పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయ)/జరాసంధ వధ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జరాసంధ వధ

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయ)/జరాసంధ వధ)
రచయిత: పోతన


(తెభా-10.2-733-సీ.)[మార్చు]

ర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు;
మృగపతిద్వితయంబు వృషభయుగము
పావకద్వయము దంతావళయుగళంబు;
లపడు వీఁక నుద్దండలీలఁ
దిసి యన్యోన్యభీరగదాహతులను;
గ్రంబుగ విస్ఫులింములు సెదరఁ
గెరలుచు సవ్యదక్షిణమండలభ్రమ;
ములను సింహచంక్రమణములను

(తెభా-10.2-733.1-తే.)[మార్చు]

దిసి పాయుచు డాసి డగ్గఱచు మింటి
కెగసి క్రుంగుచుఁ గ్రుంగి వే యెగసి భూమి
గుల నార్చి ఛటచ్ఛటోద్భటమహోగ్ర
నగదాఘట్టనధ్వని గనమగల.

(తెభా-10.2-734-వ.)[మార్చు]

పోరునంత.

(తెభా-10.2-735-మ.)[మార్చు]

సారించి జరాతనూభవుఁడు హుంకారప్రఘోషంబులం
లల్లాడఁగఁ బాదఘట్టనములన్ ర్వంసహాభాగముం
లన్ వాయుజు వ్రేసె; వ్రేయ నతఁ డుగ్రక్రోధదీప్తాస్యుఁడై
ది తప్పించి విరోధిమస్తకము వ్రేయన్ వాఁడు వోఁ దట్టుచున్.

(తెభా-10.2-736-చ.)[మార్చు]

వక భీమసేనుఁడును మాగధరాజు గడంగి బెబ్బులుల్‌
వి డివడు లీల నొండొరుల వీఁపులు మూఁపులునుం బ్రకోష్ఠముల్‌
డితల లూరు జాను జఘప్రకరంబులు బిట్టు వ్రయ్యఁగాఁ
బి డుగులఁబోలు పెన్గదల బెట్టుగ వ్రేయుచుఁ బాయుచున్ వెసన్.

(తెభా-10.2-737-లవి.)[మార్చు]

బె డ''' గడరు పెన్గదలు పొడిపొడిగఁ దాఁకఁ బెనుఁ;
పిడుగు లవనిం దొరఁగ నుడుగణము రాలన్
మి డుఁ'''గుఱులు చెద్రి నభ మడల హరిదంతములు;
వడఁక జడధుల్‌ గలఁగ బుడమి చలియింపన్
వె డ'''చఱువ మొత్తియును దడఁబడఁగ నొత్తియును;
నెడమగుడు లాఁచి తిరుగుడు పడఁగ వ్రేయన్
డ'''వడ వడంకుచును సుడివడక డాసి చల;
ముడుగ కపు డొండొరుల వడిచెడక పోరన్.

(తెభా-10.2-738-వ.)[మార్చు]

ఇవ్విధంబునం బోరుచుండ నొండొరుల గదా దండంబులు దుమురులైనం బెండు వడక సమద దిగ్వేదండశుండాదండమండిత ప్రచండంబు లగు బాహుదండంబు లప్పగించి ముష్టియుద్ధంబునకు డగ్గఱి.

(తెభా-10.2-739-లగ్రా.)[మార్చు]

కా ల''' వెస డాఁచియును గీ లెడలఁ ద్రోచియును;
దాలుములు దూలఁ బెడకేల వడి వ్రేయన్
''ఫా ల'''ములు గక్షములుఁ దాలువులు వక్షములు;
వ్రీల నెముకల్‌ మెదడు నేలఁ దుమురై వే
''రా ల''' విపులక్షతవిలోలమగు నెత్తురులు;
జాలుగొని యోలిఁ బెనుఁ గాలువలుగం బే
''తా ల'''మదభూతములు ఖేలనలఁ జేతులను;
దాళములు తట్టుచు సలీలగతి నాడన్.

(తెభా-10.2-740-ఉ.)[మార్చు]

'ప్ర క్కలుఁ జెక్కులున్ మెడలుఁ బాణితలంబులచేఁ బగుల్చుచున్
'ము క్కులు నక్కులుంజెవులు ముష్టిహతిన్ నలియంగ గ్రుద్దుచున్
'డొ క్కలుఁ బిక్కలున్ ఘనకఠోరపదాహతి నొంచుచున్ నెఱుల్‌
' క్కక స్రుక్క కొండొరులఁ దార్కొని పేర్కొని పోరి రుగ్రతన్.

(తెభా-10.2-741-ఉ.)[మార్చు]

'హు మ్మని మ్రోఁగుచుం బెలుచ హుంకృతు లిచ్చుచుఁ బాసి డాసి కో
'కొ మ్మనుచున్నొడళ్ళగల గుల్లల తిత్తులుగాఁ బదంబులం
'గ్రు మ్ముచు ముష్ఠి ఘట్టనల స్రుక్కుచు నూర్పులు సందఁడింపఁగా
'సొ మ్మలు వోవుచుం దెలియుచున్ మదిఁ జేవయుఁ లావుఁ జూపుచున్

(తెభా-10.2-742-వ.)[మార్చు]

ఇవ్విధంబున వజ్రివజ్రసన్నిభంబగు నితరేతర ముష్టిఘట్టనంబుల భిన్నాంగులై, రక్తసిక్తశరీరంబులతోడం బుష్పితాశోకంబుల వీఁకను, జేగుఱుఁ గొండల చందంబునను జూపట్టి పోరుచుండఁ గృష్ణుండు జరాసంధుని జన్మమరణప్రకారంబు లాత్మ నెఱుంగుటం జేసి వాయుతనూభవున కలయికలేక లావును జేవయుఁ గలుగునట్లుగాఁ దద్గాత్రంబునందు దనదివ్యతేజంబు నిలిపి యరినిరసనోపాయం బూహించి సమీరనందనుండు సూచుచుండ నొక్క శాఖాగ్రంబు రెండుగాఁ జీరివైచి వాని నట్ల చీరి చంపు మని సంజ్ఞగాఁ జూపిన నతండు నా కీలుదెలిసి యవక్రపరాక్రముండై మాగధుం బడఁద్రోచి వాని పదంబు పదంబునం ద్రొక్కి బాహుయుగళంబున రెండవ పదంబుఁ గదలకుండంబట్టి మస్తకపర్యంతంబుఁ బెళబెళమని చప్పుళ్ళుప్పతిల్ల మత్తదంతావళంబు దాళవృక్షంబు సీరు చందంబునఁ బాద జాను జంఘోరు కటి మధ్యోదరాంస కర్ణ నయనంబులు వేఱువేఱు భాగంబులుగా వ్రయ్యలు వాపి యార్చినఁ బౌరజనంబులు గనుంగొని భయాకులులై హాహాకారంబులు సేసిరంత.

21-05-2016: :
గణనాధ్యాయి 11:10, 12 డిసెంబరు 2016 (UTC)