Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రాజసూయంబు నెఱవేర్చుట

వికీసోర్స్ నుండి

రాజసూయంబునెఱవేర్చుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రాజసూయంబు నెఱవేర్చుట)
రచయిత: పోతన


తెభా-10.2-765-వ.
అని గోవిందునిం బొగడి, యద్దేవు ననుమతంబునం గుంతీసుతాగ్రజుండు పరతత్త్వవిజ్ఞాను లైన ధరిణీసురులను ఋత్విజులంగా వరియించి.
టీక:- అని = అని; గోవిందునిన్ = కృష్ణుని; పొగిడి = స్తుతించి; ఆ = ఆ; దేవున్ = కృష్ణదేవుని; అనుమతంబునన్ = అంగీకారములతో; కుంతీసుతాగ్రజుండు = ధర్మరాజు {కుంతీసుతాగ్రజుడు - కుంతీదేవి కొడుకులలో పెద్దవాడు, ధర్మరాజు}; పరతత్త్వవిజ్ఞానులు = ఆధ్యాత్మిక జ్ఞానము కలవారు; ఐన = అగు; ధరణీసురులను = విప్రులను; ఋత్విజులన్ = యాగము చేయించెడివారు; కాన్ = అగునట్లు; వరియించి = ఎన్నుకొని.
భావము:- ఈవిధంగా ధర్మరాజు కృష్ణుడిని నుతించి ఆయన ఆజ్ఞానుసారం వేదవిజ్ఞానధనులైన బ్రాహ్మణులను యజ్ఞకార్యనిర్వాహకులుగా స్వీకరించాడు.

తెభా-10.2-766-సీ.
సాత్యవతేయ, కశ్యప, భరద్వాజోప-
హూతి, విశ్వామిత్ర, వీతిహోత్ర,
మైత్రేయ, పైల, సుమంతు, మధుచ్ఛంద,-
గౌతమ, సుమతి, భార్గవ, వసిష్ఠ,
వామదేవాకృతవ్రణ, కణ్వ, జైమిని,-
ధౌమ్య, పరాశరార్వ, కవషు,
సిత, వైశంపాయ, నాసురి, దుర్వాస,-
క్రతు, వీరసేన, గర్గ, త్రికవ్య,

తెభా-10.2-766.1-ఆ.
ముఖ్యులైన పరమమునులను, గృపుని, గాం
గేయ, కుంభజాంబికేయ, విదుర,
కురుకుమార, బంధు, కులవృద్ధ, ధారుణీ
సుర, నరేంద్ర, వైశ్య, శూద్రవరుల.

టీక:- సాత్యవతేయ = వ్యాసుడు {సాత్యవతేయుడు - సత్యవతి యొక్క కొడుకు, వ్యాసుడు}; కశ్యప = కశ్యపుడు; భరద్వాజ = భరద్వాజుడు; ఉపహూతి = ఉపహూతి; విశ్వామిత్ర = విశ్వామిత్రుడు; వీతిహోత్ర = వీతిహోత్రుడు; మైత్రేయ = మైత్రేయుడు; పైల = పైలుడు; సుమంతు = సుమంతుడు; మధుచ్ఛంద = మధుచ్ఛందుడు; గౌతమ = గౌతముడు; సుమతి = సుమతి; భార్గవ = భార్గవుడు; వసిష్ఠ = వసిష్ఠుడు; వామదేవ = వామదేవుడు; అకృతవ్రణ = అకృతవ్రణుడు; కణ్వ = కణ్వుడు; జైమిని = జైమిని; ధౌమ్య = ధౌమ్యుడు; పరాశర = పరాశరుడు; అధర్వ = అధర్వుడు; కవషు = కవషుడు; లసిత = లసితుడు; వైశంపాయన = వైశంపాయనుడు; ఆసురి = ఆసురి; దుర్వాస = దుర్వాసుడు; క్రతు = క్రతువు; వీరసేన = వీరసేనుడు; గర్గ = గర్గుడు; త్రికవ్య = త్రికవ్యుడు; ముఖ్యులైన = మొదలైన; పరమ = ఉత్తములైన; మునులనున్ = ఋషులను {ముని - జ్ఞానముచేత మౌనము వహించినవాడు}; కృపుని = కృపాచార్యుడు; గాంగేయ = భీష్ముడు {గాంగేయుడు - గంగయొక్క కుమారుడు, భీష్ముడు}; కుంభజ = ద్రోణుడు {కుంభజుడు - కుంభమున జన్మించిన వాడు, ద్రోణుడు}; ఆంబికేయ = ధృతరాష్ట్రుడు {ఆంబికేయుడు - వ్యు. అంబికాయాః అపత్యమ్‌-అంబికా + ఢక్‌. (త.ప్ర.). ఆంధ్రశబ్దరత్నాకరం, అంబికయొక్క పుత్రుడు, ధృతరాష్ట్రుడు}; విదుర = విదురుడు; కురుకుమార = దుర్యోధనుడు; బంధు = బంధువులు; కులవృద్ధ = కులపెద్దలు; ధారుణీసుర = బ్రాహ్మణులు; నరేంద్ర = రాజోత్తమ; వైశ్య = వైశ్యులు; శూద్ర = శూద్రులులోని; వరులన్ = శ్రేష్ఠులను.
భావము:- సత్యవతీ కుమారుడు వేదవ్యాసుడు, కశ్యపుడు, ఉపహూతి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వీతిహోత్రుడు, మైత్రేయుడు, పైలుడు, సుమంతుడు, మధుచ్ఛందుడు, గౌతముడు, సుమతి, భార్గవుడు, వసిష్ఠుడు, వామదేవుడు, అకృతవ్రణుడు, కణ్వుడు, జైమిని, ధౌమ్యుడు, పరాశరుడు, అధర్వుడు, కవషులు, అసితుడు, వైశంపాయనుడు, ఆసురి, దుర్వాసుడు, క్రతువు, వీరసేనుడు, గర్గుడు, త్రికవ్యుడు మొదలైన మునీశ్వరులనూ; ద్రోణుడు, కృపాచార్యుడు ఆది గురువులనూ; భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మున్నగు కురువృద్ధులనూ; దుర్యోధనాది బంధుజనాన్నీ; అలా గురు బంధు మిత్ర కులవృద్ధులను అందరినీ, సమస్త బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ముఖ్యులనూ; ధర్మరాజు తన యజ్ఞానికి రప్పించాడు.

తెభా-10.2-767-క.
ప్పింప వారు హర్షము
లుప్పతిలఁగ నేఁగుదెంచి, యుచితక్రియలం
ప్పక కనుఁగొనుచుండఁగ
ప్పుడు విధ్యుక్త నియతులై భూమిసురుల్.

టీక:- రప్పింపన్ = పిలిపించగా; వారున్ = వారు; హర్షములు = సంతోషములు; ఉప్పతిలగన్ = పుట్టగా; ఏగుదెంచి = వచ్చి; ఉచిత = తగినట్టి; క్రియలన్ = విధములుగా; తప్పక = వదలకుండా; కనుగొనుచుండగన్ = చూస్తుండగా; అప్పుడు = అప్పుడు; విధ్యుక్త = శాస్త్రములలో చెప్పిబడిన; నియతులు = నిష్ఠ కలవారు; ఐ = అయ్యి; భూమిసురుల్ = బ్రాహ్మణులు.
భావము:- ధర్మరాజు ఆహ్వానించిన వారంతా విచ్చేసి సంతోషంతో ఉచిత కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండగా, బ్రాహ్మణశ్రేష్ఠులు శాస్త్ర ప్రకారం యజ్ఞం ప్రారంభించారు.

తెభా-10.2-768-ఆ.
డఁగి సవనభూమిఁ నకలాంగలముల
ర్థి దున్ని పాండవాగ్రజునకు
చట దీక్షచేసి యంచితస్వర్ణ మ
యోపకరణముల నలోపముగను,

టీక:- కడగి = ప్రారంభించి; సవన = యజ్ఞ; భూమిన్ = భూమిని; కనక = బంగారు; లాంగలములన్ = నాగళ్ళతో; అర్థిన్ = అక్కరతో; దున్ని = దున్ని; పాండవాగ్రజున్ = ధర్మరాజున {పాండవాగ్రజుడు - పంచపాండవులలోను పెద్దవాడు, ధర్మరాజు}; కున్ = కు; అచటన్ = అక్కడ; దీక్ష = దీక్షతీసుకొన్నవానిగా; చేసి = చేసి; అంచిత = చక్కటి; స్వర్ణ = బంగారముతో; మయ = చేసిన; ఉపకరణములన్ = సాధనములతో; అలోపముగన్ = లోపము లేకుండ.
భావము:- పూని యజ్ఞభూమిని బంగారునాగళ్ళతో దున్నించి, సువర్ణమయమైన పరికారాలతో ఏలోపం రాకుండా పంచపాండవులలో పెద్దవాడైన ధర్మరాజుకు యజ్ఞదీక్ష ఇచ్చారు.

తెభా-10.2-769-వ.
ఇట్లు నియమంబున సముచిత క్రియాకలాపంబులు నడపుచుండి రప్పుడు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; నియమంబునన్ = నియముల ప్రకారము; సముచిత = తగిన; క్రియా = పనుల; కలాపంబులు = సముదాయములు; నడపుచున్ = చేస్తు; ఉండిరి = ఉన్నారు; అప్పుడు = ఆ సమయము నందు;
భావము:- అలా బ్రాహ్మణులు నియమం ప్రకారం ఉచితమైన కార్యకలాపాలు నడుపుతున్నారు. ఆ సమయంలో....

తెభా-10.2-770-క.
లావనీశు లిచ్చిన
లంక సువర్ణరత్న య ధన వస్త్ర
ప్రరంబులు మొదలగు కా
ను లందుకొనన్ సుయోధనుని నియమించెన్.

టీక:- సకల = ఎల్ల; అవనీశులు = రాజులు; ఇచ్చిన = ఇచ్చెడి; అకలంక = కలంకములేని; సువర్ణ = బంగారము; రత్న = మణులు; హయ = గుఱ్ఱములు; ధన = ధనము; వస్త్ర = బట్టలు; ప్రకరంబులున్ = సమూహములు; మొదలగు = మున్నగు; కానుకలున్ = బహుమతులను; అందుకొనన్ = పుచ్చుకొనుటకు; సుయోధనుని = దుర్యోధనుని; నియమించెన్ = ఏర్పరచెను.
భావము:- ధర్మరాజు సమస్తభూపతులూ తనకు సమర్పించే ధన, కనక, వస్తు, వాహనాదులైన కానుకలను స్వీకరించటానికి దుర్యోధనుడిని నియమించాడు.

తెభా-10.2-771-సీ.
ర్థిజాతము గోరిట్టి వస్తువు లెల్లఁ-
గఁ బంచియిడఁగఁ రాధాతనూజు,
రసాన్న పానాది కలపదార్థముల్‌-
పాకముల్‌ సేయింపఁ వనతనయుఁ,
బంకజోదరు నొద్దఁ బాయక పరిచర్య-
విలి కావింప వావతనూజు,
వన నిమిత్తంబు సంచితద్రవ్యంబు-
పెంపుతో వేగఁ దెప్పింప నకులు,

తెభా-10.2-771.1-తే.
దేగురు వృద్ధధాత్రీసురాలులను
రసి పూజింప సహదేవు ఖిలజనులఁ
బొలుచు మృష్టాన్న తతులఁ దృప్తులను జేయ
ద్రౌపదిని నియమించెను ర్మసుతుఁడు.

టీక:- అర్థి = యాచకుల; జాతము = సమూహము; కోరినట్టి = అడిగిన; వస్తువులు = పదార్థములను; ఎల్లన్ = అన్నిటిని; తగన్ = తగినట్లు; పంచియిడగన్ = పంచిపెట్టుటకు; రాధాతనూజున్ = కర్ణుని; సరస = రుచికల; అన్న = భోజన పదార్థములు; పానా = తాగునట్టి పదార్థములు; ఆది = మున్నగు; సకల = సమస్తమైన; పదార్థముల్ = పదార్థములను; పాకముల్ = వంటలు; చేయింపన్ = చేయించుటకు; పవనతనయున్ = భీముని; పంకజోదరున్ = కృష్ణుని; ఒద్దన్ = దగ్గర; పాయక = ఎడబాయకుండ; పరిచర్య = ఉపచారములు; తవిలి = ఆసక్తికలిగి; కావింపన్ = చేయుటకు; వాసవతనూజున్ = అర్జునుని; సవన = యజ్ఞము; నిమిత్తంబున్ = కోసము అవసరమయ్యెడి; సంచిత = కూడబెట్టిన; ద్రవ్యంబున్ = వస్తువులు; పెంపు = అధిక్యము; తోన్ = తోటి; వేగన్ = వేగముగా; తెప్పింపన్ = తెప్పించుటకు; నకులున్ = నకులుడిని; దేవ = దేవతలు; గురు = పూజ్యులు; వృద్ధ = పెద్దలు; ధాత్రీసుర = బ్రాహ్మణులు; ఆవలులను = సమూహమును; అరసి = విచారించిచూసుకొని; పూజింపన్ = మర్యాదలుచేయుటకు; సహదేవున్ = సహదేవుని; అఖిల = ఎల్ల; జనులన్ = వారిని; పొలుచు = ఒప్పునట్టి; మృష్టాన్న = మంచిభోజనముల; తతులన్ = సమూహములచే; తృప్తులను = సంతృప్తిచెందినవారిగా; చేయన్ = చేయుటకు; ద్రౌపదిని = ద్రౌపదిని; నియమించెను = ఏర్పరచెను; ధర్మసుతుడు = ధర్మరాజు.
భావము:- కర్ణుడిని యాచకులు అడిగిన వస్తువులను దానం చేయటానికి; భీముడిని షడ్రసోపేత భోజనపదార్థాలను తయారు చేయించటానికి; శ్రీకృష్ణుడికి సేవలు చేయటానికి అర్జునుడిని; నకులుడిని యజ్ఞానికి అవసరమైన సంబారాలను సమకూర్చటానికి; సహదేవుడిని దేవతలను బ్రాహ్మణులను గురువులను పెద్దలను గౌరవించటానికి; యాగానికి విచ్చేసిన సమస్త ప్రజలూ మృష్టాన్నపానాలతో సంతుష్టులయ్యేలా చూడడానికి ద్రౌపదినీ; ధర్మరాజు నియమించాడు.

తెభా-10.2-772-వ.
అయ్యవసరంబున.
టీక:- ఆ = ఆ యొక్క; అవసరంబునన్ = సమయము నందు.
భావము:- అలా యాగం జరుగుతుంటే….

తెభా-10.2-773-చ.
రి శిఖి దండపాణి నికషాత్మజ పాశి సమీర గుహ్యకే
శ్వ శశిమౌళి పంకరుహసంభవ చారణ సిద్ధ సాధ్య కి
న్న గరుడోరగామరగణంబులు వచ్చి మఖంబుఁ జూచి య
చ్చెరువడి "తొల్లి యెవ్వరునుఁ జేయుమఖంబులునింత యొప్పునే

టీక:- హరి = ఇంద్రుడు {హరి - భక్తుల హృదయములు ఆకర్షించువాడు, ఇంద్రుడు, తూర్పు దిక్పతి}; శిఖి = అగ్ని {శిఖి - శిఖ (మంటలు) కలవాడు, అగ్ని, ఆగ్నేయ దిక్పతి}; దండపాణి = యముడు {దండపాణి - దండించుట చేపట్టినవాడు, యముడు, దక్షిణ దిక్పతి}; నికషాత్మజ = నైరృతి {నికషాత్మజుడు - నికష అను రాక్షసికి పుట్టినవాడు, నైరృతి, నైరృత దిక్పతి}; పాశి = వరుణుడు {పాశి - పాశములు ఆయుధముగా కలవాడు, వరుణుడు, పడమటి దిక్పతి}; సమీర = వాయువు {సమీరుడు - లెస్సగా చరించువాడు, వాయువు, వాయవ్య దిక్పతి}; గుహ్యకేశ్వర = కుబేరుడు {గుహ్యకేశ్వరుడు - గుహ్యకులు ప్రభువు, కుబేరుడు, ఉత్తర దిక్పతి}; శశిమౌళి = ఈశానుడు {శశిమౌళి - చంద్రుడు సిగలో కలవాడు, ఈశానుడు, ఈశాన్య దిక్పతి}; పంకరుహసంభవ = బ్రహ్మదేవుడు {పంకరుహసంభవ - పద్మజుడు, బ్రహ్మ}; చారణ = చారణులు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; కిన్నర = కిన్నరలు; గరుడ = గరుడులు, ఖేచరులు; ఉరగ = సర్పములు; అమర = దేవతలు; గణంబులున్ = సమూహములు; వచ్చి = వచ్చి; మఖంబున్ = యజ్ఞమును; చూచి = చూసి; అచ్చెరుపడి = ఆశ్చర్యపోయి; తొల్లి = ఇంతకు మునుపు; ఎవ్వరునున్ = ఎవరుకూడ; చేయు = చేసినట్టి; మఖంబులున్ = యజ్ఞములు; ఇంత = ఇంత ఎక్కువగా; ఒప్పునే = చక్కగా ఉన్నయా, లేవు.
భావము:- దేవేంద్రుడు మొదలైన దిక్పాలురూ; బ్రహ్మాది దేవతలూ; సిద్ధ, సాధ్య, కిన్నర, చారణ, గరుడ, నాగ మున్నగు దేవగణములు; వచ్చి ధర్మరాజు చేస్తున్న యజ్ఞాన్ని చూసారు. “ఇంతకు పూర్వం యే రాజు కూడా ఇంత గొప్పగా యజ్ఞం చేయలే” దని మెచ్చుకున్నారు.

తెభా-10.2-774-క.
దిగాక యిందిరావిభు
ములు సేవించునట్టి భాగ్యము గలుగం
దుదిఁ బడయరాని బహు సం
లెవ్వియుఁ గలవె?"యనుచుఁ బ్రస్తుతి సేయన్.

టీక:- అదిగాక = అంతేకాకుండ; ఇందిరావిభున్ = కృష్ణుని యొక్క {ఇందిరా విభుడు - లక్ష్మీదేవిభర్త, విష్ణువు}; పదములున్ = పాదములను; సేవించునట్టి = కొలుచునట్టి; భాగ్యము = అదృష్టము; కలుగన్ = కలుగగా; తుదిన్ = చివరకి; పడయరాని = పొందలేని; బహు = పెక్కు; సంపదలు = సంపదలు; ఎవ్వియున్ = ఏవైనా; కలవె = ఉన్నాయా, లేవు; అనుచున్ = అంటు; ప్రస్తుతి = కీర్తించుట; చేయన్ = చేయగా.
భావము:- అంతేకాకుండా, “శ్రీకృష్ణుడి పాదపద్మాలు పూజించే భాగ్యం పొందిన వారికి, పొందలేని దంటూ ఏదీ ఉండదు” అని బ్రహ్మాదులు ప్రస్తుతించారు.

తెభా-10.2-775-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = ఆ సమయము నందు.
భావము:- అంతట....

తెభా-10.2-776-చ.
రసమానులై తనరు యాజకవర్గములోలి రాజసూ
ఖవిధానమంత్రముల గ్నిముఖంబుగఁ జేసి ధర్మజుం
గ్రమున వేలిపింపఁ గ్రతురాజసమాప్తిదినంబునన్ నృపో
త్తముఁడు గడంగి యాజకసస్య గురుద్విజకోటిఁ బెంపునన్.

టీక:- అమర = దేవతలతో; సమానులు = సమానమైనవారు; ఐ = అయ్యి; తనరు = ఒప్పునట్టి; యాజక = యజ్ఞము చేయించువారి; వర్గములు = సమూహములు; ఓలిన్ = క్రమముగా; రాజసూయ = రాజసూయము అను; మఖ = యజ్ఞము యొక్క; విధాన = విధానము లందలి; మంత్రములన్ = మంత్రములతో; అగ్నిముఖంబునన్ = అగ్నికి ఆహుతి ఇచ్చుట ముఖ్యముగ; చేసి = చేసి; ధర్మజున్ = ధర్మరాజుచేత; క్రమమునన్ = క్రమముగా; వేలిపింపన్ = హోమము చేయించగా; క్రతు = యజ్ఞ; రాజ = శ్రేష్ఠము; సమాప్తి = ముగియునట్టి; దినంబునన్ = రోజున; నృపోత్తముడు = ధర్మరాజు; కడగి = పూని; యాజక = ఋత్విక్కుల; సదస్య = సభికుల; గురు = పూజ్యుల; ద్విజ = బ్రాహ్మణుల; కోటిన్ = సమూహమును; పెంపునన్ = గౌరవముతో.
భావము:- దేవతలతో సమానులైన ఋత్విక్కులు రాజసూయ యాగానికి అనువైన మంత్రాలతో హవ్య ద్రవ్యాలను ధర్మరాజుచేత వేలిపించి యాగాన్ని నడిపించారు. ధర్మరాజు ఋత్విక్కులనూ, సభాసదులనూ, పెద్దలనూ, బ్రాహ్మణులనూ యజ్ఞం పరిసమాప్తమైన చివరిదినం పూజించాలని భావించాడు.

తెభా-10.2-777-వ.
పూజించునప్పు డందగ్రపూజార్హు లెవ్వరని యడిగిన సదస్యులు దమకుఁ దోఁచిన విధంబులం బలుక వారి భాషణంబులు వారించి వివేకశీలుండును, జతురవచనకోవిదుండును నగు సహదేవుండు భగవంతుండును, యదుకులసంభవుండును నైన శ్రీకృష్ణునిం జూపి “యిమ్మహాత్ముని సంతుష్టుంజేసిన భువనంబు లన్నియుం బరితుష్టిం బొందు” నని చెప్పి ధర్మజుం జూచి యిట్లనియె.
టీక:- పూజించున్ = గౌరవించు; అప్పుడు = సమయము నందు; అందున్ = వారందరిలోను; అగ్ర = మొట్టమొదటిగా, ఉన్నతునిగా; పూజన్ = సన్మానించుటకు; అర్హులు = తగినవారు; ఎవ్వరు = ఎవరు; అని = అని; అడిగినన్ = అడుగగా; సదస్యులు = సభికులు; తమ = వారల; కున్ = కు; తోచిన = తట్టిన; విధంబులన్ = విధములుగా; పలుకన్ = చెప్పుతుండగా; వారి = వారల; భాషణంబులు = మాటలను; వారించి = అడ్డుకొని; వివేకశీలుండును = యుక్తాయుక్త విచక్షణుడు; చతుర = నేర్పుగా; వచన = మాట్లాడుట; కోవిదుండును = బాగా తెలిసినవాడు; అగు = ఐన; సహదేవుండు = సహదేవుడు; భగవంతుండును = షడ్గుణైశ్వర్య సంపన్నుడు; యదు = యదువు యొక్క; కుల = వంశమున; సంభవుండును = పుట్టినవాడు; ఐన = అయిన; శ్రీకృష్ణునిన్ = శ్రీకృష్ణుడిని; చూపి = చూపించి; ఈ = ఈ దివ్యమైన; మహాత్ముని = మహాత్ముడిని; సంతుష్టున్ = తృప్తిపడినవానిగా; చేసినన్ = చేసినచో; భువనంబులు = లోకములు; అన్నియున్ = ఎల్ల; పరితుష్టిన్ = తృప్తిని; పొందును = పొందుతాయి; అని = అని; చెప్పి = చెప్పి; ధర్మజున్ = ధర్మరాజును; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా యాగాంతంలో పెద్దలను పూజించే సందర్భంలో అగ్రపూజకు అర్హులు ఎవరు అని అడుగగా, సభలో ఉన్నవారు ఎవరికి తోచినట్లు వారు తలకొక రకంగా చెప్పసాగారు. వారి మాటలను వారించి, వాక్ చాతుర్యం కలవాడు, బుద్ధిమంతుడు ఐన సహదేవుడు కృష్ణుడిని చూపించి “ఈ మహాత్ముడిని సంతుష్టుణ్ణి చేస్తే సమస్త లోకాలూ సంతోషిస్తాయి.” అని పలికి ధర్మరాజుతో ఇలా అన్నాడు.

తెభా-10.2-778-ఉ.
"కాము దేశమున్ గ్రతువుఁ ర్మముఁ గర్తయు భోక్తయున్ జగ
జ్జాముదైవమున్గురువుసాంఖ్యముమంత్రమునగ్నియాహుతుల్‌
వేలు విప్రులున్ జనన వృద్ధి లయంబుల హేతుభూతముల్‌
లీలఁ దాన యై తగ వెలింగెడు నెక్కటితేజ మీశుఁడున్.

టీక:- కాలము = ప్రవాహ రూపమైన కాలము ఎల్ల; దేశమున్ = ఎల్ల దేశములు; క్రతువు = ఎల్ల యజ్ఞములు; కర్మము = చేయుట, క్రియలు; కర్త = చేయువాడు; భోక్త = యజ్ఞఫలము అనుభవించువాడు; జగత్ = ఎల్లలోకముల; జాలమున్ = సమూహము; దైవమున్ = యజ్ఞమునకు దేవుడు; గురువు = యజ్ఞము చేయించువాడు; సాంఖ్యము = సాంఖ్యయోగము; మంత్రమున్ = యజ్ఞ మంత్రములు; అగ్ని = అగ్నిహోత్రుడు; ఆహుతులు = ఆహుతి చేయబడిన వపాజ్యాదులు; వేళలున్ = యజ్ఞసమయములు; విప్రులున్ = బ్రాహ్మణులు; జనన = పుట్టుక; వృద్ధి = పెంపు; లయంబులున్ = నాశములు; హేతుభూతములు = కారణభూతములు; లీలలన్ = విలాసములతో; తాన = తనే; ఐ = అయ్యి; తగన్ = మిక్కిలి; వెలింగెడు = ప్రకాశించెడి; ఎక్కటి = అద్వితీయ మైన ఐన; తేజమున్ = తేజస్సు; ఈశుడున్ = సర్వనియామకుడును.
భావము:- “కాలము, దేశము, యజ్ఞము, కర్మము, కర్త, భోక్త, లోకాలు, దైవము, గురువు, మంత్రము, అగ్ని, ఆహుతులు, యాజికులు, సృష్టిస్థితిలయాలూ, సమస్తము తానే అయి ప్రకాశించే ఏకైక దివ్యస్వరూపుడు ఈ శ్రీకృష్ణపరమాత్ముడు ఒక్కడే.

తెభా-10.2-779-చ.
తఁడె యితండు గన్ను లొకయించుక మోడ్చిన నీ చరాచర
స్థిభువనంబు లన్నియు నశించు నితం డవి విచ్చిచూచినన్
వితములై జనించుఁ బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు నైన యట్టి యీ
క్రతుఫలదుండుగా కొరుఁ డొకం డెటు లర్హుఁడు శిష్టపూజకున్?

టీక:- ఇతడె = ఇతనే; ఇతండు = ఇతను, ఈ కృష్ణుడు; కన్నులున్ = కళ్ళను; ఒకయించుక = కొద్దిపాటి; మోడ్చినన్ = మూసినను; ఈ = ఈ; చర = చరించగల; అచర = చరింపలేని ప్రాణులు; స్థిత = కల; భువనంబులు = లోకములు; అన్నియున్ = ఎల్ల; నశించున్ = నశించును; ఇతండు = ఇతను; అవి = వాటిని; విచ్చి = విప్పి; చూచినన్ = చూస్తే; వితతములు = విరివి ఐనవి; ఐ = అయ్యి; జనించున్ = పుట్టును; ప్రభవిష్ణుడు = సర్వము సృష్టించు శీలం గలవాడు; విష్ణుడు = సర్వ వ్యాపక శీలుడు; ఐన = అగు; అట్టి = అటువంటి; ఈ = ఈ; క్రతుఫలదుడు = యజ్ఞఫలమును ఇచ్చువాడు; కాక = కాకుండ; ఒరుడు = ఇతరుడు; ఒకడు = ఇంకొకడు; ఎటులు = ఏ విధముగ; అర్హుడు = తగినవాడు కాగలడు, కాలేడు; శిష్టపూజకున్ = అగ్రపూజకు.
భావము:- అటువంటి ఈ శ్రీకృష్ణుడు కనుక, కన్నులు కొద్దిగా మూసుకున్నాడంటే ఈ చరాచర ప్రపంచమంతా నశిస్తుంది. కన్నులు విప్పిచూస్తే ఈలోకాలన్నీ జనిస్తాయి. యజ్ఞ ఫలాన్ని ప్రసాదించే ప్రభువు, ప్రభవిష్ణుడు, సాక్షాత్తు విష్ణు స్వరూపుడు ఐన శ్రీకృష్ణుడే ఈ అగ్రపూజకు అర్హుడు. ఇతడు కాకపోతే మరెవ్వరు తగినవారు కాగలరు?

తెభా-10.2-780-ఉ.
పురుషోత్తమున్, జగదధీశు, ననంతుని, సర్వశక్తుఁ, జి
ద్రూకు నగ్రపూజఁ బరితోషితుఁ జేయ సమస్త లోకముల్‌
వే రితుష్టిఁ బొందుఁ బృథివీవర! కావున నీవు కృష్ణునిన్,
శ్రీతిఁ బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్?"

టీక:- ఈ = ఆ దివ్యమైన; పురుషోత్తముని = పురుషశ్రేష్ఠుని; జగదధీశున్ = సర్వలోకాలకధీశుని; అనంతుని = మేరలేనివానిని; సర్వశక్తున్ = సమస్తమైన శక్తులు కలవానిని; చిద్రూపకున్ = జ్ఞానస్వరూప మైనవానిని; అగ్రపూజన్ = అగ్రపూజతో; పరితోషితున్ = సంతోషించినవానిగా; చేయన్ = చేసినచో; సమస్త = ఎల్ల; లోకముల్ = లోకములు; వేన్ = శీఘ్రమే; పరితుష్టిన్ = పూర్ణతృప్తిని; పొందున్ = పొందుతాయి; పృథవీవర = రాజా; కావునన్ = కాబట్టి; నీవు = నీవు; కృష్ణునిన్ = కృష్ణుడిని; శ్రీపతిన్ = లక్ష్మీపతిని; పూజచేయుము = పూజింపుము; ఎడచేయక = ఆలస్యము చేయకుండ; మాటలు = మాటలు; వేయున్ = అనేకములు; ఏటికిని = ఎందుకు.
భావము:- ఓ రాజా! పురుషోత్తముడు, సకలలోకాధిపతి, అనంతుడు సమస్తశక్తులు కలవాడు, చిద్రూపుడు అయిన శ్రీకృష్ణుడిని ప్రప్రథమంగా పూజించి సంతోషింప చేస్తే సమస్త లోకాలూ సంతృప్తి పొందుతాయి. కాబట్టి, వేలమాటలు ఎందుకు, నీవు ఆలస్యం చేయకుండా అన్యధా ఆలోచించకుండా ఈ లక్ష్మీపతికి, శ్రీకృష్ణుడికి అగ్ర పూజ చెయ్యి.”

తెభా-10.2-781-క.
ని సహదేవుఁడు పలికిన
విని యచ్చటి జనులు మనుజవిభులును ఋషులున్
మునుకొని మనములు మోదము
నుకఁగ నిది లెస్స యనిరి ర్మజుఁ డంతన్.

టీక:- అని = అని; సహదేవుడు = సహదేవుడు; పలికినన్ = చెప్పగా; విని = విని; అచ్చటి = అక్కడున్న; జనులు = వారు; మనుజవిభులు = రాజులు; ఋషులున్ = మునులు; మునుకొని = ఒప్పుకొని; మనములున్ = మనస్సులు; మోదమున్ = సంతోషముతో; తనుకగన్ = కలుగగా; ఇది = ఇది; లెస్స = సరైనది; అనిరి = అన్నారు; ధర్మజుడు = ధర్మరాజు; అంతన్ = అటుపిమ్మట.
భావము:- అని సహదేవుడు చెప్పగా ఆ సభాసదులు, రాజులు, ఋషులు మొదలైన వారందరూ సంతోషంతో “ఇదే సముచిత మైనది” అని అంగీకరించారు. అప్పుడు ధర్మరాజు.....

తెభా-10.2-782-క.
మునిజనమానసమధుకర
జాతములైన యట్టి వారిజదళలో
ను పదయుగళప్రక్షా
మొగిఁ గావించి తజ్జలంబులు భక్తిన్.

టీక:- ముని = మునులు; జన = ఎల్లరి; మానస = అంతరంగములు అను; మధుకర = తుమ్మెదలకు; వనజాతములు = తామరలు; ఐన = అయిన; అట్టి = అటువంటి; వారిజదళలోచనున్ = కృష్ణుని; పద = పాదముల; యుగళ = జంటను; ప్రక్షాళనము = కడుగుట; ఒగిన్ = క్రమముగా; కావించి = చేసి; తత్ = ఆ; జలంబులున్ = నీళ్ళను; భక్తిన్ = భక్తితో.
భావము:- మహామునుల మనస్సులు అనే తుమ్మెదలకు పద్మాలవంటి వైన కలువరేకులు వంటి కన్నులు కల శ్రీకృష్ణుని పాదాలు రెండూ భక్తితో కడిగి, ఆ జలాన్ని...

తెభా-10.2-783-క.
తానును గుంతియు ననుజులు
మానుగ ద్రుపదాత్మజయును స్తకములఁ బెం
పూనిన నియతి ధరించి మ
హానందము బొంది రతిశప్రీతిమెయిన్.

టీక:- తానును = ధర్మరాజు; కుంతియున్ = కుంతీదేవి; అనుజులు = తోడబుట్టినవాళ్ళు; మానుగన్ = చక్కగా; ద్రుపదాత్మజయును = ద్రౌపది {ద్రుపదాత్మజ - ద్రుపదమహారాజు ఆత్మజ (పుత్రిక), ద్రౌపది}; మస్తకములన్ = తలమీద; పెంపు = గౌరవముగా; ఊనిన = వహించిన; నియతిన్ = మహాభాగ్యముగా; ధరించి = ధరించి; మహా = మిక్కుటమైన; ఆనందమున్ = ఆనందమును; పొందిరి = పొందారు; అతిశయ = అత్యంత; ప్రీతిమెయిన్ = ప్రీతితో;
భావము:- తానూ, కుంతీ, భీమాదులూ, ద్రౌపదీ అమితమైన ప్రీతితో తమ శిరస్సులమీద శ్రీకృష్ణుని పాదజలాన్ని ధరించి ఎంతో సంతోషించారు.

తెభా-10.2-784-క.
చంత్కాంచన రుచిరో
దంచితవస్త్రముల నూతనార్కప్రభలన్
మించిన రత్నములం బూ
జించెన్ ధర్మజుఁడు కృష్ణు జిష్ణు సహిష్ణున్.

టీక:- చంచత్ = కదులుతున్న; కాంచన = బంగారమువలె; రుచిర = చక్కదనములతో; ఉదంచిత = అందమైన; వస్త్రములన్ = బట్టలచేత; నూతన = ఉదయపు, బాల; అర్క = సూర్య; ప్రభలన్ = కాంతులకంటె; మించిన = అతిశయించిన; రత్నములన్ = మణులతో; పూజించెను = సన్మానించెను; ధర్మజుడు = ధర్మరాజు; కృష్ణున్ = కృష్ణుడిని; జిష్ణున్ = జయశీలుని; సహిష్ణున్ = సర్వసహనశీలుని.
భావము:- ధర్మరాజు బంగారు జలతారువస్త్రాలతో, బాలభానుడి కాంతులను మించిన కాంతులుగల రత్నాలతో ఆ జయశీలుడు, సర్వసహనశీలుడు అయిన శ్రీకృష్ణుడిని సన్మానించాడు.

తెభా-10.2-785-వ.
ఇట్లు పూజించి యానందబాష్పజల బిందుసందోహకందళిత నయనారవిందంబులం గోవిందుని సుందరాకారంబు దర్శింపఁ జాలకుండె; నట్లు పూజితుండై తేజరిల్లు పుండరీకాక్షు నిరీక్షించి హస్తంబులు నిజమస్తకంబుల ధరించి వినుతుల సేయుచు, నఖిలజనంబులు జయజయ శబ్దంబు లిచ్చిరి; దేవతలు వివిధ తూర్యఘోషంబులతోడం బుష్పవర్షంబులు గురియించి; రయ్యవసరంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగా; పూజించి = అర్చించి; ఆనంద = ఆనందపు; బాష్పజల = కన్నీటి; బిందు = బిందువుల; సందోహ = సమూహముల; కందళిత = అంకురించిన; నయన = కన్నులు అను; అరవిందంబులన్ = పద్మములతో; గోవిందుని = కృష్ణుని; సుందర = అందమైన; ఆకారంబు = స్వరూపమును; దర్శింపజాలక = చూడలేకుండా; ఉండెన్ = ఉండెను; అట్లు = ఆ విధముగా; పూజితుండు = అర్చింపబడినవాడు; ఐ = అయ్యి; తేజరిల్లు = ప్రకాశించు; పుండరీకాక్షున్ = కృష్ణుని; నిరీక్షించి = చూసి; హస్తంబులున్ = చేతులు; నిజ = తమ; మస్తకంబులన్ = తలలమీద; ధరించి = పెట్టుకొని; వినుతులన్ = స్తోత్రములు; చేయుచున్ = చేస్తూ; అఖిల = ఎల్ల; జనంబులున్ = వారు; జయజయ = జయముజయము అను; శబ్దంబులున్ = ధ్వానములు; ఇచ్చిరి = చేసారు; దేవతలు = దేవతలు; వివిధ = నానా రకముల; తూర్య = వాద్యముల; ఘోషంబుల = మోతల; తోడన్ = తోటి; పుష్ప = పూల; వర్షంబులున్ = వానలు; కురియించిరి = కురిపించిరి; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు;
భావము:- ఆ విధంగా ధర్మరాజు గోవిందుడిని పూజించి ఆనందబాష్పాలు కనుల నిండా కమ్ముటచే, ఆయన సుందరాకారాన్ని సరిగా చూడలేకపోయాడు. ఈ విధంగా పూజించబడి ప్రకాశించే పుండరీకాక్షుడు శ్రీకృష్ణుని చూసి సమస్త ప్రజలూ చేతులుజోడించి అనేక విధాల పొగడుతూ, జయజయ ధ్వానాలు చేశారు. దేవతల వివిధ మంగళ వాద్యాలు మ్రోగిస్తూ పుష్పవర్షం కురిపించారు.

తెభా-10.2-786-క.
ఘోషసుతుఁడు దద్విభ
ము సూచి సహింప కలుక ట్రిలఁగా బీ
ము డిగ్గి నిలిచి నిజ హ
స్తము లెత్తి మనోభయంబు క్కినవాఁడై.

టీక:- దమఘోషసుతుడు = శిశుపాలుడు {దమఘోష సుతుడు - దమఘోషుని (కృష్ణుని మేనత్త శ్రుతశ్రవసల) కొడుకు, శిశుపాలుడు}; తత్ = ఆ; విభవము = వైభవమును; చూచి = చూసి; సహింపక = సహించలేక; అలుకన్ = కోపము; వట్రిలగన్ = కలుగగా; పీఠమున్ = పీఠమును; డిగ్గి = దిగి; నిలిచి = నిలబడి; నిజ = తన; హస్తములు = చేతులు; ఎత్తి = పైకెత్తి; మనః = మనసు నందు; భయంబున్ = భయము; తక్కినవాడు = తొలగినవాడు, లేనివాడు; ఐ = అయ్యి.
భావము:- అంతలో, కృష్ణుని మేనత్త శ్రుతశ్రవస, చేది దేశ రాజు దమఘోషుల కుమారుడైన శిశుపాలుడు ఆ వైభవాన్ని చూసి ఓర్వలేకపోయాడు. అసూయతో మనసులోని భయాన్ని వీడి తన చేతులెత్తి ఆసనం దిగి, నిలబడి...

తెభా-10.2-787-వ.
అప్పు డప్పుండరీకాక్షుండు వినుచుండ సభాసదులం జూచి యిట్లనియె.
టీక:- అప్పుడు = ఆ సమయమునందు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పుండరీకాక్షుండు = కృష్ణుడు; వినుచుండన్ = వింటుండగా; సభాసదులన్ = సభికులను; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- పుండరీకముల వంటి కన్నులతో అలరారుతున్న శ్రీకృష్ణుడు వినేలా సభాసదులతో ఇలా అన్నాడు.