Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/శయ్యన నుంచుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-145-వ.
ఇట్లు యమున దాఁటి, దూఁటి, చని నందుని మందం జేరి, యం దమంద నిద్రం బొంది, యొడ లెఱుంగని గొల్లలం దెలుప నొల్లక , నిత్యప్రసాద యగు యశోదశయ్య నొయ్యన చిన్నినల్లనయ్య నునిచి, చయ్యన నయ్యవ్వ కూఁతు నెత్తుకొని మరల నింటికిఁ బంటింపక వచ్చి య చ్చిఱుతపాపను దేవకి ప్రక్కం జక్క నిడి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; యమున = యమునానది; దాటి = దాటివేసి; దూటి =చొచ్చి; చని = వెళ్ళి; నందుని = నందుని యొక్క; మందన్ = పల్లెను; చేరి = ప్రవేశించి; అందు = అక్కడ; అమంద = గాఢమైన, మందంకాని; నిద్రన్ = నిద్రను; పొంది = పోయి; ఒడలు = ఒళ్ళు; ఎఱుంగని = తెలియని; గొల్లలన్ = యాదవులకు; తెలుపన్ = తెలియజేయుటకు; ఒల్లకన్ = అంగీకరించకుడా; నిత్య = ఎల్లప్పుడును; ప్రసాద = ప్రసన్నంగా ఉండెడి ఆమె; అగు = ఐన; యశోదన్ = యశోద యొక్క; శయ్యన్ = పక్కమీద; ఒయ్యన్ = త్వరితముగా; చిన్ని = చిన్నపిల్లవాడైన; నల్లనయ్యను = శ్రీకృష్ణుని {నల్లనయ్య - నల్లని అయ్య, కృష్ణుడు}; చయ్యనన్ = చటుక్కున; ఆ = ఆ; అవ్వ = అమ్మ యొక్క; కూతున్ = పుత్రికను; ఎత్తుకొని = చేతులలోకి తీసుకొని; మరలన్ = వెనుకకి; ఇంటి = తన నివాసమున; కిన్ = కి; పంటింపకన్ = సంకోచింపకుండగ; వచ్చి = వచ్చి; ఆ = ఆ; చిఱుత = చిన్ని; పాపను = బిడ్డను; దేవకి = దేవకీదేవి; ప్రక్కన్ = ప్రక్కన; చక్కన్ = చక్కగా; ఇడి = పెట్టి.
భావము:- ఇలా వసుదేవుడు యమునానదిని దాటి వెళ్ళి, హుటాహుటిని నందుని వ్రేపల్లెను ప్రవేశించాడు. అక్కడ మందలోని గొల్లలందరు ఒళ్ళుతెలియని అతిగాఢమైన నిద్రలో ఉన్నారు. వారికి చెప్పడం ఇష్టంలేని వసుదేవుడు తిన్నగా ఎప్పుడు ప్రసన్నంగా ఉండే యశోదాదేవి శయ్య దగ్గరకు వెళ్ళాడు. ఆమె కూడ మైమరచి నిద్రపోతోంది. తన చేతిలోని చిన్నారి నల్లనయ్యను జాగ్రత్తగా పరుండబెట్టి. ఆమె పక్కలోని ఆడపిల్లని ఎత్తుకొని వెనక్కి బయలుదేరాడు. తాత్సారం చేయకుండా వేగంగా తిరిగి వచ్చి దేవకీదేవి పక్కలో చక్కగా పడుకోబెట్టాడు.

తెభా-10.1-146-క.
ముల సంకెల లిడుకొని
దిఁ దలఁకుచు శూరసుతుడు మందుఁడు బోలెన్
బెరుగల రీతి దేహము
లించుచు నొదిఁగియుండె ఱువతనమునన్

టీక:- పదములన్ = కాళ్లకు; సంకెలల్ = సంకెళ్ళు; ఇడికొని = పెట్టుకొని; మదిన్ = మనసునందు; తలకుచు = బెదురుతు; శూరసుతుడు = వసుదేవుడు {శూరసుతుడు - శూరుని యొక్క పుత్రుడు, వసుదేవుడు}; మందుడు = ఏమి ఎరుగనివాని; పోలెన్ = వలె; బెదురు = బెరుకు; కల = ఉన్నట్టి; రీతిన్ = విధముగా; దేహమున్ = శరీరమును; కదిలించుచున్ = వణికించుచు; ఒదిగి = ముడుచుకొని; ఉండెన్ = ఉండెను; గఱువతనమునన్ = గడుసుతనముతో.
భావము:- శూరసేనుని కొడుకైన వసుదేవుడు మనసులో తడబడుతు కాళ్ళకి సంకెళ్ళు తగిలించుకొన్నాడు. అతడు “ఏమి తెలియని వాడిలా, బెదిరిపోతున్న వాడిలా, ఒదిగి ఒదిగి పోతూ, శరీరం వణుకుతున్న వాడిలా” గడుసుగా నటిస్తూ ఉన్నాడు.

తెభా-10.1-147-క.
జాక్షునిఁ దెచ్చుటయును
సుతఁ గొనిపోవుటయును దా నెఱుఁగక మూఁ
గినిద్ర జొక్కియుండెను
జాక్షి యశోద రేయి సుధాధీశా!

టీక:- వనజాక్షునిన్ = శ్రీకృష్ణుని {వనజాక్షుడు - వనజము (పద్మము)ల వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; తెచ్చుటయును = తీసుకొని వచ్చుట; తన = తన యొక్క; సుతన్ = పుత్రికను; కొనిపోవుటయును = తీసుకొని పోవుట; తాన్ = ఆమె; ఎఱుగకన్ = తెలియక; మూగిన్ = ముంచుకొచ్చిన; నిద్రన్ = నిద్ర యందు; చొక్కి = మైమరచిపోయి; ఉండెను = ఉండెను; వనజాక్షి = అందగత్తె {వనజాక్షి - పద్మాక్షి, సుందరి}; యశోద = యశోదాదేవి; రేయి = ఆ రాత్రి; వసుధాధీశ = రాజా {వసుధాధీశుడు - భూమికి ప్రభువు, రాజు}.
భావము:- మహారాజా! పరీక్షిత్తూ! ఆ పద్మాల లాంటి కళ్ళున్న నల్లనయ్యను తీసుకురావడంకాని, తన కూతురును తీసుకుపోవడంకాని ఏమాత్రం ఎరుకలేకుండా యశోదాదేవి మైమరచి కమ్ముకు వచ్చిన నిద్రమైకంలో ఆ రాత్రంతా ఉండిపోయింది. (పద్మాల్లాంటి కళ్ళున్న ఆ యశోదాదేవికి అలాంటి కళ్ళున్న కొడుకు)

తెభా-10.1-148-సీ.
అంత బాలిక యావు ని యేడ్చు చిఱుచప్పు-
డాలించి వేకన నాఁకయింటి
కావలివారు మేల్కని చూచి తలుపుల-
తాళముల్ తొంటివిమున నుండఁ
దెలిసి చక్కన వచ్చి దేవకి నీళ్ళాడె-
మ్ము రమ్మని భోజరాజుతోడఁ
జెప్పిన నాతఁడు చిడిముడి పాటుతోఁ-
ల్పంబుపై లేచి త్తఱమున

తెభా-10.1-148.1-తే.
వెండ్రుకలు వీడఁ బైచీర వ్రేలియాడ
దాల్మి కీలూడ రోషాగ్ని ర్పమాడ
భూరివైరంబుతోఁ గూడఁ బురిటియింటి
జాడఁ జనుదెంచి యా పాపఁ జంపఁ గదియ.

టీక:- అంతన్ = అప్పుడు; బాలిక = ఆ ఆడపిల్ల; ఆవురు = ఆ...; అని = అనుచు; ఏడ్చు = రోదించెడి; చిఱు = చిన్న; చప్పుడున్ = శబ్దమును; వేకనన్ = వేకువజామున; నాకయింటి = చెఱసాల; కావలివారలు = కాపలావాళ్ళు; మేల్కని = నిద్రలేచి; చూచి = పరిశీలనగా చూసి; తలుపుల = ద్వారముల యొక్క; తాళముల్ = బీగములు; తొంటి = ఇంతకు ముందు; విధమునన్ = విధముగానే; ఉండన్ = ఉన్నట్లుగా; తెలిసి = చూసుకొని; చక్కనన్ = చక్కగా; వచ్చి = వచ్చి; దేవకి = దేవకీదేవి; నీళ్ళాడెన్ = ప్రసవించెను; రమ్ము = రా; రమ్ము = రా; అని = అని; భోజరాజు = కంసుని {భోజరాజు - భోజదేశమునకు రాజు, కంసుడు}; తోడన్ = తోటి; చెప్పినన్ = తెలుపగా; ఆతడున్ = అతను; చిడిముడిపాటు = తొట్రుపాటు; తోన్ = తోటి; తల్పంబున్ = మంచము; పైన్ = మీంచి; లేచి = లేచి; తత్తఱమునన్ = తొందరలో.
వెండ్రుకల్ = తలవెంట్రుకలు; వీడన్ = వీడిపోగా; పైన్ = వంటిమీది; చీర = బట్ట; వ్రేలి = వేళ్ళాడుతుండగ; తాల్మి = ధైర్యము; కీలూడన్ = చెదిరిపోగా; రోష = కోపము అనెడి; అగ్నిన్ = అగ్నితోటి; భూరి = అత్యధికమైన; వైరంబున్ = శత్రుత్వము; తోగూడన్ = కలిగియుండి; పురిటియింటి = ప్రసవగృహము; జాడన్ = దారిని; చనుదెంచి = వచ్చి; ఆ = ఆ; పాపన్ = ఆ బిడ్డను; చంపన్ = వధించుటకు; కదియన్ = దగ్గరకురాగానే.
భావము:- అక్కడ మథురలో, అప్పుడు, కారాగారంలో పసిపిల్ల కేరుకేరుమని ఏడ్చింది. ఆ శబ్దం విన్న కావలివారి విష్ణుమాయ వీడిపోడంతో వెంటనే మేల్కొన్నారు. లోపలికి తొంగి చూసారు. తాళాలు అవి మామూలుగా ఉన్నాయని స్థిమితపడ్డారు. వెంటనే కంసుడి దగ్గరకు పరుగెట్టుకొని వెళ్ళి, "దేవకి ప్రసవించింది. తొందరగా ర"మ్మని పిలిచారు. అతడు గాబరాగా మంచం దిగాడు. వెంట్రుకలు చిందర వందరగా వేళ్ళాడుతున్నాయి. పై పంచె నేలమీద జీరాడుతోంది. ఓర్పు నశించి రోషాగ్ని విజృంభిస్తోంది. తీరని శత్రుత్వంతో, వాడు పురుటింటికి పరుగుపెట్టాడు. పసిపాపని చంపేద్దామని దగ్గర కెళ్లాడు.