పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/రామకృష్ణుల ఉపనయనము

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1407-క.
ర్గాది భూసురోత్తమ
ర్గముచే నుపనయనము సుదేవుఁడు స
న్మార్గంబునఁ జేయించెను
నిర్గర్వచరిత్రులకును నిజ పుత్రులకున్.

టీక:- గర్గ = గర్గుడు; ఆది = మున్నగు; భూసుర = బ్రాహ్మణ; ఉత్తమ = శ్రేష్ఠుల; వర్గము = సమూహము; చేన్ = చేత; ఉపనయనము = వడుగు; వసుదేవుడు = వసుదేవుడు; సన్మార్గంబునన్ = మంచి విధానములతో; చేయించెను = చేయించెను; నిర్గర్వ = గర్వము లేనట్టి; చరిత్రుల్ = నడవడిక కలవారి; కును = కి; నిజ = తన; పుత్రుల్ = కుమారుల; కున్ = కు.
భావము:- వసుదేవుడు గర్వరహితమైన చరిత్ర కల తన పుత్రులకు గర్గుడు మొదలైన బ్రాహ్మణ పురోహితుల సన్నిధిలో యథావిధిగా ఉపనయన సంస్కారం జరిపించాడు.

తెభా-10.1-1408-క.
ద్విరాజ వంశవర్యులు
ద్విరాజ ముఖాంబుజోపదిష్టవ్రతులై
ద్విరాజత్వము నొందిరి
ద్విరాజాదిక జనంబు దీవింపంగన్.

టీక:- ద్విజరాజ = చంద్ర {ద్విజరాజు - బ్రాహ్మణులకు ప్రభువు, చంద్రుడు}; వంశ = కులపు; వర్యులు = శ్రేష్ఠులు; ద్విజ = బ్రాహ్మణుల {ద్విజుడు - పుట్టుక ఉపనయనము అనెడి రెండు జన్మలు కలవాడు, విప్రుడు}; రాజ = రాజుల యొక్క; ముఖ = ముఖములనెడి; అంబుజ = కమలముల నుండి; ఉపదిష్ట = ఉపదేశించబడిన; వ్రతులు = వ్రతములు కలవారు; ఐ = అయ్యి; ద్విజ = రెండు జన్మలు కలిగిన {ద్విజ - పుట్టుక ఉపనయనము అనెడి రెండు జన్మలు}; రాజత్వమున్ = రాజు లగుటను; ఒందిరి = పొందిరి; ద్విజ = విప్రులు, పక్షి, నాగ; రాజ = క్షత్రియులు, రాజులు; ఆదిక = మున్నగు; జనంబు = వారు; దీవింపన్ = ఆశీర్వదింపగా.
భావము:- చంద్రవంశజులలో అగ్రగణ్యులై అలరారుతున్న బలరామకృష్ణులు బ్రాహ్మణోత్తముల ముఖకమలాల నుండి ఉపనయన మంత్రాల ఉపదేశములు పొందారు. విప్రులు, రాజులు, గరుత్మంతుడు, ఆదిశేషుడు మొదలైనవారూ దీవెనలీయగా ద్విజత్వం అందుకున్నారు.

తెభా-10.1-1409-వ.
ఉపనయ నానంతరంబున వసుదేవుండు బ్రాహ్మణులకు సదక్షిణంబులుగా ననేక గో హిరణ్యాది దానంబు లొసంగి తొల్లి రామకృష్ణుల జన్మసమయంబు లందు నిజమనోదత్తలైన గోవుల నుచ్చరించి యిచ్చి కామితార్థంబుల నర్థులకుం బెట్టె; నిట్లు బ్రహ్మచారులై.
టీక:- ఉపనయన = వడుగు; అనంతరంబునన్ = అయిన పిమ్మట; వసుదేవుండు = వసుదేవుడు; బ్రాహ్మణుల్ = విప్రుల; కున్ = కు; సదక్షిణంబులు = దక్షిణలతో కూడినవి; కాన్ = అయిన; అనేక = పెక్కు; గో = ఆవులు; హిరణ్య = బంగారము; ఆది = మున్నగు; దానంబులు = దానములు; ఒసంగి = ఇచ్చి, దానముచేసి; తొల్లి = ఇంతకు పూర్వము; రామ = బలరాము; కృష్ణుల = కృష్ణులయొక్క; జన్మ = పుట్టిన; సమయంబుల్ = సమయముల; అందున్ = లో; నిజ = తన; మనః = మనసు నందు; దత్తలు = దానము చేయబడినవి; ఐన = అయిన; గోవులన్ = ఆవులను; ఉచ్చరించి = చెప్పుకొని; ఇచ్చి = దానము చేసి; కామిత = కోరిన; అర్థంబులన్ = కోరికలను; అర్థుల్ = కోరినవారి; కున్ = కి; పెట్టెన్ = ఇచ్చెను; ఇట్లు = ఈ విధముగ; బ్రహ్మచారులు = బ్రహ్మచర్యమున ఉన్నవారు; ఐ = అయ్యి.
భావము:- ఉపనయనము జరిగిన పిమ్మట, వసుదేవుడు విప్రులకు దక్షిణల సహితంగా ధేనువులు, బంగారము మొదలైన అనేక దానాలు చేసాడు. ఇంతకు మునుపు రామకృష్ణులు జననకాలంలో తాను మనస్సులో దానం చేసినట్లు చేసిన సంకల్పం ప్రకారం, ఇప్పుడు ప్రత్యక్షంగా గోవులను ఇచ్చాడు. కోరిన వారికి కోరినట్లు సమస్త వస్తువులూ సమర్పించాడు. ఈ విధంగా బలరామకృష్ణులు బ్రహ్మచర్యవ్రతం అవలంబించి. . .

తెభా-10.1-1410-శా.
ర్విన్ మానవు లెవ్వరైన గురువా క్యోద్యుక్తులై కాని త
త్పూ ర్వారంభము సేయఁ బోల దనుచున్ బోధించు చందంబునన్
ర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై యుండియున్
గుర్వంగీకరణంబు సేయఁ జని; రా గోవిందుఁడున్ రాముఁడున్.

టీక:- ఉర్విన్ = భూలోము నందు; మానవులు = మనుష్యులు {మానవుడు - మనువు వలన పుట్టినవాడు, మనుజుడు}; ఎవ్వరు = ఎవరు; ఐనన్ = అయినప్పటికి; గురువు = గురువువలన; వాక్య = ఉపదేశమును; ఉద్యుక్తులు = పొందినవారు; ఐ = అయ్యి; కాని = కాని; తత్ = దానికి; పూర్వ = ముందుగనే; ఆరంభము = ప్రయత్నము; చేయబోలదు = చేయకూడదు; అనుచున్ = అని; బోధించు = తెలియజేసెడి; చందంబునన్ = రీతిని; సర్వజ్ఞత్వము = అన్ని తెలిసి యుండుట; తోన్ = తోకూడి ఉండి; జగత్ = లోకములకు; గురువులు = గొప్పవారు; ఐ = అయ్యి; సంపూర్ణులు = ఎట్టి లోటు(లోపము)లేని వారు, నిండు స్వభావులు; ఐ = అయ్యి; ఉండియున్ = ఉన్నప్పటికిని; గుర్వు = గురువును; అంగీకరణంబు = స్వీకరించుట; చేయన్ = చేయుటకు; చనిరి = వెళ్ళిరి; ఆ = ఆ ప్రసిద్ధులైన; గోవిందుడును = కృష్ణుడు; రాముడున్ = బలరాముడు.
భావము:- భూలోకంలో మానవులు ఎవరైనా సరే గురువు నుండి ఉపదేశం పొందితే తప్ప ఏ విద్య అనుష్ఠానం మొదలుపెట్ట రాదు సుమా, అని లోకానికి బోధించాలని బలరామకృష్ణులు భావించారు. సమస్తము నెరిగిన వారైనప్పటికినీ జగద్గురువులు అయినప్పటికీ; పరిపూర్ణులు అయినప్పటికీ; బలరామకృష్ణులు ఆచార్యుడి కోసం అన్వేషిస్తూ బయలుదేరారు.