పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/పూతన కృష్ణుని ముద్దాడుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెభా-10.1-219-క.
పాపజాతి సుందరి
యా పాపని పాన్పుఁ జేర రిగి, కరములన్
లేపి, చనుంగవ శిశువున్
మోపుచు ముద్దాడి, శిరము మూర్కొని, పలికెన్.

టీక:- ఆ = ఆ; పాపజాతి = రాక్షస {పాపజాతి - దుష్కృత వంశస్థులు, రాక్షసులు}; సుందరి = స్త్రీ; ఆ = ఆ; పాపని = శిశువు యొక్క; పాన్పున్ = పక్క వద్దకి; చేరన = చేరుటకు; అరిగి = వెళ్ళి; కరములన్ = చేతులతో; లేపి = లేవదీసి; చను = స్తనముల; కవన్ = జంటను; శిశువున్ = చంటిపిల్లవానిని; మోపుచున్ = ఆన్చుచు; ముద్దాడి = ముద్దుపెట్టుకొని; శిరమున్ = తలను; మూర్కొని = మూజూచి; పలికెన్ = పలికెను.
భావము:- ఆ పాపిష్టి రాక్షసి మంచం దగ్గరకి వెళ్ళి, కృష్ణుడిని చేతుల లోకి తీసుకొంది. పాలిళ్ళకి హత్తుకొని, తల వాసన చూసి, ముద్దు పెట్టుకొంది.

తెభా-10.1-220-క.
"చను నీకు గుడుపఁజాలెడి
నువారలు లేరు; నీవు నవలె"ననుచుం
"జనుఁగుడుపి, మీఁద నిలుకడఁ
నుదాన" ననంగ, వేడ్కఁ నుఁ జనుఁ గుడుపన్.

టీక:- చనున్ = చనుబాలను; నీ = నీ; కున్ = కు; కుడుపన్ = తాగించుటకు; చాలెడు = సమర్థులైన; చనువారలు = తగినవారు; లేరు = ఎవరూలేరు; నీవు = నీవు; చనవలెన్ = వెళ్ళవలెను, చావవలెను; అనుచున్ = అనుచు; చను = చనుబాలు; కుడిపి = తాగించి; మీదన్ = ఆపైన; నిలుకడన్ = నెమ్మదిగా; చనుదానన్ = వెళ్ళెదను, చనిపోయెదను; అనగన్ = అనెడి; వేడ్కన్ = కుతూహలముతో; చనున్ = వెళ్ళును; చను = చనుబాలు; కుడుపన్ = తాగించుటకు.
భావము:- బాలకృష్ణుని వద్దకు వస్తున్న శిశుహంతకి పూతన “నీకు చనుబాలు (చనుట) పట్టించ గల నేర్పరులు ఎవరు లేరయ్య. ఇంక నువ్వు పోవాలి.” అని లాలించింది. నీకు చనుబాలు (చనుట) పట్టించి అటుపిమ్మట మెల్లగా (తప్పక) పోతాలే (చనిపోతాలే) అంటున్నట్లు ఉత్సాహంతో స్తన్యం ఇవ్వడానికి బయలుదేరింది.

తెభా-10.1-221-క.
"నా నుఁబా లొక గ్రుక్కెఁడు
నో! చిన్నికుమార! త్రావు మొయ్యన; పిదపన్
నీ చెలువ మెఱుఁగ వచ్చును;
నా చెలువము సఫల మగును; ళినదళాక్షా!"

టీక:- నా = నా యొక్క; చనుబాలు = స్తన్యము; ఒక = ఒకే ఒక్క; గుక్కెడున్ = ఒక గుటక వేయగలిగి నంత; ఓ = ఓయీ; చిన్ని = చంటి; కుమార = పిల్లవాడ; త్రావుము = తాగుము; ఒయ్యనన్ = తిన్నగా; పిదపన్ = తరువాత; నీ = నీ యొక్క; చెలువము = చక్కదనమును; ఎఱుగవచ్చును = చూడవచ్చును; నా = నా యొక్క; చెలువము = చందము; సఫలము = పండినది; అగును = అగును; నళినదళాక్ష = పద్మాక్షుడా.
భావము:- ఓ పద్మాలవంటి కన్నులు గల చిట్టి తండ్రీ! నా చనుబాలు ఒక్క గుక్కెడు తాగు. తరువాత నీ చక్కదనం ఎలా ఉంటుందో తెలుస్తుంది. నా అందానికి కూడ తగిన ఫలితం దక్కుతుంది."

తెభా-10.1-222-వ.
అని బాలు నుద్దేశించి, ముద్దాడెడి భంగి మాటలాడెడి చేడియం జూచి.
టీక:- అని = అని; బాలున్ = బాలుని; ఉద్దేశించి = గురించి; ముద్దాడెడి = ముద్దు చేయుచున్న; భంగిన్ =విధంగా; మాటలాడెడి = మాట్లాడుచున్న; చేడియన్ = స్త్రీని; చూచి = కనుగొని;
భావము:- ఈ విధంగా ముద్దాడుతున్నట్లు కృష్ణుడితో మాట్లాడుతున్న పూతనను చూసి యశోదాదేవిరోహిణి అభ్యంతరం చెబుతూ. . .