Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గురుపుత్రుని తేబోవుట

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1418-వ.
అనిన విని రామకృష్ణులు గుర్వర్థంబుగా దుర్వారరథారూఢులై రయంబునం జని రౌద్రంబున సముద్రంబుఁ జేరి యిట్లనిరి.
టీక:- అనినన్ = అనగ; విని = విని; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణులు; గుర్వు = గురువు; అర్థంబుగా = కొరకు; దుర్వార = ఆపరాని; రథా = రథము నందు; ఆరూఢులు = ఎక్కినవారు; ఐ = అయ్యి; రయంబునన్ = వేగముగా; చని = వెళ్ళి; రౌద్రంబునన్ = భీకరముగ; సముద్రంబున్ = సముద్రమును; చేరి = దగ్గరకు పోయి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఇలా పలికిన తమ గురువు పలుకులు విని, రామకృష్ణులు వారి కోరిక తీర్చడం కోసం ఎదురు లేని రథాన్ని అధిరోహించారు. తత్క్షణం సముద్రుడి దగ్గరకి వెళ్ళి కోపంతో ఇలా అన్నారు

తెభా-10.1-1419-క.
"సార! సుబుద్ధితోడను
మా గురుపుత్రకునిఁ దెమ్ము మా ఱాడిన నీ
వాడ మగుదువు దుస్సహ
వేరణాభీల నిశిత విశిఖాగ్నులకున్."

టీక:- సాగర = సముద్రుడా; సుబుద్ధి = మంచి బుద్ధి; తోడను = తోటి; మా = మా; గురు = గురువు యొక్క; పుత్రకునిన్ = కుమారుని; తెమ్ము = తీసుకొనిరమ్ము; మాఱాడినన్ = ఎదురు చెప్పినచో; నీవున్ = నీవు; ఆగడము = చెఱుపు, నశించినవాడవు; అగుదువు = అయిపోవుదువు; దుస్సహ = సహింపరాని; వేగ = వడిగల; రణ = యుద్ధము నందు; ఆభీల = భీకరమైన; నిశిత = వాడియైన; విశిఖ = బాణములవలని; అగ్నుల్ = అగ్నుల; కున్ = చేత.
భావము:- “ఓ సముద్రుడా! మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుడిని తెచ్చి మాకు అప్పగించు. ఎదురు చెప్పావు అంటే, సహింపరాని వేగం కలవీ, రణరంగ భయంకరాలూ అయిన మా పదునైన బాణాలు విరజిమ్మే అగ్నిజ్వాలలకు నీవు గుఱి అవుతావు.”

తెభా-10.1-1420-వ.
అనిన వారలకు జలరాశి యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; వారల్ = వారి; కున్ = కి; జలరాశి = సముద్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పలికిన రామకృష్ణులతో సాగరుడు ఇలా అన్నాడు.

తెభా-10.1-1421-ఉ.
"వంన యేమి లేదు యదుల్లభులార! ప్రభాసతీర్థమం
దంచితమూర్తి విప్రసుతుఁ డాఢ్యుఁడు తోయములాడుచుండ ను
త్సంలితోర్మి యొక్కటి ప్రచండగతిం గొనిపోయెఁ బోవఁగాఁ
బంజనుండు మ్రింగె నతిభాసురశీలుని విప్రబాలునిన్."

టీక:- వంచన = మోసము; ఏమి = ఏమాత్రము; లేదు = లేదు; యదువల్లభులారా = ఓ రామకృష్ణులు; ప్రభాస = ప్రభాసము అనెడి; తీర్థమున్ = పుణ్యతీర్థము; అందున్ = లో; అంచిత = చక్కటి; మూర్తి = ఆకారము కలవాడు; విప్ర = బ్రాహ్మణుని; సుతుడు = పుత్రుడు; ఆఢ్యుడు = ధన్యుడు; తోయములు = జల; ఆడుచున్ = క్రీడలాడుచు; ఉండన్ = ఉండగా; ఉత్ = మిక్కిలి; సంచలిత్ = ఎగయుచున్న; ఊర్మి = అల; ఒక్కటి = ఒకానొకటి; ప్రచండ = తీవ్రమైన; గతిన్ = వేగముతో; కొనిపోయెన్ = తీసుకుపోయెను; పోవగా = తీసుకుపోగా; పంచజనుండు = పంచజనుడను రాక్షసుడు; మ్రింగెన్ = మింగివేసెను; అతి = మిక్కిలి; భాసుర = ప్రకాశించెడి; శీలుని = నడవడిక కలవానిని; విప్ర = బ్రాహ్మణ; బాలునిన్ = పిల్లవానిని.
భావము:- “యాదవేశ్వరులారా! నా మాటలలో ఏమాత్రం మోసం లేదు. ప్రభాసతీర్ధంలో మంచి అందమైన చక్కటి బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తుండగా, పెద్ద అల ఒకటి పైకెగసి భయంకరవేగంతో అతడిని లోపలికి తీసుకుపోయింది. అలా తీసుకునిపోగా బహు చక్కనైన స్వభావం కల ఆ బ్రాహ్మణ పిల్లాడిని పంచజనుడనే దైత్యుడు మ్రింగివేశాడు.”

తెభా-10.1-1422-వ.
అని వాని వసియించు చో టెఱింగించిన.
టీక:- అని = అని; వాని = అతని; వసియించు = నివసించెడి; చోటున్ = స్థలమును; ఎఱిగించిన = తెలుపగా.
భావము:- అంటూ సముద్రుడు ఆ రాక్షసుడుండే చోటు రామకృష్ణులకు తెలియజేసాడు.

తెభా-10.1-1423-శా.
శంఖారావముతోడఁ బంచజనుఁ డాశంకించి చిత్తంబులో
సం ఖిన్నుండయి వార్థిఁ జొచ్చె దహనజ్వాలాభ హేమోజ్జ్వల
త్పుంఖాస్త్రంబునఁ గూల్చి వాని జఠరంబున్ వ్రచ్చి గోవిందుఁ డ
ప్రేంచ్చిత్తుఁడు బాలుఁ గానక గురుప్రేమోదితోద్యోగుఁడై.

టీక:- శంఖా = శంఖధ్వని వంటి; రావము = శబ్దము; తోడన్ = తోటి; పంచజనుడు = పంచజనుడు; ఆశంకించి = మిక్కిలి భయపడి; చిత్తంబు = మనసు నందు; సంఖిన్నుండు = మిక్కిలి దుఃఖించెడివాడు; కన్ = ఐ; వార్థిన్ = సముద్రము నందు; చొచ్చెన్ = దూరెను; దహన = మండెడి; జ్వాలా = నిప్పు; ఆభ = వంటి; హేమ = బంగారు మయమైన; ఉజ్వలత్ = వెలుగుచున్న; పుంఖ = పింజ కలిగిన; అస్త్రంబునన్ = బాణములచేత; కూల్చి = పడగొట్టి; వానిన్ = అతనిని; జఠరంబున్ = కడుపును; వ్రచ్చి = చించి; గోవిందుడు = కృష్ణుడు; అప్రేంఖత్ = డోలాయమానముకాని; చిత్తుడు = మనసు కలవాడు; బాలున్ = పిల్లవానిని; కానక = చూడకుండ; గురు = గురువుమీద; ప్రేమ = ప్రీతి; ఉదిత = పుట్టిన; ఉద్యోగుడు = ప్రయత్నము కలవాడు; ఐ = అయ్యి.
భావము:- శ్రీకృష్ణుడు శంఖం పూరించగా, ఆ శంఖారావం వినిన పంచజనుడు భయ సందేహాలతో కంపించిపోయి,. సాగర జలంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు వాడిని అగ్నిజ్వాలలతో సమానములైన బంగారుపింజల రంగారు బాణాలతో పడగొట్టి, వాడి పొట్టను చీల్చాడు. అచంచలమనస్కు డైన శ్రీకృష్ణునకు పంచజనుని కడుపులో విప్రకుమారుడు కనిపించలేదు. అతడు గురువు పట్ల గల ప్రీతిచే కార్య తత్పరుడు అయ్యాడు.

తెభా-10.1-1424-క.
దావుని దేహజం బగు
మానిత శంఖంబుఁ గొనుచు సలక బలుఁడుం
దో నేతేరఁగ రథి యై
దావరిపుఁ డరిగె దండరుపురికి నృపా!

టీక:- దానవుని = రాక్షసుని యొక్క; దేహజంబు = దేహములో ఉన్నది; అగు = ఐన; మానిత = గొప్ప; శంఖంబున్ = శంఖమును; కొనుచు = తీసుకొనుచు; మసలక = ఆలస్యము చేయకుండ; బలుండున్ = బలరాముడు; తోన్ = కూడా; ఏతేరగన్ = వచ్చుచుండగ; రథి = రథమును ఎక్కినవాడు; ఐ = అయ్యి; దానవరిపుడు = కృష్ణుడు {దానవ రిపుడు - రాక్షసశత్రువు, విష్ణువు}; అరిగెన్ = వెళ్ళెను; దండధరు = యముని; పురి = పట్టణమున; కిన్ = కు; నృపా = రాజా.
భావము:- ఓ పరీక్షన్మహారాజా! రాక్షసవిరోధి అయిన శ్రీకృష్ణుడు పంచజన రాక్షసుడి శరీరం నుంచి జనించిన పాంచజన్యం అనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. ఆలసించక బలభద్ర సహితుడై రథము ఎక్కి, యమ పురికి వెళ్ళాడు.

తెభా-10.1-1425-వ.
చని సంయమనీనామ నగరంబు చేరి తద్వారంబునఁ బ్రళయకాల మేఘగంభీర నినద భీషణం బగు శంఖంబు పూరించిన విని వెఱఁగుపడి.
టీక:- చని = పోయి; సంయమనీ = సంయమనీ అనెడి; నామ = పేరు కలగిన; నగరంబు = పట్టణము; చేరి = దగ్గరకు పోయి; తత్ = అతని; ద్వారంబునన్ = వాకిటి యందు; ప్రళయ = ప్రళయపు; కాల = సమయ మందలి; మేఘ = మేఘములవంటి; గంభీర = గంభీరమైన; నినద = ధ్వనితో; భీషణంబు = భయంకరము; అగు = ఐన; శంఖంబున్ = శంఖమును; పూరించినన్ = ఊదగా; విని = విని; వెఱగుపడి = ఆశ్చర్యపోయి;
భావము:- అలా వెళ్ళిన శ్రీకృష్ణుడు సంయమని అనే పేరు కల ఆ యముడి పట్టణం చేరి ఆ పట్టణం వాకిట ప్రళయకాల మేఘం వలె గంభీరధ్వనితో భీతిగొలిపే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖఘోషము వినిన యమధర్మరాజు అశ్చర్యపోయాడు.

తెభా-10.1-1426-శా.
"స్మద్బాహుబలంబుఁ గైకొనక శంఖారావమున్ మాన సా
స్మారంబుగ నెవ్వఁ డొక్కొ నగరప్రాంతంబునం జేసె? మ
ద్విస్మేరాహవ రోషపావకునిచే విధ్వస్తుఁడై వాఁడు దా
స్మంబై చెడు"నంచు నంతకుఁడు కోప్రజ్వలన్మూర్తియై.

టీక:- అస్మద్ = నా యొక్క; బాహు = భుజముల; బలంబున్ = బలమును; కైకొనక = లెక్కపెట్టకుండా; శంఖా = శంఖము పూరించిన; రావమున్ = ధ్వనిని; మానస = మనసునకు; అపస్మారంబు = కలతపెట్టునది; కన్ = అగునట్లు; ఎవ్వడొక్కో = ఎవడో; నగర = పట్టణపు; ప్రాంతంబునన్ = దగ్గర; చేసెన్ = చేసెనో; మత్ = నా యొక్క; విస్మేర = అట్టహాసముతో కూడిన; ఆహవ = యుద్ధములోని; రోష = కోపము అనెడి; పావకుని = అగ్ని; చేన్ = చేత; విధ్వస్తుడు = మిక్కిలి ధ్వంసమైనవాడు; ఐ = అయ్యి; వాడు = అట్టివాడు; భస్మంబు = బూడిద; ఐ = అయ్యి; చెడున్ = నశించును; అంచున్ = అనుచు; అంతకుడు = యముడు; కోప = కోపముచేత; ప్రజ్వలన్ = మండిపడుతున్న; మూర్తి = ఆకృతి కలవాడు; ఐ = అయ్యి.
భావము:- “నా యమపురి ముందట ఎవరో నా భుజబలాన్ని లెక్కచేయకుండా నా మనసుకు క్రోధావేశం కలిగేలా శంఖం పూరిస్తున్నాడు. వాడు అద్భుతావహ మైన నా క్రోధాగ్నికి బూడిద అయిపోతాడు.” అంటూ దండధరుడు కోపంతో మండిపడుతూ వచ్చాడు.

తెభా-10.1-1427-వ.
వచ్చి రామకృష్ణులం గని వారు లీలామనుష్యు లైన విష్ణుమూర్తు లని యెఱింగి; భక్తితోడ శుశ్రూష చేసి సర్వభూతమయుం డగు కృష్ణునకు నమస్కరించి “యేమి చేయుదు నానతి” మ్మనిన నమహాత్ముండు యిట్లనియె.
టీక:- వచ్చి = బైటకు వచ్చి; రామ = బలరాముడు; కృష్ణులన్ = కృష్ణులను; కని = చూసి; వారు = వారు; లీలా = విలాసముగా; మనుష్యులు = మానవులు; ఐన = అయినట్టి; విష్ణు = విష్ణుదేవునియొక్క; మూర్తులు = స్వరూపములు కలవాడు; అని = అని; ఎఱింగి = తెలిసికొని; భక్తి = పూజ్యభావము; తోడన్ = తోటి; శుశ్రూష = పరిచర్యలు; చేసి = చేసి; సర్వ = సమస్తమైన; భూత = జీవులలోను; మయుండు = నిండియున్నవాడు; అగు = ఐన; కృష్ణున్ = కృష్ణుని; కున్ = కు; నమస్కరించి = నమస్కారము చేసి; ఏమి = ఎట్టిపని; చేయుదున్ = చేయవలెను; ఆనతిమ్ము = తెలుపుము; అనినన్ = అనగా; ఆ = ఆ యొక్క; మహాత్ముండు = గొప్పవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా వచ్చిన యముడు బలరామకృష్ణులను చూడగానే. వారు లీలావతారం ధరించిన విష్ణువు అవతార మూర్తులు అని గ్రహించాడు. భక్తితో పూజించాడు. సకల భూత హృదయ నివాసి అయిన కృష్ణుడికి నమస్సులు సమర్పించి. “నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించ” మని అడిగాడు. యముడి మాటలు విని ఆ పరమాత్మ ఇలా అన్నాడు.

తెభా-10.1-1428-క.
"చెప్పెద మా గురునందనుఁ
ప్పుగలుగఁ జూచి నీవు దండనమునకుం
దెప్పించినాఁడ వాతని
నొప్పింపుము మాకు వలయు నుత్తమచరితా!"

టీక:- చెప్పెదన్ = తెలిపెదను; మా = మా యొక్క; గురు = గురువు యొక్క; నందనున్ = పుత్రుని; తప్పు = దోషము; కలుగన్ = జరుగుటను; చూచి = కనుగొని; నీవున్ = నీవు; దండనమున్ = దండనమున; కున్ = కు; తెప్పించినాడవు = తీసుకురమ్మంటివి; ఆతనిన్ = అతనిని; ఒప్పింపుము = అప్పజెప్పుము; మా = మా; కున్ = కు; వలయున్ = కావలెను; ఉత్తమచరితా = యముడా {ఉత్తమచరితుడు - ఉత్తమమైన నడవడిక కలవాడు, యముడు}.
భావము:- “ఓ పుణ్యశీలా! యమధర్మరాజా! చెబుతాను విను. మా గురుపుత్రునిలో తప్పు చూసి దండించడం కోసం తెప్పించుకున్నావు. మాకు అతడు కావాలి, అప్పగించు.”