Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/పర్వత భజనంబు

వికీసోర్స్ నుండి


తెభా-10.1-892-మ.
లాభీరులు వీఁడె కృష్ణుఁ డన నైజంబైన రూపంబుతో
లంకస్థితి నుండి "శైల మిదె మీర్చింప రం"డంచుఁ దా
నొ శైలాకృతిఁదాల్చి గోపకులతో నొండొండఁ బూజించి గో
దత్తాన్నము లాహరించె విభుఁ డా ప్రత్యక్ష శైలాకృతిన్.

టీక:- సకల = సమస్తమైన; ఆభీరులున్ = గొల్లలు; వీడె = ఇతడె; కృష్ణుడు = కృష్ణుడు అంటె; అనన్ = అనుకొనునట్లు; నైజంబు = తనది; ఐన = అయినట్టి; రూపంబు = స్వరూపము; తోన్ = తోటి; అకలంక = స్వచ్ఛమైన; స్థితిన్ = స్థితిలో; ఉండి = ఉండి; శైలము = కొండ; ఇదె = ఇదిగో; మీరు = మీరందరు; అర్చింపన్ = పూజించుటకు; రండు = రండి; అంచున్ = అనుచు; తాన్ = అతను; ఒక = ఒకానొక; శైల = కొండ వలె; ఆకృతిన్ = రూపు; తాల్చి = ధరించి; గోపకుల = గొల్లవారి; తోన్ = తోటి; ఒండొండన్ = క్రమముగ; గోపక = గొల్లవారిచేత; దత్తాన్నములు = నివేదించిన ప్రసాదములు; ఆహరించెన్ = భుజించెను; విభుడు = కృష్ణుడు; ఆ = ఆ ప్రసిద్ధమైన; ప్రత్యక్ష = సాక్షాత్కరించిన; శైల = కొండ యొక్క; ఆకృతిన్ = రూపముతో.
భావము:- శ్రీ కృష్ణుడు ఎప్పటి గొల్ల రూపుతో గొల్లల నడుమ నిశ్శంకంగా నిష్కళంకంగా ఉంటూ, వారితో “ఇదిగో పర్వతం దీనిని పూజించడానికి మీరంతా రండి” అని, తాను తత్క్షణం పర్వతాకృతి ధరించాడు. ఆ గోపాలకులతో కలసి ఉండి, గిరి రూపం దాల్చిన హరి తన్ను తానే ప్రత్యేకంగా పూజించుకుంటూ గొల్లలు నివేదించిన నైవేద్యమంతా ఆరగించాడు.

తెభా-10.1-893-మ.
"వినుఁ డీ శైలము కామరూపి; ఖలులన్ వేధించు; నాజ్యాన్నముల్
మొప్పింపఁగ నాహరించె; మనలన్ న్నించెఁ; జిత్తంబులో
నుకంపాతిశయంబు చేసె మనపై"నంచున్ సగోపాలుఁడై
జాక్షుండు నమస్కరించె గిరికిన్ వందారు మందారుఁడై.

టీక:- వినుడీ = వినండి; శైలము = కొండ; కామరూపి = కోరిన రూపము పొంద గలది; ఖలులన్ = దుర్జనులను; వేధించున్ = బాధించును; ఆజ్య = నేతి; అన్నముల్ = వంటలు; మనమున్ = మనము, మనసులకు; ఒప్పింపగన్ = సమ్మతించగా, బాగుండగా; ఆహరించెన్ = ఆరగించెను; మనలన్ = మనలను; మన్నించె = ఆదరించెను; చిత్తంబు = మనసుల; లోన్ = లో; అనుకంపాతిశయము = మిక్కిల కరుణచూపుట; చేసెన్ = చేసినది; మన = మన; పైన్ = మీద; అంచున్ = అనుచు; సగోపాలుడు = గొల్లవారితో కూడినవాడు; ఐ = అయ్యి; వనజాక్షుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; నమస్కరించెన్ = మొక్కెను; గిరి = కొండ; కిన్ = కు; వందారు = సేవించువారికి; మందారుడు = కల్పవృక్షమువంటివాడు; ఐ = అయ్యి.
భావము:- మ్రోక్కే వారికి కల్పవృక్షమైన కమలాయతాక్షుడు కృష్ణుడు “ఓ గోపకులారా! ఆలకించండి. ఈ కొండ ఇష్టం వచ్చిన రూపం ధరించ గలదు. మనము ఆరగింపు చేసిన నేతిబువ్వలు చక్కగా భుజించింది. మనలను ఆదరించింది. మన యెడల కారుణ్యం చూపింది. దుర్మార్గులను ఈ కొండ పీడిస్తుంది.” అంటూ వారితోపాటు తాను కూడ ఆ కొండకు చేతులు జోడించాడు.

తెభా-10.1-894-వ.
ఇట్లు గోపకులు హరిసమేతులై గిరికిం బూజనోపహారంబులు సమర్పించి, గోధనంబులం బురస్కరించుకొని భూసురాశీర్వాద వచనంబులతో గిరికిం బ్రదక్షిణంబు చేసి, రా సమయంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; గోపకులు = యాదవులు; హరి = కృష్ణునితో; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; గిరి = కొండ; కిన్ = కు; పూజన = పూజించుట; ఉపహారంబులు = నైవేద్యములు; సమర్పించి = నివేదించి; గో = గోవులు అనెడి; ధనంబులన్ = సంపదలను; పురస్కరించుకొని = ముందుంచుకొని; భూసుర = విప్రుల; ఆశీర్వచన = దీవెనల; వచనంబుల = పలుకుల; తోన్ = తోటి; గిరి = కొండ; కిన్ = కు; ప్రదక్షిణంబు = ప్రదక్షిణలు {ప్రదక్షిణ - రూపమునకు చుట్టును కుడివైపుగా భక్తితో తిరుగుట}; చేసిరి = చేసిరి; ఆ = ఆ యొక్క; సమయంబునన్ = సమయము నందు.
భావము:- ఇలా, గోపాలకులు శ్రీ హరితో కూడి ఆ కొండకు పూజలూ కానుకలూ సమర్పించారు. పిమ్మట ఆలమందలను ముందుంచుకొని బ్రాహ్మణాశీస్సులతో ఆ గిరికి అందరూ ప్రదక్షిణలు చేశారు.

తెభా-10.1-895-క.
గుఱ్ఱముల పరువు మెచ్చని
ఱ్ఱల గట్టిన రథంబు నందప్రముఖుల్
గుఱ్ఱ ల యార్పులు చెలఁగఁగఁ
దొఱ్ఱలగమి వెంట నంటఁ దోలి రిలేశా!

టీక:- గుఱ్ఱముల = గుఱ్ఱముల యొక్క; పరువు = పరుగును; మెచ్చని = గొప్పగా ఎంచని, మించెడి; నఱ్ఱలన్ = కొవ్విన ఎద్దులను; కట్టిన = పూన్చిన; రథంబున్ = బండ్లను; నంద = నందుడు; ప్రముఖుల్ = మొదలగువారు; కుఱ్ఱల = పిల్లల యొక్క; ఆర్పులు = అరుపులు; చెలగగన్ = చెలరేగుచుండగా; తొఱ్ఱల = ఆవుల; గమి = గుంపుల; వెంటనంటన్ = వెంబడించుచు; తోలిరి = పరుగెత్తించిరి; ఇలేశా = రాజా {ఇలేశుడు - ఇల (భూమి)కి ఈశుడు (ప్రభువు), రాజు}.
భావము:- పరీక్షన్మహారాజా! పిల్లలు ఉత్సాహంతో కేరింతలు కొడుతూండగా, గుఱ్ఱాల దౌడును మించిపోయే యెడ్లబండ్లలో నందుడు మున్నగువారు ఎక్కి ఆవుల మంద వెంట తోలించారు.

తెభా-10.1-896-క.
పాటించి గానవిద్యా
పావమునఁ దేరు లెక్కి హుతానములం
బాలగంధులు కృష్ణుని
పాలు పాడిరి విరోధిపాటనుఁ డనుచున్.

టీక:- పాటించి = పూని; గాన = పాటలు పాడెడి; విద్యా = విద్య అందలి; పాటవమునన్ = నేర్పులతో; తేరులు = రథములు, బండ్లు; ఎక్కి = ఎక్కి; బహు = అనేకమైన; తానములన్ = తాళభేదములతో; పాటలగంధులు = అందగత్తెలు {పాటలగంధి - పాదిరిపూలవంటి దేహ సువాసన కలిగినామె, స్త్రీ}; కృష్ణుని = కృష్ణుని గురించిన; పాటలు = గీతములను; పాడిరి = ఆలపించిరి; విరోధి = శత్రువులను; పాటనుడు = అణగగొట్టువాడు; అనుచున్ = అనుచు.
భావము:- కలిగొట్టు పూలవలె కమ్మని దేహపరిమళం కల గొల్లభామలు తమ సంగీత కళాకౌశల్యం తేటపడేలా ఆ బండ్లెక్కి రాగాలాపన చేస్తూ “శత్రువులను చీల్చివేసే వాడు అంటూ” శ్రీకృష్ణుని మీద పాటలు పాడారు.

తెభా-10.1-897-క.
కుం నిభాపీనంబులు
మండితవర్ణములు వివిధహితాకృతులున్
నిండిన కడుపులుఁ గన్నుల
పండువులుగఁ బాఁడి కుఱ్ఱిదువులు జరిగెన్.

టీక:- కుండ = కడవల; నిభ = వంటి; ఆపీనంబులును = పొదుగులను; మండిత = అలంకరింపబడిన; వర్ణములు = వన్నెలు; వివిధ = నానా విధమైన; మహిత = గొప్ప; ఆకృతులున్ = ఆకారములు; నిండిన = నిండినట్టి; కడుపులున్ = కడుపులు; కన్నుల = కళ్ళకు; పండువులుగన్ = ఆనందము కలిగించునవిగ; పాడి = పాలిచ్చెడి; కుఱ్ఱి = ఆవుల; పదువులు = సమూహములు; జరిగెను = నడచెను.
భావము:- కుండల అంత పెద్ద పొదుగులు, మెరుస్తున్న దేహ కాంతులు, రకరకాల గొప్ప ఆకారాలు, నిండిన పొట్టలు గల పాడియావుల మంద కనువిందు చేస్తూ కదలింది.

తెభా-10.1-898-క.
పొరెక్కిన మూఁపురములు;
దె గల వాలములు, శైల దేహంబులు, భూ
నములు నిండు ఱంకెలు
మిగుల మెఱయు వృషభగణము మెల్లన నడచెన్.

టీక:- పొగరు = మదము; ఎక్కిన = అతిశయించిన; మూపురములున్ = మూపురములు; తెగగల = నిడుపైన; వాలములున్ = తోకలు; శైల = కొండలలాంటి; దేహంబులున్ = శరీరములు; భూగగనములు = భూమ్యాకాశములు; నిండు = వ్యాపించు; ఱంకెలు = రంకెలు {రంకె, ఱంకె - ఎద్దుల అరుపు}; మిగులన్ = మీరుచుండగా; మెఱయు = ప్రకాశించునట్టి; వృషభ = ఆబోతుల; గణము = సమూహము; మెల్లనన్ = మెల్లిగా; నడచెన్ = నడచెను.
భావము:- బలసిన మూపురములు, పొడవైన తోకలు, కొండల వంటి మేనులు, భూమ్యాకాశాలు నిండిన ఱంకెలు ఉద్దీపించగా అతిశయించిన ఎద్దుల గుంపు మెల్లగా నడచింది.