Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రాజబంధ మోక్షంబు

వికీసోర్స్ నుండి

రాజబంధమోక్షంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రాజబంధ మోక్షంబు)
రచయిత: పోతన


తెభా-10.2-743-క.
నిలజుని దేవపతి నం
నుఁడునుఁ బద్మాక్షుఁడును నుదారత నాలిం
ములు సేసి పరాక్రమ
ము కద్భుతమంది మోదమునఁ బొగడి రొగిన్.

టీక:- అనిలజుని = భీముని {అనిల జుడు - అనిల (వాయు) జుడు (పుత్రుడు), భీముడు}; దేవపతినందనుడునున్ = అర్జునుడు {దేవపతి నందనుడు - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు}; పద్మాక్షుడునున్ = కృష్ణుడు; ఉదారతన్ = మెచ్చుకోలుగా; ఆలింగనములు = కౌగలించుకొనుటలు; చేసి = చేసి; పరాక్రమమునకు = పరాక్రమమునకు; అద్భుతము = అబ్బుర; అంది = పడి; మోదమునన్ = సంతోషముతో; పొగడిరి = శ్లాఘించిరి; ఒగిన్ = వరసపెట్టి.
భావము:- జరాసంధుడిని చంపినందుకు అర్జునుడూ కృష్ణుడూ ఆనందంతో భీముడిని కౌగలించుకున్నారు; అతని పరాక్రమాన్ని ప్రస్తుతించారు.

తెభా-10.2-744-క.
జాక్షుఁ డంతఁ గరుణా
నిధియును భక్తలోకత్సలుఁడునుఁ గా
వు మాగధసుతు సహదే
వునిఁ బట్టముగట్టెఁ దన్నవోన్నతపదవిన్.

టీక:- వనజాక్షుడు = కృష్ణుడు; అంతన్ = అంతట; కరుణా = దయకు; వననిధియును = సముద్రము; భక్త = భక్తుల; లోక = జనసమూహమునకు; వత్సలుడు = వాత్సల్యము కలవాడు; కావున = కాబట్టి; మాగధసుతు = జరాసంధుని కొడుకు; సహదేవుని = సహదేవుడు అను వానికి; పట్టముకట్టెన్ = పట్టాభిషిక్తుని చేసెను; తత్ = ఆ; నవ = నవీనమైన; ఉన్నత = గొప్ప; పదవిన్ = పదవి అందు;
భావము:- దయామయుడూ భక్తవత్సలుడూ అయిన శ్రీకృష్ణుడు అప్పుడు జరాసంధుడి కుమారుడైన సహదేవుడికి పట్టం గట్టి మగధరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు.

తెభా-10.2-745-క.
ధాధినాథునకు ము
న్నపడి చెఱసాలలను మహాదుఃఖములన్
నొగులుచుఁ దన పాదాంబుజ
యుళము చింతించుచున్న యుర్వీశ్వరులన్.

టీక:- మగధాధినాథున్ = జరాసంధుని; కున్ = కి; మున్ను = మునుపు; అగపడి = చిక్కి; చెఱసాలలను = కారాగారములలో; మహా = మిక్కుటమైన; దుఃఖములన్ = దుఃఖము లందు; నొగులుచున్ = బాధపడుతు; తన = తన యొక్క; పాద = పాదములు అను; అంబుజ = పద్మముల; యుగళమున్ = జంటను; చింతించుచున్న = ధ్యానిస్తున్న; ఉర్వీశ్వరులన్ = రాజులను.
భావము:- జరాసంధుడికి లోబడి అతడి చెరసాలలో దుఃఖంతో మ్రగ్గుతూ, తన పాదపద్మాలనే స్మరిస్తూ ఉన్న ఆ రాజులు అందరినీ (విడిపించాడు)

తెభా-10.2-746-వ.
అయ్యవసరంబునఁ గృష్ణుండు దన దివ్యచిత్తంబున మఱవ నవధరింపక చెఱలు విడిపించిన, వారలు పెద్దకాలంబు కారాగృహంబులఁ బెక్కు బాధలం బడి కృశీభూతశరీరు లగుటంజేసి, రక్తమాంస శూన్యంబులై త్వగస్థిమాత్రావశిష్టంబులును, ధూళిధూసరంబులు నైన దేహంబులు గలిగి, కేశపాశంబులు మాసి, జటాబంధంబు లైన శిరంబులతో మలినవస్త్రులై చనుదెంచి; యప్పుడు.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; కృష్ణుండు = కృష్ణుడు; తన = తన యొక్క; దివ్య = గొప్ప; చిత్తంబునన్ = మనసు నందు; మఱవన్ = మరచుటను; అవధరింపక = చేపట్టకుండా; చెఱలు = చెరసాలలనుండి; విడిపించినన్ = విడుదల చేయించగా; వారలు = వారు; పెద్ద = చాలా; కాలంబున్ = కాలమునుండి; కారాగృహంబులన్ = చెరసాలలలో; పెక్కు = అనేకమైన; బాధలన్ = బాధలను; పడి = అనుభవించి; కృశీభూత = చిక్కిపోయిన; శరీరులు = దేహములు కలవారు; అగుటన్ = అగుట; చేసి = వలన; రక్త = నెత్తురు; మాంస = కండలు; శూన్యంబులు = లేనివి; ఐ = అయ్యి; త్వక్ = చర్మము; అస్థి = ఎముకలు; మాత్ర = మాత్రమే; అవశిష్టంబులు = మిగిలినవి; ధూళిధూసరంబులున్ = దుమ్ము కమ్ముకొనినవి; ఐన = అయిన; దేహంబులున్ = శరీరములు; కలిగి = ఉండి; కేశపాశంబులు = జుట్టుముళ్ళు; మాసి = మకిలిపట్టి; జటాబంధంబులు = జటలు కట్టినవి; ఐన = అయిన; శిరంబుల్ = తలలు; తోన్ = తోటి; మలిన = మురికి పట్టిన; వస్త్రులు = బట్టలు కలవారు; ఐ = అయ్యి; చనుదెంచి = వచ్చి; అప్పుడు = అప్పుడు.
భావము:- అలా ఆ సమయంలో శ్రీకృష్ణుడు మరచిపోకుండా ఆ రాజులు అందరిని కారాగారం నుండి విముక్తులను చేసాడు. వారు చాలాకాలం పాటు చెరసాలలో బంధించబడి అనేక బాధలు పడుతూ ఉండడం వలన రక్తమాంసాలు క్షీణించి, చిక్కిశల్యమై, దుమ్ముకొట్టుకున్న శరీరాలతో, జడలు కట్టిన తలలతో, మాసిన బట్టలతో వాసుదేవుడి వద్దకు వచ్చారు.

తెభా-10.2-747-సీ.
వపద్మలోచను, వబంధమోచను-
భరితశుభాకారు, దురితదూరుఁ,
గంగణకేయూరుఁ, గాంచనమంజీరు-
వివిధశోభితభూషు, విగతదోషుఁ,
న్నగాంతకవాహు, క్తమహోత్సాహు-
తచంద్రజూటు, నున్నతకిరీటు,
రినీలనిభకాయు, రపీతకౌశేయుఁ-
టిసూత్రధారు, జద్విహారు

తెభా-10.2-747.1-తే.
హా వనమాలికా మహితోరువక్షు,
శంఖచక్రగదాపద్మశార్‌ఙ్గహస్తు,
లిత శ్రీవత్సశోభితక్షణాంగు,
సుభగచారిత్రు, దేవకీసుతునిఁ గాంచి.

టీక:- నవపద్మలోచను = కృష్ణుని {నవపద్మలోచనుడు - నవ (లేత) పద్మముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; భవ = జన్మజన్మల; బంధ = బంధములను; మోచనున్ = తొలగించువానిని; భరిత = నిండు; శుభ = శుభములు; ఆకారున్ = స్వరూపమైనవానిని; దురిత = పాపములను; దూరున్ = తొలగించువానిని; కంకణ = చేతికడియములు; కేయూరున్ = భుజకీర్తులుధరించినవానిని; కాంచన = బంగారు; మంజీరున్ = కాలి అందెలు ధరించినవానిని; వివిధ = నానావిధ; శోభిత = ప్రకాశవంతమైన; భూషున్ = అలంకారములు కలవానిని; విగత = తొలగిన; దోషున్ = పాపములు కలవానిని; పన్నగాంతక = గరుత్మంతుని {పన్నగాంతకుడు - పాములకు యముడు, గరుత్మంతుడు}; వాహున్ = వాహనముగా కలవానిని; భక్త = భక్తులకు; మహా = మిక్కిలి; ఉత్సాహున్ = ఉత్సాహముకలిగించువానిని; నత = నమస్కరించిన; చంద్రజూటున్ = శివుడు కలవానిని {చంద్రజూటుడు - చంద్రుడు శిఖయందు కలవాడు, శివుడు}; ఉన్నత = గొప్ప; కిరీటున్ = కిరీటము కలవానిని; హరినీల = ఇంద్రనీలము; నిభ = వంటి; కాయున్ = దేహము కలవానిని; వర = శ్రేష్ఠమైన; పీత = పచ్చని; కౌశేయున్ = పట్టువస్త్రము ధరించినవానిని; కటిసూత్రధారున్ = మొలనూలు ధరించినవానిని; జగత్ = లోకములెల్లను; విహారున్ = విహరించువానిని; హార = ముత్యాలపేరులు; వనమాలికా = వనమాలలచేత {వనమాల - పూలు ఆకులుతో కట్టిన దండలు}; మహిత = ఘనతవహించిన; ఉరు = పెద్ద; వక్షున్ = వక్షస్థలము కలవానిని; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; పద్మ = పద్మము; శార్ఙ్గ = శార్ఙ్గము అను విల్లు; హస్తున్ = చేతులందు ధరించినవానిని; లలిత = మనోజ్ఞమైన; శ్రీవత్స = శ్రీవత్సము అను; శోభిత = శోభకల; లక్షణ = గురుతుగల, పుట్టుమచ్చ కల; అంగున్ = దేహము కలవానిని; సుభగ = మనోహరమైన; చారిత్రున్ = నడవడిక కలవానిని; దేవకీసుతునిన్ = కృష్ణుని; కాంచి = చూసి.
భావము:- పద్మాక్షుడూ, భవబంధ విమోచనుడూ, దురిత దూరుడూ, నానాలంకార సంశోభితుడూ, దోష రహితుడూ, భక్తులకు ఉత్సాహాన్ని ఇచ్చేవాడూ, శివుడి చేత పొగడబడేవాడూ, సకల లోక విహారుడు, గరుడ వాహనుడూ, మంగళాకారుడూ, ఇంద్రనీల ఛాయ దేహము వాడూ, విశాల వక్షము వాడు, గొప్ప కిరీటం ధరించు వాడు, పచ్చని పట్టువస్త్రాలు ధరించు వాడు, ముత్యాల పేరులు వనమాలలు ధరించువాడు, శ్రీవత్సశోభితుడూ, శంఖ చక్ర గదా శార్ఞ్గ పద్మాలను ధరించు వాడు, పవిత్ర చరితుడూ, దేవకీపుత్రుడూ అయిన కృష్ణుడిని ఆ రాజులు అందరు చేరి దర్శించారు.

తెభా-10.2-748-చ.
రితముదాత్ములై, విగతబంధనులై, నిజమస్తముల్‌ మురా
సురిపు పాదపద్మములు సోఁకఁగఁ జాఁగిలి మ్రొక్కి నమ్రులై,
ములు మోడ్చి "యో! పరమకారుణికోత్తమ! సజ్జనార్తి సం
ణ వివేకశీల! మహితాశ్రితపోషణ! పాపశోషణా!

టీక:- భరిత = నిండు; ముద = సంతోషించిన; ఆత్ములు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి; విగత = పోయిన; బంధనులు = నిర్భంధములు కలవారు; ఐ = అయ్యి; నిజ = తమ; మస్తముల్ = తలలు; మురాసురరిపు = కృష్ణుని; పాద = పాదములు అను; పద్మములు = పద్మములు; సోకగన్ = తాకునట్లుగా; జాగిలి = సాగిలపడి; మ్రొక్కి = నమస్కరించి; నమ్రులు = అణకువ కలవారు; ఐ = అయ్యి; కరములు = చేతులు; మోడ్చి = జోడించి; ఓ = ఓ; పరమ = ఉత్కృష్టమైన; కారుణిక = దయ కలవారిలో; ఉత్తమ = ఉత్తముడా; సజ్జన = సత్పురుషుల; ఆర్తిన్ = దుఃఖమును; సంహరణ = పోగొట్టువాడ; వివేక = ఉచితానుచిత పరిజ్ఞానము కల; శీల = నడవడి కలవాడా; మహిత = గొప్పవాడ; ఆశ్రిత = ఆశ్రయించినవారిని; పోషణ = ప్రోచువాడ; పాప = పాపములను; శోషణా = ఆవిరి చేయువాడ.
భావము:- బంధవిముక్తులైన ఆ రాజులందరూ సంతోషించారు. కృష్ణుని పాదాలకు మ్రొక్కి, చేతులుజోడించి నమస్కారం చేసి అణుకువగా ఇలా స్తుతించారు. “ఓ దయామయా! సజ్జనుల దుఃఖాలను పోగొట్టేవాడా! ఆశ్రితరక్షకా! దురిత నివారణ!

తెభా-10.2-749-ఆ.
రద! పద్మనాభ! రి! కృష్ణ! గోవింద!
దాసదుఃఖనాశ! వాసుదేవ!
వ్యయాప్రమేయ! నిశంబుఁ గావింతు
మిందిరేశ! నీకు వందనములు

టీక:- వరద = శ్రీకృష్ణా {వరదుడు - కోరినకోరికలు ఇచ్చువాడు, విష్ణువు}; పద్మనాభ = శ్రీకృష్ణా {పద్మనాభుడు - పద్మము నాభిన కలవాడు, విష్ణువు}; హరి = శ్రీకృష్ణా {హరి - భక్తుల దుఃఖములు తొలగించువాడు, విష్ణువు}; కృష్ణ = శ్రీకృష్ణా {కృష్ణుడు - నల్లని వాడు, భక్తుల హృదయము లాకర్షించువాడు, కృష్ణుడు}; గోవింద = శ్రీకృష్ణా {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; దాసదుఃఖనాశ = శ్రీకృష్ణా {దాస దుఃఖ నాశి - భక్తుల దుఃఖములను నశింపజేయువాడు, విష్ణువు}; వాసుదేవ = శ్రీకృష్ణా {వాసుదేవుడు - వసుదేవుని పుత్రుడు, కృష్ణుడు}; అవ్యయా = శ్రీకృష్ణా {అవ్యయుడు - నాశనము లేనివాడు, విష్ణువు}; అప్రమేయ = శ్రీకృష్ణా {అప్రమేయుడు - మేరలకు కొలతలకు అతీతమైనవాడు, విష్ణువు}; అనిశంబున్ = ఎల్లప్పుడు; కావింతుము = చేయుదుము; ఇందిరేశ = శ్రీకృష్ణా {ఇందిరేశుడు - లక్ష్మీదేవి భర్త, విష్ణువు}; నీ = నీ; కున్ = కు; వందనములు = నమస్కారములు.
భావము:- వరదా! పద్మనాభా! శ్రీహరీ! శ్రీకృష్ణ! వాసుదేవా! గోవిందా! ఇందిరావల్లభా! ఆశ్రిత ఆర్తి హరణా! శాశ్వతా! అనంతా! లక్ష్మీపతి! నీకు ఎప్పుడూ నమస్కరిస్తూ ఉంటాము.

తెభా-10.2-750-ఉ.
ధీవిచార! మమ్ము భవదీయ పదాశ్రయులన్ జరాసుతో
దానిబంధనోగ్ర పరితాపము నీ కరుణావలోకనా
సాముచేత నార్చితివి; జ్జనరక్షయు దుష్టశిక్షయు
న్నాయ నీకుఁ గార్యములు యాదవవంశపయోధిచంద్రమా!

టీక:- ధీర = జ్ఞానము కల; విచార = ఆలోచనలు కలవాడ; మమ్మున్ = మమ్ములు; భవదీయ = నీ యొక్క; పద = పాదములను; ఆశ్రయులన్ = ఆశ్రయించినవారిని; జరాసుత = జరాసంధునిచే; ఉదార = మిక్కుటమైన; బంధన = నిర్బంధములవలన; ఉగ్ర = భయంకరమైన; పరితాపము = సంతాపమును; నీ = నీ యొక్క; కరుణా = దయతోకూడిన; అవలోకనా = అనుగ్రహ పూర్వక చూపుల యొక్క; సారము = జలము, చేవ; చేతన్ = చేత; ఆర్చితివి = పోగొట్టితివి; సజ్జన = సుజనులను; రక్షయున్ = కాపాడుట; దుష్ట = దుష్టులను; శిక్షయున్ = శిక్షించుట; ఆరయన్ = విచారించి చూడగా; నీ = నీ; కున్ = కు; కార్యములు = చేయు పనులు; యాదవవంశపయోధిచంద్రమా = శ్రీకృష్ణా {యాదవ వంశ పయోధి చంద్రమ - యాదవవంశము అను సముద్రమున (ఉప్పొంగుట)కు చంద్రుని వంటి వాడు}.
భావము:- యాదవవంశ మనే సముద్రానికి చంద్రుని వంటి వాడా! పరమజ్ఞానీ! శ్రీకృష్ణా! నీ పాదాలను ఆశ్రయించిన మాకు జరాసంధుడి బంధనాల వలన కలిగిన పరితాపాన్ని నీ కరుణాకటాక్షమనే జడివానతో చల్లార్చావు. అవును, సజ్జనులను రక్షించుట, దుర్జనులను శిక్షించుట చేయడమే నీ కర్తవ్యాలు కదా.

తెభా-10.2-751-సీ.
వధరింపుము మాగధాధీశ్వరుఁడు మాకు-
రమబంధుఁడు గాని గయకాఁడు
ప్రకటిత రాజ్యవైవ మదాంధీభూత-
చేతస్కులము మమ్ముఁ జెప్ప నేల?
మనీయ జలతరంముల కైవడి దీప-
శిఖవోలెఁ జూడ నస్థిరములైన
గురుసంపదలు నమ్మి సాధనక్రియా-
మ మేది తద్బాధకంబు లగుచుఁ

తెభా-10.2-751.1-తే.
రగు నన్యోన్య వైరానుబంధములను
బ్రజలఁ గారించుచును దుష్టభావచిత్తు
గుచు నాసన్న మృత్యుభయంబు దక్కి
త్తులై తిరుగుదురు దుర్మనుజు లంత.

టీక:- అవధరింపుము = వినుము; మాగధాధీశ్వరుడు = జరాసంధుడు; మా = మా; కున్ = కు; పరమ = మంచి; బంధుడు = మేలుచేయువాడు; కాని = అంతే తప్పించి; పగయ = పగవాడు; కాడు = కాడు; ప్రకటిత = ప్రసిద్ధములైన; రాజ్య = రాజ్యాధికారపు; వైభవ = వైభవముల వలన; మద = కొవ్వెక్కుటచేత; అంధీభూత = కళ్ళుకనిపించకపోయిన; చేతస్కులము = మనస్సులు కలవారము; మమ్మున్ = మా వృత్తాంతములుగురించి; చెప్పన్ = చెప్పవలసిన పని; ఏలన్ = ఏముంది; కమనీయ = మనోజ్ఞములైన; జల = నీటి; తరంగముల = అలల; కైవడి = వలె; దీప = దీపపు; శిఖ = జ్వాల; పోలెన్ = వలె; చూడన్ = విచారించగా; అస్థిరములు = చంచలములు; ఐన = అయిన; గురు = గొప్ప; సంపదలున్ = కలుములను; నమ్మి = నమ్మి; పర = పరలోకమునకు; సాధన = సాధకములైన; క్రియా = పనులు; ఆగమ = రాకపోవుట; ఏది = పోయి; తత్ = ఆ పరలోకప్రయోజనములకు; బాధకంబులు = పాడుచేయునవి; అగుచున్ = ఔతు; పరగు = వ్యాపించెడివైన; అన్యోన్య = పరస్పర; వైర = శత్రుత్వపు; అనుబంధములను = సంబంధములతో; ప్రజలన్ = లోకులను; కారించుచున్ = యాతనుపెడుతు; దుష్ట = దుర్మార్గపు; భావ = ఆలోచనలుకల; చిత్తులు = మనస్సులు కలవారు; అగుచున్ = ఔతు; ఆసన్న = దగ్గరకి వచ్చిన; మృత్యు = చావు; భయంబున్ = భయమును; తక్కి = పోయి; మత్తులు = ఒళ్ళుతెలియనివారు; ఐ = అయ్యి; తిరుగుదురు = వర్తిస్తారు; దుర్మనుజులు = చెడ్డమానవులు; అంతన్ = అంతట.
భావము:- వినవయ్యా శ్రీకృష్ణా! జరాసంధుడు మా దగ్గర బంధువే కాని శత్రువేం కాదు. రాజ్యవైభవం అనే మదాంధులమైన మా గురించి చెప్పటం అనవసరం. దుర్జనులు మనోజ్ఞమైన నీటి అలలలాగా, దీపశిఖలలాగా చంచలములు ఐన సిరిసంపదలు శాశ్వతాలని నమ్మి, పరానికి సంబంధించిన కార్యకలాపాలను పరిత్యజించుతారు; పరస్పరం విరోధాలను పెంచుకుంటూ దుష్ఠులు అయి, ప్రజలను బాధిస్తూ ఉంటారు; మరణభయాన్ని మరచిపోయి, పొగరుబోతులై ప్రవర్తిస్తారు.

తెభా-10.2-752-చ.
పటిచేఁత నైహికసుఖంబులఁ గోల్పడి రిత్త కోర్కి వెం
డిఁ బడి యెండమావులఁ బిపాసువులై సలిలాశ డాయుచుం
జెడు మనుజుల్‌ భవాబ్ధిదరిఁ జేరఁగలేక నశింతు; రట్టి యా
యిడుమలఁ బొందఁజాలము రమేశ! త్రిలోకశరణ్య! మాధవా!

టీక:- కడపటిచేతన్ = చావుచేత {కడపటిచేత - ఎల్ల పనులకు చివరి పని, చావు}; ఐహిక = ఇహలోకపు; సుఖంబులన్ = సుఖములను; కోల్పడి = పోగొట్టుకొని; రిత్త = వ్యర్థపు {రిక్త (ప్ర) - రిత్త (వి)}; కోర్కిన్ = కోరికల; వెంబడిబడి = వెనుకబడి; ఎండమావులున్ = మృగతృష్ణలు {ఎండమావులు - మధ్యాహ్న సమయమున ఎడారాదుల యందు నీటిచాలు వలె కనబడు నీడలు, భ్రాంతులు, మృగతృష్ణ, మరీచిక}; పిపాసువులు = దాహము వేస్తున్నవారు; ఐ = అయ్యి; సలిల = నీళ్ళమీది; ఆశన్ = ఆశతో; డాయుచున్ = సమీపించుచు; చెడు = నశించెడి; మనుజుల్ = మానవులు; భవ = పునర్జన్మల పరంపర అను; అబ్ధిన్ = సముద్రము; దరిజేరగలేక = తరించలేక, దాటలేకుండ; నశింతురు = నశించిపోతారు; అట్టి = అటువంటి; ఆ = అటువంటి; ఇడుములన్ = బాధలను; పొందజాలము = పొందలేము; రమేశ = శ్రీకృష్ణా {రమేశుడు - లక్ష్మిభర్త, విష్ణువు}; త్రిలోకశరణ్య = శ్రీకృష్ణా {త్రిలోక శరణ్యుడు - ముల్లోకములకు రక్షకుడు, విష్ణువు}; మాధవా = శ్రీకృష్ణా {మాధవుడు - మధు అనురాక్షసుని చంపినవాడు, విష్ణువు}.
భావము:- ఓ మాధవా! లక్ష్మీపతీ! త్రిలోకశరణ్యా! అట్టి దుర్జనులు చివరకు ఐహికసుఖాలను నష్టపోతారు; వ్యర్ధమైన కోరికల వెంటబడి నీళ్ళనే భ్రమతో ఎండమావులను చేరినట్లు భ్రష్టులైపోతారు; సంసారసముద్రాన్ని దాటలేక నశించిపోతారు; అటువంటి క్లేశములు మేము అనుభవించలేము.

తెభా-10.2-753-ఉ.
వేవధూశిరోమహితవీథులఁ జాల నలంకరించు మీ
పాసరోజయుగ్మము శుస్థితి మా హృదయంబులందు ని
త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెఱుంగఁబల్కు దా
మోర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా!"

టీక:- వేద = వేదములు అను; వధూ = స్త్రీ యొక్క; శిరః = తలమీది; మహిత = గొప్ప; వీథులన్ = పాపిడి యందు; చాలన్ = మిక్కిలి; అలంకరించు = అలంకరించునట్టి; మీ = మీ యొక్క; పాద = పాదముల అను; సరోజ = పద్మముల; యుగ్మమున్ = జంటను; శుభ = శుభములైన; స్థితిన్ = స్థితిని; మా = మా యొక్క; హృదయంబుల్ = మనస్సుల; అందున్ = లో; నిత్య = ఎడతెగకుండ; ఉదిత = పుట్టుచున్న; భక్తిమైన్ = భక్తితో; తగిలి = లగ్నమై, ఆసక్తులమై; ఉండు = ఉండెడి; ఉపాయమున్ = ఉపాయమును; ఎఱుంగన్ = తెలియునట్లు; పల్కు = చెప్పుము; దామోదర = కృష్ణా {దామోదరుడు - దామము ఉదరమున కలవాడు, కృష్ణుడు}; భక్త = భక్తుల యొక్క; దుర్ = దుష్టమైన; భవ = సంసారము అను; పయోనిధిన్ = సముద్రమును; తారణ = దాటించువాడ; సృష్టి = సృష్టి కలుగుటకు; కారణా = కారణభూత మైనవాడ.
భావము:- యశోదామాతచే ఉదరమున తాడు కట్టబడిన దామోదరా! శ్రీకృష్ణా! దుష్ట సంసారసాగరాన్ని తరింపచేసేవాడా. ఈ సమస్త సృష్టికీ కారణమైన వాడా. వేదాంత వీధుల్లో విహరించే నీ పాదపద్మాలు మా హృదయాల్లో ఎల్లప్పుడూ నిలచి ఉండే ఉపాయాన్ని మాకు అనుగ్రహించు.”

తెభా-10.2-754-క.
ని తను శరణము వేఁడిన
నాథుల వలను సూచి దమలభక్తా
చరితుఁడు పంకజలో
నుఁ డిట్లను వారితోడ దయామతియై.

టీక:- అని = అని; తను = తనను; శరణము = రక్షకము; వేడిన = కోరినట్టి; జననాథుల = రాజుల; వలను = వైపు; చూచి = చూసి; సత్ = మిక్కిలి; అమల = నిర్మలమైన; భక్త = భక్తులను; ఆవన = కాపాడెడి; చరితుడు = వర్తన కలవాడు; పంకజలోచనుడు = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగా; అనున్ = అనెను; వారి = వారల; తోడన్ = తోటి; సదయా = కృప గల; మతి = మనస్సు కలవాడు; ఐ = అయ్యి.
భావము:- భక్తజనావాసుడైన పద్మలోచనుడు దయతో కూడినవాడై, తనను శరణుకోరుతున్న ఆ రాజులకు ఇలా చెప్పాడు.

తెభా-10.2-755-చ.
"పతులార! మీ పలుకు త్యము; రాజ్యమదాంధచిత్తులై
ముగ విప్రులం బ్రజలఁ గాఱియఁ బెట్టుటఁ జేసి కాదె వే
హుష రావణార్జునులు నాశము నొందిరి; కాన ధర్మ పా
మునఁగాక నిల్చునె? కులంబుబలంబుఁ జిరాయురున్నతుల్.

టీక:- జనపతులారా = రాజులూ; మీ = మీ యొక్క; పలుకు = మాటలు; సత్యము = నిజమే; రాజ్య = రాజ్యాధికారపు; మద = గర్వముచేత; అంధ = కళ్ళు కనబడని; చిత్తులు = మనస్సులు కలవాడు; ఐ = అయ్యి; ఘనముగన్ = గొప్పగా; విప్రులన్ = బ్రాహ్మణులను; ప్రజలన్ = జనులను; కాఱియబెట్టుటన్ = యాతనపెట్టుట; చేసి = వలన; కాదె = కాదా; వేన్ = వేనుడు; నహుష = నహుషుడు; రావణ = రావణుడు; అర్జునులు = కార్తవీర్యార్జునుడు; నాశమున్ = నాశనము; ఒందిరి = పొందారు; కాన = కాబట్టి; ధర్మపాలనమునన్ = ధర్మపరిపాలనమువలన; కాక = కాకుండ; నిల్చునె = నిలబడునా, నిలబడదు; కులంబున్ = గొప్పవంశము; బలంబున్ = మిక్కిలి బలము; చిర = అధికమైన; ఆయుః = ఆయుష్షు; ఉన్నతుల్ = గౌరవములు.
భావము:- “ఓ రాజులారా! మీ మాట నిజం. రాజ్యమదంతో బ్రాహ్మణులనూ, ప్రజలనూ మిక్కిలి బాధించటం వలననే కదా వేనుడు, నహుషుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు నాశనమయ్యారు. కాబట్టి ధర్మాన్ని పాటించకపోతే కులం, బలం, ఆయుస్సు, ఔన్నత్యం నిలబడవు.

తెభా-10.2-756-వ.
అది గావున మీ మనంబుల దేహం బనిత్యంబుగాఁ దెలిసి.
టీక:- అదిగావున = కాబట్టి; మీ = మీ యొక్క; మనంబులన్ = మనస్సు లందు; దేహంబు = శరీరము; అనిత్యంబు = అశాశ్వతమైనది; కాన్ = ఐనట్లు; తెలిసి = తెలిసికొని.
భావము:- కావున, ఈ శరీరం శాశ్వతంకాదని మీరు గ్రహించండి...

తెభా-10.2-757-ఉ.
మీలు ధర్మముం దగవు మేరయుఁ దప్పక, భూజనాళిఁ బెం
పారుచు, సౌఖ్యసంపదల నందఁగఁ బ్రోచుచు, భూరియజ్ఞముల్‌
గౌవవృత్తి మత్పరముగా నొనరింపుచు, మామకాంఘ్రి పం
కేరుహముల్‌ భజించుచు నకిల్బిషులై చరియింపుఁ డిమ్ములన్.

టీక:- మీరలు = మీరు; ధర్మమున్ = ధర్మమును; తగవు = న్యాయము; మేరయున్ = మర్యాదలు; తప్పక = తప్పకుండా; భూజన = ప్రజలను {భూజనులు - భూ (రాజ్యము నందలి) జనులు, ప్రజలు}; ఆళిన్ = సమూహమును; పెంపారుచున్ = అతిశయించుచు; సౌఖ్య = సుఖములు; సంపదలన్ = కలుములు; అందగన్ = చెందునట్లు; ప్రోచుచున్ = కాపాడుతు; భూరి = పెద్ద; యజ్ఞముల్ = యాగములను; గౌరవ = గౌరవవంతమైన; వృత్తిన్ = విధానములతో; మత్ = నాకు; పరముగాన్ = చెందునట్లుగా; ఒనరింపుచు = చేస్తూ; మామక = మా యొక్క; అంఘ్రి = పాదములు అను; పంకేరుహముల్ = పద్మములను; భజించుచున్ = సేవించుచు; అకిల్బిషులు = పాపములు లేనివారు; ఐ = అయ్యి; చరియింపుడు = వర్తించండి; ఇమ్ములన్ = చక్కగా.
భావము:- మీరు ధర్మాన్నీ నీతినీ న్యాయాన్నీ తప్పకుండా ప్రజలు సుఖసంతోషాలలో మునిగితేలేలా పరిపాలన సాగించండి. నన్ను ఉద్దేశించి యజ్ఞయాగాదులను నిర్వహించండి. నా పాదాలను భజిస్తూ పాపరహితులై చక్కగా ప్రవర్తించండి.

తెభా-10.2-758-వ.
అట్లయిన మీరలు బ్రహ్మసాయుజ్య ప్రాప్తులయ్యెదురు; మదీయ పాదారవిందంబులందుఁ జలింపని భక్తియుఁ గలుగు"నని యానతిచ్చి యా రాజవరుల మంగళస్నానంబులు సేయించి, వివిధ మణి భూషణ మృదులాంబర మాల్యానులేపనంబు లొసంగి, భోజన తాంబూలాదులం బరితృప్తులం జేసి, యున్నత రథాశ్వ సామజాధిరూఢులం గావించి, నిజరాజ్యంబులకుఁ బూజ్యులంచేసి, యనిచిన.
టీక:- అట్లు = అలా; అయినన్ = అయినచో; మీరలు = మీరు; బ్రహ్మ = పరబ్రహ్మము నందు; సాయుజ్యము = కూడి ఉండుట, లీనమగుట; ప్రాప్తులు = పొందినవారు; అయ్యెదరు = ఔతారు; మదీయ = నా యొక్క; పాద = పాదములు అను; అరవిందంబుల్ = పద్మముల; అందున్ = ఎడల; చలింపని = నిశ్చలమైన; భక్తియున్ = భక్తి; కలుగును = లభించును; అని = అని; ఆనతిచ్చి = చెప్పి; ఆ = ఆ యొక్క; రాజ = రాజ; వరులన్ = ఉత్తములను; మంగళ = పరిశుద్ధ; స్నానంబులు = స్నానములు; చేయించి = చేయించి; వివిధ = నానా విధములైన; మణి = రత్నాలు; భూషణ = అలంకారములు; మృదుల = మెత్తని; అంబర = వస్త్రములు; మాల్య = పూలదండలు; అనులేపనంబులు = మైపూతలు; ఒసంగి = ఇచ్చి; భోజన = భోజనము; తాంబూల = తాంబూలములు; ఆదులన్ = మున్నగువానిచేత; పరితృప్తులన్ = సంతృప్తి చెందినవారిగా; చేసి = చేసి; ఉన్నత = ఉత్తమమైన; రథ = రథములు; అశ్వ = గుఱ్ఱములు; సామజ = ఏనుగులు; అధిరూఢులన్ = ఎక్కినవారిగా; కావించి = చేసి; నిజ = తమతమ; రాజ్యంబుల్ = రాజ్యముల; కున్ = కు; పూజ్యులన్ = గౌరవింపదగినవారిగా; చేసి = చేసి; అనిచినన్ = పంపించగా.
భావము:- మీరు కనక అలా నడచుకుంటే ముక్తిని పొందుతారు. నా పాదాలపై మీకు అచంచలమైన భక్తి సిద్ధిస్తుంది.” అని ఆనతి ఇచ్చి, శ్రీకృష్ణుడు ఆ రాజులకు అందరికీ మంగళస్నానాలు చేయించాడు. మణిభూషణాలూ, మాల్య వస్త్ర గంధాలనూ బహుకరించాడు. సుష్ఠుగా భోజన తాంబూలాదులు పెట్టించాడు. వారిని సంతృప్తులను చేసాడు. రథాలు గుఱ్ఱాలు గజాలు ఎక్కింపించి, వారి వారి రాజ్యాలకు పంపించాడు.

తెభా-10.2-759-క.
వరు లీ చందంబున
ముసంహరుచేత బంధమోక్షణులై సు
స్థిహర్షంబులతో నిజ
పుములకుం జనిరి శుభవిభూతి తలిర్పన్.

టీక:- నరవరులు = రాజులు; ఈ = ఈ; చందంబునన్ = రీతిగా; మురసంహరు = కృష్ణుని; చేతన్ = చేత; బంధ = చెరసాలలనుండి; మోక్షణలు = విడుదల చేయబడిన వారు; ఐ = అయ్యి; సుస్థిర = బాగా స్థిరమైన; హర్షంబుల = సంతోషముల; తోన్ = తోటి; నిజ = తమతమ; పురముల = పట్టణముల; కున్ = కు; చనిరి = వెళ్ళిపోయిరి; శుభ = మంగళకర మైన; విభూతిన్ = వైభవములు; తలిర్పన్ = అంకురించగా.
భావము:- జరాసంధుడిచే బంధింపబడిన ఆరాజులందరూ ఈ విధంగా శ్రీకృష్ణుడిచేత బంధవిముక్తులై, ఎంతో సంతోషంతో గౌరవప్రదంగా వారి వారి రాజ్యాలకు బయలుదేరారు.

తెభా-10.2-760-క.
రిమంగళగుణకీర్తన
నితముఁ గావించుచును వినిర్మలమతులై
గురుబంధుపుత్త్రజాయా
రిజన మలరంగఁ గృష్ణుఁ ద్మదళాక్షున్.

టీక:- హరి = కృష్ణుని; మంగళ = శుభకరములైన; గుణ = సుగుణములను; కీర్తనన్ = స్తుతించుటను; నిరతమున్ = ఎల్లప్పుడు; కావించుచున్ = చేస్తూ; వినిర్మల = మిక్కిలి నిర్మలములైన; మతులు = బుద్ధి కలవారు; ఐ = అయ్యి; గురు = పెద్దలను; బంధు = బంధువులను; పుత్ర = కొడుకులను; జాయా = పెండ్లాలు; పరిజనము = సేవకులు; అలరంగన్ = సంతోషించునట్లు; కృష్ణున్ = కృష్ణుని; పద్మదళాక్షున్ = కృష్ణుని {పద్మదళాక్షుడు - పద్మమురేకుల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}.
భావము:- తమ భార్యా పుత్రులు మిత్రులు మున్నగువారు సంతోషించగా నిర్మలహృదయులై పద్మాక్షుడు శ్రీకృష్ణుడి సద్గుణాలను సంకీర్తిస్తూ, శ్రీకృష్ణుడిని...

తెభా-10.2-761-వ.
బహుప్రకారంబులం బొగడుచుఁ దమతమ దేశంబులకుం జని.
టీక:- బహు = పెక్కు; ప్రకారంబులన్ = విధములుగా; పొగడుచున్ = శ్లాఘించుచు; తమతమ = వారివారి; దేశంబుల్ = రాజ్యముల; కున్ = కు; చని = వెళ్ళి.
భావము:- ఆ రాజులు అనేక రకాల నుతిస్తూ తమ తమ రాజ్యాలకు వెళ్ళారు.

తెభా-10.2-762-క.
ళినదళలోచనుఁడు దముఁ
దెలిపిన సద్ధర్మపద్ధతినిఁ దగవరులై
యిలఁ బరిపాలించుచు సుఖ
ము నుండిరి మహితనిజవిభుత్వము లలరన్.

టీక:- నళినదళలోచనుడు = కృష్ణుడు; తమున్ = వారికి; తెలిపిన = చెప్పినట్టి; సద్ధర్మ = మేలైన ధర్మబద్ధమైన; పద్ధతినిన్ = పద్ధతులలో; తగవరులు = న్యాయము నవలంబించిన వారు; ఐ = అయ్యి; ఇలన్ = రాజ్యములను; పరిపాలించుచున్ = ఏలుతు; సుఖములన్ = సౌఖ్యములతో; ఉండిరి = ఉన్నారు; మహిత = గొప్ప; నిజ = తమతమ; విభుత్వములు = విభులుగా నుండుటలు; అలరన్ = ప్రకాశింపగా.
భావము:- ఆ రాజులు అందరూ న్యాయశీలురై శ్రీకృష్ణుడు ప్రబోధించిన ధర్మమార్గాన్ని తప్పక తమ తమ రాజ్యాలను వైభవంగా పరిపాలించుకుంటూ సుఖంగా ఉన్నారు.

తెభా-10.2-763-వ.
ఇట్లు కృష్ణుండు జరాసంధవధంబును, రాజలోకంబునకు బంధమోక్షణంబును గావించి, వాయునందన వాసవనందనులుం దానును జరాసంధతనయుం డగు సహదేవుండు సేయు వివిధంబు లగు పూజలు గైకొని, యతని నుండ నియమించి, యచ్చోటు గదలి కతిపయప్రయాణంబుల నింద్రప్రస్థపురంబునకుం జనుదెంచి, తద్ద్వార ప్రదేశంబున విజయశంఖంబులు పూరించినఁ, బ్రతిపక్ష భయదంబును, బాంధవ ప్రమోదంబును నగు నమ్మహాఘోషంబు విని, పౌరజనంబులు జరాతనయు మరణంబు నిశ్చయించి సంతసిల్లిరి; వారిజాక్షుండును భీమసేన పార్థులతోఁ బురంబు ప్రవేశించి, ధర్మనందనునకు వందనం బాచరించి, తమ పోయిన తెఱంగును నచ్చట జరాసంధుని వధియించిన ప్రకారంబును సవిస్తరంబుగా నెఱింగించిన నతండు విస్మయవికచలోచనంబుల నానందబాష్పంబులు గురియ, నమ్మాధవు మాహాత్మ్యంబునకుఁ దమ యందలి భక్తి స్నేహ దయాది గుణంబులకుం బరితోషంబు నొందుచుఁ గృష్ణునిం జూచి యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగా; కృష్ణుండు = కృష్ణుడు; జరాసంధ = జరాసంధుని; వధంబును = చంపుట; రాజ = రాజులు; లోకంబున్ = ఎల్లర; కున్ = కు; బంధ = చెరలనుండి; మోక్షణంబు = విడుదలచేయబడుట; కావించి = చేసి; వాయునందన = భీముడు; వాసవనందనులున్ = అర్జునుడు {వాసవనందనుడు - ఇంద్రునికొడుకు, అర్జునుడు}; తానునున్ = అతను; జరాసంధ = జరాసంధుని; తనయుండు = కొడుకు; అగు = ఐన; సహదేవుండు = సహదేవుడు; చేయు = చేసెడి; వివిధంబులు = నానా విధములు; అగు = ఐన; పూజలున్ = మర్యాదలు; కైకొని = స్వీకరించి; అతనిన్ = అతనిని; ఉండన్ = ఆగమని; నియమించి = అనుజ్ఞ ఇచ్చి; ఆ = ఆ యొక్క; చోటున్ = ప్రదేశమునుండి; కదిలి = బయలుదేరి; కతిపయి = కొన్ని; ప్రయాణంబులన్ = ప్రయాణములచేత; ఇంద్రప్రస్థపురంబున్ = ఇంద్రప్రస్థము అను పట్టణమున; కున్ = కు; చనుదెంచి = వచ్చి; తత్ = దాని; ద్వార = ప్రవేశద్వారపు; ప్రదేశంబున = ప్రాంతమునుండి; విజయ = గెలుపు సూచకములైన; శంఖంబులు = శంఖములు; పూరించినన్ = ఊదగా; ప్రతి = శత్రువుల; పక్ష = పక్షపువారికి; భయదంబును = భయమును కలిగించునవి; బాంధవ = హితులకు; ప్రమోదంబును = సంతోషమును కలిగించునవి; అగు = ఐన; ఆ = ఆ; మహా = గొప్ప; ఘోషంబున్ = గట్టి ధ్వనిని; విని = విని; పౌర = పురము నందలి; జనంబులు = ప్రజలు; జరాతనయు = జరాసంధుని; మరణంబున్ = చావును; నిశ్చయించి = నిజమని ఎంచి; సంతసిల్లిరి = సంతోషించిరి; వారిజాక్షుండును = కృష్ణుడు; భీమసేన = భీముడు; పార్థుల = అర్జునులు; తోన్ = తోటి; పురంబున్ = పట్టణము; ప్రవేశించి = లోనికి వెళ్ళి; ధర్మనందనున = ధర్మరాజున; కున్ = కు; వందనంబు = నమస్కారము; ఆచరించి = చేసి; తమ = వారు; పోయిన = వెళ్ళిన; తెఱంగును = విధమును; అచ్చటన్ = అక్కడ; జరాసంధుని = జరాసంధుని; వధియించిన = చంపిన; ప్రకారంబును = విధమును; సవిస్తరంబుగా = వివరముగా; ఎఱింగించినన్ = తెలుపగా; అతండున్ = అతను; విస్మయ = ఆశ్చర్యముచేత; వికచ = విప్పారిన; లోచనంబులన్ = కన్నులనుండి; ఆనంద = ఆనందము వలని; బాష్పంబులు = కన్నీళ్ళు; కురియన్ = వర్షించగా; ఆ = ఆ ప్రసిద్ధుడైన; మాధవున్ = కృష్ణుని; మహాత్మ్యంబున్ = మహిమ; కున్ = కు; తమ = వారి, పాండవుల; అందలి = ఎడలి; భక్తి = భక్తి; స్నేహ = చెలిమి; దయ = కృప; ఆది = మున్నగు; గుణంబుల్ = గుణముల; కున్ = కు; పరితోషంబున్ = సంతోషమును; ఒందుచున్ = పొందుతు; కృష్ణునిన్ = కృష్ణుడిని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- అలా శ్రీకృష్ణుడు జరాసంధ సంహారం, రాజులందరినీ విడిపించుట నిర్వహించాడు. భీముడు అర్జునుడు తాను జరాసంధుడి కుమారుడు సహదేవుడు చేసిన పూజలను స్వీకరించారు. పిమ్మట, బయలుదేరి భీమార్జున సమేతుడై ఇంద్రప్రస్థపురం చేరాడు. పుర ముఖద్వారంలో వారు విజయశంఖాలు పూరించారు. శత్రు భీకరములు, బంధు ప్రీతికరములు అయిన ఆ విజయసూచకాలైన ఆ శంఖధ్వనులను విని, పౌరులందరూ జరాసంధుడు మరణించాడని గ్రహించి సంతోషించారు. శ్రీకృష్ణుడు భీమార్జున సహితంగా ధర్మరాజును దర్శించి నమస్కారం చేసి, తాము మగధకు వెళ్ళిన వృత్తాంతం అక్కడ జరిగిన జరాసంధ సంహారాది సర్వం వివరంగా నివేదించాడు. కన్నులలో ఆనందబాష్పాలు పొంగిపొరలుతుండగా కృష్ణుడికి తమమీద గల స్నేహ వాత్సల్య కారుణ్యాది గుణాలకు సంతోషిస్తూ ధర్మరాజు ఈ విధంగా అన్నాడు.

తెభా-10.2-764-సీ.
"మలాక్ష! సర్వలోములకు గురుఁడవై-
తేజరిల్లెడు భవదీయమూర్తి
యంశాంశసంభవు గు లోకపాలురు-
నీ యాజ్ఞఁ దలమోచి నిఖిలభువన
రిపాల నిపుణులై భాసిల్లుచున్న వా-
ట్టి నీ కొక నృపునాజ్ఞ సేయు
రయ నీమాయ గాది నిక్కమే? యేక-
మై యద్వితీయమై వ్యయంబు

తెభా-10.2-764.1-తే.
నైన నీ తేజమున కొక హాని గలదె?
చిన్మయాకార! నీ పాదసేవకులకు
నాత్మపరభేదబుద్ధి యెందైనఁ గలదె?
పుండరీకాక్ష! గోవింద! భువనరక్ష! "

టీక:- కమలాక్ష = కృష్ణా; సర్వ = ఎల్ల; లోకముల = లోకముల; కున్ = కు; గురుడవు = తండ్రివి; ఐ = అయ్యి; తేజరిల్లెడు = ప్రకాశించెడి; భవదీయ = నీ యొక్క; మూర్తిన్ = స్వరూపము యొక్క; అంశ = కళలోని భాగమునందలి; అంశ = భాగము (బాగాచిన్నఅంశ)తో; సంభవులు = పుట్టినవారు; అగు = ఐన; లోకపాలురు = దిక్పాలకులు {అష్టదిక్పాలకులు - 1 ఇంద్రుడు - తూర్పు దిక్కునకు 2 అగ్ని - ఆగ్నేయ మూలకు 3 యముడు - దక్షిణ దిక్కునకు 4 నిరృతి - నైఋతి మూలకు 5 వరుణుడు - పడమటి దిక్కునకు 6 వాయువు -వాయవ్య మూలకు 7 కుబేరుడు - ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు - ఈశాన్య మూలకు పరిపాలకులు}; నీ = నీ యొక్క; ఆజ్ఞన్ = ఉత్తరువలను; తలమోచి = శిరసావహించి; నిఖిల = ఎల్ల; భువన = లోకములను; పరిపాలనిపుణులు = ఏలజాలినవారు; ఐ = అయ్యి; భాసిల్లుచున్నవారు = ప్రకాశించుచున్నారు; అట్టి = అటువంటి; నీ = నీ; కున్ = కు; ఒక = ఒక; నృపున్ = రాజు యొక్క; ఆజ్ఞన్ = ఉత్తరువులను; చేయుట = అనుసరించుట; అరయన్ = విచారించిచూడగా; నీ = నీ యొక్క; మాయ = మాయ; కాక = అంతేతప్పించి; అది = అట్టిది; నిక్కమే = నిజమా, కానేరదు; ఏకమై = ఉన్నది ఒక్కటే; ఐ = అయ్యి; అద్వితీయము = తనుకానిది మరొకటిలేనిది; ఐ = అయ్యి; అవ్యయంబు = నశింపనిది; ఐన = అగు; నీ = నీ యొక్క; తేజమున్ = తేజస్సున; కున్ = కు; ఒక = కొద్దిగానైనా; హాని = నష్టమన్నది; కలదె = ఉన్నదా, లేనేలేదు; చిన్మయకారా = జ్ఞానస్వరూపమైన ఆకృతికలవాడ; నీ = నీ యొక్క; పాద = పాదములందు; సేవకుల్ = భక్తుల; కున్ = కు; ఆత్మ = తాను; పర = ఇతరులు అను; భేద = భేదముకల; బుద్ధి = మనస్సు; ఎందైనన్ = ఎక్కడైనను; కలదె = ఉన్నదా, లేదు; పుండరీకాక్ష = కృష్ణా; గోవింద = కృష్ణా; భువనరక్ష = లోకరక్షకుడా.
భావము:- “ఓ కమల నయనా! శ్రీకృష్ణా! నీ అంశంనుండి జన్మించిన దిక్పాలకులు అందరూ సర్వలోకాలకూ గురుడవైన నీ ఆజ్ఞను శిరసావహిస్తూ లోకాలు అన్నింటినీ పరిపాలిస్తున్నారు. అంతటి నీకు ఒక సామాన్యుడైన భూపాలుడిని శిక్షించడం ఒక లెక్కలోనిది కాదు. ఇదంతా నీ మాయ కాక మరేమిటి గోవిందా! పుండరీకాక్ష! లోకరక్షకా! చిన్మయరూపా! అద్వితీయమైన నీ తేజస్సుకు తిరుగు లేదు. నీ పాదసేవకులకు భేదభావం ఏమాత్రం కానరాదు.”