పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/కృష్ణనిర్యాణంబు వినుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-1-359-క.
"మ సారథి, మన సచివుడు,
వియ్యము, మన సఖుండు, న భాంధవుఁడున్,
విభుడు, గురుడు, దేవర,
లను దిగనాడి చనియె నుజాధీశా!

టీక:- మన = మన యొక్క; సారథి = మార్గదర్శకుడు, రథసారథి; మన = మనకు; సచివుడు = మంత్రాంగము చెప్పువాడు; మన = మన యొక్క; వియ్యము = వియ్యంకుడు; మన = మనకు; సఖుండు = స్నేహితుడు; మన = మనకు; భాంధవుఁడున్ = బంధువు; మన = మన యొక్క; విభుడు = వైభవమునకు కారకుడును; గురుడు = పెద్ద; దేవర = దేవతా స్వరూపుడును; మనలను = మనలను; దిగనాడి = విడిచిపెట్టి; చనియెన్ = వెళ్ళిపోయాడు; మనుజాధీశా = రాజా {మనుజాధీశుడు - మనుజులకు అధీశుడు, రాజు}.
భావము:- "ఏం చెప్పమంటారు మహారాజా! మనకు సారథ్యం చేసేవాడు, తోడుగా ఉండి మంత్రాంగం చెప్పేవాడు, సన్నిహితంగా ఉండే వియ్యంకుడు, తోడునీడలా ఉండే స్నేహితుడు, మేలుకోరే మేన బావ, వెన్నుదన్నుగా ఉండే ప్రభువు, ఆదరించే ఇంటి పెద్ద, కాపాడే దేవుడు ఐన కృష్ణుడు మనలని వదలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా”

తెభా-1-360-క.
కంకులు నృపులుసూడఁగ,
మింటం గంపించు యంత్రమీనముఁ గోలన్
గెంటించి మనము వాలుం
గంటిం జేకొంటి మతని రుణన కాదే?

టీక:- కంటకులు = శత్రువులు {కంటకులు - ముండ్లవంటి వారు, శత్రువులు}; నృపులున్ = రాజులు {నృపులు - నరులను పాలించువారు, రాజులు}; చూడఁగ = చూస్తుండగా; మింటన్ = పైన ఆకాశములో; కంపించు = కదులుతున్న; యంత్ర = (మత్య) యంత్రమందు ఉన్న; మీనమున్ = చేపను; కోలన్ = బాణముతో; గెంటించి = పడగొట్టి; మనము = మనము; వాలుంగంటిన్ = ద్రౌపదిని {వాలుగంటి - వాలుచూపులు ఉన్నది, స్త్రీ (ద్రౌపది)}; చేకొంటిమి = వివాహమాడితిమి; అతని = అతని యొక్క; కరుణన = దయవలననే; కాదే = కదా.
భావము:- శత్రురాజు లందరూ కళ్లు అప్పగించి చూస్తూ ఉండగా ఆకాశాన తిరిగే మత్స్యయంత్రాన్ని గురిపెట్టి కొట్టి మనం పాంచాలరాజు పుత్రిని పరిణయమాడింది ఆ కరుణామయుని కటాక్షం వల్లనే కదా!

తెభా-1-361-క.
దండిననేకులతో నా
ఖంలుఁ డెదు రయిన గెలిచి ఖాండవవనముం
జండార్చికి నర్పించిన
గాండీవము నిచ్చెఁ జక్రి లుగుట నధిపా!

టీక:- దండిన్ = దండకారణ్యములో; అనేకుల = అనేకమంది; తోన్ = తో; ఆఖండలుఁడు = ఇంద్రుడు {ఆఖండలుడు - పర్వతములను ఖండించినవాడు, ఇంద్రుడు}; ఎదురయిన = ఎదుర్కొనినను; గెలిచి = గెలిచి; ఖాండవమున్ = ఖాండవ వనమును; చండార్చి = భయంకరమైన అగ్ని, అగ్నిదేవుని; కిన్ = కి; అర్పించిన = సమర్పించిన; గాండీవమున్ = గాండీవమును; ఇచ్చెన్ = ఇచ్చెను; చక్రి = చక్రాయుధుడు, కృష్ణుడు; కలుగుట = ఉండుట వలననే; అధిపా = గొప్పవాడా.
భావము:- గండర గండడై, అమర సమూహంతో ఆఖండలుడు ఎదురై నిల్చినా, గెల్చి ఖాండవవనాన్ని అగ్నిదేవునికి అర్పించి, గాండీవాన్ని గైకొన్నది ఆ చక్రధరుని చలువ వల్లనే కదా.

తెభా-1-362-క.
దిక్కుల రాజుల నెల్లను
క్కించి ధనంబు గొనుట, యకృతసభ ము
న్నెక్కుట, జన్నము సేయుట,
నిక్కము హరి మనకు దండ నిలిచినఁ గాదే?

టీక:- దిక్కుల = దిక్కుల కల; రాజులను = రాజులను; ఎల్లను = అందరిని; మక్కించి = గెలిచి; ధనంబున్ = ధనమును; కొనుట = తీసుకొనుట; మయ = మయునిచేత; కృత = కట్టబడిన; సభ = సభా భవనమును; మున్ను = ముందు; ఎక్కుట = అధిరోహించుట; జన్నము = యజ్ఞము; సేయుట = చేయుట; నిక్కమున్ = నిజమునకు; హరి = కృష్ణుడు; మన = మన; కున్ = కు; దండన్ = ప్రాపుగ; నిలిచినన్ = నిలబడుటవలననే; కాదే = కాదా.
భావము:- నానా దిశలలోని నరనాథులను సమరంలో జయించి అశేష ధనరాసులను కైవసం చేసుకొన్నదీ, మయసభను అందుకొన్నదీ, రాజసూయ మహాయాగం నిర్వర్తించిందీ నిజానికి ఆ వాసుదేవుడు మనకు బాసటగా నిల్చినందువల్లనే కదా!

తెభా-1-363-మ.
జిద్వీర్య! మఖాభిషిక్తమగు నీ యిల్లాలి ధమ్మిల్లమున్
లో శాత్రవు లీడ్చినన్, ముడువకా చంద్రాస్య దుఃఖింపఁగా,
యం బిచ్చి, ప్రతిజ్ఞ సేసి భవదీయారాతికాంతా శిరో
రశ్రీల హరింపఁడే విధవలై సౌభాగ్యముల్ వీడఁగన్?

టీక:- ఇభజిత్ = సింహమువంటి {ఇభజిద్వీర్యుడు - ఏనుగును జయించు సింహమువంటి పరాక్రమము కలవాడు}; వీర్య = పరాక్రమము కలవాడా; మఖ = యజ్ఞమునందు; అభిషిక్తము = స్నానము చేసినది; అగు = అయినట్టి; నీ = నీయొక్క; ఇల్లాలి = భార్య యొక్క; ధమ్మిల్లమున్ = కొప్పు, జుట్టుముడిని; సభ = సభ; లోన్ = లో; శాత్రవు = శత్రువులు; ఈడ్చినన్ = ఈడ్చి లాగగ; ముడువక = ముడి వేసుకొనక; ఆ = ఆ; చంద్రాస్య = సుందరి {చంద్రాస్య - చంద్రుని వంటి ముఖము కలామె, స్త్రీ}; దుఃఖింపఁగాన్ = బాధ పడుతుండగ; అభయంబు = శరణు; ఇచ్చి = ఇచ్చి; ప్రతిజ్ఞ = ప్రతిన; సేసి = చేసి; భవదీయ = నీయొక్క; ఆరాతి = శత్రువుల; కాంతా = స్త్రీల యొక్క; శిరోజ = తలవెంట్రుకలను; భర = భారము అను; శ్రీలన్ = సంపదలను, శోభను; హరింపఁడే = పోగొట్టలేదా; విధవలు = భర్త పోయినవాళ్ళు, ముండమోపులు; ఐ = అయి; సౌభాగ్యముల్ = సౌభాగ్యములు {సౌభాగ్యములు - సౌభాగ్య చిహ్నములైన తలకట్టు తిలక ధారణాదులు}; వీడఁగన్ = తొలగిపోగా.
భావము:- సింహపరాక్రముడైన మహారాజా రాజసూయ మహాయజ్ఞంలో అభిషేకపూతమైన నీ యిల్లాలి కబరీభరాన్ని పట్టి లాగి ఈడ్చుకొని వచ్చి నిండు సభలో నీ శత్రువులు అవమానించి నప్పుడు ఆ సతి ఆక్రోశించగా, ఆమెకు అభయమిచ్చి దీక్ష వహించి, నీ శత్రుకాంతల శిరోజ వైభవాన్ని వారి సౌభాగ్యాన్ని హరించి మనకు జయం చేకూర్చిన ఆప్తబంధుడు ఆయనే కదా!

తెభా-1-364-శా.
వైరుల్ గట్టిన పుట్టముల్ విడువఁగా, వారింప నా వల్లభుల్
రారీవేళ, నుపేక్ష సేయఁ దగవే, రావే, నివారింపవే?
లే రే త్రాతలు కృష్ణ! యంచు సభలో లీనాంగి యై కుయ్యిడం
గారుణ్యంబున భూరివస్త్రకలితంగాఁ జేయఁడే ద్రౌపదిన్?

టీక:- వైరుల్ = శత్రువులు; కట్టిన = కట్టుకొన్న; పుట్టముల్ = వస్త్రములను; విడువఁగా = విప్పుతుండగా; వారింపన్ = ఆపుటకు; నా = నాయొక్క; వల్లభుల్ = భర్తలు; రారు = వచ్చుటలేదు; ఈ = ఈ; వేళన్ = సమయమును; ఉపేక్షన్ = ఆలస్యమును; చేయన్ = చేయుటకు; తగవే = తగదు; రావే = రమ్ము; నివారింపవే = అడ్డగింపుము; లేరు = లేరు; ఏ = ఏ; త్రాతలు = రక్షించేవారు; కృష్ణా = కృష్ణా; అంచున్ = అంటూ; సభ = సభ; లోన్ = లోపల; లీన = ఒదిగిన; అంగి = శరీరము కలది; ఐ = అయి; కుయ్యిడన్ = మొరపెట్టుకొనగా; కారుణ్యంబున = దయతో; భూరి = అత్యధికములు అయిన {భూరి - మిక్కిలి పెద్ధ సంఖ్య, 1 తరువాత 32 సున్నాలు}; వస్త్ర = వస్త్రములు; కలితంగాన్ = కలిగినది అగునట్లుగ; చేయఁడే = చేయలేదా ఏమి; ద్రౌపదిన్ = ద్రౌపదిని.
భావము:- ఆనాటి మహాసభలో క్రూరాత్ములై కౌరవులు బట్టలు విప్పేటప్పుడు నా వల్లభులు నన్ను ఉపేక్షించారు. ఇక నీవే నన్ను రక్షించాలి, రావే రక్షించవే అని పాంచాలి లజ్జాసంకుచితాంగియై ప్రార్థించినప్పుడు చీరలిచ్చి కారుణ్యంతో కాపాడాడు కదా!

తెభా-1-365-సీ.
దుర్వాసుఁ డొకనాడు దుర్యోధనుఁడు వంపఁ-
దివేల శిష్యులు క్తిఁ గొలువఁ
నుదెంచి, మనముఁ బాంచాలియుఁ గుడిచిన-
వెనుక నాహారంబు వేఁడికొనినఁ,
బెట్టెద ననవుడుఁ బెట్టకున్న శపింతు,-
నుచుఁ దోయావగామున కేఁగఁ,
డవల నన్న శాములు దీఱుటఁ జూచి,-
పాంచాలపుత్రిక ర్ణశాల

తెభా-1-365.1-తే.
లోనఁ దలఁచిన విచ్చేసి లోవిలోని
శిష్టశాకాన్నలవముఁ బ్రాశించి, తపసి
కోప ముడిగించి, పరిపూర్ణకుక్షిఁ జేసె,
నిట్టి త్రైలోక్య సంతర్పి యెందుఁ గలఁడు?

టీక:- దుర్వాసుఁడు = దుర్వాసుఁడు; ఒకనాడు = ఒకరోజు; దుర్యోధనుఁడు = దుర్యోధనుఁడు; వంపన్ = పంపగా; పదివేల = పదివేలమంది; శిష్యులు = శిష్యులు; భక్తిన్ = భక్తితో; కొలువన్ = మొక్కుతుండగ; చనుదెంచి = వచ్చి; మనమున్ = మనమందరము; పాంచాలియున్ = ద్రౌపది కూడా {పాంచాలి - పాంచాల దేశ రాకుమారి, ద్రౌపది}; కుడిచిన = తినిన; వెనుకన్ = తరువాత; ఆహారంబున్ = భోజనమును; వేఁడికొనినన్ = భిక్షగా అడిగి; పెట్టెదన్ = పెట్టెదను; అనవుడున్ = అనుడు; పెట్టకున్న = పెట్టకున్న; శపింతున్ = శాపము ఇచ్చెదను; అనుచున్ = అంటూ; తోయ = నీటిలో; అవగాహమున = స్నానముచేయుట; కున్ = కు; ఏఁగన్ = వెళ్ళగా; గడవలన్ = కుండలలో; అన్న = అన్నమును; శాకములు = కూరలును; తీఱుటన్ = నిండుకొనిన, ఖాళీ అగుటను; చూచి = చూసి; పాంచాలపుత్రిక = పాంచాలి {పాంచాలపుత్రిక - పాంచాలదేశ రాకుమారి, ద్రౌపది}; పర్ణశాల = పాక; లోనన్ = లోపల; తలఁచినన్ = స్మరించగ;
విచ్చేసి = వచ్చి; లోవి = వంటపాత్రలు; లోనిన్ = లోపలి; శిష్ట = మంచి; శాకాన్న = శాకాహారములు; లవమున్ = మిగిలిపోయిన పిసరుని; ప్రాశించి = స్వీకరించి; తపసి = తపస్సు చేయువాడు, ముని; కోపము = కోపము; ఉడిగించి = తగ్గించి; పరిపూర్ణ = పూర్తిగా నిండిన; కుక్షిన్ = కడుపు కలవానిగ; చేసెన్ = చేసెను; ఇట్టి = ఇలాంటి; త్రై = మూడు; లోక్య = లోకములకును; సంతర్పి = సంతృప్తిని కలిగించగలవాడు; ఎందున్ = ఎక్కడ; కలఁడు = ఉన్నాడు.
భావము:- ఒకనాడు ముక్కోపి అయిన దుర్వాసుడు దుర్యోధన ప్రేరితుడై పదివేల మంది శిష్యులతో మన వద్దకు వచ్చాడు, అప్పటికే మన మందరమూ, పాంచాలీ భుజించాము. ఆ సమయంలో ఆ మునీంద్రుడు "మాకు అన్నం పెట్టండి" అని అడిగాడు. పెడతాను అనగా, "పెట్టకపోతే శాపం పెడతాను"అంటూ చరచరా నదికి స్నానానికి సాగిపోయాడు. అప్పుడు పర్ణశాలలోకి పోయి పాంచాలి పాత్రలన్నీ పరికించి చూచింది. ఎక్కడా ఒక్క కూరముక్క కూడా కన్పించలేదు. ఆమె నిశ్చల హృదయంతో ఆ మహానుభావుణ్ణి తలచుకొంది. తక్షణం ఆ దయామయుడు ప్రత్యక్షమై, గిన్నిలో మిగిలి ఉన్న పిసరు తిన్నాడు. అంతే, మునీశ్వరుల కడుపులన్నీ నిండిపోయాయి. వారు శాంతించి తేనుపులు తేనుస్తూ వెళ్లిపోయారు. సంకల్పమాత్రం చేతనే ముల్లోకాలకూ సంతుష్టి కలిగించే అటువంటి మహానుభావుడు మనకు మరెక్కడ దొరుకుతాడు.

తెభా-1-366-సీ.
పందికై పోరాడ ఫాలాక్షుఁ డెవ్వని-
లమున నా కిచ్చెఁ బాశుపతము?
నెవ్వని లావున నిమ్మేన దేవేంద్రు-
పీఠార్ధమున నుండ బెంపుఁ గంటిఁ?
గాలకేయ నివాతవచాది దైత్యులఁ-
జంపితి నెవ్వని సంస్మరించి?
గోగ్రహణము నాఁడు కురుకులాంభోనిధిఁ-
డచితి నెవ్వని రుణఁ జేసి?

తెభా-1-366.1-ఆ.
ర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల
లలపాగ లెల్లఁ డవి తెచ్చి
యే మహాత్ము బలిమి నిచ్చితి విరటుని
పుత్రి యడుగ బొమ్మపొత్తికలకు?

టీక:- పంది = వరాహము; కై = కోసము; పోరాడ = యుద్ధము చేయగ; ఫాలాక్షుఁడు = శివుడు {ఫాలాక్షుడు - ఫాలమునందు కన్ను కలవాడు, శివుడు}; ఎవ్వని = ఎవని యొక్క; బలమునన్ = శక్తివలన; నాకు = నాకు; ఇచ్చెన్ = ఇచ్చెను; పాశుపతమున్ = పాశుపతాస్త్రము; ఎవ్వని = ఎవనియొక్క; లావునన్ = శక్తివలన; ఈ = ఈ; మేనన్ = శరీరముతో; దేవేంద్రు = దేవేంద్రుని; పీఠ = సింహాసనము; అర్ధమున = సగములో {పీఠార్ధము - అర్ధసింహాసన మిచ్చుట అను గౌరవము.}; ఉండన్ = ఉండేటట్టి; పెంపున్ = గొప్పదనమును; కంటిన్ = పొందితిని; కాలకేయ = కాలకేయులు; నివాతకవచ = నివాతకవచులు {నివాతకవచుడు = బాణములచే ఛేదింపబడని కవచము కలవాడు}; ఆది = మొదలగు; దైత్యులన్ = రాక్షసులను; చంపితిన్ = సంహరించితిని; ఎవ్వని = ఎవనిని; సంస్మరించి = సంస్మరణ చేసి; గో = గోవులను; గ్రహణము = పట్టుకుపోవుచున్న; నాఁడు = రోజు; కురు = కౌరవ; కుల = వంశము అను; అంభోనిధిన్ = సముద్రమును; గడచితిన్ = దాటితిని; ఎవ్వని = ఎవనియొక్క; కరుణన్ = దయ; చేసి = వలన;
కర్ణ = కర్ణుడు; సింధురాజ = సైంధవుడు; కౌరవేంద్ర = దుర్యోధనుడు; ఆదుల = మొదలగువారి; తలల = శిరములందున్న; పాగలు = (తల) పాగాలు (వస్త్రాభరణములు); ఎల్లన్ = అన్నిటిని; తడవి = చేతులతో నిమురుట ద్వారా వెదకి; తెచ్చి = తీసుకొనివచ్చి; ఏ = ఏ; మహాత్ము = గొప్ప ఆత్మకలవాని; బలిమిన్ = శక్తివలన; ఇచ్చితి = ఇచ్చితిని; విరటుని = విరాటరాజు; పుత్రిక = కూతురు, ఉత్తర; అడుగన్ = అడగగ; బొమ్మ = ఆటబొమ్మల; పొత్తికల = పొత్తికల {పొత్తికల -పురుటికందులు, బొమ్మలు మొదలగువాని కొరకు వాడు మెత్తని గుడ్డలు}; కున్ = కోసము.
భావము:- అన్నా ఆ నాడు వరాహం కోసం సాగిన సమరంలో ఫాలనేత్రుని వల్ల పాశుపత మహాస్త్రాన్ని ఆయన దయవల్లనే కదా అందుకొన్నాను. త్రిలోకాధిశుడైన దేవేంద్రుని అర్ధసింహాసనాన్ని అయన అనుగ్రహం వల్లనే కదా అధిష్ఠింప గలిగాను. కాలకేయులు, నివాతకవచులు మొదలైన రాక్షసులను ఆ మహనీయుని బలం వల్లే కదా పరిమార్చాను. ఉత్తర గోగ్రహణ సందర్భంలో పొంగి వచ్చిన కౌరసేనావాహినిని ఆయన కరుణాకటాక్షం వల్లనే కదా దాట గలిగాను. ఆనాడు బొమ్మ పొత్తికలకు వస్త్రములు తెమ్మని ఉత్తర అడిగితే కర్ణ సైంధవ సుయోధనాదుల తలపాగలు తెచ్చి ఆమె ముద్దు చెల్లించగలిగింది ఆ పరమ పురుషుని దయవల్లనే కదా.

తెభా-1-367-మ.
గురుభీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశచక్రంబులో,
గురుశక్తిన్ రథయంత యై, నొగలపైఁ గూర్చుండి, యా మేటి నా
ముల్ వాఱక మున్న, వారల బలోత్సాహాయు రుద్యోగ త
త్పతల్ చూడ్కుల సంహరించె, నమితోత్సాహంబు నా కిచ్చుచున్.

టీక:- గురు = గురువు, ద్రోణుడు; భీష్మ = భీష్ముడు; ఆదులున్ = మొదలగువారు; కూడి = కలిసి; పన్నిన = రచించిన; కురు = కౌరవవంశపు; క్షోణీశ = రాజుల; చక్రంబు = (సైనికుల) దండు; లోన్ = లో; గురు = గొప్ప; శక్తిన్ = శక్తితో; రథయంత = సారథి; ఐ = అయి (ఉండి); నొగల = రథమునకు ముందు భాగము; పైన్ = మీద; కూర్చుండి = కూర్చొని; ఆ = ఆ; మేటి = సమర్థుడు; నా = నాయొక్క; శరముల్ = బాణములు; వాఱక = వాడక; మున్న = ముందే; వారల = వారియొక్క; బల = బలము; ఉత్సాహ = ఉత్సాహము; ఆయుస్ = అయువు; ఉద్యోగ = ప్రయత్నములు; తత్పరతల్ = లక్ష్యములను; చూడ్కులన్ = చూపులతోనే; సంహరించెన్ = నాశనముచేసెను; అమిత = మిక్కిలి; ఉత్సాహంబున్ = ఉత్సాహమును; నాకు = నాకు; ఇచ్చుచున్ = ఇచ్చుచు.
భావము:- (అర్జునుడు ద్వారకనుంచి వచ్చి శ్రీకృష్ణనిర్యాణం చెప్పలేకచెప్తు తమ జీవనసారథిని తలుస్తున్నాడు.) భీష్మ ద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం చేస్తు, రథం నొగలపై కూర్చుండి నేను బాణ పరంపరలను వర్షింపక ముందే, తన చూపులతో శత్రువుల శక్తినీ, ఉత్సాహాన్నీ, ఆయుర్దాయాన్నీ, తదేకదీక్షనూ అపహరించి, నాకు అమితానందాన్ని అందించిన విజయ సారథి ఆయనే కదా!

తెభా-1-368-మ.
సురేంద్రుం డొనరించు కృత్యములు ప్రహ్లాదుం బ్రవేశించి గె
ల్వ మర్థంబులు గాని కైవడిఁ; గృపాశ్వత్థామ, గాంగేయ, సూ
ర్యసుత, ద్రోణ ధనుర్విముక్త బహుదివ్యాస్త్రప్రపంచంబు నా
దెకున్ రాక తొలంగె మాధవు దయాదృష్టిన్ నరేంద్రోత్తమా!

టీక:- అసురేంద్రుండు = దానవులకు అధిపతి, హిరణ్యకశిపుడు; ఒనరించు = చేయించు; కృత్యములు = పనులు; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; ప్రవేశించిన్ = చేరినప్పటికిని; గెల్వ = గెలుచుటకు; సమర్థంబులున్ = సామర్థ్యములు కలవి; కాని = కాకుండెడిని; కైవడిన్ = వలె; కృప = కృపాచార్యుడు; అశ్వత్థామ = అశ్వత్థామ; గాంగేయ = భీష్ముడు {గాంగేయుడు - గంగ యొక్క పుత్రుడు, భీష్ముడు}; సూర్యసుత = కర్ణుడు {సూర్యసుత - సూర్యుని కుమారుడు, కర్ణుడు}; ద్రోణ = ద్రోణుని యొక్క; ధనుస్ = ధనుస్సుల నుండి; విముక్త = వదలబడిన; బహు = అనేకమైన; దివ్య = గొప్ప; అస్త్ర = అస్త్రములు అను; ప్రపంచంబున్ = పెద్ద సముదాయము; నా = నా; దెస = వైపు; కున్ = నకు; రాక = రాకుండగ; తొలంగెన్ = పక్కకుపోయినవి; మాధవు = కృష్ణుని {మాధవుడు - మాధవి భర్త, విష్ణువు}; దయా = దయతోకూడిన; దృష్టిన్ = చూపులు వలననే; నరేంద్రోత్తమ = మహారాజ {నరేంద్రోత్తముడు -ఉత్తముడైన నరులకింద్రుడు రాజు, మహారాజు}.
భావము:- మహారాజా! పూర్వం హిరణ్యకశిపుని క్రూరకృత్యాలు ప్రహ్లాదుని విషయంలో విఫలములైనట్లే, భీష్మద్రోణ కర్ణ కృప అశ్వత్థామల ధనుస్సుల నుంచి వెలువడిన నానావిధములైన శస్త్రాస్త్రాలు నా మీదకు రాకుండా ఆ మాధవుని దయాధృక్కులతో ప్రక్కకు తొలగి పోయాయి.

తెభా-1-369-చ.
సుమతి దివ్యబాణముల వ్రక్కలు వాపి కొలంకు సేసి, నా
ములు మాటుగాఁ బఱపి థ్యములన్ రిపు లెల్లఁ జూడ సా
మున నీటఁ బెట్టితి రణావని సైంధవుఁ జంపునాఁడు, నా
సురవిరోధి భద్రగతి నండయి వచ్చినఁ గాదె? భూవరా!

టీక:- వసుమతిన్ = భూమిని; దివ్య = గొప్ప; బాణముల = బాణములతో; వ్రక్కలు = పగుళ్ళు; వాపి = కొట్టి; కొలంకు = కొలను; సేసి = తయారుచేసి; నారసములు = బాణములు {నారసములు - నారినుండి వెలువడునవి, బాణములు}; మాటుగాన్ = అడ్డము ఉండేలాగ; పఱపి = వేసి; రథ్యములన్ = గుఱ్ఱములను; రిపులు = శత్రువులు; ఎల్లన్ = అందరును; చూడ = చూచుచు ఉండగ; సాహసమున = సాహసముతో; నీటన్ = నీటిలో; పెట్టితి = పెట్టితిని; రణావనిన్ = యుద్ధభూమిలో; సైంధవున్ = సైంధవుని; చంపు = సంహరించు; నాఁడు = దినమున; నాకు = నాకు; అసురవిరోధి = కృష్ణుడు; భద్ర = కాపాడే; గతిన్ = విధముగ; అండ = రక్షణ, ప్రాపు; అయి = అయి; వచ్చినన్ = రావటమువలననే; కాదె = కదా; భూవరా = రాజా {భూవరుడు - భూమికి భర్త రాజు}.
భావము:- వసుమతీ వల్లభా! సైంధవుని వధించే ఆ నాటి రణరంగంలో శత్రువులు కళ్లారా చూస్తుండగానే నా దివ్య బాణాలతో భూమిని వ్రయ్యలు చేసి జలాశయాన్ని కల్పించి, బాణముల చాటున, అలసి సొలసిన నా రథాశ్వాలకు దప్పిక తీర్చింది; ఆ దయామయుని అండవల్లనే కదా!

తెభా-1-370-సీ.
చెలికాఁడ రమ్మని చీరు న న్నొకవేళ,-
న్నించు నొకవేళ ఱఁది యనుచు,
బంధుభావంబునఁ బాటించు నొకవేళ,-
దాతయై యొకవేళ నము లిచ్చు,
మంత్రియై యొకవేళ మంత్ర మాదేశించు,-
బోధియై యొకవేళ బుద్ధి సెప్పు,
సారథ్య మొనరించుఁ నవిచ్చి యొకవేళఁ,-
గ్రీడించు నొకవేళ గేలి సేయు,

తెభా-1-370.1-తే.
నొక్క శయ్యాసనంబున నుండుఁ, గన్న
తండ్రి కైవడిఁ జేసిన ప్పుఁ గాచు,
స్తములు వట్టి పొత్తున నారగించు,
నుజవల్లభ! మాధవు ఱవ రాదు.

టీక:- చెలికాఁడ = మిత్రుడా; రమ్ము = రా; అని = అని; చీరున్ = పిలుచును; నన్ను = నన్ను; ఒక = ఒక; వేళ = సమయమందు; మన్నించున్ = గౌరవించును; ఒక = ఒక; వేళ = సమయమందు; మఱఁది = బావమరిది, చెల్లెలు భర్త; అనుచు = అనుచును; బంధు = చుట్టరికపు; భావంబునన్ = భావమును, ఆత్మీయతను; పాటించు = వ్యవహరించును; ఒక = ఒక; వేళ = సమయమందు; దాత = దానమిచ్చువాడు; ఐ = అయ్యి; ఒక = ఒక; వేళ = సమయమున; ధనములు = ధనములను; ఇచ్చు = ఇచ్చును; మంత్రి = మంత్రి {మంత్రి - మంత్రాంగమున సహాయము చేయువాడు}; ఐ = అయ్యి; ఒక = ఒక; వేళ = సమయమందు; మంత్రము = ఆలోచనా వ్యూహము; ఆదేశించు = ఆజ్ఞాపించును; బోధి = బోధించువాడు; ఐ = అయ్యి; ఒక = ఒక; వేళ = సమయమందు; బుద్ధి = నీతి; చెప్పు = చెప్పు; సారథ్యము = రథసారథ్యము; ఒనరించున్ = చేయును; చనవు = అనురాగము; ఇచ్చి = ఇచ్చి; ఒక = ఒక; వేళన్ = సమయమందు; క్రీడించున్ = ఆటలాడును; ఒక = ఒక; వేళ = సమయమందు; గేలి = ఎగతాళి; చేయు = చేయును; ఒక్క = ఒకే;
శయ్యాసనంబున = పాన్పునందు; ఉండున్ = ఉండును; కన్న = జన్మనిచ్చిన; తండ్రి = తండ్రి; కైవడిన్ = వలె; చేసిన = చేసిన; తప్పున్ = తప్పులను; కాచు = కాయును; హస్తములున్ = చేతులు; వట్టి = పట్టుకొని; పొత్తునన్ = కలిసి; ఆరగించు = భుజించు; మనుజవల్లభ = రాజా {మనుజవల్లభ - మానవులకు భర్త, రాజు}; మాధవు = కృష్ణుని యొక్క {మాధవుడు - మాధవి భర్త, విష్ణువు}; మఱవ = మరచు విధము; రాదు = చేతకాదు.
భావము:- ఆ వాసుదేవునికి నేనంటే ఎంత ప్రేమ ఒక మాటు చెలికాడా రా రమ్మని పిలిచేవాడు. ఒకమాటు ముద్దుల మరదీ అని ముద్దు చేసేవాడు, ఒకమాటు ఆత్మబంధువై ఆదరించేవాడు. ఒకమాటు ఔదార్యమూర్తియై బహుధనాలు బహూకరించేవాడు. ఒకమాటు మంత్రియై హితోపదేశం చేసేవాడు. ఔదార్యమూర్తియై బహుధనాలు బహూకరంచేవాడు. ఒకమాటు మంత్రియై హితోపదేశం చేసేవాడు. ఒకమాటు గురువై కర్తవ్యాన్ని బోధించేవాడు. మరొకమాటు సారథియై చనువు చూపేవాడు. ఒకమాటు కూడి ఆటలాడుతూ విహరించేవాడు, వేరొకమాటు ఆత్మీయుడై హాస్యమాడుతూ ఆటలు పట్టించేవాడు. ఇంకొక మాటు ఒకే ప్రక్కమీద కూర్చోపెట్టుకొని కన్నతండ్రి వలె నా తప్పులు సరిదిద్దేవాడు. మరొకమాటు నా చేతులు పట్టుకొని బలవంతం చేసి పొత్తున ఆరగింప జేసేవాడు. అటువంటి మన ముద్దులబావ అయిన మాధవుణ్ణి మరచిపోవటం ఎలా మహారాజా.

తెభా-1-371-క.
వియ, ధనంజయ, హనుమ
ద్ధ్వ, ఫల్గున, పార్థ, పాండునయ, నర, మహేం
ద్ర, మిత్రార్జున, యంచును
భుములు తలకడవ రాకపోకలఁ జీరున్.

టీక:- విజయ = అర్జున {విజయ - విజయము కలవాడు, అర్జున}; ధనంజయ = అర్జున {ధనంజయ - (దిగ్విజయమున) ధనమును గెలిచిన వాడు, అర్జున }; హనుమద్ధ్వజ = అర్జున {హనుమద్వజ - హనుమంతుని జండాపై కలవాడు, అర్జున }; ఫల్గున = అర్జున {ఫల్గున - ఉత్తర ఫల్గుని నక్షత్రము నందు పుట్టినవాడు, వేగముగా పాదరసం వలె ప్రసరించువాడ, అర్జున }; పార్థ = అర్జున {పార్థుడు - పృథాదేవి (కుంతి) పుత్రుడు, అర్జునుడు}; పాండుతనయ = అర్జున {పాండుతనయా - పాండురాజు పుత్రా, అర్జున }; నర = అర్జున {నర - నరనారాయణులలో నరుడా, అర్జున}; మహేంద్రజ = అర్జున {మహేంద్రజ - మహేంద్రుని పుత్రా, అర్జున}; మిత్ర = మిత్రుడ, {మిత్రుడు = కొలతలు వేయుటలో నేర్పరి, సూర్యుని వలె నిస్వార్థం గలవాడు, అర్జునుడు}; అర్జున = అర్జున {అర్జునా - తెల్లని వాడా, అర్జున}; అంచును = అనుచును; భుజములున్ = చేతులు; తలకడవన్ = అతిక్రమించగా, చాచి; రాకపోకలన్ = రాకపోకలందు; చీరున్ = పిలుచును.
భావము:- అటు ఇటు తిరుగుతున్నప్పుడల్లా చేతులు చాచి ఆప్యాయంగా తట్టుతు విజయ, ధనంజయ, హనుమద్ధ్వజ, ఫల్గున, పార్థ, పాండుతనయ, నర, మహేంద్రజ, మిత్రమ, అర్జున అంటు రకరకాలుగా చనువుగా నన్ను పిలిచేవాడు కదా!

తెభా-1-372-క.
వారిజగంధులు దమలో
వారింపఁగరాని ప్రేమ వాదము సేయన్,
వారిజనేత్రుఁడు ననుఁ దగ
వారిండ్లకుఁ బనుపు నలుక వారింప నృపా!

టీక:- వారిజగంధులున్ = సుందరీమణులు {వారిజగంధులు - నీట పుట్టినది (పద్మము) వంటి సువాసన కలవారు, పద్మినీజాతి స్త్రీలు}; తమ = తమ; లోన్ = మధ్యన; వారింపఁగరాని = తీర్చలేని; ప్రేమ = ప్రణయ; వాదమున్ = కలహమును; చేయన్ = చేయగా; వారిజనేత్రుఁడు = కృష్ణుడు {వారిజనేత్రుఁడు - పద్మములవంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; ననున్ = నన్ను; తగన్ = తగ, సరిగ; వారి = వారియొక్క; ఇండ్ల = నివాసముల; కున్ = కు; పనుపున్ = పంపును; అలుక = అలక (కోప విశేషము); వారింప = పోగొట్టుటకు; నృపా = రాజా {నృప - నరులను పాలించువాడు, రాజు}.
భావము:- అప్పుడప్పుడు తనకు అంతఃపుర కాంతలతో ప్రణయకలహం సంభవించినప్పుడు వారి పొలయలుకను తీర్చటం కోసం నన్ను బ్రతిమాలి వారి యిండ్లకు పంపే వారిజాక్షుని ఏ విధంగా విస్మరించగలం? ప్రభూ!

తెభా-1-373-క.
నిచ్చలు లోపలికాంతలు
చ్చికఁ దనతోడ నాడు మాటలు నాకున్
ముచ్చటలు సెప్పు మెల్లన
విచ్చలవిడిఁ దొడలమీఁద విచ్చేసి నృపా!

టీక:- నిచ్చలు = ఎల్లప్పుడు; లోపలి = అంతఃపురము లోపలి; కాంతలు = స్త్రీలు; మచ్చికన్ = చనువు కొద్దీ; తన = తన; తోడన్ = తో; ఆడు = మాట్లాడు; మాటలు = మాటలు; నాకున్ = నాకు; ముచ్చటలు = ముచ్చటగా, సరదా కబుర్లుగా; చెప్పున్ = చెప్పును; మెల్లన = మెల్లని స్వరముతో; విచ్చలవిడిన్ = స్వతంత్రముగా; తొడలమీఁద = మోకాళ్ళమీద; విచ్చేసి = వచ్చి; నృపా = రాజా {నృప - నరులను పాలించువాడు, రాజు}.
భావము:- తాను చనువుగా నా చెంత చేరి, నా ఒడిలో కూర్చొని, నిత్యమూ తన ప్రియురాళ్లకూ తనకూ మధ్య జరిగే రహస్య సంభాషణలన్నీ పూసగ్రుచ్చినట్లు మెల్లగా నా చెవిలో చెప్పేవాడు.

తెభా-1-374-చ.
మటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడు సూడుమా
యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటం
టుతర దేహలోభమునఁ బ్రాణములున్నవి వెంటఁబోక, నేఁ
కట! పూర్వజన్మమునఁ ర్మము లెట్టివి చేసినాఁడనో?

టీక:- అటమటము = గజిబిజి, వృథా; అయ్యెన్ = అయ్యెను; నా = నా యొక్క; భజనము = పూజలు; అంతయు = మొత్తము అంతా; భూవర = భూమికి భర్తా, రాజా; నేఁడు = ఇవాళ; సూడుమా = చూడవోయి; ఇటువలె = ఇలా; గారవించు = ఆదరించు, గారాబము చేయు; జగధీశుఁడు = జగత్తునకు ఈశుడు; కృష్ణుఁడు = కృష్ణుడు; లేని = లేకపోయిన; పిమ్మటన్ = తరువాత కూడ; పటుతర = చాలా గట్టిదైన {పటు - పటుతరము - పటుతమము}; దేహ = శరీరము మీది; లోభమునన్ = పిసినారితనముతో, మమకారముతో; ప్రాణములు = ప్రాణములు; ఉన్నవి = ఉన్నవి; వెంటన్ = కూడా; పోకన్ = వెళ్ళకుండగనే; నేన్ = నేను కటకట = అయ్యయ్యో; పూర్వ = క్రిందటి; జన్మమునన్ = జన్మలలో; కర్మములు = పాపం పనులు; ఎట్టివి = ఎలాంటివి; చేసినాఁడనో = చేసానో.
భావము:- అయ్యయ్యో! నా సేవ అంతా నిరర్థకం అయిపోయింది మహాప్రభో! చూడు ఇవాళ, ఇలా ఆప్యాయంగా నన్ను ఆదరించే విశ్వేశ్వరుడు, శ్రీకృష్ణుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక కూడ ఇంకా నా ప్రాణాలు ఆయన వెంట పోకుండ ఉన్నాయి. దేహం మీద ఇంతటి లోభం ఉందంటే పూర్వ జన్మలలో ఎంతటి పాపకృత్యాలు చేసానో కదా!

తెభా-1-375-శా.
కాంతారంబున నొంటి దోడుకొని రాఁగాఁ జూచి గోవిందు శు
ద్ధాంస్త్రీలఁ బదాఱువేల, మదరాగాయత్తులై తాఁకి నా
చెంతన్ బోయలు మూఁగి పట్టికొన, నా సీమంతినీ సంఘమున్
భ్రాంతిన్ భామిని భంగి నుంటి విడిపింపన్ లేక; ధాత్రీశ్వరా!

టీక:- కాంతారంబునన్ = అడవిలో; ఒంటిన్ = ఒంటరిగా; తోడుకొని = తీసుకొని; రాఁగాన్ = వస్తుండగ; చూచి = చూసి; గోవిందు = కృష్ణుని {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; శుద్ధాంత = అంతఃపుర; స్త్రీలన్ = స్త్రీలను; పదాఱువేల = పదహారువేలమంది; మద = మదముతోను; రాగ = కామముతోను; ఆయత్తులు = నిండినవారు; ఐ = అయి; తాఁకి = ముట్టడించి; నా = నా; చెంతన్ = దగ్గరగ; బోయలు = బోయవాళ్ళు; మూఁగి = చుట్టూ ముసురుకొని; పట్టికొనన్ = పట్టికొనగా; ఆ = ఆ; సీమంతినీ = అంతఃపురములో నుండు స్త్రీల; సంఘమున్ = సమూహమును; భ్రాంతిన్ = భ్రమతో; భామిని = ఆడుదాని; భంగిన్ = వలె; ఉంటిన్ = ఉండిపోతిని; విడిపింపన్ = విడిపించగా; లేక = లేక, రాక; ధాత్రీశ్వరా = రాజా, ప్రభూ {ధాత్రీశ్వరుడు - భూమికి ప్రభువు, రాజు}.
భావము:- ఆ మహానుభావుడు తనువు చాలించిన అనంతరం ఆయన అంతఃపురకాంతలను పదహారువేలమందినీ వెంటబెట్టుకొని వస్తుండగా అరణ్యమధ్యంలో మదోన్మత్తులైన కిరాతులు చుట్టుముట్టి పట్టుకొన్నారు. వారి బారినుండి ఆ నారీమణులను కాపాడలేక ఆడుదానిలాగా విస్తుపోయి కళ్లప్పగించి చూస్తూ ఊరుకొన్నాను.

తెభా-1-376-శా.
తే, రా రథికుండు, నా హయము, లా స్త్రాసనం, బా శర
వ్రాతం, బన్యులఁ దొల్లి జంపును, దుదిన్ వ్యర్థంబు లైపోయె; మ
చ్చేతోధీశుఁడు చక్రి లేమి భసితక్షిప్తాజ్య మాయావి మా
యాతంత్రోషరభూమిబీజముల మర్యాదన్ నిమేషంబునన్.

టీక:- ఆ = అదే; తేరు = రథము; ఆ = అదే; రథికుండున్ = రథమునెక్కిన వీరుడు; ఆ = అదే; హయములు = గుఱ్ఱములు; ఆ = అదే; అస్త్రాసనంబు = విల్లు; ఆ = అదే; శర = అస్త్రముల; వ్రాతంబు = సమూహము; అన్యులన్ = పరులను; తొల్లి = ఇంతకుముందు; చంపును = సంహరిస్తుండేవి; తుదిన్ = చిట్టచివరకి, ఆఖరికి; వ్యర్థంబులు = నిరుపయోగములు; ఐపోయెన్ = అయిపోయినవి; మత్ = నా యొక్క; చేతస్ = మనసునకు, ప్రజ్ఞకు; అధీశుండు = అధిపతి; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధుడు - కృష్ణుడు}; లేమి = లేకపోవుటచేత; భసిత = బూడిదలో; క్షిప్త = చిమ్మబడిన; ఆజ్య = నేయియును; మాయావి = ఐంద్రజాలికుని; మాయాతంత్ర = గారడీయును; ఊషరభూమి = చవిటిపఱ్ఱలో చల్లిన; బీజముల = విత్తనములును; మర్యాదన్ = వలె; నిమేషంబునన్ = నిమిషములో.
భావము:- (అర్జునుడు శ్రీకృష్ణ నిర్యాణానంతంరం వెనుకకు హస్తిన చేరి అన్నగారు ధర్మరాజువద్ద వాపోతున్నాడు.) ఆత్మేశ్వరుడు చక్రధారి యైన శ్రీకృష్ణుడు లేకపోడంతో ఆ రథం, ఆ రథంపై నున్న నేను, ఆ గుఱ్ఱాలు, ఆ విల్లంబులు శత్రుసంహారకా లైన అవన్ని ఇదివరకటివే అయినా నిరుపయోగ మైపోయాయి. అన్నీ బూడిదలో పోసిన నెయ్యిలా, మాయావి యందు ప్రయోగించిన మాయలా, చవిటిపఱ్ఱ ఐన పొలంలో చల్లిన విత్తనాల్లా తుదకు అన్ని క్షణకాలంలో నిరర్థకాలు అయిపోయాయి.

తెభా-1-377-మ.
దువీరుల్ మునినాథుశాపమునఁ గాలాధీనులై, యందఱున్
దిరాపాన వివర్ధమాన మదసమ్మర్దోగ్ర రోషాంధులై
నంబుల్ దమలోన ముష్టిహతులం గావించి నీఱైరి న
ష్టశం జిక్కిరి నల్వు రేవు రచటన్ ర్వంసహావల్లభా!

టీక:- యదు = యాదవ; వీరుల్ = వీరులు; మునినాథు = దూర్వాసుని; శాపమునన్ = శాపము వలన; కాల = కాలమునకు; ఆధీనులు = లొంగినవారు; ఐ = అయి; అందఱున్ = అందరును; మదిరా = మద్యమును; పాన = త్రాగుటచేత; వివర్ధమాన = పెచ్చుపెరిగిన; మద = మదముతోను; సమ్మర్ద = ఘర్షణలతోను; ఉగ్ర = భయంకరమైన; రోష = రోషముతోను, కినుకతోను; అంధులు = గ్రుడ్డివారు; ఐ = అయి; కదనంబుల్ = యుద్ధములు; తమలోన = తమలోతామే; ముష్టి = పిడికిలి; హతులన్ = పోటులను; కావించి = చేసుకొని; నీఱైరి = భస్మమైరి; నష్ట = నశించే; దశన్ = అవస్థను; చిక్కిరి = తగ్గిరి, కృశించిరి, తగులుకొనిరి; నల్వురు = నలుగురేసి; ఏవురు = ఐదుగురేసి; అచటన్ = అక్కడ; సర్వంసహావల్లభా = ప్రభూ {సర్వంసహావల్లభుడు - భూమికిరాజా, ప్రభూ}.
భావము:- ధరణీవల్లభా! ఇంతకు ముందు మీరు పేర్కొన్న యాదవ వీరులంతా విధివైపరీత్యం వల్ల మునిశాపోపహతులై, వారందరూ మద్యపానం చేసిన మత్తులో మైమరిచి, ఆగ్రహావేశంతో ద్వేషరోషాలతో కన్నూ మిన్నూ కానక తమలో తాము పోరాడుకొన్నారు. ముష్టిఘాతాలతో పరస్పరం కొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొన్నారు. పోయినవారు పోగా నలుగు రైదుగురు మాత్రం ఎలాగో బ్రతికి బయటపడ్డారు.

తెభా-1-378-క.
భూములవలన నెప్పుడు
భూములకు జన్మ మరణ పోషణములు ని
ర్ణీములు సేయుచుండును
భూమయుం డీశ్వరుండు భూతశరణ్యా!

టీక:- భూతముల = జీవుల; వలనన్ = వలన; ఎప్పుడు = ఎప్పుడును; భూతముల = తోటి జీవుల; కున్ = కు; జన్మ = పుట్టుకలు; మరణ = మరణములు; పోషణములు = పోషణములను; నిర్ణీతములు = నిర్ణయించుటలు; చేయుచుండును = చేయుచుండును; భూత = సర్వభూతములలో; మయుండు = నిండి ఉండువాడు; ఈశ్వరుండు = భగవంతుడు; భూతశరణ్యా = రాజా {భూతశరణ్య – ఆశ్రయించిన ప్రజలకు శరణము ఇచ్చువాడు, రాజు}.
భావము:- ఆశ్రితవత్సలా! అన్నా! ధర్మరాజా! పరమేశ్వరుడు సర్వభూతాంతర్యామి. ఆయన ప్రాణులకు సృష్టి స్థితి సంహారాలు తోటి ప్రాణుల వలననే కలుగజేస్తు ఉంటాడు. (అర్జునుడు అన్న ధర్మరాజుకి కృష్ణనిర్యాణము తెలుపుతు ఆప్తునిగా భగవంతునిగా స్మరిస్తున్న సందర్భంలోది ఈ పద్యం.)

తెభా-1-379-క.
ములు గల మీనంబులు
విరహితమీనములను క్షించు క్రియన్
వంతు లయిన యదువులు
రహితులఁ జంపి రహితభావముల నృపా!

టీక:- బలములు = బలము; కల = కలిగిన; మీనంబులు = చేపలు; బల = బలము; విరహిత = లేని; మీనములను = చేపలను; భక్షించు = తినెడి; క్రియన్ = విధముగ; బల = బలము; వంతులు = కలవారు; అయిన = అయినట్టి; యదువులు = యాదవులు; బల = బలము; రహితులన్ = లేనివారిని; చంపిరి = సంహరించిరి; అహిత = శత్రు; భావముల = భావములతో; నృపా = రాజా {నృప - నరులను పాలించువాడు, రాజు}.
భావము:- పెద్దచేపలు అనేక చిన్నచేపలను గుట్టుక్కున మింగుతాయి. అలా యాదవులలో బలవంతులు తమలో తాము తమకంటే బలహీను లందరిని పగబట్టినట్లు చంపేసారు. అవును జీవులు జీవుల వలననే పుట్టింపబడతారు; పోషింపబడతారు; అంతరింపబడతారు కదా! (ఆవిధంగా అనితరసాధ్యు లైన యాదవులు తుడుచుపెట్టుకుపోయా రని ద్వారకనుండి తిరిగి వచ్చిన అర్జునుడు అన్నగారికి తెలిపాడు.)

తెభా-1-380-మ.
హీనాంగులకున్ బలాధికులకుం బ్రత్యర్థి భావోద్యమం
బులు గల్పించి, వినాశమున్ నెఱపి, యీ భూభారముం బాపి, ని
శ్చబుద్ధిం గృతకార్యుఁడై చనియె; నా ర్వేశ్వరుం, డచ్యుతుం,
ఘుం, డేమని చెప్పుదున్ భగవదాత్తంబు పృథ్వీశ్వరా!

టీక:- బల = బలము; హీన = తక్కవగా కల; అంగుల = అంగములు కలవారి; కున్ = కిని; బల = బలము; అధికుల = అధికముగా కలవారి; కున్ = కిని; ప్రత్యర్థి = శత్రుత్వ; భావ = భావము యొక్క; ఉద్యమంబులు = ఉద్యమములు, ప్రయత్నములు; కల్పించి = ఏర్పరచి; వినాశమున్ = వినాశమును; నెఱపి = వ్యాపింపజేసి; ఈ = ఈ; భూ = భూమి యొక్క; భారమున్ = భారమును; పాపి = పొగొట్టి; నిశ్చల = నిశ్చలమైన; బుద్ధిన్ = బుద్ధితో; కృత = చేయవలసినది; కార్యుఁడు = చేసినవాడు; ఐ = అయి; చనియెన్ = దేహము వదలి వెళ్ళిపోయెను; ఆ = ఆ; సర్వేశ్వరుండు = కృష్ణుడు {సర్వేశ్వరుండు - సర్వులకును ఈశ్వరుడు, కృష్ణుడు}; అచ్యుతుండు = కృష్ణుడు {అచ్యుతుండు - నాశములేనివాడు, కృష్ణుడు}; అలఘుండు = కృష్ణుడు {అలఘుండు - (ఏవిధముగను) తక్కువ కాని వాడు, కృష్ణుడు}; ఏమి = ఎమిటి; అని = అని; చెప్పుదున్ = చెప్పమన్నావు; భగవత్ = భగవంతుని; ఆయత్తంబు = ఆధీనము; పృథ్వీశ్వరా = ప్రభువా {పృథ్వీశ్వరుడు - పృథివికి ఈశ్వరుడు, రాజు}.
భావము:- పృథ్వీనాథా! బలవంతులైన వారికీ బలహీనులైన వారికీ నడుమ పగలు కల్పించి, పరస్పర సంహారం చేయించి, ఈ భూభారాన్ని తీర్చి ఆ అచ్యుతుడు, ఆ అప్రమేయుడు, ఆ అఖిలేశ్వరుడు, ఆ శ్రీకృష్ణుడు వచ్చిన కార్యం పూర్తి చేసుకొని నిబ్బరంగా, నిశ్చలంగా వెళ్లిపోయాడు. ఇంకా ఏమి చెప్పేది ఆ సర్వేశ్వరుని సంకల్పం ప్రకారం జరిగిపోయింది.