పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/సూర్యాస్తమయ వర్ణన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-10.1-1290-మ.
నారణ్య చరాంధకార గజముం గాలాహ్వయ వ్యాధుఁ డ
చ్చుగఁ బట్టన్ గమకించి మచ్చిడుటకై చూతాంకురశ్రేణిచే
నొగిఁ గల్పించిన కందుకం బనఁగ సూర్యుం డంత వీక్షింపఁగాఁ
గె మందప్రభతోడఁ బశ్చిమ మహాధాత్రీ ధరేంద్రంబునన్.

టీక:- గగన = ఆకాశము అనెడి; అరణ్య = అడవి యందు; చర = తిరుగుతున్న; అంధకార = చీకటి అనెడి; గజమున్ = ఏనుగును; కాల = కాలము అని; ఆహ్వయ = పిలువబడెడి; వ్యాధుడు = వేటగాడు, బోయవాడు; అచ్చుగన్ =ఒప్పుగ; పట్టన్ = పట్టుకొనుటకు; గమకించి = యత్నించి; మచ్చి = ప్రలోభము, ఎర; ఇడుట = పెట్టుట; కై = కోసము; చూత = మామిడి; అంకుర = చిగుళ్ళ; శ్రేణి = సమూహము; చేన్ = చేత; కల్పించిన = ఏర్పరచిన; కందుకంబు = బంతి; అనగన్ = అన్నట్లుగా; సూర్యుండు = సూర్యుడు; అంత = అప్పుడు; వీక్షింపగాన్ = చూచుటకు; తగెన్ = తగి ఉండెను; మంద = తక్కువ, తగ్గిన; ప్రభ = ప్రకాశము; తోడన్ = తోటి; పశ్చిమ = పడమర; మహా = గొప్ప; ధాత్రీధరేంద్రంబునన్ = శ్రేష్ఠమైన కొండమీద {ధాత్రీ ధరము - భూమిని ధరించునది, పర్వతము}
భావము:- కాలమనే వేటగాడు ఆకాశమనే అడవిలో చీకటి అనే ఏనుగును పడదామని పూనుకుని మచ్చు పెట్టుట కోసం తయారుచేసిన మామిడిచిగుళ్ళ కందుకమా అన్నట్లుగా సూర్యుడు మందగించిన కాంతితో పడమటి కొండ మీద ముచ్చట గొలిపాడు.

తెభా-10.1-1291-క.
రుణుఁడగు శీతకిరణుని
రిగి వియల్లక్ష్మి తన్నుమాని ముదుకఁడున్
కరుఁడు ననుచు ద్రొబ్బిన
ణిన్ రవి పశ్చిమాద్రిడఁ గ్రుంకె నృపా!

టీక:- తరుణుఁడు = లేతవయసు కలవాడు; అగు = ఐన; శీతకిరణుని = చంద్రుని {శీతకిరణుని - చల్లని కిరణములు కలవాడు, చంద్రుడు}; మరిగి = వలచినది; ఐ = అయ్యి; వియత్ = ఆకాశము అనెడి; లక్ష్మీ = దేవి, స్త్రీ; తన్ను = తనను; మాని = విడిచిపెట్టి; ముదుకడున్ = వయసు మీరిన వాడు; ఖరకరుడు = సూర్యుడు {ఖర కరుడు - ఖర (తీక్షణమైన) కరుడు (కరములు అను కిరణములు కలవాడు), సూర్యుడు}; అనుచున్ = అని; ద్రొబ్బిన = పడదోసిన; కరణిన్ = విధముగా; రవి = సూర్యుడు; పశ్చిమాద్రి = పడమటికొండ; కడన్ = వద్ద; క్రుంకెన్ = అస్తమించెను; నృపా = రాజా.
భావము:- ఓ రాజా! ఆకాశలక్ష్మి పడుచువాడూ, చల్లని కరములవాడూ అయిన చంద్రుడిని వలచి, వృద్ధుడూ, కరకు కరమువాడూ అంటూ తనను త్రోసిరాజన్న విధంగా భానుడు పడమటి పర్వతం మాటున అస్తమించాడు.

తెభా-10.1-1292-ఆ.
ళలు గలుగుఁ గాక; మల తోడగుగాక;
శివుని మౌళిమీఁదఁ జేరుఁ గాక;
న్యు నొల్లఁ దపనుఁ డైన మత్పతి యని
సాధ్విభంగిఁ గమలజాతి మొగిడె.

టీక:- కళలు = షోడశకళలు, శోభలు; కలుగుగాక = ఉంటే ఉండనిమ్ము; కమల = లక్ష్మీదేవి; తోడు = తోడబుట్టువు; అగుగాక = అయితే అయ్యుండనిమ్ము; శివుని = పరమేశ్వరుని; మౌళి = శిఖ; మీదన్ = పైకి; చేరుగాక = ఎక్కి ఉంటే ఉండనిమ్ము; అన్యున్ = ఇతరుని; ఒల్లన్ = అంగీకరించను; తపనుడు = తపింపజేయువాడు; ఐనన్ = అయినప్పటికి; మత్ = నా యొక్క; పతి = భర్త; అని = అనుచు; సాధ్వి = పతివ్రత; భంగిన్ = వలె; కమలజాతి = కమలముల సమూహము; మొగిడెన్ = ముడుచుకొనెను.
భావము:- చంద్రుడు కళలు కలవాడు అయితే అగు గాక, లక్ష్మీదేవి తోబుట్టువు అయితే అగు గాక, శివుడు నెత్తిని పెట్టుకొన్న వాడు అయితే అగు గాక, (ఎంత గొప్పవాడు అయినా) అన్యుడు అయిన చంద్రుడి పొత్తు మా కక్కర లేదు. తపింప జేసే వాడే అయినప్పటికి, మా భర్త సూర్యుడే అని పతివ్రత వలె పద్మినీజాతి ముడుచు కొంది.

తెభా-10.1-1293-క.
సుంర సాయంసంధ్యా
వంన విప్రార్ఘ్యతోయ జ్రహతోద్య
న్మందేహాసుర రక్త
స్యంము క్రియఁ గెంపుసొం పెసఁగె నపరదిశన్.

టీక:- సుందర = అందమైన; సాయం = సాయంకాలపు; సంధ్యావందన = సంధ్యావందనము చేయు; విప్ర = బ్రాహ్మణునిచే విడువబడిన; అర్ఘ్య = అర్ఘ్యపు; తోయ = జలము లనెడి; వజ్ర = వజ్రాయుధముచేత; హత = చంపబడుటచేత; ఉద్యత్ = పుట్టుచున్న; మందేహ = మందేహు లనెడి; అసుర = రాక్షసుల యొక్క; రక్త = నెత్తుటి; స్యందము = స్రావము; క్రియన్ = వలె; కెంపు = ఎరుపు రంగు చేత; సొంపు = చక్కదనము; ఎసగెన్ = అతిశయించెను; అపర = పడమటి; దిశన్ = దిక్కు నందు.
భావము:- అందమైన ఆ సాయంకాలం బ్రాహ్మణులు సలుపు సంధ్యావందనము, ఆర్ఘ్యప్రదానం అనే వజ్రాయుధంతో కొట్టబడిన మందేహరాక్షసుల రక్తస్రావం వలె పడమటి దిక్కులో ఎఱ్ఱదనం సొంపారింది.

తెభా-10.1-1294-ఆ.
భూమి నిండి మింటఁ బూర్ణమై కర్కట
కర మీనరాశి హితమైన
రియశస్సుధాబ్ధి యందుల తుంపురు
నఁగఁ జుక్క లొప్పె నాకసమున.

టీక:- భూమిన్ = భూలోకమంతా; నిండి = నిండిపోయి; మింటన్ = ఆకాశము అంతటను; పూర్ణము = నిండిపోయినది; ఐ = అయ్యి; కర్కట = కర్కాటక, ఎండ్రకాయలు; మకర = మకర, మొసళ్ళ; మీన = మీన, చేపల; రాశి = నక్షత్రరాశుల, గుంపులచే; మహితము = గొప్పదనము కలది; ఐన = అయినట్టి; హరి = విష్ణుమూర్తి; యశస్సు = కీర్తి; సుధాబ్ధి = పాలసముద్రము; అందుల = లోని; తుంపురులు = నీటిబిందువులు; అనగన్ = అన్నట్లుగా; చుక్కల్ = నక్షత్రములు; ఒప్పెన్ = చక్కగ ఉన్నవి; ఆకసమునన్ = ఆకాశము నందు;
భావము:- భూమ్యాకాశాలు నిండి కర్కట మకర మీనరాశులచే భాసించు నారాయణుడి కీర్తి అనే పాలసముద్రంలోని తుంపరలా అన్నట్లు ఆకాశంలో చుక్కలు మెరిసాయి.
విష్ణువు కీర్తిని పాలసముద్రాన్ని పోలుస్తూ కర్కట అని కర్కాటక రాశిని ఎండ్రకాయలని; మకర అని మకరరాశిని, మొసళ్ళని; మీన అని మీనరాశిని, చేపలను; రాశి అని నక్షత్రరాశులను, గుంపులను స్ఫురింపజేయడంతో పద్యం అందం ఇనుమడించింది.

తెభా-10.1-1295-క.
ల్లదిశలు నిండిన శ్రీ
ల్లభుగుణమహిమ బ్రహ్మ వాసించుటకై
ల్లిన మృగమద మనఁగా
వెల్లివిరిసెఁ దమము గగనవీధుల నెల్లన్.

టీక:- ఎల్ల = అన్ని; దిశలున్ = దిక్కులందు; నిండిన = నిండినట్టి; శ్రీవల్లభు = విష్ణుదేవుని {శ్రీవల్లభుడు - లక్ష్మీదేవి భర్త, విష్ణువు}; గుణ = గొప్పగుణముల; మహిమన్ = మహత్వమును; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; వాసించుట = పరిమళింపజేయుట; కై = కోసము; చల్లిన = చల్లినట్టి; మృగమదము = కస్తూరి; అనగా = అన్నట్లుగా; వెల్లివిరిసెన్ = దట్టముగా వ్యాపించెను; తమము = చీకటి; గగన = ఆకాశపు; వీధులన్ = మార్గము లందు; ఎల్లన్ = అంతటను.
భావము:- సకల దిక్కులలోనూ వ్యాపించిన లక్ష్మీనాథుడి మహిమను పరిమళంప చేయటం కోసం బ్రహ్మదేవుడు చల్లిన కస్తూరి కాబోలు అన్నట్లు ఆకాశవీధులు అన్నింటిలో చీకట్లు ముసురుకున్నాయి.

తెభా-10.1-1296-క.
చీఁకటి వెనుదగిలినఁ
బ్రాచీదిశనుండి గంతు రువున రవి భ
ర్మాలము మలఁక త్రోవను
వే నియెంగాక నిలిచి విఱుఁగక యున్నే.

టీక:- ఆ = ఆ యొక్క; చీకటి = చీకట్లు; వెనుదగిలినన్ = వెంబడించి తరుమగా; ప్రాచీ = తూర్పు; దిశ = దిక్కు; నుండి = నుండి; గంతు = గంతులతోకూడిన; పరువునన్ = పరుగుతో; రవి = సూర్యుడు; భర్మాచలము = మేరుపర్వతపు {భర్మాచలము - బంగారుకొండ, మేరుపర్వతము}; మలకత్రోవను = వంకరదారిలో; వేచనియెన్ = తొందరగా వెళ్ళిపోయెను; కాక = అలాకానిచో; నిలిచి = ఆగి; విఱుగక = ఓడిపోకుండ; ఉన్నే = ఉండునా.
భావము:- చీకటి వెన్నాడుతుండగా రవి తూర్పుదిక్కు నుండి పరుగున గంతులేస్తూ మేరుపర్వతం చుట్టుదారిలో వేగంగా వెళ్ళిపోయాడు. అలా కాకుండా అతడు ఆగి ఉంటే ఈపాటికి వీగిపోయేవాడే.

తెభా-10.1-1297-ఉ.
మీకును వైరి; యెప్పుడును మిక్కిలి మాకును వైరి; రాజు దో
షారుఁ; డింక వచ్చు జలజాతములార! మదీయ బాలురం
జేకొనుఁ డంచు బాలకులఁ జీఁకటి దాఁచిన భంగిఁ జిక్కి రా
రా వసించెఁ దుమ్మెదలు రాత్రి సరోరుహకుట్మలంబులన్.

టీక:- మీ = మీ; కును = కు; వైరి = శత్రువు; ఎప్పుడును = ఎల్లప్పుడు; మిక్కిలి = చాలా ఎక్కువగా; మా = మా; కును = కు; వైరి = శత్రువు; రాజు = చంద్రుడు; దోషాకరుడు = చంద్రుడు {దోషాకరుడు - దోషవర్తనకు అనుకూలమైన రాత్రిని కలిగించువాడు, చంద్రుడు}; ఇంక = ఇక; వచ్చున్ = ఉదయించును; జలజాతములార = ఓ కమలములు; మదీయ = నా యొక్క; బాలురన్ = పిల్లలను; చేకొనుడు = తీసుకోండి; అంచున్ = అని; బాలకులన్ = పిల్లలను; చీకటిన్ = చీకట్లలో; దాచిన్ = దాచిన; భంగిన్ = విధముగా; చిక్కిరి = చిక్కుకొనిరి; ఆ = ఆ యొక్క; రాక = నిండుపున్నమి; వసించెన్ = ఉన్నవి; తుమ్మెదలు = తుమ్మెదలు; రాత్రి = రాత్రి; సరోరుహ = తామరపూల; కుట్మంబులన్ = మొగ్గల యందు.
భావము:- “ఓ తామరమొగ్గలారా! చంద్రుడు మీకు మాకూ శత్రువే. అతడు దోషాకరుడు. అంటే రాత్రిని కలుగజేసేవాడు. అడుగో రాబోతున్నాడు. మా పిల్లలను స్వీకరించి భద్రంగా మీ కడుపులలో పెట్టుకుని కాపాడండి” అంటూ, చీకటి తన పిల్లలను దాచమని అప్పచెప్పాయా అన్నట్లు తుమ్మెదలు తామరమొగ్గలలో చిక్కుకుని వెలుపలికి రాలేక రాత్రి అంతా అక్కడే నివసించాయి.