పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/చంద్రవం శారంభము

వికీసోర్స్ నుండి

చంద్రవంశారంభము

తెభా-9-375-ఆ.
"చంద్రగౌరమైన చంద్రవంశమునందుఁ
జంద్రకీర్తితోడ నిత మైన
ట్టి పుణ్యమతుల నైళాది రాజుల
నింక వినుము మానవేంద్రచంద్ర!

టీక:- చంద్ర = చంద్రునివలె; గౌరము = స్వచ్ఛమైనట్టిది; ఐన = అయినట్టి; చంద్రవంశమున్ = చంద్రవంశము; అందున్ = లో; చంద్ర = ఆచంద్రార్కమైన; కీర్తి = యశస్సు; తోడన్ = తోటి; జనితము = కలిగునవారు; ఐన = అయిన; అట్టి = అటువంటి; పుణ్యమతులన్ = పుణ్యాత్ములను; ఐళ = పురూరవుడు {ఐళుడు - ఇళ (బుధుని భార్య) యొక్క పుత్రుడు, పురూరవుడు}; ఆది = మున్నగు; రాజుల = రాజులను; ఇంకన్ = మరి; వినుము = వినుము; మానవేంద్రచంద్ర = మహారాజ.
భావము:- “ఓ పరీక్షిత్తు రాజచంద్ర! చంద్రవంశం చంద్రునివలె స్వచ్ఛ మైనది. ఆ చంద్రవంశంలో పుట్టిన ఆ చంద్రార్క కీర్తిమంతుడు పుణ్యాత్ముడు అయిన పురూరవుడు మున్నగు రాజుల గురించి చెప్తాను. శ్రద్ధాగా విను.

తెభా-9-376-సీ.
క వేయితలలతో నుండు జగన్నాథు-
బొడ్డుఁ దమ్మిని బ్రహ్మ పుట్టె; మొదల
తనికి గుణముల తనిఁ బోలిన దక్షుఁ-
గు నత్రి సంజాతుఁ య్యె; నత్రి
డగంటి చూడ్కులఁ లువలసంగడీఁ-
డుదయించి విప్రుల కోషధులకు
మరఁ దారాతతి జుని పంపున నాథుఁ-
డై యుండి రాజసూయంబు చేసి

తెభా-9-376.1-తే.
మూఁడులోకములను గెల్చి మోఱకమున
ని బృహస్పతి పెండ్లాముఁ జారుమూర్తిఁ
దార నిలుచొచ్చి కొనిపోయి న్ను గురుఁడు
వేడినందాక నయ్యింతి విడువఁ డయ్యె.

టీక:- ఒక = ఒక; వేయి = వెయ్యి; తలలు = శిరస్సులు; తోనుండు = కలిగుండెడి; జగన్నాథున్ = విష్ణుమూర్తియొక్క; బొడ్డు = నాభి యనెడి; తమ్మిన = కమలమునందు; బ్రహ్మా = బ్రహ్మదేవుడు; పుట్టెన్ = జనించెను; మొదలన్ = ముందరగా; అతని = అతని; కిన్ = కి; గుణములన్ = లక్షణములలో; అతనిన్ = అతనిని; పోలిన = పోలియుండెడి; దక్షుడు = సమర్థుడు; అగు = ఐన; అత్రి = అత్రి; సంజాతుండు = పుట్టినవాడు; అయ్యెన్ = అయ్యెను; అత్రి = అత్రియొక్క; కడగంటి = కటాక్షపు; చూడ్కులన్ = చూపులందు; కలువలసంగడీడు = చంద్రుడు; ఉదయించి = పుట్టి; విప్రుల = బ్రాహ్మణులు; ఓషధుల్ = ఓషధుల; కున్ = కు; అమరన్ = చక్కగా; తారా = నక్షత్రముల; తతి = సమూహముల; కిన్ = కు; అజుని = బ్రహ్మదేవునియొక్క; పంపునన్ = ఆనతిమేర; నాథుడు = ప్రభువు; ఐ = అయ్యి; ఉండి = ఉండి; రాజసూయంబున = రాజసూయయజ్ఞము; చేసి = చేసి.
మూడులోకములనున్ = ముల్లోకములను; గెల్చి = జయించి; మోఱకమునన్ = మూర్ఖత్వముతో; చని = వెళ్లి; బృహస్పతి = బృహస్పతియొక్క; పెండ్లామున్ = భార్యను; చారుమూర్తిన్ = అందగత్తెను; తారన్ = తారను; ఇలు = ఇంటిలో; చొచ్చి = ప్రవేశించి; కొనిపోయి = తీసుకెళ్ళి; తన్నున్ = అతనిని; గురుడు = బృహస్పతి; వేడినన్న = అడిగినను; ఆ = ఆ; ఇంతిన్ = స్త్రీని; విడువడు = వదలనివాడు; అయ్యెన్ = అయ్యెను.
భావము:- సహస్రశీర్ష పురుషుడు అయిన శ్రీమహావిష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు జనించాడు. ముందరగా అతనికి తనని పోలిన గుణవంతుడు అత్రి పుట్టాడు. అత్రి కడగంటి చూపు లందు చంద్రుడు పుట్టాడు. బ్రహ్మదేవుని ఆనతిమేర చంద్రుడు బ్రాహ్మణులు ఓషధులు నక్షత్రాలులకు రాజు అయ్యాడు. అతను రాజసూయయాగం చేసి, ముల్లోకాలను జయించాడు. బృహస్పతి అందమైన భార్య తారను మూర్ఖత్వంతో తీసుకుపోయాడు. బృహస్పతి అడిగినా వదలలేదు.

తెభా-9-377-వ.
అంత వేల్పులతో రక్కసులకుఁ గయ్యం బయ్యె; బృహస్పతితోడి వైరంబునం జేసి, రాక్షసులుం దానును శుక్రుండు చంద్రునిం జేపట్టి సురాచార్యునిం బోఁదోలిన, హరుండు భూతగణసమేతుండై, తన గురుపుత్రుండైన బృహస్పతిం జేపట్టె; దేవేంద్రుండు సురగణంబులుం దానును బృహస్పతికి నడ్డంబు వచ్చె; నయ్యవసరంబున బృహస్పతి భార్యానిమిత్తంబున రణంబు సురాసుర వినాశకరం బయ్యె; నాలోన బృహస్పతి తండ్రి యగు నంగిరసుండు చెప్పిన విని, బ్రహ్మదేవుండు వచ్చి చంద్రుని గోపించి, గర్భిణియైన తారను మరల నిప్పించినం జూచి బృహస్పతి దాని కిట్లనియె.
టీక:- అంతన్ = అంతట; వేల్పులు = దేవతల; తోన్ = తోటి; రక్కసుల్ = రాక్షసుల; కున్ = కు; కయ్యంబున్ = యుద్ధము; అయ్యెన్ = జరిగినది; బృహస్పతి = బృహస్పత్; తోడి = తోటి; వైరంబునన్ = శత్రుత్వము; రాక్షసులున్ = రాక్షసులు; తానునున్ = అతను; శక్రుండు = శుక్రుడు; చంద్రునిన్ = చంద్రుని; చేపట్టి = పక్షముజేరి; సురాచార్యునిన్ = బృహస్పతిని {సురాచార్యుడు - దేవతల గురువు, బృహస్పతి}; పోదోలినన్ = వెళ్ళగొట్టగా; హరుండు = పరమశివుడు; భూతగణ = భూతగణములతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; తన = తనయొక్క; గురువు = అంగిరసుని {శివుని గురువు అంగిరసుడు అతని కొడుకు బృహస్పతి}; పుత్రుండు = కుమారుడు; ఐన = అయిన; బృహస్పతిన్ = బృహస్పతిని; చేపట్టెన్ = పక్షము చేరెను; దేవేంద్రుండు = ఇంద్రుడు; సుర = దేవతల; గణంబులున్ = గణములు; తానునున్ = అతను; బృహస్పతి = బృహస్పతి; కిన్ = కి; అడ్డంబున్ = అండగా; వచ్చెన్ = వచ్చను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; బృహస్పతి = బృహస్పతియొక్క; భార్యా = భార్య; నిమిత్తంబున = విషయమై; రణంబున్ = యుద్ధము; సురా = దేవతలను; అసుర = రాక్షసులను; వినాశకరంబు = నాశనముచేయునది; అయ్యెన్ = అయినది; ఆలోనన్ = ఇంతలో; బృహస్పతి = బృహస్పతియొక్క; తండ్రి = తండ్రి; అగు = ఐన; అంగిరసుండు = అంగిరసుడు; చెప్పినన్ = చెప్పగా; విని = విని; బ్రహ్మదేవుండు = బ్రహ్మదేవుడు; వచ్చి = వచ్చి; చంద్రునిన్ = చంద్రుని; కోపించి = కోపపడి; గర్భిణి = కడుపుతోనున్నామె; ఐన = అయిన; తారను = తారను; మరల = వెనుకకు; ఇప్పించినన్ = ఇప్పించగా; చూచి = చూసి; బృహస్పతి = బృహస్పతి; దాని = ఆమె; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇంతలో దేవదానవ యుద్ధం వచ్చింది. దేవ గురువు బృహస్పతితో ఉన్న శత్రుత్వం వలన రాక్షస గురువు శుక్రుడు చంద్రుడి పక్షం చేరి బృహస్పతిని వెళ్ళగొట్టాడు. పరమశివుడు భూతగణాలతో సహా తన గురువు అంగిరసుని కుమారుడైన బృహస్పతి పక్షంలో చేరాడు. అతను, ఇంద్రుడు, దేవతాగణాలు బృహస్పతికి అండగా వచ్చాయి. ఆ సమయమలో బృహస్పతి భార్య గురించి దేవరాక్షస యుద్ధం ఉభయ పక్షాలకు నాశనకరం అయింది. అంతట, అంగిరసుడు చెప్పగా బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుని కోపపడి, కడుపుతో ఉన్న తారను వెనుకకు ఇప్పించాడు. బృహస్పతి ఆమెతో ఇలా అన్నాడు.

తెభా-9-378-ఉ.
"సిగ్గొకయింతలేక వెలచేడియ కైవడి ధర్మకీర్తులన్
బొగ్గులు చేసి జారు శశిఁ బొంది కటా! కడుపేల దెచ్చుకొం
టెగ్గుదలంపఁగా వలదె? యిప్పుడు గర్భము దించుకొమ్ము నిన్
మ్రగ్గఁగఁ జేసెదం, జెనటి! మానవతుల్ నినుఁ జూచి మెత్తురే?"

టీక:- గ్గు = లజ్జ; ఒకయింత = కొంచమైనను; లేక = లేకుండ; వెలచేడియ = వేశ్య {వెలచేడియ - ధరకు స్త్రీ, వేశ్య}; కైవడిన్ = వలె; ధర్మ = ధర్మమును; కీర్తులన్ = ప్రతిష్టలను; బొగ్గులుచేసి = కాల్చివేసి; జారు = వ్యభిచారి; శశిన్ = చంద్రుని; పొంది = కలిసి; కటా = అయ్యో; కడుపు = గర్భము; ఏలన్ = ఎందుకు; తెచ్చుకొంటి = తెచ్చుకొన్నావు; ఎగ్గు = దోష; తలపన్ = చింత; వలదె = ఉండవద్దా; ఇపుడు = ఇప్పుడు; గర్భమున్ = కడుపును; దించుకొమ్ము = తీసేయించుకొనుము; నిన్ = నిన్ను; మ్రగ్గఁగజేయెదన్ = నిలువునాకాల్చెదను; చెనటి = చెడ్డదాన; మానవతుల్ = శీలవతులు; నినున్ = నిన్ను; చూచి = చూసి; మెత్తురే = మెచుచుకోరు.
భావము:- ఓ నీచురాల! ఏమాత్రం లజ్జ లేకుండ వేశ్యలా ధర్మాన్ని ప్రతిష్టని నాశనం చేసావు కదే. వ్యభిచారి చంద్రుడిని ఎందుకు పొందావే. అయ్యో! గర్భం కూడ తెచ్చుకొన్నావు. పాపచింత ఉండక్కరలేదా. ఇప్పుడు గర్బం దించుకో. నిన్ను నిలువునా కాల్చెస్తాను. మానవతులు నిన్ను చూసి మెచ్చుకుంటారా?”