆమోదము = పరిమళభరితము; నీవున్ = నీవు; అతి = మిక్కిలి; భక్తుడవు = భక్తి గల వాడవు; ఆదిమపురుషున్ = నారాయణుని {ఆదిమ పురుషుడు - సృష్ట్యాదినుండి గల పురుషుడు, విష్ణువు}; కున్ = కి; హరి = నారాయణుని; కిన్ = కి; అబ్జాక్షున్ = నారాయణుని {అబ్జాక్షుడు - అబ్జము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; కున్ = కి.
భావము:- “ఓ రాక్షసరాజా! నీ బుద్ధి ఉపనిషత్తుల వలె తత్త్వ విజ్ఞానంతో విరాజిల్లుతున్నది. పురాణపురుషుడు, పద్మాక్షుడు అయిన వాసుదేవునికి నీవు పరమ భక్తుడవు.

తెభా-6-422-ఉ.
లోములెల్ల నిండి తన లోనుగ సర్వముఁజేసి ప్రాణులన్
దీకులఁ బెట్టి యెల్లడలఁ దీప్తులు చూపెడి విష్ణుమాయ నేఁ
డేమతిన్ దలంచి తిది యేల? మహాసురురూపు మాని సు
శ్లోకుఁ బురాణపూరుషుని శోభనమూర్తి ధరింపు మింపునన్.

టీక:- లోకముల్ = భువనములు; ఎల్లన్ = సమస్తమును; నిండి = నిండి; తన = తన; లోనుగన్ = లోబడియే, లోపలనే; సర్వమున్ = సమస్తమును; చేసి = సృష్టించి; ప్రాణులన్ = జీవులను; తీకులన్ = తీపులను, బంధనములలో; పెట్టి = బంధించి; ఎల్లన్ = అన్ని; ఎడలన్ = సమయ సందర్భములలోను; దీప్తులు = ప్రకాశములు; చూపెడి = ప్రదర్శించెడి; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; మాయన్ = మాయను; నేడు = ఈనాడు; ఏక = ఏకాగ్ర; మతిన్ = బుద్ధితో; తలంచితి = స్మరించితివి; ఇది = ఇది; ఏల = ఎందులకు; మహా = పెద్ద; అసుర = రాక్షసుల; రూపు = స్వరూపము; మాని = వదలివేసి; సుశ్లోకున్ = నారాయణుని {సుశ్లోకుడు - సు (మంచివారిచే) శ్లోకుడు (కీర్తింపబడువాడు), విష్ణువు}; పురాణపూరుషుని = నారాయణుని {పురాణపూరుషుడు - పుర్వకాలము నుండి ఉన్న పూరుషుడు (కారణభూతుడు), విష్ణువు}; శోభన = శుభకరమైన; మూర్తిన్ = స్వరూపమును; ధరింపుము = స్వీకరింపుము; ఇంపునన్ = చక్కగా.
భావము:- సమస్త లోకాలలో నిండి, సకల భువనాలను తనలో ఇముడ్చుకొని, ప్రాణులను చిక్కులు పెట్టి, అంతటా వింతలు చూపించే విష్ణుమాయను నీవు ఏకాగ్రబుద్ధితో తెలుసుకోగలిగావు. ఇంకా ఈ భీకరమైన రాక్షసాకారం నీకెందుకు? దీనిని పరిత్యజించి పరమ పవిత్రమైన పురాణ పురుషుని స్వరూపాన్ని స్వీకరించు.

తెభా-6-423-ఉ.
నియమంబు సల్పితివొ? యెట్టి మహాతప మాచరించితో
పూని రజోగుణాభిరతిఁ బొందిన నీ మతి శాంతి దాంతి స
మ్మాస మానసానుభవ త్తమరాళుఁ డరోష భావ స
మ్మానుఁ డమేయుఁ డా దనుజర్దను భక్తి పొసంగె నెంతయున్.

టీక:- ఏ = ఏ విధమైన; నియమంబున్ = నియమములను; సల్పితివొ = ఆచరించితివొ; ఎట్టి = ఏ విధమైన; మహా = గొప్ప; తపంబున్ = తపస్సును; ఆచరించితివొ = చేసితివో; పూని = పూనికతో; రజోగుణ = రజోగుణమునందు; అభిరతిన్ = ఆసక్తిని; పొందినన్ = పొందినట్టి; నీ = నీ యొక్క; మతి = బుద్ధి; శాంతి = శాంతి; దాంతి = ఓర్పులు కలిగిన; సమ్మానస = మంచి మనసులు యనెడి; మానస = మానససరోవరము యొక్క; అనుభవ = అనుభవముచే; మత్త = మత్తెక్కిన; మరాళుడు = హంస యైనవాడు; అరోష = కోపములేని; భావ = స్వభావము గలవారిని; సమ్మానుడు = సమాదరించెడివాడు; అమేయుడు = నారాయణుడు {అమేయుడు – మితి యిడ రానివాడు, విష్ణువు}; ఆ = ఆ; దనుజమర్దను = నారాయణుని {దనుజమర్దనుడు - దనుజ (రాక్షసులను) మర్దనుడు (సంహరించెడివాడు), విష్ణువు}; భక్తి = భక్తి; పొసంగెన్ = కుదిరెను; ఎంతయున్ = ఎంతో ఎక్కువగా.
భావము:- ఏ నియమాలను పాటించావో? ఎటువంటి మహా తపస్సు చేశావో? రజోగుణంలో అనురక్తమైన నీ మనస్సు శమదమాది సద్గుణాలు కలిగిన మహాత్ముల మనస్సనే మానస సరస్సులో మైమరచి విహరించే రాజహంస అయినవాడు, రోష ద్వేషాలకు అతీతమైన భావాలంటే ఇష్టపడేవాడు, అనంతుడు, భగవంతుడు అయిన జగన్నాథుని భక్తి పట్ల ఆసక్త మయింది.

తెభా-6-424-క.
నారాయణ రూ పామృత
పారావారమునఁ దేలు క్తుఁడు దా భూ
దాకరఖాత కోదక
పూరంబులు నేల తృప్తిఁ బొందు మహాత్మా!"

టీక:- నారాయణ = విష్ణుమూర్తి యొక్క; రూప = రూపము యనెడి; అమృత = అమృతపు; పారావారమునన్ = సముద్రము నందు {పారావారము - పార (దాటుటకు) అవారము (రానిది), సముద్రము}; తేలు = ఈదెడి; భక్తుడు = భక్తుడు; తాన్ = తను; భూ = రాజ్యము; దార = భార్య యనెడి; కర = ముట్టెతో, తుండముతో; ఖాతక = తవ్విన; ఉదక = జల; పూరంబులున్ = ఊటలతో; ఏలన్ = ఏ విధముగ; తృప్తిన్ = సంతృప్తిని; పొందున్ = పొందగలడు; మహాత్మా = గొప్పవాడా.
భావము:- మహాత్మా! శ్రీమన్నారాయణుని ప్రేమ స్వరూపమనే అమృత మహాసాగరంలో ఓలలాడే భక్తుడు పంది ముట్టెలతో త్రవ్వబడ్డ పాటిగుంటలలోని మురికినీటితో ఎలా తృప్తి పడతాడు?

తెభా-6-425-వ.
ఇట్లు పలుకుచున్న యింద్రు నుపలక్షించి, వృత్రాసురుం డా యోధన దుర్మర్షణ సంఘర్ష మానసుండై వైరిం బురికొల్పు కొని, వామహస్తంబునం బరిఘంబుఁ ద్రిప్పుచు నుప్పరంబునం గుప్పించుచు, బ్రహ్మాండ కర్పరంబు నిష్ఠుర భైరవారావంబునం బగిలించుచు, సముత్తుంగ మత్తమాతంగ పుంగవంబు వృషభంబుపైఁ గవియు భంగి సుర వృషభు పేరురంబుపలక్షించి, భీషణాశని నిపాత వేగంబునం గొట్టిన నింద్రుండు కులిశ ధార నప్పరిఘంబుఁ దునిమితోడన శేష ఫణా విశేష భాసురం బయిన బాహుదండంబు ఖండించె; నప్పుడు వృత్రుండు భిన్న బాహు ద్వయ మూలుండై రక్తధారలం దోఁగుచు వజ్రిచేతఁ బక్షహతం బై దివంబుననుండి జాఱుచున్న కులపర్వతంబునుం బోలెఁ జూపట్టి ప్రళయకాల సంహార నిటలచ్చటచ్ఫటార్భట కఠోర కీలా భీలాగ్ని సమాన క్రూర కుటిల నిరీక్ష దుర్నిరీక్షుండయి, భూనభో మండలంబులఁ గ్రింది మీఁది దౌడల హత్తించి, నభోమండలంబునుం బోలెఁ దుది మొద లెఱుంగ రాక, వికృతంబుగా వక్త్రంబు దెఱచి, మందర మథన మధ్యమాన విషధర విషమజిహ్వాభీలం బగు నాలుక నభంబు నాకుచుఁ గాలసంహారకారణుం డయిన కాలుని భుజదండ మండితంబగు దండంబునుం బోలిన దంష్ట్రలచేత జగత్త్రయంబును మ్రింగెడువాఁడునుం బోలె నతిమాత్ర మహాకాయుం డయి, పర్వతంబులం దలంగ మీటుచు నడగొండయుం బోలె నభోభాగ భూభాగంబుల నాక్రమించి; యప్పుడు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; పలుకుచున్న = అనుచున్న; ఇంద్రున్ = ఇంద్రుని; ఉపలక్షించి = ఉద్దేశించి; వృత్రాసురుండు = వృత్రాసురుడు; ఆ = ఆ; యోధన = యుద్ధము యెడల; దుర్మర్షణ = వ్యసనము వలని; సంఘర్ష = తొందరపాటుతో కూడిన; మానసుండు = మనసు గలవాడు; ఐ = అయ్యి; వైరిన్ = శత్రువును; పురికొల్పుకొని = రెచ్చగొట్టుకొని; వామ = ఎడమ; హస్తంబునన్ = చేతితో; పరిఘంబున్ = పరిఘాయుధమును; త్రిప్పుచున్ = తిప్పుతూ; ఉప్పరంబునన్ = ఆకాశమునకు; కుప్పించుచున్ = గెంతుతూ; బ్రహ్మాండ = బ్రహ్మాండము యొక్క; కర్పరంబున్ = కప్పును; నిష్ఠుర = కఠినమైన; భైరవ = భైరవుని వంటి; ఆరావంబునన్ = అరుపులతో; పగిలించుచున్ = బద్దలుకొడుతూ; సమ = మిక్కిలి; ఉత్తుంగ = ఉన్నతమైన; మత్త = మదించిన; మాతంగ = ఏనుగు; పుంగవంబు = శ్రేష్ఠము; వృషభంబున్ = ఎద్దు; పైన్ = మీదికి; కవియు = కలియబడుట; భంగిన్ = వలె; సురవృషభున్ = ఇంద్రుని {సురవృషభుడు - సుర (దేవతలలో) వృషభుడు (శక్తి గలవాడు), ఇంద్రుడు}; పేరు = విశాలమైన; ఉరంబున్ = వక్షమును; ఉపలక్షించి = గురిచూసి; భీషణ = భయంకరమైన; అశనిపాత = పిడుగుపాటు; వేగంబునన్ = వేగముతో; కొట్టిన = కొట్టగా; ఇంద్రుండు = ఇంద్రుడు; కులిశ = వజ్రాయుధపు; ధారన్ = అంచులతో; ఆ = ఆ; పరిఘంబున్ = పరిఘను; తునిమి = తుంచేసి; తోడన = వెంటనే; శేష = మిగిలిన, ఆదిశేషుని; ఫణా = పడగవలె; విశేష = విశిష్టముగ; భాసురంబు = ప్రకాశించుతున్నది; అయిన = ఐనట్టి; బాహుదండంబున్ = భుజస్తంభమును; ఖండించెన్ = నరికివేసెను; అప్పుడు = అప్పుడు; వృత్రుండు = వృత్రుండు; భిన్న = విరిగిపోయిన; బాహు = భుజముల; ద్వయ = జంట యొక్క; మూలుండు = మొదళ్ళు గలవాడు; ఐ = అయ్యి; రక్త = రక్తపు; ధారలన్ = ధారలందు; తోగుచున్ = తడిసిపోతూ; వజ్రి = ఇంద్రుని; చేతన్ = వలన; పక్ష = రెక్కలు; హతంబు = విరగొట్టబడినది; ఐ = అయ్యి; దివంబున్ = ఆకాశమున; నుండి = నుండి; జాఱుచున్న = జారిపడుతున్న; కులపర్వతంబునున్ = కులపర్వతము; పోలెన్ = వలె; చూపట్టి = కనబడి; ప్రళయకాల = ప్రళయకాల మందలి; సంహార = సంహారముచేయునట్టి; నిటల = నుదిటి; ఛటచ్ఛటత్ = ఛటఛటమని; ఆర్భాట = మోతలతో; కఠోర = భరింపరాని; కీల = మంటలు గల; ఆభీల = భయంకరమైన; అగ్ని = అగ్నితో; సమాన = సరిసమానమైన; క్రూర = క్రూరమైన; కుటిల = వంకర; నిరీక్ష = చూపులతో; దుర్నిరీక్షుండు = చూడరానివాడు; అయి = అయ్యి; భూ = భూమి; నభస్ = ఆకాశముల; మండలంబులన్ = మండలములను; క్రింది = కింది; మీది = పై; దౌడలన్ = దౌడలచే; హత్తించి = నొక్కిపట్టి; నభస్ = ఆకాశ; మండలంబునున్ = మండలము; పోలెన్ = వలె; తుది = అంతము; మొదలు = ఆది; ఎఱుంగరాక = తెలియరాని; వికృతంబుగా = వికృతముగా; వక్త్రంబున్ = నోటిని; తెఱచి = తెరిచి; మందరమథన = మందరగిరి యనెడి కవ్వము; మధ్యమాన = నడమన ఉన్నట్టి; విషధర = సర్పము (ఆదిశేషుని); విషమ = విషపు; జిహ్వ = నాలుకవలె; ఆభీలంబు = భయంకరము; అగు = అయిన; నాలుకన్ = నాలుకతో; నభంబున్ = ఆకాశమును; నాకుచున్ = నాకుతూ; కాల = కాలానుసారము; సంహార = మరణమునకు; కారణుండు = కారణము యైనవాడు; అయిన = అయిన; కాలుని = యమధర్మరాజు యొక్క; భుజదండ = చేతులలో; మండితంబు = అలంకరింపబడినది; అగు = అయిన; దండంబునున్ = దండమును; పోలిన = సరిపోలెడి; దంష్ట్రల్ = కోరలు; చేతన్ = తోటి; జగత్రయంబున్ = ముల్లోకములను {జగత్రయము - ముల్లోకములు, 1స్వర్గలోకము 2మర్త్యలోకము 3పాతాళలోకము}; మ్రింగెడు = మింగేసే; వాడునున్ = వాని; పోలెన్ = వలె; అతిమాత్ర = పెద్దదైనట్టి; మహా = గొప్ప; కాయుండు = దేహము గలవాడు; అయి = అయ్యి; పర్వతంబులన్ = పర్వతములను; తలంగ = తొలగ; మీటుచున్ = తోయుచు; నడ = నడుస్తున్న; కొండయున్ = కొండ; పోలెన్ = వలె; నభోభాగ = ఆకాశప్రదేశము; భూభాగంబులన్ = నేల ప్రదేశములను; ఆక్రమించి = వ్యాపించి; అప్పుడు = అప్పుడు.
భావము:- ఈ విధంగా పలుకుతున్న ఇంద్రుణ్ణి వృత్రాసురుడు యుద్ధానికి పురిగొల్పాడు. ఉత్సాహం ఉరకలు వేసే మనస్సుతో ఎడమ చేతిలోని పరిఘను గిరగిర త్రిప్పుతూ కుప్పించి ముందుకు దుమికాడు. బ్రహ్మాండ భాండం బ్రద్దలయ్యే విధంగా భయంకరంగా గర్జిస్తూ మదపుటేనుగు ఆబోతుపైకి దూకినట్లు ఇంద్రుని మీదికి లంఘించి తన ఇనుప గుదియతో అతని ఎదురు రొమ్మును గురిచూచి కొట్టాడు. పిడుగు పడినట్లు తన గుండెలపై పడుతున్న ఆ పరిఘాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధంతో రెండుగా ఖండించాడు. వెనువెంటనే పడగ నెత్తిన ఆదిశేషుని వలె ఉన్న మిగిలి ఉన్న అతని బాహుదండాన్ని నరికివేశాడు. రెండు చేతులు మొదలంటా తెగిపోయి రక్తధారలు స్రవిస్తున్న వృత్రాసురుడు, రెక్కలు నరుకగా ఆకాశం నుండి భూమిపైకి జారుతున్న కులపర్వతం వలె కనిపించాడు. ఆ రాక్షసరాజు ఆగ్రహంతో కనుబొమలు చిట్లించాడు. ప్రళయకాల మందలి భయంకర జ్వాలల వంటి క్రూర కఠోర దృక్కులతో తేరి చూడరానివాడై ఆకాశమంత నోరు తెరచి నింగికీ నేలకూ రెండు దవడలను హత్తించాడు. సముద్ర మథన సమయంలో మందర పర్వతానికి చుట్టబడి విషం గ్రక్కుతున్న వాసుకి నాలుక వంటి నాలుకను చాచి ఆకాశాన్ని నాకుతూ ప్రళయకాల దండధరుని బాహుదండం వంటి దంష్ట్రలతో ముల్లోకాలను మ్రింగబోతున్నట్లు కనిపించాడు. ఆ మహాకాయుడు కొండలను ఎగుర మీటుతూ నడిచి వస్తున్న పెనుగొండ వలె భూమ్యాకాశాలను ఆక్రమించి పరాక్రమించాడు. అప్పుడు...

తెభా-6-426-ఉ.
కామునాటి మృత్యవుముఖంబునఁ బోలెను విస్ఫులింగముల్
గ్రాలఁగ దేవసంఘములు గంపమునొంద జగంబు లెల్ల నా
హా లుఠి తారవం బెసఁగ భ్రగజంబును నాయుధంబుతో
నాలుకఁ జుట్టి పట్టి సురనాథుని మ్రింగె మహాద్భు తాకృతిన్.

టీక:- కాలము = అంత్యకాలపు; నాటి = సమయమునందలి; మృత్యువు = మృత్యువు యొక్క; ముఖంబునున్ = ముఖమును; పోలెను = వలె; విస్ఫులింగముల్ = నిప్పురవ్వలు; క్రాలగన్ = చెలరేగుతుండగ; దేవ = దేవతల; సంఘములున్ = సమూహములు; కంపము = వణుకు; ఒందన్ = పొందగా; జగంబుల్ = లోకములు; ఎల్లన్ = అన్నియును; ఆహా = ఆహా యని; లుఠిత = పొర్లెడి; రావంబున్ = శబ్దములు; ఎసగన్ = అతిశయింపగా; అభ్రగజంబునున్ = ఐరావతమును {అభ్రగజము - అభ్ర (ఆకాశపు, స్వర్గలోకపు) గజము (ఏనుగు), ఐరావతము}; ఆయుధంబున్ = వజ్రాయుధము; తోన్ = తోటి; నాలుకన్ = నాలుకతో; చుట్టిపట్టి = చుట్టబెట్టి; సురనాథునిన్ = ఇంద్రుని; మ్రింగెన్ = మింగెను; మహా = గొప్ప; అద్భుత = ఆశ్చర్యకరమైన; ఆకృతిన్ = స్వరూపముతోటి.
భావము:- కల్పాంత కాలం నాటి మృత్యుదేవత నోరు వంటి ఆ వృత్ఱ్ఱాసురుని నోటినుండి అగ్నికణాలు రాలాయి. అది చూచి దేవతలందరూ గడగడలాడారు. లోకాలన్నీ హాహకారాలు చూస్తూ ఉండగా ఆ భయంకరాకారుడు నాలుక చాచి ఐరావతంతో, వజ్రాయుధంతో సహా చుట్టి పట్టి అమాంతంగా ఇంద్రుణ్ణి మ్రింగాడు.

తెభా-6-427-ఆ.
లో మెల్ల నపుడు చీఁకాకు పడెఁ దమం
డరె నుడుగణంబు వనిఁ బడియె;
సోనవాన గురిసె సూర్యచంద్రాగ్నుల
శ్ము లడఁగె దిశలు భస మయ్యె.

టీక:- లోకముల్ = లోకములు; ఎల్లన్ = అన్నియును; అపుడు = అప్పుడు; చీకాకుపడెన్ = చీకాకుపడెను; తమంబు = చిమ్మచీకట్లు; అడరెన్ = అతిశయించెను; ఉడు = నక్షత్రముల; గణంబుల్ = సమూహములు; అవనిన్ = భూమిపై; బడియె = పడెను సోనవాన = జడివాన; కురిసెన్ = కురిసెను; సూర్య = సూర్యుడు; చంద్ర = చంద్రుడు; అగ్నుల = అగ్నుల యొక్క; రశ్ములన్ = కాంతులు; అడగెన్ = అణగిపోయెను; దిశలు = దిక్కు లందు; రభసము = చీకాకు; అయ్యెన్ = కలిగెను.
భావము:- లోకమంతా చీకాకు పడింది. అంతటా చిమ్మచీకట్లు క్రమ్ముకున్నాయి. నక్షత్రాలు నేల రాలాయి. రక్తవర్షం కురిసింది. సూర్యచంద్రాగ్నులు తేజస్సులు కోల్పోయారు. దిక్కులు తారుమారైనాయి.

తెభా-6-428-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = అప్పుడు.
భావము:- ఆ సమయంలో...

తెభా-6-429-ఉ.
కందఁడు భీతి గుందఁడు ప్రకంపనమొందఁడు పెద్దనిద్దురం
జెందఁడు తత్తఱింపఁడు విశేషముఁ జొప్పఁడు వైష్ణవీ జయా
నంపరైక విద్యను మనంబునఁ దాల్చుచు నుండెఁ గాని సం
క్రంనుఁడా నిశాచరుని ర్భములో హరిరక్షితాంగుఁడై.

టీక:- కందడు = కదిపోడు; భీతిన్ = భయముతో; కుందడు = కుంగిపోడు; ప్రకంపనము = వణుకు; అందడు = పొందడు; పెద్దనిద్దురన్ = మరణమును; చెందడు = పొందడు; తత్తఱింపడు = కళవళపడడు; విశేషమున్ = విశిష్టితలను; చొప్పడు = కలిగించెడి; వైష్ణవీ = విష్ణుమూర్తి యొక్క; జయ = జయమును; ఆనంద = ఆనందమును; పర = లక్షించెడి; ఏక = ముఖ్యమైన; విద్యను = విద్యను; మనంబునన్ = మనసు నందు; తాల్చుచుచున్ = ధరించుచు; ఉండెన్ = ఉండెను; కాని = అంతే తప్ప; సంక్రందనుడు = ఇంద్రుడు {సంక్రందనుడు – శత్రువును ఆక్రందనము (మొఱ) పెట్టించు వాడు, దేవేంద్రుడు}; ఆ = ఆ; నిశాచరుని = రాక్షసుని {నిశాచరుడు - నిశ (రాత్రులు) యందు చరుడు (చరించెడివాడు), రాక్షసుడు}; గర్భము = కడుపు; లో = అందు; హరి = నారాయణునిచే; రక్షిత = కాపాడబడిన; అంగుడు = దేహము గలవాడు; ఐ = అయ్యి.
భావము:- వృత్రాసురుని కడుపులోని ఇంద్రుడు కసుగందలేదు. భయపడలేదు. వణికిపోలేదు. ప్రాణాలు కోల్పోలేదు. తత్తర పడలేదు. ఆనందమయమైన వైష్ణవీ విద్యను మనస్సులో ధ్యానిస్తూ శ్రీహరి వల్ల రక్షణ పొంది చెక్కు చెదరక నిశ్చలంగా నిర్భయంగా ఉన్నాడు.

తెభా-6-430-వ.
ఇట్లు కవచరూప శ్రీనారాయణ కృపాపాలితుండై యోగబలంబున బలభేది యతని యుదరంబు వజ్రాయుధంబున భేదించి యైరావణ సహితుండై వెడలి, యతని కంధరంబు తెగనడువ వజ్రంబుఁ బ్రయోగించిన, నతి నిష్ఠురవేగంబున వృత్రు హరణార్థంబుగం దిరుగుచు సూర్యాది గ్రహ నక్షత్రంబులకు దక్షిణోత్తర గతి రూపంబయిన సంవత్సర సంధియందు నహోరాత్ర మధ్యంబున వృత్రు శిరంబు పర్వత శిఖరంబునుం బోలెఁ ద్రుంచి కూలంద్రోచె; నప్పుడు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కవచ = కవచము యొక్క; రూప = రూపములో యున్న; శ్రీ = శుభకరమైన; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; కృపా = దయచే; పాలితుండు = పరిపాలింపబడువాడు; ఐ = అయ్యి; యోగ = యోగించిన; బలంబునన్ = శక్తితో; బలభేది = ఇంద్రుడు {బలభేది - బల (బలాసురుని) భేదించిన (సంహరించిన) వాడు, ఇంద్రుడు}; అతని = అతని యొక్క; ఉదరంబున్ = కడుపును; వజ్ర = వజ్రము యనెడి; ఆయుధంబునన్ = శస్త్రముతో; భేదించి = చీల్చి; ఐరావణ = ఐరావతము; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; వెడలి = బయటపడి; అతని = అతని యొక్క; కంధరంబు = కంఠమును; తెగనడువ = ఖండించుటకు; వజ్రంబున్ = వజ్రాయుధమును; ప్రయోగించిన = ప్రయోగించగా; అతి = మిక్కిలి; నిష్ఠుర = భయంకరమైన; వేగంబునన్ = వేగముతో; వృత్రు = వృత్రాసురుని; హరణ = సంహరించుట; అర్థంబుగన్ = కోసము; తిరుగుచున్ = తిరుగుచు; సూర్య = సూర్యుడు; ఆది = మొదలగు; గ్రహ = గ్రహములు; నక్షత్రంబుల్ = నక్షత్రముల; కున్ = కు; దక్షిణ = దక్షిణాయనము; ఉత్తర = ఉత్తరాయనము; గతిన్ = విధములైన; రూపంబున్ = స్వరూపములు; అయిన = కలిగిన; సంవత్సర = సంవత్సరపు; సంధి = సంధ్యా; అందున్ = సమయ మందు; అహ = పగలు; రాత్ర = రాత్రుల; మధ్యంబునన్ = సాయం సంధ్యాసమయములో; వృత్రు = వృత్రాసురుని; శిరంబున్ = తలను; పర్వత = కొండ; శిఖరంబునున్ = శిఖరము; పోలెన్ = వలె; త్రుంచి = ఖండించి; కూలన్ = కూలిపోవునట్లు; త్రోచెన్ = తోసివేసెను; అప్పుడు = అప్పుడు.
భావము:- ఈ విధంగా శ్రీమన్నారాయణ కవచ రూపంలో శ్రీమహావిష్ణువు దయచేత రక్షింపబడిన ఇంద్రుడు యోగబలంతో తన వజ్రాయుధంతో వృత్ఱ్ఱాసురుని కడుపు ఛేదించాడు. ఐరావతంతో సహా బయటకు వచ్చి వృత్రుని కంఠాన్ని ఖండించడానికి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది అమిత వేగంతో గిరగిర తిరుగుతూ సూర్యాది గ్రహాలు, నక్షత్రాలు సంచరించే దక్షిణోత్తరాయనాల నడిమి కాలంలో సంవత్సర సంధిలో సాయం సంధ్యాసమయంలో వృత్రాసురుని తలను ఖండించింది. ఆ శిరస్సు ఒక పర్వత శిఖరం వలె నేలమీద పడింది. అప్పుడు...

తెభా-6-431-మ.
మొసెన్ దుందుభు లంబరంబునఁ గడున్ మోదించి గంధర్వులున్
సులున్ సాధ్యులు సిద్ధులున్ మునివరుల్ సొంపార వృత్రఘ్ను భీ
తేజోవిభవప్రకాశకర విఖ్యాతైఁక మంత్రంబులం
ది మొప్పం బఠియించుచుం గురిసి రెంతేఁ గ్రొత్త పూ సోనలన్.

టీక:- మొరసెన్ = మోగినవి; దుందుభులు = భేరీలు; అంబరంబునన్ = ఆకాశమున; కడున్ = మిక్కిలి; మోదించి = సంతోషము కలిగించి; గంధర్వులున్ = గంధర్వులు; సురలున్ = దేవతలు; సాధ్యులున్ = సాధ్యులు; సిద్ధులున్ = సిద్ధులు; ముని = మునులలో; వరుల్ = ఉత్తములు; సొంపార = చక్కగా; వృత్రఘ్నున్ = ఇంద్రుని; భీకర = భయంకరమైన; తేజస్ = తేజస్సు యొక్క; విభవ = వైభవమును; ప్రకాశకర = వెల్లడి చేసెడి; విఖ్యాత = ప్రసిద్ధమైన; ఏఁక = మిక్కిలి ఆపేక్షకలిగిన; మంత్రంబులన్ = మంత్రములతో; తిరము = కుదురుగా; ఒప్పన్ = చక్కగా; పఠియించుచున్ = చదువుతూ; కురిసిరి = కురిపించిరి; ఎంతేన్ = అధికముగా; క్రొత్త = సరికొత్త; పూ = పూవుల; సోనలన్ = వర్షములను.
భావము:- ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి. గంధర్వులు, దేవతలు, సాధ్యులు, సిద్ధులు, మునీంద్రులు మిక్కిలి ఆనందించి వృత్రాసురుని సంహరించిన ఇంద్రుని తేజో వైభవాన్ని ప్రకాశింప జేసే ప్రశస్తమైన మంత్రాలను పఠిస్తూ పూలవానలు కురిపించారు.

తెభా-6-432-ఆ.
మి చెప్ప నప్పు డింద్రారి తనువున
నొక్క దివ్యతేజ ముబ్బి వెడలి
లోకమెల్లఁ జూడ లోకులు చూడని
లోక మరసి విష్ణులోను చొచ్చె.

టీక:- ఏమిచెప్పన్ = విచిత్రముగ; అప్పుడు = అప్పుడు; ఇంద్రారి = వృత్రుని {ఇంద్రారి - ఇంద్రుని అరి (శత్రువు), వృత్రుడు}; తనువునన్ = దేహమునుండి; ఒక్క = ఒక; దివ్య = దివ్యమైన; తేజము = తేజస్సు; ఉబ్బి = వెలువడి; వెడలి = వెళ్ళి; లోకము = లోకము; ఎల్లన్ = అంతయు; చూడన్ = చూచుచుండగా; లోకులు = ప్రజలు; చూడని = చూడనట్టి; లోకమున్ = లోకమును; అరసి = కనుగొని; విష్ణు = విష్ణుమూర్తి; లోనున్ = అందు; చొచ్చె = లయమయినది.
భావము:- ఏమని చెప్పను? ఆ సమయంలో వృత్రాసురుని శరీరంలోనుండి ఒకానొక దివ్య తేజస్సు వెలువడి జనులందరూ చూస్తుండగా ఈ లోకంలో నుండి విష్ణులోకానికి వెళ్ళి విష్ణువులో లీనమయింది.

తెభా-6-433-వ.
ఇట్లు లోకభీకరుండై వృత్రాసురుండు గూలిన, నఖిల లోకంబులు బరితాపంబు లుడిగి సుస్థితిం బొందె; దేవర్షి పితృగణంబులు దానవుల తోడంగూడి, యింద్రునకు జెప్పక తమతమ స్థానంబులకుం జని;"రనిన విని, పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; లోక = లోకములకు; భీకరుండు = భయంకరుడు; ఐన్ = అయిన; వృత్రాసురుండు = వృత్రాసురుడు; కూలినన్ = చనిపోగా; అఖిల = సమస్తమైన; లోకంబులున్ = లోకములు; పరితాపంబులు = బాధలు; ఉడిగి = తగ్గి; సుస్థితిన్ = మంచిదశను; పొందె = పొందెను; దేవర్షి = దేవఋషులు; పితృగణంబులు = పితృదేవతలు; దానవుల = రాక్షసుల; తోడన్ = తోటి; కూడి = కలిసి; ఇంద్రున్ = ఇంద్రున; కున్ = కు; చెప్పక = చెప్పకుండగ; తమతమస్థానంబులకున్ = ఎవరి స్థానమునకు వారు; చనిరి = వెళ్ళిరి; అనినన్ = అని చెప్పగా; విని = విని; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = రాజు; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = శ్రేష్ఠున; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా లోకభయంకరుడైన వృత్రుడు మరణించడంతో సమస్త లోకాలు సంతాపాన్ని వీడి సంతోషించాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, దానవులు అందరు ఇంద్రునితో చెప్పకుండానే తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు” అని చెప్పగా విని పరీక్షిత్తు శుకమహర్షితో ఇలా అన్నాడు.

తెభా-6-434-ఆ.
"మి కారణమున నింద్రుతోఁ బలుకక
సురలు పోయి? రట్టి సురగణంబు
లెందుచేత సుఖముఁ జెందిరి? వజ్రికిఁ
జేటు గలుగు టెట్లు? చెప్పవయ్య! "

టీక:- ఏమి = ఏ; కారణమునన్ = కారణముచేత; ఇంద్రుని = ఇంద్రుని; తోన్ = తోటి; పలుకక = చెప్పకుండగ; సురలు = దేవతలు; పోయిరి = వెళ్ళిరి; అట్టి = అటువంటి; సుర = దేవతల; గణంబులు = సమూహములు; ఎందుచేత = ఎందువలన; సుఖమున్ = సౌఖ్యములను; చెందిరి = పొందిరి; వజ్రి = ఇంద్రుని; కిన్ = కి; చేటు = దుర్దశ; కలుగుట = కలుగుట; ఎట్లు = ఎందువలన; చెప్పవా = చెప్పుము; అయ్య = తండ్రి.
భావము:- “అయ్యా! దేవతలు ఇంద్రుణ్ణి పలుకరించకుండా ఎందుకు వెళ్ళిపోయారు? అలా వెళ్ళటంలో వారికి కలిగిన సుఖ మేమిటి? ఇంద్రునికి అటువంటి దుర్దశ కలగడానికి కారణమేమిటి? నాకు వివరించు”

తెభా-6-435-వ.
అనిన శుకుం డిట్లనియె "వృత్రపరాక్రమ చకితులయిన నిఖిల దేవతలును, మహర్షి గణంబులును, మున్ను వృత్రవధార్థం బింద్రునిం బ్రార్థించిన నతండు బ్రహ్మహత్యకుం జాలక, "తొల్లి విశ్వరూపునిం జంపిన పాపంబు స్త్రీలయందును, భూమియందును, జలంబులందును, ద్రుమంబులందును విభజించి పెట్టితిని; ఇప్పు డీ హత్య యేరీతిం బాపుకొనువాఁడ? నా కశక్యం"బనిన మహర్షు "లశ్వమేధ యజ్ఞంబు చేయించి, యజ్ఞపురుషుం డైన శ్రీ నారాయణదేవుని సంతుష్టునిం జేసి యీ హత్యం బాపంగలవారము; స్వభావంబున బ్రాహ్మణ పితృ గో మాతృ సజ్జన హంతలైనవార లే దేవునిం గీర్తించి శుద్ధాత్ము లగుదు; రద్దేవుని నశ్వమేధ మహామఖంబున శ్రద్ధాన్వితుండవై సేవించిన నీకు ఖలుండైన యిద్దురాత్ముని హింసించిన హత్య యేమి చేయంగల?"దని యొడంబఱచిన, నింద్రుండు వల్లె యని యివ్విధంబున మార్తునిం బరిమార్చి, బ్రహ్మహత్యం బొంది, యత్తాపంబు భరియింప నోపక దుర్దశం బొందె; నప్పుడు.
టీక:- అనినన్ = అనగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; వృత్ర = వృత్రాసురుని; పరాక్రమ = పరాక్రమముచేత; చకితులు = నిశ్చేష్ఠులు; అయిన = ఐన; నిఖిల = సర్వ; దేవతలును = దేవతలు; మహా = గొప్ప; ఋషి = ఋషుల; గణంబులునున్ = సమూహములు; మున్ను = ఇంతకు పూర్వము; వృత్ర = వృత్రాసురుని; వధ = సంహరించెడి; అర్థంబున్ = కోసము; ఇంద్రునిన్ = ఇంద్రుని; ప్రార్థించినన్ = కోరగా; అతండు = అతడు; బ్రహ్మహత్య = బ్రాహ్మణ హత్యాదోషమున; కున్ = కు; చాలక = సమర్థుడుకాక; తొల్లి = ఇంతకు పూర్వము; విశ్వరూపునిన్ = విశ్వరూపుని; చంపిన = చంపిన; పాపంబున్ = పాపమును; స్త్రీల = స్త్రీల; అందునున్ = లోను; భూమి = భూమి; అందునున్ = లోను; జలంబులన్ = నీటి; అందునున్ = లోను; ద్రుమంబులన్ = చెట్ల; అందునున్ = లోను; విభజించి = భాగములు పంచి; పెట్టితిని = పెట్టితిని; ఇప్పుడు = ఇప్పుడు; ఈ = ఈ; హత్యన్ = బ్రాహ్మణ హత్యా పాతకమును; ఏ = ఏ; రీతిన్ = విధముగా; పాపుకొనువాడన్ = పోగొట్టుకొనగలవాడను; నా = నా; కున్ = కు; అశక్యంబు = సాధ్యము కాదు; అనినన్ = అనగా; మహర్షులు = మహర్షులు; అశ్వమేధ = అశ్వమేధ యనెడి; యజ్ఞంబున్ = యజ్ఞమును; చేయించి = చేయించి; యజ్ఞపురుషుండున్ = యజ్ఞములకు పతి, హరి; ఐన = అయిన; శ్రీనారాయణదేవుని = హరిని; సంతుష్టునిన్ = సంతృప్తిచెందినవానిగ; చేసి = చేసి; ఈ = ఈ; హత్యన్ = బ్రాహ్మణహత్యాపాతకమును; పాపన్ = పోగొట్టుట; కలవారము = చేసెదము; స్వభావంబునన్ = ప్రకృతి సిద్ధముగ; బ్రాహ్మణ = బ్రాహ్మణులను; పితృ = తండ్రిని; గో = ఆవులను; మాతృ = తల్లిని; సజ్జన = మంచివారిని; హంతలు = చంపినవారు; ఐన = అయిన; వారలు = వారు; ఏ = ఏ; దేవునిన్ = దేవుని యైతే; కీర్తించి = స్తుతించి; శుద్ధ = పరిశుద్ధమైన; ఆత్ములు = ఆత్మలు గలవారు; అగుదురు = అగుదురో; ఆ = అట్టి; దేవునిన్ = భగవంతుని; అశ్వమేధ = అశ్వమేధ యనెడి; మహా = గొప్ప; మఖంబున్ = యజ్ఞమును; శ్రద్ధ = శ్రద్ధతో; ఆన్వితుండవు = కూడినవాడవు; ఐ = అయ్యి; సేవించిన = పూజించిన; నీ = నీ; కున్ = కు; ఖలుండు = నీచుడు; ఐన = అయిన; ఈ = ఈ; దురాత్ముని = దుర్మార్గపు బద్ధి గలవానిని; హింసించినన్ = చంపిన; హత్యన్ = బ్రాహ్మణహత్యాపాతకము; ఏమి = ఏమి; చేయంగలదు = చేయగలదు; అని = అని; ఒడంబఱచినన్ = ఒప్పించగా; ఇంద్రుండు = ఇంద్రుడు; వల్లె = సరే; అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; మార్తునిన్ = శత్రువును; పరిమార్చి = సంహరించి; బ్రహ్మహత్యన్ = బ్రాహ్మణహత్యా పాతకమును; పొంది = పొంది; ఆ = ఆ; తాపంబున్ = బాధలను; భరియింపన్ = భరింప; ఓపక = లేక; దుర్దశన్ = దుర్దశను; పొందెన్ = పొందెను; అప్పుడు = అప్పుడు.
భావము:- పరీక్షిత్తు ప్రశ్న విని శుకమహర్షి ఇలా అన్నాడు “వృత్రాసురుని పరాక్రమానికి భయపడిన దేవతలు, మహర్షులు వృత్రుని సంహరించమని ఇంద్రుణ్ణి ప్రార్థించారు. అప్పుడు దేవేంద్రుడు బ్రహ్మహత్యా పాతకానికి భయపడి “నేను విశ్వరూపుని చంపి బ్రహ్మహత్యకు లోనై నానాకష్టాలు పడ్డాను. ఆ పాపాన్ని స్త్రీలకు, భూమికి, నీళ్ళకు, చెట్లకు పంచిపెట్టి ఎలాగో బయట పడ్డాను. మళ్ళీ ఇప్పుడు బ్రహ్మహత్య చేసి ఆ మహాపాపాన్ని ఎలా పోగొట్టుకొనేది? ఈ పని నా వల్ల కాదు” అన్నాడు. అందుకు మహర్షులు “నీచేత అశ్వమేధ యాగం చేయిస్తాము. యజ్ఞపురుషుడైన శ్రీమన్నారాయణ మూర్తికి తృప్తి కలిగించి ఆయన దయవల్ల నీకు ఈ బ్రహ్మహత్యాపాపం అంటకుండా చేస్తాము. వాస్తవానికి బ్రాహ్మణులను, తల్లిదండ్రులను, గోవులను, సాధువులను హింసించిన వారుకూడా ఆ దేవదేవుని స్తుతించి పాపవిముక్తులౌతారు. అశ్వమేధ మహాయజ్ఞం ద్వారా శ్రద్ధాభక్తులతో ఆ దేవాదిదేవుణ్ణి ఆరాధిస్తే దుర్మార్గుడైన వృత్రుణ్ణి సంహరించిన పాపం నిన్ను ఏమీ చేయలేదు” అని చెప్పి ఒప్పించారు. అప్పుడు ఇంద్రుడు సరే అని వృత్రుని చంపడానికి అంగీకరించాడు. ఇప్పుడు ఈ విధంగా శత్రువైన వృత్రుణ్ణి సంహరించినందుకు ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకొన్నది. ఆ పాపాన్ని భరించలేక ఇంద్రుడు దురవస్థల పాలైనాడు.

తెభా-6-436-సీ.
పాపంబుఁ జండాలరూపంబు గలదాని-
ముదిమిచే నొడలెల్ల లుదాని
క్షయకుష్ఠరోగ సంయకృతం బగుదాని-
నురురక్తపూరంబు దొరఁగుదాని
సిన వెండ్రుకల్ నెసిన తలదాని-
టఁ బోకుపో కుండు నెడుదానిఁ
దరు కంపునఁ బ్రేవు ద రఁజేసెడుదానిఁ-
దా నెందుఁ బాఱిన ఱుముదాని

తెభా-6-436.1-ఆ.
"నా గుణంబు లెల్ల భోగింప కేరీతి
రుగ నెంతవాఁడ"నెడుదాని
బిట్టు దిరిగి చూచి భీతిల్లి సిగ్గుతో
దేవనాయకుండు దెరలి పఱచె.

టీక:- పాపంబున్ = పాపమును; చండాల = మిక్కిలి చెడ్డది యైన; రూపంబున్ = స్వరూపము; కల = ఉన్న; దానిన్ = దానిని; ముదిమి = ముసలితనముచేత; ఒడలు = ఒళ్ళు; ఎల్లన్ = అంతయు; కదలు = కదిలిపోతున్న; దానిన్ = దానిని; క్షయ = క్షయ; కుష్ఠు = కుష్ఠు; రోగ = రోగముల; సంచయ = సమూహములచే; కృతంబు = చేయబడినది; అగు = అయిన; దానిన్ = దానిని; ఉరు = అధికమైన; రక్త = రక్తపు; పూరంబున్ = ప్రవాహములు; తొరగు = స్రవించు; దానిన్ = దానిని; అరసిన = చూడగా; వెండ్రుకల్ = వెంట్రుకలు; నెరసిన = నెరిసిపోయిన; తల = తల గల; దానిన్ = దానిని; అటన్ = అక్కడకు; పోకుపోకుండుము = వెళ్ళనే వెళ్ళవద్దు; అనెడు = చెప్పెడు; దానిన్ = దానిని; కదురు = విజృంభించిన కంపునన్ = చెడువాసన వలన; ప్రేవులన్ = పేగులను; అదరజేసెడు = అదరగొట్టెడు; దానిన్ = దానిని; తాన్ = తను; ఎందున్ = ఎక్కడకు; పాఱినన్ = పారిపోయినను; తఱుము = వెంటపడు; దానిన్ = దానిని;
నా = నా యొక్క; గుణంబులు = లక్షణములు; ఎల్లన్ = అన్నిటిని; భోగింపక = అనుభవింపకుండగా; ఏ = ఏ; రీతిన్ = విధముగ; అరుగన్ = పోవుటకు; ఎంతవాడవు = సమర్థుడవు కావు; అనెడు = అనెడి; దానిన్ = దానిని బిట్టు = మిక్కిలి; తిరిగి = వెనుదిరిగి; చూచి = చూసి; భీతిల్లి = భయపడిపోయి; సిగ్గు = బిడియము; తోన్ = తోటి; దేవనాయకుండు = ఇంద్రుడు {దేవనాయకుడు - దేవతలకు నాయకుడు, ఇంద్రుడు}; తెరలి = కళవళపడి; పఱచె = పరిగెట్టెను.
భావము:- బ్రహ్మహత్యా పాపం చండాలరూపాన్ని ధరించి ముసలితనంతో ఒడలంతా ముడతలు పడి గడగడ వణుకుతూ నడచి వచ్చింది. క్షయరోగంతో, కుష్ఠురోగంతో దాని శరీరమంతా నెత్తురులు చిమ్ముతున్నవి. నెరసిన జుట్టు విరబోసుకొని “పోకు! ఉండు” అంటూ ఉన్నది. దేహమంతా దుర్గంధంతో డోకు వచ్చి ప్రేగులు తరుక్కుపోయేట్లు కంపు కొడుతున్నది. ఇంద్రుడు ఎటు పోతే అటు పరిగెత్తి వెంటబడి తరుముతున్నది. “నా గుణాలను అనుభవించకుండా ఎట్లా పోతావు? నాముందు నీవెంతవాడవు?” అంటున్నది. వెంట పరుగిడి వస్తున్న బ్రహ్మహత్యను తిరిగి తిరిగి చూస్తూ ఇంద్రుడు భయంతో, సిగ్గుతో పారిపోసాగాడు.

తెభా-6-437-వ.
ఇట్లతి వికృతత్వంబుతో బ్రహ్మహత్య వెనుతగుల నింద్రుండు నభోభాగ భూభాగ దిగ్భాగంబు లెల్లం దిరిగి, చొరం దెరువులేక దీర్ఘ నిర్ఘాతాటోప నిశ్వాస దూషితుండై, యీశాన్య భాగంబునకుం బఱచె; యద్దెస నమేయపుణ్యగణ్యంబైన మానస సరస్సునం బ్రవేశించి, యం దొక్క కమలనాళంబు చొచ్చి తంతువులం గలసి రూపంబు లేక యలబ్ధభోగుం డై, బ్రహ్మహత్యా విమోచనంబుఁ జింతించికొనుచు, సహస్ర వర్షంబు లుండె నా చండాలియు నది పరమేశ్వర దిగ్భాగం బగుటం జేసి, యందు జొరరాక కాచియుండె, నంతకాలంబుఁ ద్రిదివంబున నహుషుండు విద్యాబల తపోబల యోగబలంబులం బాలించుచుండి, సంప దైశ్వర్య మదాంధుండై, యింద్ర పత్నిం గోరి, యింద్రుండు వచ్చునందాక నాకుం బత్నివి గమ్మనిన, నా శచీదేవి బృహస్పతి ప్రేరితయై, బ్రహ్మర్షి వాహ్యశిబిక నెక్కి వచ్చి, నన్ను భోగింపు మనిన నతం డట్ల చేసి, కుంభ సంభవ శాపహతుండై, యజగర యోనియందుఁ బుట్టె; నంత నింద్రుండు బ్రహ్మర్షి గణోపహూతుండై, త్రిదివంబునకు వచ్చె, నంత కాలంబు నారాయణ చరణారవింద ధ్యానపరుండై యుండుటం జేసియు, దిశాధినాథుం డైన శంకరుచేత రక్షింపఁబడ్డవాఁడై యుండుటం జేసియు, దద్దోష బలంబు దఱఁగి సహస్రాక్షుం బీడింప లే దయ్యె; నప్పు డింద్రుండు నిజైశ్వర్యంబునుం బొంది బ్రహ్మర్షి పరివృతుండై, మహాపురుషారాధనంబు చేసి, హయమేధాధ్వరంబునకు దీక్షఁ గైకొని, బ్రహ్మవాదులచేత నాదరింపఁ బడుచున్న వాఁడై, సర్వదేవతామయుండైన నారాయణుం బరితృప్తుం జేసి, మంచు విరయించు మార్తాండుని చందంబునఁ ద్వాష్ట్రవధరూప పాపంబు నాశంబు నొందించి, సకల దివిజ యక్ష గంధర్వ సిద్ధ మునిజన సంస్తూయ మానుండయి, త్రిభువనైశ్వర్య భోగభాగ్యంబులం గైకొనియె; నప్పుడు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అతి = మిక్కిలి; వికృతత్వంబు = వికారపు స్వరూపము; తోన్ = తోటి; బ్రహ్మహత్య = బ్రాహ్మణహత్యా దోషము; వెనుతగులన్ = తరుముచుండగా; ఇంద్రుండు = ఇంద్రుడు; నభో = ఆకాశ; భాగ = మండలము; భూ = భూమి; భాగ = మండలములు; దిక్ = దిక్కుల; భాగంబుల్ = ప్రదేశములు; ఎల్లన్ = అన్నియు; తిరిగి = తిరిగి; చొరన్ = దూరుటకు; తెరువు = దారి; లేక = లేకపోవుటచే; దీర్ఘ = పెద్ద; నిర్ఘాత = పిడుగుల; ఆటోప = మోతవంటి; నిశ్వాస = ఊపిరితీసెడి ధ్వనితో; దూషితుండు = దోషము అంటినవాడు; ఐ = అయ్యి; ఈశాన్య = ఈశాన్యపు; భాగంబున్ = మూల; కున్ = కి; పఱచె = పారిపోయెను; ఆ = ఆ; దెసన్ = వైపున గల; అమేయ = సాటిలేని; పుణ్య = పవిత్రతలు; అగణ్యంబు = లెక్కలేనన్ని గలది; ఐన = అయిన; మానస = మానసము యనెడి; సరస్సునన్ = సరోవరములో; ప్రవేశించి = ప్రవేశించి; అందు = దానిలోని; ఒక్క = ఒక; కమల = తామర; నాళంబున్ = తూడు, గొట్టము; చొచ్చి = దూరి; తంతువులన్ = దారములలో; కలిసి = కలిసిపోయి; రూపంబు = స్వరూపము; లేక = లేకుండగ; అలబ్ధ = పోయిన; భోగుండు = భోగములు గలవాడు; ఐ = అయ్యి; బ్రహ్మహత్య = బ్రహ్మహత్యాపాపమునుండి; విమోచనంబున్ = విడుదలను; చింతించికొనుచున్ = ఆలోచించుకొనుచు; సహస్ర = వేయి; వర్షంబులు = సంవత్సరములు; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; చండాలియున్ = బహుచెడ్డది కూడ; అది = అది; పరమేశ్వర = పరమశివుని; దిగ్భాగంబున్ = దిక్కు; అగుటన్ = అగుట; చేసి = వలన; అందున్ = దానిలో; చొరరాక = దూరలేక; కాచి = కాచుకొని; ఉండెన్ = ఉండెను; అంతకాలంబు = అంతకాలము; త్రిదివంబునన్ = స్వర్గము నందు; నహుషుండు = నహుషుడు; విద్యా = వేదవిద్య యొక్క; బలంబునన్ = శక్తిచేతను; తపస్ = తపస్సు యొక్క; బల = శక్తిచేతను; యోగ = యోగము యొక్క; బలంబులన్ = శక్తులచేతను; పాలించుచుండి = పరిపాలించుతూ; సంపద = సంపదలు; ఐశ్వర్య = ఐశ్వర్యములచే; మద = గర్వము వలన; అంధుడు = కనులు కనిపించని వాడు; ఐ = అయ్యి; ఇంద్రపత్నిన్ = శచీదేవిని; కోరి = కోరి; ఇంద్రుండు = ఇంద్రుడు; వచ్చునందాక = వచ్చేవరకు; నా = నా; కున్ = కు; పత్నివి = భార్యవి; కమ్ము = అగుము; అనిన = అనగా; శచీదేవి = శచీదేవి; బృహస్పతి = బృహస్పతిచే; ప్రేరిత = ప్రేరేపింపబడినది; ఐ = అయ్యి; బ్రహ్మర్షి = బ్రహ్మఋషులు; వ్యాహ = మోసెడి; శిబికన్ = పల్లకిని; ఎక్కి = ఎక్కి; వచ్చి = వచ్చి; నన్ను = నన్ను; భోగింపుము = అనుభవింపుము; అనినన్ = అనగా; అతండు = అతడు; అట్ల = ఆ విధముగ; చేసి = చేసి; కుంభసంభవ = అగస్త్య మహర్షి యొక్క; శాప = శాపముచే; హతుండు = మరణించినవాడు; ఐ = అయ్యి; అజగర = కొండచిలువ; యోని = గర్భము; అందున్ = అందు; పుట్టెన్ = పుట్టెను; అంత = అంతట; ఇంద్రుండు = ఇంద్రుడు; బ్రహ్మర్షి = బ్రహ్మ ఋషులచే; గణ = సమూహములచే; ఉపహూతుండు = పిలువబడినవాడు; ఐ = అయ్యి; త్రిదివంబున్ = స్వర్గమున; కున్ = కు; వచ్చెన్ = వచ్చెను; అంతకాలంబున్ = అంతకాలము; నారాయణ = హరి; చరణ = పాదములు యనెడి; అరవింద = పద్మములను; ధ్యాన = ధ్యానించుట యందు; పరుండు = లగ్నమైన; ఐ = అయ్యి; ఉండుటన్ = ఉండుట; చేసియున్ = వలన; దిశాధినాథుండు = దిక్పాలకుండు; ఐన = అయిన; శంకరున్ = పరమశివుని; చేత = వలన; రక్షింపబడ్డవాడు = కాపాడబడినవాడు; ఐ = అయ్యి; ఉండుటన్ = ఉండుట; చేసియున్ = వలన; తత్ = ఆ; దోషంబున్ = దోషము; తఱగి = తగ్గి; సహస్రాక్షున్ = ఇంద్రుని {సహస్రాక్షుడు - సహస్ర (వేయి 1,000) అక్షుడు (కన్నులుగలవాడు), ఇంద్రుడు}; పీడింపన్ = బాధింప; లేదు = లేనిది; అయ్యెన్ = అయ్యెను; అప్పుడు = అప్పుడు; ఇంద్రుండు = ఇంద్రుడు; నిజ = తన; ఐశ్వర్యంబున్ = ఐశ్వర్యమును; పొంది = పొంది; బ్రహ్మర్షి = బ్రహ్మ ఋషులచే; పరివృతుండు = చుట్టును చేరినవాడు; ఐ = అయ్యి; మహాపురుష = నారాయణుని; ఆరాధనంబున్ = పూజించుట; చేసి = చేసి; హయమేధా = అశ్వమేధ యనెడి; అధ్వరంబున్ = యాగమున; కున్ = కు; దీక్షన్ = దీక్షను; కైకొని = చేపట్టి; బ్రహ్మవాదుల్ = బ్రహ్మజ్ఞానముగలవారి; చేతన్ = చేత; ఆదరింపబడుతున్నవాడు = ఆదరింపబడెడివాడు; ఐ = అయ్యి; సర్వ = అఖిల; దేవతా = దేవత; మయుండున్ = స్వరూపమైనవాడు; ఐన = అయిన; నారాయణున్ = హరిని; పరితృప్తున్ = తృప్తిచెందినవానిగా; చేసి = చేసి; మంచు = మంచుతెరలను; విరియించు = విరిచేసే; మార్తాండుని = సూర్యుని; చందంబునన్ = వలె; త్వాష్ట = త్వష్ట యొక్క పుత్రుని; వధ = సంహారము యొక్క; రూప = రూపములోని; పాపంబు = పాపమును; నాశంబున్ = నాశనము; ఒందించి = చేసి; సకల = సమస్తమైన; దివిజ = దేవతలు; యక్ష = యక్షులు; గంధర్వ = గంధర్వులు; సిద్ధ = సిద్ధులు; మునిజన = మునులుచే; సంస్తూయమానుండు = స్తుతింపబడువాడు; ఐ = అయ్యి; త్రిభువన = ముల్లోకముల; ఐశ్వర్య = ఐశ్వర్యములు; భోగ = భోగములు; భాగ్యంబులన్ = భాగ్యములను; కైకొనియె = చేపెట్టెను; అప్పుడు = అప్పుడు.
భావము:- ఈ విధంగా మిక్కిలి వికృతమైన స్వరూపంతో బ్రహ్మహత్యాపాపం వెంటబడి తరుముతుండగా ఇంద్రుడు ఆకాశం, భూమి, దిక్కులు అంతటా తిరిగాడు. ఎక్కడా నిలబడటానికి వీలు చిక్కలేదు. ఎటూ తట్టుకోలేక చిట్టచివరకు వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూ ఈశాన్యదిక్కుకు పరుగెత్తాడు. ఆ దిక్కున ఉన్న అత్యంత పవిత్రమైన మానస సరస్సులో ప్రవేశించాడు. ఆ సరోవరంలోని ఒక కమలనాళంలో దూరి, ఆ తామర తూడులోని సన్నని తంతువులో కలిసిపోయాడు. ఆ విధంగా ఆ మృణాళనాళంలో అదృశ్యరూపంలో ఐశ్వర్యానికి దూరంగా ఉండి బ్రహ్మహత్యా పరిహారం కోసం విచారిస్తూ వెయ్యి సంవత్సరాలు గడిపాడు. ఈశాన్యం పరమేశ్వరునికి సంబంధించింది కనుక బ్రహ్మహత్య ప్రవేశించ లేక అల్లంత దూరంలో కాచుకొని కూర్చుంది. ఆ సమయంలో నహుషుడనే రాజు స్వర్గానికి అధిపతి అయ్యాడు. తన విద్యాబలం వల్ల, యోగబలం వల్ల సాధించుకొన్న స్వర్గరాజ్యాన్ని పరిపాలిస్తున్న నహుషుడు ఐశ్వర్య గర్వాంధుడై దేవేంద్రుని భార్య అయిన శచీదేవిని కాంక్షించాడు. “నీ భర్త వచ్చే వరకు నాకు భార్యగా ఉండు” అని ఆమెను కోరాడు. శచీదేవి దేవగురువైన బృహస్పతి సూచనానుసారం “నీవు బ్రహ్మర్షులు మోస్తున్న పల్లకీని ఎక్కి నా దగ్గరకు వస్తే నీ కోరిక నెరవేరుతుంది” అన్నది. నహుషుడు శచీదేవి చెప్పిన ప్రకారం బ్రహ్మర్షుల చేత తన పల్లకీ మోయించుకొని అగస్త్య మహర్షి శాపానికి గురియై అజగర రూపం ధరించి స్వర్గభ్రష్టు డైనాడు. అనంతరం ఇంద్రుడు బ్రహ్మర్షులు ఆహ్వానింపగా స్వర్గానికి తిరిగి వచ్చాడు. ఇంతకాలంగా శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ధ్యానిస్తూ ఉండడం వల్ల, వేయి సంవత్సరాలు పరమేశ్వరుని దిగ్భాగంలో ఉండి ఆయన కరుణకు పాత్రుడవటం వల్ల బ్రహ్మహత్య క్రమంగా క్షీణించిపోయి ఇంద్రుణ్ణి స్పృశింపలేక పోయింది. అప్పుడు దేవేంద్రుడు ఎప్పటి వలె స్వర్గాధిపత్యం వహించి బ్రహ్మర్షు లందరిని ఆహ్వానించి, ఆరాధించి అశ్వమేధ యాగానికి దీక్ష స్వీకరించాడు. బ్రహ్మవేత్తలైన మహర్షులు చక్కగా జరిపించిన మహాయజ్ఞం చేత సకల దేవతా స్వరూపుడైన వాసుదేవుణ్ణి సంతృప్తుణ్ణి చేసాడు. ఇందువల్ల సూర్యుని కిరణాలకు మంచు కరిగిపోయినట్లుగా త్వష్ట కుమారుడైన వృత్రాసురుని చంపిన పాపం నశించిపోయింది. ఈ విధంగా ఇంద్రుడు సమస్త దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు స్తుతిస్తుండగా ముల్లోకాలకు అధీశ్వరుడై సకల భోగభాగ్యాలు అనుభవించాడు. అప్పుడు...

తెభా-6-438-చ.
త మరీచిముఖ్య మునిసంఘముచేత యథోచితంబుగాఁ
గృ ఘన వాజిమేధమునఁ గేశవు నీశుఁ బురాణపూరుషున్
హితు జగదీశు యజ్ఞపతి నిష్టఫలప్రదు నంతరంగ సం
తు భజియించి వజ్రి గతల్మషుఁడై నెగడెన్ మహీశ్వరా!

టీక:- సతత = ఎల్లప్పుడు; మరీచి = మరీచి; ముఖ్య = మొదలగు; ముని = మునుల; సంఘము = సమూహముల; చేత = చేత; యథోచితంబుగాన్ = తగినవిధముగా; కృత = చేయబడిన; ఘన = గొప్ప; వాజిమేధమునన్ = అశ్వమేధము వలన; కేశవున్ = నారాయణుని; ఈశున్ = నారాయణుని; పురాణపూరుషున్ = నారాయణుని {పురాణ పూరుషుడు - పురాణ (పురాతన కాలమునుండి) ఉన్న పూరుషుడు (ఉత్తమమైన పురుషుడు), విష్ణువు}; హితున్ = నారాయణుని {హితుడు - హితము కోరెడివాడు, విష్ణువు}; జగదీశున్ = నారాయణుని {జగదీశుడు - జగత్తునకు ఈశుడు (ప్రభువు), విష్ణువు}; యజ్ఞపతిన్ = నారాయణుని {యజ్ఞ పతి - యజ్ఞములకు పతి (ప్రభువు), విష్ణువు}; ఇష్టఫలప్రదున్ = నారాయణుని {ఇష్ట ఫల ప్రదుడు - ఇష్ట (కోరినకోరికలు) ఫల (తీరుటను) ప్రదుడు (కలిగించువాడు), విష్ణువు}; అంతరంగసంగతున్ = నారాయణుని {అంతరంగ సంగతుడు - అంతరంగ (ఆత్మలలో) సంగతుడు (కూడి యుండువాడు), విష్ణువు}; భజియించి = సేవించి; వజ్రి = ఇంద్రుడు; గత = పోయిన; కల్మషుడు = కల్మషములు గలవాడు; ఐ = అయ్యి; నెగడెన్ = అతిశయించెను; మహీశ్వరా = రాజా {మహీశ్వరుడు - మహి (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు}.
భావము:- రాజా! ఈ విధంగా ఇంద్రుడు మరీచి మొదలైన మహామునుల సహాయంతో యథావిధిగా అశ్వమేధయాగం చేసి యజ్ఞేశ్వరుడు, జగదీశ్వరుడు, పరమేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుని సేవించి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకొని పరిశుద్ధుడై ప్రకాశించాడు.

తెభా-6-439-సీ.
ఱియుఁ బుట్టింపంగ నసు పెట్టిన యట్టి-
క్రూరకర్మాంబోధి కుంభజుండు
అంగారములు చేయ నాహుతిఁ గన నోపు-
హు పాపకానన పావకుండు
కందక దిగ మ్రింగి ఱ్ఱునఁద్రేపంగఁ-
ల్మషగరళ గంగాధరుండు
నగుహాంతరములఁ గాలూన నియ్యని-
లుష దుస్తర తమో గ్రహ విధుండు

తెభా-6-439.1-ఆ.
కల ముక్తిలోక సామ్రాజ్య సమధిక
హజ భోగ భాగ్య సంగ్రహైక
కారణాప్రమేయ కంజాక్ష సర్వేశ
కేశవాది నామ కీర్తనంబు.

టీక:- మఱియున్ = ఇంకను; పుట్టింపంగన్ = పునర్జన్మము కలుగునట్లు; మనసుపెట్టిన = తలపెట్టిన; అట్టి = అటువంటి; క్రూర = క్రూరమైన; కర్మ = కర్మములు యనెడి; అంబోధి = సముద్రమునకు {అంబోధి - అంబు (నీటికి) నిధి, సముద్రము}; కుంభజుండు = అగస్త్య మహర్షి {కుంభజుండు - కుంభము నందు జుడు (పుట్టినవాడు), అగస్త్యుడు}; అంగారములు = బొగ్గులు; చేయన్ = చేయుటకు; ఆహుతి = కాల్చుట; కననోపుడు = చేయ సమర్థుడు; బహు = అనేకమైన; పాప = పాపములు యనెడి; కానన = అడవులకు; పావకుండు = అగ్నిహోత్రుడు; కందక = కందిపోకుండగ; దిగమ్రింగి = మింగేసి; గఱ్ఱున = గఱ్ఱుమని; త్రేపంగన్ = తేన్చ గలుగుటలో; కల్మష = పాపములు యనెడి; గరళ = విషమునకు; గంగాధరుండు = పరమశివుడు; ఘన = గొప్ప; గుహా = గుహల; అంతరములన్ = లోపల; కాలూననియ్యని = కాలుపెట్టనివ్వని; కలుష = పాపములు యనెడి; దుస్తర = దాటరాని; తమః = చీకటిని; గ్రహ = తాగివేయుటలో; విధుండు = చంద్రుడు;
సకల = సమస్తమైన; ముక్తి = మోక్షముల; లోక = సర్వముయైన; సామ్రాజ్య = సామ్రాజ్యముయొక్క; సమధిక = మిక్కిలి అధికమైన; సహజ = సహజమైన; భోగ = భోగములు; భాగ్య = భాగ్యముల; సంగ్రహ = స్వీకరించుట; ఏక = ముఖ్యమైన; కారణ = కారణమైన; అప్రమేయ = విష్ణుమూర్తి; కంజాక్ష = విష్ణుమూర్తి; సర్వేశ = విష్ణుమూర్తి; కేశవ = విష్ణుమూర్తి; ఆది = మొదలగు; నామ = పేర్లుతో; కీర్తనంబు = స్తుతించుట.
భావము:- పునర్జన్మకు కారణాలైన క్రూరకృత్యా లనబడే సముద్రాన్ని త్రాగిన అగస్త్యుని వంటివాడు. మహా పాతకా లనబడే అరణ్యాలను భస్మం చేసే అగ్నిహోతుని వంటివాడు. భక్త జనుల కల్మషా లనబడే కాలకూటాన్ని అలవోకగా మ్రింగే పరమశివుని వంటివాడు. అంతులేని కలుష రాసు లనబడే కటిక చీకట్లను పటాపంచలు చేసే సూర్యుని వంటివాడు. ఆ నారాయణునికి గల కమలాక్షుడు, సర్వేశ్వరుడు, కేశవుడు మొదలైన నామాల సంకీర్తనం సమస్తమైన మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించి పెట్టి సకల భోగభాగ్యాలను సమకూరుస్తుంది.

తెభా-6-440-సీ.
ఖిల దుఃఖైక సంహారాది కారణం-
ఖిలార్థ సంచ యాహ్లాదకరము
విమల భక్త్యుద్రేక విభవ సందర్శనం-
నుపమ భక్త వర్ణనరతంబు
విబుధహర్షానేక విజయ సంయుక్తంబు-
గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు
బ్రహ్మహత్యానేక పాపనిస్తరణంబు-
మనీయ సజ్జన కాంక్షితంబు

తెభా-6-440.1-తే.
నైన యీ యితిహాసంబు ధిక భక్తి
వినినఁ జదివిన వ్రాసిన నుదినంబు
నాయు రారోగ్య విజయ భాగ్యాభివృద్ధి
ర్మనాశము సుగతియుఁ ల్గు ననఘ! "

టీక:- అఖిల = సమసమైన; దుఃఖ = దుఃఖములు; ఏక = అన్నిటిని; సంహార = నాశనము చేయుట; ఆది = మొదలగు; కారణంబు = కారణమైనది; అఖిల = సర్వమైన; అర్థ = ప్రయోజనముల; సంచయ = సమూహమునకు; ఆహ్లాద = సంతోషమును; కరము = కలిగించునది; విమల = స్వచ్ఛమైన; భక్త = భక్తుల; ఉద్రేక = అతిశయించిన; విభవ = వైభవమును; సందర్శనంబు = దర్శింపజేయునది; అనుపమ = సాటిలేనిది; భక్త = భక్తుల; వర్ణన = కీర్తించుటందు; రతంబు = ఆసక్తి గలది; విబుధ = దేవతలకు; హర్ష = సంతోషమును కలిగించి; అనేక = అనేకమైన; విజయ = విజయములతో; సంయుక్తంబు = కూడినది; గ్రస్తా = మింగబడినను; అమరేంద్ర = ఇంద్రుని; మోక్ష = విముక్తికి; క్రమంబు = కారణము; బ్రహ్మహత్యా = బ్రహ్మహత్యాదోషము; అనేక = మొదలగు; పాప = పాపములను; నిస్తరణంబు = తరింపజేయునది; కమనీయ = కోరదగినట్టి; సజ్జన = మంచివారిచేత; కాంక్షితంబున్ = కోరబడునది; ఐన = అయిన;
ఈ = ఈ; ఇతిహాసంబున్ = ఇతిహాసమును; అధిక = అధికమైన; భక్తిన్ = భక్తితో; వినినన్ = వినినప్పటికిని; చదివినన్ = చదివినప్పటికిని; వ్రాసినన్ = వ్రాసినప్పటికిని; అనుదినంబు = ప్రతిదినము; ఆయుష్ = జీవితకాలము; ఆరోగ్య = ఆరోగ్యము; విజయ = విజయములు; భాగ్య = భాగ్యముల; అభివృద్ధి = అభివృద్ధి; కర్మ = పూర్వకర్మపలముల; నాశమున్ = నాశనము; సుగతి = ముక్తిపథము; కల్గును = కలుగును; అనఘ = పుణ్యుడా.
భావము:- ఓ పుణ్యాత్మా! వృత్రాసుర సంహారమనే ఈ ఇతిహాసం సమస్త దుఃఖాలను శమింప జేస్తుంది. కోరిన కోరిక లన్నింటినీ సమకూరుస్తుంది. అచంచలమైన భక్తిని అతిశయింప జేస్తుంది. మహా భక్తుల యందు ఆసక్తిని కలిగిస్తుంది. దేవతలందరికీ ఆనందాన్ని అందిస్తుంది. విజయాలను చేకూరుస్తుంది. బ్రహ్మహత్య మొదలైన పాపాలను సైతం పోగొడుతుంది. సత్పురుషులకు సర్వదా కాంక్షింప దగినట్టిది. శాపగ్రస్తుడైన ఇంద్రునికి సైతం విముక్తిని ప్రసాదించినట్టిది. ఇటువంటి ఇతిహాసాన్ని భక్తి పూర్వకంగా ప్రతిదినమూ పఠించినా, విన్నా, వ్రాసినా ఆయురారోగ్యాలు లభిస్తాయి. భోగ భాగ్యాలు ప్రాప్తిస్తాయి. విజయశ్రీ వరిస్తుంది. కర్మక్షయమై మోక్షాన్ని చేకూరుతుంది.”

తెభా-6-441-సీ.
నావుడు "యోగీంద్ర! నామనం బీ వృత్రు-
వివరంబు నీచేత విన్న మొదలు
డు నద్భుతంబునఁ ళవళం బందెడుఁ-
గోరి రజస్తమోగుణములందు
ర్తించు నీ పాపర్తికి నే రీతి-
మాధవ పదభక్తి ది వసించె?
త్త్వ స్వభావు లై మబుద్ధు లై తపో-
నియమ ప్రయత్ను లై నిష్ఠచేత

తెభా-6-441.1-తే.
నిర్మలాత్మకు లై నట్టి ర్మపరుల
మరులకుఁ బుణ్యమునులకు నంబుజాక్షు
భూరి కైవల్య సంప్రాప్తి మూలమైన
క్తి వీనికిఁ బోలె నేర్పాటుగాదు.

టీక:- నావుడు = అనగా; యోగి = యొగులలో; ఇంద్ర = శ్రేష్ఠుడ; నా = నా యొక్క; మనంబు = మనస్సు; ఈ = ఈ; వృత్రు = వృత్రుని; వివరంబున్ = వివరమును; నీ = నీ; చేత = వలన; విన్న = వినినది; మొదలు = మొదలు; కడున్ = మిక్కిలి; అద్భుతంబునన్ = ఆశ్చర్యముతో; కళవళన్ = కలత; అందెడున్ = చెందుతున్నది; కోరి = పూని; రజః = రజోగుణము; తమోగుణములు = తమోగుణములు; అందున్ = అందు; వర్తించున్ = ప్రవర్తించెడి; ఈ = ఈ; పాప = పాపపు మార్గమున; వర్తి = తిరిగెడువాని; కిన్ = కి; ఏ = ఏ; రీతిన్ = విధముగ; మాధవ = నారాయణుని; పద = పాదము లందలి; భక్తి = భక్తి; మదిన్ = మనసులో; వసించె = స్థిరపడెను; సత్త్వ = సత్త్వగుణ; స్వభావులు = స్వభావములు గలవారు; ఐ = అయ్యి; సమ = సమత్వ భావన గల; బుద్ధులు = భావములు గలవారు; ఐ = అయ్యి; తపస్ = తపస్సు; నియమ = నియమములతో; ప్రయత్నులు = ప్రవర్తించెడివారు; ఐ = అయ్యి; నిష్ఠ = పూనిక; చేత = వలన;
నిర్మల = స్వచ్ఛమైన; ఆత్మకులు = ఆత్మలు గలవారు; ఐనట్టి = అయినటువంటి; ధర్మపరుల్ = ధర్మనిష్ఠుల; కున్ = కు; అమరుల్ = దేవతల; కున్ = కు; పుణ్య = పుణ్యులు యైన; మునుల్ = మునుల; కున్ = కు; అంబుజాక్షు = నారాయణుని {అంబుజాక్షుడు - అంబుజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులుగలవాడు)} భూరి = అతిగొప్ప; కైవల్య = మోక్షపధము; సంప్రాప్తి = లభ్యమగుటకు; మూలము = మూలకారణము; ఐన = అయిన; భక్తి = భక్తి; వీని = ఇతని; కిన్ = కి; పోలెన్ = వలె; ఏర్పాటు = సంభవింప; లేదు = లేదు.
భావము:- అని శుకమహర్షి చెప్పగా విని పరీక్షిత్తు “యోగీంద్రా! వృత్రుని వృత్తాంతం విన్నది మొదలు నా హృదయం ఆశ్చర్యంతో కళవళపడుతున్నది. రజోగుణం, తమోగుణం ప్రధానంగా ప్రవర్తించే పాపాత్ముడైన వృత్రునికి నారాయణుని పాదపద్మాలపై భక్తి ఎలా సంభవించింది? సత్త్వగుణ సంపన్నులు, సమబుద్ధులు, తపోనిష్ఠులు, నిర్మల స్వభావులు, ధర్మమూర్తులు అయిన మహానుభావులకు, దేవతలకు, మహర్షులకు సైతం లభించని మోక్షానికి మూలకారణమైన భగవద్భక్తి పరమ రాక్షసుడైన వీనికి ఎలా పట్టుబడింది?

తెభా-6-442-సీ.
భూస్థలిఁ గల రేణువులకన్న దట్టమై-
డు నొప్పు జీవసంములు గలవు;
జీవములలో నరయ ధర్మాయత-
తి వసించినవారు నుజజాతి;
మనుష్యులలోనఁ గామంబుఁ బెడఁబాసి-
మోక్షార్థు లగువారు మొదల నరిది;
మోక్షమార్గం బాత్మమూలంబుగా నుండు-
వారిలో ముక్తులు లేరు తఱచు;

తెభా-6-442.1-తే.
ముక్తు లై నట్టి వారిలో యుక్తిఁ దలఁపఁ
జాల దుర్లభుఁ డమిత ప్రశాంతి పరుఁడు
రమ సుజ్ఞాన నిరతుండు ద్రగుణుఁడు
మణ శ్రీవాసుదేవపరాయణుండు.

టీక:- భూస్థలిన్ = భూమండలమున; కల = ఉన్నట్టి; రేణువులు = ఇసుక రేణువులు; కన్నన్ = కంటెను; దట్టము = సాంద్రత గలది; ఐ = అయ్యి; కడున్ = మిక్కిలి; ఒప్పు = ఒప్పెడి; జీవ = ప్రాణుల; సంఘములు = జాతులు; కలవు = ఉన్నవి; ఆ = ఆ; జీవముల్ = ప్రాణుల; లోనన్ = అందు; అరయన్ = చూడగా; ధర్మ = ధర్మముతో; ఆయత = కూడిన; మతి = బుద్ధి; వహించిన = ధరించిన; వారు = వారు; మనుజ = మానవ; జాతి = జాతి; ఆ = ఆ; మనుష్యుల్ = మానవుల; లోనన్ = అందును; కామంబున్ = కామమును; ఎడబాసి = విడిచిపెట్టి; మోక్షార్థులు = ముక్తిని కోరెడివారు; అగు = అయిన; వారు = వారు; మొదలన్ = ముందే; అరిది = దుర్లభము; మోక్ష = ముక్తి; మార్గంబున్ = పథమును; ఆత్మ = తమకు; మూలంబుగాన్ = ముఖ్యమైనదిగా; ఉండు = ఉండెడి; వారి = వారి; లోన్ = అందు; ముక్తులు = మోక్షము సాధించినవారు; లేరు = లేరు; తఱచున్ = ఎక్కువగా;
ముక్తులు = మోక్షము సాధించినవారు; ఐనట్టి = అయినట్టి; వారి = వారి; లోన్ = అందు; యుక్తిదలపన్ = తరచిచూసినచో; చాలన్ = మిక్కిలి; దుర్లభుడు = దొరకనివాడు; అమిత = మిక్కిలి; ప్రశాంతి = అత్యంత శాంత గుణుడు; పరమ = అత్యుత్తమమైన; సు = మంచి; జ్ఞాన = జ్ఞానమున; నిరతుండు = మిక్కిలి యాసక్తి గలవాడు; భద్ర = శుభములైన; గుణుడు = గుణములు గలవాడు; రమణన్ = మనోజ్ఞముగా; శ్రీ = శోభనకరమైన; వాసుదేవ = నారాయణుని యెడల {వాసుదేవ - ఆత్మలందు వసించెడి దేవుడు, విష్ణువు}; పరాయణుండు = లగ్నమైనవాడు.
భావము:- ఈ భూతలంపై రేణువుల కంటె అధిక ప్రమాణంలో ప్రాణి సముదాయం ఉన్నది. ఆ ప్రాణులలో ధర్మమార్గాన్ని అతిక్రమించకుండా ఉండేవారు మానవులు. అటువంటి మనుష్యులలో కూడా కామ ప్రవృత్తిని విడిచి మోక్షాన్ని కోరేవారు తక్కువగా ఉంటారు. అటువంటి మోక్షార్థులలో సైతం మోక్షలక్ష్మిని కైవసం చేసుకున్నవారు అరుదు. ఆ విధంగా ముక్తులైన వారిలో కూడా శాంత స్వభావం కలిగి జ్ఞానవంతుడై, సుగుణవంతుడై శ్రీమన్నారాయణ భక్తి పరాయణుడైనవాడు మిక్కిలి దుర్లభుడు.

తెభా-6-443-తే.
కలలోకాపకారి దుస్సంగతుండు
వృత్రుఁ డే క్రియ సుజ్ఞాన వేది యయ్యె?
మరమునఁ బౌరుషంబుచే మరవిభుని
నెట్లు మెప్పించె? దీని నాకెఱుఁగఁ జెపుమ."

టీక:- సకల = సర్వ; లోక = లోకములకు; అపకారి = అపకారములు చేయువాడు; దుస్సంగతుండు = చెడ్డ సహవాసములు గలవాడు; వృత్రుడు = వృత్రుడు; ఏ = ఏ; క్రియన్ = విధముగ; సుజ్ఞాన = దివ్యజ్ఞానము; వేది = తెలిసినవాడు; అయ్యెన్ = అయ్యెను; సమరమునన్ = యుద్ధభూమి నందు; పౌరుషంబునన్ = పౌరుషము చూపుటలో; అమరవిభుని = ఇంద్రుని {అమరవిభుడు - అమరుల (దేవతల) విభుడు (ప్రభువు), ఇంద్రుడు}; ఎట్లు = ఏ విధముగ; మెప్పించెన్ = మెప్పించెను; దీనిన్ = దీనిని; నా = నా; కున్ = కు; ఎఱుగన్ = తెలియునట్లు; చెపుము = చెప్పుము.
భావము:- సకల లోక కంటకుడు, దుస్సాంగత్యం కలవాడు అయిన వృత్రాసురునికి ఇంతటి దివ్యమైన జ్ఞానం ఎలా లభించింది? రణరంగంలో ధర్మయుక్తమైన పౌరుషంతో ఇంద్రుణ్ణి ఎలా మెప్పించ గలిగాడు? ఈ విషయమంతా నాకు వివరంగా చెప్పు”